Monday, February 26, 2018

భగవద్గీతను ఎందుకు పఠించాలి?

బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు. నిజమే! తలరాతను ఎవరూ మార్చుకోలేకపోవచ్చు. కానీ, గీతను చదివితే మాత్రం జీవనరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోను, మనిషి జీవితంలోను గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే…భగవద్గీత అనగా….భగవంతునిచే గానం చేయబదినదని అర్థం. అంతే భగవంతుని చేత చెప్పబడింది. ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవత్ తత్వము, భగవంతుడిని చేరే మార్గాలు, మనిషి పరమపదాన్ని పొందడానికి ఆచరించే మార్గాలు తదితర విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. గీతలోని 18 అధ్యాయాలు మోక్ష సౌధానికి చేర్చే 18 సోపానాలని వేదాంత కోవిదులు చెబుతారు. ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత ఈ మూడింటినీ కలిసి ‘ప్రస్థాన త్రయం’ అంటారు. ప్రాస్థానం అనగా ప్రయాణం. మనిషి పరమపద ప్రయాణానికి కావలిసిన సాధన సంపత్తుల గురించి, నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించివీటిలో పుష్కలంగా ఉంది. నేటి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని అంటున్నారు. 

లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగామ్. ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరింపబడి 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని ‘మోక్ష సప్తసతి’ అని కూడా అంటారు. ఉపనిషత్తులను చదవాలి. బ్రహ్మసూత్రాలను మననం చేయాలి. భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి. భగవద్గీత వేదాంత విషయాలు, వేదాంత రహస్యాలు, పరమ పదాన్ని చేరే ఉపాయాలు ఉన్నాయి కాబట్టి సన్యాసం స్వీకరించిన మోక్షగాములకు, వయసు మళ్ళినవారికి ఉపయోగపడే గ్రంథమనే అభిప్రాయం చాలమందిలో పాతుకుపోయింది. కానీ, ఇది నిజం కాదు. గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది. ఇది స్పృశించని అంశమంటూ లేదు. అందుకే ఇది ప్రపంచంలోనే మకుటాయమానమైన సాహిత్య ఉద్గ్రంథం. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను ఆధారం చేసుకునే నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారు. 

గీతలో దైనందిన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి? సన్మార్గాన ఎలా నడవాలి? సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది, లోక కల్యాణానికి ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు పొందుపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం ‘పారాయణ గ్రంథం’ కాదు, ‘అనుష్టాన గ్రంథం’ (అంటే నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించదగ్గది). భగవద్గీత కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యశాస్త్రం, ఆహారవిజ్ఞానశాస్త్రం, నైతికధార్మిక శాస్త్రం. ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రం. మనిషి జీవితానికి సంబంధించి అన్ని విషయాలను ఇది చర్చించింది. అందువల్లే భగవద్గీతను ‘మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం’ అని అన్నారు. గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. భగవద్గీతలో ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై ఉన్న ప్రకృతి గుణాలైన సత్వ, రాజ, స్తమములను నిత్య జీవితంలో జయించడం, ద్వంద్వాములను నిగ్రహించడం, సదాచారం, సమబుద్ధి, సత్ప్రవర్తన పెంపొందించుకోవడం, సత్వగుణాలను అలవర్చుకోవడం, నిష్కామ కర్మానుష్టానం ద్వారా ఉత్తమ స్థితికి చేరుకోవడం, సాత్విక ఆహార నియమాలను పాటించడం, రాజసిక, తామసిక పదార్థాలను విసర్జించడం, ధ్యాన యోగ సాధన ద్వారా నిరంతర దైవచింతన, జ్ఞానాన్ని పొందగోరువారు పాటించాల్సిన నియమాలు, ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడగలగడం….ఇంకా ఎన్నో విషయాలు విపులీకరించి ఉన్నాయి. వాటిని తెలుసుకుని ఆచరించిన మనిషి మహనీయుడు అవుతాడు.ప్రస్తుత మానవ జీవితమ పూర్తిగా భౌతిక దృక్పథానికే పరిమితమైంది. స్వార్థమే పరమావధిగా తలుస్తూ, మనశ్శాంతి లేక కాలం గడుపుతున్నాడు. ఈ దృక్పథం మారాలంటే, మనసులో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే, నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలంటే ఆధ్యాత్మిక చింతన కావాలి. అటువంటి మార్పు కోరుకునేవారు తమ దైనందిన వ్యవహారాల్లో ‘గీత’కూ చోటు కల్పించాలి. అప్పుడు స్వీయాభివృద్ధితో పాటు సమాజభివృద్ధి ఎలా సాధ్యామవుతుందో ప్రతి ఒక్కరూ అనుభవం మీద తెలుసుకోవచ్చు.

