Saturday, July 25, 2015

నాలో నాకే భాధ.....?

నాలో నాకే భాధ
మాటలు నేర్చుకోలేక మదిలో భాధ
అనురాగం పంచుకోలేక గుండెలో భాధ
అమితమైన ప్రేమఉన్న
సమాజం పోకడలేక ఒంటరైపోతున్నాను
ఓదార్పు లేక ఓడిపోతున్నాను

నా మనస్సు ఒప్పుకోదు
మౌనం విడిచి మమకారంగా మాట్లాడడానికి
ఏదో ఓ హద్దు దాన్ని ఆనకట్ట వేసి ఆపేస్తుంది

ఆనందానికి ఆశలు చిగురిస్తున్నట్లే ఉంటాయీ
కానీ అవి చిగురులోనే చీమలు పెట్టిన చెదులులా ఎందుకు మరిపోతున్నాయో
నాకైతే తెలియట్లేదు

అవకాశాలు అదునుగా వస్తుఉంటాయీ
కానీ వాటిని ఎలా గేలం వేసి ఏరా చూపి పట్టాలో
నా పసిడి మనస్సుకు తెలియట్లేదు

అమ్మ వాడిన చుసిన ప్రేమే నాకు తెలుసు
కానీ కమ్మని కళలు మొదులైయక కాలం నాకు శాపంగా మారుతుంది

నలుగురు నా చుట్టూ ఉన్న నేను ఒంటరినే
నా ఆలోచనలను పంచుకోలేక నా బాధకు నేను బదిదున్నే

నా నవ్వును నలుగురికి పంచాలని అనుకుంట కానీ
అది నాలోనే దాగుడు మూతలు ఆడుకొని వెళిపోతుంది

Thursday, July 2, 2015

విండోస్ 10

 విండోస్ 10 పేరు వింటున్నాము. కాని  దీని గురించి క్లారిటీ గా కరెక్ట్ ఇంఫర్మషన్ తెలియటంలేదా. ఇక మీకు ఆ కన్ఫుజన్ ఏమీ లేకుండా..

విండోస్ 10 వాడటానికి కావాలనినవి?
విండోస్ 10 గతంలో పైరేటెడ్ విండోస్ 7 మరియు 8 వెర్షన్స్ కు ఫ్రీ అప్ డేట్ వస్తుంది అని అఫిషియల్ గా అనౌన్స్ చేసింది మైక్రోసాఫ్ట్, కాని మళ్ళీ ఆ మాటను వెనక్కి తీసుకుంది.
కేవలం జెన్యూన్ విండోస్ 7(సర్వీస్ ప్యాక్ 1) మరియు విండోస్ 8.1 వెర్షన్స్ కు మాత్రమే 10 ఫ్రీ గా అప్ డేట్ రానుంది. ఈ ఫ్రీ అప్ డేట్ కూడా కేవలం ఒక సంవత్సరం మాత్రమే. ఆ తరువాత ఎడిషన్లు బట్టి 6,355 రూ నుండి 12,717 రూ డబ్బులు కట్టాలి.

జెన్యూన్ విండోస్ 7, 8 వెర్షన్ OS లు ఉన్న వాళ్లు ఇలా 10 ఫ్రీ అప్ డేట్ ను పొందవచ్చు..
జెన్యూన్ విండోస్ వెర్షన్ వాడుతున్న వారి సిస్టం ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యి ఉంటే, వారికి ఆటోమేటిక్ గా క్రింద టాస్క్ బార్ లో టైమ్ పక్కన విండోస్ సింబల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి విండోస్ 10 ఫ్రీ అప్ గ్రేడ్ అవ్వటానికి రిజర్వ్ చేసుకోవచ్చు.  రిజర్వ్ చేసుకున్న వాళ్లకి జులై 29 న (జెన్యూన్ విండోస్ OS యూజర్స్ కు మాత్రమే) విండోస్ 10 OS ఫైల్స్ అన్ని ఇంటర్నెట్ నుండి బ్యాక్ గ్రౌండ్ లో ఆటోమేటిక్ గా డౌన్‌లోడ్ అయ్యి, విండోస్ 10 ను ఇంస్టాల్ చేసుకోమని నోటిఫికేషన్ ఇస్తుంది కంప్యూటర్ లో.

