Thursday, February 22, 2018

ఉపనయన కాలము

బ్రాహ్మణబాలునకు గర్భాష్ణమాల్లో ఉపనయనం జరిపించాలి. అంటే జననాది ఏడు సంవత్సరముల ఏడు నెలల వయస్సు తరువాత అన్నమాట. క్షత్రియనకు పన్నెండేళ్ళకు, వైశ్యబాలునకు పదహారేళ్ళ వయస్సులో ఉపనయనం చేయవచ్చు. బ్రాహ్మణునికి ఉపనయనపు గరిష్ట వయోపరిమి పదహారేళ్ళ అంటే ఎనిమిదేళ్ళు అవకాశమిచ్చారన్నమాట. ఆశ్చర్యంగా అంత దీర్ఘవ్యవధి కూడా సరిపోవడం లేదు. పదహారేళ్ళ లోపుగా ఉపనయనం చేయకపోతే పాపమని చెప్పబడింది. ఉపనయనము ఉత్తరాయణకాలంలోనే జరగాలి. అందులో మాఘమాసం శ్రేష్టంగా ఎంచబడింది. ఎట్టి పరిస్థితులలోను దక్షిణాయనకాలంలో జరగరాదు. ఒకవేళ అలా చేయవలసి వస్తే ఉత్తరాయణ కాలంలో మళ్ళీ ఉపనయనం చేసుకోవాలని నా ఉద్దేశం.

ఈ రోజుల్లో వివాహోపనయనాలు ఎంతో జాప్యం చేయబడి, మార్గశిర మాసం మినహాయించి మిగతా మాసాలలోనూ అనుష్టించబడుతున్నాయి. దుష్ఫలితాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. అయినా అసలు వివాహమనే ఒక కార్యక్రమం లాంఛనప్రాయంగానైనా జరుగుతోంది కదా అని సంతోషించాల్సిన విషయం వచ్చేసింది. వివాహానికైనా కొంత సరిపెట్టుకోవచ్చు కానీ, ఉపనయనం మాత్రం ఉత్తరాయణంలో జరగవలసిందే!

చిఱుతప్రాయంలోనే ఎందుకు చేయాలి?
కామం మనస్సులోనికి జొరబడటానికి ముందే బాలుడు గాయత్రీ మంత్రము చేత ప్రభావితుడు కావాలి. ఉపనయన లక్ష్యం గాయత్రీ మంత్రం అనుష్టించి మంత్రశక్తిని అభివృద్ధి పరుచుకోవడం, వేదవేదాంగములను చక్కగా అధ్యయనం చేయడం వంటివి కదా! కామం చేత జయించబడితే మనస్సు లక్ష్యం నుండి ప్రక్కకు మరలించబడుతుంది. అప్పటికే సంపాదించిన కొద్దో గొప్పో మంత్రశక్తి కూడా నశించిపోతుంది. చదువు వెనకంజ వేస్తుంది.

చిఱుతప్రాయంలోనే గాయత్రీ మంత్రోపదేశం పొందిన బాలుడు కామోద్భవం జరిగే వయస్సు వచ్చేనాటికి గాయత్రీ మంత్ర పురశ్చరణ చేత నిరుష్టతను పొందగలుగుతాడు. విద్యలో కొంత స్థాయిని చేరతాడు. గాయత్రి నిండిన మనస్సులో కామానికి చోటుండదు. పదహారేళ్ళ వయస్సులో ఉపనయనమయినవారికి ఇది సాధ్యపడదు.

లక్ష్యసాధనలో ఒక మెట్టెక్కితే పదిమెట్లు దిగజారతాడు. అందువల్లనే ఉపనయనం జరగవలసిన వయస్సు ఎనిమిదిగా నిర్ణయించబడింది.
ఈ రోజుల్లో మనం సంస్కారాలను ముఖ్యంగా పరిగణించడం లేదు. అలాగని పూర్తిగా వదిలిపెట్టేసినా ఆశ్చర్యమూ లేదు. ఏదోవిధంగా పూర్తి చేశామనిపించుకొని సంతృప్తిని కొని తెచ్చుకొంటారు. దీనికన్నా నాస్తికుడు నయమనిపిస్తుంది. వానికి కనీసం కొన్ని దృఢమైన అభిప్రాయాలు, నిర్ణయాలు ఉంటాయి. తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
గాయత్రీ మంత్రజపము బాలునికి మానసిక ధృడత్వాన్ని తేజస్సునీ, దైహికమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మేధకు పదను పెట్టి ఏకాగ్రతను వృద్ధిపరుస్తుంది. కామవాంఛ అతని దరి చేరదు. వినయాన్ని భగవద్భక్తినీ, ఆత్మ విషయములో ఆసక్తిని ఇనుమడింప చేస్తుంది. ఇంతటి మహోపకారమైన నిధిని తల్లితండ్రులు అకారణంగా తమ పిల్లలకు నిరాకరించడం న్యాయమా!

