Sunday, October 14, 2018

దేవీ నవరాత్రి మహోత్సవ వైభవం

అశ్వినీ నక్షత్రం మరియు పూర్ణిమ కల‌సివచ్చేమాసమే ఆశ్వియుజమాసం. ఈ మాసంలో శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజు దేవీనవరాత్రుల‌ను వైభవంగా నిర్వహిస్తారు. వీటినే శరన్నవరాత్రుల‌ని పిలుస్తారు. చివరి మూడు రోజుల‌కు అంటే దుర్గాష్ఠమి, మహర్నవమి, విజయదశమికి ప్రత్యేక విశిష్టత ఉంది.
పూర్వం మధుకైటభుల‌నే రాక్షసుల‌ను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై యోగనిద్రనుంచి మేల్కొన్న విష్ణువు, మధుకైటభుల‌తో ఐదువేల‌ సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేక పోయాడు. ఆ పరిస్థితిని గమనిస్తున్న మహామాయ ఆ మధుకైటభుల‌ను మోహపూరితుల్ని చేస్తుంది. దానితో వారు అంతకాలంగా తమతో పోరాడినందుకు శ్రీమహావిష్ణువును మెచ్చుకుని గర్వంతో నీకు ఏవరంకావాలి అని ప్రశ్నిస్తారు? దానితో శ్రీహరి వారి మరణాన్ని వరంగా ఈయమని కోరుకుంటాడు. తమకు ఇకమరణము తప్పదని నిర్ణయించుకుని తమను నీరులేనిచోట చంపమనికోరతారు రాక్ష‌సులు.  శ్రీహరి వారిని పైకెత్తి భూఅంతరాళంలో సంహరించు సమయాన మహామాయ పదితలల‌తో, పదికాళ్ళతో, నల్ల‌ని రూపంతో ‘‘మహకాళి’’ గా ఆవిర్భవించి శ్రీమహావిష్ణువునకు సహాయపడుతుంది.
అనంతరం ‘‘సింహవాహిని’యై మహిషాసురుని సంహరించింది.  ‘‘మహామాయా`మహాసరస్వతి’’ రూపంలో శుంభ, నిశుంభుల‌ను వధించింది. చండ, ముండుల‌ను సంహరించి ‘‘చాముండి’’ అని పేరు తెచ్చుకుంది. కంస సంహారమునకు సహాయపడుటకై ‘‘నంద’’ అను పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడింది. రాక్షసంహార సమయంలో ఆమె దంతాలు రక్తసిక్తమవడంవ‌ల్ల‌ ‘‘రక్తదంతి’’ అయినది. మునిజనులందరూ వందకన్నుల‌తో ఎదురుచూడగా వారి ప్రార్థన మేరకు ఆవిర్భవించిన తల్లి ‘‘శతాక్షి’’ అని పిలువబడింది. కరువు కాటకముల‌తో ప్రజలు పడుతున్న బాధను చూడలేక ‘‘శాకంబరి’’గా వారికి శాకాలు, ఫలాల‌ను ఇచ్చి ఆ తల్లి బిడ్డను అక్కున చేర్చుకుంది. దుర్గముడను రాక్షసుని సంహరించి ‘దుర్గ’’అను పేరుగాంచింది. ‘‘భీమాదేవిగా ఆవిర్భవించి తననువేడినవారి మనోభీష్టాల‌ను నెరవేర్చింది. తుమ్మెద రూపంతో అరుణుడను రాక్షసుని  హతమార్చి ‘‘భ్రామరి’’ అను పేరు తెచ్చుకుంది.
ఆ విధంగా క్రూరులై లోకాల‌ను భయభ్రాంతుకు గురిచేస్తున్న రాక్షసుల‌ను సంహరించి అందరికీ ఆనందాన్ని అందించింది. అందువ్ల ఈ దేవిని ఎవరికివారు తమకు తోచిన రూపంతో ఆరాధిస్తారు. అయితే వీటన్నింటిలో ‘‘నవవిధ రూపాలు’’ అత్యంత ప్రాముఖ్యతను పొందాయి. నవరాత్రు సందర్భంగా ఈ తొమ్మిదిరూపాతో దేవిని అంకరించి ఆనందాన్ని పొందుతారు భ‌క్తులు.
‘‘నవరాత్రులు’’ అంటే తొమ్మిది రాత్రుల‌ని అర్థం. తొమ్మిదిరాత్రుల‌పాటు దేవిని ఆరాధించడమే దీనిలోని అంతరార్థం. దేవీనవరాత్రులు జరిగే తొమ్మిదిరోజులూ ప్రత్యేకమైనవే అయినా చివరి మూడురోజుల‌కు ఎంతో విశిష్టత ఉన్నది. ఆ మూడురోజులే దుర్గాష్టమి, మహర్నవమి, దసరా. ఈమూడు రోజులూ భక్తులు విశేష ఆరాధనలు, ఉపవాసాన‌లు, చండీహోమాలు మొదలైన కార్యక్రమాల‌తో యథాశక్తిగా దేవికి తమ భక్తిని నివేదిస్తారు.
విజయానిచ్చే విజయదశమి
దసరాకు మరోపేరు ‘దశహరా’’. అంటే పది పాపాల‌ను హరించేది అని అర్థం. ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలో ‘‘దసరా’’ ఒకటి. చరిత్ర ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణుడిపై గెలిచిన సందర్భం. అంతేగాదు.... పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై నుంచి తమ ఆయుధాల‌ను తిరిగి తీసిన రోజు. అందుకే ఈనాడు రావణవధ, జమ్మి చెట్టుకు పూజా చేయటం ఏనాటినుంచో పాటిస్తున్న సంప్రదాయం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి.
జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ దశమిని విజయయాత్రకు అంటే సాఫ‌ల్యతకు ముహూర్తంగా నిర్ణయిస్తారు. ఈనాటి సంధ్యాసమయంలో నక్షత్రాలు కనబడిన సమయంలో ‘‘విజయ’’ అనే ముహూర్తం ప్రారంభమవుతుందని జ్యోతిష్యశాస్త్రం వివరిస్తోంది. కొన్ని ప్రాంతాల‌లో విజయదశమిని ‘‘అపరాజితాదశమి’’ అనికూడా వ్యవహరిస్తారు.
ఈ రోజున ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయని ‘‘ఆశ్వినస్య సితే పక్షే దశమ్యాం తారకోదయే సకాలో విజయోజ్ఞేయః సర్వకార్యార్థసిద్ధయే’’ అంటూ ఈ విషయాన్ని శంకరుడు పార్వతికి చెప్పినట్లు మన ప్రాచీన గ్రంథాలు తెలియజేస్తున్నాయి.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

