Sunday, August 16, 2015

కళ్యాణ ఘడియ ఎప్పుడు?


జాతకచక్రం పరిశీలించేటప్పుడు జాతకంలో పెళ్ళి తొంద రగా జరుగుతుందా లేదా, ఆలస్యంగా జరుగుతుందా అనే విషయం గమనించాలి. ప్రస్తుతం 22 సంవత్సరా ల్లోపు జరిగే వివాహాలను తొందరగా జరిగే వివాహాలుగా అనుకోవచ్చు. 
1. లగ్నం మరియు సప్తమ భావమందు శుభగ్రహాలు ఉండి సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా శుభగ్రహాల దృష్టి పొందిననూ...
2. ద్వితీయ, అష్టమ స్థానాల యందు శుభగ్రహాలు ఉన్నప్పుడు...
3. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు అనగా మీనరాశిలో గాని, తుల, వృషభ రాశులలో రవికి 150 లకుపైగా దూరంగా ఉన్నప్పుడు...
4. శుక్రునిపైన, చంద్రుని పైన శని దృష్టి పడకుండా ఉన్నప్పుడు...
5. శుభగ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు...
6. జలతత్వ రాశులలో శుభగ్రహాలు ఉన్నప్పుడు వివా హం తొందరగా జరుగుతుంది.
ఆలస్య వివాహాలు అనగా 28 సంవత్సరాలు, ఆ పై వయస్సులో జరిగేవి.
1. లగ్నం, సప్తమస్థానంలో పాపగ్రహాలు అనగా శని, రాహు, కేతువు, రవి, కుజ గ్రహాలు ఉన్నప్పుడు...

2. సప్తమ స్థానంలో రెండు గానీ అంతకన్నా ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు...
3. ద్వితీయ అష్టమ భావములలో పాపగ్రహాలు గానీ, వక్ర గ్రహాలు గానీ ఉన్నప్పుడు...
4. శుక్రుడు రాహుతో గానీ లేదా శనితో గానీ కలసి ఉన్నప్పుడు...
5. శుక్రుడు రవికి 430201ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు...
6. జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచమందు గానీ, వక్రిం చి గానీ ఉన్నప్పుడు...
7. సప్తమభావంపై మరియు సప్తమాదిపై పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్య వివాహం జరుగును...

ఈ విధంగా జాతకంలో శీఘ్ర వివాహమా? ఆలస్య వివా హమా అని నిర్ణయించిన తరువాత జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి గోచారంలో గురువు, శుక్ర గ్రహాలను బట్టి వివాహ కాలం నిర్ణయించాలి. వివాహకాలం నిర్ణయించుటకు జాతకుడికి 21 సంవత్స రాలు దాటిన తరువాత వచ్చు దశ, అంతర్దశలను పరిశీ లించాలి. సప్తమాది యొక్క లేదా సప్తమ భావమును చూస్తున్న లేదా సప్తమాధిపతి వీక్షణలు పొందుతున్న గ్రహాల యొక్క దశ, అంతర్దశల యందు వివాహం జరు గుతుంది. అలాగే నవాంశలగ్నాధిపతి యొక్క లేదా సప్త మాధిపతి నవాంశయందున్న రాశినాధుని యొక్క దశ అంతర్దశలందు వివాహం జరుగుతుంది. ఈ విధంగా వివాహం జరుగు కాలం నిర్ణయించిన తరువాత గురు గ్రహం యొక్క గోచార గమనాన్ని బట్టి వివాహం జరుగు సంవత్సరం నిర్ణయించాలి. అబ్బాయిల జాతకంలో శుక్రుడు, అమ్మాయిల జాతకమందు కుజుడు ఉన్న రాశు లపై గోచార గురువు యొక్క దృష్టి లేదా కలయిక వచ్చిన సంవత్సరంలో వివాహం జరుగుతుంది.

ఉత్తరాయణ కాలంలో జన్మించిన వారికి నవంశలో గురువు ఉన్న రాశి లోనికి గాని, గురువుకు 5, 9 స్థాన ముల లోనికి గాని రవి గోచారరీత్యా వచ్చిన నెలలో వివా హం జరుగుతుంది. దక్షిణాయణమందు జన్మించిన వారి కి నవాంశలో శుక్రుడు ఉన్న రాశిలోకి గాని, శుక్రుడికి 5, 9 స్థానాల్లోకి గాని రవి గోచారరీత్యా వచ్చిన నెలలో వివాహం జరుగుతుంది. ఈ విధంగా గురువు సంచారా న్ని బట్టి వివాహం జరుగు సంవత్సరం, రవి సంచారాన్ని బట్టి వివాహం జరుగు నెల నిర్ణయించాలి. తదుపరి చంద్రుని గమనాన్ని అనుసరించి వివాహం జరిగే రోజు నిర్ణయించాలి. 
జాతకచక్రం పరిశీలించునప్పుడు ఆలస్య వివాహానికి కారణం తెలుసుకొని తత్‌ సంబంధమైన గ్రహానికి సంబం ధించిన పరిహారాలు చేసినచో దోషాలు తొలగి శీఘ్ర వివాహం జరుగుతుంది.

