Sunday, August 16, 2015

శ్రావణ మాసం విశిష్టత

మహిళలు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు . ఈ మాసంలో నెలంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు మహాలక్ష్మిలా వెలుగొందుతూ తమ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతోఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయాలు శ్రావణ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడనున్నాయి. శ్రావణమాసం సందర్భాన్ని పురస్కరిన్చుకొని ప్రతి జిల్లాలోని ఆలయాల్లో చళువ పందిళ్ళు, బారీకేడ్లను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు .
శ్రావణమాసము శుభఫలాల నెల . ముత్తైదువులందరూఉత్సాహముగా , సంబరముగా పండుగలు , పూజలు , పేరంటాలు జరుపుకునే మాసము . శ్రావణమాసము లో లక్ష్మీదేవిని మనసరా పూజిస్తే సిరి సంపదులు చేకూరుతాయి.

ఈ నెలలో ప్రతిరోజూ కూ ఒక ప్రత్యేకత ఉన్నది . విష్ణుమూర్తి శ్రవణా నక్షత్రము న పుట్టినారు . ఈ నెలలో జన్మించినవారు వేదొక్త కర్మలు నిర్వహించడము , సకలజనుల గౌరవమన్ననలు పొందడము , సిరిసంపదల సమృద్ధి తో జీవనము సాగించ గలరని నమ్మకము . ఈ నెలలో జనిమించిన మహానుభావులలో -- శ్రీకృష్ణ పరమాత్మ , హయగ్రీవోత్పత్తి , అరవింద యోగి ముఖ్యులు .

మాఘమాసము లో ఆదివారాలు , కార్తీక మాసములో సోమవారాలు , మార్గశిరమాసములో లక్ష్మివారాలు -- ఇలా ఒక్కోమాసములో ఒక్కొక్క రోజు పవిత్రదనాలుగా భావిస్తారు . ఐతే శ్రావణమాసములో అన్నిరోజులు పవిత్రమైనవే ... ప్రతిదినము ముఖ్యమైనదే .

ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు.
సోమవారాల్లో శివుడికి అభిషేకాలు,
మంగళవారం గౌరీ వ్రతం,
బుధవారం విఠలుడికి పూజలు,
గురువారాల్లో గురుదేవుని ఆరాధన,
శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు,
శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి ,
భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవున్ని పూజించడం తర తరాల నుండి సాంప్రదాయంగా వస్తుంది. రోజు చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీపౌర్ణమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. ఒకటి తర్వాత ఒకటి పండుగలు రావడంతో కొత్త అళ్ళుల్లు, కోడళ్ళు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు రావడంతో ప్రతి హైందవ గడప సందడిగా మారుతుంది.

పరమశివుడి వారం ... సోమవారం భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ కొలువగానే కొలువుదీరే శివునికి శ్రావణమాసం అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ మాసంలో వచ్చే సోమవారాలన్నింటిని శివాభిషేకానికి కేటాయిస్తారు. ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాస దీక్షలు చేపట్టి తాంబూళం, దక్షణ సమర్పించి భక్తులు శివుడికి హారతిస్తారు. బిలువ పత్రాలు, ఉమ్మెత, కలువతుమ్మి వంటి శివుడికి ఇష్టమైన పూలతో పూజలు చేయడం ఈ పండుగ ఆనవాయితీ.

శుభాలు కలిగే .. మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. మంచి భర్త రావాలని అవివాహితులు, తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.

నాగపంచమి శ్రావణమాసం మొదలైన నాలుగవ రోజునే వచ్చే పండుగ నాగపంచమి, శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిర్యాలు, పూలనుపెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడిగెలను భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే ... పుత్రదైకాదశి సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల 11వ రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతానయోగ్యత కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.

బ్రాహ్మణులు ఈ మాసంలో పాత జంధ్యాన్ని త్యజించి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు.

వరాలిచ్చే తల్లి ... వరలక్ష్మి శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శనిగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు.