చంద్రఘంట

దుర్గామాత యొక్క మూడవ శక్తినామము " చంద్రఘంట "
అన్నపూర్ణాదేవి..అలంకారం..!💐
లేత రంగు,  నైవేద్యం : కొబ్బరి అన్నము

శ్లో|| పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా । ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥

దుర్గామాత యొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి.
ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము.
ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’  అనే పేరు స్థిరపడింది.
ఈమె శరీరకాంతి బంగారువన్నెలో మిలమిల లాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది.
సర్వదా సమరసన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం.
ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.

అన్నపూర్ణ విశిష్ఠత.💐
అన్నం పరబ్రహ్మ స్వరూపం.
సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం.
అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది.
ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది.
అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.

అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం,
సమయస్పూర్తి,
వాక్శుద్ది,
వాక్సిద్ధి,
భక్తిశ్రద్ధలు,
ఐశ్వర్యం కలుగుతాయి.
భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి.
బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచిన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.

ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించి
తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి.
” హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించాలి.

అమ్మవారికి దధ్యోదనము, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి.
అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.

//ఉర్వీసర్వజయేస్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ/...

నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది.
ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది.
చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు.
దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది.
అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి.
ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.

ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి.
ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము.
ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది.
ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు.
ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.

ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది.
ఈమెను ఆరాధించడంవల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతోపాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి.
వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి.
వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది.
చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు.
ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది.
ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు.
కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.

మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి.
అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై,
సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.

www.mohanpricelist.blogspot.in

పుష్పములు: అమ్మను తెల్లని పుష్పాములతో పూజించాలి.

మంత్రము: హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత  మహిదేవ్యన్నం స్వాహా
అనే మంత్రము జపించాలి.

నివేదన: దధ్యన్నము, కట్టెపొంగలి
అన్నపూర్ణ అష్టోత్తర శత నామావళి
శ్రీ అన్నపూర్ణాష్టకమ్ పారాయణం చేయవలెను.

అన్నపూర్ణాష్టకం..💐
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 1 ||

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 2 ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౩ ||

కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 4 ||

దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 5 ||

ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 6 ||

ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 7 ||

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 8 ||

చంద్రార్కానలకోటి
కోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 9 ||

క్షత్రత్రాణకరీ మహాఽభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 10

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || 11 ||

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ !12 ||

జీవుడే వధువు, దేవుడే వరుడు

ఆత్మవివాహము- స్త్రీ పురుష శరీర సంబంధహేతువైన వివాహ సంస్కారం వంటిది కాదు. ఇది జీవ-పరమాత్మలకు ఇద్దరికి నిర్వహింపబడేది. భగవంతునికి అనాదిగా దూరమైపోయి, జనన మరణరూప సంసార చక్రబంధంలో పడియున్న జీవునికి.. మానవజన్మలోని విశిష్టతను, జీవేశ్వరుల కు గల అవిభాజ్యమైన నిత్య సంబంధమును గుర్తు చేసి, తిరిగి భగవత్సన్నిధికి చేర్చుటే ఆత్మవివాహంలోని పరమార్థము. జన్మాంతర ప్రాప్తితో పూర్వజన్మ విషయకమైన మరపు ఏర్పడుతున్నది. కానీ పూర్వ దుసంస్కారం మాత్రం అనువర్తించి దుష్ప్రవృత్తికే ప్రేరణనిస్తున్నది. ఇదే ఒక మహామాయ.

ఇపుడే ఈ జీవునిలోనున్న చిరుదీపం వంటి వివేకం పని చేయవలసి ఉంటుంది. మనస్సనే గుర్రమును క్షుద్ర విషయాలపైకి పోనీయకుండా మరల్చుకొని ఊర్ధ్వగతికి చేర్చగల సన్మార్గములో నడిపించడమే ఈ వివేకము. ఇది జరిగినపుడే మానవజన్మ సార్థక్యము. అపుడే సత్సంగం, సదాచార్యానువృత్తి మొదలైన పరిణామాలతో క్రమంగా ఉజ్జీవించే శుభ పరిణామం ఏర్పడగలదు. ఇది ఈ ఆత్మవివాహానికి పూర్వరంగము. లౌకిక వివాహ ప్రక్రియతో పోల్చి, మానవ జన్మనెత్తిన జీవునికి శాశ్వత భగవత్సన్నిధిని కలిగించడమే ఆత్మవివాహం.

వివాహ ప్రక్రియలోని పలు అంశాలను, జీవుడు భగవత్సన్నిధికి చేరుటలో జరిగే పలు అంశాలతో పోల్చి చెప్పటమే ప్రస్తుత కర్తవ్యము. ఇచట జీవుడే ఒక యుక్తవయస్కురాలైన కన్యక. వరుడు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు. ఇచట ఆచార్యుడే ఆ తండ్రి. లోకంలో దేహ జన్మనిచ్చిన తండ్రి కన్యాదానం చేయగా, ఇచట ఆ జీవుడనే కన్యకకే సంస్కారాలతో ఉత్తమ శ్రీవైష్ణవ జన్మనిచ్చిన ఆచార్యుడు పితృస్థానంలో ఉండి కన్యాదానం చేస్తున్నాడు. వివాహానికి కావలసిన మంగళస్నానం, వస్త్రాభరణాదిరూపమైన అలంకరణం, మంత్ర మంగళసూత్రం మొదలైన వివాహ ప్రక్రియ (పెండ్లి తంతు) అంతా సిద్ధమైంది. కన్యతో, వరునితో పరస్పరం బాసలు చేయించి ఆచార్యుడే పురోహితుడై, కన్యను వరునికి అప్పగిస్తాడు.

