Saturday, November 22, 2014

విష్ణు సహస్రనామ స్తోత్రము

 

స్తోత్ర కథ

అనేక పవిత్ర ధర్మములను విన్న తరువాత ధర్మరాజు భీష్ముని అడిగిన ఆరు ప్రశ్నలు:

  1. కిమ్ ఏకమ్ దైవతం లోకే - లోకంలో ఒక్కడే అయిన దేవుడు (పరమాత్ముడు) ఎవరు?

  2. కిమ్ వాపి ఏకమ్ పరాయణమ్ - జీవితానికి పరమపదమైన గమ్యము ఏది?

  3. స్తువంతః కమ్ ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును?

  4. కమ్ అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని అర్చించుట వలన మానవునకు శుభములు లభించును?

  5. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః - మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది?

  6. కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ - ఏ దేవుని జపించుటవలన జన్మ సంసార బంధనములనుండి ముక్తి లభించును?

అందుకు భీష్ముడు చెప్పిన సమాధానం: జగత్ప్రభువును, దేవదేవుని, అనంతుని, పురుషోత్తముని వేయి నామములను నిశ్చలమైన భక్తితో స్తుతిసేయట వలనను, ఆరాధించుట వలనను, ధ్యానించుట వలనను, ప్రణామము చేయుట వలనను సర్వదుఃఖములనుండి విముక్తి పొందవచ్చును. ఆ బ్రహ్మణ్యుని, పుండరీకాక్షుని ఆరాధించుట ఉత్తమ ధర్మము. ఆ దేవదేవుడు పరమ మంగళ ప్రదుడు. సకల సృష్టి-స్థితి-లయ కారకుడు. ఈ వేయి గుణ కీర్తనకరములైన నామములను ఋషులు గానము చేసినారు.

 

వేయి నామములు

1) విశ్వం - మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు.

2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.

3) వషట్కార: - వేద స్వరూపుడు.

4) భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.

5) భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు.

6) భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు.

7) భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.

8) భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు.

9) భూత భావన: - జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.

10) పూతాత్మా - పవిత్రాత్ముడు.

11) పరమాత్మ - నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు.

12) ముక్తానాం పరమాగతి: - ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు.

13) అవ్యయ: - వినాశము కానివాడు. వినాశము లేని వాడు.

14) పురుష: - నవద్వారములు కలిగిన పురము నందు ఉండువాడు.

15) సాక్షీ - చక్కగా సమస్తమును దర్శించువాడు.

16) క్షేత్రజ్ఞ: - శరీరము లో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు.

17) అక్షర: - నాశరహితుడు.

18) యోగ: - యోగము చే పొందదగిన వాడు.

19) యోగ విదాంనేతా - యోగ విదులకు ప్రభువైన వాడు.

20) ప్రధాన పురుషేశ్వర: - ప్రకృతి పురుషులకు అధినేత.

21) నారసింహవపు: - నరుని సింహమును బోలిన అవయువములు గల వాడు.

22) శ్రీమాన్ - సదా లక్ష్మీ దేవితో కూడి యుండువాడు.

23) కేశవ: - కేశి యనెడి అసురుని వధించిన వాడు.

24) పురుషోత్తమ: - పురుషులందరిలోను ఉత్తముడు.

25) సర్వ: - సమస్తమును తానై అయినవాడు.

26) శర్వ: - సకల జీవులను సంహరింప జేయువాడు.

27) శివ: - శాశ్వతుడు.

28) స్థాణు: - స్థిరమైనవాడు.

29) భూతాది: - భూతములకు ఆదికారణమైన వాడు.

30) అవ్యయనిధి: - నశించని ఐశ్వర్యము గల వాడు.

31) సంభవ: - వివిధ అవతారములను ఎత్తినవాడు.

32) భావన: - సర్వ జీవులకు సమస్త ఫలముల నొసగువాడు.

33) భర్తా: - సకలములను కనిపెట్టి, పోషించువాడు. సకలమును భరించువాడు.

34) ప్రభవ: - పంచభూతములకు, దేశకాలాదులకు మూలమైనవాడు.

35) ప్రభు: - సర్వశక్తి సమన్వితమైనవాడు.

36) ఈశ్వర: - ఒకరి సహాయములేకనే సమస్త కార్యములు నెరవేర్చగల్గిన వాడు.

37) స్వయంభూ : - తనంతట తానే ఉద్భవించిన వాడు.

38) శంభు: - సర్వశ్రేయములకు మూలపురుషుడు.

39) ఆదిత్య: - సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు.

40) పుష్కరాక్ష: - పద్మముల వంటి కన్నులు గలవాడు.

41) మహాస్వన: - గొప్పదియగు వేదరూప నాదము గలవాడు.

42) అనాదినిధన: - ఆద్యంతములు లేని వాడు.

43) ధాతా - నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమై యున్నవాడు.

44) విధాతా - కర్మఫలముల నందించువాడు.

45) ధాతురుత్తమ: - సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు.

46) అప్రమేయ: - ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.

47) హృషీకేశ: - ఇంద్రియములకు ప్రభువు.

48) పద్మనాభ: - నాభియందు పద్మము గలవాడు.

49) అమరప్రభు: - దేవతలకు ప్రభువైనవాడు.

50) విశ్వకర్మా - విశ్వరచన చేయగల్గినవాడు.

51) మను: - మననము(ఆలోచన) చేయువాడు.

52) త్వష్టా - ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.

53) స్థవిష్ఠ: - అతిశయ స్థూలమైన వాడు.

54) స్థవిరోధ్రువ: - సనాతనుడు, శాశ్వతుడైనవాడు.

55) అగ్రాహ్య: - ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలులేనివాడు.

56) శాశ్వత: - సర్వ కాలములందున్నవాడు.

57) కృష్ణ: - సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు.

58) లోహితాక్ష: - ఎఱ్ఱని నేత్రములు గలవాడు.

59) ప్రతర్దన: - ప్రళయకాలమున సర్వమును నశింపచేయువాడు.

60) ప్రభూత: - జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు.

61) త్రికకుబ్ధామ - ముల్లోకములకు ఆధారభూతమైనవాడు.

62) పవిత్రం - పరిశుద్ధుడైనవాడు.

63) పరం మంగళం - స్మరణ మాత్రముచే అద్భుతముల నంతమొందించి శుభముల నందించువాడు.

64) ఈశాన: - సర్వ భూతములను శాసించువాడు.

65) ప్రాణద: - ప్రాణి కోటికి ప్రాణశక్తి నొసగువాడు.

66) ప్రాణ: - ప్రాణశక్తి స్వరూపమైనవాడు.

67) జ్యేష్ఠ: - వృద్ధతముడు. (సృష్టికి పూర్వమునుండే ఉన్నవాడు)

68) శ్రేష్ఠ: - అత్యంత ప్రశంసాపాత్రుడు.

69) ప్రజాపతి: - సమస్త ప్రజలకు పతి.

70) హిరణ్యగర్భ: - విశ్వగర్భమున నుండువాడు.

71) భూగర్భ: - భూమిని తన గర్భమునందు ఉంచుకొన్నవాడు.

72) మాధవ: - శ్రీదేవికి భర్తయైనవాడు.

73) మధుసూదన: - మధువను రాక్షసుని వధించినవాడు.

74) ఈశ్వర: - సర్వశక్తి సంపన్నుడైనవాడు.

75) విక్రమీ - శౌర్యము గలవాడు.

76) ధన్వీ - ధనస్సును ధరించినవాడు.

77) మేధావీ - ఏకకాలములో సర్వవిషయగ్రహణ సామర్ధ్యము కలిగినవాడు.

78) విక్రమ: - గరుడుని వీపుపై ఎక్కి ఇచ్ఛామాత్రముచే ఎచ్చటైనను విహరించగలవాడు.

79) క్రమ: - నియమానుసారము చరించువాడు.

80) అనుత్తమ: - తనకంటె ఉత్తములు లేనివాడు.

81) దురాధర్ష: - రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు.

82) కృతజ్ఞ: - ప్రాణులు చేయు కర్మములను చేయువాడు.

83) కృతి: - కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.

84) ఆత్మవాన్ - తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.

85) సురేశ: - దేవతలకు ప్రభువైనవాడు.

86) శరణ: - దు:ఖార్తులను బ్రోచువాడై, వారి ఆర్తిని హరించువాడు.

87) శర్మ - పరమానంద స్వరూపుడు.

88) విశ్వరేతా: - సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.

89) ప్రజాభవ: - ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు.

90) అహ: - పగలువలె ప్రకాశించు వాడు.

91) సంవత్సర: - కాలస్వరూపుడైనవాడు.

92) వ్యాళ: - పామువలె పట్టశక్యము గానివాడు.

93) ప్రత్యయ: - ప్రజ్ఞా స్వరూపుడైనవాడు.

94) సర్వదర్శన: - సమస్తమును దర్శించగలవాడు.

95) అజ: - పుట్టుకలేని వాడు.

96) సర్వేశ్వర: - ఈశ్వరులందరికి ఈశ్వరుడైనవాడు.

97) సిద్ధ: - పొందవలసిన దంతయు పొందినవాడు.

98) సిద్ధి: - ఫలరూపుడైనవాడు.

99) సర్వాది: - సర్వమునకు మూలమైనవాడు.

100) అచ్యుత: - స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు.

101) వృషాకపి: - అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమెత్తి ఉద్ధరించినవాడు.

102) అమేయాత్మ - అపరిమిత స్వరూపము గలవాడు.

103) సర్వయోగ వినిస్సృతః - సర్వ విధములైన సంగత్యములనుండి విడిపడినవాడు.

104) వసు: - సర్వ భూతములయందు వశించువాడు.

105) వసుమనా: - పరిశుద్ధమైన మనస్సు గలవాడు.

106) సత్య: - సత్య స్వరూపుడు.

107) సమాత్మా: - సర్వప్రాణుల యందు సమముగా వర్తించువాడు.

108) సమ్మిత: - భక్తులకు చేరువై భక్తాధీనుడైనవాడు.

109) సమ: - సదా లక్ష్మీదేవితో కలిసి విరాజిల్లువాడు.

110) అమోఘ: - భక్తులను స్తుతులను ఆలకించి ఫలముల నొసగువాడు.

111) పుండరీకాక్ష: - భక్తుల హృదయ పద్మమున దర్శనీయుడైనవాడు. పద్మనయునుడు.

112) వృషకర్మా - ధర్మకార్యములు నిర్వర్తించువాడు.

113) వృషాకృతి: - ధర్మమే తన స్వరూపముగా గలవాడు.

114) రుద్ర: - దు:ఖమును లేదా దు:ఖ కారణమును పారద్రోలువాడు.

115) బహుశిరా: - అనేక శిరములు కలవాడు.

116) బభ్రు: - లోకములను భరించువాడు.

117) విశ్వయోని: - విశ్వమునకు కారణమైనవాడు.

118) శుచిశ్రవా: - శుభప్రధమై శ్రవణము చేయదగిన దివ్యనామములు కలిగినవాడు.

119) అమృత: - మరణము లేనివాడు.

120) శాశ్వతస్థాణు: - నిత్యుడై, నిశ్చలుడైనవాడు.

121) వరారోహ: - జ్ఞానగమ్యమైనవాడు.

122) మహాతపా: - మహాద్భుత జ్ఞానము కలవాడు.

123) సర్వగ: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.

124) సర్వవిద్భాను: - సర్వము తెలిసినవాడు.

125) విష్వక్సేన: - అసురుల సేనలను నిర్జించినవాడు. తాను యుద్దమునకు ఉపక్రమించినంతనే అసురసేన యంతయు భీతితో పారిపోవుటచే భగవానుడు విష్వక్సేను డాయెను.

126) జనార్దన: - దు:ఖమును కల్గించువాడు. ఆనందము నొసగూర్చువాడు.

127) వేద: - మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా గలవాడు.

128) వేదవిత్ - వేదజ్ఞానమును అనుభవములో కలిగినవాడు.

129) అవ్యంగ: - ఏ కొఱతయు, లోపము లేనివాడు.

130) వేదాంగ: - వేదములనే అంగములుగా కలిగినవాడు.

131) వేదవిత్ - వేదములను విచారించువాడు.

132) కవి: - సర్వద్రష్ట యైనవాడు.

133) లోకాధ్యక్ష: - లోకములను పరికించువాడు.

134) సురాధ్యక్ష: - దేవతలకు కూడా తానే అధ్యక్షుడైనవాడు.

135) ధర్మాధ్యక్ష: - ధర్మాధర్మములను వీక్షించువాడు.

136) కృతాకృత: - కార్య, కారణ రూపములతో భాసించువాడు.

137) చతురాత్మా - విభూతి చతుష్టయము తన స్వరూపముగా గలవాడు.

138) చతుర్వ్యూహ: - నాలుగు విధముల వ్యూహము నొంది సృష్టి కార్యములను చేయువాడు.

139) చతుర్దుంష్ట్ర: - నాలుగు కోరపండ్లు గలిగినవాడు.

140) చతుర్భుజ: - నాలుగు భుజములు కలిగినవాడు.

141) భ్రాజిష్ణు: - అద్వయ ప్రకాశరూపుడు.

142) భోజన: - భోజ్యరూపమైనవాడు.

143) భోక్తా: - ప్రకృతిలోని సర్వమును అనుభవించు పురుషుడు.

144) సహిష్ణు: - భక్తుల అపరాధములను మన్నించి క్షమించ గలిగినవాడు.

145) జగదాదిజ: - సృష్ట్యారంభముననే వ్యక్తమైనవాడు.

146) అనఘ: - పాపరహితుడైనవాడు.

147) విజయ: - ఆత్మజ్ఞానముతో వైరాగ్యసంపన్నుడై, శ్రేష్టమైన జయమునొందువాడు.

148) జేతా: - సదాజయము నొందువాడు.

149) విశ్వయోని: - విశ్వమునకు కారణభూతమైనవాడు.

150) పునర్వసు: - పదే పదే క్షేత్రజ్ఞుని రూపమున ఉపాధుల నాశ్రయించువాడు.

151) ఉపేంద్ర: - ఇంద్రునికి పై నుండువాడు.

152) వామన: - చక్కగా సేవించదగినవాడు.

153) ప్రాంశు: - ఉన్నతమైన శరీరము గలవాడు.

154) అమోఘ: - వ్యర్ధము కాని పనులు గలవాడు.

155) శుచి: - తన దరిచేరు భక్తులను పవిత్రము చేయువాడు.

156) ఊర్జిత: - మహా బలవంతుడు.

157) అతీంద్ర: - ఇంద్రుని అతిక్రమించినవాడు.

158) సంగ్రహ: - ప్రళయకాలమున సమస్తమును ఒక్కచోటికి సంగ్రహించువాడు.

159) సర్గ: - సృష్టియు, సృష్టికారణమును అయినవాడు.

160) ధృతాత్మా - తనపై తాను ఆధారపడినవాడు.

161) నియమ: - జీవులను వారి వారి కార్యములలో నియమింపజేయువాడు.

162) యమ: - లోపలనుండి నడిపించువాడు.

163) వేద్య: - సర్వులచేత తెలుసుకొనదగినవాడు.

164) వైద్య: - సమస్త విద్యలకు నిలయమైనవాడు.

165) సదాయోగి - నిత్యము స్వస్వరూపమునందు విరాజిల్లువాడు.

166) వీరహా - ధర్మరక్షణ నిమిత్తము వీరులైన అసురులను వధించినవాడు.

167) మాధవ: - అర్హులగువారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించువారు.

168) మధు: - భక్తులకు మధురమైన మకరందము వంటివారు.

169) అతీంద్రయ: - ఇంద్రియములద్వార గ్రహించుటకు వీలులేనివాడు.

170) మహామాయ: - మాయావులకు మాయావియైనవాడు.

171) మహోత్సాహ: - ఉత్సాహవంతుడు.

172) మహాబల: - బలవంతులకంటెను బలవంతుడైనవాడు.

173) మహాబుద్ధి: - బుద్ధిమంతులలో బుద్ధిమంతుడు.

174) మహావీర్య: - బ్రహ్మాండములను సృష్టించి, పోషించి, లయింపచేయు శక్తిసామర్ధ్యములు కలిగియున్నవాడు.

175) మహాశక్తి: - మహిమాన్విత శక్తిపరుడైనవాడు.

176) మహాద్యుతి: - గొప్ప ప్రకాశము అయినవాడు.

177) అనిర్దేశ్యవపు: - నిర్దేశించుటకు, నిర్ణయించుటకు వీలుకానివాడు.

178) శ్రీమాన్ - శుభప్రదుడు.

179) అమేయాత్మా - ఊహించుటకు వీలులేని మేధాసంపత్తి కలిగినవాడు.

180) మహాద్రిధృక్ - మందర, గోవర్ధన పర్వతములను అవలీలగా ఎత్తినవాడు.

181) మహేష్వాస: - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.

182) మహీభర్తా: - భూదేవికి భర్తయై, రక్షకుడైనవాడు.

183) శ్రీనివాస: - శ్రీమహాలక్ష్మికి నివాస స్థానమైనవాడు.

184) సతాంగతి: - సత్పురుషులకు పరమగతి అయినవాడు.

185) అనిరుద్ధ: - మరొకరు ఎదురించువారు లేనివాడు.

186) సురానంద: - దేవతలకు ఆనందము నొసంగువాడు.

187) గోవింద: - గోవులను రక్షించువాడు.

188) గోవిదాం పతి: - వాగ్విదులు, వేదవిదులైనవారికి ప్రభువైనవాడు.

189) మరీచి: - తేజోవంతులలో తేజోవంతుడైనవాడు.

190) దమన: - తమకప్పగించబడిన బాధ్యతలనుండి తప్పిపోవు వారిని శిక్షించువాడు.

191) హంస: - నేను అతడే (అహం బ్రహ్మస్మి)

192) సుపర్ణ: - అందమైన రెక్కలు గలవాడు.

193) భుజగోత్తమ: - భుజంగములలో ఉత్తముడు.

194) హిరణ్యగర్భ: - బ్రహ్మకు పుట్టుకనిచ్చిన బంగారు బొడ్డుగల సర్వోత్తముడు.

195) సుతపా: - చక్కటి తపమాచరించువాడు.

