Friday, November 23, 2018

చీకటి వెలుగుల జీవితం నా లోగిలి

ఓ తల్లిని ..... చంటి బిడ్డడు ... వదలలేక  అదుముకున్నట్టు
వదిలి ఉండలేనట్టు , విడిచి మనలేనట్టు , తట్టుకోలేనట్టు
ప్రభూ ........ నీ  కాళ్లకు చుట్టుకున్నాను /పట్టుకున్నాను .....

నీ మేని స్పర్శ .... పవిత్ర తరంగమై ... లోన  పాకుతూ
నా లోని   అణువణువును  పలుకరిస్తూ , తాకుతూ
కదుల్తోంది ....ఉత్కృష్ట  దివ్య   మోహన చైతన్యమై ........

నిను చుట్టిన నా చేతులు ....కమలాలై ... నీ పాదాలు ఒత్తుతూ
ఆ చేతుల  భాగ్యానికి ..... నేనై  తనివితీరా పొంగిపోతూ
ఆ ఆనంద  సేవనం లో  భక్తి ప్రభావాన తన్మయమై ........

ఈ  అద్భుత పారవశ్యానికి .... కన్నులు  చెమరుస్తూ
కట్టలుదాటి ,ఉప్పొంగి ... నిన్ను తాకి మురిసిపోతూ
తమ పుణ్యానికి ...  ఆ అశ్రుధారలు ...నీకు ప్రేమాభిషేకమై .......
 ప్రభూ ........ ........ ...... 
నిను చుట్టుకున్నది ...   నేను కాదయ్యా  .... నా భక్తి పారవశ్యం
నీకు అంటుకు పోయిన ఆనందమే నయా.... అదే.అదే . నీ ప్రేమ వాత్సల్యం .

వదలలేకున్నా తండ్రీ ...... నీవే  శరణు ....శరణు ......

ఈ చీకటి వెలుగుల జీవితం ... నీ శరణు  లోనే కదా సాధ్యం
నీ నామ   స్మరణమే .... ఎగుడు దిగుళ్ళ మా పయనంలో సాయం
నీ దివ్య కారుణ్యమే ..... మా  ప్రారబ్ధ సమస్యలకు  సమాధానం
నీ చరణ  సన్నిధానం .....కాదా . మా జన్మ జన్మల  భాగ్యం

నిను నమ్మిన వారికీ ....... లేదు కదా తండ్రీ  నాశనము
నీవే  దిక్కని  కొలిచిన  వారికి .... ఇత్తువుగా అభయ దానము
శరణు  ప్రభు ...... శరణు ...... శరణు ...... శరణు .......
"నా హృదయపు లోగిలి"
   Written by_గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ధర్మపురి


శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ధర్మపురి
 జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రం

స్వామి వైభవం:

ఈ ఆలయం వేదాలు ప్రసిద్ధి
బొమ్మర పోతన పింగళి సురణ నడయాడిన ప్రదేశం
ధర్మవర్మ అనే భక్తుడు తప్పసు చేయగా తన తప్పస్సుకు మెచ్చి ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిసాడు సాలగ్రామ శిలపై కొరమీసాలతో దర్శనం ఇస్తాడు
ఈ ఆలయ లోగిలిలో వివిధ దేవి దేవతలు మరియు ఎక్కడ లేనటువంటి యముడు బ్రహ్మ విగ్రహాలు ఉండటం విశేషం స్వయంగా శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన రామలింగేశ్వర ఆలయం కూడా ఉపాలయం గా ఉన్నాయి
కులమతాలకు అతీయుతంగా ఇక్కడ మసీదు ఉండటం విశేషం

ఆలయం చరిత్ర:

