Friday, October 25, 2013

శ్రీ కుభేర వ్రత కల్పము

వ్రతమునాడు పాటించవలసిన నియమాలు :-

1) ఈ వ్రతాన్ని ఐశ్వర్యము కోరే పురుషులు కాని, స్త్రీలు కాని, దంపతులు కాని, చేయవచ్చు.
2) వ్రతము చేసిననాడు తలస్నానము చేసి ఆరవేసిన బట్టలుగాని, పట్టు బట్టలుగాని ధరించాలి.
3) ఉపవాసం చేయలేనివారు (12 గంటలు దాటకుండా) పూజచేయాలి. శక్తి కలిగిన వారు సాయంకాలం వరకు ఉపవాసం చేసి 6-30 నుండి 9-30 గంటలలోపు పూజచేయవచ్చును.
4) వ్రతము రోజున పగటి నిద్ర మానవలెను.5. ఈ వ్రతాన్ని తొమ్మిది వారాలు చేయాలి.
5) ప్రతి గురువారంనాడు కాని, ప్రతి శుక్రవారంనాడు కాని ఒక నీయమం పెట్టుకుని చెయ్యాలి.
6) స్త్రీలకు మద్యలో ఆటంకము వచ్చినా ఒక వారం మానినా తరువాత వారాలలో పూజలు చేసి, తొమ్మిది పూజలు పూర్తి చేయాలి.దంపతులు చేసినా ఇదే పద్దతి.
7) మొట్ట మొదటి సారి పూజ ప్రారంభిచడానికి మంచి రోజు చూసుకుంటేచాలు. మిగతా వారాలలో వర్జ్య దుర్ముహూర్తాలు లేకుండా చూచుకొని పూజలు చేసుకోవచ్చును.
8) వ్రతము చేసే రోజున మద్య, మాంసాదులు, ఉల్లిపాయలు ముట్టుకోకూడదు.
9) ఆ రోజున పూజ అయ్యే వరకు టిఫిన్లు తినకూడదు.
10) వ్రతం నాడు సాద్యమైనంత వరకు శుచిశుభ్రతలు పాటిచాలి.

కుభేరవ్రత సమయమున చేయు విధులు:-

1) స్నానాంతరం పూజగదిలో మండపం పెట్టేచోట పసుపుతోగాని, ఆవుపేడతోగాని శుభ్రంగా అలకాలి.
2) ఆపైన అందంగా పద్మాలు పెట్టాలి.
3) ఇంట్లో ఈశ్యాన్య దిక్కునగాని, తూర్పు దిక్కునగాని మండపం పెట్టాలి.
4) దాని మీద ఒక పెద్ద తువ్వాలు పరచి 5 సోలలు బియ్యం పొయ్యాలి.
5) వెండిదిగాని, రాగిదిగాని, ఇత్తడిదిగాని ఒక చెంబు బియ్యం మద్యలో నిలపాలి.
6) ఆ చెంబు మీద ఒలచిన కొబ్బరికాయను ఉంచాలి.
7) ఆ కాయ మీద ఒక రవికల గుడ్డను చిలకలా చుట్టి పెట్టాలి.
8) ఆ కలశమునకు వెనుకవైపు కుబేర యంత్రము, కుబేర చిత్రపటము నిలబెట్టాలి.
9) వెండి రూపాయి కాసంత లక్ష్మీ ప్రతిమను చేయించి దానిని, దాని కుడి ప్రక్కను ఒక రూపాయి బిళ్ళను(కుబేరుడుగా)ఒక తమల పాకులో పెట్టి కలశ మందు ఉంచాలి.
10) పూజా సమయంలో కలశలో నీరు పోసి ఒక పైస వెయ్యాలి.
11) పసుపుతో గనపతిని చేసి వేరే పళ్ళెంలో 5 సోలల బియ్యం పోసి ఆబియ్యంలో పెట్టి పూజించి, పూజ అంతా పూర్తిఅయిన తరువాత పసుపు గణపతిని తీసి దాచుకొని, ఈ బియ్యాన్నీ, మండపంలో పోసిన బియ్యాన్నీ కలిపి పూజ చేయించిన బ్రాహ్మనుకు ఇవ్వాలి.
12) తువ్వాలును, కొబ్బరికాయను, కలశను, రవికల గుడ్డను దాచుకొని తరువాత పూజలకు వాడుకోవచ్చును.
13) తొమ్మిది గురువారాలు గాని, తొమ్మిది శుక్రవారాలు గాని ఇలా పూజలు చేసి, పదవ వారంలో ఉద్యాపన చేసుకోవాలి.
14) ఈ 10 పసుపు గణపతులనూ నిర్మాల్యాన్నీ మొదటి నుంచీ జాగ్రత్త పెట్టి ఉద్యాపన అయిన తరువాత ఓక నదిలోనో చెరువులోనో కాలవలోనో నిమజ్జనం చేయ్యాలి.
15) ప్రతివారం పూజలోనూ తొమ్మిది వ్రత పుస్తకాలను కాడా ఉంచి పూజించాలి. పూజతరువాత వాటిని 9 మంది దంపతులకో, ముత్తైదువలకో పంచి పెట్టి వారిని కూడా ఈ వ్రతం చేసి శుభాలు, సంపదలూ పొందండని కోరాలి.
16) లక్ష్మీ స్వరూపమైన ధనానికి కుభేరుడు అధిపతి కనుక ఆయన అనుగ్రహం పొందదానికి వ్రతాంతమందు అష్టలక్ష్మీ, మహాలక్ష్మీ సోత్రాల్నీ, కనకధారాసోత్రాన్నీ పారాయణం చెయ్యాలి.
17) ఉద్యాపనం రోజున 81 కుబేర వ్రత పుస్తకాలను, (శక్తి లేని వారు 9 పుస్తకాలనైనా) పూజించి భక్తులకు పంచి పెట్టాలి. అందువల్ల వారికీ, మనకూ గూడా సుఖసంతోషాలు కలుగుతాయి.
18) ప్రతివారం పూజానంతరం వ్రతకథను శ్రద్దగా వినాలి. తరువాత టెంకాయ కొట్టి నివేదించాలి.
19) పూజావిధానం అంతా అయిన తర్వాత మనం తినే భోజన పదార్దాలు దేవునకు నైవేద్యం పెట్టాలి.
20) ఉద్యాపన మంత్రాలు, వ్రతకథ తరువాత ఉన్నాయి చూడండి.
21) కుబేర వ్రతకల్పం పుస్తకము మీ యింటిలో కూడా ఒకటి ఉండాలి.

కుబేర వ్రతము చేయుట వలన గలుగు సత్ఫలితములు:-

1) ఈ కుబేరవ్రతాన్ని శ్రద్దాభక్తులతో చేసేవారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
2) ధర్మబద్ధంగా మనం కోరుకునే కొరికలన్నీ తీరుతాయి.
3) వివాహం కావలసిన యువతీ యువకులకు త్వరలోనే పెండ్లి వేడుకలు జరుగుతాయి.
4) విద్యార్ధులు చేస్తే వారికి విద్యా ధనం దొరుకుతుంది.
5) వ్యవసాయదారులు చేస్తే వారి పొలాలలో మంచి పంటలు పండుతాయి.
6) వ్యాపారస్తులు చేస్తే వారి వ్యాపారం దిన దినాభివృద్ధి చెందుతుంది.
7) సంతానం లేనివారు చేస్తే వారికి పుత్ర సంతానం కలుగుతుంది.
8) ఉద్యోగస్తులు చేస్తే వారికి పదోన్నతి కలగడమేగాక పై అధికారుల మెప్పు లభిస్తుంది.
9) "మిశ్రవసుడు" అంటే గొప్ప విద్యావంతుదని అర్ధం. అతని కుమారుడే కుభేరుడు, ఇతడు తండ్రిలాగానే మహా పండితుడు. అందుచేత ఇతనిని పూజిస్తే ఇహలోక భోగాలతోపాటు మోక్షానికి అవసరమైన బ్రహ్మజ్ఞానం కూడా లభిస్తుంది. అంటే ఈ పూజ ఇహపరసాధనమైన మహయజ్ఞం వంటిదని భక్తులు గ్రహించాలి.
10) ఈ లోకంలో ఏ కష్టాలూ, రోగాలూ, దారిద్ర్య బాధలూ లేకుండా జీవించి మానవులు తరించాలంటే ఈ వ్రతం కంటే సులభమైన ఉపాయం మరొక్కటి లేదు. 

కావలసిన వ్రత సామాగ్రి:-

పసుపు 20 గ్రా,
కుంకుమ 20 గ్రా,
తమలపాకు 25,
పోకచెక్కలు లేదా వక్కపొడి పొట్లములు 6,
అగరువత్తులు,
హారతి కర్పూరము 8 బిళ్లలు,
కొబ్బరి కాయ స్వామి వారికి కొట్టుటకు.
బెల్లం ముక్క,
గణపతికి నివేదనకు పళ్లు 6,
ప్రసాదము పాలతో చేసిన పిండి వంట లేదా కోవా పూజకు పువ్వులు కలశకు వేయు పూలదండ గంధము,
పసుపు లేదా కుంకుమాక్షతలు,
దూదితో చేసిన వస్త్రములు 2+2,
యజ్ఞోపవేతములు 2+2,
దీపారాదన సామాగ్రి,
కుంది,
వత్తులు,
నూనె,
అగ్గిపెట్టె,
సామానులుంచుకొనుటకు పళ్లెము,
ఆచమనము వగైరాలకు పంచపాత్ర ఉద్దరణి,
చిన్న పళ్లెము,
చేతి గంట,
అగరువత్తులు పెట్టుటకు స్తాండు,
కుబేర యంత్రము,
ఫోటో కలశ వెనుక ఫోటో,
యంత్రము పటము కట్టి ఉంచుకోవలయును.

శ్రీ ధనలక్ష్మీ జపనిధి

ఆచమ్య

మమ ధనలక్ష్మీ, ప్రసాదేన అఖండైశ్వర్యాభి వృద్యర్ధం
మనో వాంఛా పరిపూర్త్యర్దం ధనలక్ష్మీ మహామంత్రజపం కరిష్యే!
అస్య శ్రీ ధనలక్ష్మీ మహామంత్రస్య బ్రహ్మఋషయే నమః గాయత్రీ ఛందస్సే నమః ధంబీజాయ నమః హ్రీం కీలకాయ నమః శ్రీం శక్తయే నమః శ్రీ ధనలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్దే జపేవినియోగః

కరన్యాసమ్

ఓం థం అంగుష్టాభ్యాంనమః
ఓం హ్రీం తర్జనీభ్యాం స్వాహా
ఓం శ్రీం మధ్యమాభ్యాం వషట్
ఓం శ్రీం అనామికాభ్యాంహుం
ఓం హ్రీం కనిష్టకాభ్యాం వౌషట్
ఓం థం కరతలకర పృష్టాభ్యాం ఫట్

అంగన్యాసమ్

హృదయానమః
శిరసేస్వాహా
శిఖాయైవషట్
కవచాయహుం
నేత్రత్రయాయ వౌషట్
ఆస్తృయఫట్
కరన్యాసమైన పిదప అంగన్యాసము చేయవలెను.
భూర్భువస్సువరోమితి దిగ్భంధః

ధ్యానం

శ్లో" పద్మాసనే స్థితాం దేవీం పద్మసన్నిభ కోమలాం
ఐశ్వర్య దాత్రీం భక్తానం కుభేరాజ్ఞానువర్తినీం
ధనదాంతాం మహాదేవీం ధ్యాయామి మనసా సదా"
తరువాత నిర్మలమైన మనస్సుతో 108 సార్లు తక్కువ కాకుండా యీ క్రింది మంత్రమును పఠించవలెను.

ధన లక్ష్మీ మూల మంత్రము:-

(ఓం థం హ్రీం శ్రీం ధనదాదేవ్యై నమః)
జపానంతరము "మయాకృత జపం ధనలక్ష్మీ దేవతార్పణమస్తు". అని నీటిని వదిలి పెట్టవలయును.

శ్రీ ధనలక్ష్మీసంపన్న కుబేరయంత్రము పూజా, జపనిధి

కుబేర మూలమంత్రానికి కరాంగన్యాసాలు

ఆచమ్య. . . . . . . . శ్రీ చిత్ర రేఖా సమేత శ్రి కుబేర స్వామి నమః ప్రీత్యర్ధం శ్రీ కుబేర మూల మంత్ర జపం కరిష్యే.

కరన్యాసమ్

ఓం రాజాధి రాజాయ - ఓం థం అంగుష్టాభ్యాంనమః
ఓం వైశ్రవణాయ - ఓం హ్రీం తర్జనీభ్యాం నమః
ఓం కుబేరాయ - ఓం శ్రీం మధ్యమాభ్యాం నమః
ఓం రాజాధి రాజాయ - ఓం శ్రీం అనామికాభ్యాంనమః
ఓం వైశ్రవణాయ - ఓం హ్రీం కనిష్టకాభ్యాం నమః
ఓం కుబేరాయ - ఓం థం కరతలకర పృష్టాభ్యాం నమః

అంగన్యాసమ్

హృదయానమః
శిరసేస్వాహా
శిఖాయైవషట్
కవచాయహుం
నేత్రత్రయాయ వౌషట్
ఆస్తృయఫట్
భూర్భువస్సువరోమితి దిగ్భంధః

ధ్యానమ్:

శ్రీ సోమపాదభక్తాయ నిధీనామ్ పాలకాయచ,
ఆశ్రితాభీష్ట సందాత్రే రాజాధిరాజాయతే నమః.