196) పద్మనాభ: - హృదయపద్మమధ్యమున భాసించువాడు.

197) ప్రజాపతి: - అనంతజీవకోటికి ప్రభువైనవాడు.

198) అమృత్యు: - మరణముగాని, మరణ కారణముగాని లేనివాడు.

199) సర్వదృక్ - తన సహజ జ్ఞానముచే ప్రాణులు చేసినది,చేయునది అంతయు చూచుచుండువాడు.

200) సింహ: - సింహము. పాపములను నశింపజేయువాడు.

201) సంధాతా - జీవులను కర్మఫలములతో జోడించువాడు.

202) సంధిమాన్ - భక్తులతో సదాకూడియుండువాడు.

203) స్థిర: - సదా ఏకరూపము గలవాడు.

204) అజ: - పుట్టుకలేనివాడు.

205) దుర్మర్షణ: - అసురులకు భరింపశక్యము గానివాడు.

206) శాస్తా - శృతి, స్తృతుల ద్వారా శాసించువాడు.

207) విశ్రుతాత్మా - విశేషముగా శ్రవణము చేయబడినవాడు.

208) సురారిహా - దేవతల శత్రువులను నాశనము చేసినవాడు.

209) గురు: - ఆత్మవిద్యను బోధించువాడు.

210) గురుత్తమ: - గురువులకు గురువైనవాడు.

211) ధామ: - జీవులు చేరవలసిన పరమోత్కృష్ణ స్థానము.

212) సత్య: - సత్య స్వరూపుడు.

213) సత్యపరాక్రమ: - సత్యనిరూపణలో అమోఘమైన పరాక్రమము కలవాడు.

214) నిమిష: - నేత్రములు మూసుకొనినవాడు.

215) అనిమిష: - సదా మేలికొనియున్న వాడు.

216) స్రగ్వీ - వాడని పూలమాలను ధరించినవాడు.

217) వాచస్పతి రుదారధీ: - విద్యలకు పతియైనవాడు.

218) అగ్రణీ: - భక్తులకు దారిచూపువాడు.

219) గ్రామణీ: - సకల భూతములకు నాయకుడు.

220) శ్రీమాన్ - ఉత్కృష్ణమైన కాంతి గలవాడు.

221) న్యాయ: - సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు.

222) నేతా - జగత్తు యనెడి యంత్రమును నడుపువాడు.

223) సమీరణ: - ప్రాణవాయు రూపములో ప్రాణులకు చేష్టలు కలిగించువాడు.

224) సహస్రమూర్ధా - సహస్ర శిరస్సులు గలవాడు.

225) విశ్వాత్మా - విశ్వమునకు ఆత్మయైనవాడు.

226) సహస్రాక్ష: - సహస్ర నేత్రములు కలవాడు.

227) సహస్రపాత్ - సహస్రపాదములు కలవాడు.

228) ఆవర్తన: - జగత్ చక్రమును లేదా సంసార చక్రమును సదా త్రిప్పుచుండువాడు.

229) నివృత్తాత్మా - ప్రపంచముతో ఎట్టి సంబంధము లేనివాడు.

230) సంవృత: - అవిద్యారూపమైన మాయచే కప్పబడినవాడు.

231) సంప్రమర్దన: - తమోగుణ ప్రధానులైన అజ్ఞానులను పీడించువాడు.

232) అహస్సంవర్తక: - రోజులను చక్కగా నడిపెడి ఆదిత్యరూపుడు.

233) వహ్ని: - యజ్ఞములందు హోమకుండములలో హవిస్సును మోసెడి అగ్ని.

234) అనిల: - ప్రకృతిలో వాయు రూపమునను, ప్రాణులలో ప్రాణ రూపమునను ఉండువాడు.

235) ధరణీధర: - భూభారమును భరించువాడు.

236) సుప్రసాద: - చక్కని అనుగ్రహము కలవాడు.

237) ప్రసన్నాత్మా - రాగద్వేషాదులతో కలుషితముగాని పరిశుద్ధ అంత:కరణ కలవాడు.

238) విశ్వదృక్ - విశ్వమునంతటిని ధరించినవాడు.

239) విశ్వభుక్ - విశ్వమును భక్షించువాడు.

240) విభు: - బ్రహ్మ మొదలు సకల రూపములలో గోచరించువాడు.

241) సత్కర్తా - సజ్జనులను సత్కరించువాడు.

242) సత్కృత: - పూజ్యులచే పూజింపబడువాడు.

243) సాధు: - ధర్మప్రవర్తన గలవాడు.

244) జుహ్ను: - భక్తులను పరమపదమునకు నడిపించువాడు.

245) నారాయణ: - నరులకు ఆశ్రయమైనవాడు.

246) నర: - జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడుపువాడు.

247) అసంఖ్యేయ: -అనంతమైన నామరూపాదులు కలవాడు.

248) అప్రమేయాత్మా - అప్రమేయమైన స్వరూపము కలవాడు.

249) విశిష్ట: - శ్రేష్ఠతముడు. మిక్కిలి గొప్పవాడు.

250) శిష్టకృత్ - శాసనము చేయువాడు.

251) శుచి: - నిర్మలుడై, నిరంజనుడైనవాడు.

252) సిద్ధార్ధ: - పొందదగినదంతయు పొందినవాడు.

253) సిద్ధసంకల్ప: - నేఱవేరిన సంకల్పములు కలవాడు.

254) సిద్ధిద: - జీవుల కర్మానుసారముగా ఫలముల నందిచువాడు.

255) సిద్దిసాధన: - కార్యసిద్ధి కనుకూలించు సాధన సంపత్తి తానే అయినవాడు.

256) వృషాహీ - అనేక వృషాహములు (ధర్మ దినములు) ద్వారా సేవింపబడువాడు.

257) వృషభ: - భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు.

258) విష్ణు: - సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు.

259) వృషపర్వా: - ధర్మమునకు భక్తుల ధర్మ సోపానములను నిర్మించినవాడు.

260) వృషోదర: - ధర్మమును ఉదరమున ధరించువాడు. (ప్రజలను వర్షించునదిగాయున్న ఉదరము గలవాడు.)

261) వర్ధన: - ఆశ్రితులైనవారి శ్రేయములను వృద్ధినొందిచువాడు.

262) వర్ధమాన: - ప్రపంచరూపమున వృద్ధినొందువాడు.

263) వివిక్త: - మాయాస్వరూపమగువాడు.

264) శృతిసాగర: - శృతులకు నిధియైనవాడు.

265) సుభుజ: - జగద్రక్షణము గావించు సుందరమైన భుజములు గలవాడు.

266) దుర్ధర: - లోకములను ధరించి తనను ఒరులు ధరించేందుకు వీలుపడని భూమాతను ధరించినవాడు.

267) వాగ్మీ - వేదజ్ఞానమును వెలువరించినవాడు.

268) మహేంద్ర: - దేవేంద్రునకు కూడా ప్రభువైనవాడు.

269) వసుద: - భక్తుల అవసరములను సకాలములో సమకూర్చువాడు.

270) వసు: - తాను ఇచ్చు ధనము కూడా తానే అయినవాడు.

271) నైకరూప: - ఒక రూపము లేనివాడై, అనేక రూపములు గలవాడు.

272) బృహద్రూప: - బ్రహ్మాండ స్వరూపము గలవాడు.

273) శిపివిష్ట: - సూర్యునియందలి కిరణ ప్రతాపము తానైనవాడు.

274) ప్రకాశన: - సర్వమును ప్రకాశింప చేయువాడు.

275) ఓజస్తేజో ద్యుతిధర: - ఓజస్సు, తేజస్సు, ద్యుతి కలవాడు.

276) ప్రకాశాత్మా - తేజోమయ స్వరూపుడు.

277) ప్రతాపన: - సూర్యాగ్నుల రూపమున భూమిని తపింపచేయువాడు.

278) బుద్ధ: - ధర్మ, జ్ఞాన, వైరాగ్యములకు నిలయమైనవాడు.

279) స్పష్టాక్షర: - ఓం అనెడి దివ్యాక్షరముద్వారా సూచించబడినవాడు.

280) మంత్ర: - వేదమంత్రముల ద్వారా తెలియదగినవాడు.

281) చంద్రాంశు: - చంద్రకిరణముల వంటివాడు.

282) భాస్కరద్యుతి: - సూర్యతేజమువంటివాడు.

283) అమృతాంశూధ్భవ: - చంద్రుని ఆవిర్భావమునకు కారణమైనవాడు.

284) భాను: - స్వప్రకాశ స్వరూపుడు.

285) శశిబిందు: - చంద్రునివలె ప్రజలను పోషించువాడు.

286) సురేశ్వర: - దేవతలకు ప్రభువైనవాడు.

287) ఔషధం - భవరోగహరమగు దివ్యౌషధము తానైనవాడు.

288) జగతస్సేతు: - ప్రపంచమునకు పరమాత్మకు మద్య వంతెనవంటివాడు.

289) సత్యధర్మ పరాక్రమ: - సత్యజ్ఞానాది ధర్మములు, పరాక్రమము కలవాడు.

290) భూతభవ్య భవన్నాద: - జీవులచే మూడుకాలములందు ప్రార్థించబడువాడు.

291) పవన: - సకలమును పవిత్ర మొనర్చువాడు.

292) పావన: - వాయువునందు చలనశక్తి కల్గించువాడు.

293) అనల: - ప్రాణధారణకు అవసరమైన అగ్ని స్వరూపుడు.

294) కామహా - కామములను అంతము చేయువాడు.

295) కామకృత్ - సాత్వికవాంఛలను నెరవేర్చువాడు.

296) కాంత: - అద్భుత రూపవంతుడై, సర్వులచే ఆకర్షింపబడువాడు.

297) కామ: - చతుర్విధ పురుషార్థములను అభిలషించువారిచే కోరబడువాడు.

298) కామప్రద: - భక్తుల కోర్కెలను తీర్చువాడు.

299) ప్రభు: - సర్వోత్కృష్టమైనవాడు.

300) యుగాదికృత్ - కృతాది యుగములను ప్రారంభించినవాడు.

301) యుగావర్త: - యుగములను త్రిప్పువాడు.

302) నైకమాయ: - తన మాయాశక్తిచే అనేక రూపములను ధరించి, ప్రదర్శించువాడు.

303) మహాశన: - సర్వమును కబళించువాడు.

304) అదృశ్య: - దృశ్యము కానివాడు.

305) వ్యక్తరూప: - భక్తుల హృదయములలో వ్యక్తరూపుడై భాసిల్లువాడు.

306) సహస్రజిత్ - వేలకొలది రాక్షసులను సంగ్రామమున జయించువాడు.

307) అనంతజిత్ - అనూహ్యమైన శక్తి సామర్ద్యములు కలవాడై, రణరంగమున ఎదిరించువారిని జయించు శక్తి కలవాడు.

308) ఇష్ట: - ప్రియమైనవాడు.

309) అవిశిష్ట: - సర్వాంతర్యామియైనవాడు.

310) శిష్టేష్ట: - బుధజనులైన సాధుమహాత్ములకు ఇష్టుడైనవాడు.

311) శిఖండీ - శిరమున నెమలిపింఛమును ధరించినవాడు.

312) నహుష: - తన మాయచేత జీవులను సంసారమునందు బంధించువాడు.

313) వృష: - ధర్మస్వరూపుడైనవాడు.

314) క్రోధహా - సాధకులలోని క్రోధమును నశింపచేయువాడు.

315) క్రోధ కృత్కర్తా - క్రోధాత్ములగువారిని నిర్మూలించువాడు.

316) విశ్వబాహు: - బాహువులు విశ్వమంతట కలవాడు.

317) మహీధర: - భూమిని ధరించినవాడు.

318) అచ్యుత: - ఎట్టి వికారములకు లోనుగానివాడు. ( ఎటువంటి మార్పు పొందనివాడు.)

319) ప్రధిత: - ప్రఖ్యాతి నొందినవాడు.

320) ప్రాణ: - అంతటా చైతన్య స్వరూపమై నిండి, ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు.

321) ప్రాణద: - ప్రాణ బలము ననుగ్రహించువాడు.

322) వాసవానుజ: - ఇంద్రునకు తమ్ముడు.

323) అపాంనిధి: - సాగరమువలె అనంతుడైనవాడు.

324) అధిష్టానం - సర్వమునకు ఆధారమైనవాడు.

325) అప్రమత్త: - ఏమరు పాటు లేనివాడు.

326) ప్రతిష్ఠిత: - తన మహిమయందే నిలిచియుండువాడు.

327) స్కంద: - అమృత రూపమున స్రవించువాడు.

328) స్కందధర: - ధర్మమార్గమున నిలుపువాడు.

329) ధుర్య: - సర్వ జీవుల ఉత్పత్తి మొదలగు భారములను మోయువాడు.

330) వరద: - వరముల నొసగువాడు.

331) వాయువాహన: - సప్త వాయువులను బ్రహ్మాండమంతటను ప్రవర్తింపచేయువాడు.

332) వాసుదేవ: - అంతటను నిండియున్నవాడు.

333) బృహద్భాను: - ప్రకాశవంతమగు కిరణతేజముచే విశ్వమును ప్రకాశింపచేయువాడు.

334) ఆదిదేవ: - సృష్టి కార్యమును ప్రారంభించినవాడు.

335) పురంధర: - రాక్షసుల పురములను నశింపచేసినవాడు.

336) అశోక: - శోకము లేనివాడు.

337) తారణ: - సంసార సాగరమును దాటించువాడు.

338) తార: - గర్భ, జన్మ, జరా, మృత్యురూపమైన భయమునుండి తరింపజేయువాడు.

339) శూర: - పరాక్రమము గలవాడు.

340) శౌరి: - బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణిచినవాడు.

341) జనేశ్వర: - జనులకు ప్రభువు.

342) అనుకూల: - సర్వులకు అనుకూలుడైనవాడు.

343) శతావర్త: - ధర్మ రక్షణార్థము అనేక పర్యాయములు ఆవిర్భవించినవాడు.

344) పద్మీ - పద్మమును చేతియందు ధరించినవాడు.

345) పద్మనిభేక్షణ: - పద్మమువంటి నేత్రములు కలవాడు.

346) పద్మనాభ: - పద్మము నాభియందుండువాడు.

347) అరవిందాక్ష: - కమలరేకులవంటి కన్నులు గలవాడు.

348) పద్మగర్భ: - పద్మగర్భమున నివసించువాడు.

349) శరీరభృత్ - ప్రాణుల శరీరములను పోషించువాడు.

350) మహర్థి: - మహావిభూతులు కలవాడు.

351) బుద్ధ: - ప్రపంచాకారముతో భాసించువాడు.

352) వృద్ధాత్మా - సృష్టికి పూర్వమే ఉన్నవాడు.

353) మహాక్ష: - గొప్ప నేత్రములు గలవాడు.

354) గరుడధ్వజ: - తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడు.

355) అతుల: - సాటిలేనివాడు.

356) శరభ: - శరీరములందు ప్రత్యగాత్మగా ప్రకాశించువాడు.

357) భీమ: - భీకరమైన శక్తి సంపన్నుడు.

358) సమయజ్ఞ: - సర్వులను సమభావముతో దర్శించుటయే తన పూజగా భావించువాడు.

359) హవిర్హరి: - యజ్ఞములలో హవిర్భాగమును గ్రహించువాడు.

360) సర్వలక్షణ లక్షణ్య: - సర్వప్రమాణములచే సిద్ధించు జ్ఞానముచేత నిర్ణయింపబడినవాడు.

361) లక్ష్మీవాన్ - సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కలిగినవాడు.

362) సమితింజయ: - యుద్ధమున జయించినవాడు.

363) విక్షర: - నాశములేనివాడు.

364) రోహిత: - మత్స్యరూపమును ధరించినవాడు.

365) మార్గ: - భక్తులు తరించుటకు మార్గము తాను అయినవాడు.

366) హేతు: - సృష్టికి కారణము అయినవాడు.

367) దామోదర: - దమాది సాధనలచేత ఉదారమైన బుద్ధిద్వారా పొందబడువాడు.

368) సహ: - సహనశీలుడు.

369) మహీధర: - భూమిని ధరించినవాడు.

370) మహాభాగ: - భాగ్యవంతుడు.

371) వేగవాన్ - అమితమైన వేగము కలవాడు.

372) అమితాశన: - అపరిమితమైన ఆకలి గలవాడు.

373) ఉద్బవ: - ప్రపంచసృష్టికి ఉపాదానమైనవాడు.

374) క్షోభణ: - సృష్టికాలమందు కల్లోలము కల్గించువాడు.

375) దేవ: - క్రీడించువాడు.

376) శ్రీ గర్భ: - సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు.

377) పరమేశ్వర: - ఉత్కృష్ట మైనవాడు.

378) కరణమ్ - జగదుత్పత్తికి సాధనము అయినవాడు.

379) కారణమ్ - జగత్తునకు కారణమైనవాడు.

380) కర్తా - సమస్త కార్యములకు కర్తయైనవాడు.

381) వికర్తా - విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు.

382) గహన: - గ్రహించ శక్యముగానివాడు.

383) గుహ: - వ్యక్తము కానివాడు. కప్పబడినవాడు.

384) వ్యవసాయ: - మానవాళి అభ్యున్నతికి తానే కృషిచేయువాడు.

385) వ్యవస్థాన: - సర్వవ్యవహారములను యధావిధిగ నడుపువాడు.

386) సంస్థాన: - జీవులకు గమ్యస్థానమైనవాడు.

387) స్థానద: - వారివారి కర్మానుసారముగా స్థానముల నందించువాడు.

388) ధృవ: - అవినాశియై, స్థిరమైనవాడు.

389) పరర్థి: - ఉత్కృష్టమైన వైభవముకలవాడు.

390) పరమస్పష్ట: - మిక్కిలి స్పష్టముగా తెలియువాడు.

391) తుష్ట: - సంతృప్తుడు.

392) పుష్ట: - పరిపూర్ణుడు

393) శుభేక్షణ: - శుభప్రధమైన దృష్టిగలవాడు.

394) రామ: - నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు.

395) విరామ: - సకలజీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.

396) విరత: - విషయ వాంఛలు లేనివాడు.

397) మార్గ: - మోక్షమునకు మార్గము తానైనవాడు.

398) నేయ: - ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు.