ఈరోజుల్లో గాయత్రీ జపాన్ని ఉపనయనం రోజున పొరపాటున పదిసార్లు చేస్తారేమో, తరువాత చేయడం మానివేస్తున్నారు. తల్లితండ్రులీ విషయంలో తమ బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నారు. ప్రాతస్సాయం సంధ్యలలో నిద్రో, క్రికెట్టు పోటీలో, సినిమాలో అంటూ పిల్లలు సమయాన్ని దుర్వినియోగం చేయకుండా సమయానికి సంధ్యావందనానికి కూర్చోపెట్టే బాధ్యత తల్లితండ్రులకున్నది. ఈరోజుల్లో వారే ఆ సమయాలలో ప్రొద్దునైతే మేల్కొని ఉండరు. సాయంకాలం క్లబ్బులకు రేసులకు పోతారు. వారి ఆత్మౌన్నత్యం కన్న క్షణికానందాలు ఎక్కువైపోతున్నాయి. కొడుకులను సన్మార్గవర్తులుగా చేయగల నైతికబలం వీరికేదీ? వారి జీవనశైలి ప్రయోజన శూన్యమని అనిపించి బహుశః పిల్లల్నైనా సన్మార్గంలో నడపాలని వారికే తోస్తే, ఒకవేళ పిల్లలను సంధ్యావందనం చేయమని చెబుతారేమో! కానీ అప్పడు పిల్లలు వారి మాట వింటారా? నువ్వు చక్కగా రేసులకు వెళుతుంటే నేనెందుకు సంధ్యావందనం చేయాలని అడిగే అవకాశం లేకపోలేదు.

ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితులలో ఈ విషయాల గురించి ఉపన్యాసం చేస్తూ మీ సమయం ఎందుకు వృధా చేస్తున్నానని మీకనిపించవచ్చు. ఏమి చేయాలి? మఠాధిపతిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. మీ పుత్రులు ఆత్మోన్నతి విషయంలో మీ బాధ్యతను మీకు గురు చేయవలసిన బాధ్యత, దానికోసమై వారికి సకాలంలో ఉపనయనం జరుపమని మిమ్మల్ని పోరే బాధ్యత, ఉపనయనం అయిన పిల్లలు నిత్యమూ సంధ్యావందనం చేసేట్ల చూచే బాధ్యత, ఇటువంటి బాధ్యతలు మీ బాధ్యతలెంతవరకూ మీరు నిర్వర్తిస్తున్నారో అలా ఉంచి నా బాధ్యతా నిర్వహణలో లోటు లేకుండా జాగ్రత్తపడవలసిన భాద్యత నాకున్నది కదా!  దాని ఫలితం ఎంతో కొంత మీమీద  కూడా ఉంటుంది

నేటి బంధాల్లో బలమెంత...?

ప్రపంచంలో ఆడదే కరువైనట్టు ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారిని
ఇది భార్య కాదు ...బ్రహ్మ రాక్షసి.
- ఓ భర్త ఆవేదన.

ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో వీడికి భార్యనయ్యాను.
ఓ ముద్దా...ముచ్చటా..
వీడు మనిషి కాదు వ్యసనాలకు చిరునామా.
వీడికన్నా జంతువులు నయం.
- ఓ భార్య ఆవేదన.

ప్రపంచంలోనే స్నేహం చాలా చాలా గొప్పది.
కానీ నాతో స్నేహం చేసినవారందరూ నన్ను అవసరానికి వాడుకుని అవసరం తీరాక ముఖం చాటేశారు.
స్నేహం అన్న మాట వింటేనే కంపరం పుడుతోంది .
- ఓ స్నేహితుడి ఆవేదన.

మధురమైనది...అమరమైనది ప్రేమ అలాంటి ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసి జీవితాంతం నాకు మనోవేదనను మిగిల్చి తన సంతోషం తాను వెతుక్కుని వెళ్ళిపో(యింది)యాడు.
నిజమైన ప్రేమకు ఈ లోకంలో విలువ లేదు.
- ఓ ప్రేమికు(రాలి)డి ఆవేదన.

నిజం చెప్పాలంటే ఒక మనిషి తన జీవిత కాలంలో సగం సమస్యలు తన ఆలోచనలవల్లో,తన ప్రవర్తనలవల్లో ''కొని'' తెచ్చుకొనేవే.
ఈ ప్రపంచంలో ''అవసరం'' కోసం ఎదుటివాడిని మోసం చేసేవారికన్నా...
తమ వారి మీదున్న ''అక్కసు''తో తమను తాము మోసగించుకునే వారే ఎక్కువ.

