Thursday, November 22, 2018

మల్లికార్జున పండితారాధ్యుడు



ఈయన శైవకవులలో రెండవవారు.
ఆయన శివకవిగా, కవి మల్లునిగా ప్రసిద్ధి చెందారు.

మల్లికార్జున పండితుడు (1120-1180) ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు

మల్లికార్డునుడు గోదావరి మండలము లోని దాక్షారామ భీమేశ్వరుని అర్చకులైన భీమనపండితులు, గౌరాంబలకు పుట్టారు. కోటిపల్లి లో నివసించే  "ఆరాధ్యదేవర"గారు ఆయన.గురుపు. ఆయన. గురువు వద్ద శైవదీక్ష తీసుకొని, శై_వమత రహాస్యములను సాకల్యముగా గుర్తించి శ్రుతి పురాణ సహితముగ శైవమత మహత్త్వమును ప్రచారము చేశారు. తాను శివపూజా నియమమున ఉన్నను, జంగములు వచ్చినచో వెంటనే వారిని పూజించెడివారు :


ఆయన శైవ బ్రాహ్మణులలో అత్యంత శక్తివంతమైన వారు మరియు  అతీంద్రియ శక్తులకు ప్రసిద్ధి చెందారు. ఆయన చందవవోల రాజ్యం యొక్క రాజు వెలనాటి చోడుడు యొక్క న్యాయస్థానంలో బౌద్ధులను తన శైవ సిద్దాంతం తో ఓడించారు మరియు శైవిజం ను స్థాపించారు.

"శివకవి యుగం" తెలుగు సాహిత్య చరిత్రలో బ్రాహ్మణ శైవ కవుల కాలం. నన్నయ మరియు తిక్కన (12 వ శతాబ్దం AD) మధ్య  ​​సమయం. ఈ కాలంలోని ప్రసిద్ధ కవులు నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాద్యుడు, మరియు పాల్కురికి సోమనాధుడు. ఈ ముగ్గురు కవులను శివకవి త్రయం గా పిలుస్తారు వీరు కాలాముఖ శైవ వర్గానికి చెందినవారు. పండితారాద్యుడు 'ప్రమధ'  అవతారం అని మరియు అతి శక్తివంతుడని వీరశైవులు విశ్వసిస్తారు.

తెలుగు నాట శైవమతం యొక్క వ్యాప్తికి వారి జీవితాన్ని అంకితం చేసిన 'పండిత త్రయము'గా పిలవబడే ముగ్గురు శైవత్వ గురులలో ఆయన కూడా ఒకరు. మిగిలిన ఇద్దరు పండితులు శ్రీపతీ పండితుడు మరియు మంచెన పండితుడు. మల్లికార్జునుడు శివుడే అంతిమ దేవుడని, శివారాధన ఉన్నతమైనదని ప్రచారం చేశారు.శైవ మతానికి  బ్రాహ్మణత్వం జోడించి, ఆరాధ్యా శైవిజంను స్థాపించారు, తర్వాత ఆరాధ్య బ్రాహ్మణులు దీనిని అనుసరించారు.

ఆయన కల్యాణపురమున ఉన్న బసవేశ్వరుని చూడటానికి కుటుంబము తోను, శిష్యులతోను బయలుదేరి దారిలో 'తప శిష్యుఁడు దోనయ్య గారికి అన్నగారైన వీరచాకి రాజయ్య గారు ఉండే పానుగంటికి వెళ్లి ఆయన  గౌరవ మర్యాదలు పొందారు. 

తిరిగి, ప్రయాణము కానుండగా అంతకు ముందె ఎనిమిది దినముల క్రిందటనే బసవేశ్వరుడు లింగైక్యము చెందారని తెలుసుకున్నారు. బాగా దిగులు చెందిన పండితులు గారు శ్రీశైలమునకు ప్రయాణమయ్యారు. తాను వెల్లటూరిలో నిలిచి తన శిష్యుడైన దోనయ్యను గిరి ప్రయాణము చేసి, శివరాత్రికి శ్రీశైలమునకు వెళ్ళి, వచ్చాక తాను శివైక్యం చెందుతానని చెప్పారు. ఆతఁడు తిరిగి వచ్చిన తర్వాత పండితారాధ్యుడు భార్యాపుత్రుదులతో లింగైక్యము చెందారు.

ఆయన ఆంధ్ర, కన్నడ మరియు సంస్కృత భాషలలో గొప్ప పండితులు.

రచనలు :
------------
1) శివ తత్త్వసారం ( తెలుగు శతకం )

 2) శ్రీగిరి మల్లికార్జున శతకం ( అలభ్యం)

సంస్కృత రచనలు :
--------------------------
 1) రుద్ర మహిమ

  2) గుణ సహస్రమాల

  3) అమరేశ్వరాష్టకం

  4) బసవ గీతాలు

మల్లికార్జున పండితుఁడు శివతత్త్వసారము, మహిమ్నస్తవము, మలహణము, పంచగద్యలు, రుద్రమహిమ, శంకరగీతి, రక్షాధ్వరము, దాసాష్టకము తుమ్మెదపదములు, ఆనందపదములు, శంకరపదములు మున్నగు పెక్కు గ్రంధములను రచించినట్లు సోమనాధుని 'పండిరాధ్యచరిత్రము" వలననే తెలియుచున్నది

 ఆయన కన్నడంలో 'గణసహస్రనామం అనే కావ్యమును రచించారని కన్నడ కవిచరిత్రము లో ఉన్నది. కాని యిప్పటికి లభించినది ఒక్క "శివత త్త్వసారము" మాత్రమే. ముద్రితమైన "శివతత్త్వసారము"న 489 కంద పద్యములు ఉన్నాయి. ఇందు వేయి పద్యములు ఉండుంటాయని కొందఱి అభిప్రాయము.

మల్లికార్జున పండితుడు పెక్కు-గ్రంధములను రచించినను, అవి లభింపక పోవుటము,, లభించిన 'శివతత్త్వసార'ము' కూడా అసమగ్రం గా ఉఃడుటం  తెలుగు వారి దురదృష్టము.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...