Tuesday, August 20, 2013

శ్రీ దుర్గా దేవి

శ్రీ దుర్గా దేవి

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.

పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.


పూజా విధానము: ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మని పూజించాలి.

మంత్రము: "ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రమును పఠించాలి.

దుర్గా సూక్తము పారాయణ చేయవలెను.

దుర్గా, లలితా అష్టోత్తరములు పఠించవలెను.

నివేదన: పులగము నివేదన చెయ్యాలి.

  • మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి

  • రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

  • మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి

  • నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి

  • ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి

  • ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి

  • ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి

  • ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి )

  • తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి )

  • పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...