Friday, October 25, 2013

నాగులచవితి విశిష్ఠత

నాగులచవితి విశిష్ఠత

నాగుల చవితి - కార్తీకశుద్ద చతుర్దశి నాడు - దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం . అలా నాగ మహిమతో పుటిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం.

ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.

ఈ రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి ఈ పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.

నాగులచవితి పాటలు కూడా మన తెలుగువారిలో ఎంతో ప్రసిద్ధం:

నన్నేలు నాగన్న , నాకులమునేలు ,
నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు .
పడగ తొక్కిన పగవాడనుకోకు ,
నడుము తొక్కిన నావాడనుకొనుము .
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .
ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము.పిల్లల మూకను నాకిమ్ము .

అని పుట్టలో పాలు పోస్తూ , నూక వేసి వేడుకుంటారు .అలాగే,

పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....

అంటూ తాము పోసిన పాలు నాగేంద్రుడు తాగితే, తమ మనసులోని కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం.

ఆలయాలలో నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున తిరుమలలో కోనేటిరాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. అలాగే గురువారం వాహన సేవకు ఆరోజంతా వుపవాసముండి మరునాడు పారాయణ చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువులకాపరి కూడా ప్రభువు అవుతాడంటారు !

కాని పాములకు పుట్టలో పాలు పోయడం వల్ల వాటి ప్రాణాలకు హాని అని,అందుకని వాటి సహజ నివాసములలో పాలూ, గుడ్లూ వెయ్యొద్దని చెప్తున్నారు. దానికి బదులు ఇళ్ళలోనే బియ్యం పిండితో నాగ మూర్తులను చేసి, వాటికి శాస్త్రోక్తంగా అన్నీ సమర్పించవచ్చు.

ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. నాగుపాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకుంటే అంతకన్నా గొప్ప పూజ ఇంకొకటి ఉంటుందా?

తేగలు అంటే చాలా మందికి చిన్నచూపు కానీ వీటిలో పీచుపదార్ధము మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది .ప్రకృతి మనకు అందించిన మంచి ఆహారము తేగ .

      ఇట్లు

   మీ సుబ్రహ్మణ్యం శర్మ

 

పంచలోకపాలక పూజ

ఆచమ్య, పూర్వోక్తెవంగుణ విశేషణ విషిష్ఠాయాం శుభతిథౌ, శ్రీ సత్యనారాయణ వ్రతాంగత్వేన గణపత్యాదిపంచలోక పాలకపూజాం,ఆదిత్యాది నవగ్రహపూజాం, ఇంద్రాద్యష్టదిక్పాలకపూజాం చ కరిష్యే.

1. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం,జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్పత ఆ న శ్శృణ్వ న్నూతిభిస్సీదసాదనమ్. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం గణపతిం లోక పాలక మావాహయామి, స్థాపయామి,పుజయామి.

2. ఓం బ్రహ్మదేవానాం,పదవీః కవీనా మృషి ర్విప్రాణాం మహిషో మృగాణాం, శ్వేనో గృధ్రాణాగం స్వధితిర్వనానాగం సోమః పవిత్ర మత్యేతి రేభన్, సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బ్రహ్మాణం లోక పాలక మావాహయామి, స్థాపయామి,పుజయామి.

3. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేథా నిదధే పదం, సమూఢ మస్యపాగం సురే. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం విష్ణుం లోక పాలక మావాహయామి, స్థాపయామి, పుజయామి.

4. ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీడుష్టమాయ తవ్యసే, వోచేమ శంతమగం హృదే, సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం రుద్రం లోక పాలక మావాహయామి, స్థాపయామి, పుజయామి.

5. ఓం గౌరీ మిమాయ సలిలాని తక్ష త్యేకపదీ ద్విపదీ సాచతుష్పదీ, అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమేవ్యోమన్. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం గౌరీం లోక పాలిక మావాహయామి, స్థాపయామి,పుజయామి.

గణేశాది పంచలోకపాలక దేవతాభ్యోనమః, ద్యాయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూప మఘ్రాపయామి,దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి.

గణేశాది పంచలోకపాలక దేవతాప్రసాద సిద్ధిరస్తు.

ఇట్లు 
మీ సుబ్రహ్మణ్యం శర్మ

 

నవగ్రహ పూజ


సూర్య

అసత్యేనేత్యస్య మంత్రస్య హిరణ్యస్తూప ఋషిః సవితా దేవతా, త్రిష్టు ప్ఛంద, యజమానస్య ధిదేవతాప్రత్యధి దేవతా సహిత సూర్యగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే సూర్యగ్రహా రాధనే వినియోగః

శ్లో//వేదీ మధ్యే లలితకమలే కర్ణికాయాం రథస్థ
స్సప్తాశ్వోర్కోరుణరుచివపుస్సప్తరజ్ఞు ర్ధ్విబాహుః
గోత్రే రమ్యే బహువిధగుణే కాశ్యపాఖ్యే ప్రసూతః
కాళింగాఖ్యే విషయజనితః ప్రాజ్ముఖః పద్మహస్తః

శ్లో//పద్మాసనః పదమకరో ద్విబాహుః
పద్మద్యుతి స్సప్తతురంగవాహః
దివాకరో లోకవపుః కిరీటిః
మయి ప్రసాదం విధదాతు దేవః

మం. అసత్యేన రజసా వర్తమానో, నివేశయన్న మృతం మర్త్యం చ,

హిరణ్యేన సవితా రథేనా దేవో యాతి భువనాని పశ్యన్ . ఓం భూర్భువస్సువః సూర్యగ్ర హేహాగచ్ఛ, సూర్యగ్రహం, రక్తవర్ణం, రక్త గంధం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరధరం, రక్తచ్ఛత్ర ధ్వజపతకాది శోభితం, దివ్యరథసమారూఢాం, మేరుం ప్రదక్షిణీకుర్వాణం, ప్రాజ్ముఖం, పద్మాసనస్థం,ద్విభుజం, సుప్తాశ్వం, సప్తరజ్జుం, కళింగ దేశాధిపతిం, కాశ్యపగోత్రం, ప్రభవసంవత్సరే మాఘమాసే శుక్లపక్షే, సప్తమ్యాం, భానువాసరే అశ్వినీనక్షత్ర జాతం, సింహరాశ్యధిపతిం, కిరీటినం, సుఖాసీనం, పత్నీపుత్రపరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మి న్నదికరణే వర్తులాకారమండలే స్థాపయామి పూజయామి.

మం. ఓం అగ్నిం దూతం వృణీమహే, హోతారం విశ్వవేదసం, అస్యయజ్ఞస్య సుక్రతుమ్. సూర్యగ్రహాధిదేవతాం అగ్నిం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం సూర్యగ్రహస్య దక్షిణతః అగ్ని మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం కద్రుదాయ ప్రచేతసే మీధుష్టమాయ తవ్యసే, వోచేమ శంతమగం హృదే. సూర్యగ్రహ ప్రత్యధిదేవతాం రుద్రం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం సూర్యగ్రహస్య ఉత్తరతః రుద్ర మావాహయామి, స్థాపయామి, పూజయామి.

చంద్ర

ఆప్యాయ స్వేతస్య మంత్రస్య గౌతమఋషిః చంద్రో దేవతా గాయత్రీ ఛంద, యజమానస్యాధిదేవతాప్రత్యధిదేవతాసహిత చంద్రగ్రహప్రసాదసిద్ధ్యర్థ్యే చందరగ్రహారాధనే వినియోగః .

