అమ్మ జీడిపప్పు గారు (శివరాత్రి ఎలా ఏర్పడింది)? ప్రళయ కాలంలో బ్రహ్మ, అతను సృష్టించిన సర్వజీవరాసులు అతలాకుతలమయ్యే అంతిమదశలో ఉమా మహేశ్వరి పరమశివుణ్ణి ధ్యానించింది. ఆ రాత్రంతా నాలుగు జాములుఅర్చనలు ఆచరించి పరమశివుణ్ణి ఒక వరం కోరింది. "రాత్రంతా మేలుకొని నేను మీ నామస్మరణ చేసి, పూజా రాధనలు గావించినందువల్ల, మీ పవిత్ర నామం పేరిట దేవతలు, మానవులు శివరాత్రి అనేపండుగా చేసుకోవాలి. శివరాత్రి నాడు సూర్య అస్తమయం మొదలుకొని సూర్యోదయం వరకు ఎవరైతే పూజలు నిర్వహిస్తారో వారికి సర్వ భోగాలు మోక్షం ప్రసాదించాలి, అనుగ్రహించండి స్వామీ "అని పరమశివుణ్ణి వేడుకుంది. శివుడు ప్రత్యక్షమై "అందరు శివరాత్రి జరుపుకుంటారు "అని వరం ప్రసాదించాడు. కాబట్టి మనము శివరాత్రి చేసి శివుని నామస్మరణతో ఆ నాడు గడపాలి
Friday, May 1, 2015
సకల దేవేత గాయత్రి మంత్రములు
1) నంది గాయత్రీ తత్ పురుషాయ విద్మహే చక్ర తుండాయ ధీమహి తన్నో నంది: ప్రచోదయాత్! 2) నంది గాయత్రీ తత్ పురుషాయ విద్మహే చక్ర తుండాయ ధీమహి తన్నో నంది: ప్రచోదయాత్ 3) గరుడ గాయత్రీతత్ పురుషాయ విద్మహే సువర్ణ పక్ష్య ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్! 4) కాత్యాయని గౌరీ గాయత్రీ ఓం సుభాకయై విద్మహేకళా మాలిని ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్! 5) భైరవ గాయత్రిఓం భైరవాయ విద్మహే హరిహరబ్రహ్మాత్ మహాయ ధీమహి తన్నో స్వర్ణాఘర్షణ భైరవ ప్రచోదయాత్! 6) ధన్వంతరి గాయత్రీ ఓం తత్ పురుషాయ విద్మహే అమృత కలశ హస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్! [లేక] ఓం ఆదివైధ్యాయ విద్మహే ఆరోగ్య అనుగ్రహాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్! 7) దక్షిణామూర్తి గాయత్రి ఓం తత్ పురుషాయ విద్మహే విద్యా వాసాయ ధీమహీ తన్నో దక్షిణామూర్తి ప్రచోదయాత్! 8) కుబేర గాయత్రి ఓం యక్ష రాజాయ విద్మహే అలికదీసాయ దీమహే తన్న: కుబేర ప్రచోదయాత్! 9) మహా శక్తి గాయత్రీ ఓం సర్వసంమోహిన్యై విద్మహే విస్వజననయై ధీమహీ తన్నః శక్తి: ప్రచోదయాత్! 10) షణ్ముఖ గాయత్రీ ఓం దత్త పురుషాయ విద్మహే మహా సేనాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్! 11) సుదర్శన గాయత్రీ ఓం సుధర్శనయ విద్మహే మహా జ్వాలాయ ధీమహే తన్నో చక్ర ప్రచోదయాత్! 12) శ్రీనివాస గాయత్రీ నిర్నజనయే విద్మహేనిరపసయే ధీమహే తన్నో శ్రీనివాస ప్రచోదయాత్! 13) శ్రీనివాస గాయత్రీ నిర్నజనయే విద్మహే నిరపసయే ధీమహే తన్నో శ్రీనివాస ప్రచోదయాత్! 14) కామ గాయత్రి ఓం కామదేవాయ విద్మహేపుష్పబాణాయ ధీమహి, తన్నో నంగః ప్రచోదయాత్! 15) హంస గాయత్రి ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి, తన్నోహంస: ప్రచోదయాత్! 16) హయగ్రీవ గాయత్రి ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ గాయత్రి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ గాయత్రి ఓం చతుర్ముఖాయ విద్మహేహంసారూఢాయ ధీమహి, తన్నోబ్రహ్మ: ప్రచోదయాత్! 19) సీతా గాయత్రి ఓం జనక నందిన్యై విద్మహే భూమిజాయై ధీమహి, తన్నోసీతా: ప్రచోదయాత్ 20) దుర్గా గాయత్రి ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి, తన్నోదుర్గా ప్రచోదయాత్! 21) సరస్వతీ గాయత్రి ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి, తన్నోదేవీ ప్రచోదయాత్! 22) రాధా గాయత్రి ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి, తన్నోరాధా ప్రచోదయాత్! 23) కృష్ణ గాయత్రి ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణ: ప్రచోదయాత్! 24) విష్ణు గాయత్రి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణు: ప్రచోదయాత్ 25) తులసీ గాయత్రి ఓం శ్రీతులస్యై విద్మహేవిష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందా: ప్రచోదయాత్! 26) పృథ్వీ గాయత్రి ఓం పృథ్వీదేవ్యై విద్మహే సహస్రమూర్త్యై ధీమహి, తన్నోపృథ్వీ ప్రచోదయాత్! 27) అగ్ని గాయత్రి ఓం మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్ని: ప్రచోదయాత్! 