Thursday, March 29, 2018

మోక్షాన్ని ఎవరు ఇప్పించగలరు

ఒక రాజు ఉన్నాడు. "భాగవతాన్ని విన్న వెంటనే పరీక్షిత్తుకు పరమపదం ప్రాప్తించిందని ఆయన తెలుసుకుని ఒక పండితుని తన ఆస్థానానికి పిలిపించుకుని భాగవత పారాయణ చెయ్యమని కోరాడు. రాజు ఏడు రోజులు
నియమబద్ధంగా భాగవతకథను ఆలకించి పరిసమాప్తి చేశాడు.

   మరుసటిరోజు పండితుని పిలిపించి
రాజు "స్వామీ! మీరు భాగవతాన్ని ఎంతో
శ్రద్ధగా విన్పించారు. నేను కూడా శ్రద్ధగా
విన్నాను. మరి నాకెందుకు ఉత్తమగతులు కలుగలేదు? అని ప్రశ్నించాడు. దానికి ఆ పండితుడు --
"ప్రభూ! మీ ప్రశ్నకు నావద్ద సమాధానం
లేదు. బహుశా నా గురువు మీ సందేహాన్ని తీర్చగలరు" అనగారాజ
సభకు గురువుగార్ని సాదరంగా రప్పించారు. మహారాజు ఆ గురువుకు
నమస్కరించి అతిధి సత్కారములు చేసి తన సందేహం ఆయన ముందు ఉంచారు. 'గురువర్యా! భాగవతాన్ని విన్నా నాకెందుకు ముక్తి కలుగలేదు?

   గురువు రాజుతో-- "ప్రభూ! కాసేపు మీ
అధికారాన్ని నాకు ఇవ్వండి".అలాగే
నన్నాడు రాజు. ఇప్పుడు ఆ గురువే రాజైనాడు. రాజుగా మారిన గురువు వెంటనే రాజుగారిని మరియు  పండితుణ్ని బంధింపజేసాడు.తర్వాత
పండితునితో " ఓయీ! నీవు రాజును
బంధవిముక్తుని చేయుము "అని ఆజ్ఞాపించాడు. దానికి పండితుడు
"ఆచార్యా! స్వయంగా నేెను బంధితుడనై ఉన్నాను. ఇక నేను మహారాజును ఎలా
విడుదల చేయగలను ?" వెంటనే గురువు
మహారాజుతో "రాజా! మీ ప్రశ్నకు సమా
ధానం లభించినదా? అడుగగా రాజు తనకర్థం కాలేదనగా గురువు తిరిగి ఇలా అన్నారు.

"రాజా! స్వయంగా బంధితుడైన వ్యక్తి
ఎదుటివారిని బంధాలనుండి తప్పించలేడు. అర్థమైనది కదా! అలాగే ముక్తుడు కానివాడు మరొకరికి ముక్తిని
ప్రసాదించలేడు. సిద్ధుడు, ముక్తసంగుడైన
వాడే శ్రద్ధాళువుకు ఉత్తమగతిని కల్పించ
గలడు. " అని వివరించాడు.

   శుకమహర్షి వంటి ముక్తిసంగుడు, పరీక్షత్తు వంటి శ్రద్ధాళువు ఉన్నపుడే
ముక్తి లబించగలదని భావం.

నీతి:   జ్ఞానియైన గురువునకు శ్రద్ధగల   శిష్యుడు సమకూరినప్పుడే మోక్షం లభించగలదు.

ఋషివర్య ధర్మం జీవన విజ్ఞానం

మనం సంకల్పం అని ఒకటి చేస్తూఉంటాం. ప్రతీ రోజూ పూజ చేసేటప్పుడు "దేశకాలసంకీరతూనమూ" అంటరు.
అందులో "భరత వర్షే, భరత ఖండే" అని చెప్తూంటం. దేశమూ, కాలమూ ఈ రండూ ప్రధానంగా దేనికొరకు అంటే ధర్మానుష్ఠానం కొరకు. ధర్మం ఎవరు నిర్వర్తి౦చాలీ? ఒక్క మనుష్యునికే ధర్మం. ఆ ధర్మం నిరంతరమూ మారిపోతూ ఉంటంది. మిగిల్న వాటికనినిటికీ ఒకటే ధర్మం. తిర్యక్కులకు అంటే ప్రత్యేకించి పశువులకూ, పక్షులకూ అన్నిటికీ ఒకటే ధర్మం, పశుధర్మం అంటరు.

