Saturday, July 25, 2015

ప్రేమ వేరు వేరుగా ఉంది ఎలా దగ్గర కావాలో తెలియడం లేదు అంతే

ప్రేమించడం చాలామందికి తెలియదు 
దాదాపుగా 99% కి 
ఎందుకంటే ప్రేమను ప్రేమ ఎప్పటికి ప్రేమించదు

ప్రేమ ఉంటె జీవితంలో బాగా పడలేరు 
ప్రేమలేకుంటే జీవితం గోవింద గోవిందనే

ప్రేమ లేదు అంటే నాకు కోపం వస్తుంది 
ప్రేమ వేరు వేరుగా ఉంది
ఎలా దగ్గర కావాలో తెలియడం లేదు అంతే

నువ్వే తెలుసుకో నేను ఎవరినో  కానీ నువ్వు వెతికే Facebook లో మాత్రం లేదు

మనిషి మనిషికి దగ్గరకావడానికి
సంతోషముగా ఉండడానికి
అలాగే కొన్ని అవసరాల కోసం సోషల్ మీడియా అనే పెద్ద network create చేసుకున్నాడు 
కానీ అదే మనిషి సోషల్ మీడియా ని ఉపయోగ చేసుకొని మనిషిని మనిషిని దూరం చేసుకుంటున్నాడు 
మన చుట్టూ ఉన్న ప్రేమను మరచి 
ప్రేమను సోషల్ మీడియా లో వెతకడం ప్రారంబించాడు
వెతుకుతూనే ఉన్నాడు తోరకడం లేదు ఏదో ఆరో కోరో తప్ప 
అది ప్రేమ మొదలైన హాయ్ how are you what are you 
ఐ లవ్ యు అంతటితో ప్రేమ ముగిసిపోతుంది మల్లి కొత్త ప్రేమను వెతుకుంటున్నారు

వేకువ జామునే ఒక కల వచ్చింది ఒక అతడికి 
ఏమి ఆ కల 
ఎవరో అమ్మాయి మాట వినపడుతుంది కానీ ముఖం కనపడడం లేదు 
నువ్వు నేను చాల రోజులుగా ఫ్రెండ్స్ 
రోజు నన్ను సరదాగా అటపటిస్తవు
చాల డీసెంట్ గా మాట్లాడుతావు 
నాపై లోలోన ప్రేమ పెట్టుకున్నావు కానీ 
ఇంకెవరి కోసమో online వెతుకుతూ ఉంటావు గంటలు తరబడి 
నీకు ఏమైంది ని చుట్టూ నేను ఉన్న ఎవరికోసమో వేదుకుతున్నావు ఎందుకని
ఇంతకీ నేను ఎవరో తెలుసా
మీ పక్కింటి అమ్మాయి ని కాదు కాదు
నువ్వు bus stop రోజు చూస్తున్న అమ్మాయి ని కాదు కాదు 
మీ ఆఫీసు లోనే నీతో సరదాగా మాట్లాడే ని కో లిక్ ని కాదు కాదు
నువ్వు రోజు అట పాటించే ని మరదలని కాదు కాదు 
నువ్వే తెలుసుకో నేను ఎవరినో 
కానీ నువ్వు వెతికే Facebook లో మాత్రం లేదు

హీరో రెడీ అవుతాడు ఆఫీసుకి బయట వస్తనే రోడ్లో ప్రక్కింటి అమ్మయిని చూస్తాడు 
ఆమె చిరునవ్వు అయిన నవ్వదు ఏదో కోపం ముఖంలో
ఇతనిలోన ఏమి expression ఉండదు. మాటలు ఉండవు కానీ రోజు అదే టైం కి 
ఇద్దరు చూసుకుంటారు కోపంగానైన అ కోపం దాటి రాని ప్రేమ ఉంది వాళ్ళ ఇద్దరిలో

బస్సు స్టాప్ లో రోజు ఒక్కే బస్సు ఎక్కుతారు కానీ ఒకరి ప్రక్కన ఒక్కరు కుచోరు
కానీ ఒకరిని ఒకరు దొంగ చూపులు చూసుకుంటూ ఉంటారు ప్రేమగా 
ఒకరికి ఒకరికి తెలియకుండా

ఆఫీసు స్టాఫ్ అంత ఈవెనింగ్ కాఫీ కి వెళ్లుతారు మొత్తం ఇద్దరు అమ్మయిలు నలుగులు అమ్మాయి లు 
అందరు కాఫీ తీసుకుంటారు కానీ అందులో ఒక్క అమ్మాయి మాత్రమూ జ్యూస్ తీసుకుంటుంది 
అందరు సరదాగా మాట్లాడుతూ కాఫీ తగుతుంటారు 
జ్యూస్ తాగే అమ్మాయి కి జ్యూస్ ఎక్కువ అని పించి ఒక్క అతనికి తగు అని ఇస్తుంది అతడు పైకి మహుమాటం వద్దు ఆంటాడు పర్వాలేదు తగు అంటుంది కానీ ఆటను వద్దు ఆంటాడు 
లోలోన ఇష్టము ఉన్న తాగాడు ఇతనికి ఇ అమ్మాయి అంటే చాల ఇష్టము కానీ . ప్రేమను పెంచుకోవడానికి లేదా ప్రేమ చిగురించడానికి ఏవి చాల ఉపయోగ పడుతాయి కానీ మనిషి వీటిని ఉస్ చేసుకోవడం లేదు (ఎక్కడ అ అమ్మాయి ఇతన్నే అడగడ్డం దేవుడు కల్పించిన అవకాసం కానీ మనం ఉస్ చేసుకోలేదు)

