Wednesday, October 17, 2018

గర్భవతులు ఆలయానికి వెళ్ళకూడదా?

గర్భవతులు 7 వ నెల వచ్చిన తరువాత దేవాలయమునకు వెళ్ళకూడదు.  ఆమె ఆరోగ్య రీత్యా కూడా ఇది సరియైనది కాదు.  అందుకే పాన పూర్వీకులు గర్భవతులు దేవాలయ ప్రవేశము చేయకూడదని చెప్పినారు.  ముఖ్యముగా మూల నక్షత్రము, అనూరాధ నక్షత్రము, అశ్విని నక్షత్రము, జ్యేష్ట నక్షత్రము వారు 5 వ నెల నుండే దేవాలయ ప్రవేశము నిషిద్దము

 భార్య గర్భవతిగా ఉన్నపుడు  భర్త కొబ్బరికాయను కొట్టకూడదా?

శాస్త్ర ప్రకారముగా ఆవిధముగా చేయక పోవడము మంచిది.  ఎందుకనగా  భార్య గర్భవతిగా వున్నపుడు 3 వ నెల వచ్చిన పిదప గర్భములో పిండము ప్రాణము పోసుకుంటుంది.  అలాగే కొబ్బరికాయ కూడా పూర్ణ ఫలము.  అదికూడా ఒక జీవుడితో, ఒక ప్రాణముతో సమానముగా మన పూర్వీకులు చెప్పి యున్నారు.  కాబట్టి కొబ్బరికాయను పగలగోట్టడము, విచ్చెదన చేయడము మంచిది కాదు. 

అడవారిలాగా మగవారికి పాతివ్రత్య నియమం ఎందుకు పెట్టలేదు?


తప్పు ఎవరు చేసిన తప్పే.  మగవాడు చేసిన దానికి నరకలోకంలో  శిక్షలు స్రిలతో పాటే.  ఐతే  పాతివ్రత్యాన్ని పెట్టకపోవటానికి కారణం, పురుషుడు తప్పు చేస్తే వంశం  చెడదు.  అదే  స్రీ  తప్పు చేస్తే ఆ వంశమే కకావికలమైపోతుంది .  పితృదేవతలు వంశకళంకంతో విలవిలలాడిపోతారు.  స్రీ  తప్పు  చేస్తే  భర్త ముందుతరాల వారందరికీ  ద్రోహం చేసినట్టే

ఆచారము అంటే ఏమిటి?


        ఆచరణీయమైన దానిని ఆచారము అంటారు.  బుద్దివంతులు, మేధావులు, పండితులు, ధర్మవేత్తలు, కులపెద్దలు, ఆగమ కోవిదులు ఎందరెందరో ఆలోచించి, తర్కించి, అనిషిని మహోన్నతుని చేయటానికి, దురాచారం నుండి దూరం చేయటానికి ప్రవేశపెట్టిన ఆలోచనే ఆచారము.  

         మన ప్రాచీన గ్రంధాలలో మనుష్యుల వృత్తినిబట్టి, ప్రవృత్తిని బట్టి మన సమాజములో నాలుగు మాత్రమె కులాలు వున్నవి.  బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను వర్ణములు మాత్రమె కలవు.  ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క ఆచారము వున్నది.  కాలక్రమములో శూద్ర వర్ణం వివిధ రకాల మార్పులకు, వివిధమైన చిభాగాలకు లోనైనది.  ఫలితముగా అనేక తెగలుగా విడిపోయి ఎవరికి ఇష్టమైన ఆచారములను వారు స్థిరపరుచుకున్నారు.  ఒక్కొక్క తెగకు ఒక్కొక గురువు (కులపెద్ద) ఉండటమువలన ఎవరి ఆచారాలు వారు అనుసరించడము జరిగినది.  

          ఇందులో కేవలము శూద్రవర్ణము మాత్రమె వివిధ కులాలుగా విడిపోయినది.  అందుకు కారణము వారు విద్యావంతులు కాకపోవటమే.  చాలా వరకు తమ తమ తేగల కట్టుబాట్ల కోసమే ఈ ఆచారములు ఏర్పడినవి.

ఎవరు ముందు చెప్పినట్లు


స్ర్తీయొక్క మానసిక స్థితి ప్రభావం ఆమె గర్భంలోని పిండంపై పడుతుందనేది ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం కదా!



మరి ఈదేశంలో ఎప్పటినుంచో గర్భవతులు భక్తిగాథలూ వీరగాథలూ వినాలనీ చదవాలనీ ఎల్లపుడూ అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డకోసం శ్రీరాముని చిత్రపటాన్ని చూస్తుండాలనీ స్మరించుకోవాలనీ..భయంకర వార్తలూ విషాద సంఘటనలకూ దూరంగా ఉండలనీ ఈ ఫ్రాయిడ్ చెప్పకముందునుండే ఎలా చెప్పేవారబ్బా?

బిగ్ బ్యాంగ్ థీరి ఒక అగ్నిగోళం బ్రద్ధలయి స్రుష్ఠి ఏర్పడిందని తేల్చింది కదా!
మరి మన దేశంలో అనామకుడు సైతం" బ్రహ్మాండం బద్దలయ్యిందనే "వేదజనిత స్రుష్ఠి మూలం పలుకుతున్నాడెలా??

భూమి మీద ప్రకృతి ఏర్పడి దాదాపు 200కోట్ల సంవత్సరాలయిందని నేటి సైటింష్ఠులు చెబుతున్నారు కదా!

మరి మన పురాణాలు చెప్పే కాలమాణం ప్రకారం యుగాలు మహాయుగాలూ మన్వంతరాలూ సంధికాలం లను లెక్కేస్తే...మనం శ్వేతవరాహ కల్పంలో 28 వ మహాయుగంలో కలియుగంలో ఉన్నామని ప్రస్తుత సంవత్సరం  ...అంటే 2018 నాటికి 197,29,49,120 సంవత్సరాలు అవుతోంది...మరి సైంటిస్టుల కాలగణనతో సరిపోతోందెలా??

బిగ్ బేంగ్ జరిగి విడిపోయిన పదార్థం వల్ల సృష్టి ఏర్పడిందని అది తిరిగి కేంద్రం వల్ల ఆకర్షింపబడి పదార్థం ఏర్పడటం వల్ల సృష్ఠి నశించి శూన్యం అవుతుందనీ అది తిరిగి మల్లీ బ్రద్దలయి సృష్ఠి మొదలవుతుందని ఇలా జరుగుతునే ఉంటుందని నేటి సైన్స్ చెప్పిన విశ్వముఖులిత సూత్రం కదా!

మరి వేదసారమైన భగవద్గీత లో చెప్పబడిందేంటి?కల్పకం అంతమందు సకల ప్రాణులూ తన యందు లీనమవుతాయని మళ్ళీ కల్పకం ఆరంభంలో అన్నీ తననుండి పుట్టుకొస్తాయని భగవానుడు చెప్పినట్లు ఉందెలా??

ప్రతీ చర్యకూ సమాన స్థాయిలో ప్రతిచర్య ఉంటుందనేది న్యూటన్ చెప్పిన సూత్రం కదా!
మరి వేల సంవత్సరాల నుండి భారతదేశంలో వినిపించే కర్మసిద్ధాంతం చెప్పేది ఏంటి?? ఎవరు ముందు చెప్పినట్లు?

తొలివిమాన నిర్మాణం చేసిన మేధావులు రైట్ సోదరులు కదా!

అంతకు ముందు భారతీయులకు ఉన్న విమాన శాస్ర్తాన్ని కూడా కాస్త పక్కన పెడదాం..రైట్ సోదరుల కంటే ముందు శివరాం బాపూజీ తళ్పాడే అనే పండితుడు మన పురాతన గ్రంధాల ఆధారంగా తయారు చేసిన "మరుత్సబి" గాలిలో ఎగిరింది కదా.. మధ్యలో ఆగిపోయిన ఆ విమాన ప్లాన్ ఈయన వారసులు ఓ ఆంగ్లేయ కంపెనికీ అమ్మినట్లు తెలుస్తోంది...మరి అది ఏమైనట్లో...ఆ ప్రస్తావనే తేదెందుకు ఈ ప్రపంచం...

మొక్కలకు ఫీలింగ్స్ ప్రాణం ఉన్నాయని నిరూపించింది మన  దేశీయుడైన శాస్ర్తవేత్త జగదీశ్ చంద్రబోస్ కదా!

మరి ముందు ఈ విషయం మనవారికి తెలియదా?మన గ్రంధాలలో వృక్షాల భావాల ప్రస్తావనలు లెక్కలేనన్ని ఉన్నాయే...మన ఋషులు మొక్కలను ప్రార్థించే దర్బలను సేకరించేవారు(భాధ పెడుతున్నందుకు క్షమించమని)..మరి వారికి ఈ విషయాలు తెలియదనే అనుకుందామా...

పెద్దపెద్ద వృక్షాలయే మొక్కల్ని రూపలక్షణాలు మారకుండా కుండీలలో చిన్నమొక్కలుగా పెంచే ప్రక్రియ"బోన్సాయ్"నేటి విజ్ఞానశాస్ర్తం కదా!

మరి భారతీయ ప్రాచీన ఆయుర్వేద ఋషి చరకుడు తన చరకసంహిత గ్రంథంలో "వామన తను వృక్ష్యాది విద్య"అను ప్రకరణంలో వైద్యానికి ఉపయోగించే పెద్దవృక్షాలను గుణం చెడకుండా చిన్నమొక్కలుగా పెంచే ఈ విధానాన్నే తెలిపాడెలా??

తులసి మొక్క ద్వారా స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాదుల్ని అరికట్టవచ్చని వైద్యులు ఇప్పుడు ఒప్పుకుంటే.... మరి యుగాల కాలం నుండి ప్రతి ఇంట తులసి మొక్కను పూజిస్తారెందుకబ్బా!......

సముద్రగర్భంలో అగ్నిపర్వాతాలు ఉన్నట్లు మనం ఈమధ్య గమనించినట్లు చెప్పుకుంటాం కదా!

మరి మన పురాణాలకాలం వారికి "బడభాగ్ని"గురించి ఎలా తెలిసిందబ్బా...

భారతీయ గోవు మనిషి ఆరోగ్యాన్ని పెంచుతుందని శాస్త్రవేత్తలు పరీక్షించి ఇప్పుడు నిర్దారిస్తే....మరి గోమాతను దైవంగా భావించి కొలిచే ఆనవాయితీ యుగాలకాలం నుంచి ఎందుకుందబ్బా!.....

లోహవిజ్ఞానంలో నేటిమనం చాలా అడ్వాన్స్ గా ఉన్నమని చెబుతాం కదా!

మరి ప్రాచీన భారతీయులు ఢిల్లీలో నిర్మించిన ఇనుప స్తంభం (విష్ణు ద్వజం) ఇప్పటికీ తుప్పు పట్టకుండా నిలిచి ఉంటే దానికి పోటిగా ఆధునికులు నిర్మించిన ఇనుప స్తభం తుప్పపట్టి కనిపిస్తుందెలా??

నిర్మాణ రంగంలో ఆధునికులు చాలా ముందున్నాం అని చెప్పుకుంటాం కదా!

మరి వేల సంవత్సరాల నాటి ఆలయాలు కోటలూ ఇప్పటికీ నిలచి ఉంటే గత 500సం లోపు నిర్మాణాలు నిలబడుటలేదేమి?
గోల్కొండకోటలోని శబ్ధప్రసారపద్దతి వివిధ దేవాలయాలోని సంగీతం పలికే స్తంభాలూ శివాలయంలో లింగంపై చెక్కుచదరని నీడ పడే నిర్మాణాలూ.....ఏ సమయంలోనూ నీడ కనిపించని ఆలయాలు, స్తంబాలు గాల్లో నిలబడి బరువులు మోసే భారీ కట్టడాలు, గోపురం నీడ ఒక సమయంలో వ్యతిరేకదిశలో పడే అద్బుత కట్టడములు వీటన్నింటి గురించి ప్రాచీన భారతీయులకు నేటి ప్రపంచం ఇచ్చే సమాధానమేంటి??

అణువు పరమాణువు గురించి వాటిలోని శక్తి గురించి ఆధునికులకు మాత్రమే తెలుసు కదా!

మరి భారతీయ గ్రంధాలు తిరగేస్తే పరమాణువుల గురించి "వైషేశిక సూత్రం" అంటూ ఓ గ్రంధమే కనిపిస్తుందే...దీనిని రాశిన కశ్యపుడను ఋషికి కణాల వివరణ చెప్పిన కారణంగా కణాదమహర్షి అను పేరు వచ్చినట్లు తెలుస్తోంది...ఎవరు ముందు చెప్పినట్లు??

మెండలీఫ్ ఆవర్తన పట్టికలో పాదరసం,బంగారం పక్కపక్కన చూపించేవరకూ పాదరసం నుండి బంగారం చేయవచ్చని మనకు తెలియదు కదా!

మరి వీటి గురించి తెలీకుండానే మన పూర్వీకులు ఈపని ఎలా చేశారు...ఈ పని చేసేవారిని "రసవాదులు"అనికూడా పేరెట్టి పిలిచారే.....

సూర్యుడు ఓ నక్షత్రమనీ చాలా నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒకడు మాత్రమేనని మన నేటి శాస్రజ్ఞుల విజ్ఞానం కదా!

మరి మన పూర్వీకులకు ఇది తెలియకుండానే అరుణ మంత్రంలో "సప్తదిశో నానా సూర్యాః" అని చెప్పారనుకుందామా??

భూమినుండి విడివడిన కొంతభాగమే చంద్రుడనీ ఆ భాగం విడివడిన చోటు పసిఫిక్ మహా సముద్రం ఏర్పడిందనీ శాస్ర్తవేత్తల పరిశీలన కదా!

విజ్ఞానాన్ని కథలుగా చెప్పే సంస్కృతి గల మన దేశ పూర్వులు చెప్పిన సాగరమధనం కథ ద్వారా బాగా గమనిస్తే తెలిసేదేంటి?పాల సముద్రం నుండి చంద్రుడు పైకెగసినట్లు చెప్పారే...

ప్రపంచం నేడు చదువుతున్న చరిత్ర ప్రకారం గ్రహణం గురించి మొదటగా చెప్పింది చైనావారని చెప్తున్నారు కదా!(2137 క్రీ.పూ)
అంతకు పూర్వం వాడైన అత్రిమహాముని చరిత్రకు పనికిరానివాడెలా అయ్యాడు?ఆయన తయారు చేసిన "తురీయ బ్రహ్మ"అనే టెలిస్కోప్ సహాయంతో మొదటగా గ్రహణం పరిశీలించాడే(ఋగ్వేదం 5వమండలం 40-6 మంత్రం)
ఈ విషయం మన గ్రంధాలలో అనేక చోట్ల కనిపిస్తోందని శ్రీ బాలగంగాధర్ తిలక్ తేల్చారు కూడా.....

ప్రస్తుతం భారతదేశం న్యాయవ్యవస్ద విదేశాలను అనుసరించిది అని వాదిస్తుంటారే!
మరి క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం విఘ్నేశ్వరుడు రచించిన "మితాక్షర" గ్రంధం లోని అంశములను తెలియబరుస్తూ యాజ్ఞవల్క ఋషి రచించిన  స్మృతులను, 13వ శతాబ్దంనాటి తెలుగు కవి కేతన రచించిన విఘ్నేశ్వరం అనే గ్రంధంలోని అంశములను, ఇప్పటికి హిందూ న్యాయ వ్యవస్ద అనుసరిస్తున్నదని న్యాయ పుస్తకాల్లోనే ఎందుకుంది?

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....మనకు జరిగిన అన్యాయం వర్ణించలేనిది...రాతి యగంలో వేదాలు రాశిన వారికి అంత జ్ఞానం ఉండదని విదేశీయులు నేర్పిన చిలకపలుకులు నేటికీ వల్లే వేసే బానిస మనస్కులు తెలుసుకోవలసిందీ ఒకటుంది...రాతియుగం పరాయి పాలన...అంతకుముందంతా రత్నయుగమేనని...
ప్రపంచం కళ్ళు తెరవక ముందే మనం చిరునవ్వు నవ్వాం, ఆటలాడి పాటలు పాడాం..```
నేడు నీచులచే వక్రీకరింపబడ్డ మన చరిత్రను నమ్మి మన భారత జాతిని, పురాణాలను, గ్రంధాలను, ఇతిహాసాలను తూలనాడే స్థితిలో ఉన్నాం...

ఇప్పుడు చెప్పండి.. ఎవరు చెప్పినట్లు ముందు ఈ లోకానికి లౌక్యం..?
  
 ఇలాంటి మరుగునపడిన భారతీయ చరిత్ర గురించి చిన్నతన్నం నుండి పాఠ్య పుస్తకాలలోగాని పాఠశాలల ద్వారాగాని పిల్లలకు తెలియనియక మెకలె  విద్యా  విధానం ద్వారా వక్రీకరించబడ్డ చరిత్ర చదివి ప్రతి ఒక్కటీ విదేశీవాడే కనుగొన్నాడన్న ధోరణిలో విదేశాలకు జేజేలు పలుకుతూ మన భరత మాతను భారతదేశాన్ని పనికిమాలిన దేశం ఇక్కడ ఏమున్నదని తిట్టే స్దాయికి చేరుకున్నాం. కనుక మన దేశ ఘన చరిత్ర గురించి భావితరానికి తెలియజేయండి మన పూర్వీకుల జ్ఞాన భాండాగారాన్ని తిరిగి పంచండి అప్పుడే దేశం పట్ల జాతి పట్ల సంస్కృతి పట్ల ఆచార వ్యవహారాల పట్ల గౌరవ భావం తోపాటుగా దేశ భక్తి పెరుగుతుంది.

నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం




మనం తోటివారికి నమస్కరించేటప్పుడుఅది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ఆస్కారమిస్తుంది.
నమస్కారానికి ఆశీర్వాదం పొందే శక్తి ఉంది. మార్కండేయుడు పదహారేళ్లకే చనిపోతాడని కొందరు పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు- నారదుణ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్లు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్థించాడు. అందుకు ఆయన కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడితో పాదాభివందనం చేయించాలన్నాడు. అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతణ్ని వారందరూ 'దీర్ఘాయుష్మాన్‌ భవ' అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీస్సులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనాడు.
ఒక మహారాజు అడవి మార్గంలో వెళుతున్నాడు. దారిలో ఒక బౌద్ధ భిక్షువు ధ్యానముద్రలో కనిపించాడు. వెంటనే ఆ రాజు శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. అది చూసిన మంత్రి 'ఈ మహాసామ్రాజ్యానికి అధిపతి, కిరీటధారులైన మీరు ఒక యాచకుడి ముందు తల వంచారేమిటి?' అని ప్రశ్నించాడు. రాజు చిరునవ్వుతో మౌనం వహించాడు.



తరవాతి రోజు ఆ మహారాజు ఒక మేక తల, పులి తల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించాడు. వాటిని విక్రయించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. మేక తల, పులి తల అమ్ముడయ్యాయి. మనిషి తలను తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆ రాజు 'మరణించిన తరవాత మనిషి తలకు ఏ విలువా ఉండదు. అలాంటి తలను వంచి పాదాభివందనం చెయ్యడంలో తప్పేముంది?' అనడంతో, మంత్రికి జ్ఞానోదయమైంది.
యోగశాస్త్రంలో 'నమస్కారాసనం' ప్రసక్తి ఉంది. నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య.
రాముడు అరణ్యవాసానికి వెళుతూ తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశాడు. సరయూ నదిలోకి ప్రవేశించే సమయంలో, వైకుంఠానికి వెళ్లబోయే ముందు తల్లి తన పక్కన లేకున్నా ఆమెను స్మరించి నమస్కరించాడు.
'ఎదిగేకొద్దీ ఒదగాలి' అంటారు పెద్దలు. ఆ విషయంలో భగవంతుడూ తనను తాను మినహాయించుకోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఒదిగే కనిపించాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో, బహుమతులు స్వీకరించే పనిని దుర్యోధనుడు చేపట్టాడు. అతిథుల కాళ్లు కడిగి ఆహ్వానించే బాధ్యత తీసుకునేందుకు అందరూ వెనకంజ వేస్తే, శ్రీకృష్ణుడు తానే ఆ పని చేశాడు. అలా ఆయన ఒదిగే ఉండటం వామన అవతారంలోనూ సాగింది.
శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం చూపించిన మహావిష్ణువే వామనావతారంలో మూడడుగుల మరుగుజ్జుగా మారిపోయాడు. త్రివిక్రముడిగా భక్తుల గుండెల్లో నిలిచాడు. వామనుడు త్రివిక్రముడిగా ఆకాశం అంతటా వ్యాపించడంతో, ఆయన పాదాన్ని బ్రహ్మ భక్తితో కడిగాడని పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ సైతం విష్ణుమూర్తి విశ్వరూపానికి దాసోహమన్నాడు. ఎదిగేకొద్దీ ఒదగాలని, అలా ఒదిగేకొద్దీ మరింత ఎదుగుతామని, పాదాభివందనంలోని పరమార్థాన్ని, నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో ఆచరించి చూపారు.



అందుకే 'అందరికీ పోషణ, రక్షణ కావాలి. అందరం వైషమ్యరహిత, శాంతియుత జీవనం వైపు నడవాలి. నీలో, నాలో, ప్రకృతిలో శాంతి వర్ధిల్లాలి' ఇలా ప్రార్థించుకుంటూ, ఒకరికొకరం నమస్కరించుకుందాం!

భారతం అనుశాసనిక పర్వం పంచామాశ్వాసం లో శివ పార్వతుల మధ్య జరిగిన సంవాదం కొంత ఉపయుక్తంగా ఉంటుంది

ఈరోజు శ్లోకాలు దేహత్యాగం లేదా మరణానంతర యాత్ర గురించి చెప్తాయి.  ఈ విషయంలో "భారతం అనుశాసనిక పర్వం పంచామాశ్వాసం లో శివ పార్వతుల మధ్య జరిగిన సంవాదం కొంత ఉపయుక్తంగా ఉంటుంది.   




పార్వతి దేవి శివుడిని " నాథా ! చావు అనునది ఏమి ? దాని స్వరూపము ఏమిటి ? " అని అడిగింది. పరమశివుడు.  "దేవి ! ఆత్మ నిత్యము, శాశ్వతము. దేహము అశాశ్వతము. దేహము ముసలితనముచేత రోగములచేత కృంగి కృశించి పోతుంది. దేహము వాసయోగ్యము కానప్పుడు జీవాత్మ ఈ దేహమును వదిలిపోతుంది. అదే మరణము. జీవాత్మ కృశించి వడలిన దేహమును వదిలి తిరిగి వేరొక శరీరమును ధరించి శిశువుగా జన్మించడమే పుట్టుక. కనుక జీవుడు ఈ జననమరణ చక్రములో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాడు " అని చెప్పాడు. 

పార్వతీ దేవి " నాథా ! బాలుడు చిన్నతనంలో చనిపోతే వృద్ధుడు చాలా కాలము బ్రతకడానికి కారణం ఏమిటి ? " అని అడిగింది. పరమేశ్వరుడు " దేవీ ! ఈ కాలము శరీరమును కృశింప చేస్తుంది కాని చంపదు. మానవులు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా జీవితం పొడిగించబడడం తగ్గించబడడం జరుగుతూ ఉంటుంది. పొడిగిస్తే చాలా కాలం బ్రతుకుతాడు. తగ్గిస్తే మరణం సంభవిస్తుంది " అని చెప్పాడు.

పార్వతీదేవి " నాథా ! మనిషికి ఆయుష్షు ఎందువలన పెరుగుతుంది ? ఎందువలన తగ్గుతుంది ? " అని అడిగింది. పరమేశ్వరుడు " పార్వతీ ! మానవుడు ప్రశాంతముగా బ్రతికితే ఆయువు పెరుగుతుంది. అశాంతిగా జీవిస్తే ఆయువు క్షీణిస్తుంది. మానవుడు క్షమించడం నేర్చుకోవాలి. శుచిగా ఉండాలి. అందరి మీద దయకలిగి ఉండాలి. గురువుల ఎడ భక్తికలిగి ఉండాలి. వీటన్నింటిని మానవుడి ఆయువు వృద్ధిపొందుతుంది. అధికమైన కోపము కలిగి ఉండడం, అబద్ధాలు చెప్పడం, ఇతరుల ఎడల క్రూరంగా ప్రవర్తించడం, అపరిశుభ్రంగా ఉండడం, గురువులను ద్వేషించడం వీటివలన ఆయువు క్షీణిస్తుంది. పార్వతీ " తపస్సుచేతనూ, బ్రహ్మచర్యముచేతనూ, మితాహారం చేతనూ, రోగం వచ్చినప్పుడు తగిన ఔషధములు సేవించడం చేతనూ ఆయుర్ధాయము పెరుగుతుంది. పైన చెప్పిన కర్మలు అతడు తన పూర్వజన్మ సుకృతంగా చేస్తాడు. ముందు జన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి పోయి అక్కడ సుఖములు అనుభవించి తిరిగి భూలోకములో జన్మిస్తారు. వారికి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. వారు అకాల మరణం చెందరు. ముందు జన్మలో పాపము చేసుకున్న వాళ్ళు నరకానికి పోయి కష్టములు అనుభవించి భూలోకములీ తిరిగి జన్మిస్తాడు. అతడు అల్పాయుష్కుడౌతాడు. అందువలన అకాలమరణం సంభవిస్తుంది " అని  చెప్పాడు.

" నాధా ! మానవులలో స్త్రీలు, పురుషులు అని రెండు రకాలు ఉంటారు కదా ! స్త్రీ పురుషులలో జీవాత్మ ఎలా ఉంటుంది " తెలియజెయ్యండి. పరమశివుడు " పార్వతీ ! పుట్టడం స్త్రీగానూ, పురుషుడిగానూ పుట్టినా వారిలో ఉండే జీవాత్మ ఒక్కటే. దానికి స్త్రీ పురుష లింగభేదం లేదు. మనస్సు, బుద్ధి, హంకారము అందరికీ ఒక్కటే. అందరిలోనూ పంచభూతాలు  వాటి తన్మాత్రలు ఒక్కటే. మానవుడు చేసే కర్మలకు జీవాత్మ బాధ్యుడుకాడు. మానవుడు తనలోని సత్వ, రజో, తమోగుణ ప్రకోపముచేత పలువిధ కర్మలుచేస్తుంటాడు. జీవాత్మ ఆ కర్మలను సాక్షీభూతంగా చూస్తుంటాడు. సత్యము పలకడం, ఇతరులపట్ల దయకలిగి ఉండడం, ఎప్పుడూ మత్తులో జోగుతుండడం లేక నిద్రపోతూ ఉండడం ఇవన్నీ తామసగుణములు. సత్వగుణ ప్రధానుడికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి. రజోగుణ ప్రధానుడికి మానవ జన్మ ప్రాప్తిస్తుంది. తమోగుణ ప్రధానుడు పశుపక్ష్యాదులుగా జన్మిస్తాడు. ఈ మూడు గుణములను అధిగమించిన వాడు ముక్తి పొందుతాడు. ఈ సత్వ, రజో, తమో గుణముల కారణంగా కర్మలు చేసే వాడికి శుభములు, అశుభములు కలుగుతుంటాయి. ఒక్కోసారి దానికి భిన్నంగా కూడా జరుగుతుంటుంది.

అధికారులు సేవకులను తిట్టి పనిచేయించుకోవడం పాపము కాదు, వైద్యుడు శస్త్రచికిత్స చేసి రోగిని కాపాడుతాడు అది పాపముకాదు. గురువు విద్యార్థిని దండించి విద్యాబోధ చేస్తాడు. అది పాపము కాదు. అవి సుకృతములే కనుక సుకృత ఫలితమే వారికి వస్తుంది.

జీవులు గర్భము నుండి, గుడ్డు నుండి, చెమట నుండి జన్మిస్తుంటాయి. వీటికి అన్ని ఇంద్రియములు ఉంటాయి. కాని విత్తనముల నుండి పుట్టిన చెట్లకు స్పర్శ జ్ఞానము మాత్రము ఉంటుంది. గర్భము నుండి పుట్టిన జీవులలో మానవుడు గొప్పవాడు. అతడికి ధర్మాధర్మవిచక్షణ, మంచిచెడుల విచక్షణ ఉంటాయి. ఈ జ్ఞానము లేనియడల అతడు పశువుతో సమానము. చీకటి రెండు విధములు రాత్రివేళ అలముకునే ఒకటి చీకటి. రెండవది అజ్ఞానము వలన కలిగే అంధకారము. మొదటి చీకటి వెలుగు రాగానే అంతరిస్తుంది. మనిషిలో అలముకున్న చీకటిని విద్యవలన శాస్త్ర విజ్ఞానమువలన నశిస్తుంది.

మానవులలో పుట్టిన చీకటిని పారద్రోలడానికి బ్రహ్మ వేదములు, శాస్త్రములు సృష్టించాడు. వేదములు, శాస్త్రములు అధ్యయనం చెయ్యడం వలన ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుస్తుంది. దాని వలన అజ్ఞానము చీకట్లు తొలగి పోతాయి. కామము, కోపము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మొదలైన గుణములు శాస్త్రాధ్యయనం వలన నశిస్తాయి. విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. అలాంటి వాడు కొంచం పుణ్యము చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. శాస్త్రజ్ఞానము లేకుండా అజ్ఞానాంధకారంలో మునిగిన వాడు ఎన్ని పుణ్య కార్యాలు చేసినా అతడికి లభించే ఫలము తక్కువే " అన్నాడు శివుడు.

" పార్వతీ ! నరుడు మరణించగానే జన్మించిన అతడికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వాడిని జాతి అమరుడు అంటారు. కాని వయసు వచ్చేసరికి పూర్వజన్మ స్మృతి పోయి మామూలు మనిషి ఔతాడు. ఇలా కొంత మందికి మాత్రమే జరుగుతుంది. ఇలా పూర్వజన్మ స్మృతి కలగడణం వలన పూర్వజన్మ ఉందని రుజువు మానవులకు ఔతుంది. 

పార్వతీదేవి " మహాదేవా ! స్వప్నము అంటే ఏమిటి ? " అని అడిగింది. " పార్వతీ ! నరుడు నిద్రించే సమయంలో ఇంద్రియములు పని చెయ్యవు. కేవలము మనసు మాత్రమే పనిచేస్తుంది. ఆ మనస్సు దర్శించేది స్వప్నము లేక కల అంటారు. ఒక్కోసారి ఈ స్వప్నంలో జరగబోయే విషాయాలు కూడా కనిపిస్తాయి " అని చెప్పాడు మహేశ్వరుడు.

పార్వతీదేవి "మానవులు కర్మలు చేస్తుంటారు కదా ! ఆకర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా ! లేక వారంతట వారు సంకల్పించి చేస్తుటారా " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! దేవుడు ఏ పనీ చెయ్యడు. కాని దేవుడు మానవుడి కర్మలకు తన సహాయము అందిస్తాడు. మానవుడు చేసే కర్మలకు తగిన ఫలము అందిస్తాడు. ఏ పని చెయ్యాలో నిర్ణయించి కర్మలు చేసేది మానవుడే. ఇందులో దైవప్రమేయము ఏదీలేదు. పూర్వజన్మ కర్మఫలితంగా మానవుడు తను చేయవలసిన కర్మలను నిర్ణయించి కర్మలుచేస్తాడు. మానవుడు పూర్వజన్మలో చేసే పనులు దైవములు అయితే ఈ జన్మలో చేసేపనులు పౌరుషములు అనగా అవే పురుషప్రయ త్నాలు. ఒక పనిచెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు వ్యవసాయము వంటిది. దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి, నీరు వంటిది. నేలను తవ్వితే భూగర్భము నుండి నీరు ఉద్భవిస్తుంది. అలాగే ఆరణి మధిస్తే అగ్ని పుడుతుంది.

అలాగే ఏ పనికైనా పురుష ప్రయత్నము ఉంటేనే దైవము కూడా తోడై చక్కటి ఫలితాలను అందిస్తాడు. పురుషప్రయత్నము లేకుండా దైవము సహాయపడతాడని అనుకుంటే కేవలము దైవము చూస్తాడని ఊరకుంటే దేవుడు ఫలితాన్నివ్వడు. కనుక పార్వతీ ! ఏ పని సాధించాలని అనుకున్నా పురుషప్రయత్నము తప్పకకావాలి. అప్పుడే దేవుడు సత్పఫలితాలను ఇస్తాడు" అని చెప్పాడు శివుడు. స్వస్తి.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...