శ్లో//ఆగ్నేయభాగే సరథోదశాశ్వశ్చాత్రేయజో యామునదేశజశ్చ,
ప్రత్యజ్ముఖస్థ శ్చతురశ్రపీఠే గదాధరాంగో హిమవత్స్యభావః
శ్వేతాంబర శ్శ్వేత్వపుః కిరీటి, శ్వేతద్యుతి ర్దండధరో ద్విబాహుః
చంద్రో మృతాత్మా వరదః కిరిటీ , శ్రేయాంసి మహ్యం విదధాతు దేవః

ఓం అప్యాయస్వ సమేతు తే విశ్వత స్సోమవృష్ణియం, భవవాజస్య సంగధే, ఓం భూర్భువస్సువః చంద్రగ్రహేహా గచ్ఛ. చంద్రగ్రహం, శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వేతపుష్పం, శ్వేతమాల్యాంబరధరం, శ్వేతచ్ఛత్ర ద్వజపతాకాదిశోభితం, దివ్యరథసమారూఢం, మేరుం ప్రదక్షిణీ కుర్వాణం దశాశ్వరథవాహనం , ప్రత్యజ్ముఖం, ద్విభుజం దండధరం, యామునదేశాధిపతిం, కిరీటినం సుఖాసీనం, పత్నీపుత్రపరివారసమేతం, గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధి కరణే సూర్యగ్రహస్యాగ్నేయదిగ్భాగే, సమచతురశ్రమండలే స్థాపిత రజతప్రతిమారూపేణ చంద్రగ్రహ మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం అప్సు మే సోమో అబ్రవీ దంతర్విశ్వాని భేషజ, అగ్నించ విశ్వశంభువ మాపశ్చ విశ్వభేషజీః చంద్రగ్రహాధి దేవతాః సాంగాః సాయుధాః సవాహనాః సశక్తీః పుత్రపరివారసమేతాః చంద్రగ్రహస్య దక్షిణతః అపః మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం గౌరీ మిమాయ సలిలాని తక్ష త్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ, అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమేవ్యోమన్. చంద్రగ్రహ ప్రత్యధి దేవతాం, సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పుత్రపరివారసమేతం చంద్రగ్రహస్యోత్తరతః గౌరీ మావాహయామి, స్థాపయామి, పూజయామి.

అంగారక

అగ్నిర్మూర్థేత్యస్య మంత్రస్య విరూప ఋషిః అంగారక గ్రహో దేవతా, త్రిష్టు ప్ఛందః, యజమానస్య ధిదేవతాప్రత్యధి దేవతా సహితాంగారక గరహ ప్రసాద సిద్ధ్యర్థే అంగారకగ్రహారాధనే వినియోగః

శ్లో//యామ్యే గదాశ్కతి ధరష్చ శూలీ ప్వరప్రదో యామ్యుముఖో తిరక్తః
కుజ స్త్వనంతీవిషయ స్త్రికోణ స్తస్మిన్ భరద్వాజకులే ప్రసూతః
రక్తాంబరో రక్తవవుః కిరీటి చతుర్భుజో మేషగమో గదాభృత్,
ధరాసుత శ్శక్తిధరశ్చ శూలీ సదా మమ స్యా ద్వరదః ప్రశాంతః

ఓం అగ్ని ర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా ఆయం,అపాగం రేతాగంసిజిన్వతి, ఓం భూర్భువస్సువః అంగారకగ్ర హేహాగచ్ఛ, అంగారకగ్రహం, రక్తవర్ణం, రక్త గంధం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరధరం, రక్తచ్ఛత్ర ధ్వజపతకాది శోభితం, దివ్యరథసమారూఢాం, మేరుం ప్రదక్షిణీకుర్వాణం,మేషవాహనం, దక్షిణాభిముఖం, చతుర్భుజం, గదాశులశక్తిధరం, అవంతీ దేశాధిపతిం, భారద్వాజసగోత్రం, రాక్షసనామసంవత్సరే ఆషాడమాసే శుక్లపక్షే దశమ్యాం భౌమవాసరే అనూరాధానక్షత్రజాతం, మేష వృష్చిక రాశ్యాధిపతిం, కిరీటినం, సుఖాసీనం, పత్నీపుత్రపరివారసమేతం, గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే, సూర్యగ్రహస్య దక్షిణదిగ్భాగే త్రికోణకారమండలే స్థాపితతామ్ర ప్రతిమారూపేణ అంగారకగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓం స్యోనా పృథివి భవా నృక్షరా నివెశినీ, యచ్చాన శ్శర్మ సప్రధాః, అంగారక గ్రహస్య దక్షిణతః పృథివీ దక్షిణతః పృథివీ మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓమ్ క్షేత్రస్య పతినా వయుగం. హితం నేవ జయామసి, గా మశ్వం పోషయిత్న్వా సనోమృడాతీదృశే, అంగారకగ్రహప్రత్యధిదేవతాం, క్షేత్రపాలకం, సాంగం సాయుధం, సవాహనం, సశక్తిం, పత్నీపుత్రపరివారసమేతం, అంగారక గ్రహస్యోత్తరతః క్షేత్రపాలక మావాహయామి స్థాపయామి పుజయామి.

బుధ

ఉహ్బుధ్యస్వే త్యస్య మంత్రస్య, ప్రస్కణ్వ ఋషిః, బుధగ్రహో దేవతా, త్రిష్టుప్ఛందః యజమానస్యాధిదేవతా, ప్రత్యధిదేవతాసహిత బుధగ్రహప్రసాదసిద్యర్థే బుధగ్రహారాధనే వినియోగః .

శ్లో//ఉడజ్ముఖో మాగధదెశజాత శ్చాత్రేయగోత్ర శ్శరమండలస్థః
సఖడ్గ చర్మోరుగదాధరోజ్ఞ స్త్ర్యీశానభాగే వరదస్సు పీతః
పీతాంబర పీతవపుః కిరిటీ చతుర్భుజో దండ ధరశ్చ సౌమ్యః
చర్మాసిధృక్సోమసుత్ స్సుమెరు స్సింహాధిరుఢో వరదో బుధశ్చ

ఓం ఉద్యుధ్య స్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టాపూర్తే సగం సృజాథామ యంచ, పునః కృణ్వగ్గ్ స్త్యాపితరం యువాన మన్వాతాగంసీ త్వయి తంతు మేతం , ఓం భూ ర్భువ స్సువః బుధగ్రహేహాగచ్చః బుధగ్రహం, పీతవర్ణం,పీతగంధం, పీతపుష్పం,పీతమాల్యాంబరధరం, పీతచ్ఛత్ర ధ్వజపతకాడి శోభితం, దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణికుర్వాణం సింహవాహనం, ఉదజ్ముఖం, మగధదేశాధిపతిం, చతుర్భుజం, ఖడ్గచర్మాంబరధరం ఆత్రేయసగోత్రం, అంగీరసనామసంవత్సరే మార్గశిరమాసే శుక్లపక్షే సప్తమ్యాం సౌమ్యవాసరే పూర్వాభాద్రానక్షత్రజాతం, మిథునకన్యా రాశ్యాధిపతిం కిరీటినం, సుఖాసీనం, పత్నీపుత్రపరివారసమేతం, గ్రహమండలే ప్రవిష్టమస్మి న్నధికరణే సూర్యగ్రహస్య ఈశాన్యదిగ్భాగే బాణాకారమండలే, స్థాపితకాంస్యప్రతిఅమా రూపేణ బుధగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓం ఇదం విష్ణు ర్విచక్రమే, త్రేధా నిదధే పదం - సమూఢ ముస్యపాగంసురే, బుధగ్రహాధిదేవతాం, విష్ణుం, సాంగాం, సాయుధం, సవాహనం, సశక్తిం, పత్నీపుత్రపరివారసమేతం, బుధగ్రహస్య దక్షిణతః విష్ణు మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓమ్ సహస్రశీర్షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్, స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ఠద్దశాంగులమ్, బుదగ్రహప్రత్యధిదేవతాం నారాయణం, సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బుధగ్రహస్యోత్తరతః నారాయణ మావాహయామి, స్థాపయామి, పూజయామి.

బృహస్పతి

బృహస్పతే అతియదర్యేత్యస్య మంత్రస్య, గృత్స్నమదఋషిః, బృహస్పతి గ్రహోదేవతా, త్రిష్టుప్ఛందః, యజమానస్య అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బృహస్పతి గ్రహప్రసాదసిద్యర్థే బృహస్పతి గ్రహారాధనే వినియోగః

శ్లో//సౌమ్యే సుదీర్ఘే చతురశ్రపీఠే రథేజ్గరాః పూర్వముఖస్వభావః
దండాక్షమా లాజలపాత్రదారీ సింధాఖ్యదేశే వరద స్సుజీవః
పీతాంబరః పీతవపుః కిరీటి చతుర్భుజో దేవగురుః ప్రశాంతః
తథాసిదండం చ కమండలుం చ తథాక్ష సూత్రం వరదో స్తు మహ్యమ్.