ఇద్దరు వ్యక్తులు (భార్య/భర్త, ప్రేమికులు,స్నేహితులు) కలిసి జీవనం సాగించాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది ''నమ్మకం''.

నేడు ఎంతమంది భార్యాభర్తల్లో/స్నేహితుల్లో/ప్రేమికుల్లో తమ వారిని పూర్తిగా నమ్ముతున్నారు??

మనం చదువుద్వారా సంపాదించిన జ్ఞానం,స్వతహాగా ఉన్న తెలివితేటలు మనకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యనుండి బైటపడటానికి ఉపయోగపడాలి.

దురదృష్టం ఏమిటంటే మనకున్న జ్ఞానంతో,తెలివితో సమస్య'లను తెంపుకోవడం కన్నా తెచ్చుకోవడమే ఎక్కువైపోతోంది.

ముక్కు,మొహం తెలియని పరాయి వారు పలకరిస్తే పళ్ళికిలించుకుని ముఖంలో చాటంత చిరునవ్వు తెచ్చుకుని మరీ పలకరిస్తాం
వారి తరపునుండి మనకు ఏదైనా కష్టమో,నష్టమో కలిగినా క్షమించేసి
వారి దృష్టిలో చాలా ''మంచివాళ్ళం'' అయిపోవడానికి ప్రయత్నిస్తాం.
అదే
జీవితాంతం కలిసి ఉండాల్సిన వారితో మాత్రం ఒక నియంతలా ప్రవర్తిస్తుంటాం
.''మన''వారి దగ్గరకొచ్చేసరికి ఎక్కడలేని రాక్షసత్వం బైటికొచ్చి విలయతాండవం చేస్తుంటుంది.
అస్సలు
''మనసు'' విప్పి మాట్లాడం.
పరాయి వారికిచ్చే ప్రాధాన్యతలో పదోవంతు ప్రాధాన్యత మనవారికిచ్చినా బంధాలు బలపడవా??

మనసు మెచ్చిన క్షణం ''నచ్చినోళ్ళు''

మనసు నొచ్చిన క్షణం ''సచ్చినోళ్ళు''
అయిపోతుంటారు మనవాళ్ళు.

ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే బంధాలకు బీటలు వారవా??

మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
మనం ఒకరిని ప్రేమించేది....
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికా?

పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికా?

పొద్దస్తమానం శత్రువుల్లా పోట్లాడుకోవడానికా?

ఎక్కడైతే ... హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో

ఎక్కడైతే ... చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా ఉంటుందో

ఎక్కడైతే ... అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో

ఎక్కడైతే ... బలహీనతలను చూసీ చూడని అవకాశం ఉంటుందో

ఎక్కడైతే ... పొరపాట్లను మన్నించే మేధస్సు ఉంటుందో

ఎక్కడైతే ... తన మాటే నెగ్గాలన్న పంతం నశించి ఉంటుందో

ఎక్కడైతే ...''అవసరానికి'' కాక ''ఆత్మీయతకు మాత్రమే చోటుంటుందో

ఎక్కడైతే ... చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/ మన్నించే వీలుంటుందో

ఎక్కడైతే ... మాట,పట్టింపులకు ప్రధాన్యత ఉండదో

అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.

అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.

తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.

పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!. ఆలోచించండి ..........