మగవాడు

 భగవంతుని సృష్టి లో ఒక అద్భుతం 
తన చాక్లెట్స్ చెల్లికి ఇవ్వగలవాడు
తన కలలను తల్లి తండ్రుల చిరునవ్వు కోసం త్యాగం చెయ్యగలవాడు
తన పాకెట్ మనీ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ల కోసం ఖర్చుపెట్ట గలవాడు 
తన యవ్వన కాల మంతా త్యాగం చేసి భార్యా పిల్లలకోసం గొడ్డులా పని చేసి కంప్లైంట్ చెయ్యని వాడు 
వారి భవిష్యత్తు కోసం బ్యాంకు ల లో అప్పులు చేసి జీవిత మంతా తిరిగి కట్టేవాడు .
అనేక కష్టాలు పడి అమ్మానాన్నలు , భార్య , బాసు లతో తిట్లు తింటూ వాళ్ళ ఆనందం కోసం జీవించేవాడు 
బయటకు వెడితే ఇంటిని గురించి పట్టించుకోడు అంటారు 
ఇంట్లో ఉంటె బద్ధకిష్టి బయటకు కాలు పెట్టడు అంటారు 
పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు 
పిల్లల్ని తిట్టక పోతే బాధ్యత లేదు అంటారు 
భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు 
భార్య చేత ఉద్యోగం చేయించక పోతే ఇన్ఫీరియారిటీ అంటారు 
అమ్మ మాట వింటే అమ్మ కూచి అంటారు 
భార్య మాట వింటే బానిస బతుకు అంటారు 
.
ఆడపిల్లలూ మగవాడిని గౌరవించండి . వాడు ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నాడో మీకోసం 

స్త్రీ

స్త్రీ!!!
చిన్నప్పట్నుంచి వింటున్న పేరు,
ఒక అమ్మ గా , ఒక అక్క గా ,ఒక చెల్లిగా ,ఒక చెలిగా
మనిషి లో ఒక భాగమైన ఈ "షి" ఒక ప్రయాణం....ఒక
ప్రమాణం
తనకన్ని తేదీలు గుర్తుంటాయి ... తన
పుట్టినరోజు తప్ప
అవును మరి
బతుగు పొగలతో ఆమె జీవితపు క్యాలెండరు మసి
బారింది..
ఎక్కడున్నావమ్మా???
నీ బ్రతుకుని మాకు మెతుకులుగా తినిపించి
పస్తులున్న పడతీ, ఎక్కడ నీ చిరునామా??
కట్నం కుమ్ములాటలో , ప్రేమ పేరు తో మరిగే విష
కషాయం లో కరిగి ,
చెల్లదు అని కొట్టేసిన కేసు స్త్రీ!!!
అవును మరి , మనది "Mr. రాజ్యం " !!.
రాముడు ఎన్ని యుద్ధాలు చేయాలో ??
అందరూ రావణాసురులే అంతటా....
ఒక్కటి మాత్రం నిజం ..
మనిషి గతం లో " తను" ఉంది
వర్తమానం లో "తను" ఉంది
భవిష్యత్తు లో కూడా ఉంటూ
"అతను" లో అన్నీ "తను" అయిన విజేత ఈ వనిత...
యుగపురుషుడు ఒక్కడే ....
మిగతావాళ్ళందరూ స్త్రీ లే మరి...లెక్కకందన
ంతమంది..
సహనం చెలికత్తెగా , బాధలు అనే కలుపుమొక్కలను
ఏరుతూ
కన్నీళ్ళతో చేసే బతుకు వ్యవసాయం స్త్రీ ...
ఏరుతోంది పారేసుకున్న ధాన్యం కాదు..
మగవాడి పరువు తాలూకు గుర్తులు
అందుకే
స్త్రీ లేని ప్రపంచం
పేజీలు లేని పుస్తకం లాంటిది..
అక్షరాలు లేని భాష లాంటిది
అర్థం ఉండదు.....అనర్థం తప్ప....
అందుకే ....ఓ స్త్రీ !!

నీకు అభిమాన అభివందనం !!!
మమకార సిరి చందనం !!!!

మనం కలుసుకుని...ఎన్నాళ్ళు అయ్యిందో గాని; అప్పటి నుండే నా ..మరో బాల్యం ప్రారంభం.