ఓమ్ బృహస్పతె అతియదర్యో అర్హాద్యుమద్విభాతిక్రతుమజ్జనేషు, యద్దీదయచ్చవసర్త ప్రజాత తదస్మాను ద్రవిణం ధేహి చిత్రమ్ / ఓం భూ ర్భువ స్సువః బృహస్పతి గ్రహేహగచ్ఛ, బృహస్పతి గ్రహం, పీతవర్ణం,పీతగంధం, పీతపుష్పం,పీతమాల్యాంబరధరం, పీతచ్ఛత్ర ధ్వజపతకాడి శోభితం, దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణికుర్వాణం , పూర్వాభిముఖం,పద్మాసనస్థం, చతుర్భుజం, దండాక్షమాలా ధారిణిం, సింధు ద్వీపదేశాధిపతిం, అంగీరసగోత్రం, అంగీరసనామసంవత్సరే వైశాఖ మాసే శుక్లపక్షే ఏకాదశ్యాం గురువాసరే ఉత్తరా నక్షత్రజాతం, ధనుర్శీనరాశ్యధిపతిం, కిరీటినం, సుఖాసీనం, పత్నీపుత్ర పరివారసమేతం, గ్రహమండలే ప్రవిష్టమస్మి న్నదికరణే సూర్యగ్రహస్యోత్తరదిగ్భాగే దీర్ఘచతురస్రమండలే స్థాపిత త్రపుప్రతిమా రూపేణ బృహస్పతిగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తా ద్విసీమత స్సురచో వేన ఆవః, సబుధ్నియా ఉపమా అస్యవిష్టా స్సతశ్చ యోని మసత శ్చ వివః, బృహస్పతి గ్రహాధి దేవతాం బ్రహ్మాణం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బృహస్పతిగ్రహస్య దక్షిణతః బ్రహ్మణ మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం ఇంద్రం వో విశ్వత స్పరి హవామహే జనేభ్యః, అస్మాక మస్తు కేవలః, బృహస్పతి గ్రహ ప్రత్యధిదేవతాం, ఇంద్రం, సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బృహస్పతిగ్రహస్య ఉత్తరతః ఇంద్ర మావాహయామి, స్థాపయామి, పూజయామి.

శుక్ర

శుక్రం తే అన్యదిత్యస్య మంత్రస్య, భరద్వాజ ఋషిః, శుక్రగ్రహో దేవతా, త్రిష్టుప్చందః, యజమానస్యాధిదేవతాప్రత్యధిదేవతా సహితశుక్రగ్రహ ప్రసాదసిద్యర్థే శుక్రగ్రహారాధనే వినియోగః .

శ్లో//ప్రాచ్యాం భృగు ర్భోజకటప్రదేశ స్స భార్గవః పూర్వముఖ స్వభావః
స పంచకోణేశ రథాధిరూఢో దండాక్ష మాలా వరదోంబు పాత్రః
శ్వేతాంబరః శ్వేతవపుః కిరీటి చతుర్భుజో దైత్యగురుః ప్రశాంతః
తథాసిదండం చ కమండలుం చ తథాక్షసూత్రం వరదో స్తు మహ్యమ్

ఓం శుక్రం తే అన్య ద్యజతం తే అన్య ద్విషురూపే అహనీ ద్యౌరివాసి, విశ్వా హి మాయా అవసి స్వధా వో భద్రా తే పూష న్నిహ రాతి రస్తు. ఓం భూ ర్భువ స్సువః శుక్ర గ్రహేహచ్చ, శుక్రగ్రహం, శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వెతపుష్పం, శ్వెతమాల్యాంబరధరం, శ్వేతచ్ఛత్రధ్వజపతకాదిశోభితం, దివ్యరథసమారూఢం, మేరుం ప్రదక్షిణీ కుర్వాణం, పూర్వాభిముఖం, పద్మాసనస్థం, చతుర్భుజం, దండాక్షమాలా జటావల్కలదారిణం, కాంభోజ దేశాదిపతిం భార్గవసగోత్రం, పార్థివసంవత్సరే శ్రావణమాసే శుక్లపక్షే అష్టమ్యాం భృగువాసరే, స్వాతీ నక్షత్రజాతం తులా వృషభరాశ్యాధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్రపరివారసమేతం, గరహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే సూర్యగ్రహస్యప్రాగ్భాగే పంచకోణాకార మండలె స్థాపిత సీస ప్రతిమారూపేణ శుక్రగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓమ్ ఇంధ్రాణీ మాసు నారిషు సుపత్నీ మహ మశ్రవం,నహ్యస్యా అపరం చ న జరసా మరతే పతిః. శుక్రగ్రహాధిదేవతా మింద్రాణీం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శుక్రగ్రహస్య దక్షిణతః ఇంద్రాణీ మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం ఇంద్ర మరుత్వ ఇహ పాహి సోమం యథా శార్యాతే అపిబస్సుతస్య, తవ ప్రణీతీ తవ శూర శర్మన్నా వివాసంతి కవయ స్సుయజ్ఞాః . శుక్రగ్రహ ప్రత్య్ధిదేవతాం ఇంద్రమరుత్వంతం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శుక్రగ్రహస్య ఉత్తరతః ఇంద్రమరుత్వంత మావాహయామి, స్థాపయామి, పూజయామి.

శనైశ్చర

శమగ్ని రగ్నిభి రిత్యస్య మంత్రస్య, ఇళింబిషిఋషిః, శనైశ్చరగ్రహో దేవతా, ఉష్ణిక్ఛందః, యజమానస్యాధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శనైశ్చరగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే శనైశ్చర గ్రహారాధనే వినియోగః .

శ్లో//చాపసానో గృధ్రరథ స్సువీలః ప్రత్యుజ్ముఖః కాశ్యపజఝ్ ప్రతీచ్యాం
సశూలచాపేషువరప్రదశ్చ సౌరాష్ట్రదేశే ప్రభవశ్చ సౌరీ
నీలద్యుతి ర్నీలవపుః కిరీటీ గృధ్రస్థితి శ్చాపకరో ధనుష్మాన్
చతుర్భుజ స్సూర్యసుతః ప్రశాంత స్సచాస్తు మహ్యం వరమందగామీ.

ఓం శమగ్ని రగ్నిభి స్కర చ్ఛన్న స్తపతు సూర్యః, శంవాతో వా త్వరపా అపశ్రిధః, ఓమ్ భూ ర్భువ స్సువః, శనైశ్చర గ్రహేహచ్ఛ, శనైశ్చరగ్రహం, నీలవర్ణం, నీలగందం, నీలపుష్పం, నీలమాల్యాంబరధరం, నీలచ్ఛత్రధ్వజపతాకాదిశోభితం, దివ్యరథసమారూఢం,మేరుం ప్రదక్షిణీ కుర్వాణం, చాపాసనస్థం, ప్రత్యజ్ముఖం, గృధ్రరథం, చతుర్భుజం శూలాయుధధరం, సౌరాSట్రదేశాధిపతిం, కాశ్యపసగోత్రం, విభవనామసంవత్సరే, పౌష్యమాసే శుక్లపక్షే, నవామ్యం స్థిరవాసరే భరణీనక్షత్రజాతం మకరకుంభరాశయాధిపతిం, కిరీటినం, సుఖాసీనం, పత్నీపుత్రపరివారసమేతం, గ్రహమండలే ప్రవిష్ట మస్మి న్నదికరణే సూర్యగ్రహస్య పశ్చిమదిగ్భాగే ధునురాకాం మండలే స్థాపితాయః ప్రతిరూపేణ శనైశ్చరగరహ మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓం యమామ సోమగం సునుత యమాయ జుహుతా హవిః, యమగం హ యజ్ఞోగచ్చ త్యగ్నిదూతో అరం కృతః . శనైశ్చర్య గ్రహాధిదేవతాం యమం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శనైశ్చరగ్రహస్య దక్షిణతః యమ మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం ప్రజాపతే న త్వదేతా న్యన్యో విశ్వాజాతాని పరి తా బభూవ, యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయుగ్గ్ స్యామ పతయో రయీణామ్. శనైశ్చర గ్రహప్రత్యధి దేవతాం ప్రజాపతిం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శనైశ్చరగ్రహస్యోత్తరతః ప్రజాపతి మావాహయామి, స్థాపయామి, పూజయామి.

రాహు

కయానిశ్చిత్రేత్యస్య మంత్రస్య, వామదేవ ఋషిః రాహుగ్రహో దేవతా, గాయత్రీ చ్ఛందః యజమానస్యాధి దేవతా ప్రత్యధి దేవతా సహిత రాహుగ్రహప్రసాదసిద్యర్థే రాహుగ్రహారాధనే వినియోగః .

శ్లో//పైఠీనసో బర్బరదేశజాత శ్శూర్పాసన స్సింహగత స్వభావః
యామ్యాననో నైర్ ఋతిది క్కరాళో వరప్రద శ్శూల సచర్మఖడ్గః
నీలాంబరో నీలవవుః కిరీటీ కరాళవక్త్రః కరవాలశూలీ
చతుర్భుజ శ్చర్మదరశ్చ రాహుస్సింహాధిరూఢో వరదో స్తు మహ్యమ్.