అనురాగ బంధాల ప్రతీక... రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెల అనురాగ బంధాల ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి ఈ మాసంలోనే వస్తుంది. పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి రాఖీ పౌర్ణమి అని అంటారు. సకల వేళల తమకు రక్షణగా నిలువాలని కోరుకుంటూ స్త్రీలు తమ సోదరుల ముంజేతికి రాఖీ కట్టి ఆశీస్సులు అందుకుంటారు. సోదరులకు తీపి తినిపించి ప్రేమతో ఇచ్చే కానుకలను అందుకుంటారు. ముకుందాష్టమి ముకుందా....ముకుందా అంటూ శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తులు కోలహాలాల మధ్య నిర్వహించుకుంటారు. అష్టమి తిథి రోజున వచ్చే శ్రీ కృష్ణుని పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు. చిన్నారులు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. సాయంత్రం వేళలో నైవేద్య కార్యక్రమాలు పూర్తయ్యాక ఉట్టిగట్టి కోలహాలం చేస్తారు.

శ్రావణ వంటలు -- ఆరోగ్యప్రదాయము :
ఆషా్ఢ మాసము వెళ్ళిపోయి శ్రావణము వచ్చిందంటే మహిళలకు సందడే సందడి . వరలక్ష్మికి తొలిపూజ చేయడం ద్వారా తకము సౌభాగ్యము , ఐశ్వర్యము కలగాలని కోరుకుంటారు . అయిటే ఇందులో అంతర్లీనము గా ఆరోగ్య రహస్యము కూడా ఇమిడి ఉంది . వర్షాకాలము ప్రారంభం లో సాదారణము గా ప్రబలే పలు రకాల వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన రోగనిరోధక శక్తి ఈ వ్రతాల ద్వారా లభిస్తుంచి . వరలక్ష్మీ పూజలో తొమ్మిది రకాల పిందివంటలు , ఈ ఋతువులో లభించే పండ్లు , వివిధ పుష్పాలు నివేదించి కుటుంబ సభ్యులంతా ప్రసాదం గా తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులవుతారు . ఇంకా కుటుంబ సభ్యులలో సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది . మహిళలు పేరంతం పేరుతో ఇరుగుపొరుగు వానిని ఆహ్వానించి పరస్పరము వెళ్ళి వాయినాలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా స్నేహభావము పెరుగుతుంది .

తొమ్మిది రకాల పిండివంటలు :
పూర్ణం బూరెలు : సెనగపప్పుతో తయారు చేసిన ఈ బూరెలు తినడం ద్వారా ప్రోటీన్లు సమంద్దిగా లభిస్తాయి .
పులగం : బియ్యం , పెసరపప్పులను కలిపి తయారు చేస్తారు . గ్లాసుడు బియ్యంలో అరగ్లాసు పెసరపప్పు , తగినంత పంచదార , జీలకర్ర వేస్తారు .. ఇది భుజించడం ద్వారా మేధస్సు వికసిస్తుంది .
గారెలు : మినపపప్పు , కొద్దిగా సెనగపప్పు వేసి తయారు చేస్తారు . గారెలంటే అందరికీ ఇస్టము . ఇందులొ ఎన్నో ప్రోటీన్లు ఉన్నాయి .
పరమాన్నము : పాలను మరిగిస్తూ దానిలో నెయ్యి కలిపిన బియ్యాన్న, పంచదార .. వేయడం ద్వారా పరమాన్నము గా తయారవుతుంది . దీన్ని తినడం వల్ల కాల్షియం లభిస్తుంది .
చెక్కెర పొంగలి : బియ్యము , పాలు , నెయ్యి . పెసరపప్పు , జీడిపప్పు , కిస్ మిస్ , మిరియాలు వేసి తయారవుతుంది గాన మెదడు , ఇతర అవయవాలు చురుగా పనిచేసి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి .
పులిహోరా : బియ్యము , పసువు , జీడిపప్పు , వేరుసెనగ పప్పు , ఇంగువ వేసి తయారవుతుంది . దీనిని తినడం వల్ల శరీరము లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది .
చిట్టి బూరెలు : మునపపప్పు ముద్దగా చేసి కొద్దిగ మజ్జిగ కలిపి వేయించి చేస్తారు . ఇవి పిల్లలకు చాలా ఇస్టము . చలువ చేస్తుంది .
పెసర బూరెలు : పెసర పప్పుతో తయారు చేసిన ఈ బూరెలు లలో ప్రోటీన్లు లభిస్తాయి .
గోధుమ ప్రసాదము : గోధుమ నూక , పంచదార , నెయ్యి , మిశ్రమముతో తయారుచేస్తారు . ఇది బలమైన ఆహారము

69వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.....