ఏ సమయంలో నిద్ర లేస్తే మంచిది

ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పుపట్టిన కత్తితో ఏ సైనికుడు యుద్ధం చేయలేడు.అందుకే యుద్ధానికి వెళ్లేవాడు కత్తిని పదును పెట్టుకోవాలి. అలాగే ఏదైనా ధర్మకార్యం చేయాలన్నా..జీవిత పరమర్థాన్ని తెలుసుకోవాలన్నా , సాధనమైన శరీరాన్ని అందుకు అనుకూలంగా సిద్ధం చేసుకోవాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రాచీన రుషులు మనకు అందించిన మార్గమే సదాచారం.

ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు. ఆయన తన చివరి రోజుల్లో… భగవంతుడిని ప్రార్థిస్తూ, తాను మరల పుడితే భారత దేశంలో పుట్టాలని కోరుకున్నాడట. అయితే ఈనాటి ఇంగ్లీష్ ఎడ్యుకెటేడ్ ఆధునిక మేధావులు, సెక్యులర్ వాదులు , మార్క్స్ మేకాలే వాదులు మాత్రం పుణ్యభూమి భారత్ విలువ తెలియక ఇప్పటికి మన దేశాన్ని నిందిస్తున్నారు. మాక్స్ ముల్లర్ భారత్ లో పుట్టాలని కోరుకోవడానికి ప్రధాన కారణం సదాచార పూర్ణమైన భారతీయ జీవన విధానం. మానవుడు నిద్రలేవడంతోనే అతని దైనందిన జీవితం ఆరంభమౌతుంది. సదాచారంలో మొదటి అంశం నిద్రలేవటం.

నిద్ర ఎప్పుడు లేవాలి..?

ఈ విషయంలో మన ధర్మ శాస్త్రాలు, వైద్యశాస్త్రం ఏం చెప్పాయి..?
నిద్ర లేచే విషయంలో హిందు ధర్మ శాస్త్రాలు, వైద్య శాస్త్రం కూడా ఒకే మాటగా “బ్రాహ్మే ముహూర్తే బుద్ధేత” అని, అలాగే “బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ చింతయే దాత్మనో హితం” అని పేర్కొన్నాయి. ఆయురారోగ్యాలతోపాటు ధర్మాచరణకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలని హిందూ ధర్మ గ్రంథాలు తెలిపాయి.

సూర్యోదయానికి ముందున్న ముహూర్తాన్ని రౌద్రమంటారు. దీనికి ముందున్నదే బ్రాహ్మీ ముహూర్తం. అనగా సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందుండే సమయం. ఈ సమయంలో నిద్రలేవటంలో వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది. భూమి తన చట్టూ తాను తిరగటం వలన రాత్రింపగళ్లూ ఏర్పడతాయి. బ్రాహ్మీముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయం ఉత్తేజం కలిగించే సమయం. ఈ సమయంలో దేహంలో అన్ని రకాల శక్తులు వృద్ధి పొందుతాయి, చురుగ్గా పనిచేస్తాయి. దీనిని ఆదాన సమయం అంటారు.

మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రి దాటే వరకు శిథిలత నిచ్చు సమయం. ఈ సమయంలో అలసట స్వభావాలు ఏర్పడుతుంది. శరీరంలోని అన్ని అవయవాల శక్తులు సన్నగిల్లుతాయి. దేహం విశ్రాంతి కోరుకుంటుంది. దీనిని విసర్గ సమయం అంటారు. ఆదాన సమయంలో నిద్రపోవటం, విసర్గ సమయంలో మెలకువగా ఉండటం శారీరకంగానూ, మానసికంగానూ అనారోగ్యకరమైంది. దీంతో బుద్ది చురుకుదనం కోల్పోతుంది. లౌకిక వ్యవహారాలకే ప్రాధాన్యత నిచ్చేవారు ఈ వత్యాసం గుర్తించలేరు. ఇలాంటి వారు తమ ఆధ్యాత్మిక దృష్టిని వికసింప చేసుకునే అవకాశాలను చాలా వరకు కోల్పోతారు. అందుకే ఇలాంటి వారికి అవసరమైన శాంతస్థితి చేకూరదు. దీంతో వీరు నిజమైన సుఖ శాంతులకు దూరం అవుతారు. ఈ ప్రవృత్తిని నిశాచర ప్రవృత్తిగా పిలుస్తారు.