శాకుంతలంలో కణ్వుడు వరుడైన దుష్యంతునికి ‘‘అస్మాన్‌ సాధువిచింత్య’’ ఇత్యాదిగా హితబోధను చేసి, తన బిడ్డయైున శకుంతలకూ ‘‘శుశ్రూషస్వ గురూన్‌’’ అని సుద్దులు చెప్పి వరుని వద్దకు పంపినట్లు, ఇక్కడ శ్రీవైష్ణవత్వ జన్మనిచ్చిన తండ్రియగు ఆచార్యుడు కూడా తన కన్యకు (శిష్యునికి) సదుపదేశాలు చేసి, వరుడగు పరమపురుషునికి అప్పగించి ప్రేమతో ఏలుకొమ్మని ఆయనకూ విన్నవిస్తాడు. ఇది రసవంతమైన పరమార్థమైన అతి మధుర వివాహ సన్నివేశం.

ఈ ముక్తికన్యాపరిణయాన్ని సంస్కృతంలో కొందరు కవులు నాటకరూపంలోనూ మలచినారు. సుస్నాతయైు ఆభరణాలంకృతయైు గుణవతియైున సుందరిని పరమాత్మ స్వీకరించి, పరిరంభణమిచ్చి, ముద్దాడి రంజింపజేసి తాను కూడ అలభ్యలాభమిదియని పరమానందంలో మునిగిపోతాడు. ఆ ఆత్మవివాహ ప్రక్రియనే మన పూర్వాచార్యులొకరు ఒక రసవంతమైన శ్లోకంలో వర్ణించినారు. ఆ శ్లోకమిదిగో...

శ్లోశ్రీశ్రీ కర్మజ్ఞానసురూపయౌవనవతీం భక్త్యాఖ్యదూత్యాహృతాం
కంఠాలంబితమన్త్రమంగళగుణాం జీవాఖ్యకన్యాం శుభాంశ్రీ
సుస్నాతాం విరజాజలే, శుచిముఖీం వైకుంఠశయ్యాంగతాం
దృష్ట్యా హృష్యతి రన్తుమిచ్ఛతి హరిః చిత్రం సతాం సన్నిధౌశ్రీశ్రీ

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......✍

శ్రీ చణ్డికా హృదయ స్తోత్రం


అస్య శ్రీ చణ్డికా హృదయ స్తోత్ర మహామన్త్రస్య ।
మార్క్కణ్డేయ ఋషిః, అనుష్టుప్చ్ఛన్దః, శ్రీ చణ్డికా దేవతా ।
హ్రాం బీజం, హ్రీం శక్తిః, హ్రూం కీలకం,
అస్య శ్రీ చణ్డికా ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ।
హ్రాం ఇత్యాది షడంగ న్యాసః ।

ధ్యానం ।
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్త్థ సాధికే ।
శరణ్యే త్ర్యమ్బకే గౌరీ నారాయణీ నమోస్తుతే ॥

