Friday, October 25, 2013
నవగ్రహ పూజ
శ్లో//వేదీ మధ్యే లలితకమలే కర్ణికాయాం రథస్థ
శ్లో//ఆగ్నేయభాగే సరథోదశాశ్వశ్చాత్రేయజో యామునదేశజశ్చ,
శ్లో//యామ్యే గదాశ్కతి ధరష్చ శూలీ ప్వరప్రదో యామ్యుముఖో తిరక్తః
శ్లో//ఉడజ్ముఖో మాగధదెశజాత శ్చాత్రేయగోత్ర శ్శరమండలస్థః
శ్లో//సౌమ్యే సుదీర్ఘే చతురశ్రపీఠే రథేజ్గరాః పూర్వముఖస్వభావః
శ్లో//ప్రాచ్యాం భృగు ర్భోజకటప్రదేశ స్స భార్గవః పూర్వముఖ స్వభావః
శ్లో//చాపసానో గృధ్రరథ స్సువీలః ప్రత్యుజ్ముఖః కాశ్యపజఝ్ ప్రతీచ్యాం
శ్లో//పైఠీనసో బర్బరదేశజాత శ్శూర్పాసన స్సింహగత స్వభావః
శ్లో//ధ్వజాసనో జైమిని గోత్రజోంర్వేదేషు దేశేషు విచిత్రవర్ణః
దీపావళి
సంబరాల దీపావళి |
"చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి... " అని తెలుగు సినిమా కవి రాసింది ఎంత నిజంఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి, సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.దీపావళినాడు నూనెలో ( ముఖ్యంగా నువ్వులనూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది, గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది, నరక భయం ఉండదనేది పురాణాలు చెపుతున్నాయి.అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. 'యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టి చెంది ఆశీర్వదిస్తారు.స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇళ్ళ ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి, సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన, రుచికరమైన భక్ష్యభోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్దం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఆ రోజంతా ఎక్కడలేని హడావుడి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాంటాయి.దిబ్బు దిబ్బు దీపావళి |
దిబ్బు దిబ్బు దీపావళి
|
అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయంగా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత, కాళ్ళు కడుక్కుని, ఇంటిలోపలకు వచ్చి, తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.పర్యావరణానికి హాని కలగకుండా దీపావళి :ఈ పండుగ సంబరాలు మన సంస్కృతిలో ఒక భాగం. కాబట్టి పండుగను ఎలా జరుపుకోవాలనేది వారి వారి వ్యక్తిగత యిష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత తరుణంలో ఇలాగే జరుపుకోవాలి అని చెప్పాల్సి వస్తోంది. ఒకప్పుడు పర్యావరణ సమస్యలు తీవ్రంగా లేనప్పుడు పండుగ ఎలా జరుపుకున్నా జరిగిపోయేది. అసలు అప్పట్లో ఇప్పటిలా టపాసులు పెద్ద ఎత్తున కాల్చేవారం కాదు. కొత్తబట్టలు వేసుకొని, పిండివంటలు చేసుకొని ఆటలు పాటలతో, మట్టిదీపాలతో అలంకరించుకుని, దివిటీలు తిప్పుతూ పండుగను జరుపుకునేవారు. ఇవి ప్రకృతికి పెద్దగా నష్టం కలిగించేవి కావు. కానీ, నేటి మన జీవన విధానం, పండుగలు చేసుకునే తీరు ప్రకృతి వనరులపై ఎనలేని భారాలను మోపుతున్నాయి. పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతున్నాయి. భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. ఫలితంగా వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. తీవ్ర వర్షాభావం, అదే తీవ్ర స్థాయిలో వరదలు ఒకే సంవత్సరం చూడగలుగుతున్నారు. అందువల్ల కొనసాగు తున్న మన జీవన విధానాన్ని, పండుగలు చేసుకునే తీరును ప్రకృతికి నష్టం కలిగించని రీతిలో మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పండుగ చేసుకునే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రకృతిపరంగా ఎక్కువ నష్టం జరగకుండా చూద్దాం. ఆటపాటలతో, దీపాలు వెలిగించి, పిండివంటలు చేసుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపు కుందాం. ఇదే మనం ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ దీపావళి పండుగను చేసుకోవడం.దీపావళి విశిష్టత దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నూతన వస్త్రాల సోయగాలు, పిండివంటల ఘుమఘుమలు, దీపాల తళుకులు, బాణ సంచా కోలాహలాలు, అంతా కలిపితే దీపావళి సంబరాలు.