399) నయ: - జీవులను నడిపించి పరమపదస్థితికి గొనిపోవువాడు.

400) అనయ: - తనను నడుపువాడు మరొకడు లేనివాడు.

401) వీర: - పరాక్రమశాలియైనవాడు.

402) శక్తిమతాం శ్రేష్ఠ: - శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు.

403) ధర్మ: - ధర్మ స్వరూపుడు.

404) ధర్మ విదుత్తమ: - ధర్మము నెఱింగినవారిలో శ్రేష్ఠుడు.

405) వైకుంఠ: - సృష్ట్యారంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు.

406) పురుష: - ఈ సర్వముకంటే పూర్వమునుండువాడు.

407) ప్రాణ: - ప్రాణరూపమున చేష్ట కల్గించువాడు.

408) ప్రాణద: - ప్రాణమును ప్రసాదించువాడు. ప్రాణము లిచ్చువాడు.

409) ప్రణవ: - ఓంకార స్వరూపుడు.

410) పృథు: - ప్రపంచరూపమున విస్తరించినవాడు.

411) హిరణ్యగర్భ: - బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు.

412) శత్రుఘ్న: - శత్రువులను సంహరించువాడు.

413) వ్యాప్త: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.

414) వాయు: - వాయురూపమున యుండి సకలమును పోషించువాడు.

415) అథోక్షజ: - స్వరూపస్థితి నుండి ఎన్నడును జాఱనివాడు.

416) ఋతు: - కాలరూపమై తెలియబడు ఋతువులై భాసించువాడు.

417) సుదర్శన: - భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు.

418) కాల: - శతృవులను మృత్యురూపమున త్రోయువాడు.

419) పరమేష్ఠీ - హృదయగుహలో తన మహిమచే ప్రకాశించువాడు.

420) పరిగ్రహ: - గ్రహించువాడు.

421) ఉగ్ర: - ఉగ్రరూపధారి

422) సంవత్సర: - సర్వజీవులకు వాసమైనవాడు.

423) దక్ష: - సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు.

424) విశ్రామ: - జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు.

425) విశ్వదక్షిణ: - అశ్వమేధయాగములో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు.

426) విస్తార: - సమస్త లోకములు తనయందే విస్తరించి ఉన్నవాడు.

427) స్థావర: స్థాణు: - కదులుట మెదలుట లేనివాడు.

428) ప్రమాణం - సకలమునకు ప్రమాణమైనవాడు.

429) బీజమవ్యయం - క్షయము కాని బీజము.

430) అర్థ: - అందరిచే కోరబడినవాడు.

431) అనర్థ: - తాను ఏదియును కోరనివాడు.

432) మహాకోశ: - అన్నమయాది పంచకోశములచే ఆవరించినవాడు.

433) మహాభాగ: - ఆనంద స్వరూపమైన భోగము కలవాడు.

434) మహాధన: - గొప్ప ఐశ్వర్యము కలవాడు.

435) అనిర్విణ్ణ: - వేదన లేనివాడు.

436) స్థవిష్ఠ: - విరాడ్రూపమై భాసించువాడు.

437) అభూ: - పుట్టుక లేనివాడు.

438) ధర్మయూప: - ధర్మము లన్నియు తనయందే ఉన్నవాడు.

439) మహామఖ: - యజ్ఞస్వరూపుడు.

440) నక్షత్రనేమి: - జ్యోతిష చక్రమును ప్రవర్తింపచేయువాడు.

441) నక్షత్రీ - చంద్ర రూపమున భాసించువాడు.

442) క్షమ: - సహనశీలుడు.

443) క్షామ: - సర్వము నశించినను తాను క్షయ మెరుగక మిగిలియుండువాడు.

444) సమీహన: - సర్వ భూతహితమును కోరువాడు.

445) యజ్ఞ: - యజ్ఞ స్వరూపుడు.

446) ఇజ్య: - యజ్ఞములచే ఆరాధించుబడువాడు.

447) మహేజ్య: - గొప్పగా పూజింపదగినవాడు.

448) క్రతు: - యజ్ఞముగా నున్నవాడు.

449) సత్రమ్ - సజ్జనులను రక్షించువాడు.

450) సతాంగతి: - సజ్జనులకు పరమాశ్రయ స్థానమైనవాడు.

451) సర్వదర్శీ - సకలమును దర్శించువాడు.

452) విముక్తాత్మా - స్వరూపత: ముక్తి నొందినవాడు.

453) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.

454) జ్ఞానముత్తమమ్ - ఉత్తమమైన జ్ఞానము కలవాడు భగవానుడు.

455) సువ్రత: - చక్కని వ్రతదీక్ష కలవాడు.

456) సుముఖ: - ప్రసన్న వదనుడు.

457) సూక్ష్మ: - సర్వవ్యాపి.

458) సుఘోష: - చక్కటి ధ్వని గలవాడు.

459) సుఖద: - సుఖమును అనుగ్రహించువాడు.

460) సుహృత్ - ఏ విధమైన ప్రతిఫలము నాశించకనే సుహృద్భావముతో ఉపకారము చేయువాడు.

461) మనోహర: - మనస్సులను హరించువాడు.

462) జితక్రోధ: - క్రోధమును జయించినవాడు.

463) వీరబాహు: - పరాక్రమముగల బాహువులు కలవాడు.

464) విదారణ: - దుష్టులను చీల్చి చెండాడువాడు.

465) స్వాపన: - తన మాయచేత ప్రాణులను ఆత్మజ్ఞాన రహితులుగాజేసి నిద్రపుచ్చువాడు.

466) స్వవశ: - సర్వ స్వతంత్రమైనవాడు.

467) వ్యాపీ - సర్వత్ర వ్యాపించియున్నవాడు.

468) నైకాత్మా - అనేక రూపములలో విరాజిల్లువాడు.

469) నైక కర్మకృత్ - సృష్టి, స్థితి, లయము మున్నగు అనేక కార్యములు చేయువాడు.

470) వత్సర: - సర్వులకు వాసమైనవాడు.

471) వత్సల: - భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు.

472) వత్సీ - తండ్రి వంటివాడు.

473) రత్నగర్భ: - సాగరము వలె తన గర్భమున రత్నములు గలవాడు.

474) ధనేశ్వర: - ధనములకు ప్రభువు.

475) ధర్మగుప్ - ధర్మమును రక్షించువాడు.

476) ధర్మకృత్ - ధర్మము నాచరించువాడు.

477) ధర్మీ - ధర్మమునకు ఆధారమైనవాడు.

478) సత్ - మూడు కాలములలో పరిణామ రహితుడై, నిత్యుడై ఉన్నవాడు.

479) అసత్ - పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు.

480) క్షర: - వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు.

481) అక్షర: - క్షరమగు ప్రపంచమున అవినాశియై భాసిల్లువాడు.

482) అవిజ్ఞాతా - తెలుసుకొనువాని కంటెను విలక్షణమైనవాడు.

483) సహస్రాంశు: - అనంత కిరణములు గలవాడు.

484) విధాతా - సర్వమునకు ఆధారమైనవాడు.

485) కృతలక్షణ: - వేదశాస్త్రములను వెలువరించినవాడు.

486) గభస్తినేమి: - మయూఖ చక్రమునకు కేంద్రమైనవాడు.

487) సత్వస్థ: - అందరిలో నుండువాడు.

488) సింహ: - సింహమువలె పరాక్రమశాలియైనవాడు.

489) భూతమహేశ్వర: - సర్వ భూతములకు ప్రభువైనవాడు.

490) ఆదిదేవ: - తొలి దేవుడు.

491) మహాదేవ: - గొప్ప దేవుడు.

492) దేవేశ: - దేవదేవుడు.

493) దేవభృద్గురు: - దేవతల ప్రభువైన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు.

494) ఉత్తర: - అందరికంటెను అధికుడై, ఉత్తముడైనవాడు.

495) గోపతి: - గోవులను పాలించువాడు.

496) గోప్తా - సర్వులను సంరక్షించువాడు.

497) జ్ఞానగమ్య: - జ్ఞానము చేతనే తెలియబడినవాడు.

498) పురాతన: - సృష్టికి పూర్వమే వున్నవాడు.

499) శరీరభూతభృత్ - శరీరముల నుత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు.

500) భోక్తా - అనుభవించువాడు.

501) కపీంద్ర: - వానరులకు ప్రభువైనవాడు.

502) భూరిదక్షిణ: - యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణ లిచ్చువాడు.

503) సోమప: - యజ్ఞముల యందు యజింపబడిన దేవతలరూపముతో సోమరసమును పానము చేయువాడు.

504) అమృతప: - ఆత్మానందరసమును అనుభవించువాడు.

505) సోమ: - చంద్రరూపమున ఓషధులను పోషించువాడు.

506) పురుజిత్: - ఒక్కడై అనేకమందిని ఎదురించి, జయించగల్గినవాడు.

507) పురుసత్తమ: - ఉత్తములలో ఉత్తముడైనవాడు.

508) వినయ: - దుష్టులను దండించి, వినయము కల్గించువాడు.

509) జయ: - సర్వులను జయించి వశపరుచుకొనువాడు.

510) సత్యసంధ: - సత్యసంకల్పములు, సత్యవాక్కులు గలవాడు.

511) దాశార్హ: - దశార్హుడనువాని వంశమున పుట్టినవాడు.

512) సాత్వతాంపతి: - యదుకులమునకు ప్రభువు.

513) జీవ: - జీవుడు.

514) వినయితా సాక్షీ - భక్తుల యందలి వినయమును గాంచువాడు.

515) ముకుంద: - ముక్తి నొసగువాడు.

516) అమిత విక్రమ: - అమితమైన పరాక్రామము గలవాడు.

517) అంభోనిధి: - దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు ఈ నాలుగు వర్గములు అంభశబ్ధార్థములు, అంభస్సులు తనయందే ఇమిడి యున్నవాడు.

518) అనంతాత్మా - అనంతమైన ఆత్మస్వరూపుడు.

519) మహోదధిశయ: - వైకుంఠమునందు క్షీరసాగరమున శేషతల్పముపై శయనించువాడు.

520) అంతక: - ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు.

521) అజ: - పుట్టుకలేనివాడు.

522) మహార్హ: - విశేష పూజకు అర్హుడైనవాడు.

523) స్వాభావ్య: - నిరంతరము స్వరూపజ్ఞానముతో విరాజిల్లువాడు.

524) జితమిత్ర: - శత్రువులను జయించినవాడు.

525) ప్రమోదన: - సదా ఆనందమునందుండువాడు.

526) ఆనంద: - ఆనందమే తన స్వరూపముగా గలవాడు.

527) నందన: - సర్వులకు ఆనందము నొసగువాడు.

528) నంద: - విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు.

529) సత్యధర్మా - సత్య, ధర్మ స్వరూపుడు.

530) త్రివిక్రమ: - మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు.

531) మహర్షి: కపిలాచార్య: - వేదవిదుడైన కపిలమునిగా అవతరించినవాడు.

532) కృతజ్ఞ: - సృష్టి, సృష్టికర్త రెండును తానైనవాడు.

533) మేదినీపతి: - భూదేవికి భర్తయైనవాడు.

534) త్రిపద: - మూడు పాదములతో సమస్తము కొలిచినవాడు. వామనుడని భావము.

535) త్రిదశాధ్యక్ష: - జీవులనుభవించు జాగ్రుత, స్వప్న, సుషుప్త్య వస్థలకు సాక్షియైనవాడు.

536) మహాశృంగ: - ప్రళయకాల సాగరములోని నావను గొప్పదియైన తన కొమ్మున బంధించి సత్యవ్రతుని ఆయన అనుచరులైన ఋషులను ప్రళయము నుండి రక్షించినవాడు.

537) కృతాంతకృత్ - మృత్యువుని ఖండించినవాడు.

538) మహావరాహ: - మహిమగల వరాహమూర్తి.

539) గోవింద: - గోవులకు ఆనందాన్నిచ్చువాడు. భూమికి ఆధారభూతమైనవాడు.

540) సుషేణ: - శోభనమైన సేన గలవాడు.

541) కనకాంగదీ - సువర్ణమయములైన భుజకీర్తులు కలవాడు.

542) గుహ్య: - హృదయగుహలో దర్శించదగినవాడు.

543) గభీర: - జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము మొదలగువానిచే గంభీరముగా నుండువాడు.

544) గహన: - సులభముగా గ్రహించుటకు వీలుకానివాడు.

545) గుప్త: - నిగూఢమైన ఉనికి గలవాడు.

546) చక్రగదాధర: - సుదర్శనమను చక్రమును, కౌమోదకీ యను గదను ధరించినవాడు.

547) వేధా: - సృష్టి చేయువాడు.

548) స్వాంగ: - సృష్టి కార్యమును నిర్వహించుటకు అవసరమగు సాధన సామాగ్రి కూడా తానే అయినవాడు.

549) అజిత: - ఎవనికి తలవొగ్గనివాడై జయింపవీలుకానివాడు.

550) కృష్ణ: - నీలమేఘ శ్యాముడు.

551) దృఢ: - చలించని స్వభావము కలవాడు.

552) సంకర్షణోచ్యుత: - విశ్వమంతయు ప్రళయకాలములో కదిలిపోయినను తానూ ఏ విధమైన పరిణామము చెందనివాడు.

553) వరుణ: - తన కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు.

554) వారుణ: - వరుణుని కుమారులైన వశిష్ఠుడు మరియు అగస్త్యులుగా వ్యక్తమైనవాడు.

555) వృక్ష: - భక్తులకు అనుగ్రహఛాయ నందించువాడు.

556) పుష్కరాక్ష: - ఆకాశమంతయు వ్యాపించినవాడు.

557) మహామనా: - గొప్ప మనస్సు కలవాడు.

558) భగవాన్ - భగమను ఆరు లక్షణములు సమగ్రముగా యున్నవాడు.

559) భగహా - ప్రళయ సమయమున తన విభూతులను పోగొట్టువాడు.

560) ఆనందీ - ఆనందము నొసంగువాడు.

561) వనమాలీ - వైజయంతి అను వనమాలను ధరించినవాడు.

562) హలాయుధ: - నాగలి ఆయుధముగా కలవాడు.

563) ఆదిత్య: - అదితి యొక్క కుమారుడు. వామనుడు.

564) జ్యోతిరాదిత్య: - సూర్యునియందు తేజోరూపమై భాసిల్లువాడు.

565) సహిష్ణు: - ద్వంద్వములను సహించువాడు.

566) గతిసత్తమ: - సర్వులకు గతియై ఉన్నవాడు.

567) సుధన్వా - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.

568) ఖండ పరశు: - శత్రువులను ఖండించునట్టి గొడ్డలిని ధరించినవాడు.

569) దారుణ: - దుష్టులైన వారికి భయమును కలిగించువాడు.

570) ద్రవిణప్రద: - భక్తులకు కావలిసిన సంపదలను ఇచ్చువాడు.

571) దివ: సృక్ - దివిని అంటియున్నవాడు.

572) సర్వదృగ్య్వాస: - సమస్తమైన జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు.

573) వాచస్పతి రయోనిజ: - విద్యలకు పతి, మరియు మాతృగర్భమున జన్మించనివాడు.

574) త్రిసామా - మూడు సామ మంత్రములచే స్తుతించబడువాడు.

575) సామగ: - సామగానము చేయు ఉద్గాత కూడ తానే అయినవాడు.

576) సామ - సామవేదము తానైనవాడు.

577) నిర్వాణమ్ - సమస్త దు:ఖ విలక్షణమైన పరమానంద స్వరూపుడు.

578) భేషజం - భవరోగమును నివారించు దివ్యౌషధము తానైనవాడు.

579) భిషక్ - భవరోగమును నిర్మూలించు వైద్యుడు.

580) సంన్యాసకృత్ - సన్యాస వ్యవస్థను ఏర్పరచినవాడు.

581) శమ: - శాంత స్వరూపమైనవాడు.

582) శాంత: - శాంతి స్వరూపుడు.

583) నిష్ఠా - ప్రళయ కాలమున సర్వజీవులకు లయస్థానమైనవాడు.

584) శాంతి: - శాంతి స్వరూపుడు.

585) పరాయణమ్ - పరమోత్కృష్ట స్థానము.

586) శుభాంగ: - మనోహరమైన రూపము గలవాడు.

587) శాంతిద: - శాంతిని ప్రసాదించువాడు.

588) స్రష్టా - సృష్ట్యారంభమున జీవులందరిని ఉత్పత్తి చేసినవాడు.

589) కుముద: - కు అనగా భూమి, ముద అనగా సంతోషము. భూమి యందు సంతోషించువాడు.

590) కువలేశయ: - భూమిని చుట్టియున్న సముద్రమునందు శయనించువాడు.

591) గోహిత: - భూమికి హితము చేయువాడు.

592) గోపతి: - భూదేవికి భర్తయైనవాడు.

593) గోప్తా - జగత్తును రక్షించువాడు.

594) వృషభాక్ష: - ధర్మదృష్టి కలవాడు.

595) వృషప్రియ: - ధర్మమే ప్రియముగా గలవాడు.

596) అనివర్తీ - ధర్మ మార్గమున ఎన్నడూ వెనుకకు మఱలని వాడు.

597) నివృత్తాత్మా - నియమింపబడిన మనసు గలవాడు.

598) సంక్షేప్తా - జగత్తును ప్రళయకాలమున సూక్షము గావించువాడు.

599) క్షేమకృత్ - క్షేమమును గూర్చువాడు.

600) శివ: - తనను స్మరించు వారలను పవిత్రము చేయువాడు.

601) శ్రీవత్సవక్షా - శ్రీ వత్సమనెడి చిహ్నమును వక్షస్థలమున ధరించినవాడు.

602) శ్రీ వాస: - వక్షస్థలమున లక్ష్మీదేవికి వాసమైనవాడు.

603) శ్రీపతి: - లక్ష్మీదేవికి భర్తయైనవాడు.

604) శ్రీమతాంవరా: - శ్రీమంతులైన వారిలో శ్రేష్ఠుడు.

605) శ్రీ ద: - భక్తులకు సిరిని గ్రహించువాడు.

606) శ్రీ శ: - శ్రీ దేవికి నాథుడైనవాడు.

607) శ్రీనివాస: - ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులైనవారి హృదయముల యందు వసించువాడు.

