Saturday, March 3, 2018

ధనము.. మతము.. పేదరికం..:

ఒక పేదవాడు ఎన్నొ కష్టాలకి ఓర్చి బ్రతుకుతున్నాడు. హాయిగా ఉన్నాడు. చాలా ప్రశాంత వదనంతో ఉంటాడు ఎప్పుడు చూసినా.. కాకపోతే ఆర్ధిక స్థోమత లేదు.. నిరంతరం కష్టాన్ని నమ్ముకొని బ్రతుకు సాగిస్తూ ఉన్నాడు.
ఉన్నదానిలో ఉన్నతంగా వుండే ప్రకృతి ప్రేముకుడు.

"ఇలాంటి వాడికి ఒక క్రీస్టియన్ ఎదురయ్యాడు. ఎంతో జాలి కూడా చూపాడు. ఇంతలోనే బుద్ధి కూడ చూపించాడు."

ఎందుకు మీకు అంతమంది దేవుళ్ళు. దేవతలు? ఒకడేమో తొండంతో ఉంటాడు. ఇంకొకడేమో పాముతో ఉంటాడు. మరొకడు పక్షిమీద ఉంటాడు. మరొకడు మూడు తలకాయలు ఉంటాయి. ఇంకొకడు జనాన్ని చంపడానికి తాడు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంతమంది ఉన్నారు కదా! ఎప్పుడైనా నిన్ను ఆదుకున్నారా! ఆడుకుంటే నీకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? మా మతంలో చూడు ఒక్కడే దేవుడు. నువ్వు ఎన్ని పాపాలు చేసిన క్షమిస్తాడు. నిన్ను ధనవంతుడిని చేస్తాడు. దేవుళ్ళు అని చెప్పుకునే ఆ రాళ్ళని, దెయ్యాల వంటి ఆ ఆకారాలని వదిలేసి మా మతంలో చేరు. రాళ్ళని మొక్కుతారు. పాముల్ని మొక్కుతారు. చేట్టుల్ని పుట్టల్ని మొక్కుతారు. ఏమిటా పిచ్చి అసలు అని బ్రెయిన్ వాష్ చేశాడు.

అప్పుడు పేదవాడు ఇలా అన్నాడు.
నిజమా అండి. మతం మారితే ధనవంతుడు అవుతారా? ఎలాగండి? దేవుడంటే మారతాడని తెలుసు..కాని డబ్బు ఎలా వస్తుంది? అలా వస్తే మీరు ప్రపంచంలో ఉన్న 204 దేశాలలో ప్రచారం చేశారు కదా! ఆయా దేశాలలో అడుక్కుతినేవారు ఉన్నారు. అసలు ఆయా దేశాల సంస్కృతులే మార్చేశారు. మరి ఆ దేశాలలో పేదరికం ఎందుకు పోలేదు? ఉదాహరణకు ఆఫ్రికాలో అత్యంత పేద దేశాలైన కెన్యా, జింబాబ్వే, వంటి 50 కి పైగా క్రిస్టియాన్ దేశాల్లో అంతేకాదు ఆఫ్ఘసిస్తాన్, సోమాలియా వంటి 40 కి పైగా ఇస్లామిక్  అత్యంత దుర్భరమైన పరిస్థితి ఉంది కదా?? మరి వారి పరిస్థితిని మీ మతాలు ఎందుకు మార్చలేకపోతున్నాయి??

నేను పెదవాడినే కావచ్చు. కాని నాకు మా అమ్మ నాన్న ఇచ్చిన సంస్కృతి, వాళ్ళకి వాళ్ళ పూర్వికులు ఇచ్చిన సంస్కృతిని నాశనం చేసి వారికి ద్రోహం చేయలేను. మాదేశం మీద 2000 సంవత్సరాలకి పైగా ఎందఱో దాడులు చేశారు మొత్తం 198 దేశాలపైగా దాడులు చేసి వారి వారి సంస్కృతులు నాశనం చేసి పబ్బం గడుపుకున్నారు. మీరు నాశనం చేసిన 198 దేశాలు ఈరోజు తమ అస్తిత్వాన్ని కోల్పోయాయి. కాని వారికంటే ఘోరంగా ఈ భారతదేశం మీద 2000 సంవత్సరాల పైగా దాడులు చేసి ఎన్నో గ్రంధాలు, వారసత్వ చిహ్నాలు నాశనం చేసి, ఎన్నో లక్షల కోట్ల రూపాయల సంపద దోచుకెళ్ళి ఈ దేశాన్ని, దేశ సంస్కృతిని కూడా దెబ్బతీయాలని ప్రయత్నించారు.
అయినా ఏమైనా సాధించారా?
అసలు నీకు ఇంగ్లాండ్ తెలుసా?
        