|| పశుధర్మ నమో ప్రీతం అంటారు" దేవీభాగవతంలో వ్యాస భగవానుడు. పశువులకి ధర్మం ఒక్కటే. ఆకలేస్తే తనేయడం, దాహమేస్తే తాగడం, కామం కలిగితే సంభోగించడం, నిద్రవస్తే పడుకోవడం, కోపమొస్తే కుమ్మడం. అంతే వాటి ధర్మం. అంతే తప్పా వాటికి ఇతరవిధాలైన ధర్మం లేదు. ఇతరవిధాలైన ధర్మం అన్న మాటను మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. ఏ ధర్మాన్ని అనుష్ఠానించిన కారణంచేత ఇంక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరంలేని స్దితిని పందుతాడో, అటవంటి ధర్మాచరణం చెయ్యవలసిన  స్దితి కానీ, అధికారం కానీ, ఇతరప్రాణులకు కలిగించబడలేదు. ధర్మానుష్ఠానమంతా ఎవరి కొరకు అంటే కేవలం మనుష్యుని కొరకు.

మళ్ళీ ఈ భూలోకానికంతటికీ కూడా ధర్మాచరణం కానీ, కర్మాచరణం కానీ, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహంచడం కానీ, అధికారం ఎక్కడ్ననిదీ అంటే ఒక్క భరతవర్షే, భరతఖండే, జంబూదీ్వపే. వేదం స్పష్టంగా ఆ మాటలు చెప్పింది. ఇక్కడ మాత్రమే కర్మానుష్ఠానం, యజ్ఞయ్గాది క్రతువులు జరుగుతాయి తప్పా ఇతరమైన ప్రదేశాల యందు భూమండలంలో ఈ క్రతువులు చేయయాడానికి యోగయామైన ప్రదేశాలు లేవు.

Wednesday, March 28, 2018

బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి

శ్లో|| అర్థా గృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాః
       సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంతమనుగచ్ఛతి

                                                                         --సూక్తి ముక్తావళి. 112

సంపాదించిన డబ్బు ఇంట్లో ఉంటుంది. బంధు మిత్రాదులు స్మశానం వఱకు వస్తారు. చేసుకున్న మంచి చెడుల ఫలితాలు మాత్రమే మనల్ని అనుసరిస్తాయి.

నదీ ప్రవాహంలో రెండు పుల్లలు కొట్టుకొని వస్తుంటాయి. ఒక కెరటం, ఆ పుల్లలను కలుపుతుంది. కొంత దూరం కలిసి ప్రయాణం చేస్తాయి. ఇంకొక కెరటం వాటిని విడదీస్తుంది. ఈ లోకంలో భార్యాభర్తల అనుబంధం ఇంతే. ఎంతటి ప్రాణ సమానురాలైన భార్య అయినా సరే, నువ్వు మరణిస్తే, నీతో పాటు మరణించ లేదు, సరికదా! శవం దగ్గరకు రావడానికి కూడా భయపడుతుంది.

ఒకప్పుడు ఆడవాళ్లను స్మశానం వఱకు అనుమతించే వారు కాదు. కాలం మారి, ఇప్పుడు రాగలుగుతున్నారు. మామూలుగా అయితే, శవయాత్రలో కూడా పాల్గొననీయక, కేవలం ఇంటి గడప వఱకే ఉంచుతారు. కుమారుడు, మిత్రులు, బంధువులు స్మశానం వఱకు వస్తారు. అదీ స్మశానంలో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయుటకు మాత్రమే. శరీరం మాత్రం, చితి పైకి చేరి కాలిపోతుంది. తర్వాత, నీతో గూడా వచ్చిన వారు ఒక్కసారి నీటిలో మునిగి, తమ దారిన తాము వెళ్లిపోతారు.