608) శ్రీ నిధి: - ఐశ్వర్య నిధి.

609) శ్రీ విభావన: - సిరులను పంచువాడు.

610) శ్రీ ధర: - శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు.

611) శ్రీ కర: - శుభముల నొసగువాడు.

612) శ్రేయ: - మోక్ష స్వరూపుడు.

613) శ్రీమాన్ - సర్వ విధములైన ఐశ్వర్యములు గలవాడు.

614) లోకత్రయాశ్రయ: - ముల్లోకములకు ఆశ్రయమైనవాడు.

615) స్వక్ష: - చక్కని కన్నులు కలవాడు.

616) స్వంగ: - చక్కని అంగములు కలవాడు.

617) శతానంద: - అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా ఆనందించువాడు.

618) నంది: - పరమానంద స్వరూపుడు.

619) జ్యోతిర్గణేశ్వర: - జ్యోతిర్గణములకు ప్రభువు.

620) విజితాత్మ - మనస్సును జయించువాడు.

621) విధేయాత్మా - సదా భక్తులకు విధేయుడు.

622) సత్కీర్తి: - సత్యమైన యశస్సు గలవాడు.

623) ఛిన్నసంశయ: - సంశయములు లేనివాడు.

624) ఉదీర్ణ: - సర్వ జీవుల కంటెను ఉత్క్రష్టుడు.

625) సర్వతశ్చక్షు: - అంతటను నేత్రములు గలవాడు.

626) అనీశ: - తనకు ప్రభువు గాని, నియామకుడు గాని లేనివాడు.

627) శాశ్వతస్థిర: - శాశ్వతుడు స్థిరుడు.

628) భూశయ: - భూమిపై శయనించువాడు.

629) భూషణ: - తానే ఆభరణము, అలంకారము అయినవాడు.

630) భూతి: - సర్వ ఐశ్వర్యములకు నిలయమైనవాడు.

631) విశోక: - శోకము లేనివాడు.

632) శోకనాశన: - భక్తుల శోకములను నశింపచేయువాడు.

633) అర్చిష్మాన్ - తేజోరూపుడు.

634) అర్చిత: - సమస్త లోకములచే పూజింపబడువాడు.

635) కుంభ: - సర్వము తనయందుండువాడు.

636) విశుద్ధాత్మా - పరిశుద్ధమైన ఆత్మ స్వరూపుడు.

637) విశోధనః - తనను స్మరించు వారి పాపములను నశింపచేయువాడు

638) అనిరుద్ధః - శత్రువులచే అడ్డగింపబడనివాడు.

639) అప్రతిరథ: - తన నెదుర్కొను ప్రతిపక్షము లేని పరాక్రమవంతుడు.

640) ప్రద్యుమ్న: - విశేష ధనము కలవాడు.

641) అమిత విక్రమ: - విశేష పరాక్రమము గలవాడు.

642) కాలనేమినిహా - కాలనేమి యను రాక్షసుని వధించినవాడు.

643) వీర: - వీరత్వము గలవాడు.

644) శౌరి: - శూరుడను వాడి వంశమున పుట్టినవాడు.

645) శూరజనేస్వర: - శూరులలో శ్రేష్ఠుడు.

646) త్రిలోకాత్మా - త్రిలోకములకు ఆత్మయైనవాడు.

647) త్రిలోకేశ: - మూడు లోకములకు ప్రభువు.

648) కేశవ: - పొడవైన కేశములు గలవాడు.

649) కేశిహా: - కేశి యనుడి రాక్షసుని చంపినవాడు.

650) హరి: - అజ్ఞాన జనిత సంసార దు:ఖమును సమూలముగా అంతమొందించువాడు.

651) కామదేవ: - చతుర్విధ పురుషార్థములను కోరువారిచే పూజింపబడువాడు.

652) కామపాల: - భక్తులు తననుండి పొందిన పురుషార్థములను చక్కగా ఉపయోగపడునట్లు చూచువాడు.

653) కామీ - సకల కోరికలు సిద్ధించినవాడు.

654) కాంత: - రమణీయ రూపధారియైన వాడు.

655) కృతాగమ: - శ్రుతి, స్తృతి ఇత్యాది శాస్త్రములు రచించినవాడు.

656) అనిర్దేశ్యవపు: - నిర్దేశించి, నిర్వచించుటకు వీలుకానివాడు.

657) విష్ణు: - భూమ్యాకాశాలను వ్యాపించినవాడు.

658) వీర: - వీ ధాతువుచే సూచించు కర్మలచే నిండియున్నవాడు.

659) అనంత: - సర్వత్రా, సర్వకాలములందు ఉండువాడు.

660) ధనంజయ: - ధనమును జయించినవాడు.

661) బ్రహ్మణ్య: - బ్రహ్మను అభిమానించువాడు.

662) బ్రహ్మకృత్ - తపస్సు మొదలైనవిగా తెలియజేయుబడిన బ్రహ్మకు తానే కర్త అయినవాడు.

663) బ్రహ్మా - బ్రహ్మదేవుని రూపమున తానే సృష్టి చేయువాడు.

664) బ్రహ్మ - బ్రహ్మ అనగా పెద్దదని అర్థము.

665) బ్రహ్మవివర్థన: - తపస్సు మొదలైనవానిని వృద్ధి నొందించువాడు.

666) బ్రహ్మవిత్ - బ్రహ్మమును చక్కగా తెలిసినవాడు.

667) బ్రాహ్మణ: - వేదజ్ఞానమును ప్రబోధము చేయువాడు.

668) బ్రహ్మీ - తపస్యాది బ్రహ్మము తనకు అంగములై భాసించువాడు.

669) బ్రహ్మజ్ఞ: - వేదములే తన స్వరూపమని తెలిసికొనిన వాడు.

670) బ్రాహ్మణప్రియ: - బ్రహ్మజ్ఞానులైన వారిని ప్రేమించువాడు.

671) మహాక్రమ: - గొప్ప పధ్ధతి గలవాడు.

672) మహాకర్మా - గొప్ప కర్మను ఆచరించువాడు.

673) మహాతేజా: - గొప్ప తేజస్సు గలవాడు.

674) మహోరగ: - గొప్ప సర్ప స్వరూపుడు.

675) మహాక్రతు: - గొప్ప యజ్ఞ స్వరూపుడు.

676) మహాయజ్వా - విశ్వ శ్రేయమునకై అనేక యజ్ఞములు నిర్వహించినవాడు.

677) మహాయజ్ఞ: - గొప్ప యజ్ఞ స్వరూపుడు.

678) మహాహవి: - యజ్ఞమునందలి హోమసాధనములు, హోమద్రవ్యములు అన్నిటి స్వరూపుడు.

679) స్తవ్య: - సర్వులచే స్తుతించబడువాడు.

680) స్తవప్రియ: - స్తోత్రములయందు ప్రీతి కలవాడు.

681) స్తోత్రం - స్తోత్రము కూడా తానే అయినవాడు.

682) స్తుతి: - స్తవనక్రియ కూడా తానే అయినవాడు.

683) స్తోతా - స్తుతించు ప్రాణి కూడా తానే అయినవాడు.

684) రణప్రియ: - యుద్ధమునందు ప్రీతి కలవాడు.

685) పూర్ణ: - సర్వము తనయందే గలవాడు.

686) పూరయితా - తన నాశ్రయించిన భక్తులను శుభములతో నింపువాడు.

687) పుణ్య: - పుణ్య స్వరూపుడు.

688) పుణ్యకీర్తి: - పవిత్రమైన కీర్తి గలవాడు.

689) అనామయ: - ఏవిధమైన భౌతిక, మానసిక వ్యాధులు దరిచేరనివాడు.

690) మనోజవ: - మనసు వలె అమిత వేగము కలవాడు.

691) తీర్థకర: - సకల విద్యలను రచించినవాడు.

692) వసురేతా: - బంగారము వంటి వీర్యము గలవాడు.

693) వసుప్రద: - ధనమును ఇచ్చువాడు.

694) వసుప్రద: - మోక్షప్రదాత

695) వాసుదేవ: - వాసుదేవునకు కుమారుడు.

696) వసు: - సర్వులకు శరణ్యమైనవాడు.

697) వసుమనా: - సర్వత్ర సమమగు మనస్సు గలవాడు.

698) హవి: - తానే హవిస్వరూపుడైనవాడు.

699) సద్గతి: - సజ్జనులకు పరమగతియైన వాడు.

700) సత్కృతి: - జగత్కళ్యాణమైన ఉత్తమ కార్యము.

701) సత్తా - సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన అనుభవ స్వరూపము.

702) సద్భూతి: - పరమోత్కృష్టమైన మేధా స్వరూపుడు.

703) సత్పరాయణ: - సజ్జనులకు పరమగతి అయినవాడు.

704) శూరసేన: - శూరత్వము గల సైనికులు గలవాడు.

705) యదుశ్రేష్ఠ: - యాదవులలో గొప్పవాడు.

706) సన్నివాస: - సజ్జనులకు నిలయమైనవాడు.

707) సుయామున: - యమునా తీర వాసులగు గోపకులచే పరివేష్ఠింప బడినవాడు.

708) భూతవాస: - సర్వ భూతములకు నిలయమైనవాడు.

709) వాసుదేవ: - తన మాయాశక్తిచే సర్వము ఆవరించియున్నవాడు. వసుదేవుని కుమారుడు.

710) సర్వాసు నిలయ: - సమస్త జీవులకు, ప్రాణులకు నిలయమైనవాడు.

711) అనల: - అపరిమిత శక్తి, సంపద గలవాడు.

712) దర్పహా - దుష్టచిత్తుల గర్వమణుచు వాడు.

713) దర్పద: - ధర్మమార్గమున చరించువారికి దర్పము నొసంగువాడు.

714) దృప్త: - సదా ఆత్మానందామృత రసపాన చిత్తుడు.

715) దుర్థర: - ధ్యానించుటకు, బంధించుటకు సులభసాధ్యము కానివాడు.

716) అపరాజిత: - అపజయము పొందనివాడు.

717) విశ్వమూర్తి: - విశ్వమే తన మూర్తిగా గలవాడు.

718) మహామూర్తి: - గొప్ప మూర్తి గలవాడు.

719) దీప్తమూర్తి: - సంపూర్ణ జ్ఞానముతో ప్రకాశించువాడు.

720) అమూర్తివాన్ - కర్మాధీనమైన దేహమే లేనివాడు.

721) అనేకమూర్తి: - అనేక మూర్తులు ధరించినవాడు.

722) అవ్యక్త: - అగోచరుడు.

723) శతమూర్తి: - అనేక మూర్తులు ధరించినవాడు.

724) శతానన: - అనంత ముఖములు గలవాడు.

725) ఏక: - ఒక్కడే అయినవాడు.

726) నైక: - అనేక రూపములు గలవాడు.

727) సవ: - సోమయాగ రూపమున ఉండువాడు. ఏకముగా, అనేకముగా తానే యుండుటచేత తాను పూర్ణరూపుడు.

728) క: - సుఖ స్వరూపుడు.

729) కిమ్ - అతడెవరు? అని విచారణ చేయదగినవాడు.

730) యత్ - దేనినుండి సర్వభూతములు ఆవిర్భవించుచున్నవో ఆ బ్రహ్మము.

731) తత్ - ఏది అయితే వ్యాపించిఉన్నదో అది అయినవాడు.

732) పదం-అనుత్తమం - ముముక్షువులు కోరు ఉత్తమస్థితి తాను అయినవాడు.

733) లోకబంధు: - లోకమునకు బంధువైనవాడు.

734) లోకనాధ: - లోకములకు ప్రభువు

735) మాధవ: - మౌన, ధ్యాన, యోగాదుల వలన గ్రహించుటకు శక్యమైనవాడు.

736) భక్తవత్సల: - భక్తుల యందు వాత్సల్యము గలవాడు.

737) సువర్ణవర్ణ: - బంగారు వంటి వర్ణము గలవాడు.

738) హేమాంగ: - బంగారు వన్నెగల అవయువములు గలవాడు.

739) వరంగ: - గొప్పవైన అవయువములు గలవాడు.

740) చందనాంగదీ - ఆహ్లాదకరమైన చందనముతోను కేయూరములతోను అలంకృతమైనవాడు.

741) వీరహా - వీరులను వధించినవాడు.

742) విషమ: - సాటిలేనివాడు.

743) శూన్య: - శూన్యము తానైనవాడు.

744) ఘృతాశీ: - సమస్త కోరికలనుండి విడువడినవాడు.

745) అచల: - కదలిక లేనివాడు.

746) చల: - కదులువాడు.

747) అమానీ - నిగర్వి, నిరహంకారుడు.

748) మానద: - భక్తులకు గౌరవము ఇచ్చువాడు.

749) మాన్య: - పూజింపదగిన వాడైన భగవానుడు.

750) లోకస్వామీ - పదునాలుగు భువనములకు ప్రభువు.

751) త్రిలోకథృక్ - ముల్లోకములకు ఆధారమైన భగవానుడు.

752) సుమేధా: - చక్కని ప్రజ్ఞ గలవాడు.

753) మేధజ: - యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు.

754) ధన్య: - కృతార్థుడైనట్టివాడు.

755) సత్యమేధ: - సత్య జ్ఞానము కలవాడు.

756) ధరాధర: - భూమిని ధరించి యున్నవాడు.

757) తేజోవృష: - సూర్యతేజముతో నీటిని వర్షించువాడు.

758) ద్యుతిధర: - కాంతివంతమైన శరీరమును ధరించినవాడు.

759) సర్వ శస్త్ర భృతాంవర: - శస్త్రములను ధరించినవారిలో శ్రేష్ఠుడైనవాడు.

760) ప్రగ్రహ: - ఇంద్రియములనెడి అశ్వములను తన అనుగ్రహము అనెడి పగ్గముతో కట్టివేయువాడు.

761) నిగ్రహ: - సమస్తమును నిగ్రహించువాడు.

762) వ్యగ్ర: - భక్తులను తృప్తి పరుచుటలో సదా నిమగ్నమై ఉండువాడు.

763) నైకశృంగ: - అనేక కొమ్ములు గలవాడు, భగవానుడు.

764) గదాగ్రజ: - గదుడను వానికి అన్న.

765) చతుర్మూర్తి: - నాలుగు రూపములు గలవాడు.

766) చతుర్బాహు: - నాలుగు బాహువులు గలవాడు.

767) చతుర్వ్యూహ: - శరీర, వేద, ఛందో మహద్రూపుడైన పురుషుడు. ఈ నలుగురు పురుషులు వ్యూహములుగా కలవాడు.

768) చతుర్గతి: - నాలుగు విధములైన వారికి ఆశ్రయ స్థానము.

769) చతురాత్మా - చతురమనగా సామర్ధ్యము.

770) చతుర్భావ: - చతుర్విద పురుషార్థములకు మూలమైనవాడు.

771) చతుర్వేదవిత్ - నాలుగు వేదములను తెలిసినవాడు.

772) ఏకపాత్ - జగత్తంతయు ఒక పాదముగా గలవాడు.

773) సమావర్త: - సంసార చక్రమును సమర్థతతో త్రిప్పువాడు.

774) అనివృత్తాత్మా - అంతయు తానైయున్నందున దేనినుండియు విడివడినవాడు.

775) దుర్జయ: - జయింప శక్యము గానివాడు.

776) దురతిక్రమ: - అతిక్రమింపరాని విధమును సాసించువాడు.

777) దుర్లభ: - తేలికగా లభించనివాడు.

778) దుర్గమ: - మిక్కిలి కష్టముతో మాత్రమే పొందబడినవాడు.

779) దుర్గ: - సులభముగా లభించనివాడు.

780) దురావాస: - యోగులకు కూడా మనస్సున నిలుపుకొనుటకు కష్టతరమైనవాడు.

781) దురారిహా: - దుర్మార్గులను వధించువాడు.

782) శుభాంగ: - దివ్యములైన, సుందరములైన అవయువములు గలవాడు.

783) లోకసారంగ: - లోకములోని సారమును గ్రహించువాడు.

784) సుతంతు: - జగద్రూపమున అందమైన తంతువువలె విస్తరించినవాడు.

785) తంతువర్థన: - వృద్ధి పరచువాడు, నాశనము చేయువాడు.

786) ఇంద్రకర్మా - ఇంద్రుని కర్మవంటి శుభప్రధమైన కర్మ నాచరించువాడు.

787) మహాకర్మా - గొప్ప కార్యములు చేయువాడు.

788) కృతకర్మా - ఆచరించదగిన కార్యములన్నియు ఆచరించినవాడు.

789) కృతాగమ: - వేదముల నందించువాడు.

790) ఉద్భవ: - ఉత్క్రష్టమైన జన్మ గలవాడు.

791) సుందర: - మిక్కిలి సౌందర్యవంతుడు.

792) సుంద: - కరుణా స్వరూపుడు.

793) రత్నగర్భ: - రత్నమువలె సుందరమైన నాభి గలవాడు.

794) సులోచన: - అందమైన నేత్రములు కలిగిన భగవానుడు.

795) అర్క: - శ్రేష్టులైన బ్రహ్మాదుల చేతను అర్చించబడువాడు.

796) వాజసన: - అర్థించు వారలకు ఆహారము నొసంగువాడని భావము.

797) శృంగీ - శృంగము గలవాడు.

798) జయంత: - సర్వ విధములైన విజయములకు ఆధారభూతుడు.

799) సర్వవిజ్జయీ - సర్వవిద్ అనగా సర్వము తెలిసినవాడు.

800) సువర్ణబిందు: - బంగారము వంటి అవయువములు గలవాడు.

801) అక్షోభ్య: - క్షోభ తెలియనివాడు.

802) సర్వవాగీశ్వరేశ్వర: - వాక్పతులైన బ్రహ్మాదులకు కూడ ప్రభువైన భగవానుడు.

803) మహాహ్రద: - గొప్ప జలాశయము.

804) మహాగర్త : - అగాధమైన లోయ వంటివాడు.

805) మహాభూత: - పంచభూతములకు అతీతమైనవాడు.

806) మహానిధి: - సమస్త భూతములు తనయందు ఉన్నవాడు.

807) కుముద: - కు అనగా భూమి . అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును కూర్చువాడు.

808) కుందర: - భూమిని చీల్చుకుపోయినవాడు.