దానిని రవి అస్తమించని బ్రిటిష్ #క్రైస్తువులు సామ్రాజ్యం అని అనేవారు.. ఎందుకంటే ప్రపంచం అంతా ఆక్రమించి సూర్యుడు ఎక్కోడో ఒకచోట ఉదయించే ఉండేలా. ఆ బ్రిటన్ రాణి నెత్తి మీద ఏమి ఉంటది కిరీటం. 
ఆ కిరీటం మీద ఏమి ఉంటది.. ?

కోహినూర్ వజ్రం ఉంటది.

ఈ దేశం లో (అదీ కూడా మన తెలుగు రాష్ట్రం లో) దొరికిన రాయి ని ఆ  #బ్రిటస్ #క్రైస్తువులు పాలిస్తున్న రాణి కిరీటం మీద ఉంది.

ఈ దేశపు మట్టిలో లో పుట్టిన కోహినూర్ వజ్రం కి అంత విలువ ఉంటే..
ఈ దేశం లో పుట్టిన #ధర్మం కి ఎంత విలువ ఉండాలి? అలాంటి ఈ మట్టి లో పుట్టిన మనం ఈ దేశం కోసం, మన ధర్మం కోసం ఎంత తపన పడాలి???

మనం దేశాన్ని  #క్రైస్తువులు #మొగలయులు #విదేశీయులు ఎంత కొల్లగొట్టారో, ఎంత నాశనం చేశారో, ఎంత సంపద దోచుకెళ్లారో చెప్పడానికి కోహినూర్ ఒక చిన్న ఉదాహరణ..

వీలున్నప్పుడు కోహినూర్ విలువ గూగుల్ లో వెతుకు..
మీరు ఎవరికి సేవ చేస్తామని వస్తున్నారు? ఎవరిని సంపాదన పెంచుకోమని చెబుతున్నారు? పేదవారికి మరియు  రోగులకే కదా! మీరు మతం పేరుతో ఆక్రమించిన 198 దేశాలలో రోగులు కాని పేదవారు కానీ లేరా? వారిని పట్టించుకోండి ముందు. నా పేదరికం ఎప్పుడూ నాకు కష్టం కాదు.

ఇక దేవుళ్ళ విషయంలోకి వస్తే వీచేగాలి, మండే అగ్ని, త్రాగే నీరు, నడిచే భూమి ఇవి అన్నిటికి ఆధారం. సర్వప్రాణుల మనుగడకి మూలం. అందుకే వాటిని పూజిస్తాం. గౌరవిస్తాం. వాటి వలన మనం బ్రతుకుతున్నాం. ఒకరికి దాహం వేసి ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు గ్లాసుడు నీళ్ళు ఇస్తే ఎంతో కృతజ్ఞతగా ఉంటాడు? అలాంటిది జీవితకాలం ఆహారాన్ని, గాలిని, నీటిని అందించే ఈ సృష్టిని నేను ఎంత గౌరవించాలి? అందుకే వాటిని పూజిస్తాం. వాటికి ఆధారమైన దైవాన్ని పూజిస్తాం.
Courtesy- Danvi Srinivas

"చివరికి విష సర్పాన్ని పూజిస్తున్నాం అన్నావ్ కదా! ఆ విష సర్పాలని పూజిస్తున్నాం కనుకనే మీలాంటి విషం కక్కేవారిని ఇంకా ఇక్కడ బ్రతకనిస్తున్నాం."

అనగానే నోటి వెంట మాట రాలేదు...
మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు...
ఇది భారదేశ గొప్పదనం..ఔన్నత్యo..

పాఠమా..?? గుణ పాఠమా??
*************************
మన చరిత్ర పుస్తకాల్లో మొగలుల, ఐరోపా వారు మన దేశం పైన దాడి చేసినట్టు ఉంటుంది..

ఆ పాఠాలు భీభత్సంగా చదివటం, గుర్తుపెట్టుకొని, బట్టి పట్టేసి పరీక్షల్లో రాసేసి మార్కులు సంపాదిస్తాం మనం..