నువ్వు దాచుకున్న డబ్బు, మహా అయితే, నీ అంత్యక్రియలకు ఉపయోగపడవచ్చు. అది కూడా ఎవరో ఖర్చు పెడతారు. నువు చూడ బోవు. అలాంటప్పుడు, చంచలమైన ధనం కోసం తపన ఎందుకు? ఆలోచిస్తే, ఆనందమనేది ధనంలో లేదు. ధనం సుఖాన్ని ఇచ్చేటట్టయితే, ధనమున్న వారంతా సుఖపడాలి. అలా వారు లేరని, చూస్తున్న మనందరికీ తెలుస్తున్నది. అలాగే, ధనం లేని పేదవారు, గుడిసెలలోనే ఆనందంగా జీవిస్తూ కాలం గడిపేస్తున్నారు.

జీవితమంతా నిన్నే (ఆత్మను) అంటిపెట్టుకొన్న శరీరం కూడా, నిన్నొదిలేసి చితి మంటలలో కాలి, బూడిదైపోతుంది. ఇక శరీరమనబడేది ఉండదు. ప్రతిదీ కాలంలో హరించుకుపోతుంది, ఒక్క చైతన్యాన్ని మాత్రం స్ప్రుశించలేదు. ఆ చైతన్యాన్ని సదా దర్శించేవాడే తత్వజ్ఙుడు. ఆ (తత్+త్వం) తత్వమే బ్రహ్మపదార్థం. బ్రహ్మమొక్కటే సత్యం. ఆ బ్రహ్మను తెలుసుకుంటే, "బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి". ఇదే అసలు జ్ఙానం.

సజ్జన సాంగత్యం వలన పునీతులమవుతాం. ఇది కేవలం, దైవానుగ్రహం వలన మాత్రమే లభిస్తుంది. పరలోక యాత్రలో నీతో కూడా, నీకు తోడుగా వచ్చేవి, నువ్వు చేసుకొన్న మంచి, చెడు కర్మ ఫలితాలు మాత్రమే, అనుసరించి వస్తుంటాయి. అవి మంచి కర్మలైతే మంచిదే! అవే చెడ్డవైతే, దుష్ఫలితాలు అనుభవించాలి. అప్పుడు, నిన్నెవ్వరూ రక్షించలేరు. అందువలన, ఇప్పటి నుండే, నువ్వు మంచినే ఉంచు, మంచినే పెంచు, మంచినే అందరికీ పంచు.

దయచేసి రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ........

Monday, March 26, 2018

సుందరకాండ పారాయణంతో సకల దోషాల విముక్తి

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

సుందరకాండ పారాయణ వల్ల సకల దోషాలు తొలగి పోతాయి. శని,రాహు,కుజ, కేతు దోషాల వల్ల మనుషులు ఎన్నో కష్ట నష్టాలకు గురి అవుతూ ఉన్నారు.అటువంటి బాధల నుంచి విముక్తిపొందేందుకు సుందరకాండ పారాయణను చేయడం అత్యంత శ్రేష్ఠమని సాక్షాత్తు పరమశివుడు పార్వతి దేవితో ఓ సందర్భంలో అంటాడు. 'ఓ పార్వతీ! సకల దేవతల్లో శ్రీరాముడు ఎంతగొప్పవాడో, ఉన్నతుడో,వృక్షజాతుల్లో కల్ప వృక్షం ఎంత మంగళకరమైనదో, అంతటి గొప్పది అయిన ఆది కావ్యమైన శ్రీమద్రామాయణంలో అత్యంత కీలకమైనది సుందరకాండ. సుందరకాండ పారాయణ తులసివనంలో చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. బిల్లవృక్షం వద్ద చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది.నదీ తీరాల్లో సుందరకాండ పారాయణ ఎంతో శుభప్రదం. ఇంట్లో పారాయణ చేసేవారు శుచి, శుభ్రత లను పాటించాలి. సుందరకాండ పారాయణం వల్ల మనిషిలో ఉదాత్త గుణాలు కలుగుతాయి.ఎవరితోనూ తగవులు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించేందుకు అవసరమైన బుద్ధిని ఆంజనేయుడు ప్రసాదిస్తాడు. సుగ్రీవుని మంత్రిగా ఆంజనే యుడు రామలక్ష్మణులను చూసిన నాటి నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకూ వహించిన పాత్ర ఆయనలోని బుద్ధి బలాన్నీ, యశోధైర్యాన్ని సుబోధకం చేస్తుంది.

