ఆదివారం సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం
లభిస్తుందని పురోహితులు అంటున్నారు. ఆదిత్యుడైన సూర్యభగవానుడిని ఆదివారం
దర్శించుకుని ఆయనకు గోధుమలను సమర్పించుకుంటే సౌభాగ్యం చేకూరుతుందని
విశ్వాసం.

ఆదివారం ఉదయమో లేదా సాయంత్రం పూటనో సూర్యదేవుని ఆలయానికి చేరుకుని, సూర్య స్తోత్రం పఠించి.. నేతితో దీపమెలిగించే మహిళలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. ఇంకా నవగ్రహాల్లో ఆదిదేవుడైన సూర్యభగవానుడిని పూజిస్తే ఈతిబాధలు తొలిగిపోతాయని విశ్వాసం.
ఇంకా ప్రతి ఆదివారం సూర్యదేవునికి సజ్జలు, గోధుమలు, రాగి గింజలను సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజించేవారిని.. నరాలు, కంటికి సంబంధించిన వ్యాధులు సోకవని పురోహితులు అంటున్నారు. అలాగే ప్రతిరోజూ సూర్యనమస్కారం చేసే వారికి కంటిచూపు మెరుగుపడుతుందని వారు చెబుతున్నారు.
ఇకపోతే.. ఆదివారం గోధుమలతో చేసే పదార్థాలు, పూరీ, చపాతీ వగైరాలు భుజించడం మంచిది. అలాగే ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం.
ఇట్లు
మీ సుబ్రహ్మణ్య శర్మ

No comments:
Post a Comment