మహాత్ముడి అడుగుజాడల్లో..... "స్వాంతంత్ర్య దినోత్సవం"
.
ఆగష్టు 15 భారత దేశపు స్వాతంత్ర్య దినోత్సవం గా జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు 15న భారత దేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది. దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.

భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్ది చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే ఆయన గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగి భారత సిపాయిలు, రాజులు అందులో ఓడిపోయాకా 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాకా దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది. బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర పోరాటాల ఫలంగానూ దేశానికి ఆగస్టు 14, 1947న అర్థరాత్రి సమయంలో స్వాతంత్రం వచ్చింది.

బ్రిటీష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1948లో నిర్ణీతమైన స్వాతంత్ర దినాన్ని ముందుకు జరుపుతూ ఆగస్టు 15, 1947న జరగాలని నిర్ణయించారు. రెండవ ప్రపంచయుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్రానికి దానిని ఎంచుకున్నారు బాటన్.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి. మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ మాట్లాడిన మాటలివి:
అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం. మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా, కూలంకషంగా సాధించే సమయం యిప్పుడు ఆసన్నమయింది. అర్థరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే, ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో పారవశ్యం చెందివున్న సమయాన, భారతదేశం, పునరుజ్జీవనంతో, స్వేచ్ఛగా స్వతంత్రదేశంగా ఆవిర్భవిస్తుంది.

మహాత్ముడి అడుగుజాడల్లో.. "స్వాతంత్య్ర భానోదయం" .......

"దెబ్బ తీయటం గొప్ప కాదు, దెబ్బను సహించటం గొప్ప. అందుకు ఎంతో ఆత్మస్థైర్యం కావాలి" అని నిరూపించిన జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడలు ప్రతి భారతీయుడికీ మార్గదర్శకాలు. దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఒక స్థిరమైన ఆశయంతో వచ్చిన ఆయన వెంట జాతి యావత్తూ అడుగులేసింది. అప్పటిదాకా స్వతంత్ర భారతదేశం కోసం ఓ ప్రణాళిక అంటూ ఏదీలేక అస్తవ్యస్తంగా ఇష్టం వచ్చినట్లు నడచిన భారత ప్రజలకి ఆయన అడుగుజాడలే దిశా నిర్దేశాలుగా, ఆదర్శాలుగా మారాయి.

ప్రజాగ్రహం స్థానంలో సత్యాగ్రహం.. ఆక్రోశం ఆవేశాల స్థానంలో అహింసలను ఆయుధాలుగా మలచిన మహాత్ముడి తీరు చూసి ప్రపంచదేశాలన్నీఆశ్చర్యచకితులయ్యాయి. అప్పటిదాకా "ఆడింది ఆటగా పాడింది పాటగా" తైతక్కలాడిన బ్రిటీష్ ప్రభుత్వానికి చక్కటి గుణపాఠం చెప్పారాయన.

సత్యాగ్రహం కావచ్చు, దండి సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు... ఇలా మహాత్ముడు చేపట్టిన ఏ ఉద్యమానికయినా ప్రజలు సంపూర్ణ మద్ధతును, సహకారాన్ని అందించారు. "వందేమాతరం" అంటూ ముక్తకంఠంతో ఆయన వెంట జనప్రవాహమై సాగిపోయారు.

అలా సాగిన ఆ పోరాటానికి 1947 ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రిలో ప్రతిఫలం లభించింది. అంత చీకట్లో కూడా కోట్లాది భారతీయుల కళ్ళల్లో కోట్ల కాంతుల ఉషోదయం విరజిమ్మింది. ఆ ఉషోదయానికి ఇప్పుడు అరవై ఎనిమిదేళ్లు. ఈ 68 ఏళ్ల స్వాతంత్ర్య ప్రస్థానంలో ప్రతి ఏడాదినీ పుట్టినరోజులా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మరో పుట్టినరోజును నేడు జరుపుకోబోతున్నాం.

సాధారణంగా పుట్టినరోజును కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్యన జరుపుకుంటుంటాం.కానీ... స్వతంత్ర భారతదేశ పుట్టిన రోజును బడిలో, గుడిలో, కళాశాలల్లో, కార్ఖానాల్లో, స్వదేశంలో, విదేశంలో... ఇలా ఎక్కడయినా సరే, ముహూర్తంతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చు.

