Tuesday, August 20, 2013
లగ్నము అనగా ఏమిటి ?
లగ్నము అనగా ఏమిటి ?------------------------సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు.ప్రతి
రోజూ సూర్యోదయ సమయములో ఆ రాశి నుండి ప్రయాణము సాగించి ఆ రోజు
పూర్తయ్యేసరికి ౧౨ రాశులు చుట్టి వస్తాడు. (నిజానికి భూమే సూర్యుని చుట్టూ
తిరుగుతూ ఉంటుంది. మనము స్థిరముగా ఉన్నట్లు, సూర్యుడే తిరుగుతున్నట్లు
కనిపిస్తుంది). ఈ విధంగారోజుకు ఒక డిగ్రీ చొప్పున ముందుకు నడుస్తూ నెల రోజుల తరువాత ఆ రాశిని వదిలి తరువాత రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈవిధంగా ప్రతి రోజు ౧౨ రాశులలో సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక సమయములో ఒక వ్యక్తి జననం అయితే ఆసమయానికి సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తూ ఉంటాడో ఆ రాశి లగ్నం అవుతుంది.
జాతక చక్ర నిర్మాణానికి కావలసినవి - దిగ్దేశకాలమనములు, అనగా --జాతకుని యొక్క (౧) పుట్టిన తేది (౨) పుట్టిన సమయము (౩) పుట్టిన స్థలము
భారత ప్రామాణిక కాలమానము (IST) 82
1/2 (82.30) తూర్పు రేఖాంశము (East Longitude) గా నిర్ణయించబడినది.
జాతకుడు పుట్టిన ప్రదేశములోని సమయమును "స్థానిక కాలమానము" (Local Mean
Time, LMT) అందురు. LMT యొక్క అక్షాంశ, రేఖాంశములు (Latitude, Longitude)
లను గుర్తించ వలెను. (అక్షాంశ, రేఖాంశముల పట్టిక Tables of Ascendants
పుస్తకములోని ౧౦౦వ పేజి నుండి చూడవచ్చును). తరువాత IST మరియు LMT ల మధ్య
గల వ్యత్యాసమును లెక్కించవలెను. IST మరియు LMT మధ్య గల వ్యత్యాసమును
నాలుగుచే (౩౬౦ డిగ్రీలు గల భూమి తన చుట్టూ తాను తిరుగుటకు ౨౪ గంటలు పడితే,
ఒక డిగ్రీ తిరుగుటకు పట్టే సమయము నాలుగు నిమిషాలు) గుణించగా వచ్చిన
లబ్ధమును జాతకుడు పుట్టిన సమయమునకు కలుపుట లేదా తీసివేయుట ద్వారా LMT ని
సవరించవలెను.
ఉదా: ఒక జాతకుడు హైదరాబాదులో సా.గం.౫-౩౦ ని.లకు పుట్టాడని అనుకుంటే,82.30 IST East Longitude78.27 LMT of Hyd. East Longitude---------------04.03 IST(-)LMTx(-) 4---------------(-)16.12---------------5-30-00 జాతకుడు పుట్టిన సమయము, గం-ని-సె(-) 0-16-12---------------5-13-48 స్థానిక కాలమానమునకు సవరించిన తరువాత, జాతకుడు పుట్టిన వాస్తవ సమయము---------------
నక్షత్ర కాలమానము (Sidereal Time)-------------------------------------సూర్యుడు ఒక నక్షత్రము నుండి బయలుదేరి తిరిగి అదే నక్షత్రమును చేరుటకు పట్టే కాలమును నక్షత్రకాలమానము అందురు. ఇది గం.౨౩.౫౭ ని. ఉంటుంది. జాతకుడు పుట్టిన తేదికిTables of Ascendants పుస్తకములోనిSidereal Time (Table-1) ప్రకారము నక్షత్ర కాలమానము గుర్తించ వలెను.
జాతకుడు పుట్టిన సంవత్సరమును సవరణ చేసుకొనవలెను (Tables of Ascendants, Table-2)
తరువాత మ.గం. ౧౨ ల నుండి జాతకుడు పుట్టిన సమయానికి ఉన్న కాలము యొక్క వ్యత్యాసము (Time interval) ను కూడా సవరణ చేయవలెను. (Tables of Ascendants, Table-4)
భారతీయ నక్షత్ర కాలమాన సవరణ కూడా చేయవలెను (Tables of Ascendants, from Page 100). ఇది ౬ ని. లకు ఒక సెకను చొప్పున సరిచేయవలెను.
భారతీయ జ్యోతిషం నిరయన (అయనము లేనిది) పద్దతిని అనుసరించుచున్నది. కావున అయనాంశవ్యత్యాసమును కూడా సవరణ చేయవలెను
శ్రీ దుర్గా దేవి
శ్రీ దుర్గా దేవి
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.
పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.
పూజా విధానము: ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మని పూజించాలి.
మంత్రము: "ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రమును పఠించాలి.
దుర్గా సూక్తము పారాయణ చేయవలెను.
దుర్గా, లలితా అష్టోత్తరములు పఠించవలెను.
నివేదన: పులగము నివేదన చెయ్యాలి.
మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి
నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి
ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి
ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి
ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి )
తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి )
పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )
దేవీకవచం
రచన: ఋషి మార్కన్డేయ
ఓం నమశ్చండికాయై
న్యాసః
అస్య శ్రీ చండీ కవచస్య | బ్రహ్మా ఋషిః | అనుష్టుప్ ఛందః |
చాముండా దేవతా | అంగన్యాసోక్త మాతరో బీజమ్ | నవావరణో మంత్రశక్తిః | దిగ్బంధ దేవతాః తత్వమ్ | శ్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాంగత్వేన జపే వినియోగః ||
ఓం నమశ్చండికాయై
మార్కండేయ ఉవాచ |
ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణామ్ |
యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ || 1 ||
బ్రహ్మోవాచ |
అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకమ్ |
దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే || 2 ||
ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ || 3 ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీ తథా |
సప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమమ్ || 4 ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా || 5 ||
అగ్నినా దహ్యమానాస్తు శత్రుమధ్యగతా రణే |
విషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః || 6 ||
న తేషాం జాయతే కించిదశుభం రణసంకటే |
ఆపదం న చ పశ్యంతి శోకదుఃఖభయంకరీమ్ || 7 ||
యైస్తు భక్త్యా స్మృతా నిత్యం తేషాం వృద్ధిః ప్రజాయతే |
యే త్వాం స్మరంతి దేవేశి రక్షసి తాన్న సంశయః || 8 ||
ప్రేతసంస్థా తు చాముండా వారాహీ మహిషాసనా |
ఐంద్రీ గజసమారూఢా వైష్ణవీ గరుడాసనా || 9 ||
నారసింహీ మహావీర్యా శివదూతీ మహాబలా |
మాహేశ్వరీ వృషారూఢా కౌమారీ శిఖివాహనా || 10 ||
లక్ష్మీః పద్మాసనా దేవీ పద్మహస్తా హరిప్రియా |
శ్వేతరూపధరా దేవీ ఈశ్వరీ వృషవాహనా || 11 ||
బ్రాహ్మీ హంససమారూఢా సర్వాభరణభూషితా |
ఇత్యేతా మాతరః సర్వాః సర్వయోగసమన్వితాః || 12 ||
నానాభరణశోభాఢ్యా నానారత్నోపశోభితాః |
శ్రైష్ఠైశ్చ మౌక్తికైః సర్వా దివ్యహారప్రలంబిభిః || 13 ||
ఇంద్రనీలైర్మహానీలైః పద్మరాగైః సుశోభనైః |
దృశ్యంతే రథమారూఢా దేవ్యః క్రోధసమాకులాః || 14 ||
శంఖం చక్రం గదాం శక్తిం హలం చ ముసలాయుధమ్ |
ఖేటకం తోమరం చైవ పరశుం పాశమేవ చ || 15 ||
కుంతాయుధం త్రిశూలం చ శార్ంగమాయుధముత్తమమ్ |
దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ || 16 ||
ధారయంత్యాయుధానీత్థం దేవానాం చ హితాయ వై |
నమస్తేஉస్తు మహారౌద్రే మహాఘోరపరాక్రమే || 17 ||
మహాబలే మహోత్సాహే మహాభయవినాశిని |
త్రాహి మాం దేవి దుష్ప్రేక్ష్యే శత్రూణాం భయవర్ధిని || 18 ||
ప్రాచ్యాం రక్షతు మామైంద్రీ ఆగ్నేయ్యామగ్నిదేవతా |
దక్షిణేஉవతు వారాహీ నైరృత్యాం ఖడ్గధారిణీ || 19 ||
ప్రతీచ్యాం వారుణీ రక్షేద్వాయవ్యాం మృగవాహినీ |
ఉదీచ్యాం పాతు కౌబేరీ ఈశాన్యాం శూలధారిణీ || 20 ||
ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షేదధస్తాద్వైష్ణవీ తథా |
ఏవం దశ దిశో రక్షేచ్చాముండా శవవాహనా || 21 ||
జయా మామగ్రతః పాతు విజయా పాతు పృష్ఠతః |
అజితా వామపార్శ్వే తు దక్షిణే చాపరాజితా || 22 ||
శిఖాం మే ద్యోతినీ రక్షేదుమా మూర్ధ్ని వ్యవస్థితా |
మాలాధరీ లలాటే చ భ్రువౌ రక్షేద్యశస్వినీ || 23 ||
నేత్రయోశ్చిత్రనేత్రా చ యమఘంటా తు పార్శ్వకే |
త్రినేత్రా చ త్రిశూలేన భ్రువోర్మధ్యే చ చండికా || 24 ||
శంఖినీ చక్షుషోర్మధ్యే శ్రోత్రయోర్ద్వారవాసినీ |
కపోలౌ కాలికా రక్షేత్ కర్ణమూలే తు శంకరీ || 25 ||
నాసికాయాం సుగంధా చ ఉత్తరోష్ఠే చ చర్చికా |
అధరే చామృతాబాలా జిహ్వాయాం చ సరస్వతీ || 26 ||
దంతాన్ రక్షతు కౌమారీ కంఠదేశే తు చండికా |
ఘంటికాం చిత్రఘంటా చ మహామాయా చ తాలుకే || 27 ||
కామాక్షీ చిబుకం రక్షేద్వాచం మే సర్వమంగలా |
గ్రీవాయాం భద్రకాలీ చ పృష్ఠవంశే ధనుర్ధరీ || 28 ||
నీలగ్రీవా బహిః కంఠే నలికాం నలకూబరీ |
స్కంధయోః ఖడ్గినీ రక్షేద్ బాహూ మే వజ్రధారిణీ || 29 ||
హస్తయోర్దండినీ రక్షేదంబికా చాంగులీషు చ |
నఖాఞ్ఛూలేశ్వరీ రక్షేత్ కుక్షౌ రక్షేన్నరేశ్వరీ || 30 ||
స్తనౌ రక్షేన్మహాదేవీ మనఃశోకవినాశినీ |
హృదయే లలితా దేవీ ఉదరే శూలధారిణీ || 31 ||
నాభౌ చ కామినీ రక్షేద్ గుహ్యం గుహ్యేశ్వరీ తథా |
మేఢ్రం రక్షతు దుర్గంధా పాయుం మే గుహ్యవాహినీ || 32 ||
కట్యాం భగవతీ రక్షేదూరూ మే మేఘవాహనా |
జంఘే మహాబలా రక్షేత్ జానూ మాధవనాయికా || 33 ||
గుల్ఫయోర్నారసింహీ చ పాదపృష్ఠే తు కౌశికీ |
పాదాంగులీః శ్రీధరీ చ తలం పాతాలవాసినీ || 34 ||
నఖాన్ దంష్ట్రకరాలీ చ కేశాంశ్చైవోర్ధ్వకేశినీ |
రోమకూపేషు కౌమారీ త్వచం యోగీశ్వరీ తథా || 35 ||
రక్తమజ్జావసామాంసాన్యస్థిమేదాంసి పార్వతీ |
అంత్రాణి కాలరాత్రిశ్చ పిత్తం చ ముకుటేశ్వరీ || 36 ||
పద్మావతీ పద్మకోశే కఫే చూడామణిస్తథా |
జ్వాలాముఖీ నఖజ్వాలామభేద్యా సర్వసంధిషు || 37 ||
శుక్రం బ్రహ్మాణీ మే రక్షేచ్ఛాయాం ఛత్రేశ్వరీ తథా |
అహంకారం మనో బుద్ధిం రక్షేన్మే ధర్మధారిణీ || 38 ||
ప్రాణాపానౌ తథా వ్యానముదానం చ సమానకమ్ |
వజ్రహస్తా చ మే రక్షేత్ ప్రాణాన్ కల్యాణశోభనా || 39 ||
రసే రూపే చ గంధే చ శబ్దే స్పర్శే చ యోగినీ |
సత్త్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా || 40 ||
ఆయూ రక్షతు వారాహీ ధర్మం రక్షతు పార్వతీ |
యశః కీర్తిం చ లక్ష్మీం చ సదా రక్షతు వైష్ణవీ || 41 ||
గోత్రమింద్రాణీ మే రక్షేత్ పశూన్ రక్షేచ్చ చండికా |
పుత్రాన్ రక్షేన్మహాలక్ష్మీర్భార్యాం రక్షతు భైరవీ || 42 ||
ధనేశ్వరీ ధనం రక్షేత్ కౌమారీ కన్యకాం తథా |
పంథానం సుపథా రక్షేన్మార్గం క్షేమంకరీ తథా || 43 ||
రాజద్వారే మహాలక్ష్మీర్విజయా సతత స్థితా |
రక్షాహీనం తు యత్ స్థానం వర్జితం కవచేన తు || 44 ||
తత్సర్వం రక్ష మే దేవి జయంతీ పాపనాశినీ |
సర్వరక్షాకరం పుణ్యం కవచం సర్వదా జపేత్ || 45 ||
ఇదం రహస్యం విప్రర్షే భక్త్యా తవ మయోదితమ్ |
పాదమేకం న గచ్ఛేత్ తు యదీచ్ఛేచ్ఛుభమాత్మనః || 46 ||
కవచేనావృతో నిత్యం యత్ర యత్రైవ గచ్ఛతి |
తత్ర తత్రార్థలాభశ్వ విజయః సార్వకాలికః || 47 ||
యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితమ్ |
పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమాన్ || 48 ||
నిర్భయో జాయతే మర్త్యః సంగ్రామేష్వపరాజితః |
త్రైలోక్యే తు భవేత్పూజ్యః కవచేనావృతః పుమాన్ || 49 ||
ఇదం తు దేవ్యాః కవచం దేవానామపి దుర్లభమ్ |
యః పఠేత్ప్రయతో నిత్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః || 50 ||
దైవీకలా భవేత్తస్య త్రైలోక్యే చాపరాజితః |
జీవేద్వర్షశతం సాగ్రమపమృత్యువివర్జితః || 51 ||
నశ్యంతి వ్యాధయః సర్వే లూతావిస్ఫోటకాదయః |
స్థావరం జంగమం చైవ కృత్రిమం చైవ యద్విషమ్ || 52 ||
అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతలే |
భూచరాః ఖేచరాశ్చైవ కులజాశ్చౌపదేశికాః || 53 ||
సహజా కులజా మాలా డాకినీ శాకినీ తథా |
అంతరిక్షచరా ఘోరా డాకిన్యశ్చ మహారవాః || 54 ||
గ్రహభూతపిశాచాశ్చ యక్షగంధర్వరాక్షసాః |
బ్రహ్మరాక్షసవేతాలాః కూష్మాండా భైరవాదయః || 55 ||
నశ్యంతి దర్శనాత్తస్య కవచేనావృతో హి యః |
మానోన్నతిర్భవేద్రాఙ్ఞస్తేజోవృద్ధిః పరా భవేత్ || 56 ||
యశోవృద్ధిర్భవేత్ పుంసాం కీర్తివృద్ధిశ్చ జాయతే |
తస్మాత్ జపేత్ సదా భక్తః కవచం కామదం మునే || 57 ||
జపేత్ సప్తశతీం చండీం కృత్వా తు కవచం పురా |
నిర్విఘ్నేన భవేత్ సిద్ధిశ్చండీజపసముద్భవా || 58 ||
యావద్భూమండలం ధత్తే సశైలవనకాననమ్ |
తావత్తిష్ఠతి మేదిన్యాం సంతతిః పుత్రపౌత్రికీ || 59 ||
దేహాంతే పరమం స్థానం సురైరపి సుదుర్లభమ్ |
ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయాప్రసాదతః || 60 ||
తత్ర గచ్ఛతి గత్వాసౌ పునశ్చాగమనం నహి |
లభతే పరమం స్థానం శివేన సమతాం వ్రజేత్ || 61 ||
|| ఇతి శ్రీమార్కండేయపురాణే హరిహరబ్రహ్మవిరచితం దేవీకవచం సమాప్తమ్
మన్యు సూక్తమ్
యస్తే” మన్యోஉవి’ధద్ వజ్ర సాయక సహ ఓజః’ పుష్యతి విశ్వ’మానుషక్ |
సాహ్యామ దాసమార్యం త్వయా” యుజా సహ’స్కృతేన సహ’సా సహ’స్వతా || 1 ||
మన్యురింద్రో” మన్యురేవాస’ దేవో మన్యుర్ హోతా వరు’ణో జాతవే”దాః |
మన్యుం విశ’ ఈళతే మాను’షీర్యాః పాహి నో” మన్యో తప’సా సజోషా”ః || 2 ||
అభీ”హి మన్యో తవసస్తవీ”యాన్ తప’సా యుజా వి జ’హి శత్రూ”న్ |
అమిత్రహా వృ’త్రహా ద’స్యుహా చ విశ్వా వసూన్యా భ’రా త్వం నః’ || 3 ||
త్వం హి మ”న్యో అభిభూ”త్యోజాః స్వయంభూర్భామో” అభిమాతిషాహః |
విశ్వచ’ర్-షణిః సహు’రిః సహా”వానస్మాస్వోజః పృత’నాసు ధేహి || 4 ||
అభాగః సన్నప పరే”తో అస్మి తవ క్రత్వా” తవిషస్య’ ప్రచేతః |
తం త్వా” మన్యో అక్రతుర్జి’హీళాహం స్వాతనూర్బ’లదేయా”య మేహి’ || 5 ||
అయం తే” అస్మ్యుప మేహ్యర్వాఙ్ ప్ర’తీచీనః స’హురే విశ్వధాయః |
మన్యో” వజ్రిన్నభి మామా వ’వృత్స్వహనా”వ దస్యూ”న్ ఋత బో”ధ్యాపేః || 6 ||
అభి ప్రేహి’ దక్షిణతో భ’వా మేஉధా” వృత్రాణి’ జంఘనావ భూరి’ |
జుహోమి’ తే ధరుణం మధ్వో అగ్ర’ముభా ఉ’పాంశు ప్ర’థమా పి’బావ || 7 ||
త్వయా” మన్యో సరథ’మారుజంతో హర్ష’మాణాసో ధృషితా మ’రుత్వః |
తిగ్మేష’వ ఆయు’ధా సంశిశా”నా అభి ప్రయం”తు నరో” అగ్నిరూ”పాః || 8 ||
అగ్నిరి’వ మన్యో త్విషితః స’హస్వ సేనానీర్నః’ సహురే హూత ఏ”ధి |
హత్వాయ శత్రూన్ వి భ’జస్వ వేద ఓజో మిమా”నో విమృధో” నుదస్వ || 9 ||
సహ’స్వ మన్యో అభిమా”తిమస్మే రుజన్ మృణన్ ప్ర’మృణన్ ప్రేహి శత్రూ”న్ |