28) వరుణ గాయత్రి ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి, తన్నోవరుణ: ప్రచోదయాత్! 29) యమ గాయత్రి ఓం సూర్యపుత్రాయ విద్మహే మాహాకాలాయ ధీమహి, తన్నోయమ: ప్రచోదయాత్ 30) ఇంద్ర గాయత్రీ ఓం సహస్రనేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్ర: ప్రచోదయాత్! 31) నవగ్రహ గాయత్రీ సూర్య :: ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్య: ప్రచోదయాత్ చంద్ర: : ఓం అమ్రుతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహి తన్నశ్చంద్ర: ప్రచోదయాత్ కుజ :: ఓం అన్గారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్న: కుజ: ప్రచోదయాత్ బుధ :: ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధ: ప్రచోదయాత్ చంద్ర :: ఓం సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురు: ప్రచోదయాత్ శుక్ర :: ఓం భార్గవాయ విద్మహే మంద గ్రహాయ ధీమహి తన్న: శని: ప్రచోదయాత్ రాహు :: ఓం శీర్ష రూపాయ విద్మహే వక్ర పందాయ ధీమహి తన్నో రాహు: ప్రచోదయాత్ కేతు :: ఓం తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో 32) ఆంజనేయ గాయత్రీ ధీమహి వాయుపుత్రాయ విద్మహే ఆంజనేయాయ ప్రచోదయాత్ హనుమత్ తన్నో ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నోమారుతి: ప్రచోదయాత్! 33) గణేశ గాయత్రీ ఏక దంతాయ విద్మహే వక్రతుండాయ దేమహి తన్నో దంతి: ప్రచోదయాత్! 34) శివ గాయత్రీ ఓం తత్పురుషాయ విద్మహే మహా దేవాయ ధీమహి తన్నో శివః ప్రచోదయాత్! 35) లక్ష్మీ గాయత్రీ ఓం మహాదేవ్యై చ విద్మహేవిష్ణు పత్న్యై చ ధీమహీ తన్నో లక్ష్మిః ప్రచోదయాత్!
స్టీవెన్ పాల్ జాబ్స్
స్టీవ్ జాబ్స్ గా పిలువబడే స్టీవెన్ పాల్ జాబ్స్ యాపిల్ ఇన్కార్పొరేటేడ్కు చైర్మెన్ మరియు CEO. కంప్యూటర్ రంగంలో మరియు వినోదం పరిశ్రమలో తిరుగులేని విజయాలను సాధించి ప్రపంచంలోనే ఒకానొక గొప్ప వ్యాపారవేత్తగా పేరుపొందాడు.ఇతను 1944 ఫిబ్రవరి 24 న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు.జాబ్స్ కు చిన్నప్పటినుండి అధ్యాత్మిక విషయాల పైన చాలా ఆసక్తి.ఒక వీడియో గేమ్స్ కంపెనీలో కొన్నాళ్ళు పనిచేసి తగినంత డబ్బు చేకూరిన తర్వాత భారతదేశ పర్యటన చేసి వేదాంత, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొన్నాడు. తర్వాత నున్నని గుండుతో, భారతీయ సాంప్రదాయ దుస్తులతో అమెరికాకు వెనుతిరిగాడు.1976 లో స్టీవ్ వోజ్నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొట్టమొదటి కంప్యూటర్ను డాలర్లకు అమ్మారు 666.66. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1984 లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. 1984 1985 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల లో జాబ్స్ ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవినుండి తొలగించారు. NeXT అప్పుడు అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు. ఆపిల్ డైరక్టర్లు NeXT ను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అప్పటి ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక గా నియమితుడయ్యాడు CEO. కంపెనీని లాభాల బాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించడంతో 2000 లో పూర్తిస్థాయి అయ్యాడు CEO. కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్ను ఆవిష్కరించి ఆపిల్ను అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళగలిగాడు. 1986 లో 10 మిలియన్ డాలర్లకు పిక్సర్ అనే గ్రాఫిక్స్ కంపెనీని కొన్నాడు. పిక్సర్-డిస్నీ సహయత్నంగా మొట్టమొదటి సినిమా అయిన టాయ్ స్టోరీ 1995 లో విడుదలయి ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత పదేళ్ళపాటు వరుసగా ప్రతి సినిమా ఘన విజయాన్ని సాధిస్తూ గొప్ప లాభాలను ఆర్జించాయి. ఈ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలు: ఎ బగ్స్ లైఫ్, టాయ్ స్టోరీ 2 మాన్స్టర్స్.ఇన్క్, ఫైండింగ్ నీమో, ది ఇన్క్రెడిబుల్స్, కార్స్, రాటటూయి.