// దీపం జ్యోతి పరబ్రహ్మమ్
|
యజ్ఞోపవీత ధారణ
గణపతి ప్రార్ధన
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.
గణాణాంత్వ గణపతి కుంభవా మహే కవింక వీనా ముప మశ్ర వస్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనుశ్రుణ్వన్ ఊతిభి సీధసాధనం .శ్రీ మహాగణాధిపతయే నమ:
ఆచమ్య!!
ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (ఆచమనం)
ఓం గోవిందాయ నమ: , ఓం విష్ణవే నమ: (అర చేతులు కడుక్కోవాలి)
ఓం మధుసూధనాయ నమ: , ఓం త్రివిక్రమాయ నమ: (బ్రొటన వేళితో పెదవులు తుడుచుకోవాలి)
ఓం వామనాయ నమ: , ఓం శ్రీధరాయ నమ: (నెత్తి మీద రెండు సార్లు నీరు చల్లుకోవాలి)
ఓం హృషీకేశాయ నమ: (ఎడమ చేతిపై నీరు చల్లుకోవాలి)
ఓం పద్మనాభాయ నమ: (పాదముల పై నీరు చల్లుకోవాలి)
ఓం దామోదరాయ నమ: (తల మీద నీరు చల్లుకోవలి)
ఓం సంకర్షణాయ నమ: (చేతులని గిన్నె వలె చేసి గడ్డమును తాకాలి)
ఓం వాసుదేవాయ నమ: , ఓం ప్రద్యుమ్నాయ నమ: (బ్రొటన,చూపుడువేళ్ళతో ముక్కు రంధ్రాలని)
ఓం అనిరుద్ధాయ నమ: , ఓం పురుషోత్తమాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో నేత్రాలని)
ఓం అధోక్షజాయ నమ: , ఓం నారశిం హాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో చెవులని)
ఓం అచ్యుతాయ నమ: (బ్రొటన,చిటికెన వేళ్ళతో నాభిని)
ఓం జనార్దనాయ నమ: (చేతితో వక్షస్థలాన్ని)
ఓం ఉపేంద్రాయ నమ: (కరాగ్రంతో తలని)
ఓం హరయే నమ: , ఓం శ్రీ కృష్ణాయ నమ: (హస్తములతో బాహువులని)
ప్రాణాయామం
---------------
(కుడి చేతి బ్రొటన వేళిని కుడి ముక్కు గోడకి,ఉంగరం వేళిని ఎడమ ముక్కు గోడకి తాకించి)
ఓం భూ: , ఓం భువ: , ఓగ్0 సువ: , ఓం మహ: , ఓం జన: , ఓం తప: , ఓగ్0 సత్యం ,
ఓం తత్సవితుర్వే--ణ్యం , భర్గో దేవస్య ధీమహి , ధియోయోన: ప్రచోదయా--త్ ,
ఓమాప: , జ్యోతీరస: ,అమృతం బ్రహ్మ , భూర్భువస్సువరోం--
సంకల్పము
మమ, ఉపాత్త , దురితక్షయ ద్వారా , శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , శ్రీ పరమేశ్వర
ప్రీత్యర్ధం , శుభే, శోభనే , ముహూర్తే , శ్రీ మహావిష్ణో: , ఆజ్ఞయా,
ప్రవర్తమానస్య, అద్య, బ్రహ్మణ: , ద్వితీయపరార్ధే , శ్వేతవరాహకల్పే ,
వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రధమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే
, అస్మిన్ , వర్తమాన , వ్యావహారిక , చాంద్రమాన , శ్రీ____నామసంవత్సరే ,
____ ఆయనే , ____ఋతౌ , ____మాసే , _____పక్షే , _____తిధౌ , ______వాసరే ,
శుభనక్షత్రే , శుభయోగే , శుభకరణ , ఏవంగుణ , విశేషణ , విశిష్టాయాం ,
శ్రీమాన్ కౌండన్యస గోత్ర: , రామయోగిశర్మ నామధేయ : , శ్రీమత: కౌండన్యస
గోత్రస్య , రామయోగిశర్మ నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య , ఆయురారోగ్య , అఖండ
ఐశ్వర్య , అభివృద్ధర్ధం , ధర్మార్ధ , కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ
సిద్ధ్యర్ధం , సకల శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుస్ఠాన యోగ్యత
సిద్ధ్యర్ధం,బ్రహ్మ తేజ: అభివృద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీతధారణం కరిష్యే అంటూ
నీరు వదలాలి.