వేకువ జామునే నిద్ర లేచే విషయంలో పసిపిల్లలే సదాచారపరులు. చిన్నారులు తల్లిదండ్రుల కంటే ముందే బ్రాహ్మీ ముహూర్తాన్నే నిద్రలేస్తారు. వాళ్లను నిద్రలేపుతారు. పసిపిల్లలు నిద్రలేచే ఈ ప్రవృత్తి ప్రకృతి సిద్ధం. బ్రాహ్మీ ముహూర్తంలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. పశుపక్ష్యాదులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తాయి. అంతేకాదు సకల పుష్పాలు…ఈ ముహూర్తంలోనే పరిమళాలు వేదజల్లుతాయి. అలాగే ఈ ముహూర్తంలో నిద్రలేస్తే, మన బుద్ది కూడా వికసించి ఉత్తమ సమాలోచనలు పొందుతుంది. అందుకే ఇది బ్రాహ్మీ ముహూర్తం అయ్యింది. బ్రాహ్మీ అంటే సరస్వతి. బ్రాహ్మీ ముహూర్తాన లేచిన వెంటనే చల్లని నీటితో కళ్లు తుడుచుకోవాలి. కొన్ని గంటలుగా కాంతిని నిరోధించిన కళ్లకు హఠాత్తుగా వెలుగు చూపటం దోషం. అందుకై ఇలా చన్నీటితో తుడుచుకోవాలి.

ఆ తర్వాత ‘సముద్ర వసనే దేవి! పర్వత స్తనమండలే, విష్ణుపత్ని! నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే’ అని భూదేవికి నమస్కరించిన తర్వాతే పాదం భూమిపై మోపే ఆచారం మన పెద్దలది. మన దైనిందిన జీవితమంతా సకల దుష్ట విసర్జనలతో సహా ఈ భూమి మీదే చేస్తాము. కాబట్టే మనకు తిండిని ప్రసాదించే, జీవితాంతం మనలను భరించే ఈ భూమికి క్షమాపణ చెప్పుకొని నెత్తిన కాలు పెట్టుటం కనీస కర్తవ్యం. కాలు తగిలితే సారీ చెప్పుకొనే నాగరికతను చూస్తున్న మనం…భూదేవిని క్షమించమని ప్రార్థనను చేయలేమా?

నిద్రలేవగానే శుభదర్శనం చేయాలని సదాచారం చెబుతోంది. నిద్రలేవగానే శ్రోతియుని , గుణ సంపన్నుని, గోవును, అగ్నిని, సోమయాజిలాంటి వారినే చూడాలని, పాపిష్ఠివారిని, అమంగళకర వ్యక్తులను చూడతగనది అంటారు. ఇలా అనడంలో నిద్రలేచిన వెంటనే చేసే దర్శనం ఆరోజు జీవితంపై ప్రభావం చూపుతుందని ప్రజల విశ్వాసం. అందుకే ఎప్పుడైన ప్రమాదం జరగగానే ఛీ..నిద్రలేస్తూ ఎవరి మొగం చూచానో అనుకోవడం మనం చూస్తాం. చాలా మంది నిద్రలేవగానే అరచేతిని చూచుకొంటారు.

కరాగ్రే వసతే లక్ష్మీ-కరమధ్యే సరస్వతీ! కరమూలే స్థితో బ్రహ్మా- ప్రభాతే కరదర్శనం!! అనేది ఆర్ష వ్యాక్యం. అరచేతి అగ్రభాగం లక్ష్మీస్థానం. మధ్యభాగం సరస్వతి స్థానం. కరమూల బ్రహ్మ లేదా గోవింద స్థానం. కాబట్టే ఉదయం లేవగానే అరచేతిని చూచుకొంటారు. అరచేతిలో శ్రీరామ వ్రాసి కన్నుల కద్దుకొవడం కొందరు చేస్తారు. నిద్రలేవనగానే ఏ విధంగానైన దర్శనం అయ్యేటట్లు చేసుకోవడం మంచిది.