బ్రహ్మోవాచ ।
అథాతస్సం ప్రవక్ష్యామి విస్తరేణ యథాతథం ।
చణ్డికా హృదయం గుహ్యం శృణుష్వైకాగ్రమానసః । ।
ఓం ఐం హ్రీం క్ళీం, హ్రాం, హ్రీం, హ్రూం జయ జయ చాముణ్డే,
చణ్డికే, త్రిదశ, మణిమకుటకోటీర సంఘట్టిత చరణారవిన్దే,
గాయత్రీ, సావిత్రీ, సరస్వతి, మహాహికృతాభరణే, భైరవరూప
ధారిణీ, ప్రకటిత దంష్ట్రోగ్రవదనే,ఘోరే, ఘోరాననేజ్వల
జ్వలజ్జ్వాలా సహస్రపరివృతే, మహాట్టహాస బధరీకృత దిగన్తరే,
సర్వాయుధ పరిపూర్ణ్ణే, కపాలహస్తే, గజాజినోత్తరీయే,
భూతవేతాళబృన్దపరివృతే, ప్రకన్పిత ధరాధరే,
మధుకైటమహిషాసుర, ధూమ్రలోచన చణ్డముణ్డరక్తబీజ
శుంభనిశుంభాది దైత్యనిష్కణ్ఢకే, కాళరాత్రి,
మహామాయే, శివే, నిత్యే, ఇన్ద్రాగ్నియమనిరృతి వరుణవాయు
సోమేశాన ప్రధాన శక్తి భూతే, బ్రహ్మావిష్ణు శివస్తుతే,
త్రిభువనాధారాధారే, వామే, జ్యేష్ఠే, రౌద్ర్యంబికే,
బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవీ శంఖినీ వారాహీన్ద్రాణీ
చాముణ్డా శివదూతి మహాకాళి మహాలక్ష్మీ, మహాసరస్వతీతిస్థితే,
నాదమధ్యస్థితే, మహోగ్రవిషోరగఫణామణిఘటిత
మకుటకటకాదిరత్న మహాజ్వాలామయ పాదబాహుదణ్డోత్తమాంగే,
మహామహిషోపరి గన్ధర్వ విద్యాధరారాధితే,
నవరత్ననిధికోశే తత్త్వస్వరూపే వాక్పాణిపాదపాయూపస్థాత్మికే,
శబ్దస్పర్శరూపరసగన్ధాది స్వరూపే,
త్వక్చక్షుః శ్రోత్రజిహ్వాఘ్రాణమహాబుద్ధిస్థితే,
ఓం ఐంకార హ్రీం కార క్ళీం కారహస్తే ఆం క్రోం ఆగ్నేయనయనపాత్రే ప్రవేశయ,
ద్రాం శోషయ శోషయ, ద్రీం సుకుమారయ సుకుమారయ,
శ్రీం సర్వం ప్రవేశయ ప్రవేశయ, త్రైలోక్యవర వర్ణ్ణిని
సమస్త చిత్తం వశీకరు వశీకరు మమ శత్రూన్,
శీఘ్రం మారయ మారయ, జాగ్రత్ స్వప్న సుషుప్త్య వస్థాసు అస్మాన్
రాజచోరాగ్నిజల వాత విషభూత-శత్రుమృత్యు-జ్వరాది స్ఫోటకాది
నానారోగేభ్యోః నానాభిచారేభ్యో నానాపవాదేభ్యః పరకర్మ మన్త్ర
తన్త్ర యన్త్రౌషధ శల్యశూన్య క్షుద్రేభ్యః సమ్యఙ్మాం
రక్ష రక్ష, ఓం ఐం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రః,
స్ఫ్రాం స్ఫ్రీం స్ఫ్రైం స్ఫ్రౌం స్ఫ్రః - మమ సర్వ కార్యాణి
సాధయ సాధయ హుం ఫట్ స్వాహా -
రాజ ద్వారే శ్మశానే వా వివాదే శత్రు సఙ్కటే ।
భూతాగ్ని చోర మద్ధ్యస్థే మయి కార్యాణి సాధయ ॥ స్వాహా ।
చణ్డికా హృదయం గుహ్యం త్రిసన్ధ్యం యః పఠేన్నరః ।
సర్వ కామ ప్రదం పుంసాం భుక్తి ముక్తిం ప్రియచ్చతి ॥

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

శ్రీ దుర్గ సప్త శ్లోకి

ఓం హ్రీం దుం దుర్గాయై నమః !!

      

ఓం  అస్యశ్రీ  దుర్గా  సప్త  శ్లోకీ  స్తోత్రమంత్రస్య,  నారాయణ ఋషిః,  అనుష్టుప్ ఛందః,
మహంకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వత్యో దేవతాః,  శ్రీ దుర్గాంబా ప్రీత్యర్థం " సప్త శ్లోకీ
దుర్గా పాఠే "  జపే వినియోగః !!

1- ఓం  జ్ఞానినా  మపి  చేతాంసి  దేవీ  భగవతీ  హి  సా !
     బలాదా  కృష్యమోహాయ  మహామాయా  ప్రయచ్ఛతి !!

