Monday, August 19, 2013

జాగృతి


వేదభూమిగా పేరుగాంచిన ఈ పవిత్ర భారతావని ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఎందరో మహనీయులకు జన్మనిచ్చి తన ప్రత్యేకతను చాటుకుంటూ అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ ధర్మసంస్థాపనలో ముందంజ వేస్తూ విశ్వమానవులకు సవ్యమైన జీవన విధానాన్ని బోధిస్తూ దివ్యంగా విరాజిల్లుతోంది.
ఈ పవిత్ర భారతావనిని పరిపాలించిన ఎందరో రాజులు వేదములను ప్రమాణంగా పరిగణించి లోక క్షేమానికై తహతహలాడుతూ యజ్ఞయాగాదులను నిర్వహించి పునీతులయ్యారు.
‘్ధర్మో రక్షతి రక్షితః’- ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనలను రక్షిస్తుంది అనే అమూల్య సూక్తిలోని అంతరార్థం ఇదియే. యజ్ఞయాగాదుల ద్వారా హవిస్సును దేవతలకు అగ్నిముఖంగా అందించుట- ఆనందపరవశులైన దేవతలు సకాల వర్షాన్ని కరిపించి పాడిపంటలు వృద్ధిచెందుటకు సహకరించుట-
వేదములను ప్రమాణంగా స్వీకరించి ధర్మబద్ధమైన పాలన అందించే ప్రభువు కొలువుదీరిన రాజ్యంలోని రాజులు యజ్ఞయాగాదులు, దానధర్మాలు, అన్న సంతర్పణలు, మార్గమునకిరువైపులా చెట్లనునాటే కార్యక్రమాలు, పొరుగు రాజ్యం నుండి వచ్చిన అతిథి అభ్యాగతులకు విశిష్ట మర్యాదపూర్వక సన్మాన సత్కారాలు - కవులు, పండితులు, సంగీత నృత్య కళాకారులు తదితర సరస్వతీ పుత్రుల పట్ల విశేషమైన రీతిలో గౌరవమర్యాదలు...చేస్తూ పరమేశ్వర కటాక్ష సిద్ధికిఅర్హత పొందినట్లుగా భావించేవారు.
అలా కాక ఏ రాజైతే యజ్ఞయాగాదులు అనవసరమనే దురుద్దేశ్యంతో ఉంటూ ‘నేను చెప్పిందే వేదం’ అంటూ అధికార మదాంధుడై విర్రవీగుతాడో ఆ రాజుచే పరిపాలింపబడుతున్న రాజ్యంలో అతివృష్టి అనావృష్టులు కలిగేవి. ఆ రాజ్యంలోని ప్రజలను, పశుపక్ష్యాదులను నానా బాధలకు గురయ్యేవారు.
అలాంటి రాజులు కొంత కాలం తర్వాత వారి తప్పును తెలుసుకొనేవారు. తమతమ ప్రవర్తనను ధర్మవిరుద్ధంగా ఉందని అనుకుని దాన్ని సరిదిద్దుకొనేవారు. అలా కానప్పుడు వారిని సరిదిద్దడానికి దేవుడుఏదో ఒకరూపంలో అవతరించి వారిని సరిచేసేవారు. తిరిగి భూమి సస్యశ్యామలం అయ్యేది.
సిరిసంపదలంటే పచ్చనోట్లు, బంగారు ఆభరణములు, ఆకాశ సౌధాలు... ఇవి కావని, దేవతల అనుగ్రహం కరువైతే ఇవన్నీ ఎందుకూ పనికిరావని, ధర్మచక్రం నిరాటంకంగా తన పని తాను చేసుకుని పోతేనే ఏ కాలంలోని వారైనా నిజమైన సుఖశాంతులను అందుకోగలుగుతారు. ఈ ధర్మకార్యాలు అనేవి ప్రతియుగంలోనూ ఒక్కటే ఉంటాయ. కాని దేశకాల రీత్యా అనుసరించాల్సిన ధర్మాన్ని జనులే తెలుసుకోవాలి. ధర్మం ఆచరించడం ముఖ్యమైన కర్తవ్యంగా ప్రతివారు భావించాలి. ధర్మసూక్ష్మాన్ని తెలుసుకోకుండా ఇతరులను అవహేళనచేయడం కాని అధర్మాన్ని ధర్మంగా భావించడం కాని చేయకూడదు. ధర్మాచరణలో అందరూసమానులే. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారిని ధర్మదేవతే రక్షిస్తుంది. ఇదే ఎన్నో యుగాలల్లో నిరూపించబడింది.
అందుకే కలియుగం ఈ యుగంలో ఇది చేయచ్చు అది చేయొచ్చు అని కాక ధర్మప్రకారమే జీవితాన్ని నడిపించాలి. సత్యం పలుకడం, ఇతరులను కష్టపెట్టకుండా ఉండడం, ఇతరులకు చేతనైనంత దానం చేయడం అనేవి ఏయుగానికైనా వర్తిస్తాయ.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...