మనిషి
నేనెవర్ని? ........................ ఇన్ని వేల సంవత్సరాల నాగరికత తర్వాత కూడా ప్రపంచంలో ఏ ఒక్కరూ పరిపూర్ణంగా సమాధానం చెప్పలేని ప్రశ్న! అయినా మనిషి తన అస్తిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం మాత్రం మానడు. ఇదీ నేను! అని స్థిరంగా నిర్ణయించుకుని మనిషి జీవితం గడిపేస్తుంటాడు. కానీ ఒకానొక సమయంలో ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ మనల్ని ప్రశ్నించినప్పుడు, ఇదా నేను! అని బయల్దేరి, ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో తనని తాను తెలుసుకుంటాడు. చివరికి మరో సారి ఇదీ నేను అని స్థిరంగా నిర్ణయించుకుని జీవితం గడపడానికి ప్రయత్నిస్తుంటాడు మనిషి.కానీ కీర్క్గార్డ్ చెప్పినట్టు "మనిషి నిత్య పరిణామి". మనిషి ఒక స్థితి నుంచి మరో స్థితికి మారుతూ పరిణమిస్తూ ఉంటాడు. నిజమే, చెట్లు పుట్టలు కూడా పరిణమిస్తాయి. కానీ వీటి విషయంలో, ఏ స్థితిలో అయినా, ఏ దశలోనైనా, ఆ స్థితిని, ఆ దశను పూర్తిగా వర్ణించగలం. కానీ మనిషి అలా కాదు. అతడు ఏమి కానున్నాడు, ఏమిగా మారనున్నాడు? ఏ దిశగా పరిణమిస్తున్నాడు? అతడి ప్రణాళిక, ఉద్దేశాలేమిటో చెప్పడం సాధ్యం కాదు. ఈ పరిణామ క్రమంలో మనిషి అస్తిత్వాన్ని ఎలా నిర్వచించాలి? ఏది నా అస్తిత్వం? మారిన నేనా? మారకముందు నేనా? లేక మరో సారి మారబోతున్న నేనా? విశ్వమంతా వ్యాపించిన అనంతమైన తాడుని పట్టుకుని ఎక్కడని వెతకను నా కోసం?
హనుమజ్జయంతి
ఆంజనేయస్వామి ధైర్యానికి ప్రతీక. శక్తిసామర్ధ్యాలకు ప్రతిరూపం.
మన పండుగల్లో హనుమాన్ జయంతి ముఖ్యమైంది.హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా హనుమంతుని కధలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు నిర్వహిస్తారు.
ఆంజనేయస్వామి ధైర్యానికి ప్రతీక. శక్తిసామర్ధ్యాలకు ప్రతిరూపం.సముద్రం దాటి లంక చేరాడు. ఆకాశమార్గంలో పయనించి సీతమ్మవారి జాడ కనిపెట్టాడు. సంజీవనీ పర్వతాన్నే పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తియుక్తులను కీర్తించడం సాధ్యమా ?! హనుమజ్జయంతి సందర్భంగా పంచముఖ హనుమాన్, పాదరస హనుమాన్ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు.దేవాలయాల్లో హనుమాన్ ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరు ఈవేళ ఉపవాసం ఉండడానికే ఇష్టపడతారు.
హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు.
హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తికి, బల సంపన్నతకు సంకేతమైన హనుమంతుని విశేషాలు స్మరించుకుందాం. హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండీ రాముడి సేవలో గడపడానికే ప్రాధాన్యత ఇచ్చాడు.ఆంజనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తిప్రపత్తులు అంటే, తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు. శ్రీరాముని, సీతమ్మతల్లి కంటే మిన్నగా ప్రేమించాడు హనుమంతుడు.
ఒకసారి హనుమాన్ సీతాదేవి నుదుట సిందూరం పెట్టుకోవడం చూసి, "నుదుట సిందూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా" అని అడుగుతాడు.
సీతమ్మ తల్లి నవ్వుతూ "శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని" అంటుంది.
అంతే, హనుమంతుడు క్షణం ఆలోచించకుండా తన ఒళ్ళంతా సిందూరం పూసుకుంటాడు. అదీ హనుమంతునికి రాముడి మీద గల నిరుపమానమైన భక్తి. హనుమంతుని భక్తికి ఇలాంటి తార్కాణాలు ఎన్నో!
ఒక సందర్భంలో సీతమ్మ హనుమంతునికి రత్నాభరణాన్ని బహూకరించింది. హనుమంతుడు ఒక్కో పూసనూ కొరికి చూసి, విసిరేయసాగాడు.
అదేమిటని అడగ్గా, "రామయ్య తండ్రి కనిపిస్తాడేమోనని ఆశగా చూశాను. నా స్వామి లేని రత్నాలు, స్వర్ణాలతో నాకేం పని? "అన్నాడు.