మూడు కొత్త యజ్ఞోపవీతాలిని నీటితోను,పసుపుతోను శుభ్రపరచాలి.
యజ్ఞోపవీతం ఇతి మంత్రస్య
పరబ్రహ్మ ఋషి:(కుడిచేతితో నుదుటిని తాకాలి)
తృష్ఠప్ ఛంద:(ముక్కు కింద తాకాలి)
పరమాత్మ దేవత:(హృదయాన్ని తాకాలి)
యజ్ఞోపవీతధారణే వినియోగ:
ఒకదాని తర్వాత ఒకటి ఈ మూడు యజ్ఞోపవీతాలిని ఈ క్రింది విధంగా చేస్తూ ధరంచాలి.
ధరించేటప్పుడు రెండు చేతులతో యజ్ఞోపవీతాన్ని పట్టుకుని,యజ్ఞోపవీతానికి
ఉన్న ముడిని కుడి చేతితో పైకి ఉండేటట్లు(ఆకాశానికి చూపించేటట్లు)చేసి ఈ
కింది ధారణ మంత్రాన్ని పఠిస్తూ మొదటి యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే: యత్ సహజం పురస్తాత్ !
ఆయుష్య మగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ: అంటూ మొదటి దాన్ని ధరించాలి.
ఆచమ్య!!
ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (ఆచమనం)
ఓం గోవిందాయ నమ: , ఓం విష్ణవే నమ: (అర చేతులు కడుక్కోవాలి)
ఓం మధుసూధనాయ నమ: , ఓం త్రివిక్రమాయ నమ: (బ్రొటన వేళితో పెదవులు తుడుచుకోవాలి)
ఓం వామనాయ నమ: , ఓం శ్రీధరాయ నమ: (నెత్తి మీద రెండు సార్లు నీరు చల్లుకోవాలి)
ఓం హృషీకేశాయ నమ: (ఎడమ చేతిపై నీరు చల్లుకోవాలి)
ఓం పద్మనాభాయ నమ: (పాదముల పై నీరు చల్లుకోవాలి)
ఓం దామోదరాయ నమ: (తల మీద నీరు చల్లుకోవలి)
ఓం సంకర్షణాయ నమ: (చేతులని గిన్నె వలె చేసి గడ్డమును తాకాలి)
ఓం వాసుదేవాయ నమ: , ఓం ప్రద్యుమ్నాయ నమ: (బ్రొటన,చూపుడు వేళ్ళతో ముక్కు రంధ్రాలని)
ఓం అనిరుద్ధాయ నమ: , ఓం పురుషోత్తమాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో నేత్రాలని)
ఓం అధోక్షజాయ నమ: , ఓం నారశిం హాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో చెవులని)
ఓం అచ్యుతాయ నమ: (బ్రొటన,చిటికెన వేళ్ళతో నాభిని)
ఓం జనార్దనాయ నమ: (చేతితో వక్షస్థలాన్ని)
ఓం ఉపేంద్రాయ నమ: (కరాగ్రంతో తలని)
ఓం హరయే నమ: , ఓం శ్రీ కృష్ణాయ నమ: (హస్తములతో బాహువులని)
(మళ్ళీ సంకల్పం చెప్పుకుని,సంకల్పం చెప్పేటప్పుడు చివరి వాక్యం మారుతుంది.)
సంకల్పము
మమ, ఉపాత్త , దురితక్షయ ద్వారా , శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , శ్రీ పరమేశ్వర
ప్రీత్యర్ధం , శుభే, శోభనే , ముహూర్తే , శ్రీ మహావిష్ణో: , ఆజ్ఞయా,
ప్రవర్తమానస్య, అద్య, బ్రహ్మణ: , ద్వితీయపరార్ధే , శ్వేతవరాహకల్పే ,
వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రధమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే
, అస్మిన్ , వర్తమాన , వ్యావహారిక , చాంద్రమాన , శ్రీ____నామసంవత్సరే ,
____ ఆయనే , ____ఋతౌ , ____మాసే , _____పక్షే , _____తిధౌ , ______వాసరే ,
శుభనక్షత్రే , శుభయోగే , శుభకరణ , ఏవంగుణ , విశేషణ , విశిష్టాయాం , మమ
గృహస్థాశ్రమ యోగ్యత సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే |
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే: యత్ సహజం పురస్తాత్ !
ఆయుష్య మగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ: అంటూ రెండవ దాన్ని ధరించాలి.
ఆచమ్య!!
ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (ఆచమనం)
ఓం గోవిందాయ నమ: , ఓం విష్ణవే నమ: (అర చేతులు కడుక్కోవాలి)
ఓం మధుసూధనాయ నమ: , ఓం త్రివిక్రమాయ నమ: (బ్రొటన వేళితో పెదవులు తుడుచుకోవాలి)
ఓం వామనాయ నమ: , ఓం శ్రీధరాయ నమ: (నెత్తి మీద రెండు సార్లు నీరు చల్లుకోవాలి)
ఓం హృషీకేశాయ నమ: (ఎడమ చేతిపై నీరు చల్లుకోవాలి)
ఓం పద్మనాభాయ నమ: (పాదముల పై నీరు చల్లుకోవాలి)
ఓం దామోదరాయ నమ: (తల మీద నీరు చల్లుకోవలి)
ఓం సంకర్షణాయ నమ: (చేతులని గిన్నె వలె చేసి గడ్డమును తాకాలి)
ఓం వాసుదేవాయ నమ: , ఓం ప్రద్యుమ్నాయ నమ: (బ్రొటన,చూపుడు వేళ్ళతో ముక్కు రంధ్రాలని)
ఓం అనిరుద్ధాయ నమ: , ఓం పురుషోత్తమాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో నేత్రాలని)
ఓం అధోక్షజాయ నమ: , ఓం నారశిం హాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో చెవులని)
ఓం అచ్యుతాయ నమ: (బ్రొటన,చిటికెన వేళ్ళతో నాభిని)
ఓం జనార్దనాయ నమ: (చేతితో వక్షస్థలాన్ని)
ఓం ఉపేంద్రాయ నమ: (కరాగ్రంతో తలని)
ఓం హరయే నమ: , ఓం శ్రీ కృష్ణాయ నమ: (హస్తములతో బాహువులని)
(మళ్ళీ సంకల్పం చెప్పుకుని,సంకల్పం చెప్పేటప్పుడు చివరి వాక్యం మారుతుంది.)
సంకల్పము
మమ, ఉపాత్త , దురితక్షయ ద్వారా , శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , శ్రీ పరమేశ్వర
ప్రీత్యర్ధం , శుభే, శోభనే , ముహూర్తే , శ్రీ మహావిష్ణో: , ఆజ్ఞయా,
ప్రవర్తమానస్య, అద్య, బ్రహ్మణ: , ద్వితీయపరార్ధే , శ్వేతవరాహకల్పే ,
వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రధమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే
, అస్మిన్ , వర్తమాన , వ్యావహారిక , చాంద్రమాన , శ్రీ____నామసంవత్సరే ,
____ ఆయనే , ____ఋతౌ , ____మాసే , _____పక్షే , _____తిధౌ , ______వాసరే ,
శుభనక్షత్రే , శుభయోగే , శుభకరణ , ఏవంగుణ , విశేషణ , విశిష్టాయాం , మమ
ఉత్తరీయార్థే తృతీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే |
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే: యత్ సహజం పురస్తాత్ !
ఆయుష్య మగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ: అంటూ మూడవ దాన్ని ధరించాలి.
ఆచమ్య!!
ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (ఆచమనం)
ఓం గోవిందాయ నమ: , ఓం విష్ణవే నమ: (అర చేతులు కడుక్కోవాలి)
ఓం మధుసూధనాయ నమ: , ఓం త్రివిక్రమాయ నమ: (బ్రొటన వేళితో పెదవులు తుడుచుకోవాలి)
ఓం వామనాయ నమ: , ఓం శ్రీధరాయ నమ: (నెత్తి మీద రెండు సార్లు నీరు చల్లుకోవాలి)
ఓం హృషీకేశాయ నమ: (ఎడమ చేతిపై నీరు చల్లుకోవాలి)
ఓం పద్మనాభాయ నమ: (పాదముల పై నీరు చల్లుకోవాలి)
ఓం దామోదరాయ నమ: (తల మీద నీరు చల్లుకోవలి)
ఓం సంకర్షణాయ నమ: (చేతులని గిన్నె వలె చేసి గడ్డమును తాకాలి)
ఓం వాసుదేవాయ నమ: , ఓం ప్రద్యుమ్నాయ నమ: (బ్రొటన,చూపుడు వేళ్ళతో ముక్కు రంధ్రాలని)
ఓం అనిరుద్ధాయ నమ: , ఓం పురుషోత్తమాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో నేత్రాలని)
ఓం అధోక్షజాయ నమ: , ఓం నారశిం హాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో చెవులని)
ఓం అచ్యుతాయ నమ: (బ్రొటన,చిటికెన వేళ్ళతో నాభిని)
ఓం జనార్దనాయ నమ: (చేతితో వక్షస్థలాన్ని)
ఓం ఉపేంద్రాయ నమ: (కరాగ్రంతో తలని)
ఓం హరయే నమ: , ఓం శ్రీ కృష్ణాయ నమ: (హస్తములతో బాహువులని)
(మళ్ళీ సంకల్పం చెప్పుకుని,సంకల్పం చెప్పేటప్పుడు చివరి వాక్యం మారుతుంది.)