ఓం కయాన శ్చిత్ర అభువ దూతీ సదా వృఢఃఅ స్సఖా, కయా శచిష్ఠయావృతా. ఓం భూ ర్భువ స్సువః రాహుగ్రహేహాగచ్ఛ, రాహుగ్రహం, నీలవర్ణం, నీలగందం, నీలపుష్పం, నీలమాల్యాంబరధరం, నీలచ్ఛత్రధ్వజపతాకాదిశోభితం, దివ్యరథసమారూఢం,మేరుం ప్రదక్షిణీ కుర్వాణం, నైర్ ఋతి ముఖం, శూర్పాసనస్థం చతుర్భుజం కరాళవక్త్రం ఖడ్గచర్మధరం పైఠీనసగోత్రం బర్బరదేశాదిపతిం రాక్షసనామసంవత్సరే భాద్రపదమాసే కృష్ణపక్షే చతుర్డశ్యాం భానువాసరే విశాఖా నక్షత్రజాతం సింహరాశ్యాధిపతిం కిరీటినం సుఖాసీనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం గరహమండలే ప్రవిష్ట మస్మి న్నదికరణే సూర్యగ్రహస్య నైర్ ఋతిదిగ్బాగే శూర్పాకార మండలే స్థాపిత లోహప్రతిమారూపేణ రాహుగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓం ఆయుం గౌః పృశ్ని రక్రమీ దసద న్మాతరం పునః, పితరం చ ప్రియంత్సువః, రాహు గ్రహాధిదేవతాం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం రాహుగ్రహస్య దక్షిణతః గా మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం నమో అస్తు సర్పేభ్యో యే కేచ పృథివీ మను, యేంతరిక్షేయే దివి తేభ్య స్సర్పేభ్యో నమః . రాహుగ్రహప్రత్యాధిదేవతా సాంగాన్ సాయుధాన్ సవాహనాన్ సశక్తి పత్నీపుత్రపరివారసమేతాన్ రాహుగ్రహస్య ఉత్తరతః సర్పా నావాహయామి, స్థాపయామి, పూజయామి.

కేతు

కేతుం కృణవన్నిత్యస్య మంత్రస్య, మధుచ్ఛంద ఋషిః కేతుగణో దేవతా గాయత్రీ చ్ఛందః, యజమానస్యాధిదేవతా ప్రత్యధిదేవతాసహిత కేతుగణప్రసాద సిద్ద్యర్థే కేతుగణారాధనే వినియోగః .

శ్లో//ధ్వజాసనో జైమిని గోత్రజోంర్వేదేషు దేశేషు విచిత్రవర్ణః
యామ్యాననో వాయుదిషః ప్రఖడ్గచర్మాసిభి శ్చాష్టసుతశ్చ కేతుః
ధూమ్రో ద్విబాహు ర్వరదో గదాభృద్గృద్రాసనస్థో వికృతాననశ్చ
కిరీటకేయూర విభూష్తాంగ స్సచాస్తు మె కేతుగణః ప్రశాంతః

ఓం కేతుం కృణ్వ న్నకేతవే పేషో మర్యా అపేషసే, సముషద్భి రజాయథాః, ఓం భూ ర్భువ స్సువః కేతుగణేహాగచ్ఛ . కేతుగణం చిత్రవర్ణం చిత్రగంధం, చిత్రపుష్పం, చిత్రమాల్యాంబరధరం, చిత్రచ్ఛత్రధ్వజపతకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుమ ప్రదక్షిణీ కుర్వాణం ధ్వజాసనస్థం దక్షిణాభిముఖం అంతర్వేది దేశాధిపతిం ద్విబాహు గదాధారం జైమిని గోత్రం రాక్షసనామ సంవత్సరే చైత్రమాసే కృష్ణపక్షే చతుర్దశ్యా మిందువాసరే రేవతీనక్షత్రజాతం కర్కాటక రాశ్యాధిపతిం సింహాసనాసీనం గ్రహమండలే ప్రవిష్ట మస్మి న్నధికరణే సూర్యగ్రహస్య వాయువ్యదిగ్బాగే ధ్వజాకార మండలే స్థాపిత పంచలోహప్రతిమా రూపేణ కేతుగుణ మావాహయామి స్థాపయామి, పూజయామి.

ఓం సచితచిత్రం చితయంత మస్మే చిత్రక్షత చిత్రతమం వయీఓధాం,చంద్రం రయిం పురువీరం బృహంతం చంద్ర చంద్రాభిర్గృణతే దువస్వ.కెతుగణాధిదేవతాం చిత్రగుప్తం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం కేతుగణస్య దక్షిణతః చిత్రగుపత మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం బ్రహ్మదేవానాం పదవీః కవీనా మృషి ర్విప్రాణాం మహిషో మృగాణాం, శ్యేనో గృధ్రాణాగం స్వధితి ర్వనానాగం సోమః పవిత్ర మత్యేతి రేభన్.కేతుగణప్రత్యధిదేవతాం బ్రహ్మణం సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం కేతుగణస్యోత్తరతః బ్రహ్మాణ మావాహయామి, స్థాపయామి, పూజయామి.

అధిదేవతా ప్రత్యధిదేవతాసహితాదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః, ద్యాయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమ్ర్పయామి,పాద్యం సమ్ర్పయామి, అర్ఘ్యం సమ్ర్పయామి, ఆచమనీయం సమ్ర్పయామి, స్నానం సమ్ర్పయామి, శుద్దాచమనీయం సమ్ర్పయామి, వస్త్రం సమ్ర్పయామి, యజ్ఞోపవీతం సమ్ర్పయామి, గంధం సమ్ర్పయామి,అక్షతాన్ సమ్ర్పయామి, పుష్పాణి సమ్ర్పయామి, ధూప మాఘ్రాపయామి,దీపం దర్శయామి,నైవేద్యం సమ్ర్పయామి, తాంబూలం సమ్ర్పయామి, మంత్రపుష్పం సమ్ర్పయామి.

అధిదేవతా ప్రత్యధిదేవతాసహితాదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాదసిద్ధి రస్తు. 

ఇట్లు 
మీ సుబ్రహ్మణ్యం శర్మ

 

 

దీపావళి

సంబరాల దీపావళి

"చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి... " అని తెలుగు సినిమా కవి రాసింది ఎంత నిజం

ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి, సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.

దీపావళినాడు నూనెలో ( ముఖ్యంగా నువ్వులనూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది, గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది, నరక భయం ఉండదనేది పురాణాలు చెపుతున్నాయి.

అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. 'యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టి చెంది ఆశీర్వదిస్తారు.

స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇళ్ళ ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి, సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన, రుచికరమైన భక్ష్యభోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్దం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఆ రోజంతా ఎక్కడలేని హడావుడి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాంటాయి.

దిబ్బు దిబ్బు దీపావళి

దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...

అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయంగా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత, కాళ్ళు కడుక్కుని, ఇంటిలోపలకు వచ్చి, తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.

పర్యావరణానికి హాని కలగకుండా దీపావళి :

ఈ పండుగ సంబరాలు మన సంస్కృతిలో ఒక భాగం. కాబట్టి పండుగను ఎలా జరుపుకోవాలనేది వారి వారి వ్యక్తిగత యిష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత తరుణంలో ఇలాగే జరుపుకోవాలి అని చెప్పాల్సి వస్తోంది. ఒకప్పుడు పర్యావరణ సమస్యలు తీవ్రంగా లేనప్పుడు పండుగ ఎలా జరుపుకున్నా జరిగిపోయేది. అసలు అప్పట్లో ఇప్పటిలా టపాసులు పెద్ద ఎత్తున కాల్చేవారం కాదు. కొత్తబట్టలు వేసుకొని, పిండివంటలు చేసుకొని ఆటలు పాటలతో, మట్టిదీపాలతో అలంకరించుకుని, దివిటీలు తిప్పుతూ పండుగను జరుపుకునేవారు. ఇవి ప్రకృతికి పెద్దగా నష్టం కలిగించేవి కావు. కానీ, నేటి మన జీవన విధానం, పండుగలు చేసుకునే తీరు ప్రకృతి వనరులపై ఎనలేని భారాలను మోపుతున్నాయి. పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతున్నాయి. భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. ఫలితంగా వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. తీవ్ర వర్షాభావం, అదే తీవ్ర స్థాయిలో వరదలు ఒకే సంవత్సరం చూడగలుగుతున్నారు. అందువల్ల కొనసాగు తున్న మన జీవన విధానాన్ని, పండుగలు చేసుకునే తీరును ప్రకృతికి నష్టం కలిగించని రీతిలో మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పండుగ చేసుకునే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రకృతిపరంగా ఎక్కువ నష్టం జరగకుండా చూద్దాం. ఆటపాటలతో, దీపాలు వెలిగించి, పిండివంటలు చేసుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపు కుందాం. ఇదే మనం ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ దీపావళి పండుగను చేసుకోవడం. 