ఆంజనయుణ్ణి కేవలం వానరంగా కాకుండా, ఈశ్వరాంశ సంభూతు నిగా, శ్రీరామచంద్రు నికి నమ్మిన బంటుగా ఆరాధిస్తే ఎంతో మేలు జరుగుతుంది. నవగ్రహ పీడలు తొలగి పోతాయి. మనిషిలో నిదానం వృద్ధి చెందుతుంది.ఏ కార్యాన్ని చేపట్టినా ఆలోచ నకు పదును పెట్టగలుగుతారు. ఆలోచన లేకుండా ఏ పని చేపట్టినా అది సక్రమమైన రీతిలో పూర్తి కాదు. అంతెకాక,అహంకార, మమకారాలకు ప్రభావితం కాకుండా మనిషి సంయమనాన్ని అలవర్చుకోగలుగుతాడు. ప్రలోభా లాకు, బెదిరింపులకు చలించకుండా తన పనిని సక్రమంగా నిర్వహించుకోగలుగు తాడు. బృహద్ధర్మపురాణంలో సుందర కాండ పారాయణ పాశస్త్యాన్ని గురించి వివరించ బడింది. మనిషికి ఐశ్వర్యం ఎంత ముఖ్యమో, ఆరోగ్యం అంతకంటే ఎక్కువ.

ఆరోగ్యమే మహాభాగ్యమనే సామెత అందుకే పుట్టింది. మనిషిలో నైరాశ్యాన్ని పోగొట్టి, ధైర్యాన్నీ,ఉత్సాహాన్ని కలిగిం చేది సుందర కాండ. కుటుంబ పరమైన క్లేశాల్లో ఉన్నవారు సుందరకాండ పారాయణ చేస్తే వీలైనంత త్వరలోనే వాటి నుంచి విముక్తి పొందుతారు. మనిషిలోఏకాగ్రతను పెంచు తుంది.చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది.
సుందరకాండ పారాయణకు మన పెద్దలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.ఆంజనేయుడు సీతామాత కోసం లంకా నగరంలో అన్వేషించిన సమయంలో అడుగడుగునా ఎదురైన అడ్డంకి లను ఏ విధంగాతొలగించుకుంటూ ముందుకు సాగుతాడో మనిషి కూడా తాను చేపట్టిన పనికి ఎదురైన అవరోధాలను తొల గించుకోవడానికి సుందరకాండ పారాయణ ఎంతో ఉపయోగ పడుతుంది.

రాముణ్ణి సేవించి ఆంజనేయుడు తాను తరించి తనను నమ్ముకున్నవారిని తరింపజేస్తున్నాడు. శ్రీరామదూతం శిరసానమామి అని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వారి జోలికి భూత,ప్రేత పిశాచాలు రావు. శత్రువులు వారిని ఏమీ చేయలేరు. వాల్మీకి,తులసీదాసు ప్రభృతులు చెప్పిన పరమ రహస్యం ఇదే.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

తలిస్తే... అనుగ్రహిస్తాడు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

మనిషిని సంస్కరించి, కుటుంబ వ్యవస్థను చక్కదిద్ది, ఇంటిని ప్రశాంత నిలయంగా మార్చి తద్వారా యావత్‌ మానవ సమాజాన్నీ స్వర్గ ధామంగా, కలియుగ వైకుంఠంగా, ఆనంద నిలయంగా మార్చుకోవడానికి మార్గదర్శకమైనది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించటం కోసమే దత్తప్రభువు వివిధ కాలాల్లో వివిధ గురు స్వరూపాలుగా వెలుస్తూ, లోకులకు జ్ఞానబోధ కావిస్తూనే ఉన్నారు. శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీనృసింహసరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, అక్కలకోట మహరాజు, షిరిడి సాయిబాబాలను దత్త పంచకమంటారు. నేడు మార్గశిర పౌర్ణమి... దత్తులవారి అవతరణ దినోత్సవం సందర్భంగా...