ఈ పట్టణం రాజు ధర్మ వర్మ చేత పాలించబడి, ఈ పట్టణం పేరును ధర్మపూరి గా పిలవబడింది.
ఆలయం దాదాపు 3500 సంవస్తారాలపూర్వం మధ్య నిర్మించారు నమ్మకం.
ఈ పురాతన దేవాలయం రెండు వేర్వేరు ఆలయాలను కలిగి ఉంది,
పాతది పాతా నరసింహస్వామి ఆలయం అని పిలుస్తారు మరియు నూతనంగా కోటా నరసింహస్వామి ఆలయం అని పిలుస్తారు.
14 వ మరియు 15 వ శతాబ్దాలలో, బహుమని సుల్తాన్ మరియు కుతుబ్షాహిస్ పతనం తరువాత ఔరంగజేబ్ తరువాత
హిందూవ్యతిరేకత ప్రారంభమయింది.
రష్టుంద్ ఖాన్, హైదరాబాద్ యొక్క సుబేదార్ ఆలయం, ఢిల్లీ అప్పటి సుల్తాన్ ఔరంగజేబ్ సహాయంతో ఒక మసీదుగా మార్చారు.
అయితే, 1448 లో, మసీదు సమీపంలో ఒక కొత్త ఆలయం పునర్నిర్మించబడింది మరియు అందుచే ఈ ఆలయం పటా నరసింహ స్వామి ఆలయం అని పిలువబడింది. 1725 లో, నరసింహ దేవాలయం ధరంపురి గ్రామ సమీపంలో కనుగొనబడింది,
అందుచే ఈ ఆలయం మళ్ళీ అక్కడ పునర్నిర్మించబడింది

ఆలయం చేయూకోవటం ఎలా:

ఇది జిల్లా కేంద్రం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. జగిత్యాల నుండి 23 కిలోమీటర్లలో ఉంది గోదావరి దక్షిణ తీరంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పట్టణం గుండా ప్రవహిస్తుంది.

మీ శ్రేయోభిలాషి
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం

తెలంగాణ తీర్థం

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం మహాదేవపూర్ మండలం కరీంనగర్ జిల్లా తెలంగాణ

స్వామి వైభవం:

పూర్వం ఒకసారి యమధర్మరాజుగారు ఇంద్రలోకం వెళ్ళి, ఆ లోక వైభవాన్ని చూసి, ఇంత వైభవోపేతమైన ఈ లోకాన్ని పొందాలనే మనుషులంతా పరమశివుణ్ణి ప్రార్ధించి ఇంద్రలోకం వెళ్తున్నారు, నా లోకానికి వచ్చేవారు తగ్గిపోయారని ఆలోచించి, ఇంద్రలోకంకన్నా గొప్ప నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. విశ్వకర్మని రప్పించి స్వర్గాన్ని మించిన అందమైన నగరం నిర్మించమని కోరాడు. విశ్వకర్మ గోదావరి ఒడ్డున అత్యంత వైభవోపేతంగా వుండేటట్లు కాళేశ్వరం నిర్మించాడు. ఆ నగరాన్ని చూసిన పరమ శివుడు సంతుష్టుడై అక్కడ నివాస మేర్పరచుకున్నాడు

కాళుడు (యమధర్మరాజు) చేత నిర్మింపబడి, ఈశ్వరుడు వున్న నగరం కనుక అది కాళేశ్వరం అయింది. భూలోకవాసులంతా పరమశివుణ్ణి సేవించి, పాప రహితులై స్వర్గలోకాన్ని పొందుతున్నారు. దానితో అక్కడి శివుడికి ముక్తేశ్వరుడనే పేరు వచ్చింది. పాపం యమధర్మరాజుగారి వ్యూహం ఫలించక ఆయన సరాసరి వెళ్ళి శివుడితోనే మొరపెట్టుకున్నాడు. స్వామీ, నువ్వు అందరికీ ముక్తిని ప్రసాదించేసరికి నాలోకానికెవరూ రావటంలేదు ఎలా అని. అప్పుడు శివుడు నువ్వు కాళేశ్వరం వెళ్ళి ముక్తేశ్వర లింగం వున్న పానువట్టం మీదనే ఇంకొక లింగాన్ని ప్రతిష్టించు. అక్కడికి వచ్చినవారు ఎవరైనా ముందు నువ్వు ప్రతిష్టించిన లింగాన్ని పూజించి తర్వాత ముక్తేశ్వరుణ్ణి పూజించాలి. అలా చేయనివారికి నీలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు. యమధర్మరాజు శివాజ్ఞ ప్రకారం కాళేశ్వరం వెళ్ళి అక్కడ ముక్తేశ్వరుడి ప్రక్కన ఇంకొక లింగం ప్రతిష్టించాడు. కాళుడు ప్రతిష్టించిన లింగం కనుక కాళేశ్వరుడు. ఆలయం ప్రాంగణంలో వున్నయమకోణంనుంచీ దూరి వెళ్ళినవారికి యమబాధలు వుండవంటారు.

