Friday, November 23, 2018

చీకటి వెలుగుల జీవితం నా లోగిలి

ఓ తల్లిని ..... చంటి బిడ్డడు ... వదలలేక  అదుముకున్నట్టు
వదిలి ఉండలేనట్టు , విడిచి మనలేనట్టు , తట్టుకోలేనట్టు
ప్రభూ ........ నీ  కాళ్లకు చుట్టుకున్నాను /పట్టుకున్నాను .....

నీ మేని స్పర్శ .... పవిత్ర తరంగమై ... లోన  పాకుతూ
నా లోని   అణువణువును  పలుకరిస్తూ , తాకుతూ
కదుల్తోంది ....ఉత్కృష్ట  దివ్య   మోహన చైతన్యమై ........

నిను చుట్టిన నా చేతులు ....కమలాలై ... నీ పాదాలు ఒత్తుతూ
ఆ చేతుల  భాగ్యానికి ..... నేనై  తనివితీరా పొంగిపోతూ
ఆ ఆనంద  సేవనం లో  భక్తి ప్రభావాన తన్మయమై ........

ఈ  అద్భుత పారవశ్యానికి .... కన్నులు  చెమరుస్తూ
కట్టలుదాటి ,ఉప్పొంగి ... నిన్ను తాకి మురిసిపోతూ
తమ పుణ్యానికి ...  ఆ అశ్రుధారలు ...నీకు ప్రేమాభిషేకమై .......
 ప్రభూ ........ ........ ...... 
నిను చుట్టుకున్నది ...   నేను కాదయ్యా  .... నా భక్తి పారవశ్యం
నీకు అంటుకు పోయిన ఆనందమే నయా.... అదే.అదే . నీ ప్రేమ వాత్సల్యం .

వదలలేకున్నా తండ్రీ ...... నీవే  శరణు ....శరణు ......

ఈ చీకటి వెలుగుల జీవితం ... నీ శరణు  లోనే కదా సాధ్యం
నీ నామ   స్మరణమే .... ఎగుడు దిగుళ్ళ మా పయనంలో సాయం
నీ దివ్య కారుణ్యమే ..... మా  ప్రారబ్ధ సమస్యలకు  సమాధానం
నీ చరణ  సన్నిధానం .....కాదా . మా జన్మ జన్మల  భాగ్యం

నిను నమ్మిన వారికీ ....... లేదు కదా తండ్రీ  నాశనము
నీవే  దిక్కని  కొలిచిన  వారికి .... ఇత్తువుగా అభయ దానము
శరణు  ప్రభు ...... శరణు ...... శరణు ...... శరణు .......
"నా హృదయపు లోగిలి"
   Written by_గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...