హనుమంతుని నిరుపమానమైన భక్తికి ఇంతకంటే కొలమానం ఇంకేం కావాలి? రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోగా, ఆ తల్లిని అన్వేషించడానికి బయల్దేరాడు హనుమంతుడు.అహర్నిశలూ ప్రయత్నించి, సీతమ్మ జాడ తెలుసుకున్నాడు.
అశోకవనంలో శోకమూర్తిలా కూర్చుని, దిగులు సముద్రంలో కుంగిపోతూ, ఆత్మత్యాగం చేయాలనుకుంటున్న సీతమ్మకు శ్రీరాముని అంగుళీయకం చూపి, ధైర్యంగా ఉండమని స్థైర్య వచనాలు పలికాడు. లంకాదహనం చేసి తన వంతు సహకారం అందించాడు.
వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు.పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంవల్ల ధైర్యం, స్థైర్యం కలుగుతాయి. భయాలూ భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు.
ఇక హనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతో హనుమంతుని అర్చిస్తారు.
Monday, April 27, 2015
శరవణభవ
షణ్మతాలలో కుమారోపాసన ఒకటి. కంఠంలో రత్నాలంకారాలు, మేనిలో చక్కదనం, చేతిలో జ్ఞానశక్తి ఆయుధం, ముఖాన చిరునవ్వు, కటియందుహస్తాన్ని దాల్చి నెమలిపై ప్రకాశిస్తుండే స్వామి జ్ఞానస్వరూపుడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి, శరణన్నవారిని కాపాడే దేవుడు. అమోఘమైన శివతేజాన్ని, పృథ్వి, అగ్ని, జలం, షట్ కృత్తికల శక్తిని (నక్షత్రశక్తి) ధరించి, చివరకు బ్రహ్మ తపోనిర్మితమైన అలౌకిక మహాగ్ని శరవణంలో (అగ్నితో కూడిన రెల్లుతుప్పు) రూపుదిద్దుకుంది. అందుకే స్వామి శరణభవుడు.
శ – శమింపజేయువాడు
ర – రతిపుష్టిని ఇచ్చువాడు
వ – వంధ్యత్వం రూపుమాపువాడు
ణ – రణమున జయాన్నిచ్చేవాడు
భ – భవసాగరాన్ని దాటించేవాడు
వ – వందనీయుడు
అని ‘శరవణభవ’కు గూఢార్థం.
ఆ స్వామివారికి, స్కందుడు, సేనాని, మహాసేనుడు, శరవణభవ, కార్తికేయుడు, గాంగేయుడు, కుమారదేవుడు, వేలాయుధుడు, మురుగన్ అనే పేర్లున్నాయి. ఈ పేర్లలో ఎంతో నిగూఢార్థం ఉంది.
షణ్ముఖుడు: సుబ్రహ్మణ్యస్వామి ఆరు ముఖాలుగలవాడు కనుక షణ్ముఖుడనబడుతున్నాడు. అదేవిధంగా షణ్ముఖుడు పంచభూతాల సంగమానికి సంకేతం. ఆయన ఈ సృష్టిలోని సమస్తంలో ఉన్నాడు.
సుబ్రహ్మణ్యస్వామి: షణ్ముఖుని స్వరూపం జ్యోతిర్మయమైనది. పరమశివుని త్రికూటి నుండి వెలువడిన అగ్ని కీలలతో ఆరుముఖాల షణ్ముఖుడు ఉద్భవించాడు. ఆ జ్యోతి స్వరూపుడు మనలోని అజ్ఞానాంధకారాన్నిపారద్రోలి, మన మనసులలో జ్ఞానజ్యోతులను వెలిగిస్తాడు. శూరపద్ముని ఆవరించియున్న మాయను తొలిగించి, అతనికి మోక్షమార్గాన్ని చూపినందుకే స్వామిని మనమంతా సుబ్రహ్మణ్యస్వామి అని కొలుచుకుంటున్నాం. సుబ్రహ్మణ్యుడు కరుణామయుడు.
స్కందుడు: స్వామి దగ్గరకు మనం మోకరిల్లితేనే చాలు మన ఊపిరి సుగంధపరిమళాలతో నిండిపోతుంది. ఈ విషయాన్ని ముందుగా స్వామి తల్లి పార్వతీదేవి, సుబ్రహ్మణ్యస్వామిని ఆరు తామరపుష్పాలలో గమనించినపుడు తెలుసుకుని మురిసిపోయింది. అలాగే ‘స్కంద’ అంటే ఒకటిగా చేరినది అని అర్థం. పార్వతీదేవి ఆరుపద్మాలలో ఆరు శిశువులను చూసిన కాసేపటికి ఆ ఆరు శిశువులు ఒకే శిశువుగా మారి ఆరు తలలతో పన్నెండు చేతులతో ప్రత్యక్షమయ్యాడు. అందుకే స్కందుడయ్యాడు.