నిజానికి మన దేశం తో విదేశీయులు వ్యాపారమ్ చేసుకుంటాం అని వచ్చి...మన దేశాన్ని ఆక్రమించుకొని మన వాళ్ళని నాశనం చేసి, ఇక్కడ సంపదలను దోచుకుని పోతే.. ఆ పాఠాలు పుస్తకాల్లో చదివినప్పుడు కనీసం కళ్ళల్లో నీరు తిరగడం కాదు గాని.. మెదడు లో ఒక సందేహం కూడా రాదు..

ఏమిటా సందేహం అంటే విదేశీయులు 1000 ఏళ్ల పాటు మన దేశాన్ని దోచుకున్నారు కదా.. వాళ్ళు మన దేశం ఎంత సంపద ని దోచుకున్నారు?? వాళ్ళ వల్ల మనకి ఆర్థికంగా ఎంత నష్టం జరిగింది అని...

మన చరిత్ర పుస్తకాల్లో మన దేశానికి గవర్నర్ జనర్నల్ గా పని చేసిన (దేశాన్ని దోచుకున్నవారికీ హెడ్) వాళ్ళ లిస్టు తో పాటు వాళ్ళ హాబీస్, ఏ రంగు ఇష్టం, ఏ వంట ఇష్టం ఇలాంటి దిక్కు మాలిన అన్నిటిని యాడ్ చేేశారు కానీ.. స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్ళని మాత్రం గాంధీ, నెహ్రు అని ఆపేశారు.. అలా ఉంటాయి మన సిలబస్ లు

కనీసం మన దేశం నుండి ఎంత సంపదను ఎవరు దోచుకున్నారో కూడా తెలీదు.. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు.. పాఠ్య పుస్తకాల్లో పెట్టరు..

మన దేశం నుండి విదేశీయులు దోచుకున్న సంపద:-

చాలా మంది అమయూకులకి మన దేశం వెనుక బడిన దేశం అని ఒక అపోహ...

ప్రపంచం లో ఏ దేశం కూడా మనలా 1000 సం. లు దోచుకోబడలేదు.. దేశానికి కూడా మనలా అన్ని దేశాలు వారు, అన్ని జాతుల వారు దండయాత్ర లు చేయలేదు..

మన వద్ద ఉన్న జ్ఞానం, సంపద అవతలి దేశాల వద్ద అసలు లేకపోవడం వల్ల ఎన్నో దేశాలు వారు మనల్ని దోచుకోవాడినికి వచ్చారు..

అంగస్ మాడిన్సన్, బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్త, రాసిన the world economy, a millionial perspective అనే పుస్తకం లో ప్రపంచ దేశాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో ఆయా దేశాలు వాటా గురించి రాసారు..

సుమారు 2000 సం. క్రితమే మన దేశం ప్రపంచం లో 33% పైగా స్థూల జాతీయ ఉత్పత్తి మనవద్దే నుండే ఉండేది అని వివరించారు, అది మొగలులు వచ్చాక అది 25% తగ్గిందని, ఆ తరువాత బ్రిటీష్ వారు వచ్చి వెళ్లేనాటికి నాటికి అది 4% కంటె తగ్గినదని వివరించారు..

దాదాబాయి నౌరోజి రాసిన poverty and un british rule in india పుస్తకం లో బ్రిటిష్ వాళ్ళ దోపిడీ ని లెక్కకట్టారు 1757 - 1947 సంవత్సరం వరకు జరిగిన దోపిడీని వడ్డీతో లెక్క కడితే 600,000,000,000,000 (600 ట్రిలియన్ పౌండ్లు.. రూపాయాల్లో అయితే 80
రేట్లు ఎక్కువ ఈ సంఖ్యకి)

మన దేశ సంపదను ఎంత దోచుకున్నారు అనే దానికి చిన్న ఉదాహరణ విజయనగర కోట.. రాక్షస తంగడి యుద్ధం తరువాత విజయనగర కోట లో ఉన్న బంగారం ని 6 నెలలు పాటు ప్రతి రోజు దోచుకున్నారు.. దోచుకున్న బంగారం వందల సంఖ్య లో ఏనుగుల మీద ఆ బంగారం ని రవాణా చేసారు బహుమని సుల్తాన్ లు..