సప్తమ స్థానంపై రాహు, కేతువు ల ప్రభావం ఉన్నప్పుడు ఎన్ని వివాహ సంబంధాలు చూసి ననూ వివాహం జరుగదు. కొన్ని సందర్భాల్లో నిశ్చితార్థం జరిగిన తరువాత వివాహం ముందు రోజు కూడా ఏవో కారణాల వలన వాయిదా పడుతుంటాయి. ఇటువంటి వారు కనకదుర్గ అమ్మ వారికి 8 శుక్రవారాలు కుంకుమ అర్చన జరిపించుకున్నచో దోషములు తొలగిపోతాయి. వివాహం తొందరగా కావాలని కోరుకునేవారు 8 మంగళ వారాలు హనుమాన్‌ ఆలయంలో స్వామివారికి 108 తమలపాకులతో అర్చన జరిపించినచో వివాహం కుదు రుతుంది. శని గ్రహ దోషం వలన వివాహం ఆలస్యం అవుతుంటే తమలపాకులో తేనె పోసి నల్ల చీమలకు ఆహా రంగా ఉంచిన దోషం తొలగుతుంది. వివాహం ఏదో ఒక కారణం వలన ఆలస్యం అవుతుంటే ఈ క్రింది మంత్రాన్ని ప్రతీ రోజూ 108 సార్లు పారాయణం చేయాలి.

దేవింద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి
సర్వ సౌభాగ్య కార్యేషు సర్వసౌభాగ్య దాయినీ

Friday, August 7, 2015

ఎవరు గొప్ప

దేవుడు మనిషిని సృష్టించాడు..
మనిషికి విలువ లేదు....
మనిషి డబ్బుని సృష్టించాడు...
దేవుడికే కాదు మనిషికి కూడా లేనంత విలువ మనిషి సృష్టించిన డబ్బు కు వుంది ......
ఇప్పుడు చెప్పండి...?

1. మనల్ని సృష్టించిన దేవుడు గొప్పన
2. మనం సృటించిన మనీ గొప్పన

Saturday, July 25, 2015

"బ్రతికేయొచ్చు" "బ్రతికించొచ్చు".

60 సంవస్తరాల నిరు పేద వృద్దుడు.. పెద్ద వయస్సులో కష్ట పడలేక, జైలులో ఉన్న తన కొడుకుకు ఒక లేఖ వ్రాసాడు..
" నాన్నా.. నువ్వు నిరాదార కేసులో ఇరుక్కుని జైలులో ఉన్నావు.. ఇక్కడ నా
పరిస్దితి ఎం బాగోలేదు.. ఒళ్ళు కూడా సహకరించడం లేదు.. మన తోటలో కూరగాయలు సాగు చేద్దాం అంటే.. పోలం చాలా గట్టిగా ఉంది రా.. మనుషులని పెట్టి సాగు చేయిద్దాం అన్నా చేతిలో అంత డబ్బు లేదు.. నాకు సహాయంగా ఉండే నువ్వు కూడా జైలులో ఉండి పొయావు.. నాకు సహాయం చేసే వారు లేరు.. చాలా భాదల్లో ఉన్నాను.. త్వరగా వస్తే బాగుంటుది"
ఇది లేఖ సారాంశం...
ఆ లేఖను తన కొడుకుకి, రాష్ట్రపతికి (క్షమాబిక్ష కోసం) పొష్ట్ చేసాడు..
మరుసటి రోజు తన కొడుకు దగ్గర నుంచి లేఖ అందుకున్నాడు...
" నాన్నగారు మీరు ఆ పొలం తవ్వోద్దు.. ఎందుకంటే, నేను హత్య కేసులొ ఇరుక్కున్న శవాలు ఆ భూమిలోనే ఉన్నయి -- నేను త్వరలోనే వచ్చేస్తా... వచ్చాకా ఆ పని చూస్తా..."
అది చదివిన ముసలాయాకి ఎమి అర్దం కాలేదు... 
పక్క రోజు ఇంటికి సి.బి.ఐ వాళ్ళు వచ్చారు... "ఇళ్ళంతా సోదాలు చేసి, పోలం అంతా తవ్వి తవ్వి అలసి పోయి ఏటువంటి ఆదారం దొరకక పొయేసరికి.. వీ ఆర్ రియల్లీ సారి.. అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.."
అదే రోజు తన కొడుకు దగ్గర నుంచి ఇంకోక లేఖ అందుకున్నాడు ముసలాయన...
" నాన్నా పొలంలో ఇప్పుడు నువ్వు ఎం కావలంటే అవి వేసుకో... నేను లేని లోటు సి.బి.ఐ. వాళ్ళు తీర్చారు... అరోగ్యం జాగ్రత్త నాన్నా"
అలా మన సి.బి.ఐ వాళ్ళ సహాయంతో ఆ పెద్దాయన హ్యపీగా పొలం పండించుకున్నడు.
.
మోరల్ ఆఫ్ దా స్టొరీ.... : విన్నవన్నీ నిజాలు కాదు.. చూసేవన్ని సత్యాలు కావు...
తెలివనేది బుర్రలోనే ఉంటే, కష్టకాలంలో కూడా "బ్రతికేయొచ్చు" "బ్రతికించొచ్చు".

వివాహ బంధమంత పటిష్ఠత సహజీవనంలో ఉండదు.

వివాహ బంధమంత పటిష్ఠత సహజీవనంలో ఉండదు. చిన్నచిన్న అభిప్రాయా భేదాలకే జంటలు విడిపోవచ్చు. సహజీవనం చట్టబద్ధమైన జర్మనీ, అమెరికాలే ఇందుకు ఉదాహరణ. సహా జీవన బంధం లో ఉన్న జంటలకు సమాజం, బంధువుల సాయం లభించదు . ఆర్థికంగా మంచి పరిస్థితి ఉన్నంతవరకే ఈ బంధం కొనసాగుతుంది. ఒకరు సంపాదన పరంగా వెనుక బడినపుడు డబ్బు విషయాల్లో తేడా వస్తుంది.ఈ బంధం కేవలం శారీరక వాంఛలకే పరిమిత మైందనే విమర్శలున్నాయి.

ఇది కేవలం నా ఘోష కావచు.,లేక ఆక్రోశము అనిపించవచు..

ఇన్నేళ్ళ ప్రేమ దూరమైనా బెంగ తో
ఎందుకు ఇక్కడ జీవించాలి?
మనమెందుకు అసలు ఇక్కడ మనుగడ సాగించాలి?

జీవితం అంటే ఒక జంజాట జూదం
జూదం ఆడలేక ఆడకుండా ఉండలేక 
నాలో నేను 
ఇది కేవలం నా ఘోష కావచు.,లేక ఆక్రోశము అనిపించవచు..

పరిస్తితులు

కోరిక ఎప్పటికి తీరదు 
ఆశ ఎప్పటికి చవదు
ఇ రండు లేకపోతే కాలం ముందుకు సగదు

ఎన్నో మాయలు
మరెన్నో తంత్రాలు 
ఎవేవే ఆత్రాలు 
ఇంకెన్నో ఆలోచనలు 
కానీ చివరికి 
తీరని కోరికలు

కోపలు
తపాలు
భావద్రోగాలు 
పరిస్తితులు 
ఆత్రాలు 
చివరికి ఆశ తీరని గాత్రలు

కోరిక ఆశ ఎలా ఉంటాయో తెలుసా 
అర్దనగ్నలలో అట బొమ్మలై ఉంటై 
అ అట ఆడలేని సన్యాసులు ఉన్నారు సామాన్యులు ఉన్నారు 
శ్రీమంతులు ఉన్నారు

ప్రేమ వేరు వేరుగా ఉంది ఎలా దగ్గర కావాలో తెలియడం లేదు అంతే

ప్రేమించడం చాలామందికి తెలియదు 
దాదాపుగా 99% కి 
ఎందుకంటే ప్రేమను ప్రేమ ఎప్పటికి ప్రేమించదు

ప్రేమ ఉంటె జీవితంలో బాగా పడలేరు 
ప్రేమలేకుంటే జీవితం గోవింద గోవిందనే

ప్రేమ లేదు అంటే నాకు కోపం వస్తుంది 
ప్రేమ వేరు వేరుగా ఉంది
ఎలా దగ్గర కావాలో తెలియడం లేదు అంతే

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...