దైవ ప్రార్థన తర్వాత ముఖం, కాళ్లు చేతులు కడుగుకొని పుక్కిలించి ఉమ్మివేయాలి. అనంతరం జలపానం చేయాలి. ప్రాతఃకాల జలపానం ఎంతో ఆరోగ్యప్రదం. రాత్రి నిద్రకు ముందు రాగి, వెండి , కంచు లేదంటే మట్టి పాత్రలో మంచినీరుంచి ప్రాతః కాలంలో త్రాగితే సకల దోషాలు పోయి ఆరోగ్యం చేకూరుతుంది. వాత పిత్తశ్లేష్ఠు, ప్రకోపాలు తొలగటమేకాక హృద్రోగం, కాస, శ్యాస, క్షయ, అస్మరీ..మూత్రంలో రాళ్లు, గ్రహణీ….రక్త విరేచనాలు, అతిసార, అతి మూత్ర మొదలైన ఎన్నో వ్యాధులు క్రమంగా ఉపశమిస్తాయి. అంతేకాక సంతోషం, బలం, ఆయుర్వృద్ధి, వీర్యవృద్ధి,ఆరోగ్యం కలుగుతాయి. జలపానం చేశాక కొంత సేపు నడవడం మలబద్దకాన్ని పొగడుతుంది.

బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాతః స్మరణ కర్త్యవంగా మన పెద్దలు చెప్పారు. ప్రాతఃస్మరణతో పుణ్యము, సంస్కారం, చేకూరుతాయి. ఇష్టదైవాలతోపాటు, మహనీయులను, పుణ్యతీర్థాలను స్మరించటం, మహనీయుల జీవిత విశిష్టతను తెలుసుకొని ఆచరణలో వారిని ఆదర్శంగా స్వీకరించడం జీవితానికి ధన్యత.

పురాణాలు - ఉప పురాణాలు


*శ్లో|| మద్వయం భద్వయం చైవ బ్ర త్రయం వ చతుష్టయమ్‌ |*

అ - నా - ప - లిం - గ -  కూ - స్కాని పురాణాని పృథక్‌ పృథక్‌ ||

1. మత్స్య పురాణం - శ్లోకాల సంఖ్య : 14,000 ('మ' ద్వయం)

2. మార్కండేయ పురాణం - శ్లోకాల సంఖ్య : 9,000

3. భవిష్య పురాణం - శ్లోకాల సంఖ్య : 14,000 ('భ' ద్వయం)

4. భాగవత పురాణం - శ్లోకాల సంఖ్య : 18,000

5. బ్రహ్మ పురాణం - శ్లోకాల సంఖ్య : 10,000 ('బ్ర' త్రయం)

6. బ్రహ్మాండ పురాణం - శ్లోకాల సంఖ్య : 12,000

7. బ్రహ్మ వైవర్త పురాణం - శ్లోకాల సంఖ్య : 18,000

8. వామన పురాణం - శ్లోకాల సంఖ్య : 10,000

9. వాయు పురాణం - శ్లోకాల సంఖ్య : 24,600

10. విష్ణుపురాణం - శ్లోకాల సంఖ్య : 23,000 ('వ'చతుష్టయం)

11. వరాహ పురాణం - శ్లోకాల సంఖ్య : 24,000

12. అగ్ని పురాణం - శ్లోక సంఖ్య : 16,000 - అ

13. నారద పురణం - శ్లోక సంఖ్య : 25,000 - నా

14 పద్మ పురణం - శ్లోక సంఖ్య : 55,000 - ప

15. లింగ పురాణం - శ్లోక సంఖ్య : 11,000 - లిం

16. గరుడ పురాణం - శ్లోక సంఖ్య : 19,000 - గ

17. కూర్మపురాణం - శ్లోక సంఖ్య : 17,000 - కూ

18. స్కాంద పురాణం - శ్లోక సంఖ్య : 81,000 - స్కా

*ఇవికాక - 18 ఉప పురాణాలున్నాయి. అవి :*

1. సనత్కుమార పురాణం
2. సాంబ పురాణం
3. సౌర పురాణం
4. నారసింహ పురాణం
5. నారదీయ పురాణం
6. వారుణ పురాణం
7. వాసిష్ఠ పురాణం
8. కాపిల పురాణం
9. కాళికా పురాణం
10. దౌర్వాస పురాణం
11. ఔశసన పురాణం
12. ఆదిత్య పురాణం
13. మాహేశ్వర పురాణం
14. శివపురాణం
15. భాగవత పురాణం
16. పారశర పురాణం
17. నంది పురాణం
18. మానవ పురాణం.