శరవణభవ: శరవణభవ అనే మంత్రాన్ని పఠిస్తేచాలు సమస్త సన్మంగళాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. శరవణభవ మంత్రంలో –
శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు
గాంగేయుడు: శివుని త్రినేత్రం నుండి వెలువడిన జ్యోతి కిరణాలు శరవణపోయ్ గై అనే నదిలో ఐక్యం అయిన తరువాత స్వామి ప్రత్యక్షమవడం వలన గాంగేయుడు అని పిలువబడుతున్నాడు. గాంగేయుడు అంటే గంగపుత్రుడు.
వేలాయుధుడు: స్వామి ఆయుధం శూలం (వేల్ అని తమిళంలో అంటారు) ఈ వేల్ తోనే శూరపద్ముడు, అతని దుష్టపరివారమంతా సంహారించబడింది. వేల్ జ్ఞానశక్తికి ప్రతీక. స్వామి తన తన వేలాయుధంతో మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానదీపికలను వెలిగిస్తున్న వేలాయుధుడు. ఇలా స్వామి యొక్క ప్రతినామంలో ఎంతో గూఢార్థం ఉంది. ఇక, హరిహరుల తత్త్వమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుల వారి తత్త్వం.
పురుషో విష్ణురుత్యుక్తః శివోవా నామతః స్మృతః
అవ్యక్తంతు ఉమాదేవి శ్రీర్వాపద్మనిభేక్షణా!
తత్సం యోగాత్ సముధ్బూతః సహిసేనాపతి ర్గుహః
పురుషోత్తముడైన విష్ణువు లేదా పరమేశ్వరుడు అవ్యక్త శక్తి శ్రీమహాలక్ష్మీ లేదా పార్వతీదేవి వీరిరువురి సమన్వయ సమైక్యతా తత్త్వ మూర్తియే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని స్కంధ పురాణం తెలియజేస్తుంది.
వివరంగా చెప్పాలంటే శ్రీ సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే శివశక్తులను, లక్ష్మీ నారాయణులను కలిపి ఆరాధించినట్లే. ప్రకృతి పురుషుల ఏకత్వమే శ్రీ సుబ్రహ్మణ్య తత్త్వం. అదే హరిహరులు ఒక్కటేనన్న అద్వైత తత్త్వం.
అందుకనే తమిళనాడులో పళముదిర్ చోళై అనబడే శ్రీసుబ్రహ్మణ్య క్షేత్రంలో శ్రీమహావిష్ణు, శ్రీసుబ్రహ్మణ్యులు ఒకే ప్రాగణంలో వెలసియున్నారు.
నమస్తే నమస్తే మహాశక్తి పాణే
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే
నమస్తే నమస్తే సదాభీష్టపాణే
ఈ షణ్మతాలలోను ముఖ్యమైనది అగ్ని ఆరాధన. అగ్ని కారమైన ఔపాసనకు శ్రీసుబ్రహ్మణ్యుడు అధిదేవత. అందువలన ఆయనను వదలిపెట్టి తక్కిన ఐదుగురు గణపతి, సూర్యుడు, శ్రీమహావిష్ణువు, ఈశ్వరుడు, అంబికలను పంచాయతన పూజలో ఆరాధిస్తూన్నాము. అందువలన ఆయన ఆరాధన, పంచాయతన పూజా కలిసి, షణ్మత సాధన అవుతోంది.
వైదిక కర్మలలో అగ్నికార్యం హోమం ప్రధానమైనది. శ్రీసుబ్రహ్మణ్యుడు దేవతా విశేషములలో అగ్నిస్వరూపుడు. బయట అగ్ని స్వరూపుడు, ఆత్మ
స్వరూపాన గుహుడు. ఆయనకు అగ్నిభూః అనే పేరుంది. సేనాని అగ్నిభూః, గుహః అని శ్రీ సుబ్రహ్మణ్య నామావళి కూర్చబడింది.
కుండలినీ శక్తి జాగృతమైన షట్చక్రాల నుండి పైకిప్రాకి అగ్ని తత్త్వమైన సుషుమ్నా మార్గంలో ఉత్పన్నమయ్యే శక్తియే ఆయన. సంవత్సరాగ్నిగా, కాలస్వరూపుడిగా…ఆరు ఋతువులు ఆయనకు ఆరు ముఖాలు. పన్నెండు మాసాలు ఆయనకు గల పన్నెండు చేతులు. ఆయన అభయ స్వరూపుడు.
సేనా విదారక స్కంధ మహాసేన మహాబల
రుద్రోమాగ్నిజ శాద్వాక్త్ర గంగార్భా నమోస్తుతే
రాక్షససైన్యాన్ని నశింపజేసినవాడా! శరవణ తటాకము నుండి ఒడ్డుకు జారినవాడా! గొప్ప సైన్యాన్ని నిరంతరం అదుపు రక్షణగా ఉంచుకునే వాడా, సాటిలేని శక్తి సామర్థ్యములు గలవాడా, శంకరునకు పార్వతికి అగ్నికి కుమారుడవైనట్టివాడా, గంగాదేవి గర్భవాసం చేసినట్టివాడా, షణ్ముఖా, నీకు నమస్కారం.