బ్రిటిష్ రాణి కిరీటం లో ఉండే కోహినూర్ వజ్రం విలువ ఇప్పుడు దాదాపు 100 కోట్లు డాలర్లు (రూపాయల్లో మారిస్తే 60 రేట్లు పైన)..

అస్సలు బ్రిటిష్ మ్యూజియాల్లో ఉండే మన దేశ సంపద విలువ లెక్కకట్టలేం..

ఒక అంచనా ప్రకారం భారత దేశం నుండి విదేశీయులు దోచుకున్న సొమ్ము కొన్ని వేల లక్షల కోట్లు అని..

ఇంకో ఘోరమైన నిజం ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపిని వాళ్ళు మన దేశం నుండి దోచుకున్న సంపదతో యూరప్ లో ఏకంగా బ్యాంకులు కట్టుకున్నారు.. ఇప్పటికి ఈస్ట్ ఇండియా కంపెనీ ని స్థాపించిన రూథర్ షీల్డ్ కుటుంబం వాళ్ళే ప్రపంచ బ్యాంకు, ప్రపంచ రాజకీయాలను సైతం శాసిస్తున్నారు..

ఇంత పెద్ద దోపిడీ మన దేశం లో జరిగింది.. ఇలాంటి చరిత్ర ని 10 పేజీలకు మన సోషల్ స్టడీస్ పుస్తకాలో సిలబస్ పెట్టడం మన దౌర్భగ్యం.. ఆ 10 పేజీల చరిత్ర 10 మార్కులకి పరీక్షల్లో రాసి చేతులకి దులుపుకోవడం మన దరిద్రం..

నేను చూసా... మరి దారుణంగా డిగ్రీ సిలబస్ ల్లో బ్రిటిష్ వారి వల్ల భారత్ ఆర్థిక అభివృద్ధి జరిగింది అని పెట్టారు.. రేపు ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక సేవా సంస్థ అని కూడా రాస్తారేమో..!!

ఇక్కడ నేను కేవలం ఆర్థిక దోపిడీ మాత్రమే రాసాను.. సామాజిక, మానసిక, శరీరాక, ఆధ్యాత్మిక, ఇతర దోపిడీ లు గురించి చెప్పాలంటే ఒక పోస్ట్ లో కష్టం అని..

అందుకే విదేశీయులు మునకు చేసిన అన్యాయం పుస్తకం లో పాఠం కాదు.. మన జీవితాలకు గుణపాఠమ్ కావాలి..
విదేశి మతాలను తరిమి కొట్టాలి..

గుడికి ఎందుకు వెళ్ళాలి


మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.
గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.
మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
🏹భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.
⛳దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.
అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.
ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.
గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.
మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.
గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.
తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.
లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.
కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.

యాత్రలెందుకు?

దైవదర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్నది శిలా విగ్రహమో, చెక్కబొమ్మో అనుకోకూడదు. దానిలోని దైవత్వాన్ని మనం అనుభూతం చేసుకోవాలి. క్షేత్రాల్లో ఆధ్యాత్మిక చైతన్యం విరాజిల్లుతూ ఉంటుంది. క్షేత్రదర్శనాలకోసం చేసే ప్రయాణాలను తీర్థయాత్రలంటారు. తీర్థయాత్రలకు, విహారయాత్రలకు మధ్య చాలా తేడా ఉంది. నిత్యజీవనంలో కాస్త ఆటవిడుపుకోసం, మానసిక ఆహ్లాదంకోసం చేసేవి విహారయాత్రలు. అవి మనిషిని సేదతీరుస్తాయి. దివ్య ఆధ్యాత్మిక అనుభూతికోసం, ఆత్మసంతృప్తికోసం సంస్కారవంతమైన చిత్తం తీర్థయాత్రలను కోరుకుంటుంది. విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు మనిషి మానసికస్థితి ఒకలా ఉంటుంది, పుణ్యతీర్థాలను సేవించేటప్పుడు మరొకలా ఉంటుంది.

మహాభారతం అరణ్యపర్వంలో తీర్థయాత్రలకు వెళ్ళదలచినవారికి ఉండవలసిన యోగ్యతల గురించి భీష్ముడికి పులస్త్యుడు చెబుతాడు. వ్రత నిష్ఠ, శౌచం, ధర్మశుభస్థితి, ఉపవాసదీక్ష వంటి లక్షణాలు వివరించి, అవన్నీ ఉంటే తప్ప, 'తీర్థములాడనేరరు' అంటాడు పులస్త్యుడు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళదలచినవారి మానసిక సంసిద్ధత ఎలా ఉండాలో చెబుతాడు.