తేనెటీగ-ఆధ్యాత్మిక భావన

తేనె తుట్టె లోపల  తియ్యని తేనె ఉంది, ఆ తేనె మనకు తేలిక గా దొరకదు. కొన్ని వందల  తేనెటీగలు అవరోధము కల్పిస్తూ ఉంటాయి. ఆ తేనె అంది పుచ్చుకోవలెనంటే, పైన చుట్టుకొని యున్న తేనెటీగలను, తేనెపట్టు నుండి తరిమి వేసి , తేనె  చుక్కలను జాగ్రత్తగా ఒడిసి పట్టవలెను.

ఆధ్యాత్మిక భావము: మానవుడు అనే తేనెపట్టు యందు అమృతతత్వము గల పరమాత్మ (తేనె)  నిక్షిప్తమై ఉంటాడు. కానీ ఆ పరమాత్మ తత్వమును అర్థము చేసుకొనుట గానీ అవగాహన చేసుకొని పరమ పదము చేరుట కానీ అంత తేలికైన విషయం కాదు. మనలోని (అరిషడ్వర్గములు) ఆరు దుర్గుణాలు అంటి పట్టుకుని ఉండి, ఆ ప్రయత్నాలను వమ్ము చేస్తూ ఉంటాయి. అవే తేనెటీగలు. మనసులో భగవంతుని యందు శ్రద్ధ, విశ్వాసము, గట్టి నమ్మకము పూన్చుకొని,  కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను తరిమి వేస్తే  గానీ, ఆ అమృత తత్వమును (పరమాత్మ) అందుకోలేము.

ఆది పర్వము ప్రథమాశ్వాసము -2


పూర్వం భృగువు అనే మహాముని వుండేవాడు. అతడి భార్య పేరు పులోమ. ఆమె నిండు గర్భవతిగా ఉన్న సమయంలో భృగువు స్నానానికి వెళుతూ భార్యని హోమాగ్నిని సిద్ధం చేయమన్నాడు. అప్పుడు పులోముడు అనే రాక్షసుడు పులోమను చూసాడు. అతడికి పులోమ మీద మోహం కలిగింది. అతడు అగ్ని దేవునితో ఆమె ఎవరని అడిగారు. అగ్నిదేవుడు సందిగ్ధంలో పడ్డాడు. ఈ పులోముడు ఒకప్పుడు పులోమను చేసుకోవాలని అనుకున్నాడు. అయితే పులోమ తండ్రి ఆమెను భృగువుకు ఇచ్చి వివాహం చేసాడు. ఇప్పడు నిజం చెపితే పులోముడు పులోమను ఏమి చేస్తాడో అని భయపడ్డాడు. అదీ కాక భృగువుకు కూడా తన మీద కోపం రావడంమేగాక తనను శపించవచ్చు. కాని నిజం చెప్పకుంటే తనకు అసత్య దోషం అంట వచ్చు. అనగ సందిగ్ధంలో పడినా ముని శాపం ఎలాగైనా పోగొట్టుకోవచ్చు. అనుకొని అసత్య దోషానికి భయపడి ఆమె భృగువు భార్య అని నిజం చెప్పాడు. అది వినగానే పులోముడు పులోమను గుర్తు పట్టాడు. వివాహం కాక మునుపు ఆమెను పులోముడు చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆమెను భృగువు వివాహం చేసుకున్నాడు. ఈ నిజం తెలిసిన రాక్షసుడు పంది రూపంలో పులోమను ఎత్తుకుని వెళ్ళాడు. ఆ కుదుపులకు పులోమ గర్భంలోని శిశువు కింద పడ్డాడు. కింద పడిన కారణంగా అతడికి చ్యవనుడు అన్న పేరు వచ్చింది. చ్యవనుడు కళ్ళు తెరచి చూడగానే ఆ తేజో శక్తికి రాక్షసుడు దగ్ధం అయ్యాడు.

*అగ్నిహోత్రుడి మీద భృగువు ఆగ్రహించుట*

తరువాత పులోమ కుమారునితో భర్త దగ్గరకు చేరింది. ఆ తరుణంలో పులోమ కంటి నుండి జానువారిన కన్నీరు నదిగా మారి ప్రవహించ సాగింది. ఆ నదికి బ్రహ్మదేవుడు వధూసర అని నామకరణం చేసాడు. నదీ స్నానానికి వెళ్ళిన భృగువు ఆశ్రమానికి తిరిగి వచ్చి తేజోవంతుడైన కుమారుడిని చూసాడు. అప్పుడు పులోమ జరిగినది భర్తకు చెప్పింది. భృగువు భార్యతో " నీవు పులోమ అని నా భార్యవు అని అతడికి ఎలా తెలిసింది " అని అడిగాడు. పులోమ " నాధా ! ఈ అగ్నిదేవుడు నేను పులోమ అని నీ భార్యను అని చెప్పాడు. వరాహరూపంలో అతడు నన్ను తీసుకు పోతున్న తరుణంలో కిందకు జారిన చ్యవనుడు తీక్షణతకు రాక్షసుడు భస్మం అయ్యాడు " అని చెప్పింది. అది విని భృగువు కోపించి అగ్నితో " ఆ రాక్షసుడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసి కూడా నీవు నా భార్య గురించి చెప్పావు కనుక నీవు క్రూరుడవు. అందు వలన నీవు సర్వ భక్షకుడివి అయిపో " అగ్నిదేవుని శపించాడు.

*అగ్నిహోత్రుడి అలక*

అగ్నిదేవుడు " మహర్షీ ! అసత్యం పలికిన వాడు నరకానికి పోతాడని నీకు తెలియనిదా. నేను అసత్య దోషానికి భయపడి అలా చెప్పాను. కర్మ సాక్షిని అయిన నేను అసత్యం పలుకగలనా ! నా అపరాధం ఏమీ లేకనే నాకు నీవు శాపం ఇచ్చావు. నేనూ నీకు ప్రతిశాపం ఇవ్వగలను. అయినా పరుషోక్తులు పలికిలా, కొట్టినా, తిట్టినా ఉత్తమ బ్రాహ్మణులు పూజనీయులే ! నేను సదా బ్రాహ్మణులను పూజిస్తాను. బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను. నీవు ఉత్తమ బ్రాహ్మణుడవు కనుక నేను నిన్ను శపించను. సమస్త లోకాలకు హితము చేసే నన్ను శపించి లోకాలకు అపకారం చేసావు. నైమిత్తిక కార్యంలో భాగంగా అగ్నిలో వేసే హోమద్రవ్యములను, హవిస్సులను తీసుకు వెళ్ళి దేవతలకు, పితరులకు ఇస్తాను. అందు వలన నన్ను హవ్యవాహనుడు అని అంటారు. నీ శాపకారణంగా నేనిక అపవిత్రుడిని ఔతాను కనుక నేనిక హవిస్సును దేవతలకు, పితరులకు అందజేయలేను. నేనా పని చేయకున్న లోకాలు స్థంభిస్తాయి " అని చెప్పాడు. అసత్య దోషానికి భయపడి నిజం చెప్పిన తనకు వచ్చిన శాపానికి కలత చెంది అగ్ని దేవుడు సర్వ భక్షుకుడైన తాను పితృ కార్యానికి, దేవ కార్యానికి పనికి రానని తన జ్వాలలను ఉపసంహరించాడు. లోకంలో దేవక్రతువులు, యజ్ఞయాగములు, ఔపోసనాది కార్యములు ఆగి పోయాయి. దేవతార్చనలో దీపాలు ఆరిపోయాయి. పితరులకు చేసే పిండ ప్రదానాలు ఆగి పోయాయి. అగ్ని కార్యాలు ఆగి పోయాయి. ప్రజలు హాహాకారాలు చేస్తూ మునులు వద్దకు వెళ్ళారు. వారంతా దేవతల వద్దకు వెళ్ళారు. దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు అగ్నిదేవుని అనునయించి " అగ్ని దేవా ! నీవు సమస్త భూతములకు నీవు యజమానివి, చరాచర సృష్టికి నీవు హేతుభూతుడవు, సమస్త దేవతలకు నీవు ముఖం వంటి వాడిని. లోకోపావకుడివి అయిన నీవు ఇలా చెయ్యడం ధర్మం కాదు. భృగువు వాక్కు అసత్యం కాదు. సర్వభక్షకుడివి అయినా నీవు సర్వ కార్యాలలో ప్రధముడివి. నీవు ఎప్పటికీ పవిత్రుడవే శుచులలో నీవు శుచుడివి, పూజింప తగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి. కనుక నీ తేజమును తిరిగి ప్రజ్వలింప చేయుము బ్రాహ్మణ సహాయంతో దేవతలకు హవిస్సును అందించు " అని అర్ధించాడు. అందుకు అగ్నిదేవుడు సమ్మతించాడు.
*సశేషం*
*రేపు రురుడు ప్రమద్వరల వృత్తాంతం*
*సర్పముల మీద రురుడి పగ*
*ఖగముని వృత్తాంతం తెలుసుకుందాం*