ఈ శ్లోకం మనకు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క సంపూర్ణ స్వరూప, స్వభావ, మహాత్మ్యాలను తెలియజేస్తుంది. దీనిని చెప్పుకొని ప్రార్థిస్తే ఆయన కృపకు ప్రాత్రులమౌతాము.
“స్వామి” అన్న పదం అందరి దేవతలకు వర్తించినా, అది శ్రీసుబ్రహ్మణ్య స్వామికి మాత్రమే అనువర్తిస్తుంది. అమరకోశంలో స్వామి అను పదానికి దేవసేనాపతి, శూరః, స్వామీ గజముఖానుజః అని శ్రీ సుబ్రహ్మణ్యుని గూర్చి పదాలలో ఉపయోగింపబడి ఉంది. స్వామి అన్న నామధేయం ఆయనదే.
ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై వుంచి, మరొక హస్తంతో అభయప్రదానం
చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారాలు.
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు జ్యోతులలోకెల్లా జ్యోతియైన పరంజ్యోతి. ఆత్మ స్వరూపుడు. షణ్మతాలకు అధిపతి. గణపతిని ప్రధానంగా ఉపాశించునది గాణ పత్యము. సూర్యుని ఉపాశించునది సౌరము. అంబికను ఉపాశిస్తే అది శాక్తము. శివోపాసన శైవము. శ్రీమహావిష్ణు ఉపాసన వైష్ణవం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పరమాత్మ అని ఉపాశించడం కౌమారం.
శివశక్తులు కలిసి నందువల్లనే జ్ఞానజ్యోతి ఏర్పడింది. అట్లేర్పడిన జ్యోతిస్వరూపుడైన కుమారుడే శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుడు. లోకానుగ్రహార్థం మూర్తీభవించినపుడు శ్రీసుబ్రహ్మణ్యుడిగా విలసిల్లుతున్నాడు. ఆయన శివశక్తుల సమ్మేళనం వలన ప్రభవించిన జ్ఞానఫలం. అందువలన ఆయన తన దివ్యశక్తిచే మన బాహ్యాంతరములందలి అజ్ఞానాన్ని శాశ్వతంగా పోగొట్టి మనకు అమరత్వాన్ని, అమృతత్వాన్ని కలుగజేస్తున్నాడు.
అరుణగిరినాధుడనే శ్రీ సుబ్రహ్మణ్య భక్తుడు తమిళగడ్డపై జన్మించాడు. ఆయననుణ కందరనుభూతి అనే గ్రంథాన్ని వ్రాశాడు. దానిలో వేర్వేరుగానున్న శివశక్తులు ఏకమై ఒకదివ్యశక్తిని ఉత్పాదించాయని, ఆశక్తి అనుగ్రహం వలన మనలోని ద్వైత భ్రమ తొలిగి ఏకత్వంలోకి తీసుకొని వెళ్ళి తనలో కలుపుకొంటున్నాడని వివరించాడు. ఆయన తిరుపుగళ్ అనే తమిళ స్తోత్ర గ్రంథంలో కూడా శివశక్తులకు జన్మించిన శ్రీసుబ్రహ్మణ్యుని వైష్ణవ పరంగా కూడా కీర్తించడం విశేషంగా ఉంటుంది.
తమిళభాషలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ‘మురుగన్’ అని అంటారు. ఆమాటకు అందమైన వాడని అర్థం. ఆయనకు ‘మరుమగన్’ అని కూడ పేరున్నది. ఆ మాటకు అర్థం మేనల్లుడని. ఒక ఇతివృత్తం ప్రకారం శ్రీవల్లీ దేవసేనలిరువురు శ్రీమహావిష్ణువు కుమార్తెలే అని, వారిని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వివాహమాడిన కారణంగా, ఆయన శ్రీమహావిష్ణువునకు మేనల్లుడు, అల్లుడు అయ్యాడని తెలుపబడింది.
ఈ విధంగా శ్రీసుబ్రహ్మణ్యుడు శైవానికి, వైష్ణవానికి సబంధించినవాడని తెలుసుకోవాలి.
ఐతే, ఉత్తరభారతంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి గృహస్థుడుగా కాక నిరంతర బ్రహ్మచారిగా వ్యవహరింపబడుతున్నాడు. అక్కడ ఆయనకు కార్తికేయుడు అన్న పేరే ప్రసిద్ధమైనది. కుమారస్వామి అన్న పేరు కూడా వారికి
విదియమైనదే. కాళిదాసు మహాకవి సంస్కృతంలో కుమార సంభవమనే గ్రంథాన్ని రచించారు. దీని ప్రస్తావన మొదట వాల్మీకి రామాయణంలోనే వచ్చినది. బాలకాండంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు స్కంధుని జన్మవృత్తాంతము తెలియజేస్తాడు. ‘కుమారా స్సంభవ శ్చైవ ధన్యః పుణ్యస్తధైవచ’ అని వ్రాయబడింది. వాల్మీకి మహామునికి సాధారణంగా రామాయణ సర్గల పారాయణానికి ఫలశ్రుతి చెప్పే అలవాటు లేదు. కాని, ఇక్కడ ఫలశ్రుతి చెప్పాడు. వాల్మీకి బాలకాండంలోనే ఉపయోగించిన కుమార సంభావమను రెండు పదాలను మహాకవి కాళిదాసు మంగళవాక్యంగా భావించి తన గ్రంథమునకు కుమార సంభవమను పేరు పెట్టాడు.