సంకల్పము
మమ, ఉపాత్త , దురితక్షయ ద్వారా , శ్రీ పరమేశ్వర ముద్దిశ్య , శ్రీ పరమేశ్వర
ప్రీత్యర్ధం , శుభే, శోభనే , ముహూర్తే , శ్రీ మహావిష్ణో: , ఆజ్ఞయా,
ప్రవర్తమానస్య, అద్య, బ్రహ్మణ: , ద్వితీయపరార్ధే , శ్వేతవరాహకల్పే ,
వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రధమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే
, అస్మిన్ , వర్తమాన , వ్యావహారిక , చాంద్రమాన , శ్రీ____నామసంవత్సరే ,
____ ఆయనే , ____ఋతౌ , ____మాసే , _____పక్షే , _____తిధౌ , ______వాసరే ,
శుభనక్షత్రే , శుభయోగే , శుభకరణ , ఏవంగుణ , విశేషణ , విశిష్టాయాం ,
శ్రీమాన్ కౌండన్యస గోత్ర: , రామయోగిశర్మ నామధేయ : , శ్రీమత: కౌండన్యస
గోత్రస్య , రామయోగిశర్మ నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య , ఆయురారోగ్య , అఖండ
ఐశ్వర్య , అభివృద్ధర్ధం , ధర్మార్ధ , కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ
సిద్ధ్యర్ధం , నూతన యజ్ఞోపవీతధారణ సమయే దశాసంఖ్య గాయత్రీ మహామంత్ర జపం
కరిష్యే
పాత,కొత్త యజ్ఞోపవీతాలని పట్టుకుని గాయత్రి మంత్రం 10 సార్లు
జపించాలి.జపించిన పిమ్మట గాయత్రీ మహామంత్ర జపం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని
పళ్ళెంలో నీటిని వదలాలి.
తర్వాత పాత యజ్ఞోపవీతాన్ని పట్టుకుని,
యజ్ఞోపవీతం యది జీర్ణవంతం వేదాంతవేద్యం పరబ్రహ్మ స్వరూపం జీర్ణోపవీతం విసృ తస్తు తేజ:
(లేదా)
ఉపవీతం భిన్నతంతుం జీర్ణం కష్మలదూషితం|
విసృజామి పరబ్రహ్మణ్ వర్చో దీర్ఘాయురస్తు మే |
"సముద్రం గచ్ఛ స్వాహా" ఇత్యుక్త్వా విసృజేత్ | అని అంటూ పాత యజ్ఞోపవీతాన్ని బయటకి తీసేయాలి.
ఆచమ్య!!
ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (ఆచమనం)
ఓం గోవిందాయ నమ: , ఓం విష్ణవే నమ: (అర చేతులు కడుక్కోవాలి)
ఓం మధుసూధనాయ నమ: , ఓం త్రివిక్రమాయ నమ: (బ్రొటన వేళితో పెదవులు తుడుచుకోవాలి)
ఓం వామనాయ నమ: , ఓం శ్రీధరాయ నమ: (నెత్తి మీద రెండు సార్లు నీరు చల్లుకోవాలి)
ఓం హృషీకేశాయ నమ: (ఎడమ చేతిపై నీరు చల్లుకోవాలి)
ఓం పద్మనాభాయ నమ: (పాదముల పై నీరు చల్లుకోవాలి)
ఓం దామోదరాయ నమ: (తల మీద నీరు చల్లుకోవలి)
ఓం సంకర్షణాయ నమ: (చేతులని గిన్నె వలె చేసి గడ్డమును తాకాలి)
ఓం వాసుదేవాయ నమ: , ఓం ప్రద్యుమ్నాయ నమ: (బ్రొటన,చూపుడు వేళ్ళతో ముక్కు రంధ్రాలని)
ఓం అనిరుద్ధాయ నమ: , ఓం పురుషోత్తమాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో నేత్రాలని)
ఓం అధోక్షజాయ నమ: , ఓం నారశిం హాయ నమ: (బ్రొటన,ఉంగర వేళ్ళతో చెవులని)
ఓం అచ్యుతాయ నమ: (బ్రొటన,చిటికెన వేళ్ళతో నాభిని)
ఓం జనార్దనాయ నమ: (చేతితో వక్షస్థలాన్ని)
ఓం ఉపేంద్రాయ నమ: (కరాగ్రంతో తలని)
ఓం హరయే నమ: , ఓం శ్రీ కృష్ణాయ నమ: (హస్తములతో బాహువులని)
ఇట్లు
మీ సుబ్రహ్మణ్యం శర్మ
శివాభిషేక ఫలములు
1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు
లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు
కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ
అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో
చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
ఇట్లు
మీ సుబ్రహ్మణ్యం శర్మ
నిత్య పూజావిధానం :
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
(వినాయకుని / యిష్టదైవమును ధ్యానించవలెను).