ప్రాణాయామం

అస్త్రశస్త్రాలనే రెండు రకాలైన ఆయుధాలను చెప్పింది. ఖడ్గము, బాణముల వంటి ఆయుధాలు శస్త్రములని పిలవబడతాయి. మంత్రపూర్వకంగా ఉపయోగించేవి అస్త్రం. దర్భపుల్లను తీసుకొని తగిన మంత్రంతో అభిమంత్రించి వదిలితే అది శస్త్రముల కంటే శక్తివంతమైన ఆయుధమవుతుంది. ఎవరినుద్దేశించి లేదా దేనినుద్దేశించి ఆ అస్త్ర ప్రయోగం చేశారో అక్కడ సర్వనాశనం జరుగుతుంది. ద్విజులు అనుదినమూ ప్రయోగించవలసిన అస్త్రమొకటి ఉంది. అది అసురనాశనార్ధము మంత్రించబడిన అస్త్రము. ఆ అస్త్రము వలన మన బుద్ధిని ఆశ్రయించుకొని ఉన్న అసురశక్తులన్నీ మాయమైపోతాయి. ఆ అస్త్రప్రయోగమే అర్ఘ్యప్రదానము. అర్ఘ్యప్రదానము చేసేటప్పడు నా పాపములు చెడువర్తనము నశించుగాక అవి నా హృదయసీమలో ప్రకాశించే జ్ఞానభాస్కరుని ప్రకాశానికి ప్రతిబంధకాలై ఉన్నాయి. అవి తొలగిపోవాలి. జ్ఞానసూర్యుడు నాలోని తమస్సును పోగొట్టి సహస్రకిరణాలతో ఒక్కుమ్మడిగా జాజ్వల్యమానంగా ప్రకాశించాలి" అన్నభావంతో మనస్సును ఏకాగ్రంగా ఉంచుకొని చేయాలి...........
                              ఎవరైనా ఒక పని ఉత్సుకతతో మనస్ఫూర్తిగా చేస్తే ఊపిరి బిగపెట్టుకొని ఆ పని చేశాడని చెప్తాము. నంధ్యావందనం నిజంగా ఊపిరి బిగపట్టుకొని (ప్రాణాయామంతో) చేయవలసిన కార్యం. అలా చేస్తే అంతశ్శత్రువులైన కామక్రోధాదులు నశించిపోతాయి. ఈరోజుల్లో ప్రాణానాయామ్య అనగానే మనం ముక్కు పట్టుకుంటాము. ఊరికే ముక్కు పట్టుకోవడం కాదు కావలసింది. శాస్త్రములు నాసికాయామ్య అని చెప్పలేదు. ఉచ్చ్వాస నిశ్వానములను నియంత్రించాలి. ప్రాణాన్ని-జీవశక్తిని నియంత్రించాలి. ఇదంతా ఏకాగ్రతతో సాధించవలసి యున్నది. ఎంత చిత్తైకాగ్రత ఉంటే నీటిని అస్త్రంగా మార్చేశక్తి ఆవిర్భవిస్తుంది. ప్రాణాయామం యొక్క ప్రయోజనమిదే. ఉచ్ఛ్వాస నిశ్వాసముల నియంత్రణ ద్వారా చిత్తైకాగ్రత ఎలా సిద్ధిస్తుంది?....... పరమాశ్చర్యమో, పెద్ద దుఃఖమో వచ్చినపుడు నిర్ధాంతపోతాం. ఒక్క క్షణం ఊపిరి నిలిచిపోతుంది...... తరువాత వేగంగా ఊపిరి తీసుకోవడం మొదలుపెడతాం. కావాలని మనము ఊపిరి ఆపలేదు. అది సంకల్పితంగా జరిగింది. దీనిని బట్టి ఊపిరి ఆగడానికి చిత్తైకాగ్రతకు సంబంధమున్నదని అర్థం అవుతోంది కదా!....... దుర్భేద్యమైన మన అంతశత్రువులను జయించడానికి ఉవయోగించే మహాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రాణాయామంతో ఈ చిత్తైకాగ్రత్యతను సంపాదించాలి.....      
                                   ప్రాణాయామపు అభ్యాసం ద్వారా మానసిక ఏకాగ్రత పొందవచ్చు. ఇది యోగమునకు ముఖ్యము. అధిక ప్రమాణంలో అభ్యాసం చేయడము కష్టము. అది గురు పర్యవేక్షణలో జరగాలి. సంధ్యావందనంలో పదిసార్లే ప్రాణాయామం చేస్తారు. కొన్ని కర్మల ముందుగా మూడుసార్లు ప్రాణాయామం చేస్తారు. పరిమితంగానైనా నిరంతరం శ్రద్ధతో చేసే ఈ ప్రాణాయామం క్షేమం ప్రసాదిస్తుంది. ఉపనయనమాదిగా ప్రతివారూ నిరంతరం విధివిధానంగా సంధ్యావందనంలో ప్రాణాయామం చేసి ఉన్నట్లయితే దేశం ఈపాటికి వేలాదిగా యోగివరులు ఉండెవారు. సంధ్యావందనాంగంగా ప్రాణాయామం చేసేటపుడు ముఫ్పై సెకన్ల కన్న గాలిని కుంభించరాదు. ఉచ్చ్వాస నిశ్వాసాలు నిలచిపోతే మనస్సు నిలిచిపోతుంది. ఆలాంటి ఏకాగ్రస్థితిలో అర్ధ్యం వదిలితే అంతశత్రువులు నిస్సందేహంగా తరిమివేయబడతాయి.....
                                    మనలోని చెడు శక్తుల నాశనానికి అర్థ్యం వదిలిన తరువాత ప్రశాంతచిత్తంలో గాయత్రీ జపం చేయాలి. వీలయినంతవరకూ - శక్త్యానుసారం - ఉచ్చ్వాస నిశ్వాసాలను నియంత్రణం చేయడం, గాలిని కుంభించి ఉంచడం చేస్తే చాలు. సంకల్పం, మార్జనం, అర్ఘ్యప్రదానం, జపం, స్తోత్రం, అభివాదం ఇవన్ని పరమేశ్వరానుగ్రహం కోసం చేసేవే! వీటన్నిటికి ముఖ్యంగా ప్రాణాయామం చేయాలి....
                                   శాస్త్రములు రోగిష్టులను కూడా మూడుసార్లు ప్రాణాయామం చేయమని.... చెబుతున్నాయి. దీనివల్ల ప్రాణాయామం కష్టమైనది కాదనీ సులభసాధ్యమనీ అర్థమవుతుంది. దీర్ఘాయుస్సు దీని అవాంతరల ప్రయోజనంగా చెప్పబడింది. అభివాదంలో ఏ బ్రహ్మర్షుల పరంపరలో మనం ఉద్భవించామో ఆ ఋషి పేరు చెప్పకొంటున్నాం. ఆ బ్రహ్మర్షి నుండి ప్రవర్థమానమైన శాఖల మూలపురుషులైన ఋషుల పేర్లు కూడా సంస్మరించబడుతున్నాయి. అందుకే మనకు ఏకార్షేయం, పంచార్షేయం, సప్తార్షేయములైన గోత్రములున్నవి. ఆ మహర్షుల వంశపరంపరకు చెందినవారమైనందువల్లనైనా మనం వైదిక కర్మానుష్టానం చేయాలి. మన పూర్వీకులైన ఋషులు దీర్ఘకాలం సంధ్యావందనమును అనుష్టించడం ద్వారా జ్ఞానులై బ్రహ్మతేజస్సులో ఆధ్యాత్మికౌన్నత్యంతో జీవించారట. ఈ విషయం మనుస్మృతిలో ఈ క్రింది శ్లోకం వివరిస్తుంది...
            