అత్రి, అనసూయల తపస్సునకు మెచ్చి దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో రూపుదిద్దుకున్నాడు. అత్రి వరదునిది దైవ, గురు స్వరూపాల కలయిక. అందుకే దత్తాత్రేయుడు ఆదిగురువయ్యాడు.  మాయా ప్రభావంతో దారితప్పుతున్న మానవులకు జ్ఞానబోధలకు, ఆచార వ్యవహారాల అనుసరణకు, ధర్మాధర్మ విచక్షణకు, శిష్టరక్షణతోబాటు, మానవాళి విధ్యుక్త ధర్మాల ప్రబోధకే ప్రాధాన్యతనిచ్చాడు. ఇదే ఆయన గురుతత్త్వం.

జ్ఞానజ్యోతులు వెలిగించి, ప్రజల అజ్ఞానపు చీకట్లు తొలగించేందుకు వెలసిన దత్తస్వామి రూపం నయన మనోహరం, భద్రపదం, భవ బంధ నాశనం, భవసాగరతారకం. సర్వసృష్టినీ ప్రేమించే ఆ కరుణామూర్తి అనేక విశిష్టతలకు కాణాచి. దత్తావతార ముఖ్యోద్దేశం భిన్నత్వంలో ఏకత్వసాధన. అన్ని సాధనలను ఏకం చేసి, తనలో కలుపుకోవడమే ఈ అవతార తత్త్వం. కర్మ, భక్తి, జ్ఞానాలను ఒక్కొక్క దానిని ఒక్కొక్క యోగంగా మలచి, వాటినన్నింటినీ జ్ఞానంతో సంలీనం చేసి, సాధకులను బ్రహ్మజ్ఞాన విధులుగా పరిగణింపజేయడం... సాధనలో పరిపూర్ణ స్థితిని అందుకునేటట్లు అనుగ్రహించడం దత్తాత్రేయుడి తత్వం. సంసారంలో ఉంటూనే, స్వధర్మపాలన చేసుకుంటూ తరించవచ్చని, ముక్తిని సాధించవచ్చన్నదే దత్తసాంప్రదాయం.

దత్తాత్రేయుని స్వభావంలో మూడు ముఖ్య లక్షణాలు గోచరిస్తాయి. మెుదటిది ఆయన తమ నామ స్మరణతో సంతుష్ఠులై స్మరించగానే కదలి వస్తారు. అందుకే ఆయనను స్మర్తృగామిగా కీర్తిస్తారు. రెండవది వారు భక్తులకు ఇహ పర సౌఖ్యాలను ఇస్తూ, యోగశక్తిని ప్రసాదించి, జీవన్ముక్తులుగా చేస్తారు. మూడవ లక్షణం... భక్తుల వెన్నంటే ఉంటూ, వారి మంచి చెడ్డలు చూస్తూ, వారికి దత్తమౌతాడు. ఈ మూడు లక్షణాలు వారిలోని దైవ, గురు లక్షణాలను సూచిస్తాయి. ఈ స్వభావం ఆధారంగానే లక్షణాలను, లక్ష్యాలను గుర్తించవచ్చు.

దత్తునిది జ్ఞానతత్త్వం. ఆయన బ్రహ్మవిద్యను, శ్రీవిద్యను, యోగవిద్యను లోకానికి ప్రసాదించిన విశ్వగురువు. దత్తుడు బ్రహ్మకు వేదవిద్య, మంత్రవిద్య, బ్రహ్మవిద్యలను ఉపదేశించాడు. అలాగే ప్రహ్లాదునికి ఆథ్యాత్మిక విద్య, వశిష్టునికి యోగవిద్య, పరÔ]æురామునికి శ్రీవిద్య, కార్తవీర్యునికి ఆత్మవిద్య, అలర్కునికి యోగవిద్య... ఇలా ఎంతోమంది మహానుభావులకు జ్ఞానామృతాన్ని పంచాడు. ఇందులో సంతులు, సాధువులు, అవధూతలు ఎందరో వున్నారు.

దత్తాత్రేయునిది నిత్యం ఆసేతు హిమాచలం చుట్టివచ్చే తత్త్వం. ప్రతి ఉదయం కాశీలో గంగాస్నానం, గాణుగాపురంలో ధ్యానం, కొల్హాపురంలో భిక్ష, కురుక్షేత్రంలో ఆచమనం... ఇలా వివిధ ప్రాంతాలలో సంచరిస్తూ భక్త జనావళిని జాగృతపరుస్తూ ఉంటాడు. దత్త జయంతికి ఒక విశిష్టత ఉంది. ఆకాశంలోని నక్షత్ర మండలంలో దత్తుడు జన్మించిన మార్గశిర మాసంలో పూర్ణిమనాడు మానవులు నివసించే భూమి తిరుగుతూ, తిరుగుతూ, విశ్వాంతరాళంలో దత్తుని స్థానానికి అతి సమీపంగా వస్తుంది. ఆ సమయానికి సూర్యచంద్రులతో బాటు, మానవులు కూడా ఒõ  సరళరేఖలో దత్తునికి చేరువగా ఉంటారు. అందువల్ల దత్తజయంతినాడు అసంకల్పితంగా మానవులలోనికి దత్తశక్తి ప్రవేశిస్తుంది. ఆ రోజు దత్తుని విశేషంగా పూజించినవారు ఆయన అనుగ్రహానికి పాత్రులు కాగలరు.

దత్తాత్రేయునిది శివకేశవుల అభేద తత్త్వం. జ్ఞానం కోసం పరమేశ్వరుని, మోక్షం కోసం విష్ణువును ప్రార్థించి, పూజాపురస్కారాలు లేని బ్రహ్మతోకలసి, బ్రహ్మవిష్ణువుల రూపంతో వెరసి దత్తాత్రేయావతారం భువిపైకి వచ్చింది. శైవం, వైష్ణవం వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని తెలిపేందుకే దత్తతత్త్వం ఉదయించింది. దత్తుని పూజిస్తే మోక్షం, జ్ఞానం ఒకేసారి పొందవచ్చు.
ఈ దత్తావతారాల విశిష్టత ఏమిటంటే, వీరి భౌతికదేహాలు అంతమైనా, వీరి ఉనికికి భంగం రాదు. దేహంతో ఉన్నప్పుడు కూడా వీరు ఆపదలో ఉన్నవారిని అనేక విధాలుగా కాపాడారు. వీరి భౌతిక శరీరాలు గుప్తమైనా వీరి లీలలు కొనసాగుతూనే వుంటాయన్నది వీరి వాగ్దానం. అందుకే శిరిడీసాయి ‘‘నా సమాధి అనంతరం నా మట్టే మీ కోర్కెలకు ప్రతిస్పందిస్తుంది’’ అని అన్నారు. వీరి చరిత్రల పారాయణల ద్వారా దత్తరూపాలన్నింటిని ఏదో విధంగా సేవించి, తరించే దారి దొరుకుతుంది. చింతనం, నామస్మరణం వీరి అనుగ్రహం సంపాదించేందుకు సులభమైన, శ్రేష్ఠమైన మార్గాలు.

దత్తాంశతో వారి అవతారాలుగా జన్మించిన వారందరి అవతారలక్ష్యం ప్రజలకు చేరువగా ఉంటూ, వారి సమస్యలకు పరిష్కారం తెలుపుతూ, నడిపించటమే. ప్రతి అవతారంలో సారూప్య, స్వభావాలు ఇంచుమించు ఒకేవిధంగా ఉండటం విశేషం. గురుపరంపరలో దత్తాత్రేయుడు ఒక అవతారం పరి సమాప్తి అయిన తరువాత మరొక నామధేయంతో వేరొక అంశావతారంతో కాలానుగుణంగా తన ప్రవర్తనను సమన్వయ పరుస్తూ జనులను ఉద్ధరించారు. అందుకే దత్త జయంతిని గురుప్రచార తత్త్వానికి అంకితం చేస్తూ, ఆ రోజు, జప, తపాలతో ధ్యానించి తరించాలి.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

భక్తి లక్షణం


 ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ మార్గాలు ఆదికాలం నుంచీ భారతీయుల జీవన ధ్యేయాలయ్యాయి. మొదటి మూడూ (త్రిపుటి) ఉత్కృష్టమైన మోక్షసాధనకు సాధనాలు. జ్ఞాన భక్తి కర్మయోగాలనేవి భగవద్గీత ఆరంభ కాలం నుంచే జీవనమార్గాలయ్యాయి. మానవుడు తన అభిరుచిని అనుసరించి, ఈ మూడు మార్గాల్లో దేనినైనా స్వీకరించి లక్ష్యాన్ని సాధించవచ్చు. 

బుద్ధిజీవులకు జ్ఞానమార్గం, భావనాశీలురకు భక్తిమార్గం, క్రియాశీలురకు కర్మమార్గం స్వీకారయోగ్యమవుతాయి. మానవ జీవనవిధానంలో భక్తి వినూత్న చైతన్యాన్ని సృష్టించింది. 

ఇష్టదైవం పట్ల ప్రేమను ‘భక్తి’గా నిర్వచిస్తారు. ఆ మార్గంలో మొదటి మెట్టు ప్రతీకోపాసన. అంటే, విగ్రహారాధన. విగ్రహాన్ని సాక్షాత్తు దేవతగా భావిస్తారు. ఆ బాహ్య పూజావిధానానికి పైమెట్టు- మానసిక ప్రయత్నం. భక్తుడు తన హృదయపీఠం పైకి ఇష్టదైవాన్ని ఆహ్వానించి, ప్రతిష్ఠించి, పూజిస్తాడు. ‘అనన్య భక్తితో నన్ను ఎవరు ఆరాధిస్తారో, ఏ ఇతర భావాలూ లేక నన్నే ఎవరు ధ్యానిస్తారో, సదా అనుసరిస్తారో- వారి బాధ్యతలన్నీ నేనే నిర్వర్తిస్తాను’ అంటాడు గీతాకారుడు. భగవంతుడి పట్ల ప్రేమానుబంధం ఎక్కువయ్యేకొద్దీ, మిగిలిన వాటిపై భక్తుడి విముఖత పెరుగుతుంటుంది. దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ‘వైరాగ్య భావన’గా పరిగణిస్తారు. 

భక్తికి సంబంధించి, రెండు దృక్పథాలున్నాయి. ఒకటి- భక్తుడు స్వప్రయత్నంతో ఈశ్వరానుగ్రహం సంపాదించడం, లేదా దైవం మీదే భారమంతా మోపి ‘సర్వాత్మ’గా ఆరాధించడం.రెండోది ప్రపత్తి. అంటే, బంధవిముక్తికి ప్రభు పాదాల్ని ఆశ్రయించడం. వీటిలో- మొదటిది మర్కట కిశోర న్యాయం. రెండోది మార్జాల కిశోర న్యాయం. మర్కటం (కోతిపిల్ల) ఎప్పుడూ తల్లి పొట్టను పట్టుకొనే ఉంటుంది. ఆ తల్లి చెట్లపై ఎంతగా గెంతుతున్నా, దాన్ని పిల్ల వదలదు. మార్జాలం (పిల్లి) తన పిల్లను నోట కరచుకొని తీసుకుపోతుంటుంది. పిల్లిపిల్ల తన రక్షణ కోసం ఏమీ చేయదు. మొదటి మార్గంలో దైవానుగ్రహాన్ని భక్తుడు సంపాదించుకుంటాడు. రెండో మార్గంలో, దైవమే అనుగ్రహిస్తాడు. ప్రపత్తి అంటే ఇదే! ఈ రెండూ పూర్తి విరుద్ధమైన మార్గాలు కావు. ఇవి అన్యోన్యమైనవి. సహానుభూతిని కలిగించేవి. 