(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-)
శ్లో : అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా
యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాఅంతర శ్సుచి:
ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః
(అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో - ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను)
ఓం గురుభ్యో నమః
దీపమును వెలిగించి - గంధ పుష్పాదులతో అలంకరించి - దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.
దీప శ్లోకం : ఘ్రుతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ
ఆచమన కేశవ నామములు
1. ఓం కేశవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
2. ఓం నారాయణాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
3. ఓం మాధవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
4. ఓం గోవిందాయ నమః (అనుచు - ఎడమ చేతిని కుడి అరచేతితోను)
5. ఓం విష్ణవే నమః (అనుచు - ఎడమ అరచేతితోను కడుగుకొనవలెను)
6. ఓం మధుసూదనాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
7. ఓం త్రివిక్రమాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
8. ఓం వామనాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
9. ఓం శ్రీధరాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
10. ఓం హ్రుషికేశాయ నమః (అనుచు ఎడమ అరచేతిపైనను )
11. ఓం పద్మనాభాయ నమః (అనుచు రెండు పదముల పైనను)
12. ఓం దామోదరాయ నమః (అనుచు శిరము పైన నీరు చల్లుకొనవలెను)
13. ఓం సంకర్షణాయ నమః (అన్ని వేళ్ళు ముడిచి ఆ వేళ్ళ మొదళ్ళతో గడ్డమును తాకవలెను)
14. ఓం వాసుదేవాయ నమః (అనుచు ఎడమ ముక్కును)
15. ఓం ప్రద్యుమ్నాయ నమః (అనుచు కుడి ముక్కును అంగుష్ఠ (బొటనవేలు) తర్జనులతో (చూపుడు వేలు) తాకవలెను)
16. ఓం అనిరుద్ధాయ నమః (అనుచు ఎడమ కన్నును)
17. ఓం పురుషోత్తమాయ నమః (అనుచు ఎడమ చేతిని )
18. ఓం అధోక్షజాయ నమః (అనుచు ఎడమ చేతిని)
19. ఓం నారసింహాయ నమః (కుడి చేతిని అంగుష్ఠ (బొటనవేలు) అనామికలతో (ఉంగరం వేలు) తాకవలెను
20. ఓం అచ్యుతాయ నమః (అనుచు నాభిని అంగుష్ఠ కనిష్టికలతో (బొటన చిటికెన వేళ్ళతో) తాకవలెను)
21. ఓం జనార్ధనాయ నమః (అనుచు అరచేతిని హృదయమునకు ఆనించాలి)
22. ఓం ఉపేంద్రాయ నమః (అనుచు శిరమును కరాగ్రముతో తాకవలెను)
23. ఓం హరయే నమః (అనుచు బాహు మూలములను వేళ్ళను ముడుచుకొని తాకవలెను)
24. ఓం శ్రీకృష్ణాయ నమః.
భూతోచ్చాటనము
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
1. శ్లోకము చదివి - పూజాస్థలమున జలమును - అక్షతలను చల్లవలెను. తరువాత కూర్చుని అక్షతలు కొన్ని వాసన చూసి వెనుకకు వేసుకోవాలి.
అథ ప్రాణాయామః
(కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి )
ఓం భూః, ఓం భువః , ఓం సువః, ఓం జనః, ఓం తపః ,
ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధీయోయనః ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం
(మూడు సార్లు జపించవలెను)
అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకొనవలెను.
