Sunday, August 16, 2015

విద్య & వేదం

విద్య అను పదం వేదం అను పదం నుంచి ఉత్పత్తి చెందింది .విద్ అనగా తెలుపడినది అని అర్ధం.అనగా గురువు నుంచి విద్యార్దికి నేర్పబడ్డది విద్య. భగవంతుడు ఐన పరమేశ్వరుడి నుంచి ఋషులకు తెలుపడింది వేదం!!!.

హిందు ధర్మంలో వేదం అనేది ఒక మౌలిక ప్రమాణం.
వేదములను శ్రుతులు అనీ,ఆమ్నాయములు అని అంటారు. 
శ్రుతి అనగా వినపడుట (శ్రోత అనగా వింటున్న వ్యక్తీ ).
ఆమ్నాయము అనగా "మనన" ప్రక్రియ.
ఈశ్వరుడి నుంచి ఉద్భవించిన పదాలను విన్న ఋషులు విన్న వాటిని గుర్తుంచుకొనుటకు మనన ప్రక్రియను అవలంబించి మనస్సునందు నిలుపుకున్నారు.
మననం అనగా వల్లె వేయటం.
పూర్వ కాలములో వ్రాయుటకు తగు సాధనములు అందుబాటులో లేవు.
కనుక వల్లె వేయుట (మనన ప్రక్రియ) ద్వార వాటిని మనస్సు లో ఉంచుకొనే వారు.
మనస్సు అనగా మేదస్సు.
విన్నవెంటనే గ్రహించే శక్తి.
ఎవరైతే ఈ వినినంతనే గ్రహించే శక్తి కలిగి ఉన్నారో వారందరూ వేద విద్యకు అర్హులే.
వేదముల నేర్చినంత మాత్రాన వేద విద్య అలవడినట్లు కాదు.
అర్ధం తెలియని వేదవిద్య జీవితానికి ఉపయోగపడదు.
జీవితానికి ఏది అవసరం,ఏది అనవసరం అని చెప్పి.అవసరం ఐన దానిని సంపాదించుకొనే మార్గాన్ని,శక్తిని,బలాన్ని శారీరకంగాను,మానసికంగాను అందించేది వేదం.

"విద్" అను దాతువు నుంచి "చే తెలియచేయబడినది"అను పదానికి సంస్కృత అర్ధం అని ముందు చెప్పుకున్నాం.
వేదములు భగవంతుని ద్వార తెలుపబడినవి అనీ,అవి ఏ మానవ సముదాయం చేతను వ్రాయబడలేదని విశ్వాసం.
అందుకే వేదములను "అపౌరుషేయములు" అంటారు.

అపౌరుషేయములు అనగా "ఎవరిచేతా రచించబడని"వి అని అర్థం.
హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు.
అందుకే వీటిని "శ్రుతులు" అని కూడా అంటారు.

ఈ విదంగ వల్లె వేసే ప్రక్రియ ద్వార వేదాలు తరతరాలకు అందించబడుతూ ఉన్నాయి..
వేదాలలో స్వరం ప్రదానం.
మొదట వేదాలు అన్ని కలగలిసి ఒకే వేదంగ ఉండేవి.
వ్యాసుడు వాటిని సంబంద భాగాలను ఒకచోట చేసి.నాలుగు వేదాలుగ విభజించాడు.
తద్వారా వేద వ్యాసుడు అయ్యాడు.
వేదాలు నాలుగు అవి 
ఋగ్వేదం.
యజుర్వేదం,
సామవేదం మరియు అధర్వణ వేదం.

వేదవ్యాసుడి శిష్యులు పైలుడు,జైమిని,సుమంతుడు & వైశంపాయనుడు.
వీరు చతుర్వేదాలను తమ శిష్యులకు భోదించారు.
వారు వారి శిష్యులకు భోదించారు.
ఇలా గురుశిష్య పరంపరానుగతంగా తరతరాలకు వేదశాస్త్రాలు అందించబడుతున్నాయి.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...