Monday, September 2, 2013

మతమూ చెడ్డ విషయాలను బోధించదు

ఏ  మతమూ  చెడ్డ  విషయాలను  బోధించదు.    గ్రంధాలలోని  విషయాలను  సరిగ్గా  అర్ధం  చేసుకోని  వారి  వల్ల  మరియు  కొందరు  స్వార్ధపరుల   వల్ల   తరతరాలుగా సమాజంలో  అపార్ధాలు  ఏర్పడ్దాయి.

ఆధునిక విజ్ఞానాన్ని కొందరు తమ స్వార్ధానికి వాడుకుంటున్నట్లే , ఆధ్యాత్మికతను కూడా కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.

కొందరు స్వార్ధం వల్ల ,  మరి కొందరు తెలిసీతెలియనితనం వల్ల సమాజంలో కొన్ని మూఢాచారాలను వ్యాపింపచేశారు.


 ప్రాచీన  గ్రంధాలను  సరైన  తీరులో  అర్ధం  చేసుకుంటే  సమాజం  ఎంతో  బాగుంటుంది.

.......................

ఓం.

శ్రీ  కృష్ణ  పరమాత్మ  బోధించిన  భక్తి యోగములో   కొంత భాగము.....


వివేకముతో గూడని అభ్యాసము కంటె , ( శాస్త్రజన్య ) జ్ఞానము శ్రేష్ఠమైనదై కదా !( శాస్త్రజన్య ) జ్ఞానము కంటె , ధ్యానము శ్రేష్ఠమగుచున్నది.ధ్యానము ( ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగ నుండు మనఃస్థితి ) కంటె కర్మఫలమును విడుచుట ( ప్రవృతి యందును విషయదోషము లేకుండుట ) శ్రేష్ఠమై యున్నది. అట్టికర్మఫలత్యాగముచే శీఘ్రముగ
( చిత్త ) శాంతి లభించుచున్నది.

సమస్తప్రాణులయెడల ద్వేషములేనివాడును, మైత్రి, కరుణగలవాడును, అహంకారమమకారములు లేనివాడును, సుఖ దుఃఖములందు సమభావము గలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడు సంతృప్తితో గూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపఱచు కొనినవాడును, దృఢమైన నిశ్చయము గలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును, నాయందు భక్తిగలవాడును ఎవడు కలడో, అతడు నాకు ఇష్టుడు.



ఎవని వలన ప్రపంచము ( జనులు ) భయమును బొందదో,  లోకము వలన ఎవడు భయమును బొందడో
ఎవడు సంతోషము , క్రోధము, భయము, మనోవ్యాకులత - మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు.

.....................................................

గీత  మరియు  
ప్రాచీన  గ్రంధాల  ద్వారా  మనము  ఎన్నో  చక్కటి  విషయాలను  తెలుసుకోగలము.  తెలుసుకున్న  విషయాలను  ఆచరణకు  ప్రయత్నించాలి.  

అప్పుడు,   అత్యాశ,  అవినీతి,  ఇతరులతో  అనవసరంగా  పోటీపడటం, ఇతరుల  సొమ్మును  అపహరించటం,  వంటి  దుర్లక్షణాలు  తగ్గిపోతాయి.  నైతికవిలువలతో  జీవించటం  అలవాటవుతుంది.

  లోకం  ప్రశాంతంగా  ఉంటుంది. 

 
ఈ  రోజుల్లో  నైతికవిలువలకు  ప్రాధాన్యత  తగ్గి,  ఎలాగైనా  సరే  డబ్బును  సంపాదించి  విలాసంగా  జీవించాలి . అనుకునే   వారి  సంఖ్య  పెరిగింది.  



అత్యాశ,  అనవసరపు  పోటీ  , అధికారదాహం  వల్ల    అణ్వాయుధాల  పోటీ     పెరుగుతుంది.  



 అందువల్ల , సమాజంలోని  ఎంతో  సొమ్మును  ఆయుధ  పోటీకే  ఖర్చు  చేయవలసి  వస్తోంది. 


అందువల్ల ,  పేదరిక  నిర్మూలన  కార్యక్రమాల  కోసం    డబ్బు  సరిపోవటం  లేదు.


పరస్పర  అపనమ్మకాల  వల్ల   ఇప్పుడు  ప్రపంచదేశాల  వద్ద  అణ్వాస్త్రాలు  గుట్టలుగా  పడి  ఉన్నాయి. 



  ఆయుధాల  గుట్టల  మధ్య   ప్రపంచం  ఇంకా  క్షేమంగా  ఉందంటే  దైవం  దయ   వల్లనే.  



 ఈ  ఆయుధాలు  చెడ్డవారి  చేతిలో  పడకూడదని  దైవాన్ని  ప్రార్ధించటం  మినహా  సామాన్య  ప్రజలు  ఏం  చేయగలరు  ?


ఆధునిక  విజ్ఞానాన్ని కూడా  కొందరు  వ్యక్తులు   మితిమీరి  ఉపయోగిస్తున్నారు. 


 ఈ  ప్రపంచంలో  మనుషులే  మాత్రమే  కాదు.  ఇతర  జీవులు  ఎన్నో  ఉన్నాయి.   


కొందరు  తమ అత్యాశ ,అంతులేని  కోరికల  కోసం  పర్యావరణాన్ని  పాడుచేస్తూ , ఇతరజీవులకు  ముప్పును  కలిగిస్తున్నారు.



మితిమీరిన   పారిశ్రామీకరణ  వల్లే   ఆమ్ల  వర్షాలు  పడుతున్నాయట.


  ఇలాంటి  ఎన్నో  పెను  ప్రమాదసూచికలు  కనిపిస్తున్నా  కూడా  ప్రజలు  సరిగ్గా  పట్టించుకోవటంలేదు.  నిమ్మకు  నీరెత్తినట్లు    ఉంటున్నారు.   



  ఇక   ప్రపంచాన్ని  దైవమే  రక్షించాలి.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...