కాళేశ్వరుని వైభవం :

ఇక్కడ ఒకే పానువట్టం మీద రెండు శివ లింగాలుండటానికి కారణం పైన చెప్పిన కధే. ఇక్కడికొచ్చినవారు ముందుగా కాళేశ్వరుణ్ణి అభిషేకించి, తర్వాత ముక్తేశ్వరుడిని పూజిస్తారు. ఇక్కడ ఇంకొక విశేషం ముక్తేశ్వర లింగానికి రెండు నాసికా రంధ్రాలుంటాయి. దానిలో ఎంత నీరు పోసినా లోపలకి వెళ్తాయేగానీ ఆ రంధ్రాలు నిండవు. ఒకసారి ఆ చుట్టు ప్రక్కల ప్రదేశాలనుంచీ కడవలకొద్దీ పాలు తెప్పించి పోసి చూడగా అవి సంగమ ప్రదేశంలో కలిశాయిట. ఇక్కడ పార్వతీ దేవికి శుభానందాదేవి పేరుతో ప్రత్యేక ఆలయం వున్నది. ఉపాలయాలలో సరస్వతి, సూర్యుడు మొదలయినవారు పూజలందుకుంటున్నారు. ఇక్కడికి ఒక కిలో మీటరు దూరంలో పురాతన ముక్తేశ్వర ఆలయం వున్నది. నదీ సంగమం ఒడ్డున వున్న సంగమేశ్వరస్వామిని పూజించటంవలన ఉదర సంబంధమైన బాధలు తగ్గుతాయని ప్రతీతి

ఆలయ చరిత్ర:

 కాళేశ్వరం తెలంగాణా రాష్ట్రంలో, కరీంనగర్ జిల్లాలో మహదేవ్ పూర్ మండలంలో మారుమూల అటవీ ప్రదేశంలో గోదావరి ఒడ్డున నెలకొన్నది.
ఇది చారిత్రక ఆధారాల ప్రకారం కాళేశ్వరానికి రెండు వేల సంవత్సరాలపైగా చరిత్ర వున్నట్లు తెలుస్తున్నది. క్రీ.శ. 892-921లో చాళుక్య భీముడు ఆలయాన్ని నిర్మింపజేసినట్లు ఆధారాలున్నాయి. తర్వాత కాలంలో శిధిలమయిన ఆలయాన్ని కాకతీయులు పునరుధ్ధరించారు. కాకతీయ ప్రతాపరుద్రడు తాను బంగారంతో తులాభారం వేసుకుని ఆ బంగారాన్ని కాళేశ్వరస్వామి ఆలయానికి సమర్పించినట్లు శాసనాలద్వారా తెలుస్తున్నది. తర్వాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఆలయ పోషణకు ఏర్వాట్లు చేశారు.

ఎలా చేరుకోవాలి:

హైదరాబాద్ నుండి 280 కి.మీ.లు, కరీంనగర్ నుండి 130 కి.మీ.లు, మందని నుండి 65 కి.మీ.లు, వరంగల్ నుండి 110 కి.మీ.ల దూరంలో ఈ ఆలయం కలదు

మీ
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....
సహకారం
నా మిత్రులు 

ఛాయా సోమేశ్వర ఆలయం పోనకల్ నల్గొండ జిల్లా

తెలంగాణ తీర్థం

ఆలయ చరిత్ర:

11 వ - 12 వ శతాబ్దాలలో చోళులు శ్రీ ఆలయం నిర్మించారు. ఈ ఆలయం శివుని యొక్క కనికరంలేని నీడ (తెలుగులోని చయ) ఏర్పడిన రోజు మొత్తం శివలింగం యొక్క ప్రధాన దేవతపై పడిందని నమ్ముతారు. కుండూరు చేత నిర్మించబడిన ఈ అద్భుతమైన ఆలయం దాని వాస్తుశిల్పుల అద్భుతమైన సృజనాత్మక ఆలోచన మరియు శాస్త్రీయ విజ్ఞానాన్ని నిరూపిస్తుంది. బ్రహ్మ, విష్ణు, శివుడు మూడు దేవతలు కలవు. ఈ ఆలయం అద్భుతమైన శిల్ప మరియు కళల పనిని కూడా ప్రదర్శిస్తుంది.

ఈ ఆలయం దాని నిర్మాణ శైలికి ప్రసిద్ది చెందింది. పశ్చిమాన ఉన్న తూర్పు వైపు మరియు తూర్పు వైపు ఉన్న గర్భగ్రిలలో ఒక రోజు అంతా నిరంతర నీడను కలిగి ఉంటుంది. ఈ మర్మమైన నీడ ఆలయం యొక్క భారీ ఆకర్షణ. ఈ దేవతపై వచ్చే చయ పవిత్రమైన గది ముందు చెక్కిన స్తంభాలలో ఒకటి నీడలా కనిపిస్తోంది. కానీ వాస్తవానికి ఎటువంటి స్తంభాల నీడ కాదు. చీకటి ప్రాంతం గర్భగ్రిహా ముందు ఉంచుతారు బహుళ స్తంభాలు ద్వారా కాంతి ప్రతిబింబం ద్వారా ఏర్పడుతుంది మరియు నీడ ఆ నాలుగు స్తంభాలు ఒక ఏకీకృత నీడ. ఈ ఆలయంలోని స్తంభాలు వ్యూహాత్మకంగా ఉంచుతారు,

ఈ ఆలయం త్రికుట ఆలయం అని చెపుతారు
ఈ ఆలయం లో ఒక్క లోగిలిలో సోమేశ్వరుడు మరో లోగిలిలో దత్తత్యేయుడు మరో లోగిలిలో సూర్యనారాయణుడు దర్శనం ఇవ్వటం విశేషం

రామాయణం మరియు మహాభారతం నుండి భాగాలు యొక్క ఉపశీర్షిక శిల్పాలతో ఈ ఆలయ స్తంభాలు గొప్ప వివరాలను అలంకరించాయి. ఈ ప్రాంతంలో నుండి సేకరించిన అనేక శిల్పాలు పచాల సోమేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో నిర్మించిన మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. మ్యూజియంలో భద్రపరచబడిన కొన్ని పురాతన శివలింగులు యలేశ్వరం అనే గ్రామం నుండి సేకరించబడ్డాయి, ఇది నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణ సమయంలో మునిగిపోయింది.

పనాగల్ విలేజ్ లోని శ్రీ చయ సోమేశ్వర ఆలయం నుండి 1.2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పచాల రామలింగేశ్వర ఆలయం మరొక అద్భుతమైన ప్రదేశం.

నాలాగొండ బస్ స్టేషన్ నుండి 4 కి.మీ.ల దూరం, హైదరాబాద్ నుండి 104 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్ బస్ స్టేషన్ నుండి 1.4 కిలోమీటర్ల దూరంలో తెలంగాణా నల్గొండ జిల్లాలోని పానాగల్ లో ఉన్న అద్భుతమైన అద్భుత దేవాలయం చయ సోమేశ్వర దేవాలయం. ఇది నల్గొండ మరియు హైదరాబాద్ నుండి సందర్శించడానికి ఆసక్తికరమైన యాత్రాస్థలం మరియు చారిత్రక ప్రదేశం.

