Friday, May 1, 2015

మనిషి

నేనెవర్ని? ........................ ఇన్ని వేల సంవత్సరాల నాగరికత తర్వాత కూడా ప్రపంచంలో ఏ ఒక్కరూ పరిపూర్ణంగా సమాధానం చెప్పలేని ప్రశ్న! అయినా మనిషి తన అస్తిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం మాత్రం మానడు. ఇదీ నేను! అని స్థిరంగా నిర్ణయించుకుని మనిషి జీవితం గడిపేస్తుంటాడు. కానీ ఒకానొక సమయంలో ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ మనల్ని ప్రశ్నించినప్పుడు, ఇదా నేను! అని బయల్దేరి, ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో తనని తాను తెలుసుకుంటాడు. చివరికి మరో సారి ఇదీ నేను అని స్థిరంగా నిర్ణయించుకుని జీవితం గడపడానికి ప్రయత్నిస్తుంటాడు మనిషి.కానీ కీర్క్గార్డ్ చెప్పినట్టు "మనిషి నిత్య పరిణామి". మనిషి ఒక స్థితి నుంచి మరో స్థితికి మారుతూ పరిణమిస్తూ ఉంటాడు. నిజమే, చెట్లు పుట్టలు కూడా పరిణమిస్తాయి. కానీ వీటి విషయంలో, ఏ స్థితిలో అయినా, ఏ దశలోనైనా, ఆ స్థితిని, ఆ దశను పూర్తిగా వర్ణించగలం. కానీ మనిషి అలా కాదు. అతడు ఏమి కానున్నాడు, ఏమిగా మారనున్నాడు? ఏ దిశగా పరిణమిస్తున్నాడు? అతడి ప్రణాళిక, ఉద్దేశాలేమిటో చెప్పడం సాధ్యం కాదు. ఈ పరిణామ క్రమంలో మనిషి అస్తిత్వాన్ని ఎలా నిర్వచించాలి? ఏది నా అస్తిత్వం? మారిన నేనా? మారకముందు నేనా? లేక మరో సారి మారబోతున్న నేనా? విశ్వమంతా వ్యాపించిన అనంతమైన తాడుని పట్టుకుని ఎక్కడని వెతకను నా కోసం?

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...