స్కందుడన్న పేరు కూడా శ్రీ స్వామి వారికి ప్రసిద్ధమైనది. స్కన్నమైన (జారిన) వాడు స్కందుడు. శివుని ఆత్మజ్యోతి నుండి ఆవిర్భవించిన ఆరుజ్యోతుల స్వరూపమే శ్రీసుబ్రహ్మణ్యుడు. స్కందుడను పేరును మనస్సులో ఉంచుకొని శ్రీవ్యాసులవారు స్కంద పురాణాన్ని రచించారు. ద్రవిడ భాషలో స్కందుడను పదమునకు వికృతి కందుడు.
మాతృదేవోభవ, పితృ దేవోభవ అనేవి వేద శానములు. శివ, శక్తులు మాతాపితలుగా వేర్వేరుగా కాక అర్థనారీశ్వర రూపంలో కలిసి ఉన్నారు. సత్ పరేమేశ్వరుడు కాగా చిత్ అంబిక. ఈ సత్ చిత్ రెండును ఏకము కాగా ఆనందం ఉద్భవించింది. ఆ సచ్చిదానందమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. శివమనే మంగళం, అంబిక అనే కారుణ్యం కలిసిన రూపమే శ్రీసుబ్రహ్మణ్యుడు.
శ్రీసుబ్రహ్మణ్యుడు జ్ఞాన స్వరూపి, తేజస్వి. అగ్నితేజం గలవాడు. కాని, గంగా తనయుడగుటచే అమృతంవలె చల్లదనమునిచ్చే స్వభూవము గలడు. తిథులలో అరవది షష్టి. ఆయన జన్మతిథి కూడా అదే. షష్ఠి ప్రియుడు, షడాననుడు అనగా ఆరు ముఖములుగలవాడు. ఆయన మంత్రం షడక్షరి “శరవణభవ”. ఇది మిక్కిలి మహిమాన్వితమైనది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము లను ఆరు దుర్గుణములను నశింపచేసి విజ్ఞానవంతులుగ రూపొందించునట్టిది. ఇహపర సుఖదాయకమైనది.
ఇట్టి విశిష్ట జ్ఞానస్వరూపుడగు శ్రీసుబ్రహ్మణ్యుని ఆరాధన సర్వానర్థాలను తొలగించి, సర్వాభీష్టసిద్ధిని కలిగించి జ్ఞానసంపన్నులను చేస్తుందనటంలో అతిశయోక్తి లేదు.
శీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు శివ శక్తులకు జన్మించిన తిథి మార్గశిరశుద్ధ షష్ఠి. మహనీయులు జన్మలు లోక కంటకులను నిర్మూలించి, సజ్జనులను కాపాడటానికేనన్న విషయం లోక విదితమైనదే. తారకాసుర, శూర పద్మాసురాది రాక్షసులను దునుమాడుటకై కార్తికేయుడు ఉద్భవించాడు. ఆ మహామహితాత్ముడు జన్మించిన రోజును శ్రీసుబ్రహ్మణ్యషష్ఠియని స్కందషష్ఠియని, సుబ్బారాయుడి షష్ఠి అని, కుమారషష్ఠియని వ్యవహరిస్తారు.
భవిష్యోత్తరపురాణం ప్రకారం శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవసేనాధిపతిగా 5 రోజులు భీకరమైన పోరాటం సాగించి ఆరవరోజు యుద్ధంలో తారకాసురాది రాక్షసులను సంహారించి పదునాల్గు భువనాలకు సంతోషాన్ని కలిగించాడు. ఆయన అసాధారణ శక్తి సామర్థ్యాలను త్రిమూర్తులు, ముక్కోటి దేవతలు కొనియాడారు. శ్రీస్వామివారు లోక సంరక్షణార్థమునకు శాటి స్థాపనకు చేసిన కృషికి గుర్తింపుగా మార్గశిరశుద్ధషష్ఠి ఆయన జన్మదినంగా పరిగణించి, వేడుకలు జరుపుకొంటారు. ఈ వేడుకలు కొన్ని ప్రాంతాలలో మార్గశిర శుద్ధ పాడ్యమి నుండి షష్ఠి వరకు నిర్వహిస్తారు.
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు దేవసేనను షష్ఠి రోజునే పరిణయం చెసుకొన్నారు.
శ్రీవేదవ్యాసభగవానులు షష్ఠి ప్రాముఖ్యతను తెలియ జేస్తూ తస్మాత్ షష్ఠీ మహాతిథిః అని అన్నారు.