ఉగ్రం తే పాజో” నన్వా రు’రుధ్రే వశీ వశం” నయస ఏకజ త్వమ్ || 10 ||
ఏకో” బహూనామ’సి మన్యవీళితో విశం”విశం యుధయే సం శి’శాధి |
అకృ’త్తరుక్ త్వయా” యుజా వయం ద్యుమంతం ఘోషం” విజయాయ’ కృణ్మహే || 11 ||
విజేషకృదింద్ర’ ఇవానవబ్రవో(ఓ)3’உస్మాకం” మన్యో అధిపా భ’వేహ |
ప్రియం తే నామ’ సహురే గృణీమసి విద్మాతముత్సం యత’ ఆబభూథ’ || 12 ||
ఆభూ”త్యా సహజా వ’జ్ర సాయక సహో” బిభర్ష్యభిభూత ఉత్త’రమ్ |
క్రత్వా” నో మన్యో సహమేద్యే”ధి మహాధనస్య’ పురుహూత సంసృజి’ || 13 ||
సంసృ’ష్టం ధన’ముభయం” సమాకృ’తమస్మభ్యం” దత్తాం వరు’ణశ్చ మన్యుః |
భియం దధా”నా హృద’యేషు శత్ర’వః పరా”జితాసో అప నిల’యంతామ్ || 14 ||
ధన్వ’నాగాధన్వ’ నాజింజ’యేమ ధన్వ’నా తీవ్రాః సమదో” జయేమ |
ధనుః శత్రో”రపకామం కృ’ణోతి ధన్వ’ నాసర్వా”ః ప్రదిశో” జయేమ ||
భద్రం నో అపి’ వాతయ మనః’ ||
ఓం శాంతా’ పృథివీ శి’వమంతరిక్షం ద్యౌర్నో” దేవ్యஉభ’యన్నో అస్తు |
శివా దిశః’ ప్రదిశ’ ఉద్దిశో” నஉఆపో” విశ్వతః పరి’పాంతు సర్వతః శాంతిః శాంతిః శాంతిః’ ||
నక్షత్రేష్టి
తైత్తిరీయ బ్రహ్మణమ్ | అష్టకమ్ – 3 ప్రశ్నః – 1
తైత్తిరీయ సంహితాః | కాండ 3 ప్రపాఠకః – 5 అనువాకమ్ – 1
ఓం || అగ్నిర్నః’ పాతు కృత్తి’కాః | నక్ష’త్రం దేవమి’ంద్రియమ్ | ఇదమా’సాం విచక్షణమ్ | హవిరాసం జు’హోతన | యస్య భాంతి’ రశ్మయో యస్య’ కేతవః’ | యస్యేమా విశ్వా భువ’నాని సర్వా” | స కృత్తి’కాభిరభిసంవసా’నః | అగ్నిర్నో’ దేవస్సు’వితే ద’ధాతు || 1 ||
ప్రజాప’తే రోహిణీవే’తు పత్నీ” | విశ్వరూ’పా బృహతీ చిత్రభా’నుః | సా నో’ యఙ్ఞస్య’ సువితే ద’ధాతు | యథా జీవే’మ శరదస్సవీ’రాః | రోహిణీ దేవ్యుద’గాత్పురస్తా”త్ | విశ్వా’ రూపాణి’ ప్రతిమోద’మానా | ప్రజాప’తిగ్‍మ్ హవిషా’ వర్ధయ’ంతీ | ప్రియా దేవానాముప’యాతు యఙ్ఞమ్ || 2 ||
సోమో రాజా’ మృగశీర్షేణ ఆగన్న్’ | శివం నక్ష’త్రం ప్రియమ’స్య ధామ’ | ఆప్యాయ’మానో బహుధా జనే’షు | రేతః’ ప్రజాం యజ’మానే దధాతు | యత్తే నక్ష’త్రం మృగశీర్షమస్తి’ | ప్రియగ్‍మ్ రా’జన్ ప్రియత’మం ప్రియాణా”మ్ | తస్మై’ తే సోమ హవిషా’ విధేమ | శన్న’ ఏధి ద్విపదే శం చతు’ష్పదే || 3 ||
ఆర్ద్రయా’ రుద్రః ప్రథ’మా న ఏతి | శ్రేష్ఠో’ దేవానాం పతి’రఘ్నియానా”మ్ | నక్ష’త్రమస్య హవిషా’ విధేమ | మా నః’ ప్రజాగ్‍మ్ రీ’రిషన్మోత వీరాన్ | హేతి రుద్రస్య పరి’ణో వృణక్తు | ఆర్ద్రా నక్ష’త్రం జుషతాగ్‍మ్ హవిర్నః’ | ప్రముంచమా’నౌ దురితాని విశ్వా” | అపాఘశగ్‍మ్’ సన్నుదతామరా’తిమ్ | || 4||
పున’ర్నో దేవ్యది’తిస్పృణోతు | పున’ర్వసూనః పునరేతాం” యఙ్ఞమ్ | పున’ర్నో దేవా అభియ’ంతు సర్వే” | పునః’ పునర్వో హవిషా’ యజామః | ఏవా న దేవ్యది’తిరనర్వా | విశ్వ’స్య భర్త్రీ జగ’తః ప్రతిష్ఠా | పున’ర్వసూ హవిషా’ వర్ధయ’ంతీ | ప్రియం దేవానా-మప్యే’తు పాథః’ || 5||
బృహస్పతిః’ ప్రథమం జాయ’మానః | తిష్యం’ నక్ష’త్రమభి సంబ’భూవ | శ్రేష్ఠో’ దేవానాం పృత’నాసుజిష్ణుః | దిశోஉను సర్వా అభ’యన్నో అస్తు | తిష్యః’ పురస్తా’దుత మ’ధ్యతో నః’ | బృహస్పతి’ర్నః పరి’పాతు పశ్చాత్ | బాధే’తాంద్వేషో అభ’యం కృణుతామ్ | సువీర్య’స్య పత’యస్యామ || 6 ||
ఇదగ్మ్ సర్పేభ్యో’ హవిర’స్తు జుష్టమ్” | ఆశ్రేషా యేషా’మనుయంతి చేతః’ | యే అంతరి’క్షం పృథివీం క్షియంతి’ | తే న’స్సర్పాసో హవమాగ’మిష్ఠాః | యే రో’చనే సూర్యస్యాపి’ సర్పాః | యే దివం’ దేవీమను’సంచర’ంతి | యేషా’మశ్రేషా అ’నుయంతి కామమ్” | తేభ్య’స్సర్పేభ్యో మధు’మజ్జుహోమి || 7 ||
ఉప’హూతాః పితరో యే మఘాసు’ | మనో’జవసస్సుకృత’స్సుకృత్యాః | తే నో నక్ష’త్రే హవమాగ’మిష్ఠాః | స్వధాభి’ర్యఙ్ఞం ప్రయ’తం జుషంతామ్ | యే అ’గ్నిదగ్ధా యేஉన’గ్నిదగ్ధాః | యే’உముల్లోకం పితరః’ క్షియంతి’ | యాగ్‍శ్చ’ విద్మయాగ్మ్ ఉ’ చ న ప్ర’విద్మ | మఘాసు’ యఙ్ఞగ్మ్ సుకృ’తం జుషంతామ్ || 8||
గవాం పతిః ఫల్గు’నీనామసి త్వమ్ | తద’ర్యమన్ వరుణమిత్ర చారు’ | తం త్వా’ వయగ్మ్ స’నితారగ్‍మ్’ సనీనామ్ | జీవా జీవ’ంతముప సంవి’శేమ | యేనేమా విశ్వా భువ’నాని సంజి’తా | యస్య’ దేవా అ’నుసంయంతి చేతః’ | అర్యమా రాజాஉజరస్తు వి’ష్మాన్ | ఫల్గు’నీనామృషభో రో’రవీతి || 9 ||
శ్రేష్ఠో’ దేవానాం” భగవో భగాసి | తత్త్వా’ విదుః ఫల్గు’నీస్తస్య’ విత్తాత్ | అస్మభ్యం’ క్షత్రమజరగ్మ్’ సువీర్యమ్” | గోమదశ్వ’వదుపసన్ను’దేహ | భగో’హ దాతా భగ ఇత్ప్ర’దాతా | భగో’ దేవీః ఫల్గు’నీరావి’వేశ | భగస్యేత్తం ప్ర’సవం గ’మేమ | యత్ర’ దేవైస్స’ధమాదం’ మదేమ | || 10 ||
ఆయాతు దేవస్స’వితోప’యాతు | హిరణ్యయే’న సువృతా రథే’న | వహన్, హస్తగ్‍మ్’ సుభగ్‍మ్’ విద్మనాప’సమ్ | ప్రయచ్ఛ’ంతం పపు’రిం పుణ్యమచ్ఛ’ | హస్తః ప్రయ’చ్ఛ త్వమృతం వసీ’యః | దక్షి’ణేన ప్రతి’గృభ్ణీమ ఏనత్ | దాతార’మద్య స’వితా వి’దేయ | యో నో హస్తా’య ప్రసువాతి’ యఙ్ఞమ్ ||11 ||
త్వష్టా నక్ష’త్రమభ్యే’తి చిత్రామ్ | సుభగ్‍మ్ స’సంయువతిగ్మ్ రాచ’మానామ్ | నివేశయ’న్నమృతాన్మర్త్యాగ్’శ్చ | రూపాణి’ పిగ్ంశన్ భువ’నాని విశ్వా” | తన్నస్త్వష్టా తదు’ చిత్రా విచ’ష్టామ్ | తన్నక్ష’త్రం భూరిదా అ’స్తు మహ్యమ్” | తన్నః’ ప్రజాం వీరవ’తీగ్‍మ్ సనోతు | గోభి’ర్నో అశ్వైస్సమ’నక్తు యఙ్ఞమ్ || 12 ||
వాయుర్నక్ష’త్రమభ్యే’తి నిష్ట్యా”మ్ | తిగ్మశృం’గో వృషభో రోరు’వాణః | సమీరయన్ భువ’నా మాతరిశ్వా” | అప ద్వేషాగ్‍మ్’సి నుదతామరా’తీః | తన్నో’ వాయస్తదు నిష్ట్యా’ శృణోతు | తన్నక్ష’త్రం భూరిదా అ’స్తు మహ్యమ్” | తన్నో’ దేవాసో అను’జానంతు కామమ్” | యథా తరే’మ దురితాని విశ్వా” || 13 ||
దూరమస్మచ్ఛత్ర’వో యంతు భీతాః | తది’ంద్రాగ్నీ కృ’ణుతాం తద్విశా’ఖే | తన్నో’ దేవా అను’మదంతు యఙ్ఞమ్ | పశ్చాత్ పురస్తాదభ’యన్నో అస్తు | నక్ష’త్రాణామధి’పత్నీ విశా’ఖే | శ్రేష్ఠా’వింద్రాగ్నీ భువ’నస్య గోపౌ | విషూ’చశ్శత్రూ’నపబాధ’మానౌ | అపక్షుధ’న్నుదతామరా’తిమ్ | || 14 ||
పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తా”త్ | ఉన్మ’ధ్యతః పౌ”ర్ణమాసీ జి’గాయ | తస్యాం” దేవా అధి’సంవస’ంతః | ఉత్తమే నాక’ ఇహ మా’దయంతామ్ | పృథ్వీ సువర్చా’ యువతిః సజోషా”ః | పౌర్ణమాస్యుద’గాచ్ఛోభ’మానా | ఆప్యాయయ’ంతీ దురితాని విశ్వా” | ఉరుం దుహాం యజ’మానాయ యఙ్ఞమ్ |
ఋద్ధ్యాస్మ’ హవ్యైర్నమ’సోపసద్య’ | మిత్రం దేవం మి’త్రధేయం’ నో అస్తు | అనూరాధాన్, హవిషా’ వర్ధయ’ంతః | శతం జీ’వేమ శరదః సవీ’రాః | చిత్రం నక్ష’త్రముద’గాత్పురస్తా”త్ | అనూరాధా స ఇతి యద్వద’ంతి | తన్మిత్ర ఏ’తి పథిభి’ర్దేవయానై”ః | హిరణ్యయైర్విత’తైరంతరి’క్షే || 16 ||
ఇంద్రో” జ్యేష్ఠామను నక్ష’త్రమేతి | యస్మి’న్ వృత్రం వృ’త్ర తూర్యే’ తతార’ | తస్మి’న్వయ-మమృతం దుహా’నాః | క్షుధ’ంతరేమ దురి’తిం దురి’ష్టిమ్ | పురందరాయ’ వృషభాయ’ ధృష్ణవే” | అషా’ఢాయ సహ’మానాయ మీఢుషే” | ఇంద్రా’య జ్యేష్ఠా మధు’మద్దుహా’నా | ఉరుం కృ’ణోతు యజ’మానాయ లోకమ్ | || 17 ||
మూలం’ ప్రజాం వీరవ’తీం విదేయ | పరా”చ్యేతు నిరృ’తిః పరాచా | గోభిర్నక్ష’త్రం పశుభిస్సమ’క్తమ్ | అహ’ర్భూయాద్యజ’మానాయ మహ్యమ్” | అహ’ర్నో అద్య సు’వితే ద’దాతు | మూలం నక్ష’త్రమితి యద్వద’ంతి | పరా’చీం వాచా నిరృ’తిం నుదామి | శివం ప్రజాయై’ శివమ’స్తు మహ్యమ్” || 18 ||
యా దివ్యా ఆపః పయ’సా సంబభూవుః | యా అంతరి’క్ష ఉత పార్థి’వీర్యాః | యాసా’మషాఢా అ’నుయంతి కామమ్” | తా న ఆపః శగ్గ్ స్యోనా భ’వంతు | యాశ్చ కూప్యా యాశ్చ’ నాద్యా”స్సముద్రియా”ః | యాశ్చ’ వైశంతీరుత ప్రా’సచీర్యాః | యాసా’మషాఢా మధు’ భక్షయ’ంతి | తా న ఆపః శగ్గ్ స్యోనా భ’వంతు ||19 ||
తన్నో విశ్వే ఉప’ శృణ్వంతు దేవాః | తద’షాఢా అభిసంయ’ంతు యఙ్ఞమ్ | తన్నక్ష’త్రం ప్రథతాం పశుభ్యః’ | కృషిర్వృష్టిర్యజ’మానాయ కల్పతామ్ | శుభ్రాః కన్యా’ యువతయ’స్సుపేశ’సః | కర్మకృత’స్సుకృతో’ వీర్యా’వతీః | విశ్వా”న్ దేవాన్, హవిషా’ వర్ధయ’ంతీః | అషాఢాః కామముపా’యంతు యఙ్ఞమ్ || 20 ||
యస్మిన్ బ్రహ్మాభ్యజ’యత్సర్వ’మేతత్ | అముంచ’ లోకమిదమూ’చ సర్వమ్” | తన్నో నక్ష’త్రమభిజిద్విజిత్య’ | శ్రియం’ దధాత్వహృ’ణీయమానమ్ | ఉభౌ లోకౌ బ్రహ్మ’ణా సంజి’తేమౌ | తన్నో నక్ష’త్రమభిజిద్విచ’ష్టామ్ | తస్మి’న్వయం పృత’నాస్సంజ’యేమ | తన్నో’ దేవాసో అను’జానంతు కామమ్” || 21 ||
శృణ్వంతి’ శ్రోణామమృత’స్య గోపామ్ | పుణ్యా’మస్యా ఉప’శృణోమి వాచమ్” | మహీం దేవీం విష్ణు’పత్నీమజూర్యామ్ | ప్రతీచీ’ మేనాగ్‍మ్ హవిషా’ యజామః | త్రేధా విష్ణు’రురుగాయో విచ’క్రమే | మహీం దివం’ పృథివీమంతరి’క్షమ్ | తచ్ఛ్రోణైతిశ్రవ’-ఇచ్ఛమా’నా | పుణ్యగ్గ్ శ్లోకం యజ’మానాయ కృణ్వతీ || 22 ||
అష్టౌ దేవా వస’వస్సోమ్యాసః’ | చత’స్రో దేవీరజరాః శ్రవి’ష్ఠాః | తే యఙ్ఞం పా”ంతు రజ’సః పురస్తా”త్ | సంవత్సరీణ’మమృతగ్గ్’ స్వస్తి | యఙ్ఞం నః’ పాంతు వస’వః పురస్తా”త్ | దక్షిణతో’உభియ’ంతు శ్రవి’ష్ఠాః | పుణ్యన్నక్ష’త్రమభి సంవి’శామ | మా నో అరా’తిరఘశగ్ంసాஉగన్న్’ || 23 ||
క్షత్రస్య రాజా వరు’ణోஉధిరాజః | నక్ష’త్రాణాగ్‍మ్ శతభి’షగ్వసి’ష్ఠః | తౌ దేవేభ్యః’ కృణుతో దీర్ఘమాయుః’ | శతగ్మ్ సహస్రా’ భేషజాని’ ధత్తః | యఙ్ఞన్నో రాజా వరు’ణ ఉప’యాతు | తన్నో విశ్వే’ అభి సంయ’ంతు దేవాః | తన్నో నక్ష’త్రగ్‍మ్ శతభి’షగ్జుషాణమ్ | దీర్ఘమాయుః ప్రతి’రద్భేషజాని’ || 24 ||
అజ ఏక’పాదుద’గాత్పురస్తా”త్ | విశ్వా’ భూతాని’ ప్రతి మోద’మానః | తస్య’ దేవాః ప్ర’సవం య’ంతి సర్వే” | ప్రోష్ఠపదాసో’ అమృత’స్య గోపాః | విభ్రాజ’మానస్సమిధా న ఉగ్రః | ఆஉంతరి’క్షమరుహదగంద్యామ్ | తగ్‍మ్ సూర్యం’ దేవమజమేక’పాదమ్ | ప్రోష్ఠపదాసో అను’యంతి సర్వే” || 25 ||
అహి’ర్బుధ్నియః ప్రథ’మా న ఏతి | శ్రేష్ఠో’ దేవానా’ముత మాను’షాణామ్ | తం బ్రా”హ్మణాస్సో’మపాస్సోమ్యాసః’ | ప్రోష్ఠపదాసో’ అభిర’క్షంతి సర్వే” | చత్వార ఏక’మభి కర్మ’ దేవాః | ప్రోష్ఠపదా స ఇతి యాన్, వద’ంతి | తే బుధ్నియం’ పరిషద్యగ్గ్’ స్తువంతః’ | అహిగ్‍మ్’ రక్షంతి నమ’సోపసద్య’ || 26 ||
పూషా రేవత్యన్వే’తి పంథా”మ్ | పుష్టిపతీ’ పశుపా వాజ’బస్త్యౌ | ఇమాని’ హవ్యా ప్రయ’తా జుషాణా | సుగైర్నో యానైరుప’యాతాం యఙ్ఞమ్ | క్షుద్రాన్ పశూన్ ర’క్షతు రేవతీ’ నః | గావో’ నో అశ్వాగ్మ్ అన్వే’తు పూషా | అన్నగ్ం రక్ష’ంతౌ బహుధా విరూ’పమ్ | వాజగ్‍మ్’ సనుతాం యజ’మానాయ యఙ్ఞమ్ || 27 ||
తదశ్వినా’వశ్వయుజోప’యాతామ్ | శుభంగమి’ష్ఠౌ సుయమే’భిరశ్వై”ః | స్వం నక్ష’త్రగ్‍మ్ హవిషా యజ’ంతౌ | మధ్వాసంపృ’క్తౌ యజు’షా సమ’క్తౌ | యౌ దేవానాం” భిషజౌ” హవ్యవాహౌ | విశ్వ’స్య దూతావమృత’స్య గోపౌ | తౌ నక్షత్రం జుజుషాణోప’యాతామ్ | నమోஉశ్విభ్యాం” కృణుమోஉశ్వయుగ్భ్యా”మ్ || 28 ||
అప’ పాప్మానం భర’ణీర్భరంతు | తద్యమో రాజా భగ’వాన్, విచ’ష్టామ్ | లోకస్య రాజా’ మహతో మహాన్, హి | సుగం నః పంథామభ’యం కృణోతు | యస్మిన్నక్ష’త్రే యమ ఏతి రాజా” | యస్మి’న్నేనమభ్యషిం’చంత దేవాః | తద’స్య చిత్రగ్‍మ్ హవిషా’ యజామ | అప’ పాప్మానం భర’ణీర్భరంతు || 29 ||
నివేశ’నీ సంగమ’నీ వసూ’నాం విశ్వా’ రూపాణి వసూ”న్యావేశయ’ంతీ | సహస్రపోషగ్మ్ సుభగా రరా’ణా సా న ఆగన్వర్చ’సా సంవిదానా | యత్తే’ దేవా అద’ధుర్భాగధేయమమా’వాస్యే సంవస’ంతో మహిత్వా | సా నో’ యఙ్ఞం పి’పృహి విశ్వవారే రయిన్నో’ ధేహి సుభగే సువీరమ్” || 30 ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ |
శ్రీ సూక్తం
శ్రీ సూక్తం
హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద-ప్రబోధినీమ్
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్
కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే
ఆదిత్యవర్ణే తపసో థిజాతో వనస్పతిస్తవ వృక్షో థ బిల్వః
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాదు మే
క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్షీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీ”మ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్
మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి
పశూనాం రూపమన్యస్య మయి శ్రీః శ్రయతాం యశః
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్
ఆపః సృజంతు స్నిగ్దాని చిక్లీత వస మే గృహే
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణా”మ్ హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ
ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగలా”మ్ పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ
తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీ”మ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వా”న్, విందేయం పురుషానహమ్
ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయా”త్
~ ఓం శాంతిః శాంతిః శాంతిః ~
''ఇట్లు''
మీ
జి.సుబ్రహ్మణ్య శర్మ
Subscribe to:
Posts (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
జ్ఞానం తో కానీ అజ్ఞానం తో కానీ చేసిన సకల తప్పులను ఒప్పులను మన్నించి మమ్ములను కాపాడువాడివి దయగల హృదయుడవు కరుణ స్వామివి కలియుగ దైవం ఐన హర...
-
🔔 *పాడ్యమి* శుద్ధ పాడ్యమి ఉదయం నుండి పనులకు మంచిది కాదు, తిది అర్ధ భాగం తరువాత మంచిది, బహుళ పాడ్యమి అన్నిటికీ శుభప్రదమే. *ఈ త...