809) కుంద: - భూమిని దానమిచ్చినవాడు.

810) పర్జన్య: - మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి,వారి మనస్సులను శాంతింపచేయువాడు భగవానుడు.

811) పావన: - పవిత్రీకరించువాడు.

812) అనిల: - ప్రేరణ చేయువాడు, సదా జాగరూకుడు.

813) అమృతాశ: - అమృతము నొసంగువాడు.

814) అమృతవపు: - అమృతస్వరూపుడు శాశ్వతుడు.

815) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.

816) సర్వతోముఖ: - ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడు.

817) సులభ: - భక్తితో తనను స్మరించువారికి సులభముగా లభ్యమగువాడు.

818) సువ్రత: - మంచి వ్రతము గలవాడు.

819) సిద్ధ: - సత్వస్వరూపుడై, పూర్ణరూపుడై భగవానుడు సిద్ధ: అని తెలియబడువాడు.

820) శత్రుజిత్ - శత్రువులను జయించువాడు.

821) శత్రుతాపన: - దేవతల విరోదులైన వారిని,సజ్జనులకు విరోధులైన వారిని తపింప చేయువాడు.

822) న్యగ్రోధ: - సర్వ భూతములను తన మాయచే ఆవరించి ఉన్నవాడు.

823) ఉదుంబర: - అన్నముచేత విశ్వమును పోషించువాడు.

824) అశ్వత్ధ: - అశాశ్వతమైన సంసార వృక్ష స్వరూపుడు.

825) చాణూరాంధ్ర నిషూదన: - చాణూరుడను మల్లయోధుని వధించినవాడు.

826) సహస్రార్చి: - అనంతకిరణములు కలవాడు.

827) సప్తజిహ్వ: - ఏడు నాలుకలుగల అగ్నిస్వరూపుడు.

828) సప్తైథా: - ఏడు దీప్తులు కలవాడు.

829) సప్తవాహన: -ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు.

830) అమూర్తి: - రూపము లేనివాడు.

831) అనఘ: - పాపరహితుడు.

832) అచింత్య: - చింతించుటకు వీలుకానివాడు.

833) భయకృత్ - దుర్జనులకు భీతిని కలిగించువాడు.

834) భయనాశన: - భయమును నశింపచేయువాడు.

835) అణు: - సూక్షాతి సూక్షమైనవాడు.

836) బృహుత్ - మిక్కిలి పెద్దది అయిన బ్రహ్మము స్వరూపము.

837) కృశ: - సన్ననివాడై, అస్థూలమైనవాడు.

838) స్థూల: - స్థూల స్వరూపము కలిగియున్నవాడు.

839) గుణభృత్ - సత్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు.

840) నిర్గుణ: - గుణములు తనలో లేనివాడు.

841) మహాన్ - దేశకాలాదుల నధిగమించి యున్నవాడు.

842) అధృత: - సర్వము తానే ధరించియుండి, తనను ధరించునది మరియొకటి లేనివాడు.

843) స్వధృత: - తనకు తానే ఆధారమైనవాడైన భగవానుడు.

844) స్వాస్య: - విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు.

845) ప్రాగ్వంశ: - ప్రాచీనమైన వంశము కలవాడు.

846) వంశవర్థన: - తన వంశమును వృద్ధినొందించువాడు.

847) భారభృత్ - భారమును మోయువాడు.

848) కథిత: - వేదములచేత సర్వోత్తముడుగా కీర్తించబడినవాడు.

849) యోగీ - ఆత్మజ్ఞానము నందే సదా ఓలలాడు వాడు.

850) యోగీశ: - యోగులకు ప్రభువు.

851) సర్వ కామద: - సకల కోరికలను తీర్చువాడు.

852) ఆశ్రమ: - జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.

853) శ్రమణ: - భక్తిహీనులను, వివేకరహితులను శ్రమ పెట్టువాడు.

854) క్షామ: - సర్వ జీవులను క్షీణింపజేయువాడు.

855) సుపర్ణ: - రమణీయ పత్రములు కలిగిన వృక్షము తానైనవాడు.

856) వాయువాహన: - వాయు చలనమునకు కారణభూతుడైనవాడు.

857) ధనుర్ధర: - ధనస్సును ధరించినవాడు.

858) ధనుర్వేద: - ధనుర్వేదము తెలిసినవాడు.

859) దండ: - దండించువాడు.

860) దమయితా - శిక్షించువాడు.

861) దమ: - శిక్షానుభవము ద్వారా ఏర్పడు పవిత్రత తానైనవాడు.

862) అపరాజిత: - పరాజయము తెలియనివాడు.

863) సర్వసహ: - సమస్త శత్రువులను సహించువాడు.

864) నియంతా - అందరినీ తమతమ కార్యములందు నియమించువాడు.

865) అనియమ: - నియమము లేనివాడు.

866) ఆయమ: - మృత్యుభీతి లేనివాడు.

867) సత్త్వావాన్ - సత్త్వము గలవాడు.

868) సాత్త్విక: - సత్త్వగుణ ప్రధానుడైనవాడు.

869) సత్య: - సత్పురుషుల విషయములో మంచిగా ప్రవర్తించువాడు.

870) సత్యధర్మ పరాయణ: - సత్య విషయమునందును, ధర్మ విషయమునందును దీక్షాపరుడైనవాడు.

871) అభిప్రాయ: - అభిలషించు వారిచేత అభిప్రాయపడువాడు.

872) ప్రియార్హ: - భక్తుల ప్రేమకు పాత్రుడైనవాడు.

873) అర్హ: - అర్పింపబడుటకు అర్హుడైనవాడు.

874) ప్రియకృత్ - తన నాశ్రయించినవారికి ప్రియము నొసగూర్చువాడు.

875) ప్రీతివర్ధన: - భక్తులలో భవవంతునిపై ప్రీతిని వృద్ధి చేయువాడు.

876) విహాయన గతి: - ఆకాశము ఆశ్రయముగ గలదియైన విష్ణుపదము తానైనవాడు.

877) జ్యోతి: - తన ప్రకాశము చేత సర్వమును ప్రకాశింపచేయువాడు.

878) సురుచి: - అందమైన ప్రకాశము గలవాడు.

879) హుతభుక్ - యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు.

880) విభు: - సర్వ లోకములకు ప్రభువైనవాడు.

881) రవి: - తన విభూతియైన సూర్యుని ద్వారా భూమినుండి సర్వరసములను గ్రహించువాడు.

882) విలోచన: - వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు.

883) సూర్య: - ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు.

884) సవితా: - సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు.

885) రవిలోచన: - సూర్యుడు నేత్రములుగా కలవాడు.

886) అనంత: - అంతము లేనివాడు.

887) హుతభుక్ - హోమద్రవ్యము నారిగించువాడు.

888) భోక్తా - భోగ్యవస్తువైన ప్రకృతిని అనుభవించువాడు.

889) సుఖద: - భక్తులకు ఆత్మసుఖము నొసంగువాడు.

890) నైకజ: - అనేక రూపములలో అవతరించువాడు.

891) అగ్రజ: - సృష్ట్యారంభమునకు ముందే ఆవిర్భవించినవాడు.

892) అనిర్వణ్ణ: - నిరాశ నెరుగనివాడు.

893) సదామర్షీ - సజ్జనుల దోషములను క్షమించువాడు.

894) లోకాధిష్టానం - ప్రపంచమంతటికి ఆధారభూతుడు.

895) అధ్బుత: - ఆశ్చర్య స్వరూపుడు.

896) సనాత్ - ఆది లేనివాడు.

897) సనాతన సమ: - సృష్టికర్త యైన బ్రహ్మకు పూర్వము కూడా యున్నవాడు.

898) కపిల: - ఋషులలో కపిలుడు తానైనవాడు.

899) కపి: - సూర్యరూపుడు.

900) అవ్యయ: - ప్రళయకాలము నందు సమస్తము తనలో లీనమగుటకు విశ్రామ స్థానమైనవాడు.

901) స్వస్తిద: - సర్వశ్రేయములను చేకూర్చువాడు.

902) స్వస్తికృత్ - శుభమును కూర్చువాడు.

903) స్వస్తి - సర్వ మంగళ స్వరూపుడు.

904) స్వస్తిభుక్ - శుభమును అనుభవించువాడు.

905) స్వస్తిదక్షిణ: - స్మరణ మాత్రముననే సర్వ శుభములు సమకూర్చువాడు.

906) అరౌద్ర: - రౌద్రము లేనివాడు.

907) కుండలీ - మకర కుండలములు ధరించినవాడు.

908) చక్రీ - సుదర్శనమను చక్రమును ధరించినవాడు.

909) విక్రమీ - గొప్ప శూరుడైన భగవానుడు.

910) ఊర్జిత శాసన: - ఉల్లంఘించుటకు వీలులేని శాసనములు కలవాడు.

911) శబ్దాతిగ: - వాక్కుకు అందనివాడు.

912) శబ్దసహ: - సమస్త వేదములు తెలియబడినవాడు.

913) శిశిర: - శిశిర ఋతువువలె చల్లబరుచువాడు.

914) శర్వరీకర: - రాత్రిని కలుగజేయువాడు.

915) అక్రూర: - క్రూరత్వము లేనివాడు.

916) పేశల: - మనోవాక్కాయ కర్మలచే రమణీయముగ నుండువాడై పేశల: అని స్తుతించబడును.

917) దక్ష: - సమర్థుడైనవాడు.

918) దక్షిణ: - భక్తులను ఔదార్యముతో బ్రోచువాడు.

919) క్షమిణాం వర: - సహనశీలు లైన వారిలందరిలో శ్రేష్ఠుడు.

920) విద్వత్తమ: - సర్వజ్ఞత్తము కలిగియుండి, అందరిలో ఉత్తమమైనవాడు.

921) వీతభయ: - భయము లేనివాడు.

922) పుణ్యశ్రవణ కీర్తన: - తనను గూర్చి శ్రవణము గాని, కీర్తన గాని పుణ్యము కలుగజేయును.

923) ఉత్తారణ: - సంసార సముద్రమును దాటించువాడు.

924) దుష్కృతిహా - సాధకులలో యున్న చెడువాసనలను అంతరింప చేయువాడు.

925) ప్రాణ: - ప్రాణులకు పవిత్రతను చేకూర్చు పుణ్య స్వరూపుడు.

926) దుస్వప్న నాశన: - చెడు స్వప్నములను నాశనము చేయువాడు.

927) వీరహా - భక్తులు మనస్సులు వివిధ మార్గములలో ప్రయాణించకుండ క్రమము చేయువాడు.

928) రక్షణ: - రక్షించువాడైనందున భగవానుడు రక్షణ: అని స్తవనీయుడయ్యెను.

929) సంత: - పవిత్ర స్వరూపుడు.

930) జీవన: - సర్వ జీవులయందు ప్రాణశక్తి తానైనవాడు.

931) పర్యవస్థిత: - అన్నివైపుల అందరిలో వ్యాపించి యున్నవాడు.

932) అనంతరూప: - అనంతమైన రూపములు గలవాడు.

933) అనంత శ్రీ: - అంతము లేని శక్తివంతుడైనవాడు.

934) జితమన్యు: - క్రోధము ఎఱగని వాడు.

935) భయాపహ: - భయమును పోగొట్టువాడు.

936) చతురశ్ర: - జీవులకు కర్మఫలములను న్యాయముగా పంచువాడు.

937) గభీరాత్మా - గ్రహింప శక్యము గాని స్వరూపము గలవాడు.

938) విదిశ: - అధికారులైన వారికి ఫలము ననుగ్రహించుటలో ప్రత్యేకత కలిగియున్నవాడు.

939) వ్యాదిశ: - వారి వారి అర్హతలను గమనించి బ్రహ్మాదులను సైతము నియమించి, ఆజ్ఞాపించువాడు.

940) దిశ: - వేదముద్వారా మానవుల కర్మఫలములను తెలియజేయువాడు.

941) అనాది: - ఆదిలేనివాడు.

942) భూర్భువ: - సర్వభూతములకు ఆధారమైన భూమికి కూడా భూ: ఆధారమైనవాడు.

943) లక్ష్మీ: - లక్ష్మీ స్వరూపుడు.

944) సువీర: - అనేక విధములైన సుందర పోకడలు గలవాడు.

945) రుచిరాంగద: - మంగళమైన బాహువులు గలవాడు.

946) జనన: - సర్వ ప్రాణులను సృజించినవాడు.

947) జన జన్మాది: - జన్మించు ప్రాణుల జన్మకు ఆధారమైనవాడు.

948) భీమ: - అధర్మపరుల హృదయములో భీతిని కలిగించు భయరూపుడు.

949) భీమ పరాక్రమ: - విరోధులకు భయంకరమై గోచరించువాడు.

950) ఆధార నిలయ: - సృష్టికి ఆధారమైన పృధ్వి, జలము, తేజము, వాయువు, ఆకాశము అను పంచ మహాభూతములకు ఆధారమైనవాడు.

951) అధాతా - తానే ఆధారమైనవాడు.

952) పుష్టహాస: - మొగ్గ పువ్వుగా వికసించునట్లు ప్రపంచరూపమున వికసించువాడు.

953) ప్రజాగర: - సదా మేల్కొనియుండువాడు.

954) ఊర్ధ్వగ: - సర్వుల కన్నా పైనుండువాడు.

955) సత్పధాచార: - సత్పురుషుల మార్గములో చరించువాడు.

956) ప్రాణద: - ప్రాణ ప్రదాత యైనవాడు.

957) ప్రణవ: - ప్రణవ స్వరూపుడైనవాడు.

958) పణ: - సర్వ కార్యములను నిర్వహించువాడు.

959) ప్రమాణ: - స్వయముగానే జ్ఞానస్వరూపుడై యున్నవాడు.

960) ప్రాణ నిలయ: - సమస్త జీవుల అంతిమ విరామ స్థానమైనవాడు.

961) ప్రాణభృత్ - ప్రాణములను పోషించువాడు.

962) ప్రాణజీవన: - ప్రాణ వాయువుల ద్వారా ప్రాణులను జీవింపజేయువాడు.

963) తత్త్వం - సత్యస్వరూపమైనందున భగవానుడు తత్త్వం అని తెలియబడిన వాడు.

964) తత్త్వవిత్ - సత్యవిదుడైన భగవానుడు తత్త్వవిత్ అని స్తుతించబడువాడు.

965) ఏకాత్మా - ఏకమై, అద్వితీయమైన పరమాత్మ

966) జన్మమృత్యు జరాతిగ: - పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పుచెందుట, కృశించుట నశించుట వంటి వికారములకు లోనుగానివాడు.

967) భూర్భువ: స్వస్తరు: - భూ: భువ: స్వ: అను వ్యాహృతి రూపములు 3 గలవాడు.

968) తార: - సంసార సాగరమును దాటించువాడు.

969) సవితా - తండ్రి వంటివాడైన భగవానుడు.

970) ప్రపితామహః - బ్రహ్మదేవునికి కూడా తండ్రియైనవాడు.

971) యజ్ఞ: - యజ్ఞ స్వరూపుడు.

972) యజ్ఞపతి: - యజ్ఞము నందు అధిష్టాన దేవత తానైన భగవానుడు.

973) యజ్వా - యజ్ఞము నందు యజమాని.

974) యజ్ఞాంగ: - యజ్ఞము లోని అంగములన్నియు తానే అయినవాడు.

975) యజ్ఞవాహన: - ఫలహేతువులైన యజ్ఞములు వాహనములుగా కలవాడు.

976) యజ్ఞభృత్ - యజ్ఞములను సంరక్షించువాడు.

977) యజ్ఞకృత్ - యజ్ఞములను నిర్వహించువాడు.

978) యజ్ఞీ - యజ్ఞములందు ప్రధానముగా ఆరాధించుబడువాడు.

979) యజ్ఞభుక్ - యజ్ఞఫలమును అనుభవించువాడు.

980) యజ్ఞసాధన: - తనను పొందుటకు యజ్ఞములు సాధనములుగా గలవాడు.

981) యజ్ఞాంతకృత్ - యజ్ఞఫలము నిచ్చువాడు.

982) యజ్ఞగుహ్యమ్ - గోప్యమైన యజ్ఞము తానైనవాడు.

983) అన్నం - ఆహారము తానైనవాడు.

984) అన్నాద: - అన్నము భక్షించువాడు.

985) ఆత్మయోని: - తన ఆవిర్భావమునకు తానే కారణమైనవాడు.

986) స్వయంజాత: - మరొకరి ప్రమేయము లేకనే తనకు తానుగ ఆవిర్భవించువాడు.

987) వైఖాన: - ప్రాపంచిక దు:ఖమును నివారించువాడు.

988) సామగాయన: - సామగానము చేయువాడు.

989) దేవకీనందన: - దేవకీ పుత్రుడైన శ్రీ కృష్ణుడు.

990) స్రష్టా - సృష్టికర్త

991) క్షితీశ: - భూమికి నాధుడైనవాడు.

992) పాపనాశన: - పాపములను నశింపజేయువాడు.

993) శంఖభృత్ - పాంచజన్యమను శంఖమును ధరించినవాడు.

994) నందకీ - నందకమను ఖడ్గమును ధరించినవాడు.

995) చక్రీ - సుదర్శనమును చక్రమును ధరించినవాడు.

996) శారంగ ధన్వా - శారంగము అనెడి ధనుస్సు కలవాడు.

997) గదాధర: - కౌమోదకి యనెడి గదను ధరించినవాడు.

998) రథాంగపాణి: - చక్రము చేతియందు గలవాడు.

999) అక్షోభ్య: - కలవరము లేనివాడు.

1000) సర్వ ప్రహరణాయుధ: - సర్వవిధ ఆయుధములు కలవాడు.

