Sunday, April 29, 2018

అక్షతలు అంటే...?

రోకటిపోటుకు విరగని శ్రేష్టమైన బియ్యం.  నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికీ ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాల్లో చంద్రుడికి దానవస్తువు బియ్యం.

   *శ్వేతాక్షతలు :*

తెల్లని ఈ అక్షింతలను  పితృకార్యాలలో ఉపయోగిస్తారు. వీటిని నీటితో తడిపి, తర్పణాదులకు కర్తలను ఆశీర్వదించడానికి ఉపయోగిస్తారు.

   *హరిద్రాక్షతలు *

అలంకార ప్రియుడైన విష్ణువును అర్చించడానికి వైష్ణవ మత అనుయాయులు పసుపుతో చేసిన అక్షింతలను వాడతారు. స్వర్ణం లక్ష్మీదేవికి ప్రతీక కనుక హరిద్రాక్షతలు లక్ష్మీపూజలలో, వివాహాది శుభకార్యాలలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

  *కుంకుమాక్షతలు *

ఈశ్వరునికి, అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం. కనుక కుంకుమాక్షతలను శైవ, శాక్లేయులు ఎక్కువగా ఉపయోగిస్తారు.

తలపై వేసే అక్షింతల శక్తిని బ్రహ్మ రంద్రం గ్రహించి నేరుగా శరీరాంతటికీ అందజేసి ఆశీర్వచన ఫలితాలను పొందగలరు.

  మానవుడిలోని దైవశక్తిని ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేయడానికి మరియు మంత్ర శక్తిని, దేవతారాధన ఫలితాన్ని లేదా పెద్ద ఆశీర్వచన శక్తిని ఇంకొకరికి బదిలీ చేయడానికి జలము మరియు అక్షింతలు వాహకంగా ఉంటాయనేద మన శాస్త్రం చేబుతోంది. మంత్ర పఠనంతో మనస్సు పూర్వకంగా ఆశీర్వచనం చేస్తూ శిరస్సున అక్షింతలు వేసి ఆశీర్వచనం చేయడంతో బ్రహ్మరంధ్రం వాటి శక్తిని నేరుగా గ్రహించి, శరీరంలోని సహస్త్ర చక్రాలను ఉత్తేజపరుస్తూ శరీర మంతటికీ అందిస్తుంది. శరీరంలోని షట్‌ చక్రాలు #బ్రహ్మరంధ్రానికి అనుసంధానమై ఉంటాయి.

శాస్త్రీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్ కేంద్రం. విద్యుత్ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిసి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి.మనుషుల్లో తమో, రజో, సాత్తియాకాలనే త్రిగుణాలకు కారకము. పెద్దలు వధువరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో , దేహంలోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి .ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం. పెద్దలు, విధ్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు, అత్తమమామలు వివాహ సమయంలో శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పరమార్థం ఇదే..!

ఆయుర్వేదం ప్రకారం చర్మ సంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపు కుంకుమకుంది , అక్షతలు వేసే వారికి ఎలాంటి రోగ సమస్యలున్నా, పుచ్చుకొనే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతే కాక పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.
వివాహ శుభకార్యంలో జీలకర్ర , బెల్లం పెటటే వేళ , మాంగల్యధారణ వేళ వధువరులపై ఆహుతులు అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి 'దీర్ఘాయుష్మాన్ భవ' ,'చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్యప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు'అంటూ ఆశీర్వదిస్తుంటారు.

వివాహంలో #తలంబ్రాలలో వధూవరులు దోసిలితో పోసిన తలంబ్రాలకు మంత్రోక్తంగా....

*ప్రజామే కామ సమృద్యాతాం*
*పశవోమే కామ సమృద్యాతాం*
*యజ్ఞోమే కామ సమృద్యాతాం*
*శ్రీయోమే కామ సమృద్యాతాం*

అంటూ గృహస్తుల జీవితంలో వారు ఎలాంటి మనోవాంచులను కోరుతున్నారో జీవితంలో వారికి ఎలాంటి కోరికల సిద్ధిద్వార సుఖ జీవనం గడుపుతారో మంత్రోక్తంగా చెబుతూ (గృహము, సంతానం, యజ్ఞము, ధనము, పశువులు, పంటలు ఇలా మరెన్నో కోరుకలు) వధూవరులు ఒకరి శిరసుపై మరొకరు తలంబ్రాలు పోసుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీంతో గృహస్తు జీవితంలోమ తమన ఇష్ట కోరికలు తీరి వారిమధ్య అన్యోనత పెరుగుతుంది. అంతే కాకుండా వివాహంలో తలంబ్రాలు ఘట్టం వధూవరుల్లో ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. వారిలో అనురాగాన్ని పెంచుతుంది. ఇదే మన పూర్వీ మహర్షుల మన సనాతన ధర్మ గొప్పతనం. ప్రతి సంప్రదాయంలో ఒక గొప్ప విలువైన సైన్స్‌ సూత్రాలను కూడా ఇమిడ్చి ఉంచారు. అదే మన సంస్కృతి మహత్యం.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ........

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...