ఈ పుట్టినరోజు వేడుకలు ఆత్మీయుల మధ్యనేగాదు అపరిచితుల మధ్య కూడా జరుపుకోవచ్చు. దీనికి ఆహ్వానాల అవసరం లేదు, అతిథుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండదు. మన స్వతంత్ర భారతావని పుట్టినరోజు వేడుకకు అందరూ ఆహ్వానితులే, ముఖ్యులే...!

"ఇంటా, బయటా" అని పెద్దలు అంటుంటారు. దీనికి ఇంట్లోనూ, అదే ఊరిలో మరోచోట అనే అర్థాలున్నప్పటికీ... వాటి స్వరూపాన్ని బట్టి నేడు "ఇంట అంటే భారతదేశంలో ఎక్కడయినా అనీ.. బయట అంటే, భారతదేశం అవతల ఏ విదేశంలో ఉన్నా" అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సావాలను స్వదేశంలోనూ, విదేశాల్లోని నివసించే భారతీయులందరూ అత్యంత కోలాహలంగా వేడుకలు చేసుకుంటున్నారు.

అందుకే...

“ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము”

అంటూ ఎలుగెత్తి కీర్తించిన రాయప్రోలు సుబ్బారావుగారి ప్రబోధాన్ని మరోసారి మననం చేసుకుని దేశ విదేశాల్లో సైతం స్వాతంత్ర్య దినోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించుకోవడం భారతీయులుగా మనందరి కర్తవ్యం.

ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన వచ్చే ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇచ్చే సెలవు దినం కోసం ఎదురుచూపులు చూడటం కాకుండా, స్వాతంత్ర్య దినం కోసం ఎదురుచూడటం భారతీయులందరి కనీస ధర్మం. మరణించిన పెద్దలను ప్రతి ఏటా స్మరించుకోవటం, సంతర్పణలు లాంటివి చేస్తుంటాం.

మరి మనందరం స్వేచ్ఛగా బ్రతికేందుకు మరణం తప్ప మరో మార్గం లేదని తెలిసి కూడా కదనరంగంలోకి దూకి అసువులు బాసిన స్వాంతంత్ర్యోద్యమ వీరులను ఒక్కరోజైనా తలచుకోవటం మన కనీస ధర్మం కాదా..? మనం వారికి ఎలాంటి సంతర్పణలు చేయాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా ఒక్కసారి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటే చాలు.

మన ముందు తరాలవారి త్యాగ ఫలాలను భోంచేస్తున్న మనం ఇప్పుడు కొత్తగా త్యాగాలు చేయాల్సిన అవసరమేమీ లేదుగానీ.. ప్రతియేటా ఈ పండుగను జరుపుకునేందుకు కాస్తంత తీరిక చేసుకుంటే చాలు. మన భారతీయ పండుగల్లో ఏ పండుగకూ, ఏ వేడుకకీ.. ఈ స్వాంతంత్ర్య దినోత్సవ పండుగ తీసిపోదు. దసరా, దీపావళి, హోలీ, క్రిస్‌మస్ పండుగలు వివిధ మతాలకు చెందినవైతే... అన్ని మతాలవారు చేసుకోదగ్గ అద్వితీయ పండుగ మన "స్వాంతంత్ర్య దినోత్సవం

శిల్ప శాస్త్రజ్ఞులు

ఖగోళాన్ని భూగోళానికి దింపిన అలనాటి శిల్ప శాస్త్రజ్ఞులు

ఒరిస్సా ముఖ్య పట్టణం భువనేశ్వర్ కు ‘’ఆలయాల నగరం ‘’అని పేరు .అక్కడి దేవాలయాలను అంతరిక్ష నక్షత్ర మండలాలకు ప్రతీకలుగా నిర్మించటం విశేషం .నక్షత్ర సీమల మధ్య ఉండే దూరాలు వాటి మధ్య అనుబంధాలే మన ప్రాచీన ఆలయ నిర్మాణాలు .ఇవి చూసి ఈ నాటి శాస్త్ర వేత్తలు అలనాటి మన వాళ్ళ వైదుష్యానికి ముక్కున వేలేసుకొంటున్నారు .
.పరాసు రామ దేవాలయం శిఖరం