కుబేరమూలమంత్రం:

ఓం "రాజాధిరాజాయ వైశ్రవణ కుబేరాయ నమః".

కుబేరగాయత్రి:

"రాజరాజాయ విద్మహే వైశ్రవణ కుబేరాయ ధీమహి,
తన్నః కుబేరః ప్రచోదయాత్."
మూలమంత్ర జపం తరువాత ఈ కుబేర గాయత్రిని కనీసం 28 సార్లు జపిఓచాలి.

వ్రతవిధానము

పంచపాత్రలోని నీటిని ఉద్దరిణితో ముందుగా ఈ క్రింది మంత్రములతో లోపలకు తీసుకోవాలి.
ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః చేతులు కడుగుకొని దీపారాదన చేయాలి. దీపమునకు గంధం అద్ది కుంకుమ పెట్టి ఈ క్రింది మంత్రముతో దీపం వెలిగించాలి. మం" దీపోజ్యోతిః పరబ్రహ్మ దీపస్పర్వతమోపహః,
దీపేనాసాద్యతే సర్వం దీప దేవ నమోస్తుతే"
ఓం రక్త ద్వాదశ శక్తి యుక్తాయ దీపనాధాయ నమః
ఈ మంత్రముతో వెలిగించి అక్షతలు పుష్పము ఈ క్రింది మంత్రముతో దీపము క్రింది భాగమున ఉంచవలెను. ఓం దీపదేవతాబ్యో నమః
దీపము వెలిగించిన తరువాత మరల మూడు మార్లు ఉద్ధరిణితో నీటిని ఈ క్రింది మంత్రములతో లోనికి తీసుకోవలయును.
ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః
చేతులు కడుగుకొని ఈ క్రింది నామ మంత్రములు చదవవలయును.
గోవింద, విష్ణో, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, స్ంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హారే, శ్రీకృష్ణాయ నమః

ఈ క్రింది శ్లోకమును చెప్పుచు గంటవాయించవలెను.

శ్లో" ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం
కుర్వేఘంటారావం తత్ర దేవతా హ్వానలాంఛనమ్
ఈ క్రింది శ్లోకము చెప్పుచు భూమి మీద పూజ చేయవలెను.

శ్లో" అపసర్పంతు యే భూతాః యే భూతా భువి సంస్థితాః
యే భూతాః విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా"

శ్లో" అపక్రామంతు యే భూతాః యే భూతా భూమిభారకా
యే భూతా విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా"
పృధ్వి! త్వయా ధృతాలోకాః దేవిత్వం విష్ణునా ధృతా"
త్వం చ ధారయ మాం దేవి పవిత్రం చాసనం కురు
అని ప్రార్దించి పుష్పాక్షతలచే భూమిని పూజించి

సంకల్పము

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ ధనలక్ష్మీ సహీ కుబేర దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ధక్షిణ దిగ్భాగే శ్రీశైలశ్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి యోర్మద్యదేశే భగవత్ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన........ సంవత్సరే .......ఆయనే....... ఋతౌ.......మాసే. ............ పక్షే......తిథౌ.......వాసరే....... శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః ధర్మపత్నీసమేతః శ్రీమతః....గోతస్ర్య.......నామధేస్య స్త్రీలైనచో శ్రీమత్యాః...........గోత్రవత్యాః...........నామదేయ వత్యాః మమ ఆర్యోగ్య ధనలక్ష్మీ సంపన్న శ్రీ చిత్ర రేఖా సమేత కుబేర ప్రసాదేవ అఖండ ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం మనోవాంఛా ఫలసిద్ధ్య ర్ధం, ఆర్యోగ్య ధనలక్ష్మీ సంపన్నకుబేర వ్రతం కరిష్యే ఆధౌనిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే, తదంగ కలశపూజాం కరిష్యే. పంచపాత్రకు మూడు వైపుల గంధము కుంకుమలు అద్ది గంధము,పుష్పములు అక్షతలు కలశలో వేసి అరచేతితో మూసి ఈ క్రింది శ్లోకమును చదవవలెను. శ్లో" కలశ్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలేతత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యదర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్ధం దురితక్షయ కారకాః"
కలశోదకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్య

కలశములోని నీటిని పుష్పముతో దేవునిపైన తమపైమ పూజాద్రవ్యములపైన చల్లుకొని పసుపుతొ చేసిన గణపతిపై ఈ క్రింది మంత్రముతో పుష్పాక్షతల నుంచవలెను. ఓం గణానాం త్యా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం.

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనఃశృణ్య న్నూతిభిస్పీద సాదనమ్. అస్మిన్ హరిద్రా బింబే సాంగం సాయుధం సహవానం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం గణపతి మావాహయామి, స్థాపయామి, పూజాయామి.
శ్రీ మహగణపతే స్థిరోభవ !వరదోభవ! శ్రీ అని పుష్పాక్షతలుంచి మరల పుష్పము అక్షతలు తీసకుని
ఓం శ్రీ గణపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి, రత్నసింహసనం సమర్పయామి, (అక్షతలుంచవలయును)
పాదయోః పాద్యం సమర్పయామి (పుష్పముతో నీటిని చల్లవలయును)
శ్రీ గణపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (పుష్పముతో నీటిని చల్లవలయును)
శ్రీ మహగణపతయే నమః, ముఖే ఆచమనీయం సమర్పయామి (పుష్పముతో నీటిని చల్లవలయును)
శ్రీ మహగణపతయే నమః
గంగాగోదావరీ కృష్ణా కావేరి నిర్మలైర్జలై
స్నపయామి గణాదీశ! ఆత్మశుద్ధ్యై గజానన"స్నపయామి"(ఆకులతో నీటిని చల్లవలయును)
శ్రీ మహగణపతయే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి. (చేసియుంచిన వస్త్రములను ఉంచవలెను)
శ్రీ మహగణపతయే నమః ఉపనీతం సమర్పయామి. (చేసియుంచిన యజ్ఞోపవీతం ఉంచవలెను)
శ్రీ మహగణపతయే నమః గంధం సమర్పయామి. (గంధము పుష్పమునకు అద్ధి దేవునకు సమర్పించవలయును)
శ్రీ మహగణపతయే నమః దూర్వాయుగ్మం సమర్పయామి.(2 దూర్వలు (గరికపోచలు) దేవునికి సమర్పించవలెను)
శ్రీ మహగణపతయే నమః అలంకరణార్ధం పుష్పాక్షతైః పూజయామి.(గణపతిని పుష్పములతో అక్షతలతో యీ క్రింది నామాలు చెప్పుచు పూజింపవలయును)

ఓం సుముఖాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం కపిలాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః ,ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం గుజకర్ణకాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం కుమారగురవే నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గజాననాయ నమః,
ఓం లక్ష్మీగణపతయే నమః, ఓం వికటాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః
శ్రీ మహగణపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి.(అగరువత్తులు వెలిగించి ఆ పొగ స్వామివరికి ఈ క్రింది మంతముతో చూపవలయును.)

వనస్పత్యుద్భవైర్ధివ్యై ర్నానాగంధై స్సుంసంయుతః,
ఆఘ్రేయ స్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్,
శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి
ఈ క్రింది మంతముతో దీపము చూపవలయును
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం
శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి
ధూపదీపానంతర ఆచచమనీయం సమర్పయామి (ఆకులతో నీటిని చల్లవలయును.) పండు లేదా బెల్లం ముక్క స్వామి ముందు ఉంచి ఈ క్రింది శ్లోకముతో స్వామివారికి చూపవలయును.

శ్లో" నైవేద్యం గృహ్యతాం దేవ వరసిద్ది వినాయక,
భక్త్యా సమర్పితం భుక్త్యా మాంరక్ష గమాయక
ఓం ప్రాణాయ స్వాహా - ఓం ఆపానాయ స్వాహ - ఓం వ్యానాయ స్వాహ

ఓం ఉదానాయ స్వాహ - ఓం సమానాయ స్వాహ
(ఈ అయిదు మంత్రములతో స్వామివారికి చూపవలెను.)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (పుష్పముతో నేరు వదలవలయును) శ్రీ మహగణపతయే నమః (అమృతాపిధానమసి), ఉథరాపొశనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళ యామి,
పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహగణపతయే నమః తాంబూలం సమర్పయామి. (తాంబూలము ఉంచవలయును). శ్రీ మహగణపతయే నమః కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి. (హారతి కర్పూరం వెలిగించి ఈ క్రింది మంత్రముతో హారతి నివ్వవలయును.)
శ్లో" నీరాజనం ప్రదాస్వామి భక్తియుక్తేన చేతసా
స్వీకుష్య గణేశత్వం ఈశపుత్ర నమోస్తుతే
(మరలా పూవులు అక్షతలు తీసుకొని ఈ క్రింది మంత్రము చెప్పి స్వామి వారికి సమర్పించవలయును.)

శ్లో" గౌరీపుత్ర నమస్తేస్తు లంబోదర వినాయక
మంత్రపుష్పమిదం దేవ స్వీకురుష్య హరాత్మజ
శ్రీ మహాగణాధిపతయే సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.

(ఈ క్రింది శ్లోకము చదివి పుష్పాక్షతలు స్వామివారి ముందు ఉంచవలెను.)
శ్లో" ఆయుర్దేహి శ్రియం దేహి లంబోదర హరాత్మజ
మమ పూజావిధానేన సంతుష్టోభవ సర్వదా
(చేతిలో అక్షతలు నీరు వేసుకుని ఈ క్రింది మంత్రముతో సెఆమివారి ముందు ధారపోయవలెను)
అనయా ఆవాహనాధి షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతిః సుప్రీతః వరదోభవతు

(ధార వదలి స్వామివారిని పూజించిన పుష్పము అక్షతలు ఈ క్రింది మంత్రముతో శిరస్సున ధరింపవలయును.)
శ్రీ మహగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి.
స్వామివారిని కదుపుతూ ఈ క్రింది మంత్రమును చెప్పవలయును.
"శ్రీ మహగణపతిం యథాస్తానం ప్రవేశయామి, శోభనార్దే క్షేమాయ పునరాగమనాయచ

ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సమేత శ్రీ కుభేర స్వామి

వ్రతము

పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయానం శుభతిథౌ శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సమేత శ్రీ కుభేర ప్రసాదేవ అఖండ ఐశ్వర్యాభివృద్దర్ద్యం, ఇష్ట్కామ్యార్ధ సిద్య్ద్ధర్ధం శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సమేత శ్రీ కుభేరవ్రతం కరిష్యే.(అని సంకల్పము చేసి) అస్మిన్ కలశే సమస్త తీర్ధాదిపం వరుణం, తదగ్రే శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సమేత శ్రీ కుభేర స్వామినం సాంగం సాయిధం సవాహన సశక్తీ పత్నీ పుత్ర పరివార సమేతం ఆవాహయామి స్థాపయామి.(పుష్పాక్షతలు కలశపై ఉంచవలెను.)

ధ్యానమ్:

(పుష్పములు,అక్షతలు చేతబుచ్చుకొని)
ధనలక్ష్య్మాసమాయుక్తకుబేర వరదాయక
అశ్వవాహన హేస్వామిన్ ధ్యాయామి మనసా ముదా శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేర ధ్యాయామి (దేవునిపై పుష్పాక్షతలు ఉంచవలెను)

ఆవాహనమ్:

మరల పుష్పములు, అక్షతలు చేతబుచ్చుకొని)
ఆవాహయామి త్యాం భక్త్యా ఉత్తరాశాపతే విభో
శక్తి సంయుత మాంరక్ష బింబేస్మిన్ సన్నిధిం కురు
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేర మావాహయామి (దేవునిపై ఉంచవలెను)

రత్నసింహసనమ్:

(పూలు అక్షతలు మరలా తీసుకొని)
సింహసన మిదం రమ్యం సౌవర్ణం రత్నభూషితం
కల్పితం చ మయాభక్త్యా స్వీకురుష్వ దయానిధే
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః రత్నసింహాసననార్ధం పుష్పాక్షతాన్ సమర్పయామి.

పాద్యము:

(పాద్యమునకు నీటిని పూలతో చల్లాలి)
శ్లో" పాద్యం గృహాణ యక్షేశ గంధాడ్యం సుమనోహరం
శీతలం స్పర్శసుఖదం సర్వమాలిన్య శోధకమ్
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః పాదయోః పాద్యం సమర్పయామి.(ఉదకము పుష్పముతో చల్లవలయును.)

అర్ఘ్యము:

(పూలు అక్షతలు నీళ్ళతో కలిపి ఇవ్వాలి.)
శ్లో" అర్ఘ్యం గృహాణ దేవేశ యక్షరాజ ధన ప్రియ
గంధ పుష్పాక్షతైరుక్తం సలిలం పావనం శుభం
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనం:

గంగానది సర్వతీర్దేభ్య ఆనీతం నిర్మలోదకం
భవదాచమనార్దం హే కృబేర! ప్రతి గృహ్యతామ్.
ఆచమనీయం సమర్పయామి.(రెండుమార్లు పుష్పముతో ఉదకము చల్లవలెను)

పంచామృతస్నానమ్:

(పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపిన మిశ్రముతో)
దధిక్షిరాజ్య మదుభిః శర్కరాఫల సంయుతం
పంచామృత స్నాన మిదం గృహాణ ధననాయక
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః పంచామృతస్నానం సమర్పయామి.

శుద్ధోదక స్నానం:

(మంచి నీటి స్నానం)
గంగా గోదావరి కృష్ణా కావేరి నిర్మలై ర్జలైః
స్నపయామి కుబేర త్వాం కురు స్నానం హరప్రియ
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః శుద్ధోదకస్నానం సమర్పయామి

వస్త్రం:

(ప్రత్తితో చేసిన వస్త్రములు తీసుకొని
శ్లో" వస్త్రం దాస్యామి సౌవర్ణం కాంచనం చోత్తరీయకం
స్వీకురుష్య త్ర్యంబక సఖ సౌఖ్యం దేహి సురేశ్వర
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః వస్త్రయుగ్మం సమర్పయామి.(స్వామివారికి వస్త్రములు ఉంచవలెను)

యజ్ఞోపవీతమ్:

(ప్రత్తితో చేసిన పసుపు దారము తీసుకొని)
శ్లో" యజ్ఞోపవీత మమలం బ్రహ్మణా నిర్మితంపురా
స్వర్ణసూత్రసమాయుక్తం స్వీకురుష్య ధనేశ్వర
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. (యజ్ఞోపవీతములు ఉంచవలయును)

గందము:

శ్లో" కర్పూరాగుర కస్తూరీ సుగణ్ద ద్రవ్య వాసితం
గంధం దాస్యామి విత్తేశ స్వీకురుష్య సుశోభవ
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః గంధాన్ సమర్పయామి(పుష్పమునకు గందము అద్ది స్వామివారికి సమర్పించవలయును)

అక్షతలు:

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులూన్ శుభాన్
సువర్ణ వర్ణ సంయుక్తాన్ గృహాణ వరదోభవ
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః అక్షతాన్ సమర్పయామి.(అక్షతలుంచవలయును)

పుష్పములు:

శ్లో" మల్లికా మాలతీ జాతీ చంపకా వకుళా నిచ
ఉపాహరామి పుష్పాణి స్ఈ కురుష్య ధనప్రియ
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః పుష్పాణి సమర్పయామి.(పుష్పములతో స్వామివారిని పూజింపవలయును)

అథ అంగ పూజా

ఓం యక్షరాజాయ నమః - పాదౌపూజయామి
ఓం గూఢగుల్ఫాయ నమః - గుల్ఫౌపూజయామి
ఓం ధన ప్రియాయ నమః - జంఘేపూజయామి
ఓం రంభోరవే నమః - ఊరూపూజయామి
ఓం యక్షరాజాయ నమః - కటింపూజయామి
ఓం నిమ్ననాభాయ నమః - నాభిం పూజయామి
ఓం సువక్షసే నమః - వక్షస్థల పూజయామి
ఓం దీర్ఘబాహవే నమః - బాహూపూజయామి
ఓం సుకంఠాయ నమః - కంఠంపూజయామి
ఓం చంద్రవదనాయ నమః - ముఖంపూజయామి
ఓం సునాసికాయ నమః - నాసికాంపూజయామి
ఓం సునేత్రాయ నమః - నేత్రేపూజయామి
ఓం ధనపతయే నమః - ముఖంపూజయామి
ఓం కుబేరాయ నమః - సర్వాణి అంగాణి పూజయామి
ఇతి అంగ పూజ

కుబేరాష్టోత్తర శతనామావళిః

ఓం కుబేరాయ నమః
ఓం ధనదాయ నమః
ఓం శ్రీదాయ నమః
ఓం రాజరాజాయ నమః
ఓం ధనీశ్వరాయ నమః
ఓం ధనలక్ష్మీ ప్రియతమాయ నమః
ఓం ధనాడ్యాయ నమః
ఓం ధనిక ప్రియాయ నమః
ఓం దాక్షిణ్యాయ నమః
ఓం ధర్మనిరతాయ నమః
ఓం దయావతే నమః
ఓం ధృడవ్రతాయ నమః
ఓం దివ్యలక్షణ సంపన్నాయ నమః
ఓం దీనార్తి జనరక్షకాయ నమః
ఓం ధాన్యలక్ష్మీ సమారాద్యాయ నమః
ఓం ధైర్యలక్ష్మీవిరాజితాయ నమః
ఓం దయారూపాయ నమః
ఓం ధర్మబద్దయే నమః
ఓం ధర్మసంరక్షణోత్సుకాయ నమః
ఓం నిధీశ్వరాయ నమః
ఓం నిధీనాం పరిపాలకాయ నమః
ఓం నియంత్రే నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం నిష్కామాయ నమః
ఓం నిరుప్రదవాయ నమః
ఓం నవనాగ సమారాధ్యాయ నమః
ఓం నవసంఖ్యా ప్రవర్తకాయ నమః
ఓం మాన్యాయ నమః
ఓం చైత్రరదాదీశాయ నమః
ఓం మహాగుణ గనాన్వితాయ నమః
ఓం యాజ్ఞికాయ నమః
ఓం యజనాసక్తాయ నమః
ఓం యజ్ఞభుజే నమః
ఓం యజ్ఞ రక్షకాయ నమః
ఓం రాజచంద్రాయ నమః
ఓం రమాదీశాయ నమః
ఓం రంజకాయ నమః
ఓం రాజపూజితాయ నమః
ఓం విచిత్ర వస్త్ర వేషాడ్యాయ నమః
ఓం వియద్గమన మానసాయ నమః
ఓం విజయాయ నమః
ఓం విమలాయ నమః
ఓం వంద్యాయ నమః
ఓం వందారు జనవత్సలాయ నమః
ఓం విరూపాక్ష ప్రియతమాయ నమః
ఓం విరాగిణే నమః
ఓం విశ్వతోముఖాయ నమః
ఓం సర్వ వ్యాప్తాయ నమః
ఓం సదా నందాయ నమః
ఓం సర్వ శక్తి సమన్వితాయ నమః
ఓం సామదానతరాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం సర్వభాదా నివారకాయ నమః
ఓం సుప్రితాయ నమః
ఓం సులభాయ నమః
ఓం సోమాయ నమః
ఓం సర్వకార్య ధురంధరాయ నమః
ఓం సామాగానప్రియాయ నమః
ఓం సాక్షాత్ విభవశ్రీ విరాజితాయ నమః
ఓం అశ్వవాహన సంప్రీతాయ నమః
ఓం అఖిలాండ ప్రవర్తకాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం అర్చన ప్రీతాయ నమః
ఓం అమృతాస్వాదనప్రియాయ నమః
ఓం అలకాపురవాసినే నమః
ఓం అహంకార వివర్జితాయ నమః
ఓం ఉదారబుద్దయే నమః
ఓం ఉద్దామ వైభవాయ నమః
ఓం నరవాహనాయ నమః
ఓం కిన్నరేశాయ నమః
ఓం వైశ్రవణాయ నమః
ఓం కాలచక్ర ప్రవర్తకాయ నమః
ఓం అష్టలక్ష్మ్యా సమాయుక్తాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అమలవిగ్రహాయ నమః
ఓం లోకరాధ్యాయ నమః
ఓం లోకపాలకాయ నమః
ఓం లోకవంద్యాయ నమః
ఓం సులక్షణాయ నమః
ఓం సులభాయ నమః
ఓం సుభగాయ నమః
ఓం శుద్ధాయ నమః
ఓం శంకరారాదన ప్రియాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం శుద్ధగుణోపేతాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం శుద్దవిగ్రహాయ నమః
ఓం సర్వాగమజ్ఞాయ నమః
ఓం సుమతయే నమః
ఓం సర్వదేవ గణార్చితాయ నమః
ఓం శంఖచక్రదరాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం శమాదిగుణ సంపన్నాయ నమః
ఓం శరణ్యాయ నమః
ఓం దీనవత్సలాయ నమః
ఓం పరీపకారిణే నమః
ఓం పాపఘ్నాయ నమః
ఓం తరుణాదిత్య సన్నిభాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం సర్వగుణోపేతాయ నమః
ఓం సురేంద్ర సమవైభవాయ నమః
ఓం విశ్వఖ్యాతయ నమః
ఓం వీతభయాయ నమః
ఓం విజ్ఞానినే నమః
ఓం జ్ఞానినాం వరాయ నమః
ఓం అనంత దేవతా సేవ్యయా నమః
ఓం అనంతానం సౌఖ్యాదాయ నమః
శ్రీ ఆరోగ్య-కుబేర లక్ష్మీ సమేత శ్రీ కుబేరాయ నమః

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః
ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః
అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.

ధూపము:

శ్లో" దశాంగం గగ్గులోపేతం గంధాడ్యం సుమనోహరం
ధూపం కుభేర గృహ్ణీష్వ ప్రసన్నో భవసర్వదా
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః ధూపమాగ్రయామి.
(అగరువత్తులు వెలిగించి చూపవలెను)

దీపము:

(రెండు వత్తులు వేసిన దీపము వెలిగించి చూపవలెను)
శ్లో" సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా
దీపం స్వీకుర హే దేవ! అజ్ఞాన తిమిరాపహమ్
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః దీపం దర్శయామి.(ఆ పుష్పముతో నీటిని కలశ యందుంచవలయును.)

నైవేద్యము:

శ్లో" నైవేద్యం షడ్రసోపేతం ఫలయుక్తం మనోహరం
గృహ్యతాం చంద్రధవళదధినా సంయుతం విభో
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః నైవేద్యం సమర్పయామి.(నైవేద్యము పెట్టు పదార్దములు స్వామివారి ఎదుట పెట్టి ఈ క్రింది మంత్రములతో అయిదుమార్లు స్వామికి చూపవలయును.)
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా
మద్యే మద్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోశనం సమ్ర్పయామి, హస్తౌ, పాదౌ, ప్రక్షాళయామి, శుద్ధాచమనం సమర్పయామి.

తాంబూలము:

శ్లో" ఫూగీఫల సమాయుక్తం కర్పూరేణ సమన్వితం
ఏలా లవంగ మిళితం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః తాంబూలం సమర్పయామి. (తాంబూలమునుంచవలెను.)

నీరాజనము:

శ్లో" నీరాజన మిదం తుభ్యం మంగళాయతనం మహత్
మంగళా వాప్తయే దాస్యే గృహాణ వరదోభవ
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః నీరాజనం దర్శనయామి.(హారతి కర్పూరము వెలిగించి స్వామి వారికి చూపించవలయును )

మంత్రపుష్పము:

శ్లో" మంత్రంపుష్పం ప్రదాస్వామి భక్తియుక్తేన చేతసా
స్వీకురుష్య ధనా దీశ పాహిమాం కృపయానఘ
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః మంత్ర పుష్పం సమర్పయామి

ప్రదక్షణలు:

శ్లో" ప్రదక్షిణం కరిష్యామి త్రివారం త్రిగుణాత్మక
అపాకురు మదీయాంత ర్మాలిన్యాని శుభావహ!
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాః కృపయా దేవ శరణాగతవత్సల
అన్యధ్యాశరణం నాస్తి త్వమేన శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష నిధీశ్వర!
శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేరాయనమః ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి.(మూడుసార్లు సాష్టాంగదండ ప్రణామములు ఆచరించవలయును.)

ప్రార్ధనా నమస్కారములు:

శ్లో" చిత్రరేఖా సమాయుక్త! కుబేర! నిధిపాలక!
యథాశక్తి భవత్ ప్రీత్యై వ్రతం భక్త్యా కృతం మయా
శ్లో" సంతుష్టోభవ హే స్వామిన్ మమకామ్యంప్రపూరాయ
సాదరం ప్రణమామి త్యాం క్షమస్వ త్రాహి మం ప్రభో
ప్రార్ధనా నమస్కారాన్ సమర్పయామి.
అనయా ధ్యానవాహనాధి కల్పోక్త షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ ఆరోగ్య-ధనలక్ష్మీసంపన్న, శ్రీ చిత్రరేఖా సహిత కుబేస్వామి సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు.(అక్షతలు, నీళ్ళు వదలాలి)
శ్రీ కుబేర ప్రసాదం శిరసా గృహామి. హరిః ఓం తత్సత్
ఏతత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. (కొంచెము నీళ్ళు వదలాలి.)


కుబేర వ్రత కథ

నైమిశ్యారణ్యములో మహర్షులంతా సతయ్రాగము చేస్తుండగా ఆ యాగానికి వ్యాస శిష్యుడైన సూతులవారు కూడా వచ్చారు. మధ్యాహ్న సమయంలో మహర్షులంతా సూతులవారి వద్దకు చేరి "ఓ సూతా! సర్వపురాణాలు వ్యాసుల వారి వద్ద తెలుసుకొన్న మహనీయుడవు. ఈ భూ మండలంలో అందరూ సుఖాన్నే కోరుకుంతారు. ఆ సుఖం ఏంతో కష్ట్పడి తపస్సుచేస్తేగాని, భగవంతుని అనుగ్రహం వల్లగాని లభించదు. అంత కష్టపడే స్వభావం కలియుగంలో మానవులకు ఉండదు. తేలికగా ప్రతివారు ధనవంతులు కావాలంటే ఏ వ్రతం చేయాలో దానిని మాకు తెలియజేయుము." అని ప్రార్థించిరి. అపుడు సూతులవారు "ఓ మహర్షులారా! లోకుల మేలు కోసం మంచి ప్రస్న వేశారు. అటువంటి వ్రతం ఒకటి ఉంది. దానిని కుబేర వ్రతం అంటారు. ఈశ్వరుడు కుబేరుని మీద అనుగ్రహం కలుగగా, దేవతల సంపదనంతా పొందుపరచమని ఆ కుబేరుని హస్తగతం చేసినాడు. అతని అనుగ్రహం వల్లనే కుబేరుడు ఉత్తర దిక్కుకు పాలకుడిగా అదికారము పొందినాడు. అతని భార్య చిత్రరేఖ అని పేరు పెట్టుకొన్న ఆరోగ్య కుబేర ధనలక్ష్మీ. లక్ష్మీసహితుడైన ఆ కుబేరుని ఆరాధించినవారు ధనవంతులై సుఖపడతారు. అందులో సందేహము లేదు. కుబేరునికి ఈ పదవికలుగుటకు కారణం చెబుతాను శ్రద్ధగా వనండి." కాంచీపురంలో ధనదత్తుడనే షావకారు ఉండీవాడు. అతడు ఎన్నో వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు. ధనాని సంపాదించడమేగాని ఖర్చు పెట్టేవాడు కాదు.అతడు ఆరోజుల్లో చాలా ధనవంతుడనే పేరు ప్రతిష్టలు సంపాదించాడు. దానికి తోడు నలుగురు కుమారులు, అయిదుగురు కుమార్తెలు ఉండేవారు. ధన సంపద కుటుంబ సంపద గల ఆ షావుకారు, కుటుంబం గడవడానికి కూడా సరిగా ఖర్చు పెట్టక పీనాసి తనంతో జీవయాత్ర గడిపేవాడు. పిల్లలందరికీ ఈ గుణాలే నేర్పి వారిని కూడా తన బాటలోనే నడిపించేవాడు. కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అల్లుళ్లను తెచ్చి ఇంట్లో పెట్టుకుని వ్యాపారాలు చేయించేవాడు. చివరకి ఆ ధనదత్తుడు మహారాజులకే అవసరమొస్తే ధనాన్ని వడ్డీకి ఇచ్చే స్థాయికి పెరిగిపోయాడు. పైసా ఖర్చు పెట్టాలంటే ముందూ వెనుకా చాలా ఆలోచించేవాడు. దేవాలయాలకి వెళ్లి దేవునికి నమస్కారాలు పెట్టి ఒక్క పైసయినా దానం చేసిన పాపాన పోలేదు. పీనాసివాడనే పేరు తాను పొదడమేగాక ఇంత్లోని వారందరికి ఆ పేరు వారసత్వంగా అందించాడు.కాలం గడిచిపోతుంది. ఒకనాడు మహసిద్ధుడు ధనదత్తుని దగరకు వచ్చాడు. అతన్ని చూడగానే ధనదత్తుడు కమ్మని కబుర్లు చెప్పి ఒక్క నమస్కారంతో సరిపెట్టి ఊరిలో చాలా మంది స్వయం పాకాలు ఇచ్చేవారున్నారని, దయ చేసి వెళ్లమని సాగనంపి తలుపులు వేసుకున్నాడు. కొద్దిరోజులు గడిచాయి. మళ్లీ ఆ సిద్ధుడు దనదత్తుని దగరకు వచ్చాడు. ధనదత్తుడు మంచిమాటలు చెప్పి ఆ సిద్దుని వెళ్ళిరమ్మన్నాడు. ఆ సిద్దుడు ఏదో చెప్పబోతుండగా మాట వినిపించుకోకుండా తలుపు వేసుకొని లోపలకి వేల్లిపోయాడు. మరలా ఆ సిద్దుడు దనదతుని ఇంటి వద్దకు వచ్చినేను స్వయం పాకం కోసం రాలేదని నా మాటలు వినిపించూకోమని చెప్పాడు. దనదత్తుడు నాకు మాటలు వినే సమయం లేదని, చాలా తొదర పనులు ఉన్నాయని నెలరోజుల తరువాత రమ్మని పంపించివేసి తలిపులు వేసుకున్నాడు. నెలరోజులు దాటిన తర్వాత ఆసిద్దుడు మరలా వచ్చాడు. వచ్చీరాగానే అయ్యా! నాకు ఇంకా ఖాళీ అవలేదు. రెండు మాసాల తర్వాత దయచేయండి అని తలుపులు వేసుకున్నాడు. ఈ విధంగా సాకులు చెపుతూ ఒక సంవత్సరం గడిపేశాడు. ఆ సిద్దుడు రావడం మానలేదు. చివరకు దనదత్తుడు మీరేమి చెబుతారో ఒక్క మాటలో చెప్పి వెళ్ళండి అన్నాడు. వెంటనే ఆ సిద్దుడు ఓ షావుకారూ! నీ భార్యా పుత్రులకోసం నువ్వు ఈ లంపటంలో మునిగి నీకు రాబోవు కష్టాన్ని తెలుసుకొవటం లేదు. అనగానే ధనదత్తుడు నాకే కష్టాలు రాబోతున్నాయో త్వరగా తెలపండి అని, అయినా అనేక సంపదలు సంపాదించాను నా కుటుంబం కూడా చాలా వృద్ది పొందింది. నాకు లోటు ఏమున్నది అనెను. అప్పుడు ఆ సిద్దుదు ఓ ధనదత్తా! నీకు త్వరలో అపమృత్యువు సంభవిస్తుంది. ఆ మృత్యువు నుండి నిన్ను నీవు కాపాడుకొనుటకు ఒకే ఒక్క మార్గము కలదు. నీ భార్యాగానీ నీ సంతానము ఎవరైనా ఆ అపమృత్యువును తీసుకొనుటకు అంగీకరించినచో నీవు ఇంకా అరువది సంవత్సరములు సుఖముగా జీవిస్తావు. లేని యెడల నీకు మృత్యువు తప్పదని పలికెను. అప్పుడు ధనదత్తుడు తన వారందరిని పిలిచి మృత్యువును మీరు ఎవరైనా స్వీకరిస్తారా అని ప్రశ్నించెను. ఎవరు మృత్యువు వాత పడుటకు ఇష్టపడక నీపాపము నీవే అనుభవించవలసిందేనని అల్కిరి. అంతటి ధనదత్తుడు ఆయోగితో నా వారెవ్వరు అపమృత్యువును స్వీకరించుటకు సమ్మతించడం లేదు. నా ధనమునే అందరూ కోరుకొనుచున్నారు. కాబట్టి నా అపమృత్యువును తొలగించుటకు వేరొక మార్గము చెప్పమని యోగిని ప్రార్ధించెను. అపుడా సిద్దుడు నీవు ధనము ఖర్చు పెట్టి అఖండ శివారాదన చేయాలని చెప్పాడు. నా ప్రాణముల కంటే ధనము ఎక్కువదా? తప్పక ఖర్చు చేయగలనని చెప్పెను. వెంటనే ఆ వైశ్యునిచేత అఖండ శివారాదన చేయించెను. అతడు శివారాదనా తత్పురుషుడై భక్తిశ్రద్దలతో శివారాధన సలుపుతూ జీవితమంతా గడిపి కొంతకాలమునకు శివనామార్చన జరుపుతూ తనను చాలించెను. తత్ఫలితముగా ఆ ధనదత్తుడు శివలోక ప్రప్తిపొంది శివుని ఆంతరంగిక మిత్రుడయ్యెను. శివానుగ్రహముచే దేవలోకమునకు ధనషతియై కుబేరుడని పేరు గాంచెను.అతనికి దేవలోకములోని సంపదలపైన, నవనిధులపైనా, అధికారము కలిగెను. చిత్రరేఖ అను పేరుతో ధనలక్ష్మి ఆ కుబేరుని అర్ధాంయై వెలసెను. ధనలక్ష్మి సహితుడగు తనను ఆరాదన సలిపిన భక్తులకు ఆరోగ్య భాగ్యాలను, ఇష్టసంపదలనూ , ఇచ్చెదనని ఆయన ప్రతిజ్ఞ చేసెను. నవనిధి పరిపాలకుడగుటచేతన పూజను తొమ్మిది వారాలు ఆచరించవలయుననియు. తొమ్మిది మందిచే చేయించినవారికి అంతులేని సంపదలు ఇచ్చెదననియు. ప్రతిన బూనెను. తొమ్మిది గురువారములుగాని, తొమ్మిది శుక్రవారములుగాని ఈ వ్రతమును ఆచరీంచవలయును. పదవ వారము ఉద్యాపన చేయవలెను. అన్ని వారములు పూజ చేయలేని అశక్తులు కనీసం అయిదు వారములు లైననూ పూజ చేసి ఆరవ వారము ఉద్యాపనము చేసుకొనవచ్చును.

ఉద్యాపనము:

పదవ మామూలుగా ధనలక్ష్మీ సమేతుడైన కుబేరుని పూజించి, కలశ దగ్గర తొమ్మిది వ్రత విదాన పుస్తకాలను ఉంచి, పూజించి ఆ పుస్తకాలను తొమ్మిది మంది దంపతులకు లేదా ముత్తైదువలకు పండు తాంబూలముతో వాయనమివ్వవలెను. వారు కాడా ఈ వ్రతము ఆచరించునట్లు నచ్చజెప్పవలెను. భక్తి శ్రద్దలు ప్రదానము. ఇందులోనున్న కుబేర యంత్రమును పటము కట్టించుకొని పూజామందిరంలో ఉంచుకొనవలెను. ఇట్లు చేసిన వారికి సమస్త రోగములూ తొలగి ఆరోగ్యము కలుగును. అష్టైశ్వర్యములును, భోగ భాగ్యములు కలుగును. ఇహపర సౌఖ్యములు గలుగటకు ఇంతకుమించిన వ్రతము లేదు. అని సూతుడుమహర్షులకు లోకానుగ్రహార్ధము వినిపించెను. పూజానంతరం ఈ కథను చదివి అక్షతలను శిరసుపై వేసుకొనవలయును.
ఇది స్కాంద పురాణమందలి రేవా ఖండములోని ఇరువది నాలుగవ అధ్యాయము.
శుభం భూయాత్.

ఉద్యాపనము

తొమ్మిది వారాలు పూజ ముగిసిన పిదప ప్దవ వారములో మరలా యధావిధిగా పూజ చేసి 9 వ్రత విధాన పుస్తకములను పుష్పాక్షతలతో స్వామివారి ఎదుట ఈ మంత్రము చెప్పి ఉంచవలెను. శ్లో" ఉద్యాపనార్ధం యక్షేశ నవసంఖ్యాక కోశకాః
సమర్పితా మయా భక్త్యా స్వీకురిష్య కృపానిధే

పుస్తకము వాయనము ఇచ్చునప్పుడు ఈ క్రింది మంత్రముతో ఇవ్వవలయును.
శ్లో" కుబేరానుగ్రహప్రాప్యై కోశం తుభ్యం దదామ్యహం
స్వీకురిష్య దయాసింధో వ్రతమాచర సత్వరం

వాయనము తీసుకున్నవారు ఈ క్రింది మంత్రముతో స్వీకరించవలయును.
శ్లో" కుబేరస్య వ్రతగ్రంధం పవిత్రాం పాపనాశానం
లబ్ధం త్వత్తః స్వీకరోమి ఆచరిష్యామి తద్ర్వతమ్