సంకల్పము
మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే శ్రీ మహా విష్ణు రాజ్ఞీయ ప్రవర్తమానస్య
అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతా వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే రమణక వర్షే అయింద్ర ఖండే శ్రీసైలస్య పశ్చిమే పార్శ్వే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ........ (శ్రీ నందన (సంవత్సరం పేరు)) నామ సంవత్సరే (ఆయనం పేరు చేర్చి) ..... ఆయనే (దక్షిణాయనే) , (ఋతువు పేరు చేర్చి) ..... ఋతే (శరత్) , ..... మాసే (కార్తీక ), .... పక్షే (శుక్ల) , .... శుభ తిథౌ .....శ్రీమాన్ (గోత్రము పేరు చెప్పి) గోత్రః (తన పేరు చెప్పుకొని) నామధేయః శ్రీమతః (గోత్రము పేరు చేర్చి) గోత్రస్య (తన పేరు చేర్చుకొని) నామ ధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐస్వర్యాభి వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం , మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ (మనం ఏ దైవమును పూజిస్తున్నామో అ దైవము పేరు చెప్పుకోవాలి - కార్తిక మాసం - దామోదర - ఈశ్వర - తులసి) శ్రీ .............. దేవతా పూజాం కరిష్యే - సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపాచారైః సంభవితా నియమేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే /
అంటూ అక్షతలు ఉదకం పళ్ళెంలో విడువవలెను.
కలశ పూజ:
కలశం అంటే నీళ్ళు వుండే పాత్ర కు గంధము, కుంకుమ అలంకరించి అక్షతలు, పుష్పము వేసి ఎడమ అరా చేతితో కింద పట్టుకొని కుడిఅరచేతితో పైన పట్టుకుని
తదంగ కలశ పూజాం కరిష్యే //
శ్లో : కలశస్య ముఖే విష్ణుః కంఠ్ ఎ రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః //
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదో యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః //
అంగై శ్చ సాహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ //
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు శ్రీదేవి (దేవుని పేరు చేర్చి) పూజార్థం దురితక్షయ కారకాః (కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ)
పూజాద్రవ్యాణి (దేవుడి మీద చల్లి ) దేవం (తమ మీద చల్లుకుని) ఆత్మానం సంప్రోక్ష్య //
శ్రీ మహా గణాధిపతి పూజా
అదౌ - నిర్విఘ్నేన పరిసమాప్యార్థం శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచం ద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పక ర్ణాయ నమః
ఓం హేరంభాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
ఓం గణాధిపతయే నమః
షోడశ నామ పూజా సమర్పయామి
శ్లో : వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా //
గణాధిపతి సుప్రీతో వరదో భవతు
మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు //
ప్రతి ఉపచారమునకు ముందు - మనం పూజిస్తున్న దైవమును " ఓం శ్రీ .................... దేవతాయై నమః" అని నమస్కరించుకుంటూ ఆయా ఉపచారములను జరపాలి.
1. ఆ దైవము ధ్యాన శ్లోకమును స్మరించుకుని
ఓం శ్రీ ......................దేవతాయై నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి . (ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను )
2. ఓం శ్రీ .................. దేవతాయై నమః ఆవాహయామి (ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను)
3. ఓం శ్రీ ................... దేవతాయై నమః రత్న సింహాసనం సమర్పయామి ( కొన్ని అక్షతలు సమర్పించవలెను)
4. ఓం శ్రీ .................... దేవతాయై నమః పాదయోః పాద్యం సమర్పయామి ( పుష్పం తో నీరు దేవుడి/దేవి కి పాదములు కడగాలి - కడిగినట్టు భావించాలి )
5. ఓం శ్రీ ....................దేవతాయై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవికి చేతులు కడగాలి - కడిగినట్టు భావించాలి ).
6. ఓం శ్రీ ...................... దేవతాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవి కి ముఖం కడుగుటకు ఇవ్వాలి ).
7. ఓం శ్రీ .................... దేవతాయై నమః మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి (పుష్పం తో నీరు దేవుడి / దేవికి మధుపర్క స్నానానికి సమర్పించాలి)
8. ఓం శ్రీ .................... దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. (పుష్పం తో నీరు దేవుడి. దేవికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి.
9. ఓం శ్రీ .................... దేవతాయై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి - వస్త్ర యుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి (వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి).
10. ఓం శ్రీ .................... దేవతాయై నమః ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి (కుంకుమ ధారణ చేయాలి).