భువనేశ్వర్ లోని ప్రాచీన ‘’పరశురామాలయం ‘’నిర్మాణం పై దీపక్ భట్టా చార్య 2010లో పరిశోధన చేసి ఎన్నో విషయాలను లోకానికి చాటి చెప్పాడు .ఈ ఆలయ నిర్మాణం మామూలు నిర్మాణ శైలి లో కాకుండా భిన్నం గా ఉందని ముందు గుర్తించాడు .దీనికీ ఖగోళ సంబంధం ఉందని భావించాడు .అతరిక్షం లో నక్షత్రాలు వేర్వేరు దూరాలలో పరచుకొని ఉన్న రీతిలో ఆలయం లోని కొన్ని ముఖ్యమైన కళా రూపాలు కూడా భిన్న భిన్న కోణాలలో ,దిశలలో అమరి ఉండటం చూసి పరమాశ్చర్య పడ్డాడు .తనకున్న పరిజ్ఞానం చాలక ,మరింత లోతుగా అధ్యయనం చేయటం ప్రారంభించాడు .ఈయనకు ప్రహ్లాద చంద్ర నాయక సహకరించాడు .అంతరిక్ష గణితం లో దిట్ట అయిన ప్రహ్లాద కూడా ఏంతో జిజ్ఞాసతో కృషి చేశాడు .చివరికి అంతరిక్షం లో ‘’తారకల అమరిక’’ నే భువనేశ్వర్ లోని ఆలయ నిర్మాణాలలో కూడా ఏర్పరచారని ఇద్దరు తేల్చారు .

భువనేశ్వర్ పాత బస్తీ లో ‘’ఏకామ్ర క్షేత్రం ‘’పరిధిలో సముద్ర మట్టానికి భిన్న మైన ఎత్తు లో ఉండే మూడు ప్రదేశాలున్నాయి .ఒక్కో ప్రదేశం లో తొమ్మిది చొప్పున ఇరవై ఏడు ప్రాచీన నిర్మాణాలున్నాయి .ఇవి నక్షత్రాలకు ప్రాతి నిధ్యం వాహించేవే అని వీరిద్దరి పరి శోధన లో తేలింది .ప్రకాశ వంతమైన నక్షత్రాలను ఒక జాబితా గా రూపొందించే ‘’అంతర్జాతీయ ఏల్ కేటలాగ్ ‘’లో ఉన్న 27నక్షత్రాలకు ,ఈ ప్రాచీన ఆలయ నిర్మాణాలు ప్రాతి నిధ్యం వహిస్తున్నాయని ఎత్తూ ,దూరాల విషయం లో వాటి పరస్పర సంబంధాలు కూడా ఇక్కడా ప్రతి బిమ్బిస్తున్నాయని నిర్ధారించారు .గణిత శాస్త్రానికి సంబంధించిన ఈ నిర్ధారణ కు ‘’కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్’’ (క్యాడ్ )సాఫ్ట్ వేర్ ను వినియోగించుకొన్నారు .

అంతరిక్షం లో ఉన్న నక్షత్ర మండలాలకు ,భూమి మీద ఉన్న ఈ నిర్మాణాలకు ఉన్న సంబంధాన్ని తులనాత్మకం గా అధ్యయనం చేసిన తర్వాత మన ప్రాచీనులు తారా మండలాన్ని దృష్టిలో ఉంచుకొనే ఎంపిక చేసిన ప్రత్యెక ప్రదేశాలలో ఈ నిర్మాణాలు చేశారని స్పష్టం చేశారు .భువనేశ్వర్ లో ‘’బారంగ ఘడ్ ,శిశుపాల్ ఘడ్ మొదలైన శివారు ప్రాంతాల్లో చతురస్రాకా రాలలో ఉన్న కోటలను అంత రిక్షం లోని ‘’పిగాసన్ స్క్వేర్ ,క్రేటర్ నక్షత్ర మండలాలకు ప్రతి నిధులుగా నిర్ణయించారు .అలాగే రెండు త్రిభుజా కారాల్లో రూపొందించి నట్లు కనీ పించే ‘’సెటస్’’నక్షత్ర మండలం ‘’ఖంద గిరి,ఉదయ గిరి ప్రాంతాలను ,’’వేలా ‘’నక్షత్ర మండలం భువనేశ్వర్ తూర్పు తీరం లోని ఓడ రేవునూ సూచిన్చేట్లు ఉండటం విశేషమైన విషయం .