 ఇట్లు 

గుట్టి సుబ్రహ్మణ్యం శర్మ


విష్ణు సహస్రనామ స్తోత్రము ఆవిర్భవించిన పరిస్థితులు ఆసక్తి కరమైనవి. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన జనక్షయం, కష్టాలవలన పాండవాగ్రజుడు యుధిష్ఠిరుడు కృంగిపోయి ఉన్నాడు. తన వంశోన్నతిని కోరిన భీష్ముడు అంపశయ్యపై మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అనితర జ్ఞాననిలయమైన భీష్ముని ఆశ్రయించి ధర్మాన్ని, నీతిని తెలిసికొనమని యుధిష్ఠిరుని వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు ఆదేశించారు. భీష్ముడు కృష్ణునితో "ప్రభూ! జగద్గురువువైన నీయెదుట నేను ఉపదేశము చేయజాలినవాడను కాను. ఆపై క్షతగాత్రుడనైన నా బుద్ధి, శక్తి క్షీణించినవి. క్షమింపుడు" అనెను. అప్పుడు శ్రీకృష్ణుడు "భీష్మా! నా ప్రభావము చేత నీ క్లేశములన్నీ ఇపుడే తొలగిపోవును. సమస్త జ్ఞానము నీ బుద్ధికి స్ఫురించును. నీచేత నేను ధర్మోపదేశము చేయించుచున్నాను" అని అనుగ్రహించెను. అలా భీష్ముడు అంపశయ్యపైనుండే యుధిష్ఠిరునకు సమస్త జ్ఞాన, ధర్మములను ఉపదేశించెను.
 
అలా జ్ఞానబోధను గ్రహించే సమయంలో యుధిష్ఠిరుడు ఆరు ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నల సారాంశము: "దుఃఖముతో కృంగి ఉన్న నాకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితమును ఇచ్చే ఉపాయమేది? ఎవరిని స్తుతించాలి?" దానికి భీష్ముడు చెప్పిన ఉపాయము: "భక్తితో, శ్రద్ధతో విష్ణువు వేయి నామాలను జపించు. అన్ని దుఃఖములు, కష్టములు, పాపములనుండి విముక్తి పొందడానికి ఇదే సులభమైన మార్గము". అలా భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామ స్తోత్రము.

పురాణాల విభజన

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణమహర్షి కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది. 

          

                   

పురాణ వాఙ్మయం ఆవిర్భావం

"పురాణ" శబ్దానికి "పూర్వ కాల కథా విశేషం" అన్న అర్ధం నిరూఢమై ఉంది. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికే ఈ వాఙ్మయం ప్రస్తుతం లభిస్తున్న రూపు సంతరించుకొంది కాని వేదవాఙ్మయ కాలానికే దీని మౌలిక రూపం ఏర్పడి ఉండాలి. యజ్ఞసమయంలో ఋక్సామచ్ఛందాలతో పాటు ఉచ్చిష్ట రూపమై పురాణం ఆవిర్భవించిందని అధర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావింపబడింది. శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్తు, గోపథ బ్రాహ్మణం వంటి గ్రంధాలలో పురాణ ప్రశంసలున్నాయి. ఆదికాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాంగ సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించి మతసాహిత్యంగా రూపుదిద్దుకొందని విమర్శకుల ఊహ. సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ నడుమ విరామ వేళలలో ఇష్ట కథా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేతల కథలను ఇలా చెబుతూ ఉండవచ్చును. మొదటి కాలంలో బహుశా యఙ్నాన్ని నిర్వహించే పండితులే ఈ కథాకాలక్షేపం జరిపి ఉండవచ్చును కాని ఇది ప్రధాన కార్యక్రమం కాదు గనుక క్రమంగా సూత పౌరాణికులకు (క్షత్రియునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించిన సంతానం) ఈ విధి సంక్రమించి ఉండవచ్చును. ఇలాంటి ఐతిహ్యం వాయు బ్రహ్మాండ విష్ణు పురాణాలలో కనిపిస్తుంది.[1]
వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వీరిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప శాంశపాయనులు వేరువేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంధజాతమంతా పురాణ వాఙ్మయానికి మూలమయింది. ఈ విధంగా పరిశీలిస్తే అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ క్రీ.శ. 12వ శతాబ్దివరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును[1].

ప్రణవం వేదాలు పురాణాల పుట్టుక
పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్ధం వెలువడింది. ఆ శబ్ధంలో నుండి కార కార కార శబ్ధాలు కూడిన ఓంకారశబ్ధం ఆవిర్భవించింది. "అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్ధంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ 'అ'కార, 'ఉ'కార 'మ'కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.

వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి.

 

పురాణాల పేర్లు చెప్పే శ్లోకం


సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.
మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్
పైన చెప్పిన వాటిలో:
  • "మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
  • "భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం
  • "బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
  • "వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం
మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:
  • అ -- అగ్ని పురాణం
  • నా -- నారద పురాణం
  • పద్ -- పద్మ పురాణం
  • లిం -- లింగ పురాణం
  • గ -- గరుడ పురాణం
  • కూ -- కూర్మ పురాణం
  • స్కా -- స్కాంద పురాణం
అష్టాదశ పురాణములలో శ్లోకాలు [3]
  1. బ్రహ్మ పురాణం - బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.
  2. పద్మ పురాణము - బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.
  3. విష్ణు పురాణం - పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.
  4. శివ పురాణం - వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
  5. లింగ పురాణము - నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.
  6. గరుడ పురాణం - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
  7. నారద పురాణము - నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
  8. భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.
  9. అగ్ని పురాణం - భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
  10. స్కంద పురాణం - కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
  11. భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం - శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
  12. బ్రహ్మవైవర్త పురాణం - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.
  13. మార్కండేయ పురాణం - పక్షులు క్రోష్టి(జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.
  14. వామన పురాణము - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.
  15. వరాహ పురాణం - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
  16. మత్స్య పురాణం - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
  17. కూర్మ పురాణం - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
  18. బ్రహ్మాండ పురాణం - బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.
దేవతాప్రాముఖ్యాన్ని గుణాన్ని చెప్పే శ్లోకం
ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాలను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.
వైష్ణవం నారదీయం చ తధా భాగవతం శుభం గారుడంచ తధా పాద్మం వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజ నిబోధతే మాత్స్య కౌర్మం తధా లైంగ శైవం స్కౌందం ఆగ్నేయంచ షడేతాని తామసాని భోధమే

ఇలాంటిదే మరొక శ్లోకం

బ్రాహ్మం పాద్వం వైష్ణవంచ శైవం వైంగం చ గారుడమ్ నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞికమ్ భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం చ వామనమ్
వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్


ఉపపురాణాలు

ఈ అష్టాదశపురాణాలే కాకుండా ఉపపురాణాలు కూడా 18 ఉన్నాయి. అవి:

బ్రహ్మ పురాణంలో ఉన్న ముఖ్యాంశాలు.


నక్షత్రముల జన్మము, వివాహము

కశ్యపనీ భార్య దితి  గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు  వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాబాధ్ర, ఉత్తరాబాధ్ర, రేవతి.


ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు.

చంద్రునకు క్షయ వ్యాధి కలుగుట

ఆ ఇరువదియేడుగురు భార్యలలో అత్యంత సుందరాంగియైన రోహిణిపట్ల చంద్రుడు ఎక్కువ అనురాగం చూపుతూ తక్కినవారిపట్ల అనాదరం ప్రదర్శించాడు. అప్పుడు వారు దుఃఖించి తమ తండ్రితో తమ బాధను చెప్పుకొన్నారు. దక్షుడు సహజంగానే కోపిష్టి గనుక చంద్రుని క్షయవ్యాధితో కృశింపమని శపించాడు. క్రమంగా చంద్రుడు కళావిహీనుడు కాసాగాడు. పరమేశ్వరుని ప్రార్ధించాడు. దక్షుడినే ఉపాయం అడుగమని శివుడు చెప్పాడు.

చంద్రుడు దక్షునికి నమస్కరించి "తమ ఆశీర్వచన ప్రభావంచేత ఇప్పటికిలా ఉన్నాను" అన్నాడు. అందరు భార్యలను సమముగా ఎందుకు చూచుకోవడంలేదని దక్షుడు అడిగాడు. సృష్టిలో వైవిధ్యం ఉన్నపుడు అందరినీ ఒకేలా ఎలా చూసుకోగలమని చంద్రుడు ప్రశ్నించాడు. రూపమునకే ప్రాధాన్యత ఇవ్వడం తగదని దక్షుడు తెలిపాడు. అందరిలోకి రోహిణి అందగత్తె అని తాను భావిస్తున్నానని చంద్రుడు చెప్పాడు.

దేవ, రాక్షస, మానవ గణములు

దక్షుడు ఇలా చెప్పాడు - రూపములో తరతమ భేదాలు ఉండడం సాధారణం. నా పుత్రికలలో తొమ్మిది మంది (అశ్వని, మృగశిర, పుష్యమి, స్వాతి, హస్త, పునర్వసు, అనూరాధ, శ్రవణము, రేవతి) దేవతా స్వభావులు, మరి తొమ్మిది మంది (రోహిణి, ఆరుద్ర, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాబాధ్ర, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాబాధ్ర) మానవ స్వభావులు, తక్కిన తొమ్మిది మంది (కృత్తిక, మఖ, ఆశ్లేష, విశాఖ, శతభిష, ధనిష్ఠ, చిత్త, జ్యేష్ట, మూల ) రాక్షస స్వభావులు. కనుక వారి గుణాలలో భేదాలున్నాయి. అయినాగాని అగ్ని సాక్షిగా చేసుకొన్న ప్రమాణాలు తప్పరాదు. అందువలన అసత్యదోషం కలుగుతుంది.

వివాహ సమయంలో చేసే ప్రమాణములు

చంద్రుని కోరికపై దక్షుడు పెండ్లినాటి ప్రమాణాలను ఇలా వివరించాడు - మంగళసూత్ర ధారణకు ముందు బ్రహ్మ చూపిన అన్నంమీద, దోసిళ్ళతో బియ్యం శిరసులపై పోసికొనేముందు ఆ బియ్యం మీద, ప్రధాన హోమానికి ముందు చేతిలో పేలాలు ఉంచుకొని, ఆ తరువాత సప్తరుషులను అరుందతిని   చూపించేటపుడు అనేక ప్రమాణాలు చేశారు. ఎన్ని ఇక్కట్లు వచ్చినా భార్యను  విడువనని ప్రమాణం చేసినాక భార్యను నిరాదరిస్తే అది దోషం అవుతుంది. ప్రమాణ హక్కులు లేకుండా వివాహం ఎక్కడా జరుగదు. ఆ ప్రమాణాలను వధూవరులతో సరిగా పలికింపకపోవడం పురోహితుల దోషం అవుతుంది.

చంద్రునకు దక్షుని జ్ఞానోపదేశము

తెలిసి చేసినా, తెలియక చేసినా గాని సుకృతాలకు, దుష్కృతాలకు ఫలితం అనుభవింపక తప్పదు. కనుక యుక్తాయుక్తాలను తెలిసికొని కర్మలు చేయాలి. మానవేతర జంతుజాలానికి గత జన్మ పాపాలను అనుభవించడమే గాని ఆ జన్మలో క్రొత్తగా చేసే పాపాలేవీ ఉండవు. గతజన్మలో జీవులు చేసిన కర్మఫలాలు (ముందు జన్మలలో అనుభవించడానికి నిలువ చేసుకొన్నవి) తరువాతి జన్మలలో అనుభవించాలి.

  • వీటిలో ఆరుజన్మలనుండి ప్రోగైనవి సంచితములు.

  • ఏడు జన్మల క్రింద చేసినవి ప్రారబ్ధములు

  • ఈ జన్మలో చేసిన కర్మలకు ముందు జన్మలలో అనుభవింపవలసిన ఫలాలు ఆగామి

వీటిలో తెలియక చేసిన అపరాధములకు పశ్చాత్తాపం పొంది, సన్మార్గాన్ని అలవరచుకోవడం వలన జీవులు క్షంతవ్యులు అవుతారు. అంటే పారి పాపాలనుండి విముక్తి లభిస్తుంది. అంతే కాకుండా జ్ఞానం ద్వారా సంచితములు, ఆగామి నుండి విడుదల పొందవచ్చును. ప్రారబ్ధం మాత్రం అనుభవించి తీరవలసిందే.

కనుక పశ్చాత్తప్తుడై, సన్మార్గం అవలంబించి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని జీవుడు సంచితములనుండి, ఆగామినుండి విముక్తుడై, ప్రారబ్ధాన్ని మాత్రం అనుభవించి, కర్మశూన్యుడై ముక్తిని పొందవచ్చును. బ్రహ్మజ్ఞాని కూడా ప్రారబ్దాన్ని అనుభవించి తీరాల్సిందే. జ్ఞానియైనవాడు తన కర్మలనన్నింటిని హరింపజేసుకొని, శ్రీహరి పంకేరుహ ధ్యానైక చిత్తుడై, జనన మరణములు లేని స్థితిని పొందుటయే మోక్షము. కర్మమేమాత్రము శేషించినా గాని జన్మము తప్పదు.

ఈ ప్రపంచం సమస్తమూ పరమాత్మ స్వరూపమే అని తెలిసికొని, సకల జీవులపట్ల సమభావంతో వర్తించడం సామాన్య జ్ఞానం. సామాన్య జ్ఞానాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అప్పుడు భేదబుద్ధి తొలగి, సర్వ ప్రపంచంలో పరబ్రహ్మమే నిండియున్నదన్న జ్ఞానం ఆత్మకు లభిస్తుంది. దానివలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.

చంద్రుని క్షయరోగ విముక్తి

తన భార్యలను (అనగా చంద్రుని భార్యలు, దక్షుని పుత్రికలు అయిన వారిని) చంద్రుడు క్షోభకు గురి చేశాడు గనుక అతనికి క్షయరోగం కలిగిందని దక్షుడు తెలిపాడు. అందరిపట్ల పక్షపాత బుద్ధి లేకుండా మెలగమని చెప్పాడు. అందుకొరకు దినమునకొక భార్యతో ఉండమని, ఆ 27 దినములు 27 యోగములు  అవుతాయని దక్షుడు చెప్పాడు. - అవి విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యము, శోభనము, అతిగండము, వృద్ధి, ధృవము, వ్యాఘాతము, హర్షణము, వజ్రము, సిద్ధి, వ్యతీపాతము, పరియాన్, పరిఘము, శివము, సిద్ధము, సాధ్యము, శుభము, శుక్రము, ఇంద్రము, వైధృతి.


అలా ఉండడం వలన క్రమంగా రోగం క్షీణిస్తుందని, శుక్లపక్షంలో వృద్ధిని పొందుతూ కృష్ణపక్షంలో కళావిహీనుడు అవుతుంటాడని దక్షుడు ఉపాయం చెప్పాడు. తన శాపం అమోఘం గనుక దానిని తొలగించడం సాధ్యం కాదని, కాని మదోన్మత్తుడైన రాజు (చంద్రుడు) క్రమంగా జరిగినదానిని మరిచిపోయే ప్రమాదం ఉంది గనుక ఆ విధాన్ని అలా ఉండనీయమని చెప్పాడు. దక్షునికి నమస్కరించి, అతని ఆనతి తీసికొని చంద్రుడు అతని ఆజ్ఞ ప్రకారం నడుచుకోసాగాడు.

మహా పాతకము, పుణ్యములో పాపము

నక్షత్రాల, చంద్రుని కథ విన్న తరువాత జైమిని వ్యాసుని "మహాపాతకములు" అంటే ఏమిటని అడిగాడు. అందుకు వ్యాసుడిలా చెప్పాడు - పాతకాలలో ఐదింటిని "మహాపాతకాలు" అంటారు. ఆ పాపాలకు నిష్కృతి లేదు. వాటి ఫలితాలను అనుభవించే తీరాలి. ఆ మహాపాతకాలు -

  1. స్త్రీ హత్య

  1. శిశు హత్య

  1. గో హత్య

  1. బ్రహ్మ హత్య

  1. స్వర్ణస్తేయము

ఇక బుద్ధి పూర్వకంగా చేసిన పుణ్యపాపముల ఫలితాన్ని అనుభవించి తీరాలి. అలా కాకుండా తెలియక, ప్రమాద వశాత్తూ చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా విముక్తి సాధనాలున్నాయి. శాస్త్ర ప్రకారంగా, భక్తిపూర్వకంగా ప్రాయశ్చిత్తం చేసుకొంటే ఆ పాలు క్రమంగా హరిస్తాయి. ఇందుకు ఉదాహరణగా కోసల దేశపురాజు గోహత్యాపాతకంలో ఇరుక్కొన్న వైనం చెప్పాడు వ్యాసుడు.

ఒకప్పుడు కోసలదేశంలో క్షామం సంభవించినపుడు రాజు భీమసేనుడు నగరం వెలుపల ఒక బావి త్రవ్వించాడు. కాని ఆ నూతి చుట్టూ గోడ కట్టించలేదు. దాహం గొని ఉన్న ఒక ఆవు దూడ ఆ నూతిలోపడి మరణించింది. బావిచుట్టూ తిరుగుతూ ఆవు అరుస్తున్నది. ప్రోగైన జనులు దూడ కళేబరాన్ని బయటకు తీశారు. ఈ పాపం ఎవరిదనే చర్చ సాగింది. అజాగ్రత్తగా ఉన్న పశువులకాపరిధి తప్పన్నారు కొందరు. దూడ యజమాని తప్పు అని కొందరన్నారు. బావికి గోడ కట్టించని వారిది తప్పని మరి కొందరన్నారు. ఈ సంగతి తెలిసి రాజు పండితులను సంప్రదించాడు. వారు రాజుకు చెప్పిన విషయం ఏమంటే - రాజా బావి త్రవ్వించి అనేకుల ప్రాణాలను రక్షించిన పుణ్యం నీకు చెందుతుంది. అలాగే గోడ కట్టించాలని తెలియక ఒక ఆవుదూడ మరణానికి కారణమైన పాపం కూడా నీకు చెందుతుంది. కాని ఇది తెలియక చేసిన తప్పు కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చును. పది దినములు దీక్షతో ఉండి, పుణ్యక్షేత్రాలు దర్శించి, ఉత్తమ దానములు చేయుము - అని చెప్పారు. రాజు అలాగే చేశాడు.

గోవు పుట్టుక

గోవుకు అంత పవిత్రత ఎందుకు కలిగిందని జైమిని అడిగాడు.

శ్వేతవరాహకల్పంలో విరాట్పురుషుడైన పరబ్రహ్మ యోగనిద్రనుండి లేచి ముందుగా తన నాభి కమలంనుండి బ్రహ్మను పుట్టించాడు. అనంతరం తనయందున్న ప్రకృతినుండి విష్ణువును, మహేశ్వరుని సృజింపజేశాడు. అనంతరం ప్రకృతి చేసిన ఒక తప్పిదం కారణంగా ఆమెను "పశువు" అన్నాడు. కాని మరల కరుణించి - నీ ముఖంలో పంచమహాపాతకాలుంటాయి. అయినా నీవు అతిపవిత్రవై యుందువు. నీ మలమూత్రములు కూడా పవిత్రములు. నీ దర్శనము సకల పాపములు పోగొట్టును. నిన్ను దానమిచ్చేవారి శరీరంలో ఎన్ని వెండ్రుకలుంటాయో అన్నివేల దివ్యాబ్ధములు వాఱు గోలోకంలో నివశిస్తారు.- అని చెప్పెను.

గాయత్రి ఉత్పత్తి

గాయత్రి  గురించి తెలుపమని జైమిని వ్యాసుని ప్రార్ధించాడు - అందుకు వ్యాసుని ఉత్తరం:

పరబ్రహ్మ నాభి కమలంనుండి జనించిన నాలుగు ముఖాల బ్రహ్మకు  ''ఓం'' అనే ప్రణవనాదం వినిపించింది. అప్పుడు బ్రహ్మ ఒకోముఖంనుండి ఆరు అక్షరాలు కలిగిన గాయత్రి మంత్రం (మొత్తం నాలుగు ముఖాలనుండి 24 అక్షరాలు) వెలువడింది. కనుక అన్ని వేదములకు ఈ మంత్రము మాతృక. అన్ని మంత్రములకు తల్లివంటిది. ఈ మంత్రాన్ని ఉపాసించేవారి కోరికలు ఈడేరును. బ్రహ్మమును ఉపాసించేవారికి ఇది ముఖ్యసాధనమైన బ్రహ్మవిద్య  ఉపనయనార్హత కలిగిన ద్విజులు తప్ప అన్యులు దీనిని జపించరాదు, ఉపాసింపరాదు."

బ్రహ్మ పురాణము అధ్యాయ క్రమంలో

  • మొదటి అధ్యాయములో బ్రహ్మ సృష్టి చేయ సంకల్పించుట. ఆ తరువాత ఉదకమును సృజించుట. ఆ ఊదకములో సృష్టి చేయడానికి వీర్యమును వదలుట. అవి బంగారు అందములుగా తెలియుట. అందు ఒక అండమునందు హిరణ్య గర్భుడుగా తానే జనించుట. బ్రహ్మ మానస పుత్రులను సంకల్ప కారణముగా పుట్టించుట. రుద్రుని పుట్టించుట. సనత్కుమారుడు జన్మించి స్కందుడగుట. పక్షులను, సాధ్యులను పుట్టించుట. ఉరుములు, మెరుపులు, ఇంద్ర ధనస్సు, మేఘములను సృష్టించుట, భువి, దివి, ఆకాశమును సృష్టించుట వర్ణించబడ్డాయి. బ్రహ్మ స్త్రీ పురుషులుగా మారి ప్రజలను వృద్ధి చేయుట. పురుషుడు జగములందు విష్ణువుగా వ్యాపించుట. విష్ణువు విరాట్పురుషుని పుట్టించుట. విరాట్పురుషుడు మనువును సృజించుట. మన్వంతరము కొనసాగుట వర్ణించబడినది.

  • స్వాయంభువ మనువు శతరూపల వివాహము వారి వంశాభివృద్ధి క్రమంలో ధృవ జననము, పృధువు జననము, దక్షప్రజాపతి జననము అతడి వివాహము వారి వివాహములు వర్ణించబడ్డయి.

  • తృతీయాధ్యాయములో దక్షుడు సంకల్ప మాత్రముగా దేవ దానవ యక్షులను పుట్టించడము. అస్నికను వివాహమాడడము, పుత్రులను కనడము, నారదుని మాటలు విని వారు గృహస్థ జీవితానికి విముఖులై వెళ్లి తిరిగి రాక పోవడము, దక్షుడు తిరిగి వైరిణి యందు వేయి మంది పుత్రులను పొందడము, వారు అన్నలను వెదుకుతూ వెళ్లి తిరిగి రాక పోవడము, తత్ఫలితముగా దక్షుడు కుపితుడై నారదుడిని శపించడము, శాపవశాన నారదుడు బ్రహ్మకు జన్మించడము, దక్షుడు తిరిగి అరవై మంది పుత్రికలను కనడము, వారిని ధర్మునుకి, కశ్యపునికి, చంద్రుడికి ఇచ్చి వివాహము వేయడము వర్ణించబదినది. దేవాసుర ఉత్పత్తి వర్ణించబడినది.

  • నాలుగవ అధ్యాయములో బ్రహ్మ సృష్టి అంతటికీ అధిపతులను నిర్ణయించుట, రాజులకు కుబేరుడిని, ఆదిత్యులకు విష్ణువును, జలాలకు వరుణిడిని, వసువులకు అగ్నిని, ప్రజాపతులకు దక్షుడిని, మరుత్తులకు వాసవుని, దైత్యులకు ప్రహ్లాదుడిని, పితరులకు యముడిని, యక్ష, భూత పిశాచములకు శివుడిని, పర్వతములకు హిమవంతుడిని, నదులకు సాగరుడిని, గంఘర్వులకు చిత్రరధుడిని, నాగులకు వాసుకుని, సర్పములకు తక్షకుడిని, ఏనుగులకు ఐరావతాన్ని, గుర్రములకు ఉచ్ఛైశ్వాన్ని, పక్షులకు గరుడిని, మృగములకు సింహాన్ని, గోవులకు గోవృషమును, వృక్షములకు జువ్విని అధిపతులను చేయడము. దిక్కులకు అధిపతులను నిర్ణయించడము. పృధు చక్రవర్తి సహాయముతో భూని గోవుగా చేసి అందరూ క్షీరమును పితకడము వర్ణించబడినది.

  • ఐదవ అధ్యాయమున మనువుల గురించి మన్వంతరముల గురించి మనువుల కుమారుల గురించి వర్ణించ బడినది. ఆయా మనువుల కాలములో సప్తఋషుల గురించి వర్ణించబడినది.

  • ఆరవ అధ్యాయములో కశ్పపునికి వివస్వంతుడు(సుర్యుడు) జన్మించుట, సూర్యుడు త్వష్ట ప్రజాపతి కూతురైన సంజ్ఞాదేవిని వివాహము చేసుకొనుట, ఛాయాదేవి సృష్తి, మనువు, యముడు, యమున, సావర్ణి మనువు, శనీశ్వర జననము, వారి విధులు వర్ణించబడ్డాయి.

  • ఏడవ అధ్యాయములో వైవసత్వమనువు వంశ చరిత్ర, పురూరవ జననము, దుంధుమారుని గురించి వర్ణించబడినది.

  • ఎనిమిదవ అధ్యాయములో సూర్యవంశానుక్రమములో త్రిశంఖు చరిత్ర, హరిశ్చంద్రుడు, సగరుడు, దశరధుడు, శ్రీరాముడు, కుశుడు, నలుడు మొదలైన వారి చరిత్ర వర్ణించబడినది.

  • పదియవ అధ్యాయములోచంద్రవంశ చరిత్ర చెప్పబడినది. గంగాదేవి జాహ్నవిగా మారుట, కవేరి, కైశికీ నదుల పుట్టుక, జమదగ్ని పరశురాముల జననము వర్ణించబడినది.

  • పదకొండవ అధ్యాయములో కాశ్యపవంశ వర్ణన చేయబడినది.

  • పన్నెండవ అధ్యాయములో యయాతి చరిత్ర వర్ణించబడినది.

  • పదమూడవ అధ్యాయములో యయాతికుమారులైన పురువు, దుహ్యుడు, తుర్వసుడు, అనువు, యదువుల చరిత్ర వర్ణించబడినది.

  • పదినాల్గవ అధ్యాయములో వృష్టి వంస చరిత్ర వర్ణించబడినది.

  • పదిహేవవ అధ్యాయములో భోజవంశ చరిత్ర గురించి చెప్పబడినది.

  • పదహారవ అధ్యాయమున అంధక వంశ చరిత్ర చెప్పబడినది. శ్యమంతకమణి వృత్తాంతము వర్ణించబడినది.

  • పదిహేడవ అధ్యాయములో శ్యమంతకమణి కథా సమాప్తము అయినది.

  • పద్దెనిమిదవ అధ్యాయములో భువునకోశ ద్వీప వర్ణన చేయబడినది.

  • పదొమ్మిదవ అధ్యాయములో జంబుద్వీప వర్ణన చేయబడినది.

  • ఇరవైవ అధ్యాయము ప్లక్ష్యద్వీపము, శాల్మద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, శాకద్వీపము, పుష్కరద్విపము అను ఆరు ద్వీపముల వర్ణన చోటు చేసుకున్నది.

  • ఇరవై ఒకటవ అధ్యాయములో అతల, వితల, సుతల, తలాతల, పాతాళ, రసాతల, నితల అను ఏడు పాల లొకముల వర్నన జరిగినది.

  • ఇరవైరెండవ అధ్యాయములో నరక లోక వర్ణన పాపములు ఫలితము విముక్తి మోక్షము గురించి వర్ణించబడినది.

  • ఇరవైమూడవ అధ్యాయములో ఊర్ధ్వలోక వర్నన, విష్ణుతత్వము సృష్టి గురించి తెలుపబడినది.

  • ఇరవైనాల్గవ అధ్యాయములో బ్రహ్మాండము, సూర్యుడు, వర్షము గురించి వర్ణించబడినది.

  • ఇరవై ఐదవ అధ్యాయములోసకల పూణ్యతీర్ధాల వర్ణన చేయబడినది.

  • ఇరవై ఆరవ అధ్యాయములోమునులు సుతుడిని మోక్షము నిచ్చే పుణ్యతీరధము గురించి ప్రశ్నించుట గురించి వర్ణించబడినది.

  • ఇరవైఏడవ అధ్యాయములో భరత ల్హండము గురిఛిన వర్ణన చేయబడినది.

  • ఇరై ఎనిమిదవ అధ్యాయములో సూర్యోపాసన, పుజావిధనము, కోణతీర్ధమహిమ గురించి వర్ణించబడినది.రామేశ్వర మహిమ గురించి చెప్పబడినది.

  • ఇరవై తొమ్మిదవ అధ్యాయములో సుర్యోపసన గురించి పుజా విధానము ఫలితాల గురిమ్చి వివరించబడింది.

  • ముప్పైవ అధ్యాయములో సుర్యుడి మహిమ గురించి వర్ణించబదినది.

  • ముప్పై ఒకట్వ అధ్యాయములో సూర్యుది మహిమ సూర్యోపసనా ఫలితాలు వర్ణించబడ్డాయి.

  • ముప్పై రెండవ అధ్యాయములో మార్తాండుడు జన్మించుట అతడికి తరణి పట్టి మూర్తిని సుందరముగా చెక్కుట వర్ణించబడినది.

  • ముప్పై మూడవ అధ్యాయములో సూర్య అష్టోత్తరము, శతనామావళి దాని ఫలితము.

  • ముప్పై ఐదవ అధ్యాయములో పార్వతీదేవి తపస్సు గురిమ్చి వివరంచబడినది.

  • ముప్పై ఆరవ అధ్యాయములో శివపార్వతుల వివాహాలంకరణ శోభ గురించి వర్ణించబడినది.

  • ముప్పై ఏడవ అధ్యాయములో శివకల్యాణము వర్ణించబడినది.

  • ముప్పై ఎనిమిదవ అధ్యాయములో శివుడు పార్వతితో విహరించుత శివుడు కైలాసమును వీడి మెరువును చేరుట వివరించబదినది.

  • ముప్పై తొమ్మిదవ అధ్యాయములొ దక్షయజ్ఞ వినాశనము గురిమ్చి వర్ణించబడినది.

  • నలభైయవ అధ్యాయములో దక్షుడు చేసిన శివసహస్రనామావళి గురించి వర్ణించబడినది.

  • నలభై ఒకటవ అధ్యాయములో ఏకామ్రేశ్వరుని మాహాత్మ్యము గురిమ్చి వర్ణించబడినది.

  • నలభై రెండవ అధ్యాయములో ఉత్కళ క్షేత్రవైభము గురించి వర్ణించబడినది.

  • నలభై నాల్గవ అధ్యాయంలో అవంతీపుర వర్ణనము చేయబడినది.

  • నలభై నాల్గవ అధ్యాయములో పురుషోత్తమ క్షేత్రం గురించి వర్ణించబడ్డాయి.

  • నలభై అయిదవ అధ్యాయములో పురుషూత్మ క్షేత్ర ఆవిర్భావము మహిమ గురించి వర్ణించబడినది.

  • నలభై ఏడవ అధ్యాయములో ఇంద్రద్యుమ్నుదు చేసిన అస్వమెధయజ్ఞము, విష్ణుదేవాలయ ప్రాసాద నిర్మానము గురంచిన వర్ణన జరిగినగినది.

  • నలభై ఎనిమిదవ అధ్యాయములో విష్ణురూప ముర్తి నిర్మాణము కొరముకు ధ్యానించుటను గురించి వర్నించబదినది.

  • నలభైతొమ్మిదవ అధ్యాయములో కృష్ణస్తుతి గురించి దాని మహిమ గురించి వర్ణించబదినది.

  • ఎభైయవ అధ్యాయములో జగన్నధ, బలరామ, సుభద్రల ముర్తుల నిర్మానము గురించిన వర్ణన చేయబడినది.

  • ఏభై ఒకటవ అధ్యాయములో పురిజన్నాధయాత్రా విధానము మహిమ వర్ణించబడినది.

  • ఎభైరెండవ అధ్యాయములో స్వయంభువు ఋషి సంవాదములో మార్కండేయుడు వటవృక్షమును దర్శించుట గురించి వర్ణించుట.

  • ఎభైమూడవ అధ్యాయములో మార్కండేయుడు ప్రళయదర్సనము చేయుట వర్ణించబదినది.

  • ఎభైనాల్గవ అధ్యాయములో మార్కండేయుడు భగవానుదైన వటపత్రశయి కుక్షి(ఉదరము)అందు ప్రవేశించుట వర్ణించబడినది.

  • ఎభై అయిదవ అధ్యాయములో మర్కండేయుడు భవానుదైన వతపత్రశాయిని స్తుతించుత వర్ణించబడినది.

  • ఎభై ఆరవ అధ్యాయములో వటపత్రశాయి అయిన నారాయణుడు ఆ క్షేత్రములో శివలింగ ప్రతిష్ట చేయమని మార్కండేయుడికి ఆనతి ఇచ్చుట. శివుడికి, విష్ణువుకు భేదము లేదని చెప్పుట.

  • ఎభై ఏడవ అధ్యాయములో పంచతీర్ధ విధిలో జగన్నధుని దర్శించు విధానము గురించి వర్ణించబడినది.

  • ఎభై ఎనిమిదవ అధ్యాయములో నృసింహ మహిమ గురించి వర్ణించుట.

  • ఎభై తొమ్మిదవ అధ్యాయములో శ్వేతమాధవుని మహిమ గురిమ్చి వర్ణించబడినది.

  • అరవైయవ అధ్యాయములో సముద్రస్నాన విధి గురిమ్చి వర్ణించబడినది.

  • అరవై ఒకటవ అధ్యాయములో విష్ణు పూజా విధానము గురించి వర్ణించబడినది.

  • అరవై రెండవ అధ్యాయములో సముద్ర స్నానము సముద్రుడికి నమస్కారము గురించి వర్ణించబదినది.

  • అరవై మూడవ అధ్యాయములో పురుషోత్తమ క్షేత్రములోని పంచతీర్ధ మహిమగురించి వర్ణించబడినది.

  • అరవైనాల్గవ అధ్యాయములో పురుషోత్తమ క్షేత్ర దర్శన ఫలసృతి ప్రస్థావించబడినది.

  • అరవై అయిదవ అధ్యాయములో పురుషోతమక్షెత్రాఅన్ని దెవతలు సహితము దర్శించుకుని తరిమ్చిన విధము వర్ణించబడినది.

  • అరవై ఆరవ అధ్యాయములో గుడివా రధయాత్రా వర్ణన చేయబడినది.

  • అరవై ఎనిమిదవ అధ్యాయములో గుదివా యాత్రాఫలము గురించి వర్ణించబదినది.

  • అరవై ఎనిమిదవ అధ్యాయములో విష్ణులోక వర్ణన చేయబదినది.

  • పురుషోత్తమ క్షెత్ర వర్ణన ప్[అరొసమాప్తి చేయబడినది.

  • అనంతవాసుదేవుని మాహాత్మ్యము గురించి వర్ణించబడినది.

  • పురుషోత్తమ క్షేత్రమున మరణించిన కలుగు ఫలము, వ్రతములు ఆచరిమ్చిన కలుగు ఫలము వర్ణించబడినది.

  • కండూపోఖ్యానము పేరుతో కండూపముని గురించిన వర్ణన చేయబడినది.

  • వసుదేవుని మానవ జననము గురించి మునులు వ్యాసుడిని ప్రశ్నించుట వివరించబడినది.

  • వాసుదేవుని చతుర్వ్యూహ వర్ణన చెయ్యబడినది.

  • హరియంశావతరణ గురించి వర్ణించబడినది.

  • కంస విచారము గురించి వర్ణించబడినది.

  • బృందావనగమనము గురించి వర్ణించబడినది. కంసుని కృష్ణుని నందుని ఇంట వదిలి వచ్చుట గురించి వర్ణించబడినది.

  • కాళీయమదనము (కాళీయ మర్ధనము ) గురించి వర్ణించబడినది.

  • ధేనుక కథ (ధేనుకాసుర వధ )గురించి వర్ణించబడినది.

  • గోవర్ధన గిరి యజ్ఞము గురించి వర్ణించబడినది.

  • శ్రీకృష్ణ బాలచరితము గోవింద పట్టాభిషేకము గురించి వర్ణించచబడినది.

  • శ్రీకృష్ణుడి రాసలీల గురించి వర్ణించబడినది.

  • కేశివధ గురించి వర్ణించబడినది.

  • అక్రూర ప్రత్యాగమనము అను పేర శ్రీకృష్ణ బలరాములను మధురకు తిసుకొనొని పోవుట వర్ణించబడినది.