             "ఋషయో దీర్ఘ సంధ్యత్వాద్దిర్ఘమాయు రవాప్నుయుః!
                 ప్రజ్ఞాం యశశ్చ కీర్తించ బ్రహ్మవర్చసమేవచ!!"

                                         మన నిర్లక్ష్యము చేత తరతరములుగా వస్తున్న సంప్రదాయ తంతువును తెంపి వేయరాదు. సంధ్యావందనం కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గముల సమచ్చయము. సంధ్యావందనమును అర్థం ఎరిగి భక్తి విశ్వాసములతో పరమేశ్వరాధనగా అనుష్టించాలి....

గాయత్రిలోని_24_శక్తులు

“గయాం  త్రాయతి ఇతి గాయత్రి” ప్రాణాలను రక్షించేది గాయత్రి. శక్తి పలురకాలు. కానీ అన్నింటికి మూలమైన శక్తి ఒకటి ఉంది. దానిని ఆత్మశక్తి అని, గాయత్రి అని, బ్రహ్మ సంకల్పం అని, ఇచ్ఛాశక్తి అని అంటారు.

ప్రకృతి పరంగా చూస్తే సంవత్సరానికి 12 అమావాస్యలు, 12 పూర్ణిమలు కలసి 24 వస్తాయి. రోజుకు 24 గంటలు. వీటికి ప్రతీకయే గాయత్రి మంత్రం. ద్వాదశ రాశులలో సంచరించే సూర్యుడు సూర్యవిద్య, అమృత వర్షం కురిపించే చంద్రుడు చంద్ర విద్య కలిపి భూమి మీద చూపే ప్రభావం గాయత్రి.

శ్లో:- ఆదిశక్తి స్తధా బ్రహ్మీ వైష్ణవీ తిచ
వేదమాత దేవమాత విశ్వమాత ఋతంభరా
మందాకిన్య జపాచైవ బుద్ధి సిద్ధి ప్రకీర్తితా
వైదికానిటు నామాని పూర్వోక్తానిచ ద్వాదశ

ఆదిశక్తి, బ్రాహ్మీ, వైష్ణవి, శాంభవి, వేదమాత, దేవమాత, విశ్వమాత, ఋతంభర, మందాకిని, అజప, బుద్ధి, సిద్ధి ఈ పన్నెండు జ్ఞాన పక్షానికి, మస్తిష్కానికి, దక్షిణ మార్గానికి సంబందించిన శక్తులు.

శ్లో:- సావిత్రీ సరస్వతీ జ్ఞేయ లక్ష్మీ దుర్గా తధైవచ
కుండలిని ప్రాణాగ్నిశ్చ భవాని భువనేశ్వరి
అన్నపూర్ణేతి మానాని మహామాయా పయశ్వినీ
త్రిపురా చైవేతి విజ్ఞేయా తాంత్రి కానిచ ద్వాదశ

సావిత్రి, సరస్వతి, లక్ష్మీ, దుర్గ, కుండలిని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయశ్విని, త్రిపుర, ఈ పన్నెండు తాంత్రికమైనవి. వామ మార్గానికి సంబంధించిన శక్తులు.  
 