దీపావళి విశిష్టత దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నూతన వస్త్రాల సోయగాలు, పిండివంటల ఘుమఘుమలు, దీపాల తళుకులు, బాణ సంచా కోలాహలాలు, అంతా కలిపితే దీపావళి సంబరాలు.

 // దీపం జ్యోతి పరబ్రహ్మమ్
దీపం సర్వతమోహరమ్
దీపేన సాధ్యతే సర్వమ్
సంధ్యా దీపం నమామ్యహమ్ // 

 ఈ నాలుగు రోజుల పండుగ, ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు మొదలయి కార్తిక శుద్ధ విదియ నాడు ముగుస్తుంది. మొదటి రోజు - నరక చతుర్దశి: ఆశ్వయుజ బహుళ చతుర్దశి - నరక చతుర్దశి. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా, మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. నరకాసురుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. అప్పటికి నరకాసురుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో నరకుడి శరాఘాతాలకు కృష్ణుడు సొమ్మసిల్లినట్లు నటిస్తాడు. అప్పుడు భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. రెండవ రోజు – దీపావళి: నరకుని మరణానికి సంతోషంతో మర్నాడు అమావాస్య చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి పండుగ జరుపుకోవడం, అదే దీపావళి పండుగగా ప్రసిద్ది చెందడం జరిగాయి. దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీపలక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దివ్వెల పండుగ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలలో క్రింది విధంగా చెప్పబడింది. 

తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!.

 దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. క్షీర సాగర మధనంలో నుండి లక్ష్మి దేవి ఈ రోజున ఉద్భవించింది అని ఒక నమ్మకం ఉంది. ఇంకొక కధనం ప్రకారం, శ్రీ మహా విష్ణువు వామనావతారం ధరించి, బలి చకవర్తిని మూడు అడుగుల భూమి అడిగినప్పుడు, రెండు అడుగులలో అతడు భూమి, ఆకాశములను ఆక్రమిస్తాడు. మూడవ అడుగుకు బలి తన శిరస్సును చూపించగా, వామనుడు త్రివిక్రముడై, అతడిని పాతాళానికి తొక్కేస్తాడు. కాని బలి దాతృత్వానికి మెచ్చి పాతాళంలో అతని కోటకు రక్షకుడుగా నిలుస్తాడు, పతి వియోగంలో ఉన్న లక్ష్మిని స్వాంతన పరచుటకు, బ్రహ్మ, మహేశ్వరులు తాము రక్షకులుగా ఉండి, విష్ణువును విడుదల చేస్తారు. ఆ విధంగా అమావాస్య నాడు స్వామి శ్రీదేవిని చేరడంతో ఆమె సంతోషంతో అందరికి కోరిన వరాలు ప్రసాదిస్తుంది అని నమ్మకం. మూడవ రోజు - బలి పాడ్యమి: విష్ణుమూర్తి ఇచ్చిన వరంతో ఈ రోజు బలి చక్రవర్తి పాతాళలోకం వదలి భూలోకాన్ని పాలిస్తాడు.

 నాలుగవ రోజు - యమ ద్వితీయ: ఈ దినం యమధర్మరాజు తన సోదరి యమి ఇంటికి వెళ్ళడం విశేషంగా యమద్వితీయ చెప్తారు.

ఇట్లు 
మీ సుబ్రహ్మణ్యం శర్మ
 

యజ్ఞోపవీత ధారణ



గణపతి ప్రార్ధన

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.
గణాణాంత్వ గణపతి కుంభవా మహే కవింక వీనా ముప మశ్ర వస్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనుశ్రుణ్వన్ ఊతిభి సీధసాధనం .శ్రీ మహాగణాధిపతయే నమ:
ఆచమ్య!!
ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (ఆచమనం)
ఓం గోవిందాయ నమ: , ఓం విష్ణవే నమ: (అర చేతులు కడుక్కోవాలి)
ఓం మధుసూధనాయ నమ: , ఓం త్రివిక్రమాయ నమ: (బ్రొటన వేళితో పెదవులు తుడుచుకోవాలి)
ఓం వామనాయ నమ: , ఓం శ్రీధరాయ నమ: (నెత్తి మీద రెండు సార్లు నీరు చల్లుకోవాలి)
ఓం హృషీకేశాయ నమ: (ఎడమ చేతిపై నీరు చల్లుకోవాలి)
ఓం పద్మనాభాయ నమ: (పాదముల పై నీరు చల్లుకోవాలి)
ఓం దామోదరాయ నమ: (తల మీద నీరు చల్లుకోవలి)
ఓం సంకర్షణాయ నమ: (చేతులని గిన్నె వలె చేసి గడ్డమును తాకాలి)
ఓం వాసుదేవాయ నమ: , ఓం ప్రద్యుమ్నాయ నమ: (బ్రొటన,చూపుడువేళ్ళతో ముక్కు రంధ్రాలని)
ఓం అనిరుద్ధాయ నమ: , ఓం పురుషోత్తమాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో నేత్రాలని)
ఓం అధోక్షజాయ నమ: , ఓం నారశిం హాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో చెవులని)
ఓం అచ్యుతాయ నమ: (బ్రొటన,చిటికెన వేళ్ళతో నాభిని)
ఓం జనార్దనాయ నమ: (చేతితో వక్షస్థలాన్ని)
ఓం ఉపేంద్రాయ నమ: (కరాగ్రంతో తలని)
ఓం హరయే నమ: , ఓం శ్రీ కృష్ణాయ నమ: (హస్తములతో బాహువులని)

ప్రాణాయామం
---------------
(కుడి చేతి బ్రొటన వేళిని కుడి ముక్కు గోడకి,ఉంగరం వేళిని ఎడమ ముక్కు గోడకి తాకించి)
ఓం భూ: , ఓం భువ: , ఓగ్0 సువ: , ఓం మహ: , ఓం జన: , ఓం తప: , ఓగ్0 సత్యం , ఓం తత్సవితుర్వే--ణ్యం , భర్గో దేవస్య ధీమహి , ధియోయోన: ప్రచోదయా--త్ , ఓమాప: , జ్యోతీరస: ,అమృతం బ్రహ్మ , భూర్భువస్సువరోం--
సంకల్పము
మమ, ఉపాత్త , దురితక్షయ ద్వారా , శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం , శుభే, శోభనే , ముహూర్తే , శ్రీ మహావిష్ణో: , ఆజ్ఞయా, ప్రవర్తమానస్య, అద్య, బ్రహ్మణ: , ద్వితీయపరార్ధే , శ్వేతవరాహకల్పే , వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రధమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే , అస్మిన్ , వర్తమాన , వ్యావహారిక , చాంద్రమాన , శ్రీ____నామసంవత్సరే , ____ ఆయనే , ____ఋతౌ , ____మాసే , _____పక్షే , _____తిధౌ , ______వాసరే , శుభనక్షత్రే , శుభయోగే , శుభకరణ , ఏవంగుణ , విశేషణ , విశిష్టాయాం , శ్రీమాన్ కౌండన్యస గోత్ర: , రామయోగిశర్మ నామధేయ : , శ్రీమత: కౌండన్యస గోత్రస్య , రామయోగిశర్మ నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య , ఆయురారోగ్య , అఖండ ఐశ్వర్య , అభివృద్ధర్ధం , ధర్మార్ధ , కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం , సకల శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుస్ఠాన యోగ్యత సిద్ధ్యర్ధం,బ్రహ్మ తేజ: అభివృద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీతధారణం కరిష్యే అంటూ నీరు వదలాలి.

మూడు కొత్త యజ్ఞోపవీతాలిని నీటితోను,పసుపుతోను శుభ్రపరచాలి.

