Saturday, July 25, 2015

"బ్రతికేయొచ్చు" "బ్రతికించొచ్చు".

60 సంవస్తరాల నిరు పేద వృద్దుడు.. పెద్ద వయస్సులో కష్ట పడలేక, జైలులో ఉన్న తన కొడుకుకు ఒక లేఖ వ్రాసాడు..
" నాన్నా.. నువ్వు నిరాదార కేసులో ఇరుక్కుని జైలులో ఉన్నావు.. ఇక్కడ నా
పరిస్దితి ఎం బాగోలేదు.. ఒళ్ళు కూడా సహకరించడం లేదు.. మన తోటలో కూరగాయలు సాగు చేద్దాం అంటే.. పోలం చాలా గట్టిగా ఉంది రా.. మనుషులని పెట్టి సాగు చేయిద్దాం అన్నా చేతిలో అంత డబ్బు లేదు.. నాకు సహాయంగా ఉండే నువ్వు కూడా జైలులో ఉండి పొయావు.. నాకు సహాయం చేసే వారు లేరు.. చాలా భాదల్లో ఉన్నాను.. త్వరగా వస్తే బాగుంటుది"
ఇది లేఖ సారాంశం...
ఆ లేఖను తన కొడుకుకి, రాష్ట్రపతికి (క్షమాబిక్ష కోసం) పొష్ట్ చేసాడు..
మరుసటి రోజు తన కొడుకు దగ్గర నుంచి లేఖ అందుకున్నాడు...
" నాన్నగారు మీరు ఆ పొలం తవ్వోద్దు.. ఎందుకంటే, నేను హత్య కేసులొ ఇరుక్కున్న శవాలు ఆ భూమిలోనే ఉన్నయి -- నేను త్వరలోనే వచ్చేస్తా... వచ్చాకా ఆ పని చూస్తా..."
అది చదివిన ముసలాయాకి ఎమి అర్దం కాలేదు... 
పక్క రోజు ఇంటికి సి.బి.ఐ వాళ్ళు వచ్చారు... "ఇళ్ళంతా సోదాలు చేసి, పోలం అంతా తవ్వి తవ్వి అలసి పోయి ఏటువంటి ఆదారం దొరకక పొయేసరికి.. వీ ఆర్ రియల్లీ సారి.. అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.."
అదే రోజు తన కొడుకు దగ్గర నుంచి ఇంకోక లేఖ అందుకున్నాడు ముసలాయన...
" నాన్నా పొలంలో ఇప్పుడు నువ్వు ఎం కావలంటే అవి వేసుకో... నేను లేని లోటు సి.బి.ఐ. వాళ్ళు తీర్చారు... అరోగ్యం జాగ్రత్త నాన్నా"
అలా మన సి.బి.ఐ వాళ్ళ సహాయంతో ఆ పెద్దాయన హ్యపీగా పొలం పండించుకున్నడు.
.
మోరల్ ఆఫ్ దా స్టొరీ.... : విన్నవన్నీ నిజాలు కాదు.. చూసేవన్ని సత్యాలు కావు...
తెలివనేది బుర్రలోనే ఉంటే, కష్టకాలంలో కూడా "బ్రతికేయొచ్చు" "బ్రతికించొచ్చు".

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...