దక్షిణ మార్గమంటే జ్ఞాన మార్గం, వామ మార్గం అంటే శక్తి సంచయం. ఈ విధంగా జ్ఞానాన్ని, శక్తిని సంపాదించి ఆధ్యాత్మిక భౌతిక శక్తులలో రెండింటిలోనూ సాధకుడు ఫలితాన్ని పొందుతాడు. గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు ప్రకృతిలోని 24 శక్తులను, మానవ శరీరంలో గల 24 శక్తులను సూచిస్తాయి.

"సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ"  జ్ఞానానికి ఒక హద్దంటూ ఉండదు. గాయత్రీమంత్రం, సాధకునికి ఋషిత్వ స్ధాయిని ప్రసాదించి, దేవర్షి స్ధాయికి తీసుకొని పోతుంది. అందుకోసం జ్ఞాన పక్షానికి చెందిన 12 శక్తులను, విజ్ఞాన పక్షానికి చెందిన 12 శక్తులను అందిస్తుంది  గాయత్రి.

దర్మరాజకృత_దుర్గాస్తోత్రం


పాండవుల అజ్ఞాతవాస ప్రారంభ సమయంలో ధర్మరాజు, దుర్గాదేవిని స్తుతించి,
తమనెవరూ గుర్తించకుండా ఉండేందుగ్గానూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన సందర్భంలోనిదీ దుర్గాస్తోత్రం.

విరాటనగరం రమ్యం గచ్చమానో యుధిష్టిరః
అస్తువన్మనసా దేవీ దుర్గాం త్రిభువనేశ్వరీమ్

యశోదా గర్భ సంభూతాం నారాయణ వరప్రియాం
నంద గోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీమ్

కంస విద్రావణభకరీ మసురాణాం క్షయంకరీం
శిలాతట వినిక్షిప్తాం మాకాశం ప్రతిగామినీమ్

వాసుదేవస్య భగినీం దివ్యమాల్యం విభూషితాం
దివ్యాంబర ధరాం దేవీం ఖడ్గఖేటక ధారిణీం

భారావతరణే పుణ్యే యే స్మరంతి సదా శివాం
తాన్ వై తారయసే పాపాత్ పంకే గామివ దుర్బలామ్

స్తోతుంప్రచక్రమే భూయోవివిధైః స్తోత్ర సంభవై:
ఆమంత్ర్య దర్శనా కాంక్షీ రాజా దేవీ సహానుజః

నమోస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణీ
బాలార్క సదృశకారే పూర్ణ్చంద్ నిభాననే

చతుర్భుజే చతుర్వక్ర్తే పీనశ్రోణి పయోధరే
మయూరపింఛ వలయే కేయూరాంగద ధారణీ

భాసి దేవి యథా పద్మా నారాయణ పరిగ్రహః
స్వరూపం బ్రహ్మచర్యం చ విశదం గగనేశ్వరీ

కృష్ణచ్చవి సమాకృష్ణా సంకర్షణ సమాననా
బిభ్రతీవిపులౌ బాహూ శక్ర ధ్వజ సముచ్చ్రయౌ

పాత్రీచ పంకజీ ఘంటీ స్త్రీ విశుద్ధా చ యా భువి
పాశం ధనుర్మహాచఅక్రమ వివిధా న్యాయుధాని చ

కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ విభూషితా
చంద్ర విస్పర్ధినా దేవి ముఖేన త్వం విరాజసే

ముకుటేన విచిత్రేణ కేశబంధేన శోభినా
భుజంగా భోగ వాసేన శ్రోణి సూత్రేణ రాజతా

విభ్రాజసే చావబద్దేన భోగే నేవేహ మందరః
ధ్వజేన శిఖిపించానా ముచ్చ్రితేన విరాజసే

కౌమారం ప్రతమాస్థాయ త్రిదివం పావితం త్వయా
తేన త్వం స్తూయసే దేవి త్రిదశై: పూజ్యసేపి చ

త్ర్యైలోక్య రక్షణార్దాయ మహిషాసుర నాశిని
ప్రసన్నామే సుర శ్రేష్టే దయాం కురు శివా భవ

జయాత్వం విజయాచైవ సంగ్రామే చ జయప్రదా
మమాపి విజయం దేహి వరదా త్వం చ సాంప్రతమ్

వింధ్యైచైవ నగశ్రేష్టే తవ స్థానం హి శాశ్వతం
కాళి కాళి మహా కాళి ఖడ్గ ఖట్వాంగా ధారిణి

కృతానుయాత్రా భూతైస్యం వరదా కామచారిణీ
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః

ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే నరా భువి
ణ తేషాం దుర్లభం కించిత్ పుత్రతో ధనదోపినా

దుర్గాత్తారయసే దుర్గే తత్త్వం దుర్గాస్త్రతా జమై
కాంతా రేశ్వవాసన్నాన్నాం మగ్నానాం చ మహార్ణవే