యజ్ఞోపవీతం ఇతి మంత్రస్య
పరబ్రహ్మ ఋషి:(కుడిచేతితో నుదుటిని తాకాలి)
తృష్ఠప్ ఛంద:(ముక్కు కింద తాకాలి)
పరమాత్మ దేవత:(హృదయాన్ని తాకాలి)
యజ్ఞోపవీతధారణే వినియోగ:
ఒకదాని తర్వాత ఒకటి ఈ మూడు యజ్ఞోపవీతాలిని ఈ క్రింది విధంగా చేస్తూ ధరంచాలి.
ధరించేటప్పుడు రెండు చేతులతో యజ్ఞోపవీతాన్ని పట్టుకుని,యజ్ఞోపవీతానికి ఉన్న ముడిని కుడి చేతితో పైకి ఉండేటట్లు(ఆకాశానికి చూపించేటట్లు)చేసి ఈ కింది ధారణ మంత్రాన్ని పఠిస్తూ మొదటి యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే: యత్ సహజం పురస్తాత్ !
ఆయుష్య మగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ: అంటూ మొదటి దాన్ని ధరించాలి.
ఆచమ్య!!
ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (ఆచమనం)
ఓం గోవిందాయ నమ: , ఓం విష్ణవే నమ: (అర చేతులు కడుక్కోవాలి)
ఓం మధుసూధనాయ నమ: , ఓం త్రివిక్రమాయ నమ: (బ్రొటన వేళితో పెదవులు తుడుచుకోవాలి)
ఓం వామనాయ నమ: , ఓం శ్రీధరాయ నమ: (నెత్తి మీద రెండు సార్లు నీరు చల్లుకోవాలి)
ఓం హృషీకేశాయ నమ: (ఎడమ చేతిపై నీరు చల్లుకోవాలి)
ఓం పద్మనాభాయ నమ: (పాదముల పై నీరు చల్లుకోవాలి)
ఓం దామోదరాయ నమ: (తల మీద నీరు చల్లుకోవలి)
ఓం సంకర్షణాయ నమ: (చేతులని గిన్నె వలె చేసి గడ్డమును తాకాలి)
ఓం వాసుదేవాయ నమ: , ఓం ప్రద్యుమ్నాయ నమ: (బ్రొటన,చూపుడు వేళ్ళతో ముక్కు రంధ్రాలని)
ఓం అనిరుద్ధాయ నమ: , ఓం పురుషోత్తమాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో నేత్రాలని)
ఓం అధోక్షజాయ నమ: , ఓం నారశిం హాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో చెవులని)
ఓం అచ్యుతాయ నమ: (బ్రొటన,చిటికెన వేళ్ళతో నాభిని)
ఓం జనార్దనాయ నమ: (చేతితో వక్షస్థలాన్ని)
ఓం ఉపేంద్రాయ నమ: (కరాగ్రంతో తలని)
ఓం హరయే నమ: , ఓం శ్రీ కృష్ణాయ నమ: (హస్తములతో బాహువులని)
(మళ్ళీ సంకల్పం చెప్పుకుని,సంకల్పం చెప్పేటప్పుడు చివరి వాక్యం మారుతుంది.)
సంకల్పము
మమ, ఉపాత్త , దురితక్షయ ద్వారా , శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం , శుభే, శోభనే , ముహూర్తే , శ్రీ మహావిష్ణో: , ఆజ్ఞయా, ప్రవర్తమానస్య, అద్య, బ్రహ్మణ: , ద్వితీయపరార్ధే , శ్వేతవరాహకల్పే , వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రధమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే , అస్మిన్ , వర్తమాన , వ్యావహారిక , చాంద్రమాన , శ్రీ____నామసంవత్సరే , ____ ఆయనే , ____ఋతౌ , ____మాసే , _____పక్షే , _____తిధౌ , ______వాసరే , శుభనక్షత్రే , శుభయోగే , శుభకరణ , ఏవంగుణ , విశేషణ , విశిష్టాయాం , మమ గృహస్థాశ్రమ యోగ్యత సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే |
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే: యత్ సహజం పురస్తాత్ !
ఆయుష్య మగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ: అంటూ రెండవ దాన్ని ధరించాలి.
ఆచమ్య!!
ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (ఆచమనం)
ఓం గోవిందాయ నమ: , ఓం విష్ణవే నమ: (అర చేతులు కడుక్కోవాలి)
ఓం మధుసూధనాయ నమ: , ఓం త్రివిక్రమాయ నమ: (బ్రొటన వేళితో పెదవులు తుడుచుకోవాలి)
ఓం వామనాయ నమ: , ఓం శ్రీధరాయ నమ: (నెత్తి మీద రెండు సార్లు నీరు చల్లుకోవాలి)
ఓం హృషీకేశాయ నమ: (ఎడమ చేతిపై నీరు చల్లుకోవాలి)
ఓం పద్మనాభాయ నమ: (పాదముల పై నీరు చల్లుకోవాలి)
ఓం దామోదరాయ నమ: (తల మీద నీరు చల్లుకోవలి)
ఓం సంకర్షణాయ నమ: (చేతులని గిన్నె వలె చేసి గడ్డమును తాకాలి)
ఓం వాసుదేవాయ నమ: , ఓం ప్రద్యుమ్నాయ నమ: (బ్రొటన,చూపుడు వేళ్ళతో ముక్కు రంధ్రాలని)
ఓం అనిరుద్ధాయ నమ: , ఓం పురుషోత్తమాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో నేత్రాలని)
ఓం అధోక్షజాయ నమ: , ఓం నారశిం హాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో చెవులని)
ఓం అచ్యుతాయ నమ: (బ్రొటన,చిటికెన వేళ్ళతో నాభిని)
ఓం జనార్దనాయ నమ: (చేతితో వక్షస్థలాన్ని)
ఓం ఉపేంద్రాయ నమ: (కరాగ్రంతో తలని)
ఓం హరయే నమ: , ఓం శ్రీ కృష్ణాయ నమ: (హస్తములతో బాహువులని)
(మళ్ళీ సంకల్పం చెప్పుకుని,సంకల్పం చెప్పేటప్పుడు చివరి వాక్యం మారుతుంది.)
సంకల్పము
మమ, ఉపాత్త , దురితక్షయ ద్వారా , శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం , శుభే, శోభనే , ముహూర్తే , శ్రీ మహావిష్ణో: , ఆజ్ఞయా, ప్రవర్తమానస్య, అద్య, బ్రహ్మణ: , ద్వితీయపరార్ధే , శ్వేతవరాహకల్పే , వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రధమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే , అస్మిన్ , వర్తమాన , వ్యావహారిక , చాంద్రమాన , శ్రీ____నామసంవత్సరే , ____ ఆయనే , ____ఋతౌ , ____మాసే , _____పక్షే , _____తిధౌ , ______వాసరే , శుభనక్షత్రే , శుభయోగే , శుభకరణ , ఏవంగుణ , విశేషణ , విశిష్టాయాం , మమ ఉత్తరీయార్థే తృతీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే |
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే: యత్ సహజం పురస్తాత్ !
ఆయుష్య మగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ: అంటూ మూడవ దాన్ని ధరించాలి.
ఆచమ్య!!
ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (ఆచమనం)
ఓం గోవిందాయ నమ: , ఓం విష్ణవే నమ: (అర చేతులు కడుక్కోవాలి)
ఓం మధుసూధనాయ నమ: , ఓం త్రివిక్రమాయ నమ: (బ్రొటన వేళితో పెదవులు తుడుచుకోవాలి)
ఓం వామనాయ నమ: , ఓం శ్రీధరాయ నమ: (నెత్తి మీద రెండు సార్లు నీరు చల్లుకోవాలి)
ఓం హృషీకేశాయ నమ: (ఎడమ చేతిపై నీరు చల్లుకోవాలి)
ఓం పద్మనాభాయ నమ: (పాదముల పై నీరు చల్లుకోవాలి)
ఓం దామోదరాయ నమ: (తల మీద నీరు చల్లుకోవలి)
ఓం సంకర్షణాయ నమ: (చేతులని గిన్నె వలె చేసి గడ్డమును తాకాలి)
ఓం వాసుదేవాయ నమ: , ఓం ప్రద్యుమ్నాయ నమ: (బ్రొటన,చూపుడు వేళ్ళతో ముక్కు రంధ్రాలని)
ఓం అనిరుద్ధాయ నమ: , ఓం పురుషోత్తమాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో నేత్రాలని)
ఓం అధోక్షజాయ నమ: , ఓం నారశిం హాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో చెవులని)
ఓం అచ్యుతాయ నమ: (బ్రొటన,చిటికెన వేళ్ళతో నాభిని)
ఓం జనార్దనాయ నమ: (చేతితో వక్షస్థలాన్ని)
ఓం ఉపేంద్రాయ నమ: (కరాగ్రంతో తలని)
ఓం హరయే నమ: , ఓం శ్రీ కృష్ణాయ నమ: (హస్తములతో బాహువులని)
(మళ్ళీ సంకల్పం చెప్పుకుని,సంకల్పం చెప్పేటప్పుడు చివరి వాక్యం మారుతుంది.)
సంకల్పము
మమ, ఉపాత్త , దురితక్షయ ద్వారా , శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం , శుభే, శోభనే , ముహూర్తే , శ్రీ మహావిష్ణో: , ఆజ్ఞయా, ప్రవర్తమానస్య, అద్య, బ్రహ్మణ: , ద్వితీయపరార్ధే , శ్వేతవరాహకల్పే , వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రధమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే , అస్మిన్ , వర్తమాన , వ్యావహారిక , చాంద్రమాన , శ్రీ____నామసంవత్సరే , ____ ఆయనే , ____ఋతౌ , ____మాసే , _____పక్షే , _____తిధౌ , ______వాసరే , శుభనక్షత్రే , శుభయోగే , శుభకరణ , ఏవంగుణ , విశేషణ , విశిష్టాయాం , శ్రీమాన్ కౌండన్యస గోత్ర: , రామయోగిశర్మ నామధేయ : , శ్రీమత: కౌండన్యస గోత్రస్య , రామయోగిశర్మ నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య , ఆయురారోగ్య , అఖండ ఐశ్వర్య , అభివృద్ధర్ధం , ధర్మార్ధ , కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం , నూతన యజ్ఞోపవీతధారణ సమయే దశాసంఖ్య గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే
పాత,కొత్త యజ్ఞోపవీతాలని పట్టుకుని గాయత్రి మంత్రం 10 సార్లు జపించాలి.జపించిన పిమ్మట గాయత్రీ మహామంత్ర జపం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పళ్ళెంలో నీటిని వదలాలి.
తర్వాత పాత యజ్ఞోపవీతాన్ని పట్టుకుని,
యజ్ఞోపవీతం యది జీర్ణవంతం వేదాంతవేద్యం పరబ్రహ్మ స్వరూపం జీర్ణోపవీతం విసృ తస్తు తేజ:
(లేదా)
ఉపవీతం భిన్నతంతుం జీర్ణం కష్మలదూషితం|
విసృజామి పరబ్రహ్మణ్ వర్చో దీర్ఘాయురస్తు మే |
"సముద్రం గచ్ఛ స్వాహా" ఇత్యుక్త్వా విసృజేత్ | అని అంటూ పాత యజ్ఞోపవీతాన్ని బయటకి తీసేయాలి.
ఆచమ్య!!
ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (ఆచమనం)
ఓం గోవిందాయ నమ: , ఓం విష్ణవే నమ: (అర చేతులు కడుక్కోవాలి)
ఓం మధుసూధనాయ నమ: , ఓం త్రివిక్రమాయ నమ: (బ్రొటన వేళితో పెదవులు తుడుచుకోవాలి)
ఓం వామనాయ నమ: , ఓం శ్రీధరాయ నమ: (నెత్తి మీద రెండు సార్లు నీరు చల్లుకోవాలి)
ఓం హృషీకేశాయ నమ: (ఎడమ చేతిపై నీరు చల్లుకోవాలి)
ఓం పద్మనాభాయ నమ: (పాదముల పై నీరు చల్లుకోవాలి)
ఓం దామోదరాయ నమ: (తల మీద నీరు చల్లుకోవలి)
ఓం సంకర్షణాయ నమ: (చేతులని గిన్నె వలె చేసి గడ్డమును తాకాలి)
ఓం వాసుదేవాయ నమ: , ఓం ప్రద్యుమ్నాయ నమ: (బ్రొటన,చూపుడు వేళ్ళతో ముక్కు రంధ్రాలని)
ఓం అనిరుద్ధాయ నమ: , ఓం పురుషోత్తమాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో నేత్రాలని)
ఓం అధోక్షజాయ నమ: , ఓం నారశిం హాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో చెవులని)
ఓం అచ్యుతాయ నమ: (బ్రొటన,చిటికెన వేళ్ళతో నాభిని)
ఓం జనార్దనాయ నమ: (చేతితో వక్షస్థలాన్ని)
ఓం ఉపేంద్రాయ నమ: (కరాగ్రంతో తలని)
ఓం హరయే నమ: , ఓం శ్రీ కృష్ణాయ నమ: (హస్తములతో బాహువులని)