భారతంలోనే కాదు, శ్రీదేవీభాగవతం వంటి అనేక పురాణాల్లో సైతం మనిషి ముందుగా దీక్ష తీసుకుని మరీ తీర్థయాత్రా సేవనం చేయాలని ఉంది. అలాంటివారిని అన్నమయ్య 'సువ్రతులు'గా వర్ణించాడు. భక్తితో, ఆర్తితో దేవుడి దివ్యసాక్షాత్కార అనుభవం కోసం అర్రులుచాస్తూ ఆతృతగా వెళ్ళాలన్నాడు. తిరుమల గిరుల్లోను, కొండమీద ప్రతీ అణువు పావనం, ప్రతి శిలా సాలగ్రామం, ప్రతి అంశం బ్రహ్మమయం అన్న భావనతో సంతోషంగా వెళ్ళాలి. ఆ రకమైన మానసిక సంసిద్ధతతో వెళ్ళినప్పుడు అద్భుత ఆధ్యాత్మిక అనుభూతి మనిషికి దక్కుతుంది. అంతేతప్ప- సెలవులు వచ్చాయనో, విహారయాత్రలకనో పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదు. దేవుడి నెలవులు కనుగొనడం కోసం వెళ్ళాలి.

తీర్థయాత్రలకే కాదు, విహారయాత్రలకు సైతం ఒక పద్థతి అవసరం. మానసిక సంసిద్ధత ముఖ్యం. ప్రకృతితో మనిషి బంధం గట్టిపడేందుకు విహారయాత్రలు గొప్పగా ఉపకరిస్తాయి. ఇటీవలి కాలంలో ప్రకృతికీ మనిషికీ మధ్య వైరం బాగా పెరిగిపోయింది. మనిషి చేతిలో ప్రకృతి సర్వవిధాలా నాశనమవుతోంది. సఖ్యత పూర్తిగా చెడిపోయింది. భయంకరమైన కాలుష్యంలో మునిగిపోయి, దేహం మట్టికొట్టుకుపోయి, మన మనసు మసిబారిపోతున్న స్థితిలోంచి ఒకసారి చల్లని మంచుకొండల్లోకి, పచ్చని అడవుల్లోకి, మెత్తని ఇసుక తిన్నెలపైకి వెళ్ళి గడిపితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో వహించండి! తీరిగ్గా కూర్చుని వరిపైరు వయ్యారాలను గమనిస్తూ చేలగట్లపై విహరిస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి!

విహారయాత్రలకు వెళ్ళడమంటే ప్రకృతి సోయగాలను ఆస్వాదించడానికి వెళ్ళాలి. ఒక సీతాకోకచిలుకను చూస్తే- అంత చిన్నజీవి ఎన్నెన్ని రంగులతో ఎంత అందంగా ఉందో కదా అనిపించాలి. ఒక్కరోజుతో తన జీవితాన్ని చాలించే పువ్వు అంత హాయిగా నవ్వుతూ ఎంత పరిమళాన్ని వెదజల్లుతోందో చూసి మనం మురిసిపోవాలి. చక్కగా అల్లుకున్న తమలపాకు తీగలకు ఈ పూటే చిగిర్చిన లేలేత చివురాకు మృదుస్పర్శకు ముందెన్నడో మొలిచిన ముదురాకుల ముతకదనానికి గలతేడా మన చేతికి తెలిసిందంటే- ప్రకృతితో ఇంకా స్నేహం మిగిలి ఉందని అర్థం. మన గుండెలో ఎక్కడో ఓ మూల కాస్త పచ్చదనం ఇంకా మిగిలే ఉందని ధైర్యం. అందుకోసం విహారయాత్రలు! మన హోదాలు, బాధ్యతలు, కష్టాలు, కాలుష్యాలు అన్నింటినీ కాసేపు మరిచిపోయి, కాస్తంత పచ్చిగాలిని హాయిగా పీల్చుకొని ప్రకృతికి ధన్యవాదాలు చెప్పుకోవడం కోసం మనం విహారయాత్రలు తలపెట్టాలి.

తీర్థయాత్రలంటే ఏవేవో నియమాలంటారు, పోనీ విహారయాత్రలన్నా ఆస్వాదిస్తున్నారా అంటే- అదీ సందేహమే! చాలామందికి విహారయాత్రలపట్ల ఆసక్తి, అవగాహన ఉండటంలేదు. గోదావరిలో పాపికొండల విహారయాత్రలకు వందలమంది నిత్యం వెళుతూనే ఉంటారు. కమ్మనిమట్టి వాసనతో మొదలై చల్లని పిల్లగాలులు, గోదావరి తరగల నురుగులు, గాలిలోంచి తేలివచ్చే పట్టిసీమ గుడిగంటల మోతలు, నదికిరువైపులా జనపచేల తెల్లని మొవ్వులు... దూరంగా ఆకుపచ్చని నునుపుకొండలు, పసుపు పచ్చని పూలతో విరగబూసిన నువ్వుచేలు... నీళ్ళను చీల్చుకుంటూ లాంచీ పోతుంటే వచ్చే లయబద్ధమైన సంగీతం, నీలిమబ్బులు, గోదావరి వయ్యారాలు... వీటన్నింటినీ ఆస్వాదించాలి. వాటిని వదిలేసి- ఖరీదైన బోట్లలోని శీతల మందిరాల్లో తలుపులు బిడాయించుకుని పేకాటతో కాలక్షేపం చేసేవాళ్లకు విహార యాత్రలు అక్కర్లేదు. మనిషి తనలోకి ఇంకెప్పుడు తొంగిచూడగలడు? తిరిగొస్తుంటే మళ్ళీ ఎప్పుడో! అన్న బెంగ పుట్టించాలి. వాలిపోయే పొద్దుకు ప్రకృతి అద్దుతున్న వర్ణాలను చూసి మురిసిపోవాలి. గోదావరిలో మునిగిపోతున్న సూర్యుణ్ని చూస్తే- అయ్యో ఈ రోజెంత త్వరగా అయిపోయిందో కదా! అనిపించాలి. తలచుకున్నప్పుడల్లా జ్ఞాపకాలు తియ్యగా చెలరేగి మనసుకు కితకితలు పెట్టాలి. విహారయాత్రలు మనిషి జీవితంలోకి ఇంద్రధనుస్సులోని రంగులన్నింటినీ ఒంపాలి. ఇన్ని వర్ణాలా అని మనిషి అబ్బురపోవాలి. అదీ విహారయాత్రల పరమార్థం! 

సంస్కారశుద్ధి లేకుంటే తీర్థయాత్రలు వ్యర్థం. 

సంతోషసిద్ధి లేకుంటే విహారయాత్రలూ వ్యర్థమే!

.................................గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ

శాకాహారం అంటే ఏమిటి? మాంసాహారం అంటే ఏమిటి?

అనే విషయం పై పండితులు చెప్పిన వివరణ పరిశీలిద్దాం.

భగవంతుని ప్రేరణ చేత ఈ భూమి పై చరాచర సృష్టి (పుట్టుక) అనేది నాలుగురకాలుగా విభజించి అర్ధంచేసుకోబడింది. వీటిని జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని పిలుస్తారు.

1. జరాయుజములు:- గర్భంలోని పిండమునావరించియుడు మాయవలన పుట్టునవి. మనుష్యులు పశువులు.
2. అండజములు:- గ్రుడ్డు నుండి పుట్టు పక్షులు, పాములు మొదలగునవి.
3. స్వేదజములు:- చెమటవలన పుట్టు దోమలు, నల్లులు మొదలగునవి.
4. ఉద్భిజములు :- విత్తనము పగలదీసి జన్మించు వృక్షలతాదులు

ఇక ఇందులో రెండురకాలు ’చర సృష్టి’, ’అచర సృష్టి’…. జరాయుజములు, అండజములు, స్వేదజములను ’చర సృష్టి’ అనియు, ఉద్భిజములనుమాత్రం ’అచర’ సృష్టి అనియు చర అంటే కదిలేవి. మనుషులు, పశువులు, పక్షులు, పాములు, దోమలు, నల్లులు ఇటువంటివి కదలిక కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా తమ కదలికను తమను తాము కాపాడుకునే పనిలోనూ తమ ఆహారప్రయత్నంలోనూ వాడతాయి. ఇవి రజోగుణ, తమోగుణ స్వభావులు; అందువల్ల ఇవిధరించే శరీరాలను దోషభూయిష్టమైనవిగా, అంతర్గతంగా దుర్గంధాన్ని ఆవరించి యుండేవిగా భావించి వీటిని ’నీచమనీ’, ’మాంసమనీ’, మాంసాహారమనీ పూర్వీకులు చెప్పారు. ఈ నీచము అనేమాటనుండే నీచు అనే అర్థం మాంసానికి వచ్చింది.
ఈ చరసృష్టి అంతా తల కిందకు దించి తమ ఆహారాన్ని స్వీకరించ ప్రయత్నంచేస్తాయి. పశువులు మేతమేసినా, మానవులు ఆహారంతింటున్నా తలను నీచానికి చూస్తారు కాబట్టి నీచం అనే పదం వాడారు కాబట్టి వేరేవిధంగా అర్ధం చేసుకోగూడదు.