11. ఓం శ్రీ .................... దేవతాయై నమః యజ్ఞోపవీతం సమర్పయామి - యజ్ఞోపవీతం రూపేణ అక్షతాన్ సమర్పయామి(అక్షతలు వేయాలి).
12. ఓం శ్రీ .................... దేవతాయై నమః శ్రీ గంధాం ధారయామి - (గంధం సమర్పించాలి).
13. ఓం శ్రీ .................... దేవతాయై నమః సర్వాభరణాన్ ధారయామి (అక్షతలు సమర్పించాలి).
14. ఓం శ్రీ .................... దేవతాయై నమః సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి (పువ్వులు/ అక్షతలు సమర్పించాలి).
15. ఓం శ్రీ .................... దేవతాయై నమః (యథా శక్తి మన ఇష్ట దైవము యొక్క మంత్ర జపమును, అష్టోత్తర శత నామాన్ని, కాని లేదా ప్రార్థన శ్లోకము ను గాని
చదువుకొన వలెను.
16. ఓం శ్రీ .................... దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించి దేవుడికి/ దేవికి చూపించాలి).
17. ఓం శ్రీ .................... దేవతాయై నమః దీపం దర్శయామి (దీపం చూపించాలి).
18. ఓం శ్రీ .................... దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి (నివేదనార్పణా విధి: నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ
ఓం భూర్భువస్సువః తథ్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయా త్ (అంటూ కొంచెం జలమును చిలకరించి)
సత్యం త్వర్తేన పరిషం చామి (మూడు సార్లు పుష్పము తో గాని , ఉద్ధరిణి తో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశ లో (క్లోక్ వైస్ ) తిప్పాలి.
అమృతమస్తు (నైవేద్యం పై జలమును వుంచి)
అమృతోపస్తర ణమసి (అదే నీటిని దేవుడి / దేవి వద్ద ) ఉంచాలి.
దిగువ మంత్రము లతో భగవంతునికి ఆరగింపు (తినిపిస్తున్నట్టు - బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేళ్ళ తో ) చూపవలెను.
ఓం ప్రాణాయ స్వాహా-- ఓం అపానాయ స్వాహా -- ఓం వ్యానాయ స్వాహా -- ఓం ఉదానాయ స్వాహా -- ఓం సమానాయ స్వాహా --
ఓం పరబ్రహ్మణే నమః --- అంటూ నివేదించవలెను.
ఓం శ్రీ .................... దేవతాయై నమః తాంబూలం సమర్పయామి - తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి.(తాంబూలం చూపించుట కానీ, అక్షతలు గాని సమర్పించాలి).
ఓం శ్రీ .................... దేవతాయై నమః కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి (కర్పూర హారతి ఇవ్వాలి).
ఓం శ్రీ .................... దేవతాయై నమః మంత్ర పుష్పం సమర్పయామి (అక్షతలు, పువ్వులు సమర్పించవలెను).
ఓం శ్రీ .................... దేవతాయై నమః నమస్కారం సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను --
శ్లో : యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతు ప్రదక్షిణం పదే పదే
పాపాహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవా
త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగత వత్సలా
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా //
ఓం శ్రీ .................... దేవతాయై నమః గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళిక నారోహమావహయామి ,
అశ్వా నారోహమావహయామి, గజనారోహమావాహయామి ,
ఓం శ్రీ .................... దేవతాయై నమః సమస్త శక్త్యోపచారాన్, రాజ్యోపచారాన్, భక్త్యోపచారాన్ , దేవ్యోపచారాన్ సమర్పయామి.
(అంటూ అక్షతలు సమర్పించవలెను).
అనయా , యథా శక్తి, మయా కృత ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ -- శ్రీ .............................. . దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు ----
ఓం శ్రీ .................... దేవతాయై నమః (మనం యథా శక్తి చేసిన పూజలకు భగవంతుడు ప్రీతి చెంది మన కోరికలను తీర్చి, మనలను కాపాడాలని కోరుకుంటూ )
కాయేన వాచా మనసేంద్రియై ర్వాబుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారయణా యేతి సమర్పయామి
యే తత్ ఫలం శ్రీ ................... దేవతార్పణ మస్తు
హరిః ఓం తత్సత్
ఇట్లు
మీ సుబ్రహ్మణ్యం శర్మ
Thursday, October 24, 2013
మీతో నేను..3
ఒక విషయం గురించి స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండడం ఉత్తమం
- సుబ్రహ్మణ్యం శర్మ
(జి.ఎస్. యెమ్)
Subscribe to:
Posts (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్...
-
అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప మహర్షి. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు....