Friday, November 23, 2018

శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం

 ఆలయ ప్రత్యేక కథనం

తద్కమల్ల గ్రామం, వరంగల్ జిల్లా 

అమ్మవారి వైభవం:

శాఖవెల్లి మల్లికార్జున భట్టు హనుమకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళీదేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటనే నిలుపుతానని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి, సు దర్శనమిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట. ఇది కేవలం దైవీశక్తి కాని, మానవశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగా శ్రీ భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటి నుంచే కనిపిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోనివా డు. కనుక ప్రతాపరుద్రుని కాలంనాటికే భద్రకాళీ దేవాలయం ప్రసిద్దమై ఉండినట్లు స్పష్టమవుతుంది.

1950లో ఒకరోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేష్‌ శాస్ర్తి, స్థానిక శ్రీవైష్ణవ పండితులు శ్రీమాన్‌ ముడుంబైరామానుజా చార్య నగరంలో ఉన్న ఒక ప్రముఖ వ్యాపారి మగన్‌లాల్‌ సమేజా గారి వద్దకు ఆలయ పునరుద్ధరణకు సహకరించవలసిందిగా కోరడానికి మరునాడు ఉదయం వెళ్దామని నిశ్చయించుకున్నారు.

అదే రాత్రి శ్రీమగన్‌ లాల్‌ సమేజా గారికి అమ్మవారు కలలో కనపడి రేపు నీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వారితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అమ్మవారు ఆదేశించిందట...మరునాడు ఉదయం తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా భావించి ఆ వ్యాపారి ఆలయానికి వచ్చి అమ్మ వారిని దర్శించి నా కుమార్తెకు పడిపోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునురుద్దరణకు నావంతు సహకారం అందిస్తానని శాస్ర్తి గారికి మాట ఇవ్వగా శ్రీ గణేశ శాస్ర్తిగారు ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకించిన జలాన్ని ఒక మాసం వరకు క్రమం తప్పకుండా శ్రీమగన్‌ లాల్‌ సమేజా గారి కూతురికి తీర్థం పెట్టడం ద్వారా ఆమెకు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చింది.

అమ్మవారికి మహిమకు ముగ్ధుడైన శ్రీమగన్‌లాల్‌ సమేజా ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. ఆ సందర్బంలో ఆయనకు శ్రీ విద్యా నిధియైన బ్రహ్మశ్రీ హరి రాధాకృష్ణమూర్తి, తాండ్ర వెంకటరామనర్సయ్య, అడ్లూరి సీతారామశాస్ర్తి, వంగల గురువయ్య, టంకసాల నరసింహారావు, మహాతపస్వి ని మంగళాంబిక ఇలా ఎంతోమంది మహనీయులు ఎందరో చేసిన సహకారం చిరస్మరణీయం.

కాకతీయ రాజు ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగార మై వారి కోర్కెలను తీరుస్తూ ఉన్నట్లు... ‘పతాపరుద్ర చరిత్రము’, ‘సిద్ధేశ్వర చరిత్రము’ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. 

భద్రకాళీ అమ్మవారు. ఈ దేవాలయంలో దేవివిగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అలరారుతూ, భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు ప్రేతా సనాసీనయై ఉన్నది. కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గం, ఛురిక, జపమాల, డమరుకం... ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలం, ఛిన్నమస్తకం, పానపాత్రలు ధరించి... 8 చేతులతో... అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్న భద్రకాళి అమ్మవారి విశేషాలు 

ఆలయ చరిత్ర:

శ్రీ భద్రకాళీ దేవాలయము క్రీ.శ.625 లోనే నిర్మించిపబడిందని స్థానికుల కథనం. వేంగీ చాళుక్యులపైన విజయం సాధించటానికి, పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి ఈ ఆ లయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించి నట్లు చెబుతారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిలమీద చెక్కబడి ఉండటమే. ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కటం చాళుక్య సంప్రదాయంలో కనిపిస్తుంది. రెండవది ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూలస్తంభాలు చతురస్రాకారం లో ఉన్నాయి. కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది. ఆ కారణాల వల్ల ఈదేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మింపబడిందని కొందరి ఊహ.

క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. అదీ కాక హైదరాబాదు సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన, రజాకార్ల దుశ్చర్యల ఫలితంగా దాదాపు క్రీ.శ. 1950 వరకూ ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు. 

అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానం, ఆ స్తంభాలను నిలబెట్టిన విధానం, విశాలమైన ముఖ ద్వారం అన్నీ కాకతీయుల కాలంలో నిర్మింపబడిందేనని అనిపిస్తుంది. 
స్తంభశాస నాలను బట్టి ఈ దేవాలయం క్రీ.శ.10వ శతాబ్దంలో కాకతీయులచే నిర్మింప బడి ఉంటుందని ఊహించవచ్చు. 
ఏమైనప్పటికీ కనీసం వెయ్యు సంవత్సరాల చరిత్రగలది ఈ శ్రీ భద్రకాళీ దేవాలయం.

1950లో పునరుద్ధరించే సమయం వరకూ అమ్మవారు వ్రేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది. ప్రాచీనకాలంలో కూడా అట్లాగే భయంకరంగా ఉండేదట అలాంటి రౌద్రస్వరూపిణిని నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు. (దక్షిణాచార సంప్రదాయం ప్రకారం అర్చింపబడే మూర్తి శాంత స్వరూపంగా ఉండాలనేది శాస్త్ర విధి). అంతేగాక అమ్మవారి గుడిలో శ్రీచండీయంత్ర ప్రతిష్ఠ చేసి, ప్రతి సంవత్సరమూ శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతి నిత్యం దూపదీప నైవేద్యాదులు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు.

భద్రకాళీ చెఱువు:

ఆమ్మవారికి ఎదురుగా పెద్ద చెఱవు ఒకటి ఉన్నది. దానినే భద్రకాళీ చెఱవు అంటారు. వరంగల్‌ నగర ప్రజలకు తాగునీటి సరఫరా ఈ చెఱవు నుండే జరుగుతుంది.

ఆలయం చేరుకోవటం ఎలా:

వరంగల్‌-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలి టెక్నిక్‌ కాలేజీ నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరాన... గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంత మైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది
ఈ ఆలయం వరంగల్ కి 5 కి.మీ లో కలదు

అమ్మవారి అనుగ్రహం తో మిత్రులందరికీ 
తెలంగాణ తీర్థం వారి శుభాకాంక్షలు

మీ
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ...
సహకారం
నా మిత్ర బృందం 

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...