ఇకపోతే ఉద్భిజములు – విత్తనమునుండి వచ్చేవి. వీటిని ఉచ్చములు అని పిలిచారు. ఇవి వీలైనంతవరకూ సూర్యుడిని అందుకోవడానికి ఆకాశంవైపు సాగుతాయి. ఇవి అత్యధికశాతం సత్వగుణపూరితములు. అందువల్ల వీటిని ’శాకాహారమని’ పిలిచారు.

చరసృష్టిని ఆహారముకొరకు వాడగూడదు అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. ఒక లేడి యొక్క ఒక కాలు మనం కత్తిరిస్తే అది జీవితాంతం కుంటుతుంది. అంతేగానీ వేరొకకాలు మొలిపించుకోలేదు. అలాగే తనకు ఒకచోట బృతిదొరకలేదుగదా అని వేరొకచోటకు వెళ్లగలిగిన రజోగుణం లేడి, మానవుడు, పాము, నల్లి వంటి చరసృష్టికలిగిన జంతువులలో ఉంటుంది.

కానీ అచరసృష్టి దీనికి భిన్నం. ఒక చెట్టుయొక్క ఒక కొమ్మని నరికితే అది వేరొక కొమ్మను మళ్లీ మొలిపించుకుంటుంది. చెట్టు తన ఆకులను సమృద్ధిగా రాల్చేస్తుంది. చెట్టు తన పండ్లను రాల్చేస్తుంది. అలాగే వరి వంటి మొక్కల ధాన్యాన్ని మనం ఆ మొక్క ప్రకృతిసిద్ధంగా చనిపోయిన తర్వాతే పంటను కోసి విత్తనాలను ఇంటికి తెచ్చుకుంటాము. ఈ అచరసృష్టి తమకు ఒకచోట ఆహారం దొరకలేదుగదా అని వేరొకచోటికి కదలవు వీటిలో సత్వగుణం (సత్వం సుఖే సంజయతి). అందువల్ల అరటి, మామిడి, గోధుమలు, యవలు, తిలలు, వంటి వాటిని భుజిస్తే సత్వగుణవృద్ధి జరిగి ఆలోచనలో క్రూరత్వం నశించి మనిషి ఆరోగ్యపూరితమైన జీవనాన్ని సాగిస్తాడు కాబట్టి శాకాహారము (అచర చేతనా సృష్టి) ని భుజించి మానవుడు సుఖించి కైవల్యాన్ని పొందవచ్చని సాధనాగ్రంధములలో ఋషులు బోధించారు.

ఇకపోతే ఈ శాకాహార మాంసాహారచర్చ అనేది ’జరాయుజములలో’నే సాధ్యం! మానవులు మావినుండి పుడతారు. తల్లి పాలు తాగి పెరుగుతారు. అలాగే తోటి జరాయుజములైన ఆవులు, లేడులు, గుర్రముల వంటి వాటి పాలు వీరు తాగవచ్చు అని చెప్పారు. ఈ పాలు అనేవి తమ బిడ్డతాగేదానికంటే రెండింతల ఎక్కువగానే జరాయుజములు ఉత్పత్తిచేస్తాయి. కాబట్టి దూడ తాగిన తర్వాత మిగిలిన పాలను ఈ జరాయుజములు సహజంగానే విసర్జించేస్తాయి. అంటే మీరు పితకకపోతే ఎక్కువైనపాలను ఏ చెట్టుకో పొదుగును అదిమిపెట్టి కార్చేస్తాయి. కాబట్టి ఇలాంటి పాలు సేకరించడంవల్ల జరాయుజముల ప్రాణనష్టాన్ని కలిగించడం జరగడంలేదు! కాబట్టి పాలు ఖచ్చితంగా శాకాహారమే! అయితే దీనికి ఒక నియమం చెప్పారు. ఉద్భిజములను’ తిని బ్రతికే ’జరాయుజముల’ పాలుమాత్రమే శాకాహారం – అంటే గడ్డితిని పాలిచ్చే ఆవుపాలు శాకాహారం. కానీ మిగిలినవాటిని తిని పాలిచ్చే జరాయుజముల పాలు ’మాంసాహారం – అంటే ఆవును తిని పాలిచ్చే పులిపాలు మాంసాహారమే!. మానవులు స్వతస్సిద్ధంగా ఉద్భిజములను’ తిని బ్రతికే ’జరాయుజములు’.

గుడ్డు అనేది ఖచ్చితంగా మాంసాహారమే! Sterile Egg అనేదాన్ని కొన్ని రసాయనాలనుపయోగించి పెరగకుండా దానిలోని జీవాన్ని మాతృగర్భంలో ఉండగానే చంపేస్తారు. అందుకే అది పుట్టిన తర్వాతగూడా పెరగకుండా గుడ్డులాగా మిగిలిపోతుంది. ఆ గుడ్డులోనుండి పిల్ల బైటికిరాకుండా రసాయనాలువాడి, పైగా పిల్లరాదుగదా అది శాకాహారమే అని చెప్పడం అర్ధంలేని వాదం.

కాబట్టి సూక్షంగా ఏది కదులుతుందో, ఏది కదిలి తన ప్రాణాలను కాపాడుకో ప్రయత్నిస్తుందో, ఏది కదలిక కలిగే తనవంటి ప్రతిరూపానికి జన్మనిస్తుందో – దానిని తినడం మాంసాహారం. గుడ్డు ఖచ్చితంగా మాంసమే! కానీ పాలు శాకాహారం.

ఏది కదలదో, ఏది తన కొమ్మలను మరింతగా, ఆకులను మరింతగా మొలిపించుకోగలుగుతుందో అది శాకాహారం.

చేపలు ‘అండజముల‘ క్రిందకే వస్తాయి. అంటే గుడ్లనుండి పుట్టేవి. కదలిక కలిగినటువంటివి. కాబట్టి చేపలవంటివిగూడా మాంసాహారంక్రిందకే పరిగణించబడుతుంది. ప్రతి జీవికి తన స్వతస్సిద్ధమైన తిండి ఉంటుంది. లేడులు, ఆవులు, గుర్రములు స్వతస్సిద్ధంగా పచ్చికమేస్తాయి.

పులులు, సింహములు, దుమ్ములగొండులు, గద్దలు స్వతస్సిద్ధంగ మాంసమును తింటాయి.

మానవులు స్వతస్సిద్ధంగా పండ్లు, కూరగాయలు, కొన్నిరకముల గడ్డి (లేతవెదురు) మరియు గడ్డిగింజలు (వరి, గోధుమ మొదలగునవి) తింటారు.

మనుషుల శరీర నిర్మాణాకృతి అంతర్గతమైన జీర్ణావయవములు ఈ విషయాన్నే నిర్ధారిస్తాయి. మానవుల ప్రేగులు దాదాపు ఏడు మీటర్ల పొడవుంటాయి.

ఇవి మిగిలిన శాకాహార జరాయుజములైన దుప్పి,లేడి, ఆవులను పోలిన నిర్మాణం. కానీ పులి, దుమ్ములగొండి, సింహము వంటి సహజసిద్ధమైన మాంసాహార జరాయుజముల పొట్టలోని ప్రేగులు మీటరు పొడవుగూడా ఉండవు.

ఎందుకంటే ఇవి మాంసం తింటాయి, మాంసము అంటే అప్పటికే ఒక జంతువు తిని అరిగించుకుని బలంగా మార్చుకున్న పదార్థం.

అందువల్ల తిరిగి మాంసాన్ని అరిగించుకోవాల్సిన అవసరం వీటి ప్రేగులకు ఉండదు, వీటి ప్రేగులపై అంత భారమూ పడదు.

అందుకని స్వతస్సిద్ధంగా మాంసం తినే జంతువుల ప్రేగులు చాలా చిన్నవిగా ఉంటాయి. కాబట్టి మానవులు స్వతస్సిద్ధంగా శాకాహరజీవులు. ఇదీ అసలు విషయం.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...