Thursday, March 29, 2018

శ్రీ యోగావసిష్టమ్-4

శ్రీ వసిష్ట మహా రామాయణము

      *ప్రథమ స్సర్గః*

*కర్మలయందు విముఖుడైన కారుణ్యునికి అతని తండ్రి అగ్ని వేశ్యుడు ఈ విధంగా చెప్పుచున్నాడు *

*అగ్నివేస్య ఉవాచ --:*

కిమే తత్ పుత్ర ! కురుషే పాలనం న స్వకర్మణః?।(12)

పుత్రా ఇదేమి ? నీవు స్వ ధర్మమును పాలించుటలేదు ?( కర్మలనాచరించుట లేదు )

అకర్మనిరతః సిధ్ధిం కథం ప్రాప్స్యసి తద్వద ।
కర్మణో ౽సాన్నివృత్తేః కిం కారణమ్ తన్నివేద్యతాం ॥
(13)
నీవు కర్మవివర్జితుడవై సిథ్థి నెట్లు పొందెదవో నాకు తెలియచెప్పుము! మఱియు కర్మల నెందులకు త్యజించితివో నుడువుము ( తెలుపుము)

🥀 *కారుణ్య ఉవాచ -:*

యావజ్జీవన  మగ్ని హోత్రం
నిత్యం సంధ్యా ముపాసయేత్।
ప్రవృత్తి  రూపో   ధర్మో౽యం
శ్రుత్యా స్మృత్యా చ చోదితః ॥ (14)

కారుణ్యుడు : చెప్పెను.

మరణపర్యంతము అగ్నిహోత్రము నొనర్చునది ,
నిత్యము సంధ్యావందనము ఆచరించునది - ఈ రూపములగు శ్రుతి స్మృతి వాక్యములన్నియు
ప్రవృత్తి ధర్మమునకు చెందినవి !

స  ధనేన   భవేన్మోక్షః
కర్మణా    ప్రజయా  నవా।
త్యాగ    మాత్రేణ కిం త్వేకే
యత  యో౽శ్నంతి చామృతమ్ ॥(15)

ధనమువలన కర్మల వలన సంతానోత్పాదనము వలన మోక్షము లభింపదు
త్యాగము అనగా * సర్వకర్మ* సన్యాసము వలననే
అమృతత్వము పొందును .
( ఇట్టి వాక్యములన్నియు నివృత్తి పరములు)

ఇతి శ్రుత్యోర్ధ్వ  యోర్మధ్యే
కం   కర్తవ్యం   మయా గురో ।
ఇతి   సందిగ్ధతాం గత్వా
తూష్ణీం  భూతో౽స్మి   కర్మణి ॥(16)

తండ్రీ ! ఈ రెంటిలో ఎద్దానిననుసరింపతగును?
అను సందియము , కలిగి సందిగ్ధ చిత్తుడనై కర్మలను త్యజించితిని!

🌻 *అగస్తిరువాచ-:*

ఇత్యు  క్త్వా    తాత   విప్రో౽సౌ
కారుణ్యో     మౌనమాగతః ।
తథా  విధం  సుతం దృష్ట్వా
పునః ప్రాహ గురుః సుతమ్ ॥ (17)

💐 *అగస్తిమౌని పల్కెను-:*

కారుణ్యడు తండ్రికి అట్లుపల్కి వూరకుండెను . అపుడు మౌనమును వహించిన పుత్రనితో అగ్ని వేశ్యుడు ఇట్లు పల్కెను .

🌞 *అగ్నివేశ్య ఉవాచ-:*

శ్రుణు   పుత్ర   కథామేకాం
తధర్ధం    హృదయే౽ఖిలమ్ ।
మత్తో౽వధారస్య   పుత్ర త్వం
యథేఛ్ఛసి   తథా కురు ॥ (18)

అగ్నివేశ్యుడు -:పుత్రా నీ కొక కథను చెప్పెదను; వినుము ! విని దానిని బాగుగా విచారించి చూచి నీకు నచ్చినట్లొనర్చుము !

సురుచిర్నామ   కాచిత్ స్త్రీ
అప్సరోగణ    ఉత్తమా ।
ఉపవిష్టా    హిమవతః
శిఖరే    శిఖ   సంవృతే ॥ (19)

రమంతే కామ సంత ప్తాః
కిన్న ర్యో యత్ర కిన్నరైః ।
స్వర్ధున్యో ఘేన సంసృష్టే
మహా ఘౌఘ వినాశినా ॥ (20)

దూతమింద్రస్య గఛ్ఛంత
మంతరిక్షే దదర్శసా ।
తమువాచ మహాభాగా
సురుచిశ్చాప్సరోవరా ॥(21)

పూర్వము, కామతప్తులగు కిన్నరకిన్నరీ సమూహములు విహారములు సల్పునది
మయూరీ మయూరములు - ప్రమోదక్రీడలు నొనర్చునదియు , పాపనాశినియగు గంగానది ప్రవహించునదియు నగు హిమవత్పర్వత శిఖరమున -- అచ్చోట "సురిచి" యను అప్సరస కూర్చుని యుండెను . ఆ పై ఆకాశమున అరుగుచున్న ( వచ్చుచున్న) ఇంద్ర దూతను గాంచి ఇట్లనెను!

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...