Monday, August 19, 2013

మనిషి విలువలు మనిషికే తెలియదు

ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ధనం కన్నా ధైర్యం మిన్నగా ఉండాలి. సమాజంలో ఎదురయ్యే సమస్యల సుడిగుండాల అంచులనుంచి తప్పించుకోవాలంటే ధైర్యం ఉండాలి. భర్తను కోల్పోయిన భార్యగాని, ప్రమాదాలలో సర్వస్వం కోల్పోయిన నిరాశ్రయులుగాని, శారీరకంగా అంగవికలత్వం పొందిన చిన్నారులుగాని ధైర్యాన్ని కోల్పోకుండా జీవనయానం సాగించాలి. ధైర్యం మన వెన్నంటి ఉంటే సాహసం లక్ష్మి మన వెంట ఉంటాయి. అంగవికలురు ఎంత పట్టుదలతో ధైర్యంతో విజయాలబాట పట్టినవారున్నారు. ఎందరో విద్యార్థులు పోలియో బారిన కాళ్ళు కోల్పోయినా ఉత్తమ ఇంజనీరు, అధ్యాపకులుగా పేర్గాంచారు.
ధైర్యం ఏ సమయంలోనూ విడువరాదు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్లు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ జీవనయానం సాగించాలి. చాలామంది ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. వారిని వేదిక మీదకు పిలిచి మాట్లాడమంటే మాటరాదు. కారణం ధైర్యం లేకపోవడమే గదా!
యుద్ధంలో పోరాడటానికి ఒకడు శిరస్త్రాణం - విల్లంబులు - రధం గుఱ్ఱాలు రథచోదకుడూ అన్నీ ఏర్పరచకుంటాడు కానీ యుద్ధంలో పోరాడే ధైర్యం లేక వెనుకడగుగు వేస్తుంటాడు అందుకనే ముందు మనసులో ధైర్యం సాహసం ఉండాలి. దానితో మనలను విజయలక్ష్మి వరించి వస్తుంది.
కొంతమంది ఇంటర్వ్యూ హాలులోకి వెళ్ళగానే విద్యార్థులు బిగుసుకుపోతారు వారికి నోట మాట రాదు- నోరు పిడచ కట్టుకుపోతుంది. ఏం సమాధానాలు చెప్పాలో తెలియక అల్లాడుతుంటాడు ఇలా కావడం వారిలో ధైర్యం లేకనే. తెలివిలేకకాదు.
ఏ విషయంలోనైనా అలసత్వం, నిరాశనిస్పృహ, అవినీతి లాంటి జాడ్యాలను దగ్గరకు రానీక ధైర్యంతో అన్యాయం ఎదిరించాలి. కష్టాల్లో ధైర్యంతో పోరాడేవారిని మనం అభినందించాలి. అభిమానించాలి. 1893లో చికాగోలో స్వామి వివేకానందుడు తన వాణితో భారతీయ సంస్కృతీ వైభవాన్ని ధైర్యంగా ఎలుగెత్తి చాటి చిరస్మరణీయుడైనాడు. మన భారతీయ కీర్తి పతాకం రెపరెపలాడటానికి ఆయన ధైర్యం స్ఫూర్తే కూడా కారణమే. ధైర్యంకల్గి ఉంటే దాని వెంటే అన్నీ నడిచొస్తాయి. ధైర్యానికి ఒక పరీక్ష ఉంటుంది అదీ ఓటమే! ఓటమిని ఎదుర్కోవటానికి ధైర్యం కావాలి. మనోధైర్యంతో పోరాడాలి. మహాభారతంలో పాండవులు రాజ్యాన్ని, సిరిని కోల్పోయినా ధైర్యాన్ని పట్టుదలను కోల్పోకుండా అరణ్య అజ్ఞాతవాసాలను విజయవంతంగా పూర్తిచేయగలిగారు గదా!
ధైర్యం మన కంటికి కన్పించని ఆయుధం. అలాంటి ఆయుధం మన వెంటుంటే ఎంతటి శత్రువునైనా పాదాక్రాంతం చేసుకోవచ్చు.
మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ధైర్యంతో పోరాడితే పోయేదేం లేదు వచ్చే విజయం తప్ప అన్నట్లుగా మనం ముందుకుసాగాలి.
ఎన్ని కష్టాలైనా అనుభవించు కానీ మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యే సాహసే లక్ష్మిః అన్నారు మన పెద్దలు. కనుక ఏ విషయంలోనైనా మంచిని గ్రహించాలి, చెడును దగ్గరకు రానీయకూడదు. మనకు తెలిసిన మంచిని నలుగురికి తెలియచేయాలి. అన్యాయం జరుగుతుంటే నోరు విప్పి ధైర్యంగా చెప్పాలి. అలా మాట్లాడటమే న్యాయం చేయడం అవుతుంది. ఎవరికి వారు నీతిగా నిజాయతిగా వ్యవహరిస్తే చాలు ధైర్యం దానంతట అదే ప్రోది అవుతుంది.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...