నీ పరిచయం తో పాటుగా .
దాచుకున్న నెమలీకను పదే పదే ఇక నాదేగా
అనుకుంటూ చూసుకునే సంబరపు పునాది లా
అమ్మ దాచిన తాయిలం నా ఒక్కడికేనా కాదా
అన్నట్టు సంకోచం.. పంచితే ఊరుకొని ఉక్రోషం
ఇప్పటికీ నిన్ను పూర్తిగా గెల్చుకున్నానో లేదో
నని
అలల పై నిలకడలేని నావలా సందిగ్దాల మనసు..
నాన్న కొనిచ్చిన బొమ్మ కారు ఎవరో కాజేస్తారని
పక్కనే పెట్టుకుని పడుకున్నట్లు భయం వెంటే
అభద్రత
ఎక్కడ చేజారిపోతావో నని, నేను అవసరమే రాని (లేని)
నీ సంతోషాల సాక్షిగా..వచ్చేస్తుంది ...
అదుపు లేని కోపం అర్ధం కాని చిక్కు ముడి లా
నేనంటే నీకు నిర్లక్ష్యమో , నమ్మకమో, ధీమా ఏమో
తెలియదు కాని
నువ్వంటే ఎక్కడ దూరమవుతావోనని భయం,
నన్ను వీడకు అనే వేడుకోలు స్వార్ధం నాది....

ఒక్క సారైనా మనల్ని ఇష్టపడే వారి గురించి ఆలోచిస్తామా ?

ఒక్క సారైనా మనల్ని ఇష్టపడే వారి గురించి ఆలోచిస్తామా ?

ప్రతి మనిషి జీవితం లో మనల్ని ఇష్టపడే వారు, మనం ఇష్టపడే
వారు ఉంటారు
మనం ప్రతి సారి మనం ఇష్ట పడే వారితోనే గడపాలి,
వారితోనే మాట్లాడాలి వారి తోనే కలకాలం కలిసుండాలి అనుకుంటాం...
వారు తిట్టిన సరే వారిని మాత్రం వదిలి ఉండలేం ....
కుదిరితే వారితో, కుధరకపోతే వారి జ్ఞాపకాలతోనైనా బ్రతికేస్తుంటాం...
కాని,
ఒక్క సారైనా మనల్ని ఇష్టపడే వారి గురించి ఆలోచిస్తామా ?
వారు మనల్ని కలవాలని మనతో మాట్లాడాలని ఎదురు చూస్తుంటారు,
కాని మనం మాత్రం ఏమి తెలియనట్లు, మాట్లాడే తీరికలేనంత బిజీగా
అయిపోతాము.
మనం నిజంగానే బిజీగా ఉంటామ లేక బిజీగా ఉన్నట్లు నటిస్తామా....
అదికాక వారు మనల్ని విడిచి ఉండలేరన్న దీమాతోనా ?
మనం ఇష్టపడే వారి గురించి ఆలోచించిన దానిలో ఒక బాగామైన మనల్ని
ఇష్టపడే వారి గురించి ఆలోచిస్తామా....?
రెండు ఇష్టాలే కాని ఇంత వ్యత్యాసం ఎందుకో...!

నాలో నాకే భాధ.....?

నాలో నాకే భాధ
మాటలు నేర్చుకోలేక మదిలో భాధ
అనురాగం పంచుకోలేక గుండెలో భాధ
అమితమైన ప్రేమఉన్న
సమాజం పోకడలేక ఒంటరైపోతున్నాను
ఓదార్పు లేక ఓడిపోతున్నాను

నా మనస్సు ఒప్పుకోదు
మౌనం విడిచి మమకారంగా మాట్లాడడానికి
ఏదో ఓ హద్దు దాన్ని ఆనకట్ట వేసి ఆపేస్తుంది

ఆనందానికి ఆశలు చిగురిస్తున్నట్లే ఉంటాయీ
కానీ అవి చిగురులోనే చీమలు పెట్టిన చెదులులా ఎందుకు మరిపోతున్నాయో
నాకైతే తెలియట్లేదు

అవకాశాలు అదునుగా వస్తుఉంటాయీ
కానీ వాటిని ఎలా గేలం వేసి ఏరా చూపి పట్టాలో
నా పసిడి మనస్సుకు తెలియట్లేదు

అమ్మ వాడిన చుసిన ప్రేమే నాకు తెలుసు
కానీ కమ్మని కళలు మొదులైయక కాలం నాకు శాపంగా మారుతుంది

నలుగురు నా చుట్టూ ఉన్న నేను ఒంటరినే
నా ఆలోచనలను పంచుకోలేక నా బాధకు నేను బదిదున్నే

నా నవ్వును నలుగురికి పంచాలని అనుకుంట కానీ
అది నాలోనే దాగుడు మూతలు ఆడుకొని వెళిపోతుంది

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...