షష్ఠి రోజున ఉపవాసముండి షణ్ముఖూని పూజించి బ్రహ్మచారికి వస్త్రదానమిచ్చి భోజనం పెట్టి ఆనందింప జేయాలి. కొంతమంది శ్రీస్వామివారిని సర్పాకారంగా ఆరాధించి పుట్టలో పాలు పోస్తారు.
కుజదోషమున్నవారు ఆ రోజున ఉపవాసముండి, సర్పదేవతను ప్రార్థించి పుట్టలో పాలుపోసి తమ దోషాలను పోగొట్టమని శ్రీస్వామివారిని వేడుకొంటారు.
శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని చాలామంది సర్పాకారంలో పూజిస్తుంటారు. ఇందువెనుక కొన్ని జ్యోతిశ్శాస్త్ర అంశాలున్నాయి. ఈయన మేష లగ్నం, వృశ్చిక రాశిలో జన్మించాడు. వృశ్చికరాశి జలరాశి అని కూడా పేర్కొనబడినది. శరవణ తటాకంలో జన్మించాడు గదా! మేష రాశికి అధిపతి కుజుడు. పురుషత్వానికి ప్రధాన కారకుడు శ్రీస్వామి శివతేజంవల్ల జన్మించాడు కావున అగ్ని స్వరూపుడు. అగ్నిధరుడని కూడా అంటారు. కుజునకు అధిష్ఠాన దేవత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి. ఆయనను సేవిస్తే తప్పక సంతానప్రాప్తి కలుగుతుంది.
ఇక, షణ్ముఖుడు జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించాడు. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు జ్ఞానమిచ్చేవాడు. జ్ఞానాన్ని సంస్కృతంలో సుబ్రహ్మ అంటారు. అందువలన ఈ స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడని ప్రసిద్ధి చెందాడు. ఈయన జన్మరాశి వృశ్చికం నుండి జన్మలగ్నమైన మేషం వరకు 6 రాశులు ఉన్నాయి. ఈ ఆరురాశులు మన శరీరంలోని షట్ చక్రాలు. వృశ్చికరాశిని తోకగా పరిగణిస్తే మేషరాశి పాము శిరస్సు అవుతుంది. ఈ పద్ధతిలో శ్రీస్వామివారు కుండలినీ ప్రభువు అయ్యాడు. ఇవన్నీ జ్ఞాన వైరాగ్యములకు సంబంధించిన విషయాలు. సర్పం వీటికి సంబంధించినది. అందువల్లనే సర్పాలను సదాశివుడు ధరించి పన్నగ భూషణుడని ప్రసిద్ధి చెందాడు. ఈ పన్నాగాలు సుషుమ్నా నాడీ రూపంలో ఉన్న షణ్ముఖుని విభూతి రూపాలు. ఆ కారణంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సర్ప రూపంలో పూజిస్తారు.
ప్రాణశక్తి మన శరీరంలో మూలాధారమనే చోట సర్పరూపంలో కేంద్రీకరింపబడి ఉంటుంది. మనకు దాని మహాశక్తి తెలియదు. అది నిద్రిస్తున్న సర్పము వంటిది. దానిని తట్టి లేపుటకు అసాధారణమైన యోగసాధన అవసరం.
ఒక వ్యక్తి యోగాభ్యాసం చేస్తూ నేలపై కూర్చుండి యుండినపుడు అతని ఆకారం యోగ పరంగా గమనిస్తే పాము శరీరంలాగా ఉంటుంది. ఇలా కనిపించడంలో ప్రతిపక్షవ్యక్తి జ్ఞానపరంగా అభివృద్ధి చెంది, యోగాభ్యాసం చేసి తరించాలన్నది దానిలోని అంతరార్థం. మన శరీరంలో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు ఆరు ఉన్నట్లు యోగశాస్త్రం చెబుతుంది. ఈ ఆరింటిలో మూలాధార చక్రంలోనే ప్రాణశక్తి ఉంటుంది. అది సర్ప రూపంలో వుంటుంది. స్వప్నావస్థలో నున్నందున దాని శక్తి మనకు తెలియదు. యోగాభ్యాసం ద్వారా చేసే సాధనవల్ల మనం గొప్ప జ్ఞానశక్తిని సాధించి స్వప్నావస్థలోనున్న జ్ఞానశక్తిని లేపగల్గినపుడు అసాధారణ జ్ఞానం సిద్ధించి పరమానందం కలుగుతుంది.
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి ఆరు అంకెతో సంబంధముంది. ఆయన షణ్ముఖుడు. సహజంగా జ్ఞానస్వరూపుడు. యోగమూర్తి. పూర్వజన్మలో సనత్కుమారులుగ జన్మించిన బ్రహ్మమానసపుత్రుడు. నిరంతర తపస్సమాధిలో వుంటూ ఈ సృష్టిలోనే దేనినీ బేధభావంతో చూడక, వేదమూర్తిగా భాసించాడు. అదే ప్రవృత్తి ఈ జన్మలోనే సిద్ధించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నిరంతరం జ్ఞాననిష్ఠలో వున్న భక్తులను రక్షిస్తూనే వుంటాడు.
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్...
-
అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప మహర్షి. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు....