Thursday, February 22, 2018

వేదమంత్రాన్ని వింటే లాభమొస్తుందా?

పీఠాదిపతులు, అవధూతలు, సత్యమెరిగిన స్వాములు వేదం రాకపోయినా ఫర్వాలేదు వింటే చాలు మీకు లాభం చేకూరుతుంది అంటారు. మంత్రశాబ్దాన్ని వింటేనే ఏమి లాభం కలుగుతుంది అని అనుమానం మనకు రాకపోదు.
మనకు చిన్నప్పుడు మన అమ్మ సన్నగా లాలి పాట పాడుతుంది. కొన్ని సార్లు కేవలం కొన్ని పదాలతో జోకొడుతుంది. ఆ పాటలో ఉన్న పదాల అర్ధం ఆ చంటిపిల్లకు తెలియనవసరం లేదు, అది ఏ రాగమో అర్ధం అవ్వవలసిన అవసరం లేదు, కేవలం తల్లి ఆ పాట పాడితే నిద్ర వస్తుంది చంటిగుడ్డుకి. ఇదే విధంగా వేదమంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మన చుట్టూ తయారయ్యే ఆ శబ్దతరంగాలు అంతటినీ ప్రభావితం చేస్తాయి. ఆ శబ్దబ్రహ్మం మనకు రక్ష అవుతుంది.

ఉదాహరణకు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటూ ఉంటాయి. కొన్ని రేడియో తరంగాలు, కొన్ని AV/ఆడియో వీడియో తరంగాలు, కమ్యూనికేషన్ తరంగాలు, UV  తరంగాలు, ఇలా మన చుట్టూ ఎప్పుడూ మనకు తెలియని శక్తి తరంగాలు ఒక వాటి వాటి నిర్దుష్ట frequencyతో మనను చుట్టుముట్టి వుంటాయి. నేనొక రేడియో రిసీవర్ పెట్టుకుని ఆ స్టేషన్ కి ట్యూన్ చేస్తే ఆ తరంగాలు నా రేడియో నుండి ఒక మంచి పాట రూపంలో అవగతం అవుతాయి. లేదా నా మొబైల్ నుండి నేను వాటిని డేటా గానో, ఒక ఫోన్ కాల్ గానో అందుకోగలను. అటువంటి పరికరం నా దగ్గర ఉన్నప్పుడు వాటిని నేను సరిగ్గా రిసీవ్ చేసుకుని ఆనందించగలవాడను. వాటితో పాటు నాకు noise కూడా వస్తుంది. నా రిసీవర్ సరైనది కాకపోతే ఆ noise నా చెవులకు కానీ కళ్ళకు కానీ ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా నేను వినగా వినగా చిరాకు పుట్టి మానసిక ప్రశాంతత కోల్పోగలను.

ఎలా అయితే  ఇటువంటి తరంగాలు ఉన్నాయో, మనకు తెలియని నెగటివ్ ఫీలింగ్స్, తప్పుడు ప్రభావం కలిగించే తరంగాలు కూడా మన చుట్టూ ఉంటాయి. అలాగే మంచిని ప్రేరేపించే తరంగాలు కూడా వుంటాయి. ప్రతి మంత్రానికి స్వర, అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దుష్టమైన రీతిలో పలికే పద్ధతి వుంది. ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు నా చుట్టూ ప్రకటితం అవుతాయి. ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి చెడుకు ప్రేరేపించే ఆలోచనా తరంగాలను తొక్కిపెట్టి ఉంచుతాయి. తద్వారా కేవలం మన కర్ణావయవం ద్వారా కేవలం మంచికి సంబంధించిన frequency నా మెదడుకు అందిస్తుంది. తద్వారా నా బ్రెయిన్లో grey matter పెంపొందుతుంది. మానసిక దౌర్భాల్యం మాయమై ఒకానొక శక్తి ప్రవేశిస్తుంది. అదే మంత్రం మరిన్ని సార్లు నేనే చదవగలిగితే ఆ ఎనర్జీ నేనే తయారు చేసుకోఅలవాడను. మంత్రాన్ని కేవలం వినడం ద్వారా నా చుట్టూ ఉన్న నెగటివ్ సిగ్నల్స్ ను దూరం చేస్తే అదే నేను ఉచ్చరించగలిగితే మరింత శక్తియుతంగా ఆ పాజిటివ్ శక్తిని నేను గ్రహించగలను. ఎలాగంటే ఒక గదిలో చెడు వాసన వస్తుంటే నేనొక రూమ్ స్ప్రే ద్వారా ఆ చెడు వాసనను పోగొట్టి మంచి సువాసనను ఆ గదిలో కొంత సేపు నిలపగలనో అలాగే మంత్రాన్ని విన్నంత సేపు అదే జరుగుతుంది. అదే ఆ చెడు వాసన ఎక్కడ నుండి వస్తోందో నేను కనిపెట్టి దాన్ని బయటకు విసర్జించి సంపూర్ణంగా నివారించడం అనేది నేనే మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ మంత్రం మనకున్న మనలో ఉన్న చెడు వాసనలను పోగొట్టి దైవత్వం నింపడం లాంటిది.

కేవలం ఉచ్చరించడం తో ఆగిపోతే అక్కడ వరకు లాభం. అన్నం కేవలం తిని ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమె కాదు కదా. అది జీర్ణం అవ్వాలి. అది జీర్ణం అయితేనే ఆ ఆహారం నాకు శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో నేను మరిన్ని పనులు చెయ్యగలను. అదే విధంగా కేవలం మంత్రోచ్చ్చారణతో ఆగకుండా ఆ మంత్రం ప్రయోజనం మీద మనం ధ్యానం చెయ్యగలిగితే ఆ పరమార్ధం ఆ మంత్రాధిష్టాన దేవత ప్రచోదయం చేస్తుంది. తద్వారా నేను మంత్రం వలన సంపూర్ణలాభం పొందుతాను. “మననాత్ త్రాయతే ఇతి మంత్రః”. మననం చెయ్యడం మాత్రం వల్ల రక్షించేస్తుంది. ఇక నిధిధ్యాస చేసి ఆ మంత్రం మీద తపిస్తే లభించే శక్తి నీకే కాదు నీ చుట్టూ మొత్తం ప్రపంచానికి శాంతిని కలుగచేస్తుంది. మన కర్మలవలన లోకశాంతి ఆశిస్తే ఆ లోకంలో నువ్వు ఒక వ్యక్తివి కాబట్టి నీకు కూడా ఆ లాభం వస్తుంది. మన సనాతనధర్మం ఎప్పుడూ లోకహితం చెబుతుంది. నువ్వు చెప్పే అష్తోత్తరంలో నీ నక్షత్ర పాదానికి ఒక్క నామం అయితే మిగిలిన 107 నామాలు 27నక్షత్రాల x 4పాదాలకు చెందిన లోకం అంతటికీ మంచి జరగాలని ఆకాంక్షించేవిధంగా మనకు 108 నామాలు జపించమని, లేదా మంత్రం కనీసంలో కనీసం 108 జపించమని కండిషన్ విధిస్తుంది శాస్త్రం. ఏది చేసినా అందరూ సుభిక్షంగా శాంతిగా వుండాలని ఆకాంక్షించే అద్భుతమైన ధర్మం మన సనాతనం.

!! ఓం నమః శివాయ !!

చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం

చాలా అరుదుగా దొరికే స్తోత్రం,మరియు మోస్ట్ పవర్ ఫుల్.

*సూర్యమండల స్తోత్రం*

నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ ||

యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ ||

యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||

యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |
సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ ||

యన్మండలం గూఢమతి ప్రబోధం | ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వ పాపక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ ||

యన్మండలం వ్యాధివినాశదక్షం | యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ ||

యన్మండలం వేదవిదో వదంతి | గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౭ ||

యన్మండలం సర్వజనైశ్చ పూజితం | జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాల కాలాద్యమరాది రూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౮ ||

యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం | యదక్షరం పాపహరం జనానామ్ |
యత్కాలకల్పక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౯ ||

యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం | ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౦ ||

యన్మండలం సర్వగతస్య విష్ణోః | ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౧ ||

యన్మండలం వేదవిదోపగీతం | యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |
తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౨ ||

సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||

*ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం ||

ఆది దేవ నమఃస్తుభ్యం ప్రసీద మమ భాస్కర

ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహీ తన్నో ఆదిత్య ప్రచోదయాత్

స్త్రీలు జుట్టు విరబోసుకొని ఎందుకున్డరాదు?

🕉🕉🕉🕉🕉

ఈ చర్య పిశాచాలకు ఆహ్వానం వంటిది. అనేక దుష్ట గ్రహాలూ ఆ సమయంలో ఆవహించి కల్లోలపరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుంది. జుట్టు విరబోసుకు తిరుగుతుంటే లక్ష్మిదేవి అక్కకు(జ్యేష్ట దేవి) కూడా ఆహ్వానమే.జుట్టు విరబోసుకుని తిరగడం నేడు ఓ ఫ్యాషన్ అయిపోయింది. అయితే మన ఆచార, సాంప్రదాయాల ప్రకారం జుట్టు విరబోసుకోకూడదు.

అసలు వెంట్రుకలు, గోళ్లు మన పాపాలకు ప్రతీకలు. అందుకే భగవంతునికి తల నీలాలిచ్చి పాప ప్రక్షాళన చేసుకుంటాం.

స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగావచ్చా? తిరిగితే ఏమవుతుంది???

మీరు (స్త్రీలు) తలస్నానం చేసి జుట్టుని విరబోసుకొంటున్నారా?  జడని అల్లుకోకుండా జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్తున్నారా??? అయితే కింది సమాచారం తపకుండా చదవండి.

స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగావచ్చా?
స్త్రీ జుట్టు విరబోసుకొని తిరిగితే ఏమవుతుంది?
పురుషులు పొడుగ్గా పెంచుకొనే జుట్టుకి ఏ నియమమైన ఉందా?

స్త్రీలు బ్రహ్మహత్యాపాతకాన్ని పంచుకున్నందుకు ఇంద్రుడు ఇచ్చిన వరమేమిటి?
స్త్రీ దేవతలు కేశములను పూర్తిగా వదిలినట్టుగా ఫోటోలు ఉంటాయి కదా మరి వాటి సంగతి ఏమిటి?
భారతీయ మహిళల సాంప్రదాయ కేశాలంకరణలు ఏమిటి?

తలస్నానం చేసిన తర్వాత  స్త్రీలు ఎన్నడూ తమ యొక్క జుట్టుని విరబోసుకోకూడదు. తలంటు స్నానం చేసిన స్త్రీల యొక్క జుట్టు విరబోసుకొని ఉంటే సమస్తమైన భూత ప్రేతాది శక్తులు కేశపాశముల గుండా ప్రవేశిస్తాయి. ఎట్టి పరిస్తితులలో తలస్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదు. స్త్రీ విరబోసుకొన్న జుట్టుతో సంచరించినచో అనేక దుష్ట గ్రహాలు ఆవహిస్థాయి

తలస్నానానంతరం జడని అల్లుకొని లేదా జుట్టు కొసలను ముడివేసుకొని పూజ/దైవదర్శనం చేయాలి. విరబోసుకొన్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్ళడంకానీ,  శుభకార్యాల్లో పాల్గొనడం అశుభం. ఆవిధంగా చేసినచో, లక్ష్మిదేవి అక్క అయిన జ్యేష్ట దేవిని(దరిద్ర దేవత) ఆహ్వానించినట్లే.

దీనికి ఉదాహరణే రామాయణంలో దితి జుట్టుని విరబోసుకొని, బాగా అలసిపోవడం చేత శిరస్సు కొంచెం ముందుకి వంగి, జుట్టు పాదాలకి తగిలి సౌచం పోయి ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించి పిండాన్ని 7 ముక్కలు చేయడమే.

పురుషులు కూడా జుట్టుని పొడుగ్గా పెంచుకోవడం లేదా మహర్షులు జటలు పెంచుకొంటారు కదా? వాళ్లకు ఈ నియమం వర్తించదా?

ఈ విధంగా చాలా మంది నాస్తికులకు ఒక సందేహం కలుగుతుంది. పురుషులు/మహర్షులు పెంచుకొనే జుట్టుకు నియమంలేదు ఎందుకంటే, కేశములను విరబోసుకొనే స్త్రీలకు మాత్రమే అధికంగా కామోపభోగాన్ని ప్రేరేపించే శక్తి ఉంది. అది ఇంద్రుడు స్త్రీలకు ఇచ్చిన వరం.

✨ వృత్తాంతం: ✨

ఒకనాడు బ్రహ్మజ్ఞానం కలిగిన విశ్వరూపుడు అను మహర్షి తనమన భేదాలు లేకుండా దేవతలకి ఇచ్చే హవిస్సులలో కొంతభాగం రాక్షసులకు ఇస్తున్నాడనే విషయం తెలుసుకొన్న ఇంద్రుడు యుక్తాయుక్త విచక్షణ మరచి తన చంద్రహాసంతో విశ్వరూపుని మూడు శిరస్సులను(సురాపానం, సోమపానం,అన్నం తింటున్న శిరస్సు) నరికి వేస్తాడు.

అనంతరం సురాపానం చేసే శిరస్సు ఆడాపిచుకగా మారి పోయింది, సోమపానం చేసే శిరస్సు కౌజు పక్షిగా మారిపోయింది. అన్నం తినే శిరస్సు తిత్తిరి పిట్ట(తీతువు పిట్ట)గా మారిపోయాయి. ఆ మూడు పక్షులు ఇంద్రుడు చేసిన బ్రహ్మహత్యాపాతకాన్ని సూచిస్తాయి. ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడి చెవ్వుల్లొ రొదగా ఉండేవి. వాటి బాధ భరించలేక బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకోవడం కోసం ఇంద్రుడు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి, భూమికి, స్త్రీలకు, నీటికి, వృక్షాలకు తలో పావుభాగం పంచుతాడు. బ్రహ్మహత్యాపాతకం పాపం తీసుకొన్నందుకు ఆ నాలుగు జాతులకు నాలుగు వరాలు ఇచ్చాడు.
భూమికి వరంగా ఇక్కడైన గోతులు తీస్తే ఆ గోతులు తమంతతాము పూడుకొనేటట్లుగా, వృక్షాలకు ఎవరైన మొదలు ఉంచి కొమ్మలు, ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతటతాము పెరిగేటట్లుగా, నీటికేమో ప్రక్షాళన గుణాన్ని, స్త్రీలకేమో కామభోగాలయందు కొద్దిపాళ్ళు ఎక్కువసుఖాన్ని ప్రసాదించాడు. బ్రహ్మహత్యపాతకం క్రింద వారు అనుభవించే బాధలు భూమి కొన్నిచోట్ల పంటలు లేకుండా ఉండడం (ఊసర క్షేత్రాలు), నీరు నురుగుతో ఉండడం, వృక్షాలు జిగురు, స్త్రీలకు ఋతుస్రావం. అందుకని కేవలం స్త్రీలకు మాత్రమే జుట్టు విరబోసుకు తిరగడం నిషిద్ధం.

స్త్రీ దేవతలు అందరూ కేశములను పూర్తిగా వదిలినట్టుగా ప్రతిమలు, ఫోటోలు, మూర్తులలో ఉన్నాయి కదా మరి వాటి సంగతి ఏమిటి?

ఏ దేవతా రూపమైన ఆది పరాశక్తి స్వరూపమే. దేవీ భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపము. సత్వ,రజో,తమో (స్త్రీ)గుణములు ఆమె యందు ఉండవు. అమ్మవారు కామారి(కామాన్ని హరించేది). కాబట్టి  స్త్రీ దేవతలకు ఈ నియమం వర్తించదు.

అందుచేత ఛాందస్సవాదులు ఇటువంటి ప్రశ్నలని కట్టిపెట్టి శాస్త్రాల్ని అనుసరించండి మంచిది.

భారతీయ మహిళల సాంప్రదాయ కేశాలంకరణలు:

జడ వేసుకొని ఆలయ దర్శనం చేయుట

సిగలో(తలలో) పుష్పములను ధరించుట

వృద్ధ మహిళలు సాంప్రదాయంగా కొప్పును వేసుకొనుట

✨ గమనిక: ✨

పై సమాచారం కేవలం శాస్త్రంలో చెప్పిన విషయాలను ప్రస్తావన చేసే ప్రయత్నం మాత్రమే.  ఎవరిని విమర్శించి, వారి ఇష్టాయిష్టములను తిరస్కరించుట కొరకు కాదని మనవి.

మకర తోరణం

వివిధ దేవాలయాలలో ద్వారతోరణమధ్యభాగంలో ఒక కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనబడుతుంది. దానికే మకరతోరణమని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణమధ్యంలో అలంకరించటానికి గల కారణమును గురించి స్కందమహాపురాణంలో ఒక కథ ఉన్నది.
పూర్వం "కీర్తిముఖుడ"నే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేకవరములను పొంది అలా వచ్చిన బలపరాక్రమాలతో సమస్తభువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు నారదుని ప్రేరణతో పరమశివపత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశపడ్డాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని అతిభీకరమైన అగ్నిని సృష్టించాడు. లోకాలను అన్నింటినీ మ్రింగివేస్తూ ఆ అగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. మరణంలేకుండా వరం పొందిన కీర్తిముఖుడు ఆ అగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలలో తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడాడు. భక్తవశంకరుడైన శివుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవకన్నుగా దానిని ధరించాడు. ఆ తరువాత కీర్తిముఖుడు తనకు తట్టుకోలేనంత ఆకలిగా ఉన్నదని తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు "నిన్ను నువ్వే తిను" అని చెప్పాడు. శివుని వచనానుసారం మొసలి రూపును ధరించి ఆ కీర్తిముఖుడు తనను తాను ముందుగా తోకభాగంనుంచి తినటం మొదలు పెట్టాడు. తన శరీరాన్ని అలా తింటూ తింటూ కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలాతినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు. నీవు ఈ నాటినుంచి సమస్తదేవతాలయాలలో తోరణాగ్రభాగాన్ని అలంకరించు. దెవతా దర్శనానినికి వచ్చే ప్రజలందరిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని, ఆశను, తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు "అని వరమిచ్చాడు. ఆనాటినుంచి కీర్తిముఖుడు దేవతాలయాలలోని తోరణామధ్యభాగాన్ని తన రాక్షసమకరముఖంతో అధిష్ఠించి అలంకరించి భక్తులలో ఉండే దుష్టవికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తూ విరాజిల్లుతున్నాడు. అందుకనే దేవతామూర్తుల వెనుకనుండే తోరణానికి మకరతోరణం అని పేరు వచ్చింది.

వేదసారము

వేదములు నాలుగు అని తెలుసుకదా !!
.

వేదము 1134 శాఖలుగా విభజించబడినది..
.

ఒక శాఖ క్షుణముగా అధ్యయనము చేయడానికి దాదాపు ఎనిమిది సంవత్సరములు పడుతుంది..
.

ఇన్ని శాఖలు క్షుణముగా అధ్యయనము చేయడానికి ఒక మానవ ఆయుష్షు చాలదు..
.
. దీనిగురించి ఒక కధ ఉంది.. అది తెలుసుకుందాం !!

.
.
భరద్వాజుడు అనే మహర్షి మొత్తం వేదాన్ని పూర్తిగా అధ్యయనము చేయాలని సంకల్పించాడు. నిష్టగా అధ్యయనము చేస్తూ వచ్చాడు. ఆయుష్షు చాలదనిపించి, వేదాధ్యయనము ఆపి ఇంద్రుని గూర్చి తపించాడు. ఇంద్రుడు వచ్చాడు. " ఏం నాయనా , ఏం కావాలి అనడిగాడు.  ?"  ఇంద్రుడు. " నాకు వంద సంవత్సరాల అయుష్షు కావాలి " అనడిగాడు భారద్వాజ మహర్షి. " ఆ ఆయుష్షుతో ఏం చేస్తావు" అనడిగాడు ఇంద్రుడు. " వేదాధ్యయనము " చేస్తాను అన్నాడు మహర్షి. "మంచిది" అంటూ వంద సంవత్సరాల ఆయుష్షు అనుగ్రహించాడు ఇంద్రుడు. భారద్యాజుడు తన వేదాధ్యయనము ను కొనసాగించాడు. ఇంద్రుడిచ్చిన ఆయుష్షు అయిపోతోందని గ్రహించి ఇంద్రుడిని ప్రార్ధించి మరోవంద సంవత్సరాలు ఆయుష్షు పొంది వేదాధ్యయనము కొనసాగించాడు.అయినా వేదాధ్యయనము పూర్తికాలేదు.మరో వంద సంవత్సరాలు ఆయుష్షు పొంది తిరిగి వేదాధ్యయనము చేశాడు. అయినా సంతృప్తి కలగక అశాంతి తో తల్లడిల్ల సాగాడు భరద్వాజ మహర్షి. .
.
.
.
.ఈసారి ప్రార్ధించకుండానే ప్రత్యక్షమయ్యాడు ఇంద్రుడు. "ఏం! నాయనా! ఇంత వేదము చదివి
ఇలా అశాంతిగా ఉన్నావేమిటీ? " అనడిగాడు. " ఇంద్రుడు. "వేదాన్ని మొత్తం చదివేద్దామనుకున్నాను. కాని మీరిచ్చిన ఆయుష్షు చాలటం లేదు. అస్తమానము మిమ్మల్ని అడగటము బాగుండదు కదా!" అని బాధపడ్డాడు మహర్షి. "అయితే చూడు!" అంటూ మూడు కొండల్ని ఆయన ముందు సృష్టించాడు. "ఏమిటవి" అనడిగాడు మహర్షి. " అవి వేదములలొని విజ్ఞాననికి ప్రతీకలు." అంటూ ఆ మూడు కొండలలో నుండి మూడు పిడికిళ్ళ మట్టి తీసి " ఇది నీవు ఇప్పటివరకు పొందిన జ్ఞానం" అని అంతర్ధానమయ్యాడు..
.
.
.
అంటే, భారద్వాజ మహర్షి అంతటి నిష్టాగరిష్టునికి, మూడువందల సంవత్సరముల పైగా అధ్యయనము చేసిన లభ్యము కాని వేదవిజ్ఞానము ఒక సామాన్య మానవులమైన మనకి ఎలా లభ్యమవుతుంది. కాని, భగవంతుడు కరుణామయుడు. ఆయన మానవులందరికి వేదవిజ్ఞానము అందుబాటులోకి తేవాలని సంకల్పించి వేదాన్ని "ఆవృత్తము" ( మళ్ళీ మళ్ళీ తదేక దీక్షతో చదవటం) చేయటం ఆరంభించాడు. అలా కొన్ని వేల సార్లు ఆవృత్తములు జరిగిన పిదప "భు:" భువ:", ", సువః" అనే మూడు వ్యాహృతులు వెలువడ్డాయి. దీనిని కూడా అభ్యసించలేని అజ్ఞానంలో మానవులు ఉన్నారని గ్రహించి, మనస్వామి ఆ మూడు వ్యాహృతులు మళ్ళీ "ఆవృత్తము" చేయడం ఆరంభించాడు. అప్పుడు "అ,ఉ,మ" అనే అక్షరాలు వెలువడ్డాయి. ఆ మూడిటిని స్వీకరించి కలిపి "ఓం" అని "ఓంకారమును" సృష్టించి, మానవులకిచ్చి ఇది వేదసారము. ఇది స్వీకరించి, అనుష్టానము చేసి, వేదవిజ్ఞానము పొందండి" అని భగవంతుడు మానవులకు ఉపదేశము చేశాడు. ఇది "ఓం కారము " సర్వ వేదసారము అని ఉపనిషత్తులో చెప్పిన ఉదంతము.

హాయిగా కుర్చుని "ఓం", "ఓం" అనుకుంటూ వేదప్రతిపాద్యుడైన భగవంతుని పొందటానికి ఎంత సులభ మార్గము ఆ దయామయుడు మనకు సమకూర్చాడు. ఆ భగవంతుని మనము "ఓంకారము" తోనే ప్రార్దిస్తాము. ఏమంత్రమైనా ముందు "ఓం"
అనే వేదసారాన్ని కలపకపోతే నిష్ప్రయోజనమని పెద్దలు చెప్పుతారు. అయితే "ఓం" కారోపాసన గాని, మంత్రోపాసన గాని సద్గురువు ఉపదేశముతోనే మనము అనుష్టించాలి. స్వస్తి.

సత్యాన్వేషణ

అతను యువకుడు. అన్ని అనుకువలు వున్నవాడు. ఏ యిబ్బందులూ లేవు. అట్లాంటిది అతనికి హఠాత్తుగా సత్యాన్వేషణపైకి దృష్టి మళ్లింది. సత్యాన్ని అన్వేషించాలన్న వాడికి గురువు అవసరం. అందుకని తగిన గురువుని అన్వేషించడానికి బయల్దేరాడు. గ్రామం వదిలి వెళుతూ ఉంటే పొలిమేరలో ఒక పెద్ద చెట్టు కింద రచ్చబండపైన ఒక సన్యాసి వుండడం చూశాడు. అతని దగ్గర ఏదయినా సమాచారం దొరకవచ్చని అనుకుని ఆ యువకుడు ఆ సన్యాసి దగ్గరికి వెళ్లి నమస్కరించి
‘నువ్వు ఎన్నో ప్రదేశాలు తిరిగి వుంటావు. ఎంతో అనుభవాన్ని గడించి వుంటావు. నేను సత్యాన్వేషణలో వున్నాను. సరయిన గురువుని వెతికే పనిలో ఉన్నాను. నీ ప్రయాణంలో నీకు గొప్ప గురువు తటస్థపడే వుంటాడు. అతని గురించి చెబితే నీకు రుణపడి ఉంటాను. గురువు లేకుండా నా జీవితం సంపూర్ణం కాదు” అన్నాడు. ఆ సన్యాసి వృద్ధుడు. అరవయ్యేళ్లు ఉంటాయి. అతను తప్పకుండా నీకు ఆ గురువు వివరాల్ని అందిస్తాను. దాన్ని బట్టి అతన్ని నువ్వు గుర్తు పట్టవచ్చు. అని ఆ గురువు రూపురేఖల్ని వర్ణించాడు. ”ఈ వివరాల్ని మాత్రం విస్మరించకు. అట్లాంటి వ్యక్తి ఎక్కడయినా నీకు ఎదురయితే అతనే గురువు” అన్నాడు.

ఆ యువకుడు వృద్ధుడికి కృతజ్ఞతలు చెప్పి అన్వేషిస్తూ సాగిపోయాడు. ముఫ్ఫయిసంవత్సరాలు గడిచిపోయాయి. యువకుడు కూడా పెద్దవాడయ్యాడు. అన్వేషణలో అలిసిపోయాడు. వృద్ధుడు చెప్పిన పోలికలున్న వ్యక్తి ఎక్కడా అతనికి తటస్థపడలేదు. చివరికి విసిగిపోయి ”బహుశా: అట్లాంటి గురువు లేడేమో” అనుకుని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామపొలిమేరల్లో ఒక వృక్షం,రచ్చబండ. తమ గ్రామాన్ని వదిలిపెట్టినప్పుడు వున్న రచ్చబండ, ఆ రచ్చబండపై అదే సన్యాసి మరింత వృద్ధుడయ్యాడు. పండు ముసలివాడయ్యాడు. ఆ తొంభయి సంవత్సరాల వృద్ధుణ్ణి చూసి యువకుడు నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే ముప్పయిసంవత్సరాల క్రితం ఆ సన్యాసి వర్ణించిన లక్షణాలన్నీ ఆ వృద్ధుడిలోనే ఉన్నాయి. యువకుడి కళ్లలో నీళ్లు కదిలాయి. ఆవేశంతో ఆ సన్యాసి దగ్గరకి వచ్చి ”ఎందుకు నన్ను మోసం చేశావు? నా ముప్పయి సంవత్సరాల జీవితాన్ని నాశనం చేశావు. నువ్వే గురువని చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు కదా!” అన్నాడు. దానికి ఆ వృద్ధుడు నవ్వుతూ.. ”మొదట నీ కోపాన్ని ఉపసంహరించుకో. అప్పుడు అసలు సంగతి చెబుతాను. ముప్ఫయిసంవత్సరాల క్రితం నువ్వు యువకుడివి. ఆవేశంలో ఉన్నావు. నేనే గురువని చెప్పి ఉంటే నువ్వు నవ్వే వాడివి. విశ్వసించేవాడివి కాదు. పైగా మా గ్రామానికి వచ్చి నేనే గురువంటావా?” అని హేళన పట్టించేవాడివి. అయినా అన్నీ నీకు వివరంగా చెప్పాను. వర్ణించాను. కానీ నువ్వు ఇక్కడ కాకుండా ఎక్కడో వెతుకుతున్నావు. ముప్పయి సంవత్సరాల నీ అన్వేషణ వ్యర్థం కాలేదు. నువ్వు పరిణితి చెందావు. నన్ను గుర్తించావు. పైగా నీ ముప్పయి సంవత్సరాలు వ్యర్థమయ్యాయని నాపై ఆరోపణలు చేస్తున్నావు. కానీ నా సంగతి ఆలోచించు. ముప్పయిసంవత్సరాలుగా నేను ఈ వృక్షాన్ని వదిలిపెట్టలేదు. యిక్కడే వున్నాను. నీకోసం ఎదురు చూస్తున్నాను. తప్పకుండా ఏదో ఒకరోజు నువ్వు వస్తావని నీకోసం ఎదురుచూస్తున్నాను. నీకు చెప్పిన మాటల్లో అణువంతుకూడా అసత్యం లేదని గ్రహించు” అన్నాడు.

ఆ మాటలతో యువకుడికి జ్ఞానోదయమైంది.

మూర్ఖుని లక్షణములు

శ్లోకం:-మూర్ఖస్య పంచ చిహ్నాని గర్వో దుర్వచనం తథా |
హఠశ్చైవ విషాథ్చ పరోక్తం నైవ మన్యతే ||

అర్థం:-
1. దురభిమానము,
2. కఠినముగా మ్లాడుట (బూతులు తిట్టుట), 3. మొండిపట్టు పట్టుట, 4. దుఃఖితుడగుట, 5. ఇతరుల మాటను వినకుండుట యను నైదును మూర్ఖుని లక్షణములు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...