ఇట్లు 
మీ సుబ్రహ్మణ్యం శర్మ
 

శివాభిషేక ఫలములు

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.

2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.

3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.

4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.

5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును

6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.

7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.

8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.

10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.

11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.

12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.

13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.

14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.

15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.

16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.

17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).

18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.

19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.

20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.

21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.

22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.

23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.

24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
ఇట్లు 
మీ సుబ్రహ్మణ్యం శర్మ  

నిత్య పూజావిధానం :

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

(వినాయకుని / యిష్టదైవమును ధ్యానించవలెను).

(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-)

శ్లో : అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా
యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాఅంతర శ్సుచి:
ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః

(అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో - ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను)

ఓం గురుభ్యో నమః

దీపమును వెలిగించి - గంధ పుష్పాదులతో అలంకరించి - దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.

దీప శ్లోకం : ఘ్రుతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ

ఆచమన కేశవ నామములు

1. ఓం కేశవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
2. ఓం నారాయణాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
3. ఓం మాధవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
4. ఓం గోవిందాయ నమః (అనుచు - ఎడమ చేతిని కుడి అరచేతితోను)
5. ఓం విష్ణవే నమః (అనుచు - ఎడమ అరచేతితోను కడుగుకొనవలెను)
6. ఓం మధుసూదనాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
7. ఓం త్రివిక్రమాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
8. ఓం వామనాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
9. ఓం శ్రీధరాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
10. ఓం హ్రుషికేశాయ నమః (అనుచు ఎడమ అరచేతిపైనను )
11. ఓం పద్మనాభాయ నమః (అనుచు రెండు పదముల పైనను)
12. ఓం దామోదరాయ నమః (అనుచు శిరము పైన నీరు చల్లుకొనవలెను)
13. ఓం సంకర్షణాయ నమః (అన్ని వేళ్ళు ముడిచి ఆ వేళ్ళ మొదళ్ళతో గడ్డమును తాకవలెను)
14. ఓం వాసుదేవాయ నమః (అనుచు ఎడమ ముక్కును)
15. ఓం ప్రద్యుమ్నాయ నమః (అనుచు కుడి ముక్కును అంగుష్ఠ (బొటనవేలు) తర్జనులతో (చూపుడు వేలు) తాకవలెను)
16. ఓం అనిరుద్ధాయ నమః (అనుచు ఎడమ కన్నును)
17. ఓం పురుషోత్తమాయ నమః (అనుచు ఎడమ చేతిని )
18. ఓం అధోక్షజాయ నమః (అనుచు ఎడమ చేతిని)
19. ఓం నారసింహాయ నమః (కుడి చేతిని అంగుష్ఠ (బొటనవేలు) అనామికలతో (ఉంగరం వేలు) తాకవలెను
20. ఓం అచ్యుతాయ నమః (అనుచు నాభిని అంగుష్ఠ కనిష్టికలతో (బొటన చిటికెన వేళ్ళతో) తాకవలెను)
21. ఓం జనార్ధనాయ నమః (అనుచు అరచేతిని హృదయమునకు ఆనించాలి)
22. ఓం ఉపేంద్రాయ నమః (అనుచు శిరమును కరాగ్రముతో తాకవలెను)
23. ఓం హరయే నమః (అనుచు బాహు మూలములను వేళ్ళను ముడుచుకొని తాకవలెను)
24. ఓం శ్రీకృష్ణాయ నమః.

భూతోచ్చాటనము

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

1. శ్లోకము చదివి - పూజాస్థలమున జలమును - అక్షతలను చల్లవలెను. తరువాత కూర్చుని అక్షతలు కొన్ని వాసన చూసి వెనుకకు వేసుకోవాలి.

అథ ప్రాణాయామః

(కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి )

ఓం భూః, ఓం భువః , ఓం సువః, ఓం జనః, ఓం తపః ,
ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధీయోయనః ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం
(మూడు సార్లు జపించవలెను)

అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకొనవలెను.

సంకల్పము

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే శ్రీ మహా విష్ణు రాజ్ఞీయ ప్రవర్తమానస్య
అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతా వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే రమణక వర్షే అయింద్ర ఖండే శ్రీసైలస్య పశ్చిమే పార్శ్వే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ........ (శ్రీ నందన (సంవత్సరం పేరు)) నామ సంవత్సరే (ఆయనం పేరు చేర్చి) ..... ఆయనే (దక్షిణాయనే) , (ఋతువు పేరు చేర్చి) ..... ఋతే (శరత్) , ..... మాసే (కార్తీక ), .... పక్షే (శుక్ల) , .... శుభ తిథౌ .....శ్రీమాన్ (గోత్రము పేరు చెప్పి) గోత్రః (తన పేరు చెప్పుకొని) నామధేయః శ్రీమతః (గోత్రము పేరు చేర్చి) గోత్రస్య (తన పేరు చేర్చుకొని) నామ ధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐస్వర్యాభి వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం , మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ (మనం ఏ దైవమును పూజిస్తున్నామో అ దైవము పేరు చెప్పుకోవాలి - కార్తిక మాసం - దామోదర - ఈశ్వర - తులసి) శ్రీ .............. దేవతా పూజాం కరిష్యే - సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపాచారైః సంభవితా నియమేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే /

అంటూ అక్షతలు ఉదకం పళ్ళెంలో విడువవలెను.
కలశ పూజ:
కలశం అంటే నీళ్ళు వుండే పాత్ర కు గంధము, కుంకుమ అలంకరించి అక్షతలు, పుష్పము వేసి ఎడమ అరా చేతితో కింద పట్టుకొని కుడిఅరచేతితో పైన పట్టుకుని

తదంగ కలశ పూజాం కరిష్యే //
శ్లో : కలశస్య ముఖే విష్ణుః కంఠ్ ఎ రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః //
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదో యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః //
అంగై శ్చ సాహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ //
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు శ్రీదేవి (దేవుని పేరు చేర్చి) పూజార్థం దురితక్షయ కారకాః (కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ)
పూజాద్రవ్యాణి (దేవుడి మీద చల్లి ) దేవం (తమ మీద చల్లుకుని) ఆత్మానం సంప్రోక్ష్య //

శ్రీ మహా గణాధిపతి పూజా

అదౌ - నిర్విఘ్నేన పరిసమాప్యార్థం శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచం ద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పక ర్ణాయ నమః
ఓం హేరంభాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
ఓం గణాధిపతయే నమః
షోడశ నామ పూజా సమర్పయామి
శ్లో : వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా //
గణాధిపతి సుప్రీతో వరదో భవతు
మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు //

ప్రతి ఉపచారమునకు ముందు - మనం పూజిస్తున్న దైవమును " ఓం శ్రీ .................... దేవతాయై నమః" అని నమస్కరించుకుంటూ ఆయా ఉపచారములను జరపాలి.

1. ఆ దైవము ధ్యాన శ్లోకమును స్మరించుకుని

ఓం శ్రీ ......................దేవతాయై నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి . (ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను )

2. ఓం శ్రీ .................. దేవతాయై నమః ఆవాహయామి (ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను)

3. ఓం శ్రీ ................... దేవతాయై నమః రత్న సింహాసనం సమర్పయామి ( కొన్ని అక్షతలు సమర్పించవలెను)

4. ఓం శ్రీ .................... దేవతాయై నమః పాదయోః పాద్యం సమర్పయామి ( పుష్పం తో నీరు దేవుడి/దేవి కి పాదములు కడగాలి - కడిగినట్టు భావించాలి )

5. ఓం శ్రీ ....................దేవతాయై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవికి చేతులు కడగాలి - కడిగినట్టు భావించాలి ).

6. ఓం శ్రీ ...................... దేవతాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవి కి ముఖం కడుగుటకు ఇవ్వాలి ).

7. ఓం శ్రీ .................... దేవతాయై నమః మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి (పుష్పం తో నీరు దేవుడి / దేవికి మధుపర్క స్నానానికి సమర్పించాలి)

8. ఓం శ్రీ .................... దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. (పుష్పం తో నీరు దేవుడి. దేవికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి.

9. ఓం శ్రీ .................... దేవతాయై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి - వస్త్ర యుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి (వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి).

10. ఓం శ్రీ .................... దేవతాయై నమః ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి (కుంకుమ ధారణ చేయాలి).

11. ఓం శ్రీ .................... దేవతాయై నమః యజ్ఞోపవీతం సమర్పయామి - యజ్ఞోపవీతం రూపేణ అక్షతాన్ సమర్పయామి(అక్షతలు వేయాలి).

12. ఓం శ్రీ .................... దేవతాయై నమః శ్రీ గంధాం ధారయామి - (గంధం సమర్పించాలి).

13. ఓం శ్రీ .................... దేవతాయై నమః సర్వాభరణాన్ ధారయామి (అక్షతలు సమర్పించాలి).

14. ఓం శ్రీ .................... దేవతాయై నమః సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి (పువ్వులు/ అక్షతలు సమర్పించాలి).

15. ఓం శ్రీ .................... దేవతాయై నమః (యథా శక్తి మన ఇష్ట దైవము యొక్క మంత్ర జపమును, అష్టోత్తర శత నామాన్ని, కాని లేదా ప్రార్థన శ్లోకము ను గాని
చదువుకొన వలెను.

16. ఓం శ్రీ .................... దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించి దేవుడికి/ దేవికి చూపించాలి).

17. ఓం శ్రీ .................... దేవతాయై నమః దీపం దర్శయామి (దీపం చూపించాలి).

18. ఓం శ్రీ .................... దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి (నివేదనార్పణా విధి: నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ
ఓం భూర్భువస్సువః తథ్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయా త్ (అంటూ కొంచెం జలమును చిలకరించి)
సత్యం త్వర్తేన పరిషం చామి (మూడు సార్లు పుష్పము తో గాని , ఉద్ధరిణి తో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశ లో (క్లోక్ వైస్ ) తిప్పాలి.
అమృతమస్తు (నైవేద్యం పై జలమును వుంచి)
అమృతోపస్తర ణమసి (అదే నీటిని దేవుడి / దేవి వద్ద ) ఉంచాలి.
దిగువ మంత్రము లతో భగవంతునికి ఆరగింపు (తినిపిస్తున్నట్టు - బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేళ్ళ తో ) చూపవలెను.
ఓం ప్రాణాయ స్వాహా-- ఓం అపానాయ స్వాహా -- ఓం వ్యానాయ స్వాహా -- ఓం ఉదానాయ స్వాహా -- ఓం సమానాయ స్వాహా --
ఓం పరబ్రహ్మణే నమః --- అంటూ నివేదించవలెను.

ఓం శ్రీ .................... దేవతాయై నమః తాంబూలం సమర్పయామి - తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి.(తాంబూలం చూపించుట కానీ, అక్షతలు గాని సమర్పించాలి).

ఓం శ్రీ .................... దేవతాయై నమః కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి (కర్పూర హారతి ఇవ్వాలి).
ఓం శ్రీ .................... దేవతాయై నమః మంత్ర పుష్పం సమర్పయామి (అక్షతలు, పువ్వులు సమర్పించవలెను).

ఓం శ్రీ .................... దేవతాయై నమః నమస్కారం సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను --
శ్లో : యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతు ప్రదక్షిణం పదే పదే
పాపాహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవా
త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగత వత్సలా
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా //

ఓం శ్రీ .................... దేవతాయై నమః గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళిక నారోహమావహయామి ,
అశ్వా నారోహమావహయామి, గజనారోహమావాహయామి ,
ఓం శ్రీ .................... దేవతాయై నమః సమస్త శక్త్యోపచారాన్, రాజ్యోపచారాన్, భక్త్యోపచారాన్ , దేవ్యోపచారాన్ సమర్పయామి.

(అంటూ అక్షతలు సమర్పించవలెను).

అనయా , యథా శక్తి, మయా కృత ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ -- శ్రీ ............................... దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు ----
ఓం శ్రీ .................... దేవతాయై నమః (మనం యథా శక్తి చేసిన పూజలకు భగవంతుడు ప్రీతి చెంది మన కోరికలను తీర్చి, మనలను కాపాడాలని కోరుకుంటూ )

కాయేన వాచా మనసేంద్రియై ర్వాబుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారయణా యేతి సమర్పయామి

యే తత్ ఫలం శ్రీ ................... దేవతార్పణ మస్తు

హరిః ఓం తత్సత్

 
ఇట్లు 
మీ సుబ్రహ్మణ్యం శర్మ 

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...