  • కంసవధ గురించి వర్ణించబడినది.

  • బలరామ కృష్ణులు తల్లి తండ్రులను కలుసుకొనుట గురుదక్షిణ సమర్పించుట.

  • జరాసంధుని దండయాత్రల గురించి వర్ణించబదినది.

  • కాలయవనోపాఖ్యము గురించి వర్ణించబదినది.

  • బలరాముడు నందగోకులముకు పోవుట.

  • బలరామ క్రీడగురించి వర్ణించబడినది.

  • రుక్మిణీ కల్యాణం శంబరాసుర వధ వర్ణించబడినది.

  • ప్రద్యుమ్నుడు రుక్మిణిని కలుసుకొనుత గురించి వర్ణించడినది.

  • రుక్మివధ గురించి వర్ణించబడినది.

  • నరకాసురవధ గురించి వర్ణన జరిగింది.

  • ఇంద్రుడు హరినిస్తుతించుట గురించి వర్ణన జరిగింది.

  • పారిజాతాపహరణం ఇంద్రస్తుతి గురించి వర్ణించబడింది.

  • ఇంద్రకృష్ణ సంవాదం కృష్ణుడితో పరహారు వేల నూరు మంది స్త్రీల వివాహం గురించి వర్ణించబడినది.

  • అనిరుద్ధచరిత్ర గురించి వర్ణించబడినది.

  • బాణాసుర యుద్ధం గురించి వర్ణించబడినది.

  • పౌండ్రకవాసుదేవుని కథ గురించి వర్ణించబడినది.

  • శ్రీకృష్ణజాంబవంతిల కుమారుడైన సాంబుడి వివాహము గురించి వర్ణించబడినది.

  • బలరాముడు నరకాసుర వధకు కోపించి అందుకు బదులుగా భూలోకమును తపింపజేసిన ద్వివిధవానరమును వధించుట వర్ణించబడినది.

  • బలరామ నిర్యాణం శ్రీకృష్ణుడు నిజధామముకు ఏగుట గురించి వర్ణించబడినది.

  • శ్రీకృష్ణ నిర్యాణం గురించి వర్ణించబడినది.

  • శ్రీకృష్ణ చరిత్ర సమాప్తి గురించి వర్ణించబడినది.

  • విష్ణ్వతార సంకీర్తనం అనే పేరుయ్తో దశావతారవర్ణన జరిగినది.

  • యమలోక మార్గ స్వరూపము వర్ణించబడినది.

  • యమలోకము యొక్క దక్షిణ మార్గము గురంచి వర్ణించబడినది.

  • అధర్మానుగతి పేరుతో పాపములు శిక్షలు గురించి వర్ణించబడినది.

  • జీవుడి చక్ర భ్రమణము అను పేరుతో జీవచక్రము గురంచి వర్ణించబడినది.

  • అన్నదాన మహిమ గురించి వర్ణించబడినది.

  • పితరులకు పిండ ప్రధాన విధానము గురిమ్చి వర్ణించబడినది.

  • శ్రాద్ధకర్మ గురించి వర్ణించబడినది.

  • సదాచారముల గురించి వర్ణించబదినది.

  • వర్ణాశ్రమ ధర్మాల గురించి వర్ణించబడినది.

  • సంకరజాతి లక్షణాల గురించి వర్ణించబడినది.

  • దండనిరూపణము గురించి వర్ణించబడినది.

  • ఋషి పరమేశ్వర సంవాదమ అనే పేరుతో వాసుదేవుని మహిమను గురింవి వర్ణించబడింది.

  • వైష్ణవగతి ఉపాఖ్యానము అను పేరుతో వైష్ణవులు పొందే ఉత్తమగతుల వర్ణన జరిగింది.

  • విష్ణుగాన ప్రశస్తి గురించి వర్ణించబడినది.

  • విష్ణుమాయాప్రభావము గురించి వర్ణించబడినది.

  • భవిష్యత్తు కథ అను పేరుతో కలియుగధర్మము గురించి వర్ణించబడినది.

  • భవిష్యత్దర్శనం కలియుగధర్మము గురించి వర్ణించబడినది.

  • సృష్టి సంహారము గురించి వర్ణించబడినది.

  • నైమిత్తిక ప్రళయము ప్రకృతి లయ గురించి వర్ణించబడినది.

  • ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది భూతము గురించి వర్ణించబడినది.

  • యోగవిధానము గురించి వర్ణించబడినది.

  • సాంఖ్యయోగము గురించి వర్ణించడినది.

  • యొగవిధుల గురించి వర్ణించబడినది.

  • జనక వశిష్టుల క్షరము అక్షరముగురించిన వర్ణన చేయబడినది.

  • పరతత్వవర్ణన పరిసమాప్తి.

  • రొమహర్షణ మునుల సమావేశంలో చెప్పబడిన పురాణ శ్రవణ ప్రసంశ.

ఇట్లు 
గుట్టి సుబ్రహ్మణ్యం శర్మ

కర్మ ఫలం అంటే ఏమిటి.............?

కర్మ ఫలం అంటే ఏమిటి


"కర్మ" అనే మాటకు సరి అయిన అర్థం "కార్యము" లేదా "కృత్యము", మరింత విస్తారముగా చెప్పలంటే, అది కారణము మరియు పరిణామము, స్పందన మరియు ప్రతిస్పందనల యొక్క విస్వజనీనమయిన సూత్రమును పేర్కొంటుంది, హిందువులు దానిని మనిషి యొక్క చేతనని నడిపించేదిగా నమ్ముతారు. కర్మ అంటే విధి కాదు, ఎందుకంటే మనిషి తన జీవితంలో రాబోవు పరిణామాలను తన స్వేచ్ఛానుగతమయిన సంకల్పము చేత నిర్దేశించబడిన చేతల ప్రభావంతో సృష్టించుకుంటాడు. వేదాల ప్రకారము, మనం మంచితనాన్ని నాటితే మంచి ప్రతిఫలాన్ని పొందుతాము, చెడుని నాటితే, చెడు ఫలితాన్ని పొందుతాము. కర్మ అనేది మన కార్యాలని అన్నింటినీ సమిష్టిగా సూచించి వాటికి ప్రస్తుత జీవితంలోనూ, గత జన్మలలోనూ అనుసరించి ఉన్న ప్రతిస్పందనలను సూచిస్తుంది, ఇవన్నీ మన భవితవ్యాన్ని నిర్ధారిస్తాయి. కర్మను జయించడము తెలివయిన కార్యాచరణలోనూ మరియు నిశ్చలమయిన ప్రతిస్పందనలోనూ ఉన్నది. అన్ని కర్మ ఫలితాలూ వెంటనే సంభవించవు. కొన్ని జమ అయ్యి, ఈ జన్మలోనో లేదా ఇతర జన్మల్లోనో అనుకోని విధంగా సంభవిస్తాయి మనం నాలుగు విధాలుగా కర్మని ఉత్పత్తి చేస్తాము:
  • ఆలోచనల ద్వారా
  • మాటల ద్వారా
  • మనమే చేపట్టే మన కార్యాల ద్వారా
  • మన ఉపదేశాలను అనుసరించి ఇతరులు చేసే కార్యాల ద్వారా
మనం ఆలోచించేది, మాట్లాడేది, చేసేది లేదా దేనికైనా కారణమయ్యేది అంతా కూడా కర్మ; ఈ క్షణంలో మనం ఆలోచించేది, మాట్లాడేది లేదా చేసేది కూడా కర్మే.హిందూ శాస్త్రాలు కర్మను మూడు రకాలుగా విభజిస్తాయి:
  • సంచిత అనేది కూడబెట్టబడిన కర్మ. అన్ని కర్మలనూ ఒకే జీవితంలో అనుభవించడం, భరించడం అనేది అసాధ్యం. ఈ సంచిత కర్మ యొక్క ఖాతాలోనుండి, చేతిలో పట్టేటన్ని ఒక జీవితంలో అనుభవించడానికి వెలికి తీయడం జరుగుతుంది, ఈ కార్యాలు, ఫలించడం మొదలు పెట్టి, అవి ఫలించాకనే వాటిని అనుభవించడం ద్వారా తరిగిపోతాయి, వేరే విధంగా కాదు, దానిని ప్రారబ్ధ కర్మ అని అంటారు.
  • ఫలించగలిగే ప్రారబ్ధ కర్మ అనేది కూడబెట్టబడిన కర్మలోని ఒక భాగం, అది "పండి", ప్రస్తుత జీవితంలో ఒక ప్రత్యేకమైన సమస్యగా గోచరిస్తుంది.
  • క్రియమాన అనేది ప్రస్తుత జీవితంలో మనం ఉత్పత్తి చేసేది. అన్ని క్రియామాన కర్మలూ సంచిత కర్మ లో జమ అయ్యి, తదనంతరముగా మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. మానవజన్మలో మాత్రమే మనం మన భవిష్యత్గమ్యాన్ని మార్చుకోగలము. చనిపోయాక మనం మన క్రియా శక్తి (పని చేయకలిగే శక్తి) కోల్పోయి, (క్రియామాన) కర్మను మళ్ళీ మనిషి శరీరంలో జన్మించేంతదాకా చేయలేము.
స్పృహతో చేసిన కార్యాలు, స్పృహ లేకుండా అంటే తెలీకుండా చేసిన వాటికంటే చాలా భారీగా ఉంటాయి. ఎలాగయితే విషం తెలీకుండా తీసుకున్నా కూడా మనల్ని ప్రభావితం చేస్తుందో అలాగే, మనకు తెలీకుండా ఇతరులని బాధిస్తే, దానికి కూడా తగిన విధమైన కార్మిక ప్రభావం ఉంటుంది. మంచి చెడుల మధ్య తేడా తెలిసిన మనుషులు మాత్రమే (క్రియామాన) కర్మను చేయగలరు. జంతువులు మరియు చిరుప్రాయంలో ఉన్న పిల్లలు కొత్త కర్మని సృష్టించడం లేదు (అందుకని వాళ్ళు తమ భవిష్యద్గమ్యాన్ని ప్రభావితం చేసుకోలేరు) ఎందుకంటే వాళ్ళు మంచి, చెడుల మధ్య తారతమ్యం గ్రహించలేరు. కానీ స్పర్శా జ్ఞానం కలిగిన ప్రతి జీవీ కర్మ యొక్క ప్రభావమును అనుభవించగలదు, అవి వాటికి ఆనందము మరియు బాధగా తెలుస్తాయి.
తులసిదాస్ అనే హిందు సాధువు ఈ విధంగా అన్నాడు: "మన శరీరం సృష్టిలో భాగం కాక ముందే మన గమ్యం నిర్దేశించబడుతుంది."సంచిత కర్మ లోని ఖాతా అంతమయ్యే వరకూ, దానిలోని కొంచం భాగము ఒక జీవిత కాలంలో ప్రారబ్ధ కర్మ ను అనుభవించడానికి వెలికితీయడం జరుగుతుంది, అది జనన మరణ చక్రానికి దారితీస్తుంది. జీవుడు జమకాబడిన సంచిత కర్మ పూర్తిగా తరిగిపోయేంత వరకూ జనన మరణాల చక్రం నుండి మోక్షం పొందలేడు.
భూమిపైన జనన మరణాల చక్రం అనేది 84 లక్షల జీవాకృతుల నుండి ఏర్పడుతుంది, వాటిల్లో ఒకటి మాత్రమే మానవ జన్మ. మనుషులుగా మాత్రమే మనం మన గమ్యస్థానం కోసం సరి అయిన సమయంలో సరి అయిన విధంగా ఏదో ఒకటి చేసే స్థానంలో ఉంటాము. మంచి పనుల వల్ల, స్వచ్చమయిన ఆలోచనల వల్ల, ప్రార్థన వల్ల, మంత్రము మరియు ధ్యానం వల్ల, మనం కర్మ యొక్క ప్రభావాన్ని ప్రస్తుత జీవితంలో తగ్గించుకోగలిగి, మన గమ్యాన్ని బాగు చేసుకోగలము. మన కర్మ ఏ రకంగా, ఏ వరుసక్రమంలో పరిపక్వం చెందుతుందో అన్న విషయం తెలిసిన ఆధ్యాత్మిక గురువు మనకి సాయపడగలడు. మనుషులుగా మనం మంచి పనులు చేయడమనే అభ్యాసం ద్వారా మన ఆధ్యాతిమ పురోగమనాన్ని త్వరితం చేసుకోగల అవకాశం ఉంది. మనకు జ్ఞానము లేదా స్పష్టత లేక పోవడం వలన మనము చెడు కర్మను ఉత్పత్తి చేస్తాము.
నిర్దయగా ఉండటం చెడిపోయిన ఫలాలను ఉత్పత్తి చేస్తుంది, వాటిని పాపం అంటారు, మంచి పనులు తియ్యటి ఫలాలను తీసుకువస్తాయి, వాటిని పుణ్యము అంటారు. మనం చేసే పనులకు తగ్గట్లుగా మనం తయారవుతాము: సన్మార్గపు కార్యాల వలన సన్మార్గులుగానూ, దుర్మార్గపు కార్యాల వల్ల దుర్మార్గులుగానూ మారతాము.

ఇట్లు 
గుట్టి సుబ్రహ్మణ్యం శర్మ

Saturday, September 13, 2014

చనిపోయినవారి తల దగ్గర దీపమెందుకు ?



ప్రాణాలతో ఉన్న వ్యక్తికి చీకటిలో దారి చూపించి ముందుకు నడిపిస్తుంది దీపం. అలాగే జీవాన్ని కోల్పోయిన తరువాత ఆత్మకు కూడా సరైన దారి చూపమని కోరుతూ ఇలా తల దగ్గర దీపం పెడతారు. మరణించిన వ్యక్తి ఆత్మ బ్రహ్మకపాలం ద్వారా బయటకు వస్తే, ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. బయటకు వచ్చిన ఆత్మ పైలోకాలకు చేరడానికి రెండు మార్గాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఉత్తర మార్గం, రెండోది దక్షిణ మార్గం. ఉత్తర మార్గం వెలుగుతోను, దక్షిణ మార్గం చీకటితోను నిండి ఉంటుందట. ఉత్తమ గతులు కలగాలంటే వెలుగు మార్గంలోనే ప్రయాణించాలి. కాబట్టి బ్రహ్మకపాలం నుంచి వచ్చిన ఆత్మకు వెలుగు మార్గం చూపించే ఉద్దేశంతోనే ఆ స్థానంలో దీపాన్ని ఉంచుతారు.

గుట్టి. సుబ్రహ్మణ్యశర్మ 

Thursday, August 7, 2014

వరలక్ష్మీ వ్రతం

 శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున భారత దేశంలో ఐఛ్చిక సెలవు దినాన్ని ప్రకటిస్తారు.









నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

తాత్పర్యం

మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.

పురాణ గాధ

స్కాంద పురాణం లో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.

ఎందుకు ఈ వ్రతం

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి

పసుపు, కుంకుమ, తమల పాకులు, వక్కలు,అరటి పండ్లు, ఊదు బత్తీలు/దూపం కలికెలు, హారతి కర్పూరము, పసుపు అక్షతలు, పూలు, కొబ్బరి కాయ/కలశం మీదికి, కొబ్బరికాయ అర్చనకు, దీపారాధన కుంది - పెద్దది, దీపారాధన కుంది - చిన్నది, గంధం, గంట, హారతి పళ్లెము, వత్తులు, దీపారాదన నూనె ఆవునెయ్యి, అమ్మవారికి కలశము, అర్చన కలశము, పంచామృతాలు, అమ్మవారికి పీఠము/పీట, ఒక పళ్లెము - దీపారాధన హారతి పళ్లెము ఉంచుటకు, బియ్యము తో ఉన్న చిన్న పళ్లెము పసుపు గణపతికి, ఒక రవికె గుడ్డ, అమ్మవారి అలంకరణ సామగ్రి, వడపప్పు, (ఆనవాయితి ఉంటే) పానకము (ఆనవాయితి ఉంటే), పతిని పావలా కసుగా చేసి కుంకుమ తో అధినవి రెండు వస్త్రాలు, పత్రితో రుద్రాక్షమాల గా చేసి పసుపు/కుంకుమ లతో అలదిన యజ్ఞ ఉపవీతము, అర్చన కలశము ప్రక్కన గిన్నె, ఆచమనమునకు గ్లాసు ప్రక్కన పల్ల్లేము, కొద్దిగ ఏలకులు/లవంగాల పొడి, చెంచాలు, కూర్చొను వారికి తగినన్ని పీటలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప దలచితే ప్రత్హి వస్త్రాలు అక్కరలేదు, మామిడి ఆకులు మందిర అలంకరణకు, చిల్లర రూపాయిలు, పన్నీరు లేక గంధము కలిపిన నీరు, నవ సూత్రములు ఎంత మంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారములు తీసుకొని తొమ్మిది ముడులు వేసి కుంకుమలో అలధినవి. పాటకు జ్యోతులు తొమ్మిది బియ్యపు పిండి బెల్లముతో కలిపి చేసినవి, నానబోసిన శనగలు,

వ్రత విధి విధానం

తొలుత పసుపు తో గణపతి ని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనమీయవలెను.

తోరగ్రంథి పూజ

తొమ్మిది దారపుపోగులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయవలెను.

  • ఓం కమలాయై నమ ప్రథమ గ్రంథిం పూజయామి.

  • ఓం రమాయై నమ ద్వితియ గ్రంథిం పూజయామి.

  • ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి.

వరలక్ష్మి వ్రత కథ

ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, "ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు"డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను" అనెను. అది విని యామె, "స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ"య వేడెను. మరియు, "ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద" ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ పడతీ! ఆ వ్రతకథను చెప్పెదను వినుము" అని కథ చెప్పెను.

పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, "చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద" నని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్గాంచి, తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప నతడునూ మిగుల సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశంబేర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి, సాయంత్రమైనంత నధిక భక్తితో

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం

శ్రీ రంగథామేశ్వరీం|

దాసీభూత సమస్తదేవ వనితాం

లోకైక దీపాంకురాం|

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః

బ్రహ్మేంద్ర గంగాధరాం|

త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం

వందేముకుందప్రియాం||


అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమృధ్ధము లయ్యెను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును.

 PRIEST

గుట్టి సుబ్రహ్మణ్య శర్మ 

 9848288711

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...