దస్యుభిర్వా నిరుద్దానాంత్వం గతి: పరమా నృణాం
జలప్రత రణేచైవ కాంతారే శ్వటవీషు చ

యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః
త్వం కీర్తి: శ్రీర్ద్రతి: సిద్ధిర్హ్రీర్విద్యా సంతతిర్మతి:

సంధ్యారాత్రి: ప్రభా నిదరా జ్యోత్స్యా కాంతి: క్షమా దయా
నృణాం చ బంధనం మోహమ పుత్రనాశం ధన క్షయం

వ్యాధి మృత్యు భయం చైవ పూజితా నాశయిష్యసి
సోహం రాజ్యాత్ పరిభ్రష్ట: శరణం త్వాం ప్రవన్నవాన్

ప్రనతశ్చ యథా మూర్ధ్ని తవ దేవి సురేశ్వరి
త్రాహిమాం పద్మ పత్రాక్షి సత్య సత్యా భవ స్వనః

శరణం భవ మే దుర్గే శరణ్యే భక్తవత్సలే
ఏవం స్తుతాహి సాదేవి దర్శయామాస పాండవమ్.

భూతత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు


భూతత్వరాశులు:- వృషభం, కన్య, మకర రాశులు భూతత్వానికి చెందినవి. వీటికి వరుసగా శుక్ర, బుధ, శని అధిపతులు. భూతత్వరాశుల వారు మంచి దృడమైన శరీరం కలిగి ఉంటారు. మంచి భోజన ప్రియులు. కూడబెట్టుట, ఏదైనా పనిని ప్రారంభించే ముందు లాభ నష్టములను బేరీజు వేసుకొని ప్రవర్తించెదరు. వ్యక్తిగత విషయాల యందు, ఊహా జగత్తుల యందు విహరించుట. బౌతిక విషయాల యందు, జీవనం నందు విశ్వాసం ఉండును. ఏదైనా పనిని ప్రారంభించిన వదిలిపెట్టరు. వీటిని అర్ధ త్రికోణ రాశులు అని కూడ అంటారు. మంచి జీవనోపాధి కలిగి ఉంటారు. 

కుటుంబ పోషణ బాధ్యత కలిగి ఉంటారు. కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. లౌకిక విషయాలపై, సామాజిక అంశాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు. మంచి ఉపాధి కలిగి సంసార జీవితాన్ని సుఖవంతం చేసుకుంటారు. ప్రతి విషయంలోను ప్రయోజనాన్ని ఆశిస్తారు. తక్కువ శ్రమతో సంపాదించే తెలివితేటలు కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితంపై మక్కువ కలిగి ఉంటారు. కష్టపడి విజయం సాధిస్తారు. ప్రతి పని ఓర్పుగా నేర్పుగా చేస్తారు. సహనం, పోటీతత్వం కలిగి ఉంటారు. ముందు జాగ్రత్తగా భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా కార్యక్రమాలను రూపకల్పన చేస్తారు. ధనాన్ని కూడబెట్టుకోవటం అలవాటుగా చేసుకుంటారు. ఆచి తూచి నెమ్మదిగా పనులను చక్కబెడతారు. 

వృషభరాశి:- వృషభరాశి మేషాది క్రమంలో రెండవ రాశి కావటం వలన ధనం కూడ బెట్టటం, కోరికలు కలిగి ఉండటం, విలువలకు ప్రాధాన్యత, ప్రయోజనాన్ని ఆశించి పెట్టుబడి పెట్టటం, కుటుంబ పరిరక్షణ మొదలగు అంశాలపై ఆసక్తి కలిగి ఉంటారు. సంపాదనను, స్ధిర, చరాస్ధులను, స్వంతమైన వస్తువులను సద్వినియోగం చేసుకొని సౌకర్యాలను, సౌఖ్యాలను అనుభవించటం చేస్తారు. ధనాన్ని, వస్తువులను, స్ధిర చరాస్ధులను భద్రంగా కాపాడుకుంటారు. సంపాదనా మార్గాలను అన్వేషిస్తారు. వృషభరాశికి అధిపతి శుక్రుడు కావటం వలన సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. 

అందంగా కనపడాలనుకోవటం, ఆకర్షణగా కనపడాలనుకోవటం, అందమైన, ఆకర్షణీయమైన దుస్తులు ధరించాలని కోరుకుంటారు. ఖరీదైన ఆభరణాలపై మక్కువ కలిగి ఉంటారు. విలాస వంతమైన వస్తువులతో సౌఖ్యాలను అనుభవిస్తారు. ఖరీదైన వాహనంలో సుఖాలు కోరుకుంటారు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటారు. ఆకర్షణీయమైన చిత్రాలపై, ప్రకృతిపై మక్కువ. చిత్రలేఖనం, సంగీతం, పాటలు పాడటంపై ఆసక్తి కలిగిస్తుంది. బ్యాంకింగ్, వస్త్రాలు, వాహనాలు, భూ సంభంధమైన, గృహ సంభంధమైన వ్యాపారాలు లేదా ఉద్యోగాలలో రాణించే అవకాశాలు వృషభ రాశి వారికి ఉంటాయి. 