విండోస్ 10 ఎప్పుడు వాడటానికి అందుబాటులోకి వస్తుంది?
జులై 29 అఫిషియల్ కంప్లీట్ ఫైనల్ విండోస్ 10 OS విడుదల కానుంది. కాని ఈ లోపు దానిపై టెస్టింగ్ చేయటానికి టెక్నికల్ ప్రివ్యూ అనే పేరుతో విండోస్ 10 ను ప్రస్తుతానికి జెన్యూన్ లేదా నాన్ జెన్యూన్ విండోస్ యూజర్స్ అందరూ వాడే అవకాశం ఇస్తుంది మైక్రోసాఫ్ట్. అంటే మీరు వాడవచ్చు. కాకపోతే ఇందులో కొన్ని బగ్స్ మరియు ఇన్ కంప్లీట్ ఫీచర్స్ ఉంటాయి. అవి మన డైలీ యూసేజ్ కు ఎటువంటి ఇబ్బంది కలిగించదు. విండోస్ 10 ఎలా ఉంటుంది అనే ఔత్సాహికులు దీనిని వాడగలరు. ఇది 90 పర్సెంట్ ఫైనల్ విండోస్ 10 వెర్షన్ లుక్స్ తో ఉంటుంది.

విండోస్ 10 టెక్నికల్ ప్రివ్యూ ఎక్కడ దొరుకుతుంది?  ఇది వాడటానికి ఏమి కావలి? ఎలా చేయాలి?
టెక్నికల్ ప్రివ్యూ డౌన్లోడ్ చేసుకోవటానికి ముందుగా Windows Insider Program అనే దానికి సైన్ అప్ అవ్వాలి. Windows Insider Program కు ఈ లింక్ లోకి వెళ్లి సైన్ అప్ అవగలరు. ఇందులో సైన్ అప్ అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ ID లేదా Outlook మెయిల్ అడ్రస్ ఉండాలి. సైన్ అప్ అయ్యాక, ఫాస్ట్ రింగ్ మరియు స్లో రింగ్ అని రెండు రకాల విండోస్ 10 OS బిల్డ్స్ ను ఎంచుకోవటానికి ఆప్షన్ ఇస్తుంది. 


ఫాస్ట్ రింగ్ బిల్డ్స్ లో ఎక్కువ బగ్స్ ఉంటాయి కాని ఫాస్ట్ గా లేటెస్ట్ అప్ డేట్ లు వస్తాయి. స్లో రింగ్ బిల్డ్ వెర్షన్స్ లో స్టేబుల్ గా తక్కువ బగ్స్ తో ఉంటుంది OS, కాని ఫాస్ట్ రింగ్ బిల్డ్ వాళ్లకి వచ్చిన తరువాత వస్తాయి ఇందులో లేటెస్ట్ os బిల్డ్ అప్ డెట్లు. ఎలా డౌన్లోడ్ చేయాలి..ఎక్కడ చేయాలి..ఎలా ఇంస్టాల్ చేసుకోవాలి అనే వాటిపై మీకు అది స్టెప్ బై స్టెప్ instructions ఉంటాయి. జులై 29 న ఫైనల్ కంప్లీట్ విండోస్ 10 వెర్షన్ వచ్చినప్పుడు టెక్నికల్ బిల్డ్స్ పనిచేయవు. లేటెస్ట్ గా విండోస్ 10 10159 టెక్నికల్ ప్రివ్యూ బిల్డ్ ను రిలీజ్ చేసింది. దీనిలో 300 బగ్స్ ను ఫిక్స్ చేసి కొత్త లాగిన్ స్క్రీన్ ఇంటర్ఫేస్ ను పొందుపరిచింది.

విండోస్ 10(టెక్నికల్ బిల్డ్ / ఫైనల్ రిలీజ్)  సిస్టం Requirements?
మీ సిస్టం లో విండోస్ 7(సర్వీస్ ప్యాక్ 1) కాని విండోస్ 8.1 కాని పనిచేస్తే, విండోస్ 10 కూడా దర్జాగా పనిచేస్తాది. విండోస్ 8.1 రన్ అయ్యే విండోస్ ఫోనులకు కూడా ఫ్రీ అప్ డేట్ రానుంది. అయితే మైక్రోసాఫ్ట్ కాని విండోస్ ఫోనులకు మాత్రం ఆ ఫోన్ కంపెని మీద ఆధారపడి ఉంటుంది 10 అప్ డేట్.

అసలు విండోస్ 10 ఏమున్నాయి?
కొత్త os అంటే మేజర్ గా ఉండే మార్పు యూజర్ ఇంటర్ఫేస్ (UI). సెకండరీ గా కొత్త ఫీచర్స్. విండోస్ 10 లో కావలసిన అన్ని UI మార్పులు ఉన్నాయి. అయితే కొత్తగా ఇందులో ఉండే ఫీచర్స్...


 విండోస్ 10 లో ఆండ్రాయిడ్ మరియు ఐ os అప్లికేషన్లు రన్ చేసుకోవచ్చు.ప్రాజెక్ట్ స్పార్టాన్ అనే పేరుతో మొదలై “మైక్రోసాఫ్ట్ ఎడ్జ్” అని పేరు మార్చుకొని కొత్త ఫీచర్స్ తో ఇంటర్నెట్ బ్రౌజర్ వస్తుంది.ఇంటిగ్రేటెడ్ స్కైప్ కాలింగ్ సాఫ్ట్ వేర్వర్చ్యువల్ డెస్క్ టాప్స్ ద్వారా బెటర్ మల్టీ టాస్కింగ్అన్నిటికి మించి వాయిస్ స్పీచ్ అసిస్టంట్ లోని కొన్ని మంచి మార్పులు తో Cortanaఆండ్రాయిడ్ ఫోనుల్లో మాదిరి నోటిఫికేషన్ సెంటర్windowed మెట్రో యాప్స్Continuum మోడ్ ద్వారా టచ్ మరియు రెగ్యులర్ డెస్క్ టాప్ ఇంటర్ఫేస్ కు మరే అవకాశంపూర్తిగా మారిన విండోస్ మెయిన్ సెట్టింగ్స్ లుక్స్మెయిల్ Revamped యూజర్ ఇంటర్ఫేస్
 

డిజిట్‌తో అనుసంధానం అవ్వండి

- See more at: http://www.digit.in/te/internet/all-about-windows-10-21454.html#sthash.oNwWPsXf.dpuf

Friday, May 1, 2015

శివరాత్రి

అమ్మ జీడిపప్పు గారు (శివరాత్రి ఎలా ఏర్పడింది)? ప్రళయ కాలంలో బ్రహ్మ, అతను సృష్టించిన సర్వజీవరాసులు అతలాకుతలమయ్యే అంతిమదశలో ఉమా మహేశ్వరి పరమశివుణ్ణి ధ్యానించింది. ఆ రాత్రంతా నాలుగు జాములుఅర్చనలు ఆచరించి పరమశివుణ్ణి ఒక వరం కోరింది. "రాత్రంతా మేలుకొని నేను మీ నామస్మరణ చేసి, పూజా రాధనలు గావించినందువల్ల, మీ పవిత్ర నామం పేరిట దేవతలు, మానవులు శివరాత్రి అనేపండుగా చేసుకోవాలి. శివరాత్రి నాడు సూర్య అస్తమయం మొదలుకొని సూర్యోదయం వరకు ఎవరైతే పూజలు నిర్వహిస్తారో వారికి సర్వ భోగాలు మోక్షం ప్రసాదించాలి, అనుగ్రహించండి స్వామీ "అని పరమశివుణ్ణి వేడుకుంది. శివుడు ప్రత్యక్షమై "అందరు శివరాత్రి జరుపుకుంటారు "అని వరం ప్రసాదించాడు. కాబట్టి మనము శివరాత్రి చేసి శివుని నామస్మరణతో ఆ నాడు గడపాలి

సకల దేవేత గాయత్రి మంత్రములు

 1) నంది గాయత్రీ తత్ పురుషాయ విద్మహే చక్ర తుండాయ ధీమహి తన్నో నంది: ప్రచోదయాత్! 2) నంది గాయత్రీ తత్ పురుషాయ విద్మహే చక్ర తుండాయ ధీమహి తన్నో నంది: ప్రచోదయాత్ 3) గరుడ గాయత్రీతత్ పురుషాయ విద్మహే సువర్ణ పక్ష్య ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్! 4) కాత్యాయని గౌరీ గాయత్రీ ఓం సుభాకయై విద్మహేకళా మాలిని ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్! 5) భైరవ గాయత్రిఓం భైరవాయ విద్మహే హరిహరబ్రహ్మాత్ మహాయ ధీమహి తన్నో స్వర్ణాఘర్షణ భైరవ ప్రచోదయాత్! 6) ధన్వంతరి గాయత్రీ ఓం తత్ పురుషాయ విద్మహే అమృత కలశ హస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్! [లేక] ఓం ఆదివైధ్యాయ విద్మహే ఆరోగ్య అనుగ్రహాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్! 7) దక్షిణామూర్తి గాయత్రి ఓం తత్ పురుషాయ విద్మహే విద్యా వాసాయ ధీమహీ తన్నో దక్షిణామూర్తి ప్రచోదయాత్! 8) కుబేర గాయత్రి ఓం యక్ష రాజాయ విద్మహే అలికదీసాయ దీమహే తన్న: కుబేర ప్రచోదయాత్! 9) మహా శక్తి గాయత్రీ ఓం సర్వసంమోహిన్యై విద్మహే విస్వజననయై ధీమహీ తన్నః శక్తి: ప్రచోదయాత్! 10) షణ్ముఖ గాయత్రీ ఓం దత్త పురుషాయ విద్మహే మహా సేనాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్! 11) సుదర్శన గాయత్రీ ఓం సుధర్శనయ విద్మహే మహా జ్వాలాయ ధీమహే తన్నో చక్ర ప్రచోదయాత్! 12) శ్రీనివాస గాయత్రీ నిర్నజనయే విద్మహేనిరపసయే ధీమహే తన్నో శ్రీనివాస ప్రచోదయాత్! 13) శ్రీనివాస గాయత్రీ నిర్నజనయే విద్మహే నిరపసయే ధీమహే తన్నో శ్రీనివాస ప్రచోదయాత్! 14) కామ గాయత్రి ఓం కామదేవాయ విద్మహేపుష్పబాణాయ ధీమహి, తన్నో నంగః ప్రచోదయాత్! 15) హంస గాయత్రి ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి, తన్నోహంస: ప్రచోదయాత్! 16) హయగ్రీవ గాయత్రి ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ గాయత్రి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ గాయత్రి ఓం చతుర్ముఖాయ విద్మహేహంసారూఢాయ ధీమహి, తన్నోబ్రహ్మ: ప్రచోదయాత్! 19) సీతా గాయత్రి ఓం జనక నందిన్యై విద్మహే భూమిజాయై ధీమహి, తన్నోసీతా: ప్రచోదయాత్ 20) దుర్గా గాయత్రి ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి, తన్నోదుర్గా ప్రచోదయాత్! 21) సరస్వతీ గాయత్రి ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి, తన్నోదేవీ ప్రచోదయాత్! 22) రాధా గాయత్రి ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి, తన్నోరాధా ప్రచోదయాత్! 23) కృష్ణ గాయత్రి ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణ: ప్రచోదయాత్! 24) విష్ణు గాయత్రి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణు: ప్రచోదయాత్ 25) తులసీ గాయత్రి ఓం శ్రీతులస్యై విద్మహేవిష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందా: ప్రచోదయాత్! 26) పృథ్వీ గాయత్రి ఓం పృథ్వీదేవ్యై విద్మహే సహస్రమూర్త్యై ధీమహి, తన్నోపృథ్వీ ప్రచోదయాత్! 27) అగ్ని గాయత్రి ఓం మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్ని: ప్రచోదయాత్! 28) వరుణ గాయత్రి ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి, తన్నోవరుణ: ప్రచోదయాత్! 29) యమ గాయత్రి ఓం సూర్యపుత్రాయ విద్మహే మాహాకాలాయ ధీమహి, తన్నోయమ: ప్రచోదయాత్ 30) ఇంద్ర గాయత్రీ ఓం సహస్రనేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్ర: ప్రచోదయాత్! 31) నవగ్రహ గాయత్రీ సూర్య :: ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్య: ప్రచోదయాత్ చంద్ర: : ఓం అమ్రుతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహి తన్నశ్చంద్ర: ప్రచోదయాత్ కుజ :: ఓం అన్గారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్న: కుజ: ప్రచోదయాత్ బుధ :: ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధ: ప్రచోదయాత్ చంద్ర :: ఓం సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురు: ప్రచోదయాత్ శుక్ర :: ఓం భార్గవాయ విద్మహే మంద గ్రహాయ ధీమహి తన్న: శని: ప్రచోదయాత్ రాహు :: ఓం శీర్ష రూపాయ విద్మహే వక్ర పందాయ ధీమహి తన్నో రాహు: ప్రచోదయాత్ కేతు :: ఓం తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో 32) ఆంజనేయ గాయత్రీ ధీమహి వాయుపుత్రాయ విద్మహే ఆంజనేయాయ ప్రచోదయాత్ హనుమత్ తన్నో ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నోమారుతి: ప్రచోదయాత్! 33) గణేశ గాయత్రీ ఏక దంతాయ విద్మహే వక్రతుండాయ దేమహి తన్నో దంతి: ప్రచోదయాత్! 34) శివ గాయత్రీ ఓం తత్పురుషాయ విద్మహే మహా దేవాయ ధీమహి తన్నో శివః ప్రచోదయాత్! 35) లక్ష్మీ గాయత్రీ ఓం మహాదేవ్యై చ విద్మహేవిష్ణు పత్న్యై చ ధీమహీ తన్నో లక్ష్మిః ప్రచోదయాత్!

స్టీవెన్ పాల్ జాబ్స్

స్టీవ్ జాబ్స్ గా పిలువబడే స్టీవెన్ పాల్ జాబ్స్ యాపిల్ ఇన్కార్పొరేటేడ్కు చైర్మెన్ మరియు CEO. కంప్యూటర్ రంగంలో మరియు వినోదం పరిశ్రమలో తిరుగులేని విజయాలను సాధించి ప్రపంచంలోనే ఒకానొక గొప్ప వ్యాపారవేత్తగా పేరుపొందాడు.ఇతను 1944 ఫిబ్రవరి 24 న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు.జాబ్స్ కు చిన్నప్పటినుండి అధ్యాత్మిక విషయాల పైన చాలా ఆసక్తి.ఒక వీడియో గేమ్స్ కంపెనీలో కొన్నాళ్ళు పనిచేసి తగినంత డబ్బు చేకూరిన తర్వాత భారతదేశ పర్యటన చేసి వేదాంత, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొన్నాడు. తర్వాత నున్నని గుండుతో, భారతీయ సాంప్రదాయ దుస్తులతో అమెరికాకు వెనుతిరిగాడు.1976 లో స్టీవ్ వోజ్నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొట్టమొదటి కంప్యూటర్ను డాలర్లకు అమ్మారు 666.66. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1984 లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. 1984 1985 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల లో జాబ్స్ ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవినుండి తొలగించారు. NeXT అప్పుడు అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు. ఆపిల్ డైరక్టర్లు NeXT ను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అప్పటి ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక గా నియమితుడయ్యాడు CEO. కంపెనీని లాభాల బాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించడంతో 2000 లో పూర్తిస్థాయి అయ్యాడు CEO. కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్ను ఆవిష్కరించి ఆపిల్ను అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళగలిగాడు. 1986 లో 10 మిలియన్ డాలర్లకు పిక్సర్ అనే గ్రాఫిక్స్ కంపెనీని కొన్నాడు. పిక్సర్-డిస్నీ సహయత్నంగా మొట్టమొదటి సినిమా అయిన టాయ్ స్టోరీ 1995 లో విడుదలయి ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత పదేళ్ళపాటు వరుసగా ప్రతి సినిమా ఘన విజయాన్ని సాధిస్తూ గొప్ప లాభాలను ఆర్జించాయి. ఈ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలు: ఎ బగ్స్ లైఫ్, టాయ్ స్టోరీ 2 మాన్స్టర్స్.ఇన్క్, ఫైండింగ్ నీమో, ది ఇన్క్రెడిబుల్స్, కార్స్, రాటటూయి.

మనిషి

నేనెవర్ని? ........................ ఇన్ని వేల సంవత్సరాల నాగరికత తర్వాత కూడా ప్రపంచంలో ఏ ఒక్కరూ పరిపూర్ణంగా సమాధానం చెప్పలేని ప్రశ్న! అయినా మనిషి తన అస్తిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం మాత్రం మానడు. ఇదీ నేను! అని స్థిరంగా నిర్ణయించుకుని మనిషి జీవితం గడిపేస్తుంటాడు. కానీ ఒకానొక సమయంలో ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ మనల్ని ప్రశ్నించినప్పుడు, ఇదా నేను! అని బయల్దేరి, ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో తనని తాను తెలుసుకుంటాడు. చివరికి మరో సారి ఇదీ నేను అని స్థిరంగా నిర్ణయించుకుని జీవితం గడపడానికి ప్రయత్నిస్తుంటాడు మనిషి.కానీ కీర్క్గార్డ్ చెప్పినట్టు "మనిషి నిత్య పరిణామి". మనిషి ఒక స్థితి నుంచి మరో స్థితికి మారుతూ పరిణమిస్తూ ఉంటాడు. నిజమే, చెట్లు పుట్టలు కూడా పరిణమిస్తాయి. కానీ వీటి విషయంలో, ఏ స్థితిలో అయినా, ఏ దశలోనైనా, ఆ స్థితిని, ఆ దశను పూర్తిగా వర్ణించగలం. కానీ మనిషి అలా కాదు. అతడు ఏమి కానున్నాడు, ఏమిగా మారనున్నాడు? ఏ దిశగా పరిణమిస్తున్నాడు? అతడి ప్రణాళిక, ఉద్దేశాలేమిటో చెప్పడం సాధ్యం కాదు. ఈ పరిణామ క్రమంలో మనిషి అస్తిత్వాన్ని ఎలా నిర్వచించాలి? ఏది నా అస్తిత్వం? మారిన నేనా? మారకముందు నేనా? లేక మరో సారి మారబోతున్న నేనా? విశ్వమంతా వ్యాపించిన అనంతమైన తాడుని పట్టుకుని ఎక్కడని వెతకను నా కోసం?

హనుమజ్జయంతి

ఆంజనేయస్వామి ధైర్యానికి ప్రతీక. శక్తిసామర్ధ్యాలకు ప్రతిరూపం. 
మన పండుగల్లో హనుమాన్ జయంతి ముఖ్యమైంది.హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా హనుమంతుని కధలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు నిర్వహిస్తారు. 
ఆంజనేయస్వామి ధైర్యానికి ప్రతీక. శక్తిసామర్ధ్యాలకు ప్రతిరూపం.సముద్రం దాటి లంక చేరాడు. ఆకాశమార్గంలో పయనించి సీతమ్మవారి జాడ కనిపెట్టాడు. సంజీవనీ పర్వతాన్నే పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తియుక్తులను కీర్తించడం సాధ్యమా ?! హనుమజ్జయంతి సందర్భంగా పంచముఖ హనుమాన్, పాదరస హనుమాన్ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు.దేవాలయాల్లో హనుమాన్ ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరు ఈవేళ ఉపవాసం ఉండడానికే ఇష్టపడతారు. 
హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు. 
హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తికి, బల సంపన్నతకు సంకేతమైన హనుమంతుని విశేషాలు స్మరించుకుందాం. హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండీ రాముడి సేవలో గడపడానికే ప్రాధాన్యత ఇచ్చాడు.ఆంజనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తిప్రపత్తులు అంటే, తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు. శ్రీరాముని, సీతమ్మతల్లి కంటే మిన్నగా ప్రేమించాడు హనుమంతుడు. 
ఒకసారి హనుమాన్ సీతాదేవి నుదుట సిందూరం పెట్టుకోవడం చూసి, "నుదుట సిందూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా" అని అడుగుతాడు. 
సీతమ్మ తల్లి నవ్వుతూ "శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని" అంటుంది. 
అంతే, హనుమంతుడు క్షణం ఆలోచించకుండా తన ఒళ్ళంతా సిందూరం పూసుకుంటాడు. అదీ హనుమంతునికి రాముడి మీద గల నిరుపమానమైన భక్తి. హనుమంతుని భక్తికి ఇలాంటి తార్కాణాలు ఎన్నో! 
ఒక సందర్భంలో సీతమ్మ హనుమంతునికి రత్నాభరణాన్ని బహూకరించింది. హనుమంతుడు ఒక్కో పూసనూ కొరికి చూసి, విసిరేయసాగాడు. 
అదేమిటని అడగ్గా, "రామయ్య తండ్రి కనిపిస్తాడేమోనని ఆశగా చూశాను. నా స్వామి లేని రత్నాలు, స్వర్ణాలతో నాకేం పని? "అన్నాడు. 
హనుమంతుని నిరుపమానమైన భక్తికి ఇంతకంటే కొలమానం ఇంకేం కావాలి? రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోగా, ఆ తల్లిని అన్వేషించడానికి బయల్దేరాడు హనుమంతుడు.అహర్నిశలూ ప్రయత్నించి, సీతమ్మ జాడ తెలుసుకున్నాడు. 
అశోకవనంలో శోకమూర్తిలా కూర్చుని, దిగులు సముద్రంలో కుంగిపోతూ, ఆత్మత్యాగం చేయాలనుకుంటున్న సీతమ్మకు శ్రీరాముని అంగుళీయకం చూపి, ధైర్యంగా ఉండమని స్థైర్య వచనాలు పలికాడు. లంకాదహనం చేసి తన వంతు సహకారం అందించాడు. 
వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు.పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంవల్ల ధైర్యం, స్థైర్యం కలుగుతాయి. భయాలూ భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు. 
ఇక హనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతో హనుమంతుని అర్చిస్తారు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...