మీ
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ...
సహకారం
నా మిత్రులు 

జోగులాంబ ఆలయం అలంపూర్



జోగులాంబ ఆలయం అలంపూర్
తెలంగాణ రాష్ట్రం

భారతదేశంలో వెలిసిన అష్టాదశ శక్తిపీఠాలలో ‘ఆలంపూర్ జోగులాంబ’ ఐదవది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆలంపూర్ ప్రాంతంలో వుంది. సతీదేవి  పై దవడ దంతాలు ఇక్కడ పడ్డాయంటారు.  భక్తులకు రక్షణనిచ్చి, సదా వారి గృహాలను కాపాడే దేవతగా, తమ ఇళ్ళ వాస్తుదోషాలను పోగట్టే గృహ చండిగా, దుష్టదృక్కులనుంచీ, దుష్ట శక్తులనుంచీ కాపాడే దేవతగా ఈ అమ్మవారిని కొలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది.

ఆలయ స్థల పురాణం :

శివుని భార్య సతీదేవి తన తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అక్కడ అవమానాల పాలవుతుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. విషయం తెలుసుకున్న శివుడు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని.. భార్య మీదున్న ప్రేమతో ఆమె మృతదేహాన్ని తన భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో.. శివుని వరప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది.

ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.

ఆలయ చరిత్ర :

క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 9వ శతాబ్దంలో జగద్గురువు శ్రీ శంకరాచార్యులవారు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారంటారు. 14వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు

మీ
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ...
సహకారం
నా మిత్రులు 

శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం

 ఆలయ ప్రత్యేక కథనం

తద్కమల్ల గ్రామం, వరంగల్ జిల్లా 

అమ్మవారి వైభవం:

శాఖవెల్లి మల్లికార్జున భట్టు హనుమకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళీదేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటనే నిలుపుతానని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి, సు దర్శనమిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట. ఇది కేవలం దైవీశక్తి కాని, మానవశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగా శ్రీ భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటి నుంచే కనిపిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోనివా డు. కనుక ప్రతాపరుద్రుని కాలంనాటికే భద్రకాళీ దేవాలయం ప్రసిద్దమై ఉండినట్లు స్పష్టమవుతుంది.

1950లో ఒకరోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేష్‌ శాస్ర్తి, స్థానిక శ్రీవైష్ణవ పండితులు శ్రీమాన్‌ ముడుంబైరామానుజా చార్య నగరంలో ఉన్న ఒక ప్రముఖ వ్యాపారి మగన్‌లాల్‌ సమేజా గారి వద్దకు ఆలయ పునరుద్ధరణకు సహకరించవలసిందిగా కోరడానికి మరునాడు ఉదయం వెళ్దామని నిశ్చయించుకున్నారు.

అదే రాత్రి శ్రీమగన్‌ లాల్‌ సమేజా గారికి అమ్మవారు కలలో కనపడి రేపు నీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వారితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అమ్మవారు ఆదేశించిందట...మరునాడు ఉదయం తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా భావించి ఆ వ్యాపారి ఆలయానికి వచ్చి అమ్మ వారిని దర్శించి నా కుమార్తెకు పడిపోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునురుద్దరణకు నావంతు సహకారం అందిస్తానని శాస్ర్తి గారికి మాట ఇవ్వగా శ్రీ గణేశ శాస్ర్తిగారు ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకించిన జలాన్ని ఒక మాసం వరకు క్రమం తప్పకుండా శ్రీమగన్‌ లాల్‌ సమేజా గారి కూతురికి తీర్థం పెట్టడం ద్వారా ఆమెకు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చింది.

అమ్మవారికి మహిమకు ముగ్ధుడైన శ్రీమగన్‌లాల్‌ సమేజా ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. ఆ సందర్బంలో ఆయనకు శ్రీ విద్యా నిధియైన బ్రహ్మశ్రీ హరి రాధాకృష్ణమూర్తి, తాండ్ర వెంకటరామనర్సయ్య, అడ్లూరి సీతారామశాస్ర్తి, వంగల గురువయ్య, టంకసాల నరసింహారావు, మహాతపస్వి ని మంగళాంబిక ఇలా ఎంతోమంది మహనీయులు ఎందరో చేసిన సహకారం చిరస్మరణీయం.

కాకతీయ రాజు ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగార మై వారి కోర్కెలను తీరుస్తూ ఉన్నట్లు... ‘పతాపరుద్ర చరిత్రము’, ‘సిద్ధేశ్వర చరిత్రము’ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. 

భద్రకాళీ అమ్మవారు. ఈ దేవాలయంలో దేవివిగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అలరారుతూ, భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు ప్రేతా సనాసీనయై ఉన్నది. కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గం, ఛురిక, జపమాల, డమరుకం... ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలం, ఛిన్నమస్తకం, పానపాత్రలు ధరించి... 8 చేతులతో... అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్న భద్రకాళి అమ్మవారి విశేషాలు 

ఆలయ చరిత్ర:

శ్రీ భద్రకాళీ దేవాలయము క్రీ.శ.625 లోనే నిర్మించిపబడిందని స్థానికుల కథనం. వేంగీ చాళుక్యులపైన విజయం సాధించటానికి, పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి ఈ ఆ లయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించి నట్లు చెబుతారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిలమీద చెక్కబడి ఉండటమే. ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కటం చాళుక్య సంప్రదాయంలో కనిపిస్తుంది. రెండవది ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూలస్తంభాలు చతురస్రాకారం లో ఉన్నాయి. కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది. ఆ కారణాల వల్ల ఈదేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మింపబడిందని కొందరి ఊహ.

క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. అదీ కాక హైదరాబాదు సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన, రజాకార్ల దుశ్చర్యల ఫలితంగా దాదాపు క్రీ.శ. 1950 వరకూ ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు. 

అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానం, ఆ స్తంభాలను నిలబెట్టిన విధానం, విశాలమైన ముఖ ద్వారం అన్నీ కాకతీయుల కాలంలో నిర్మింపబడిందేనని అనిపిస్తుంది. 
స్తంభశాస నాలను బట్టి ఈ దేవాలయం క్రీ.శ.10వ శతాబ్దంలో కాకతీయులచే నిర్మింప బడి ఉంటుందని ఊహించవచ్చు. 
ఏమైనప్పటికీ కనీసం వెయ్యు సంవత్సరాల చరిత్రగలది ఈ శ్రీ భద్రకాళీ దేవాలయం.

1950లో పునరుద్ధరించే సమయం వరకూ అమ్మవారు వ్రేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది. ప్రాచీనకాలంలో కూడా అట్లాగే భయంకరంగా ఉండేదట అలాంటి రౌద్రస్వరూపిణిని నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు. (దక్షిణాచార సంప్రదాయం ప్రకారం అర్చింపబడే మూర్తి శాంత స్వరూపంగా ఉండాలనేది శాస్త్ర విధి). అంతేగాక అమ్మవారి గుడిలో శ్రీచండీయంత్ర ప్రతిష్ఠ చేసి, ప్రతి సంవత్సరమూ శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతి నిత్యం దూపదీప నైవేద్యాదులు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు.

భద్రకాళీ చెఱువు:

ఆమ్మవారికి ఎదురుగా పెద్ద చెఱవు ఒకటి ఉన్నది. దానినే భద్రకాళీ చెఱవు అంటారు. వరంగల్‌ నగర ప్రజలకు తాగునీటి సరఫరా ఈ చెఱవు నుండే జరుగుతుంది.

ఆలయం చేరుకోవటం ఎలా:

వరంగల్‌-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలి టెక్నిక్‌ కాలేజీ నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరాన... గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంత మైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది
ఈ ఆలయం వరంగల్ కి 5 కి.మీ లో కలదు

అమ్మవారి అనుగ్రహం తో మిత్రులందరికీ 
తెలంగాణ తీర్థం వారి శుభాకాంక్షలు

మీ
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ...
సహకారం
నా మిత్ర బృందం 

పంచభూత లింగాలు ఏవి ? అవి ఎక్కడ ఉన్నాయి?



లింగరూపం గా ఉండే శంకరుడు పంచభూతాలకి ప్రతీకగా ఐదు చోట్ల లింగాకారములో ఉన్నాడు . పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

1. పృథ్విలింగం: ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం: ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం: ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడు లోని తిరుచునాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం: తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రం పై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం: ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...