2- ఓం  దుర్గే  స్మృతా  హరసి  భీతి  మశేష  జంతోః,
     స్వస్థైః  స్మృతా  మతిమతీవ  శుభామ్  దదాసి !
     దారిద్ర్య  దుఃఖ  భయహారిణి  కా  త్వదన్యా,
     సర్వోపకార  కరణాయ  సదార్ద్ర  చిత్తా !!

3- ఓం  సర్వ  మంగళ  మాంగళ్యే  శివే  సర్వార్థ  సాధికే !
     శరణ్యే  త్ర్యయంబికే   దేవీ  నారాయణీ  నమోస్తుతే !!

4- ఓం  శరణాగత  దీనార్త  పరిత్రాణ  పరాయణే !
     సర్వస్యార్తి  హరే  దేవీ  నారాయణీ  నమోస్తుతే  !!

5- ఓం  సర్వ  స్వరూపే  సర్వేశే  సర్వశక్తి  సమన్వితే !
     భయేభ్య  స్త్రాహినో  దేవీ  దుర్గే  దేవీ  నమోస్తుతే !!

6- ఓం  రోగా  నశేషా  నపహంసి  తుష్టా
     రుష్టాతు  కామాన్  సకలా  నభీష్టాన్ !
     త్వా  మాశ్రితానాం  న  విపన్నరాణాం
     త్వా  మాశ్రితా  హ్యాశ్రయతాం  ప్రయాంతి !!

7- ఓం  సర్వబాధా  ప్రశమనం  త్రైలోక్య  స్యాఖిలేశ్వరీ !
     ఏవమేవ  త్వయాకార్యం అస్మద్వైరి  వినాశనం !!
          -: ఓం శాంతిః  శాంతిః  శాంతిః :-

ఆత్మ బంధువులారా !   మార్కండేయ పురాణంలో నున్న" చండీ సప్త శతి "
(దేవీ మహాత్యము) 700 ల మంత్రపూరిత
శ్లోకాలలో  ఏడింటినీ  ఏర్చి కూర్చి (7) శక్తివంతమైన మంత్రాలతో సులభమైన సూక్ష్మమైన " మంత్రరాజం " ను
మన ఋషులు తయారు చేశారు !!

సర్వ శక్తి స్వరూపిణి , సకల దేవతా స్వరూపిణియైన ఆ " దుర్గా పరమేశ్వరీ దేవి " మధుకైటభ, మహిషాసుర, చండ-ముండ, ధూమ్రాక్ష, రక్తబీజ, శుంబ-నిశుంబాది
రాక్షసులను సంహారం చేసింది !! 

అందరూ దేవతలు కలసి అమ్మను వేడుకున్నారు !! అమ్మా !! ధర్మానికి  హాని తలపెట్టే ఆసురీ శక్తులను నాశనం చేసి
దైవిక  శక్తులకు తోడుగా వుండమ్మా!! అని
దుర్గా సప్త శతి లో పై మంత్రములతో వేడుకున్నారు!!

మరిమనం కూడా కలసి ప్రార్థన చేద్దాం !!

ఈ " దుర్గా సప్త శ్లోకీ " మంత్రములను నిత్యం పఠించు వారలకు సర్వ బాధలు, ఆపదలు తొలగిపోతాయి !  సకల భయాల నుండి విముక్తులవుతారు !  సర్వ శత్రు వినాశనం
జరిగి , సర్వత్రా " విజయం" సిద్ధిస్తుంది !!

ఘోరమైన వ్యాధులు, దారిద్ర్య బాధలు దూరమవుతాయి !! సకల అభీష్టములు నెరవేరి సకల సౌఖ్యాలు లభిస్తాయి !!

ఈనాడు ప్రపంచానికి పెను సవాలుగా మారిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు సర్వ మానవాళిని రాక్షసుల రూపంలో భయ
కంపితులను చేస్తున్నారు !! 

తీవ్రవాద, ఉగ్రవాద,  సర్వ శత్రు వినాశనానికి  మరియు " హిందూ ధర్మ రక్షణ"  కొఱకై  "విశ్వశాంతి" పరి రక్షణకై  " శ్రీ దుర్గామాత" ను ఈ మంత్రాలతో నిత్యం సామూహికంగా ఆరాధన చేస్తూ పఠిద్దాము !!