కన్యారాశి :- కన్యారాశి మేషాదిగా ఆరవ రాశి అయినందున కృషికి తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తారు. కృషికి ప్రాధాన్యత కలిగి ఉండటం చేత ప్రయోజనాన్ని, సౌకర్యాలను పొందుతారు. సమగ్రమైన వివరాలు సేకరించటంలో అనుభవం కలిగి ఉంటారు. వివిధ రీతులలో, వివిధ పరిస్ధితులలో విషయాన్ని సేకరించగలిగే నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా వివరించగలిగే సామర్ధ్యం కలిగి ఉంటారు. సమీక్షలు, సమావేశాలు జరిపి సమగ్రమైన నివేదిక సమర్పిస్తారు. సూక్ష్మ పరిశీలనా ఙ్ఞానాన్ని కలిగి ఉంటారు. ప్రతి అంశాన్ని, పరిస్ధితులను అంచనా వేయటం, ఖచ్చితమైన లెక్కలు వేయగలరు. కొలతలు, తూనికల పట్ల శ్రద్ధ వహిస్తారు. వ్రాయటం, లెక్కలు కట్టటం వంటి పనులపై మక్కువ. జీర్ణాశయ సమస్యలు కలిగి ఉంటారు. 

వ్యవసాయం, పాడి పరిశ్రమ, తోటలు, సాధు జీవులను పోషించటం, మొక్కలు పెంచటంపై మక్కువ. అంచనా వేయగలిగే వృత్తులలో రాణిస్తారు. ఇతరులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. తొందరగా ఒక అంచనాకు రాలేరు. ద్వంద రీతిలో ఆలోచిస్తారు. ఆరోగ్య సంబంధమైన ఆహార ధాన్యాలు, తినుభండారాలు, మందులు, పారిశుద్యం, వైధ్యం మొదలగు వృత్తి ఉద్యోగాలలో రాణింపు. శ్రమ సంబందమైన హస్తకళలు, కులవృత్తులు, నేత వస్త్రాలు, కుట్టుపని, పరిశ్రమలు, సేవా కార్యక్రమాలు, యంత్ర పరికరాలు, కార్మికులు, జీతం, ఉద్యోగం మొదలగు వృత్తి ఉద్యోగాలు కన్యారాశి లక్షణాలు. 

మకరరాశి :- మకరరాశి మేషాదిగా పదవ రాశి కావటం వలన ఉపాధి మార్గాలను సూచిస్తుంది. ఉద్యోగం, వ్యాపార వృత్తి, పరిశ్రమలు మొదలైన వాటి ద్వారా ఉపాధి మార్గాలను పొందుతారు. సంఘంలో పేరుప్రఖ్యాతలు సంపాదించాలని కోరుకుంటారు. ఎప్పుడు పై స్ధాయిలో ఉండాలనుకోవటం వలన రాజకీయ పదవి వరించే అవకాశం ఉంటుంది. అధికారం చూపించే వృత్తి, ఉద్యోగాలలో రాణిస్తారు. తను ఉన్నచోట పెద్ద మనుషులుగా చెలామణి అవుతారు. భాద్యతాయుతంగా ప్రవర్తిస్తారు. వయోవృద్ధులపై, అనాదలపై, మానసిక వికలాంగులపై మక్కువ కనబరుస్తారు. ప్రతి పని పట్టుదలగా జాగ్రత్తగా చేస్తారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. 

రక్షణ చర్యలు చేపడతారు. సహనం కలిగి ఉంటారు. నిదానంగా పనులు చక్కపెడతారు. నెమ్మదిగా శ్రమించి పని చేస్తారు. ప్రతి పని ఏకాగ్రతగా చేస్తారు. శ్రమతో కూడిన పనులు చేస్తూ కార్యసాధన లక్ష్యంగా ఎంచుకుంటారు. ఉన్నత స్ధాయికి రావాలనే ఆకాంక్ష. ప్రతి వారికి ఉపయోగపడే పనులు చేయటం. ప్రయోజనం, లాభం చేకూర్చే పనుల పట్ల ఆసక్తి కలిగి ఉండటం. స్వార్ధం, పోటీతత్వం లేకపోవటం. తరచుగా నడవటానికి ఇష్టపడతారు. చేతికి మట్టి, మరక అంటుకునే వృత్తి, ఉద్యోగాలలో రాణిస్తారు. ఖాళీగా లేకుండా ఎప్పుడూ ఎదో ఒక పని చేయటం చేస్తారు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కలిగి ఉండటం మకరరాశి కారకత్వాలుగా చెప్పుకోవచ్చు.   

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...