నవ గ్రహముల మూల మంత్రములు


1 సూర్యుడు – మూల మంత్రము

ఓం ఆ సత్యేన కృష్ణేన రాజసా వర్తమానో నివేశయన్న మృతం మర్త్యంచ

హిరణ్యయేన సవితా రాదేనా దేవోయాటి భువనాని పశ్యన్

2 చంద్రుడు – మూల మంత్రము

ఓం ఆప్యాయస్య సమేతుటే విశ్వ తస్సోమ వృష్టియమ్ , భవా వాజస్య సంగదే

౩ కుజుడు – మూల మంత్రము

ఓం అగ్నిర్మూర్దా దివః కకుత్పతి; పృధివ్యా అయం అపాగ్మ్  రేతాంగ్మ్ సి జస్వతి

4 బుధుడు – మూల మంత్రము

ఓం ఉద్భధ్యస్నాగ్నే ప్రతిజా గృహ్యేన మిష్టా పూర్తేసగమ్ సృజే దామయంచ

పునః క్రుణగ్స్త్వా పితరం యునానమ న్వాతాగం సీత్వయి తంతు మేతం

5 గురుడు – మూల మంత్రము

ఓం బృహస్పతే అతి యదర్యో అర్హా ద్ద్యు మ ద్విభాతి క్రతు మజ్జనేషు

యద్దీయచ్చవసర్త ప్రజాత తడస్మాస్తు ద్రవిణం ధేహి చిత్రంమ్

6 శుక్రుడు- మూల మంత్రం

ఓం శుక్రంతే అన్యద్య జతంతే అన్యదిషు రూపే అహనీ ద్యోరిహసి

విశ్వా హిమాయా అవసి స్వధావో భద్రాతే పూషన్నిహ రాతిరస్తు

7 శని – మూల మంత్రము

ఓం శమరగ్నిరగ్ని  భిస్కర శ్చన్నస్తపతు సూర్యః శంవాతో వాత్వరపా అపశ్రిదః

8 రాహువు – మూల మంత్రము

ఓం క్రయా నశ్చిత్ర ఆభువ దూతీ సదా వృధ స్సఖా కయాష చిష్టయా వృతా

9  కేతువు – మూల మంత్రము

ఓం కేతుం కృన్ణ్ వన్న కేతవే పెశో మర్యా ఆపెశసే సముషద్భి రాజాయుధః

నిత్యమూ పైన తెలిపిన శ్లోకములను పటించుట వలన ఆయురారోగ్య , ఐశ్వర్యములు కలుగును

గ్రహదోషాలకు


గోపూజ అద్భుతంగా పని చేస్తుంది:

#గోపూజ
అంటే గోవుకు ఆహారాన్ని తినిపించటమే....

ఉదాహరణకు #అష్టమ_అర్థాష్టమ_ఏలిననాటి_శనిదశలు జరుగుతున్నవారు శనివారం(వీలునుబట్టి) గోవుకు ఆహారం (కనీసం 6 అరటి పళ్ళైనా - 19 వారాలు క్రమం తప్పకుండా) సమర్పించినట్లైతే మంచి ఫలితాలు కలుగుతున్నాయి.,
ఈవిధంగా చేయడం వలన ఎన్నోప్రయాసలకు ఓర్చి #ధర్మం కోసం గోశాలలను నిర్వహిస్తున్న మన మిత్రృలకు సహాయం చేసిన వారం కూడా అవుతాము.....
ప్రతి హైందవుడు ఈవిధంగా చేయాలని ఆశిద్ధాం....
కేవలం 6 అరటిపళ్ళు గోమాతకు సమర్పించటం భారం అవుతుందా....??
ప్రతి హైందవుడు ఆవిధంగా చేయ గలిగితే గోమాతలకు ప్రస్తుతమున్న దుస్థితి వస్తుందా....??