‘అంతర్యామివి నీవు, ఆడేటి బొమ్మను నేను, చెంత గాచుట నీ పని, సేవించుట నా పని...’ అంటాడు అన్నమయ్య. ఏ ప్రాణి పట్లా ద్వేషభావం లేనివాడు; సర్వ ప్రాణుల మీద అవ్యాజమైన ప్రేమ, కరుణ గలవాడు భక్తుడు. అతడు విపరీతమైన మమత, అహంకారం- రెండూ లేనివాడు. సుఖం ప్రాప్తించినా, దుఃఖం కలిగినా సమభావం కలిగి ఉండేవాడు. క్షమాగుణం కలిగినవాడు. మనసు, శరీరం, ఇంద్రియాల్ని వశంలో ఉంచగలవాడు. సర్వకాల సర్వావస్థల్లోనూ సంతుష్టుడైనవాడే అసలైన భక్తుడు. అతడు భగవంతుడికే తన మనసును, బుద్ధిని అర్పణ చేసేంత గొప్పవాడు. 

భక్తుడు అందరితోనూ సమభావంతో మెలగాలి. నిందాస్తుతులకు చలించకూడదు. ఈర్ష్య, భయం వంటి మనోవికారాలకు లొంగకూడదు. 

భక్తుల్ని మూడు విధాలుగా గుర్తిస్తారు. ‘భగవంతుడు అక్కడెక్కడో ఉన్నాడు. ఆయన వేరు, ఆ సృష్టి వేరు’ అని భావించేవాడిది అధమ భక్తి. ‘భగవంతుడు అంతర్యామి. లోపల నుంచి అందర్నీ నియంత్రిస్తాడు’ అని తలచేవాడు మధ్యముడు. ‘సర్వమూ భగవంతుడే’ అని తలపోస్తాడు ఉత్తమ భక్తుడు. ‘సకల తత్వాలూ భగవంతుడే... సృష్టి అంతటా ఆయనే నిండి ఉన్నాడు’ అనే భావనే ఉదాత్త భక్తి! 

శ్రీరామ నవమిన పానకం-వడపప్పు తినడంలో పరమార్థం?

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీ మహా విష్ణువు అవతారం అయినటువంటి శ్రీరామచంద్రుని జననమును మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటున్నాము. రామనామం రాముని కంటే శక్తివంతమైనది. రామనామం మనల్ని సకల సముద్రాలు దాటించగలదు.

రాముణ్ణి స్మరించే పెదాలకు వేరే పానకం ఎందుకు?రాముణ్ణి ప్రతిష్ఠించుకున్న హృదయానికి వేరే కోవెలెందుకు?రాముడి మార్గంలో నడిచేవారికి వేరే దారి ఎందుకు?రాముడి ధర్మాన్ని ఆచరించేవారికి వేరే ధర్మం ఎందుకు?శ్రీరామనవమికి తెలుగువారి లోగిళ్లు కళకళలాడతాయి.

తెలుగు వీధులకు చలువపందిళ్లు గొడుగు పడతాయి. హరికథలు... బుర్రకథలు... పాటలు... శ్రీరామ నీ నామమెంతో రుచిరా...పండగ పూట...ఈ వడపప్పు... పానకం... ఇంకొంత తీపి. ఈ శ్రీరామనవమి రోజు ముఖ్యంగా పానకం వడపప్పును ప్రసాదంగా తీసుకుంటారు.

_*పానకం - వడపప్పు ప్రాముఖ్యత ఏంటి?*_

శ్రీరామ నవమి రోజున అందరిల్లలోనూ పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది ఎండాకాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్యాభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద శాస్త్రజ్ఞుల అభివూపాయం. సీతారాముల కళ్యాణోత్సవం నాటి వివాహ మంగళాక్షతలు అతి పవిత్రం. వాటిని మన ఇంట్లో బియ్యంలో కలుపుకోవాలి. అలా అవి ఆ సంవత్సరమంతా మనింటనే ఉం టాయి. తత్ ఫలితంగా కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది వేదపండితుల భావన.

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, దేహారోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు - పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని చెబుతారు.
పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.
        🍂🍄🍁🍂🍄🍁
🏵 రామచంద్రమూర్తి 🔯 శాస్త్రధర్మం🏵

తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన శ్రీ రామచంద్రుడు ఓకడే.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...