భట్టా చార్య ,ప్రహ్లాదలు 2000 మే నెలలో ఒక సదస్సు జరిపి తమ పరిశోధనలు ఊహా గానాలు కావని సభా ముఖం గా బహిర్గతం చేశారు

. వీరి ఖగోళ గణితం ప్రకారం విడి విడిగాను,సంయుక్తం గాను కనీ పించే 33 నక్షత్రాలకు కేంద్రం గా భావించే ‘’బేబెల్ గూస్ ‘’ అంత రిక్ష స్థానం ,వీరి ఖగోళ గణితం ప్రకారం భువనేశ్వర్ లోని ‘’పరశు రామాలయం ‘’ప్రాంతాన్నే సూచిస్తోంది .ప్రకాశ వంతమైన ఎరుపు రంగు లో ఉండే ‘’బెటల్ గూస్ ‘’నక్షత్రాన్ని ఋగ్వేదం తెలియ జేస్తోంది .పరశురామేశ్వరం లో శివ లింగం మామూలుకు భిన్నంగా ప్రకాశ వంతమైన ఎరుపు రంగులో ఉండటం ఇక్కడి విశేషం .దీన్ని కేంద్రం గా తీసుకొని ఊహా రేఖలను గీస్తే అంతరిక్షాన్ని60 డిగ్రీల కోణం లో ఆక్రమిస్తూ ఏర్పడే మహా నక్షత్రం ‘’తారక ‘’ఆకారం కూడా ‘’ఏకామ్ర క్షేత్ర ఆలయ ‘’లక్షణాలతో సరిగ్గా సరి పోవటం మరీ విశేషం .’’ఆరియస్ ,కాసియోపియా ,హైడ్రా ‘’‘’మొదలైన అనేక నక్షత్రాల జాడలను కూడా ఈ ప్రాచీన ఆలయ నిర్మాణాలలో ప్రతి బిమ్బింప జేసిన ఘనత, మేధా శక్తి మన ఆలయ స్తపతులకు ఉండటం ఏంతో ఆశ్చర్య జనక విషయం .అందుకే ఖగోళాన్ని భూగోళం పై దింపారు అలనాటి మన శిల్ప స్రష్టలు అని ముందే చెప్పాను

.

ఇక్కడ ఇంకో ఆశ్చర్య కరమైన విషయం కూడా ఉంది .నక్షత్రాల ప్రాతి నిధ్యం వహించే ఈ భువనేశ్వర్లయాల నిర్మాణం లో ఆలయాల అభి వృద్ధికి ,పతనానికి కూడా ఆయా నక్షత్రాల గమనంతో సంబంధం ఉందని పరిశోధకులు చెప్పారు .’’సిగ్నస్’’నక్షత్ర మండలం ను ఒరియా భాషలో ‘’చాయా లేక అగ్ని ‘’అని అంటారు .అది తన ప్రదేశాన్ని మార్చుకోన్నప్పుడు భూమి మీద అది ప్రాతి నిధ్యం వహించే నిర్మాణాలు ,ఆలయాలు శిధిలం గా మారటాన్ని ఇందుకు రుజువుగా సూచించారు .పూరీ భువనేశ్వర్ ‘’ప్రాచీ లోయ ‘’లోని ‘’కోణార్క్ ‘’లలో ఉన్న ఈ నాడు కనీ పించే శిధిలాలు ఇవే .

భువనేశ్వర్ లో అతి భారీ స్తాయి ఆలయం ‘’లింగ రాజు ‘’ఆలయం పై భాగం మామూలు ఆలయాలకు భిన్నం గా ‘’పినాక ధనువు ‘’పేరుతొ ఒక విల్లు ఆకారం లో ఉండటం విశేషం .శాస్త్ర వేత్తల లెక్క ప్రకారం ఇది ‘’రేజేల్ ‘’నక్షత్ర మండలానికి ప్రతీక .ఆ నక్షత్ర మండలం ధనుస్సు ఆకారం లోనే ఉంటుంది .ఈ విధం గానే ఈ ఆలయ శిఖరం కూడా అలా ఉండేట్లు నిర్మించారన్న మాటకనుక మన ప్రాచీనుల శాస్త్ర అవగాహనయెంత విశాలమైనదో, లోతైనదో అర్ధం అవుతోంది .ఖగోళ శాస్త్రమే కాదు వైద్య శాస్త్రం లోను ఇప్పుడు ఆలయ నిర్మాణ శాస్త్రం లోను మన వారి ప్రతిభ అంతరిక్షాన్ని ముట్టిందని అర్ధమవుతోంది కదా .

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...