కుబేరాష్టోత్తర శతనామ స్తోత్రమ్

శ్లో" కుబేరో ధనద శ్రీదః రాజరాజో ధనేశ్వరః
ధనలక్ష్మీ ప్రియతమో ధనాఢ్యో ధనికప్రియః
దాక్షిణ్యో ధర్మనిరతః దయావంతో ధృఢవ్రతః
దివ్యలక్షణ సంపన్నో దీనార్తిజనరక్షకః
ధాన్యలక్ష్మీ సమారాధ్యో ధైర్యలక్ష్మీ విరాజితః
దయారూపో ధర్మబుద్దిః ధర్మ సంరక్షణోత్సకః
నిధీశ్వరో నిరాలంబకో నిదీనాం పరిపాలకః
నియంతా నిర్గుణాకారః నిష్కామో నిరుప్రదవః
నవనాగ సమరాధ్యో నవసంఖ్యా ప్రవర్తకః
మాన్యశ్చైత్రరదాదీశః మహాగుణగణాన్వితః
యాజ్ఞికో యజనాసక్తః యజ్ఞభు గ్యజ్ఞరక్షకః
రాజచంద్రో రమాధీశో రంజకో రాజపూజితః
విచిత్రవస్త్రవేషాఢ్యః వియద్గమనమానసః
విజయో విమలో వంద్యో వందారుజనవత్సలః
విరూపాక్షప్రొయతమో విరాగీ విశ్వతోముఖః
సర్వవ్యాప్తో సదానందః సర్వశక్తి సమన్వితః
సామదానరతస్సామ్యః సర్వబాధా నివారకః
సుప్రీత స్సులభ స్సోమో సర్వకార్యధురంధరః
సామగానప్రియ సాక్షాశ్రీద్విభవవిరాజితః
అశ్వవాహనసంప్రీతో అఖిలాండప్రవర్తకః
అవ్యయోర్చనసంప్రీతః అమృతాస్వాదన ప్రియః
అలకాపురసంవాసీ అహంకారవివర్జితః
ఉదారబుద్ది రుద్దామవైభవో నరవాహనః
కిన్నరేశో వైశ్రవణః కాలచక్రప్రవర్తకః
అష్టలక్ష్మ్యాసమాయుక్తః అవ్యక్తో మల విగ్రహః
లోకారాధ్యో లోకపాలః లోకవంద్యో సులక్షణః
సులభ సుభగ శ్శుద్ధో శంకరా రాధనప్రియ
శాంత శ్శుద్ద గుణోపేతః శాశ్వత శ్శుద్దవిగ్రహః
సర్వాగమజ్ఞో సుమతిః సర్వదేవగణార్చకః
శంఖహస్తధరః శ్రీమాన్ పరం జ్యోతిః పరాత్పరః
శమాదిగుణ సంపన్న శ్శరణ్యో దీనవత్సలః
పరోపకారీ పాపఘ్న స్తరుణాదిత్యసన్నిభః
దాంత స్సర్వగుణోపేతః సురేంద్రసమవైభవః
విశ్వఖ్యాతో వీతభయః అనంతానంతసౌఖ్యదః
ప్రాతఃకాలే పఠేత్ స్తోత్రం శుచిర్భూత్యా దినే దినే,
తేన ప్రాప్నోతి పురుషః శ్రియం దేవేంద్రసన్నిభమ్.

ఇతి శ్రీ స్కాందే దేవాఖండే
కుబేరాష్టోత్తర శతనామస్తోత్రమ్ సంపూర్ణమ్

అష్టలక్ష్మిస్తోత్రము

1. ఆదిలక్ష్మి

సురగణ వంధిత, సుంధరి, మాధవి
చంద్ర సహోధరి హేమమయి
మునిజనసంస్తుత మోక్ష విధాయిని
మంజుల భాషిణి, వేదనుతే,
సరసిజవాసిని దేవసురక్షణి
సద్వర వర్షిణి శాంతయుతే
జయజయహే మధుసూధన కామిని
ఆదిరమే! పరిపాలయ మామ్.

2. ధాన్యలక్ష్మి

అయికలికల్మషనాశిని కామిని
వైధికభాసిని వేదమయి
కలాశమహాబ్దిజ మంగళరూపిణి
మంత్ర నివాసిని మంత్రనుతే,
శుభఫలదాయిని నీరజవాసిని
దేవగణా శ్రితపాదయుగే
జయ జయహే మదుసూదన కామిని
ధాన్యరమే! పరిపాలయ మామ్.

3.ధైర్యలక్ష్మి

జయవరవర్ణిని వైష్ణవి భార్గవి
మంత్ర సరూపిణి మంత్రమయి
సురగణ మానిని శీఘ్రఫలప్రద
కీర్తివికాసిని శాస్త్రనుతే,
భవభయహారిణి పాపవిమోచని
సాధుజనాశ్రితపాదయుగే
జయ జయహే మదుసూదన కామిని
ధైర్యరమే! పరిపాలయ మామ్.

4.గజలక్ష్మి

జయ జయ దుర్గతినాశిని కామిని
సర్వఫలప్రదశాస్త్రమయి
రథగజతురగపదాతిసమావృత
రాజమహేంద్ర గణాభినుతే,
హరి హర దాతృసుపూజితరూపిణి
తాపనివారకపాదయుతే
జయ జయహే మదుసూదన కామిని
(రాజ్య) హస్తిరమే! పరిపాలయ మామ్.

5.సంతానలక్ష్మి

అయి ఖగవాహనమోహిని చక్రిణి
రాగవివర్దిని జ్ఞానమయి
గుణ గణ వారది లోకహితైషిణి
నారదతుంబురగానరతే
సకలసురాసురదేవమునీశ్వర
మానవందిత పాదయుగే
జయ జయహే మధుసూదనకామిని
సంతతిరూపిణి! పాలయ మామ్ !

6.విజయలక్ష్మి

జయ భయభంజని సద్గతిదాయిని
జ్ఞానవికాసిని గానమయి
అనుదిన మర్చితకుంకుమధూసరి
తాఖిలగాత్రి సువాద్యరతే,
కనకమహాస్రుతిసన్నుతికారక
శంకరదేశికమాన్యపదే
జయ జయహే మధుసూదనకామిని
దిగ్విజయేశ్వరి! పాలయ మామ్

7.విద్యాలక్ష్మి

ప్రణతసురేశ్వరి భారతి భార్గవి
శోకవినాశిని దీప్తమతే
మణగణరాజితకర్ణవిభూషణ
కాంతిసమావృతా తదివ్యముఖి,
శ్రుతిహితవేదపురాణసుశాస్త్ర
సమీరి తవైదికమార్గహితే
జయ జయహే మధుసూదనకామిని
వాక్పరివర్షిణి! పాలయ మామ్.

8.ధనలక్ష్మి

ధిమిధిమి ధింధిమి ధింధిమి-ధింధిమి
దుందుభినాదవినోదరతే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ
శంఖనినాదవికాసమతే !
నవనిధిదాయిని దుర్మలహారిణి
కామితదాయకహస్తయుతే
జయ జయహే మధుసూదనకామిని
హైమావికారిణి! పాలయ మామ్.

మహాలక్ష్మీ స్తోత్రము

మాత ర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వతమాతః!
క్షీరోదజే కమలకోమల గర్భగౌరి! ప్రసీద సతతం నమతాం శరణ్యే!

త్వం రూపేంద్రసదనే మదనైకమాతః జ్యోత్స్నా సి చంద్రమసి, చంద్రమనోహరాస్యే!
సూర్యే ప్రభా సిచ, జగత్రితయే ప్రభాసి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే!

త్వం జాతవేదసి సదా దహనాత్మకశక్తిః వేధాస్త్వయా జగదిదం వివిధం విదధ్యాత్,
విశ్వంభరోపి బిభృయాదఖిలాం భవత్య లక్ష్మీ! ప్రసీద సతతం నమతాం శరణ్యే!

త్వ త్త్యక్త మేత దమలే, హరతే హరోపి త్వం పాసి, హంసి, విధదాసి, పరావరాసి,
ఈడ్యో బభూవ హరి రప్యమలే త్వదాప్త్యా లక్ష్మి! ప్రసీద సతతం నమతాం శరణ్యే!

శూరస్స ఏవ, సుగుణీ, సబుధ, స్సధన్యో మాన్య స్స ఏవ, కులశీలకలా కలాపైః
ఏక శ్శుచి స్సహి పుమాన్ సకలేపి లోకే యత్రాపతేత్తవ శుభే! కరుణా కటాక్షః

యస్మిన్ వసేః క్షణ మహో పురుషే, గజేశ్వే స్రైణే, తృణే, సరసి, దేవకులే, గహేగ్నే,
రత్నే, పతత్రిణి, పశౌ, శయనే, ధరాయాం సశ్రీక మేవ సకలే! తదిహాస్తి నాన్యత్.

త్వత్స్పృష్ట మేవ సకలం శుచితాం లభేత త్వత్త్యక్తమేవ సకలం త్వ శుచీహ లక్ష్మి!
త్వన్నామ యత్ర చ సుమంగళ మేవ తత్ర శ్రీ విష్ణు పత్ని! కమలే ! కమలాలయేపి

లక్ష్మీం శ్రియం చ కమలాం కమలాలయాం చ పద్మాం రమాం నలినయుగ్మ కరాం చ మాంచ,
క్షీరోదజా మమృత కుంభకరా మిరాం చ విష్ణు ప్రియా మితి సదా జపతాం క్వ దుఃఖమ్?

యేపఠిష్యంతి చస్తోత్రం త్వద్భక్త్యా మత్కృతం సదా, తేషాం కదాచి త్సంత్సాపో మాస్తు మాస్తు దరిద్రతా
మాస్తు చేష్ట వియోగశ్చ మాస్తు సంపత్తిసంక్షయః సర్వత్ర విజయ శ్చాస్తు విచ్చేదో మాస్తు సంతతేః
ఇతి శ్రీ స్కాంద పురాణే, కాశీఖండే, అగస్త్యమహామునికృత (కోలాపుర)
శ్రీ మహలక్ష్మీస్తోత్రమ్ హరిః ఓం తత్సత్

శ్రీ కనకధారాస్తవమ్

వినాయక ప్రార్ధనా

వన్దేవన్దారు మన్దార మిన్దిరానంద కందలమ్
అమన్దానన్ద సందోహ బన్దురం సింధురాననమ్

కనకధారాస్తవమ్

అఙ్గం హరేః పులకభూషణమాశ్రయ న్తీ
భృంగాంగ నేవ మకుళాభరణం తమాలం
అంగీకృతాఖిలవిభూతి రపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలాదృశో ర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభావా యాః

విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్ష
మానంద హేతు రధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్థం
ఇందీవరోదర సహోదర మిందియా యాః

ఆమీలితాక్ష మధిగ్యమ ముదా ముకుంద
మానంద కంద మనిషేష మనంగ నేత్రమ్
అకేకర స్థిత కనీనిక పద్మనేత్రం
భూత్యై భవన్మమ భుజంగ శయాంగనా యాః

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతోஉపి కటాక్షమాలా
కళ్యాణ మావహతు మే కమలాలయా యాః

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
దారాధరే స్ఫురతి యా తటిదంగ నేవ
మాతస్సమస్త జగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవ నందనా యాః

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్య భాజి మధుమాథిని మన్మథేన
మయ్యపతే త్తదిహ మంథర మీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకా యాః

దద్యాద్దయాను పవనో ద్రవిణాంబు ధారా
మస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే
దుష్మర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబు వాహః

ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్ట పపదం సులభం లభంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం
పుష్టి కృషీష్ట మమ పుష్కర విష్టరా యాః

గీర్ధవ తేతి గరుడద్వజ సుందరీతి
శాకంభరీతి శశశేఖర వల్లభేతి
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై

శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రశూత్యే
రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్దోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై

నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయా పరాయై
నమోస్తు శారంగాయుధ వల్లభాయై

నమోస్తు కాన్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలర్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే

సరసిజనిలయే సరోజహస్తే
దవళ తమాంశుక గంధమాల్య శోభే
భగవతి హరివల్లభే మనోఙ్ఞే
త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యమ్

దిగ్ఘస్తభిః కనక కుంభముఖావ సృష్ట
స్వర్వాహినీ విమలచారు జల ప్లుతాంగీమ్
ప్రాతర్నమామి జగతాం జననీ మశేష
లోకధినాథ గృహిణీ మమృతాబ్ది పుత్రీమ్

కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానం
ప్రథమం పాత్ర మకృతిమం దయాయాః

కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూరతరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః

బిల్వాటవీమధ్య లసత్సరోజే
సహస్రపత్రే సుఖసన్నివిష్టామ్
అష్టాపదామ్భోరుహపాణిపద్మాం
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్

కమలాసన పాణినా లలాటే
లిఖితామక్షరపంక్తి మస్య జంతో
పరిమార్జయ మాత రంఘ్రిణాతే
ధనికద్వారనివాసదుఃఖదోగ్ర్ధీమ్

అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్థలం భర్తృగృహం మురారే
కారుణ్యత కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదయారవిందం

స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం
త్రయీమయీం త్రిభువన మాతరం రమామ్
గుణాధికా గురుతుర భాగ్య భాజినో
భవంతి తే భువి బుధ భావితాశయాః

ఫలశ్రుతి:

సువర్ణధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్
ఇతిశ్రీమత్స రమహంస పరివ్రాజకాచార్య జగద్గురు
శంకరాచార్యాప్రణీతం
కనక్ధారా స్తోత్రం సంపూర్ణమ్

పురాణాలలో కుబేరుడు

కుబేరుడు గుహ్యకులకు నాయకుడు. శివభక్తుడు. శివుని అనుగ్రహముచేత సకలసంపదలను పొదెను. ఇతని వామభాగమునుండిఓక కన్య పుట్టెను. ఆమె పేరు మనోరమ. ఆమె కుబేరుని భార్య అయ్యెను. (బ్రహ్మవైవర్త పురాణము)
కుబేరుడు పూర్వజన్మలో యజ్ఞదత్తుని కుమారుడు. అతని పేరు గుణనిధి.అతడు అవగుణములన్నింటికిని నిధియై దుర్వ్యసనపరుడైనాడు. తండ్రి వాని చర్యలు భరించలేక ఇంటినుండి పారద్రోలినాడు. గుణనిధి తిండి లేక మలమటించుచూఓక గుడిలో నివేదన చేసిన శివప్రసాదము దొగిలించి తినెను. అందుకు రాజు భటులువానిని కొట్టి చంపిరి. శివ ప్రసాదము తినుట చేత శివ దూతలు వచ్చి వానిని తమతో కైలాసమునకు తీసుకునిపోయిరి. అతడు శివునికి ప్రీతిపాత్రుడయ్యెను. తర్వాత జన్మలో కళింగ రాజైన అరిందముడుగా పుట్టెను. దీక్షతో కాశీవిశ్వేశ్వరుని సేవించెను. శివుడు పార్వతితో ప్రత్యక్షమయ్యెను. దివ్య దృష్టి ఇచ్చెను. రాజు పార్వతి అందమును చూచుచూ ఉండిపోగాఆమె అతని కనుగ్రుడ్డు ఒకటి పేలిపోవునట్లు శపించెను. శివుడు పార్వతితో వేడు నీ పుత్రుని వంటి వాడు కనుక క్షమించి అనుగ్రహింపుమనగా ఆమె దయతో అతనికి కంటినిచ్చి దీవించెను. శివుడు అతనిని ఉత్తరదిశకు పాలకునిగా జేసి అలకాపురిని రాజధానిగానిచ్చెను. ఉత్తరదిక్కు కుబేరస్థానమైనందున గృహనిర్మాణముచేయునపుడు ఉత్తర దిశను ఖాళీగా ఉంచవలెనని వాస్తుశాస్త్రము. (శివపురాణము)
విశ్రవోబ్రహ్మకు దేవర్ణిని యను భార్య వలన కుబేరుడు జన్మించెను. పుట్టగానే బ్రహ్మ వచ్చి ధనపతి యగునని దీవంచెను. కుబేరుడు తండ్రి దగ్గర చదువులు నేర్చి బ్రహ్మను గూర్చి మూడువేల యేండ్లు తపస్సు చేసెను. బ్రహ్మ సాక్షాత్కరింపగా "నాకు దిక్పాలకత్వమును, ధనాదిపతిత్వమును అనుగ్రహింపుమని కోరెను. ఆయన ఆ వరములను పైగా పుష్పక విమానమును కూడా ఇచ్చెను. కుబేరుడు తండ్రి వద్దకు వచ్చి నాకు నివసించుటకు పురమును నిర్మించి ఇమ్మని కోరగా, విశ్రవుడు, పూర్వము విశ్వకర్మ ధక్షణ సముద్రమద్యమున లంకలో ఒక పురమును నిర్మించినాడనియు దానిలో నీవు నివసింపుమని చెప్పి పంపెను. కుబేరుడు దనములతోను, పుష్పక విమానముతోనూ లంకలో ప్రవేశించె చాలాకాలముండి, తర్వాత రావణాసురునిచే నిర్వాసితుడై అలకానగరమునకు చేరెను. (ఉత్తర రామాయణము)
వేంకటేశ్వరుడు పద్మావతిని వివాహము చేసికొన నిశ్చయించుకొనిధనమును అప్పుగా నిమ్మని కుబేరుని అడిగెను.కలియుగాంతమున అప్పు తీర్చేదనియు, అంతవరకు వడ్డీ కట్టుచుండెదనియు పత్రము వ్రాసి యిచ్చెను. కుబేరుడు ధనమును అప్పుగా ఇచ్చెను. వేంకటేశ్వరుడు దానికి వడ్డీ కట్టుటకై భక్తుల వద్ద నుండి కానుకలు స్వీకరించుచున్నాడు. అందుకే ఆయనకు వడ్డీ కాసులవాడని పేరు. (వేంకటేశ్వర పురాణం)


కేదారేశ్వర వ్రతము

కేదారేశ్వర వ్రత విశిష్ఠత
మానవులకు సర్వసౌభాగ్యంబుల గలుగజేయునదియు, పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందబడినదియునగు కేదారీశ్వర వ్రతం ఈ వ్రతం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులాచరింపవచ్చును. ఈ వ్రతము నిరువదియొక్కమారు లాచరించు పుణ్యాత్ములు సకలసంపద లనుభవించి, పిదప జీవసాయుజ్యంబు నొందుదురు..

వ్రతవిధానము

భాద్రపద శుక్లమునందు శుద్ద మనస్సురాలవై మంగళకరంబులగు నేకవింశతి తంతువులె చేత హస్తమునందు ప్రతిసరమును దరించి యాదినమందు ఉపవాస మొనరించి, మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి, అది మొదలు అమావాస్య వరకు నీవ్రతము నిట్లు సలుపుచు ప్రతిదినమునందును శ్రీమత్కేదార దేవునారాధింపవలెను. మరియు శుద్ధంబగు నొక్క ప్రదేశంబున దాన్యరాశియందు పూర్ణకుంభముంచి యిరువది యొక్క సూత్రములచే జుట్టి పుట్టుపుట్టముల చేత కప్పియుంచి నవరత్నములునుగాని, శక్తి కొలది సువర్ణముగాని యుంచి, గంధపుష్పాక్షతలచే నర్చించి యిరువది యొక్కరైన బ్రాహ్మణులను బిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యంబులాచరించి కూర్చుండ నియోగించి యచ్చట నాకేదారదేవుని ప్రతిష్టింపజేసి, చందనాగరు కస్తూరీ కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను, తాంబూలమును, వస్త్రముల నుంచి నివేదన మొనరించి యథా శాస్త్రముగ ధూపదీపాదులచేత బూజించి యేకవింశతి సంఖ్యాకులైన భక్ష్యభోజ్యచోష్యలేహ్యాదులను కదళీఫలములను నైవేద్యంబుజేసి తాంబూలము లొసంగి, చక్కగా స్తోత్రము జేసి బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి, వ్రతమును లెస్సగా ననుష్ఠించి, ఈశ్వరునకు మనస్సంతుష్ఠి చేసిన యెడల ప్రీతుండై యావృషభద్వజుండు మీరు కోరిన వరంబియ్యగలడు.

కేదారేశ్వర వ్రతకథ

సూతపౌరాణీకుడు శౌనకాది మాహర్షుల గాంచి ఇట్లనియె, ఋషిపుంగవులారా! మానవులకు సర్వసౌభాగ్యంబుల గలుగజేయునదియు, పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందబడినదియునగు కేదారీశ్వర వ్రతం బనునొక వ్రతంబు గలదు. ఆ వ్రత విధానంబును వివరించెదను వినుండు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులాచరింపవచ్చును. ఈ వ్రతము నిరువదియొక్కమారు లాచరించు పుణ్యాత్ములు సకలసంపద లనుభవించి, పిదప జీవసాయుజ్యంబు నొందుదురు. ఓ ఋషి శ్రేష్ఠులారా ! ఈ వ్రత మాహాత్మ్యంబును వివరించెద వినుండు, భూలోకమునందీశాన్యభాగంబున మెరుపుగుంపులుతో గూడి యున్నను గిరిత్కాల మేఘములుంబోలుచు నిఖిలమణి నిర్మితంబైన శిఖరముల చేతను, పలురంగులైన లతావిశేషములచేతను, బహువిదంబులగు పుష్పఫలాదులచేతను, నానావిధములైన పక్షుల చేతను మరియు ననేకంబులైన కొండ కాలువల చేతను వ్యాప్తంబై తాల తమాల రసాల హింతాల వకుళాశోకచందన దేవదారు నారికేళామ్రపనసనాగపున్నాగ చంపకాదివృక్షముల చేతను నదియును గాక నానాతరు విశేషముల చేత భాసిల్లునట్టి ఉద్యానవనముల చేత బ్రకాశించుచూ నిఖిల కళ్యాణ ప్రదంబులై సర్వజన నమస్కృతంబై కైలాసం అని పేర్కొనబడియొక పర్వతశ్రేష్టము గలదు. అందు సద్గుణైశ్వర్యసంపన్నులగు మహనీయులగు యోగులచేతను, సిద్ధ, గంధర్వ, కిన్నెర కింపురుషాదుల చేతను సేవింపబడి మనోహరంబయియున్న యా పర్వత శిఖరమందు జగత్కర్త అయిన పరమేశ్వరుడు ప్రథమగణములచే బరివేష్ఠింపబడి, భవానీ సమేతుడై సకల దేవముని బృందముల చేత నమస్కరింపబడుచుండి, ప్రసన్నుడై కూర్చుండియున్న యొక సమయంబున చతుర్ముఖాది సురలందరికి దర్శనమిచ్చె. అంత సూర్యాగ్ని పవనులు, నక్షత్రయుక్తుండైన నిశాకరుండును మఱియు ఇంద్రాదిదేవతలును వశిష్ఠాది మహర్షులును, రంభా మొదలగు దేవతా స్త్రీలును, బ్రాహ్మీ మొదలగు సప్తమాతృకలను,సేనానియు, గణపతియును, తత్సామీప్యంబును బొందియున్న నంది, భృంగి మొదలగు ప్రమధ గణములు తమను పరివేష్టించి కొలుచుచున్నట్టి భవానీ వల్లభుని యత్యద్భుతమంబగు ఆ సభయందు నారదుడు మొదలగు దేవగాయకులా స్వామి యనుజ్ఞ వడసి గానము జేసిరి. రమణీయంబయి శ్రావ్యంబగు వ్యాదలయలతో గూడి నృత్యమొనర్చిరి. అప్పుడా వేల్పు బానిసెల లోపల మిగుల సొగసుకత్తెయగు రంభ నిఖిల సురబృందముల యొక్క యల్లములు రంజిల్లునటుల నాట్యమొనరించె, ఆ సమయంబున భృంగిరిటి భక్తవరుండా స్వామి సన్నిధియందు తత్ వ్యతిరేకముగా వికట నాట్యము చేయగా నా పార్వతి కైలాసాధిపతియొక్క పూర్వభాగమునందుండెను. అప్పుడు సకల దేవతలకు మిక్కుటమైన హాసముజనించె. అట్టి యాశ్చక్యకరంబగు హాసమువలన నప్పుడా పర్వతగుహలు నిండునటుల గొప్ప కలకలధ్వనికలిగె, ఇట్లు హాసము విస్తరిల్లుచుండ సర్వేశ్వరుండగు శంకరుడా భృంగిరిటిని జూచి, నీచేత మిగలు హర్ష ప్రవృద్ధంబైన నాట్యము చేయబడెనని మెచ్చి మదంబంది యా భక్తుని యనుగ్రహించె. అంతట నా భృంగిరిటికి శివానుగ్రహంబు కలుగటంజేసి ప్రీతుండై సకల విధులచేత గౌరవింపబడి, సమాహితచిత్తుడై వినయముతో గూడి యా పార్వతీదేవిని వదలి యీశ్వరునికి మాత్రము ప్రదక్షిణమొనర్చి యాస్వామికి వందన మాచరించె. అప్పుడు పూజ్యురాలగు మృడానియు చిరునవ్వుతో గూడినదై తన భర్తయగు నప్పరమేశ్వరుని వీక్షించి ఓ స్వామీ ! ఈ భృగిరిటి నన్ను విడిచి మీకు మాత్రము ప్రదక్షిణం బాచరించుటకు గారణంబేమి? వినవేడుకైయున్నది? ఆనతీయవో యని వేడగా, నా శశిశేఖరుండు ఓ ప్రియురాలా ! చెప్పెద వినుము.
పరమార్థవిదులగు యోగులకు నీవలన ప్రయోజనంబులేమింజేసి నాకు నమస్కరించెనని సెలవివ్వగా నా పరమేశ్వరి మిగుల వ్రీడనుబొంది ఆ భర్తయందున్న తన శక్తి నాకర్షించగా స్వామి త్వగస్థి విశిష్టామాత్రానయవుండాయె. అంతట నాదేవియు సారహీనురాలై వికుటరాలయ్యె, పిదప నాదేవి కోపించి దేవతల చేత నూనడింపబడినదై కైలాసమును వదలి తపంబొనరించుటకు బహువిధములగు సింహ, శరభ, శార్దూల, గజ, మృగాదులచేత సేవింపబడియు నిత్య వైరంబుడిగియున్న పన్నగ గరుడాది సకల జంతువులచేత నిబిడంబగు నానావిధ వృక్ష, లతా, గుల్మాది భూయిష్టంబై ఋషి శ్రేష్ఠ సేవితంబై సర్వాభీష్ఠ ప్రదంబై యున్న గౌతమాశ్రమమున బ్రవేశించె. అంత నా గౌతముండు వన్యంబులైన హోమయోగ్యంబులగు సమిత్కుశ ఫలాదులను గ్రహించుకొని వనంబునుండి వచ్చునెడ తన ఆశ్రమ భాగమున వెలుగుచున్న ప్రకాశమును జూచి ఋష్యాశ్రమంబగు నిది మిగుల శోభిల్లుచున్న రేకులవంటి కన్నులు గలిగి యలంకృతరాలైయున్న యామహేశ్వరింగనుకొని పూజ్యురాలవైన ఓ భగవతీ ! నీవిచటకేతెంచుటకు కారణంబేమి? అని యడుగ నద్దేవియు నాజడధారికి తన విషాదకరమును వచించి నమస్కరించుచు ఓయీ ! మునీశ్వరుడా ! యే వ్రతము యోగ సమ్మతంబైనదో ఏ వ్రతానుష్టానము చేత శంకర దేహార్థము నాకు ఘటించునో యట్టి వ్రతము ఉపదేశిపుము మనగా ఆ మహర్షి సకల శాస్త్ర పురాణావలోకనంబాచరించి యీప్సితార్థప్రదంబగు శ్రీమత్కేదారనామకంబైన ఉత్తమ వ్రతము నాచరింపుమని ఉపదేశింపగా నంత నాదేవియు నావ్రతానుష్ఠాన క్రమంబానతీయుమని వేడగానిట్లు చెప్పదొడంగె. భాద్రపద శుక్లమునందు శుద్ద మనస్సురాలవై మంగళకరంబులగు నేకవింశతి తంతువులె చేత హస్తమునందు ప్రతిసరమును దరించి యాదినమందు ఉపవాస మొనరించి, మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి, అది మొదలు అమావాస్య వరకు నీవ్రతము నిట్లు సలుపుచు ప్రతిదినమునందును శ్రీమత్కేదార దేవునారాధింపవలెను. మరియు శుద్ధంబగు నొక్క ప్రదేశంబున దాన్యరాశియందు పూర్ణకుంభముంచి యిరువది యొక్క సూత్రములచే జుట్టి పుట్టుపుట్టముల చేత కప్పియుంచి నవరత్నములునుగాని, శక్తి కొలది సువర్ణముగాని యుంచి, గంధపుష్పాక్షతలచే నర్చించి యిరువది యొక్కరైన బ్రాహ్మణులను బిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యంబులాచరించి కూర్చుండ నియోగించి యచ్చట నాకేదారదేవుని ప్రతిష్టింపజేసి, చందనాగరు కస్తూరీ కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను, తాంబూలమును, వస్త్రముల నుంచి నివేదన మొనరించి యథా శాస్త్రముగ ధూపదీపాదులచేత బూజించి యేకవింశతి సంఖ్యాకులైన భక్ష్యభోజ్యచోష్యలేహ్యాదులను కదళీఫలములను నైవేద్యంబుజేసి తాంబూలము లొసంగి, చక్కగా స్తోత్రము జేసి బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి, వ్రతమును లెస్సగా ననుష్ఠించి, ఈశ్వరునకు మనస్సంతుష్ఠి చేసిన యెడల ప్రీతుండై యావృషభద్వజుండు నీవు కోరిన వరంబియ్యగలడు అని వచించిన నా కాత్యాయనియునట్లే యగును గాక ! యని యాచరించె. అంత పరమశివుండు సంతుష్ఠాతరంగుడయి , యిచ్చటికి దేవగుణంబులతోడ వచ్చి నిజశరీరార్థము నీకిచ్చెదననగా పార్వతి యుప్పొంగి శంకర దేహార్థమునండి లోకానుగ్రహము చేయదలచి తన భర్తయగు నీశ్వరునితో నీ వ్రతంబాచరించిన వారలకు సకలాభీష్టసిద్ది గలుగునటుల యనుగ్రహించితిరేని యెల్లవారు నాచరింతురనగా నట్లే యగుగాక! యని యంగీకరించి సురసంఘములతో గూడ నంతర్హితుండయ్యె. మరికొంత కాలమునకు శివభక్తి యక్తుండగు చిత్రాంగదుడను గంధర్వుండు నంది కేశ్వరునివలన నా వ్రతక్రమంబెఱిగి మనుష్య లోకమునకుంజని వారల కుపదేశింప వలయునను నిచ్ఛగలవాడై యుజ్జయనీ పట్టణమునకు బోయి వజ్రదంతుడను రాజున కుపదేశింప నతడు ఆ వ్రతమును గల్పోక్త ప్రకారంబుగా నాచరించి సార్వభౌముండాయెను.
మరికొంత కాలమునకు నా పట్టణంబుననున్న వైశ్యునకు బుణ్యవతియనియు, భాగ్యవతియనియు, నిద్దరు కుమార్తెలు గలిగిరి. వారిద్దరును తండ్రియొద్దకుబోయి కేదారవ్రత మాచరించునట్లాజ్ఞ యొసంగుమని వేడగా నేనుమిగులరిక్తుండను. దానికీవలయుసామాగ్రి లేమింజేసి మీ సంకల్పంబు మాను డనగా ఓ తండ్రీ ! నీ యాజ్ఞ మాకు పరమదన్యంబు గాన నాజ్ఞయొసగు మని సెలవు పుచ్చుకొని బాదరించుట వటవృక్షమూలంబున కూర్చుండి ప్రతిరసము గట్టుకొని యధావిధిగా పూజింప వారల భక్తికిమెచ్చి యీశ్వరుడు అప్పుడు వలయుసామాగ్రినిచ్చెను.
అంతట వారలు చక్కగా వ్రతం బాచరించుటవలన నమ్మహాదేవుడు ప్రీతుండై యక్కన్యల కాయురారోగైశ్వర్యములును దివ్యరూపంబుల ఒసంగి యంతర్హితుడయ్యెను. పిమ్మట నావ్రతమాహాత్మ్యము వలన నుజ్జయనీ పట్టణమేలుచున్న రాజు పుణ్యవతియును కన్యను చోళభూపాలుడు భాగ్యవతియును కన్యను పాణీగ్రహ మొనర్చినందువలన నావైశ్యుండు ధనసమృద్ధుండై సామ్రాజ్య సంపదలను, పుత్రులను బొంది సుఖంబున నుండ నంత వారిలో రెండవదియైన భాగ్యవతియనునది యైశ్వర్యమదమోహితురాలై కొంతకాలమునకు నా వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పెనిమిటి చేత వెడలింపబడి పుత్రునితోడ యడవిని తిరిగి సంచారఖిన్నురాలై ఒక బోయవాని యిల్లుచేరి, ఇచ్చట తన బుత్రుని జూపి యోపుత్రా! యక్కయగు పుణ్యవతిని యుజ్జయనీ పట్టణరాజు వివాహమాడియున్నాడు. నీవచ్చటికి జని దానింజూచి ధనము తీసుకొని శీఘ్రముగా రమ్మనగా నతండా పట్టణమునకు బోయి పెద్దతల్లికి తనయొక్క దుస్సహంబగు కష్టమును దెలపగా నా పుణ్యవతియును సుతునకు విస్తారముగా దనమునిచ్చె, అంతనంతండా ధనమును దీసుకొనివచ్చునెడల మార్గంబున నదృశ్యరూపుండైన యద్దేవునివలన నాధనము నపహరింపబడగా దోదూయమాన మానసుండై నిలువబడియున్న వానితో నీశ్వరుండదృశ్యుండై యో చిన్నవాడా ! వ్రతభ్రష్ఠుల కీధనము గ్రహించనలవిగాదని చెప్పగా నావాక్యము విని విస్మయంబంది యా చిన్నవాడు మరల పూర్వమువలె నచటికింజని యీశ్వరోక్తంబగు వృత్తాంతమును దెలుపగా నా పుణ్యవతి యాలోచించి పుత్రుని వ్రతం బొనర్రింపజేసి తన చెల్లెలు వ్రతమాచరించునటుల చెప్పవలయునని ద్రవ్యము నొసంగి పంపగా నతండు బయలు వెడలి వచ్చునెడ మార్గంబున నప్రయత్నంబుగ పూర్వము గొనిపోయిన ధనమంతయు స్వవశమైనందున సంతసించి, సర్వము గ్రహించుకొని కాంచీపట్టణమును ప్రవేశించి సమయంబునకు జనియె . అంతట తల్లిదండ్రులతో గూడి సుఖముల ననుభవించుచుండె. పిమ్మట తల్లియగు భాగ్యవతియును తండ్రియగు చోళరాజును నదిమొదలు ఈ వ్రతము నాచరించుచు ఈ అవిచ్చిన్నంబగు నిఖిల సంపదల ననుభవించుచుండిరి, కావున యెవ్వరైనను యదోక్త ప్రకారము నీ వ్రత మహత్మ్యమును భక్తియుక్తులైన వినిన, చదివిన నట్టి వారందరును, శ్రీ మహాదేవుని యనుగ్రహము వలన ననంతంబులగు నాయురారోగ్య ఐశ్వర్యములను బొంది సుఖంబు లనుభవించి శివసాయుజ్యమును బొందుదురని గౌతమ మహర్షిచే చెప్పబడెనని సూతుండు శౌనుకాదులకు చెప్పగా శ్రీ వ్యాసభట్టారsకుడు స్కాంద పురాణమునం దభివర్ణించెను.


కేదారేశ్వర వ్రతకథ సంపూర్ణము.

శ్రీ పసుపు గణపతి పూజ

శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)
శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
(గంటను మ్రోగించవలెను)
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ప్రాణాయామము
(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
సంకల్పం
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీ కేదారేశ్వర ప్రీత్యర్థం, శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్చ దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
తదంగత్వేన కలశారాధనం కరిష్యే
కలశారాధనం
శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)
శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)
మం // ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
(అక్షతలు వేయవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి
(గంధం చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.
మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి
(అగరవత్తుల ధుపం చూపించవలెను.)
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
(బెల్లం ముక్కను నివేదన చేయాలి)
ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
(నీరు వదలాలి.)
తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.
(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)
ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)
తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.
శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)


అష్టోత్తర శతనామావళి

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం శశిరేఖాయ నమః
ఓం పినాకినే నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శూలపాణయే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం అంబికానాధాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం శితికంఠాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కామారయే నమః
ఓం గంగాధరాయ నమః
ఓం కాలకాలయ నమః
ఓం భీమాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
ఓం సర్వమయాయ నమః
ఓం అశ్వనీరాయ నమః
ఓం పరమాత్మవే నమః
ఓం హవిషే నమః
ఓం సోమాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం కపర్ధినే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భవాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం కపాలినే నమః
ఓం అంధకాసురసూదనాయ నమః
ఓం లలాటక్షాయ నమః
ఓం కృపానిధయే నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం జటాధరాయ నమః
ఓం కవచినే నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషభరూఢాయ నమః
ఓం సోమప్రియాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
ఓం యజ్జమయాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం గణనాధాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం దుర్ధార్షాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం భుజంగభూషణాయ నమః
ఓం గిరిధన్వినే నమః
ఓం కృత్తివాసనే నమః
ఓం భగవతే నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం జగద్వాయ్యపినే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం అహిర్భుద్న్యాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం సాత్వికాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం అజాయ నమః
ఓం మృణాయ నమః
ఓం దేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం భగనేత్రవిదే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం తారకాయ నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం అనఘాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిప్రయాయ నమః
ఓం పురారాతయే నమః
ఓం ప్రమధాధిపాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్గురవే నమః
ఓం మహాసేన జనకాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం స్థాణవే నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం శుద్ద విగ్రహాయ నమః
ఓం ఖండపరశువే నమః
ఓం పాశవిమోచకాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం హరాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అనంతాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం శ్రీ సదాశివాయ నమః

కార్తిక మాసం పూజ విధులు 2013

దినసంఖ్య తిథి పూజ విధులు
1
పాడ్యమి ( 14-11-2012 )
   మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము
2
విదియ ( 15-11-2012)
  శివష్ఠోత్తర శతనామవళిః ( 12 సార్లు పారాయణము చేయవలెను)
3
తదియ ( 16-11-2012 )
  చంద్రశేఖరాష్ఠకమ్ 8సార్లు పారాయణము చేయవలెను
4
చవితి ( 17-11-2011 )
  గణనాయకాష్ఠకమ్ 8సార్లు పారాయణము చేయవలెను
5
పంచమి ( 18-11-2012 )
  శివపంచాక్షరీ స్తోత్రమ్ 8సార్లు పారాయణము చేయవలెను
6
షష్ఠి (19-11-2012 )
   సుబ్రహ్మణాష్ఠకమ్ 8సార్లు పారాయణము చేయవలెను
7
సప్తమి ( 20-11-2012 )
  బిల్వాష్ఠకమ్ 8సార్లు పారాయణము చేయవలెను
8
అష్ఠమి ( 21-11-2012 )
  రుద్రకవచమ్ (11 సార్లు పారాయణము చేయవలెను)
9
నవమి ( 22-11-2012 )
   శివ స్తోత్రమ్ (11 సార్లు పారాయణము చేయవలెను)
10
దశమి ( 23-11-2012 )
  విశ్వనాధాష్ఠకమ్ 8సార్లు పారాయణము చేయవలెను
11
ఏకాదశి ( 24-11-2012 )
   ఏకాదశ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము చేయిచుకొనవలెను
12
ద్వాదశి ( 25-11-2012 )
  క్షీరాబ్ది ద్వాదశి వ్రతము
13
త్రయెదశి ( 26-11-2012 )
   శనికి తైలాభిషేకము
14
చతుర్దశి ( 27-11-2012 )
   శివాష్ఠకమ్ 8సార్లు పారాయణము చేయవలెను
15
పౌర్ణమి ( 28-11-2012 )
  కేదారేశ్వర వ్రతము
16
బ.పాడ్యమి ( 29-11-2012 )
  లింగాష్ఠకమ్ 8సార్లు పారాయణము చేయవలెను
17
విదియ ( 30-12-2012 )
   రుద్రాష్ఠకమ్ 8సార్లు పారాయణము చేయవలెను
18
తదియ ( 01-12-2012 )
  ఉమామహేశ్వరాష్ఠకమ్ 8సార్లు పారాయణము చేయవలెను
19
చవితి ( 02-12-2012 )
   సంకటనాశన గణేశ స్తోత్రమ్ 8సార్లు పారాయణము చేయవలెను
20
పంచమి ( 03-12-2012 )
   శివనామావళ్యాష్ఠకమ్ 8సార్లు పారాయణము చేయవలెను
21
షష్ఠి ( 04-12-2012 )
   సుబ్రహ్మణ్యకరావలంబ స్తోత్రమ్ 8సార్లు పారాయణము చేయవలెను
22
సప్తమి ( 05-12-2012 )
   శివద్వాదశనామస్మరణమ్
23
అష్ఠమి ( 06-12-2012 )
  పార్వతీవల్లభనీలకఠాష్ఠకమ్ 8సార్లు పారాయణము చేయవలెను
24
నవమి ( 07-12-2012 )
  ఉమామహేశ్వర స్తోత్రమ్ 11 సార్లు పారాయణము చేయవలెను
25
దశమి ( 08-12-2012 )
   శివమానస పూజాస్తోత్రమ్ 11సార్లు పారాయణము చేయవలెను
26
ఏకాదశి ( 09-12-2012 )
  శ్రీ సత్యనారయణ స్వామి వ్రతము
27
ద్వాదశి ( 10-12-2012 )
   ద్వాదశ జ్యోతిర్లిలింగస్తోత్రమ్ 8సార్లు పారాయణము చేయవలెను
28
త్రయెదశి ( 11-12-2012 )
   శని కి తైలాభిషేకము చేయించగలరు
29
చతుర్దశి ( 12-12-2012 )
  శివప్రాతఃస్మరణ స్తోత్రమ్ 11సార్లు పారాయణము చేయవలెను ,   తులసీ కార్తీక దామోదర వ్రతము
30
అమావాస్య ( 13-12-2012 )
   శతరుద్రీయమ్ (పారాయణము తో అభిషేకము చేయవలెను)

   ఇట్లు 
 మీ సుబ్రహ్మణ్యం శర్మ

కార్తీకమాసము

కార్తీకమాసము


కార్తీకమాసంతో సమానమైనమాసం, విష్ణువుతో సమానమైన దైవం, వేదంతో సమానమైన శాస్త్రం,గంగతో సమానమైన తీర్దం లేదని చెప్తారు. సూర్యుడు తులారాశిలోకి రాగానే కార్తీకమాసం ఆరంభమైంది.
పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు. శివ కేశవులకు అద్యంత ప్రియమైన ఈ మాసంలో ఆచరించవలసిన వ్రతాలు,చేయవలసిన దీపారాధనల గురించి….
కార్తీకమాసంలో ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల మొత్తం తెల్లవారుజాముల నదీతీరంలోగాని, చెరువులు, కొలనులు, బావుల వద్ద స్నానం చేయాలి. స్నానానంతరం ఓం ప్రభాకరాయనమః, ఓం దివాకరాయమః, ఓం ప్రభాకరాయమః, ఓం అచ్చుతాయమః, ఓం నమో గోవిందాయనమః అనే నామాలను స్తుతిస్తూ సూర్యభగవానునికి ఆత్గ్యం పోయాలి. ఈ నెల మొత్తం ఇంటి ముందున్న ప్రధాన ద్వారానికి రెండువైపులా దీపాలను వెలిగించాలి.

ఉత్థాన ఏకాదశి

ఈ మాసంలో వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశి ఎంతో వైశిష్ట్యం వుంది.ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు.దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఉత్థాన ఏకాదశినాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉపవాసం వుండి మరుసటిరోజు ద్వాదశి పారయణం చేస్తే ఎంతో మంచిది. ఈ కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైబోవోపేతంగా పూజలందుకుంటారు ప్రధానంగా భక్తులు కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీ-సమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిసే పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మిక.

కోరికలను తీర్చే దీపపు కాంతులు

పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదులుతుంటారు. ఈ సమయంలో కోరుకున్న కోర్కెలు నెరవేరతాయనే సంకల్పంతో వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు.
పూర్వం శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నైమి శారణ్యంలో నివసిస్తున్న అదిగురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి ఋషులకు బోధించాడు. ఇలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కుడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నారదనికి, మహావిష్ణువు లక్ష్మిదేవికి ఈ వ్రతవిధానం చెప్పారు. దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం.కార్తీక పౌర్ణమిరోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇవాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది.


కార్తీక సోమవారాలు - నదీస్నానాలు

కార్తీకమాసం వచ్చిన వెంటనే నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీకమాసంలో వేకువవేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరి మితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముక్ష్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.


కార్తీక పౌర్ణమి

కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.


వనభోజనం

కార్తీకమాసం అంటేనే వనబోజనాల మాసం అని చెప్పుకోవచ్చు. ఉసరిచెట్టుక్రింద శ్రీ మహావిష్ణువుని ఫోటో పెట్టి పూజించడంతో పాటు అదే చెట్టుక్రింద సహబంతి భోజనాలు చేయాలి.

క్షీరాబ్ది ద్వాదశి:

అలాగే ఏకాదశి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీర సాగరం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. ఆ కారణం చేతనే ఈ రోజున తులసి దగ్గర విశేష పూజలు జరుపుతుండటం ఆచారంగా వస్తోంది. ఈ ద్వాదశినే మధన ద్వాదశి అని కూడా అంటారు.
దేవ దానవులు సముద్రాన్ని మధించింది.. కార్తీక శుద్ధ ద్వాదశి నాడని, దానికి గుర్తుగానే ఈ ద్వాదశిని జరుపుకోవడం ఆచారమైందని పెద్దలంటారు. ఈ రోజున కడలిలో శయనించిన విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశినాడు, లక్ష్మీ, బ్రహ్మలాంటి దేవతలందరితో కలిసి తులసి దగ్గరకు వస్తాడు. ఆ రోజున సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించిన దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. 
ఇంకా కార్తీక ద్వాదశి రోజున తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుచేత కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శివ, విష్ణువులతో పాటు తులసీ కోటను కూడా పూజించేవారికి ఈతిబాధలు తొలగి, సకల సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా ఈ రోజుల్లో శైవ, వైష్ణవ క్షేత్రాలను దర్శించుకునే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

కార్తీకమాస వ్రతాలు

కేదారేశ్వర వ్రతం

చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.

అఖండమాస సౌభాగ్యవ్రతం

వివాహితులు ఈ అఖండ సౌ భాగ్యాలను చేస్తారు. భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలంటూ చంద్రునికి ఆద్యం ఇచ్చి వ్రతాన్ని పూర్తి చేస్తారు. కార్తీక చతుర్థశి నాడు చేసే ఈ వ్రతంలో స్త్రీలు శివపార్వతులను కార్తీకేయుని,గౌరీదేవిని పూజించాలి. పాండవులు వనవాసం చేసే రోజులలో అర్జనుడు ఇంద్రనీలాద్రిపై తపస్సుచేయడానికి వెళ్లాడు.ఎంతకాలమైన తిరిగి రాలేదు. అర్జనుడు రాకపోవడానికి కారణాలు తెలిపాక ద్రౌపతి ఎంతో బాధపడింది. అర్జనుడు తిరిగి రావాలంటే సౌబాగ్యవ్రతం చేయాలంటూ కృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతమహాత్యం,వ్రతవిధానం వివరించాడు.

గోవత్స ద్వాదశి ఉత్సవం

ఈ మాసంలో వచ్చే కృష్ణ ద్వాదశిన గోవత్స ద్వాదశి అంటారు. ఆ రోజు వ్రతం చేసుకునే వారు తెల్లవారుజామున లేచి నదీస్నానం చేయాలి. రోజుమొత్తంమీద ఒక్కపూట భోజనం చేయాలి. దూడతో కూడిన ఆవును పూజిస్తారు.

గోత్రి రాత్రీ వ్రతం

ఈ వ్రతాన్ని కార్తీక కృష్ణాత్రయోదశనుండి అమవాస్య వరకు చేస్తారు. గోవర్దునికి రెండు వైపుల రుక్ష్మిణి, సత్యభామలు, బాలచంద్రడు, యశోద తదితర ఫోటోలు పెట్టి పూజించి, తదుపరి గోమాతను పూజంచాలి. తెల్లవారుజామున లేచి స్నానంచేసి గాయిత్రిమంత్రంతో 110 పిడికిళ్లు నువ్వులను ఆహుతిఇచ్చి వ్రతాన్ని పూర్తిచేయాలి.


ఇట్లు

   మీ సుబ్రహ్మణ్యం శర్మ

నాగులచవితి విశిష్ఠత

నాగులచవితి విశిష్ఠత

నాగుల చవితి - కార్తీకశుద్ద చతుర్దశి నాడు - దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం . అలా నాగ మహిమతో పుటిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం.

ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.

ఈ రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి ఈ పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.

నాగులచవితి పాటలు కూడా మన తెలుగువారిలో ఎంతో ప్రసిద్ధం:

నన్నేలు నాగన్న , నాకులమునేలు ,
నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు .
పడగ తొక్కిన పగవాడనుకోకు ,
నడుము తొక్కిన నావాడనుకొనుము .
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .
ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము.పిల్లల మూకను నాకిమ్ము .

అని పుట్టలో పాలు పోస్తూ , నూక వేసి వేడుకుంటారు .అలాగే,

పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....

అంటూ తాము పోసిన పాలు నాగేంద్రుడు తాగితే, తమ మనసులోని కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం.

ఆలయాలలో నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున తిరుమలలో కోనేటిరాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. అలాగే గురువారం వాహన సేవకు ఆరోజంతా వుపవాసముండి మరునాడు పారాయణ చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువులకాపరి కూడా ప్రభువు అవుతాడంటారు !

కాని పాములకు పుట్టలో పాలు పోయడం వల్ల వాటి ప్రాణాలకు హాని అని,అందుకని వాటి సహజ నివాసములలో పాలూ, గుడ్లూ వెయ్యొద్దని చెప్తున్నారు. దానికి బదులు ఇళ్ళలోనే బియ్యం పిండితో నాగ మూర్తులను చేసి, వాటికి శాస్త్రోక్తంగా అన్నీ సమర్పించవచ్చు.

ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. నాగుపాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకుంటే అంతకన్నా గొప్ప పూజ ఇంకొకటి ఉంటుందా?

తేగలు అంటే చాలా మందికి చిన్నచూపు కానీ వీటిలో పీచుపదార్ధము మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది .ప్రకృతి మనకు అందించిన మంచి ఆహారము తేగ .

      ఇట్లు

   మీ సుబ్రహ్మణ్యం శర్మ

 

పంచలోకపాలక పూజ

ఆచమ్య, పూర్వోక్తెవంగుణ విశేషణ విషిష్ఠాయాం శుభతిథౌ, శ్రీ సత్యనారాయణ వ్రతాంగత్వేన గణపత్యాదిపంచలోక పాలకపూజాం,ఆదిత్యాది నవగ్రహపూజాం, ఇంద్రాద్యష్టదిక్పాలకపూజాం చ కరిష్యే.

1. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం,జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్పత ఆ న శ్శృణ్వ న్నూతిభిస్సీదసాదనమ్. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం గణపతిం లోక పాలక మావాహయామి, స్థాపయామి,పుజయామి.

2. ఓం బ్రహ్మదేవానాం,పదవీః కవీనా మృషి ర్విప్రాణాం మహిషో మృగాణాం, శ్వేనో గృధ్రాణాగం స్వధితిర్వనానాగం సోమః పవిత్ర మత్యేతి రేభన్, సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బ్రహ్మాణం లోక పాలక మావాహయామి, స్థాపయామి,పుజయామి.

3. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేథా నిదధే పదం, సమూఢ మస్యపాగం సురే. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం విష్ణుం లోక పాలక మావాహయామి, స్థాపయామి, పుజయామి.

4. ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీడుష్టమాయ తవ్యసే, వోచేమ శంతమగం హృదే, సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం రుద్రం లోక పాలక మావాహయామి, స్థాపయామి, పుజయామి.

5. ఓం గౌరీ మిమాయ సలిలాని తక్ష త్యేకపదీ ద్విపదీ సాచతుష్పదీ, అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమేవ్యోమన్. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం గౌరీం లోక పాలిక మావాహయామి, స్థాపయామి,పుజయామి.

గణేశాది పంచలోకపాలక దేవతాభ్యోనమః, ద్యాయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూప మఘ్రాపయామి,దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి.

గణేశాది పంచలోకపాలక దేవతాప్రసాద సిద్ధిరస్తు.

ఇట్లు 
మీ సుబ్రహ్మణ్యం శర్మ

 

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...