Friday, December 13, 2013

శ్వేత శంఖాలు

ఎవరి ఇంట్లో అయితే దక్షిణావర్తమైన శ్వేత శంఖాలు రెండు నిత్యపూజలు అందుకుంటూ ఉంటాయో ఆఇంటి యజమాని సదా ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ఏకార్యం చేట్టినా అందులో విజయం సాధిస్తాడు. అపజయాలు, దుర్దశలు ఆవ్యక్తి దరిదాపుల్లోకి కూడా రావని ప్రజల నమ్మిక. శాస్త్ర ప్రకారం శంఖం లక్ష్మీ స్వరూపం.
"మహాభషేకం సర్వత్ర శంఖేనైవ ప్రకల్పయేత్!
సర్వత్రైవ ప్రశస్తోబ్జః శివ సూర్యార్చనం వినా!!"(తిథి తత్త్వే బ్రాహ్మే)
సర్వదేవతా పూజల్లోనూ శంఖంతో మహభిషేకం చేయాలి. శంఖంతో శివ సూర్యులను మాత్రం అభిషేకించరాదు. శంఖ ద్వారా ఇచ్చే తీర్థాన్ని ఎలా స్వీకరించాలంటే
చతుర్గుణీ కృత వస్త్రే పాణిం నిధాయ తేనాదౌ శంఖతీర్థం శిరసి ధారయేత్!
శంఖ మధ్య స్థితం తోయం భ్రామితం కేశవోపరి! అంగ లగ్నం మనుష్యాణాం బ్రహ్మహత్యా యుతం దహేత్!! (నిత్య కర్మాష్టకే)
నాలుగు మడతలు పెట్టిన వస్త్రం మీద కుడి చేతిని ఉంచాలి. ముందుగా అందులోకి శంఖ తీర్థాన్ని తీసుకొని, శిరస్సున జల్లుకోవాలి. శంఖమధ్యమున ఉండేదీ, విష్ణు ప్రదక్షిణం చేసినదీ అయిన ఈశంఖం తీర్థం మానవుల శరీరాన్ని స్పృశించి, బ్రహ్మ హత్యల వల్ల కలిగే పాపాన్ని సైతం పోగొడుతుంది. శంఖాన్ని చెవిదగ్గర ఉంచుకొన్నప్పుడు మంద్రమైన శబ్దాలు వినిపిస్తే అది ఉత్తమమైన శంఖం.
ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉండాలనుకుంటారో, ఋణబాధలు, దరిద్రం లేకుండా సిరిసంపదలతో తులతూగాలనుకుంటారో అలాంటి వాళ్ళు దక్షిణావర్త శ్వేత శంఖాన్ని(కుడివైపు తెరుచుకొని ఉండే తెల్లటి శంఖాన్ని) పూజగదిలో పెట్టుకోవాలి. ఈవిషయాన్ని పులస్త్య సంహితలో మహర్షి పులస్త్యుడు, లక్ష్మీ సంహితలో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు చెప్పారు. దక్షిణావర్తమైన తెల్లటి శంఖం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోనట్లయితే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదని శంకరాచార్యులు పేర్కొన్నారు. ఆశంఖం మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తుందని తెలిపారు.

ఎందరో మహానుభావులు చెప్పిన మాటాలు

ఎందరో మహానుభావులు చెప్పిన మాటాలే మరోసారి చెప్పుకోవాలనిపించింది. అందులో స్వార్ధం ఉంది. అవి నాలోనూ నాస్నేహితులకు కూడా ఒకసారి విచారణచేసుకొడానికి ఉపయోగపడతాయన్న ఆశ. భగవంతుడు ఇచ్చిన ఈ బ్రతుకుని ఎంతవరకు సార్థకం చేసుకుంటున్నామని ఒకసారి అలోచిద్దాం. ఎమైనా లోపాలు ఉంటే దిద్దుకుని మారడానికి ఈ రోజునుండీ ప్రయత్నిద్దాం. మనలో చాలామందికి తప్పులు ఏమిటో తెలుసు.. మనగుణాలు. ముఖ్యంగా అరిషడ్వర్గాలు.. ఇవి మన ఇహలోక పరలోక అభ్యున్నతిని అడ్డుకుంటూ ఉంటాయి. వీటిని నియంత్రించడానికి మనవంతు కృషి చేస్తూ భగవంతుడిని శరణు వేడుదాం. ఈ ఆరు శత్రువుల గురించి అందరికీ తెలుసు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఇవి కాక మమత, అభిమానం కూడా స్థానభ్రంశం చెంది దుర్గుణాలుగా మారుతూ ఉంటాయి. వీటిని నియంత్రించాలంటే యమ, నియమ, ప్రత్యాహార, ఆసన, ధ్యాన మొదలైన అష్ట యోగాలను చెప్పేరు. ఇవి నియమ ప్రకారం చేయడం ప్రస్తుత జీవనశైళిలో కొంచెం కష్టమే. మనకి ఏ కోరికలు తీరాలన్నా భగవంతుడిని కోరుకోవడం అలవాటు. మరి ఈ గుణాలను నియంత్రించడానికి కూడా అతనినే త్రికరణ శుద్ధిగా శరణు వేడుదాం.

శని త్రయోదశి

శని త్రయోదశి.  శనిదేవుని స్మరించినా, అర్చించినా, శివపూజ చేసినా శనిదోషాలు నశిస్తాయి. రుద్రాభిషేకం వంటివి ఈరోజున విశేషఫలాన్నిస్తాయి. ప్రతి శనివారం సంవత్సరం పాటు ఈక్రింది నామాలను, స్తోత్రాన్ని పఠిస్తే శనిబాధలు ఉండవు.

కోణస్థః పింగలో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః
శౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః!!
నమస్తే కోణ సంస్థాయ పింగలాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే!!
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో!!
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం మమదేవేశ దీనస్య ప్రణతస్యచ!!

మంచి మాటలు

1)తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.

2)ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి,దానితో రెండు ఒత్తులను(దీపారాధన)వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి.

3)శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం,విష్ణువుకి అలంకారం,వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం .ఇవి చేస్తే మంచి జరుగుతుంది.

4)ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.

5)దీపమును నోటితో ఆర్పరాదు.ఒక దీపం వెలుగుచుండగా,రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.

6)దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.

7)దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.

8)పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.

9)యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.

10)శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.

11)ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.

12)తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.

13)తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహమునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.

14)ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి,సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ,వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.

15)ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.

16)నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికి ప్రీతికరము.

17)జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.

18)స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.

19)ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి.

Thursday, December 12, 2013

FIND THE FACT

మరి తియ్యగా (మంచిగా) ఉంటే నిన్ను మింగేస్తారు. మరీ చేదుగా (చెడ్డగా) ఉంటే ఉమ్మేస్తారు.

నా మాటలు అర్ధం చేసుకుంటే నన్ను అర్ధం చేసుకోవడం కష్టం కాదు

పొరుగింటి గోడలు శుభ్రంగాలేవని విమర్శించడం కాదు. నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకో
నా మాటలు అర్ధం చేసుకుంటే నన్ను అర్ధం చేసుకోవడం కష్టం కాదు

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...