సూచన:- ఈ "  దుర్గ సప్త శ్లోకి " శ్లోకాలను
కార్డు రూపంలో కాని, కరపత్రము ద్వారా
కానీ అచ్చు వేసి ప్రచారం చేయండి!!

!! ధర్మాన్ని రక్షించండి !! ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది !!
               -: శుభమ్ భూయాత్:-

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

గర్భరక్షాంభికా స్తోత్రం

గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే  గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా, సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది.

పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మ పత్ని వేదిక తో కలిసి ఒక ఆశ్రమం లో నివసించేవారు. వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే సమస్య సంతానము కలుగక పోవడం. సంతానము కొఱకై ఈ దంపతులు అమ్మ వారిని, తండ్రి శంకరుడిని విశేష ఆరాధన చేశారు. ఒక మంచి రోజు ఆ తల్లి గర్భం దాల్చింది. ఇలా గర్భం దాల్చిన తర్వాత, ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదిక మూడవ త్రైమాసికం లో ఉన్నది, కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉంది.

నిధ్రువ మహర్షి బయటకి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమమునకు వచ్చారు. అప్పటికే ఇంటి పనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది, దాంతో వచ్చిన మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు, ఆయన వచ్చారని తెలియదు. ఆగ్రహం చెందిన ఊర్ధ్వ పాదుడు, ఆమె గర్భం ధరించి ఉంది అని తెలియక ఆమెను శపిస్తారు. ఆయన శాప ఫలితంగా వేదిక ఒక వింత వ్యాధితో బాధపడడం మొదలు అవుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా, గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయబడడం మొదలు అయ్యింది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధ పడుతూ సర్వ మంగళ స్వరూపమైన ఆ పార్వతీ మాతను ప్రార్ధిస్తుంది.

అవ్యాజకరుణామూర్తి అయిన అమ్మవారు వెంటనే ప్రత్యక్షం అయ్యి ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధం గా రక్షింపబడిన శిశువు  ఆ కుండలో పెరిగి చక్కని మగ పిల్లవాడు పుడతాడు. వాడికి నైధ్రువన్ అని పేరు పెడతారు. అప్పుడే పుటిన ఈ శిశువు కి కామధేనువు తన పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిధ్రువ మహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి శివ పార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని  ఆశ్రయించే వాళ్లకి గర్భ రక్ష కలుగజేయమని ప్రార్ధిస్తారు.

శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం:

ఓం శ్రీ గణేశాయ నమః   
ఓం శ్రీమాత్రే నమః
ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్
ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం
ఆపత్యాం రక్ష గర్భిణీమ్.

అశ్వినీ దేవ దేవేసౌ
ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం
చ రక్షతాం పూజ యనయా

రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా
ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం
నిత్యం రక్షతు గర్భిణీమ్.

ఆదిత్య ద్వాదశ ప్రోక్తా
ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య
నిత్యం రక్షత గర్భిణీమ్.

వినాయక గణాధ్యక్షా
శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్.

స్కంద షణ్ముఖ దేవేశా
పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్.

ప్రభాస, ప్రభవశ్శ్యామా
ప్రత్యూషో మరుత నల
దృవూ  ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా
ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం
నిత్యం రక్ష గర్భిణీమ్.

పితుర్ దేవీ పితుశ్రేష్టే
బహు పుత్రీ మహా బలే
భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్.

రక్ష రక్ష మహాదేవ,
భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా
సపత్యాం రక్ష గర్భిణీమ్.
        

పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ గర్భరక్షా స్తోత్రం చదువుకోవాలి. పిల్లలు లేని వారికి గర్భం దాల్చడం జరుగుతుంది. గర్భం దాల్చిన వాళ్లకి చక్కని ప్రసవం అవుతుంది.ఎప్పుడూ ఎవరికీ గర్భస్రావం కావడం, పిల్లలు కలుగక పోవడం అనే సమస్య లేదు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...