#గోమాత లక్ష్మీదేవితోపాటు క్షీరసముద్రంలో పుట్టినది.,
సతీదేవి దేహత్యాగం అనంతరం దీర్ఘతపస్సులోకి వెళ్ళిపోయిన పరమశివుని మేల్కొల్పుటకు దేవతలు మన్మధుణ్ణి పంపించారు, కళ్ళుతెరచిన శివుని శక్తిని తాళలేక వసంతుడి దేహం బస్మమై పోతుంది, తరువాత దేవతలకు ఏంచేయాలో అర్థంకాక అందరూ వెనకాల ఉండి గోమాతను శివుని దగ్గరకు పంపుతారు.,
దత్తాత్రేయుని వెనకాల గోమాత ఉంటుంది.,
గోమాతతో పెట్టుకుని మహావీరుడు కార్తవీర్యార్జునుడే వంశాన్ని నాశనం చేసుకున్నాడు.,
పూర్వయుగంలో ఒక రాజు పొరపాటున/తెలియక దానమిచ్చిన గోవును మళ్ళీ దానంగా ఇచ్చి కొన్ని వేల సంవత్సరాలు ఉడుంగా బిలంలో కాలం గడిపవలసి వచ్చింది(గోవు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అర్థం)
గోదావరి పుట్టుకకు కారణం అయింది గోమాత.,
ఆత్మలింగాన్ని అడ్డుకొనుటకు గోకర్ణ ప్రాంతంలో వినాయకుడు గోవులను కాసే బాలుడుగా రావణుడికి కనిపించాడు.,
శ్రీక్రృష్ణ పరమాత్మ గోవులను కాయటాన్ని వ్రృత్తిగా ఎంచుకున్నాడు.,
చిన్ని క్రృష్ణుని అవతారంలో ఉన్న పరమాత్మ శక్తిసామర్థ్యాలను పరీక్షించదలచుకున్న బ్రహ్మ ఏంచేయాలో అర్థంకాక గోవులను మాయం చేశాడు.,
అత్యంత రహస్యంగా అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులను బహిర్గతం చేయుటకు ధుర్యోదనాదులు విరాటరాజు గోవులను అపహరించారు, గోవులను కాపాడడం కోసం పాండవులు బయటపడటానికి కూడా సిద్ధపడ్డారు.,
గోమాత కారణంగానే మొదటగా వేంకటేశ్వరస్వామి లోకానికి తెలిసారు.,
వీరబ్రహ్మేంద్రస్వామి గోవులను కాస్తూనే మొదటిగా తన దైవత్వాన్ని తెలియజేశారు.,
రమణమహర్షి తన తల్లితో సమానంగా గోవుకు అంత్యసంస్కారాలు జరిపించారు.,
అవధూత #కాశినాయన వెనకాల గోవు ఉంటుంది.,
అనేక పుణ్యక్షేత్రాల స్థలపురాణాలతో గోమాతకు సంబంధం ఉంటుంది.,
గోవు పాదం మోపనిదే #గ్రృహప్రవేశానికి అర్థం లేదు.,
అంతెందుకు #క్రృత_త్రేతా_ద్వాపర యుగాలలో క్రౄరమైన రాక్షసులు సైతం సాధారణంగా గోమాత జోలికి పోయినట్టు లేదుకదా....??
లోకపాలకుడు మహావిష్ణువు యొక్క అన్ని లోకాలలో ఉన్నతమైనది వైకుంఠం కాగా, ఆ వైకుంఠం కన్నా పైన ఉన్నది #గోలోకం అని శాస్త్రాలలో చెప్పబడినది.,
గోవును #ఆషామాషీగా తీసుకోవద్దు....
కొద్ది క్షణాలు గోవుతో గడపడమే మహా భాగ్యం....
#భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో గంటల వ్యవధిలోనే కొన్ని వేలమంది చనిపోయారు, కాని చుట్టూఉన్నవాళ్ళు చనిపోయినా కొన్ని కుటుంబాలవారు మాత్రం కొద్దిపాటి అస్వస్థతతో తిరిగి కోలుకున్నారు, తరువాత పరిశోధనలో తేలిందేమంటే వీళ్ళంతా గోశాల సమీపంలో ఉన్న కుటుంబాలు మరియు గోవు నెయ్యితో నిత్యం హోమం చేసే కుటుంబాలు అని తేలింది....
తనను కాచే యజమానికి ఏదైనా వ్యాధి రాబోతుంటే ఆ లక్షణాలను ముందే పసిగట్టి దానిని నివారించే ఔషధ సంబంధ మేత/గడ్డి జాతులను తిని తన  పాలతో యజమానికి తెలియకుండానే వ్యాధిని నివారించే #అద్భుత లక్షణం గోవుకు ఉన్నట్లు ఇటీవలనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు....

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...