Monday, February 12, 2018

గురుగ్రహ దోష నివారణకు "సిట్రిన్ స్టోన్ ట్రీ"


సిట్రిన్ స్టోన్ ట్రీని ఇంటిలో గాని ఆపీసు,వ్యాపార సంస్ధలలో గాని తూర్పు ఈశాన్య దిక్కుల యందు టేబుల్ పైన గాని,షోకేష్ నందు గాని ఉంచాలి.పిల్లలు చదువుకునే టేబుల్ పైన ఉంచిన చదువులో ఏకాగ్రత ఉంటుంది.

జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో సంతాన సౌఖ్యత లేక పోవటం,కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట,నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట,ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం,షుగర్,క్యాన్సర్,మూత్ర రోగాలు,పెద్ద పొట్టతో కలిగిన దేహం,పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం,గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు.

రోగం వస్తే తొందరగా తగ్గదు.లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకా లు, నియంతగా ప్రవర్తించుట,బృహస్పతి అనుగ్రహం ఉంటే మంచి విద్యాజ్ఞానం లభిస్తుంది. లేని ఎడల ఇబ్బందికరమైన విజ్ఞానమే. కేంద్రాధిపత్యం వచ్చిన బృహస్పతి బహుదోషి. ఈయన మారక స్థానంలో ఉంటే వెంటనే మారకం చేస్తారు అని శాస్త్ర వచనం. అలాగే జన్మ లగ్నంలో మూడవ ఇంట బృహస్పతి ఉంటే అది బాలారిష్టం. మిగిలిన గ్రహ బాలారిష్టముల కంటే గురువుతో వచ్చే బాలారిష్టములు అత్యంత ప్రమాదకరమయినవి. కారణం ఆయన దేహ కారకుడు. దేహపుష్టికి కారకుడు .గోచార ఫలితాంశ నిర్ణయంలో కూడా గురువు ప్రభావం అధికంగా ఉంటుంది. ఏలినాటి శని నడుచుచున్ననూ గురుచారం బాగుంటే కాలం బాగా నడచును. 

గురువు మేధావి వర్గానికి ప్రతీక, గురువు ప్రభావం అధికంగా గల వ్యక్తులు మేధావులవుతారు. అతి మేధావుల చరిత్రలు పరిశీలిస్తే వారి ప్రవర్తన బహు చిత్రంగా ఉంటుంది. తమ టెలిఫోను నెంబరు తామే మర్చిపోవడం, తాము అన్నం తిన్నారో లేదో తమకే గుర్తుండకపోవడం, తమ ఇంటి అడ్రస్‌ తమకు తెలియక ఫోన్‌ చేసి కనుక్కోవడం మొదలైన చిత్రవిచిత్రాలు చేస్తారు. మహా మేధావులు అతిస్వల్ప విషయములలో ఏమరపాటు కలిగి ఉండడానికి కారణం వారు ఆలోచించే ధోరణిలో అతిగా ఏకాగ్రత కలిగి తాము ఏ నూతనాంశమును కనుగొంటున్నారో దాన్ని తప్ప మిగిలిన అంశాలను పట్టించుకోకపోవడమే. నిజానికి అన్ని విషయాలూ పట్టించుకుంటే ఒక విషయంలో ఏకాగ్రత కలిగి ఉండడం అసంభవమే.

ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేక పోవుట, లివర్కు సంబంధించిన వ్యాధులు కలుగుచు న్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పారాయణ చేయడం, గురువులను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శిం చుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.గురు గ్రహ దోషనివారణకు పసుపు రంగు స్టోన్ నీటిలో వేసుకొని ఆ నీటిని త్రాగిన దోష నివారణ కలుగును. పసుపు కొమ్ము గణపతిని, పసుపు రంగు స్టోన్ గణపతిని పూజిస్తే చాలా మంచిది. పూర్వ కాలం నందు గురుగ్రహ దోష నివారణకు ఇంద్రుడిని పూజించేవారు, ప్రస్తుతం సాయిబాబా, దత్తత్రేయ, హయగ్రీవుడిని పూజిస్తున్నారు

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

కుజ గ్రహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు 

కుజుడు సామాన్యునిలో ఉత్తేజాన్ని, హంతకునిలో హింసను, బాలునిలో భయాన్ని, ప్రేమికునిలో రక్తిని, కార్మికునిలో శ్రమశక్తిని ఉత్తేజపరుస్తుంది.

కుజదోషాన్ని పూర్వం ఆడవారికి మాత్రమే చూసేవారు. కుజుడు ప్రధమ భావంలో జలరాశిలో ఉంటే స్త్రీ లోలుడు, మద్యపాన ఆశక్తి కలవాడు అవుతాడు. 

కుజుడు షష్ఠం లో ఉంటే తొందరగా, హడావుడిగా మాట్లాడతారు. జాతకంలో కుజుడు దోషి అయినప్పుడే అతనికి దోషం అవుతుంది. యోగ కారకుడైన కుజదృష్టి గుణప్రదమే అవుతుంది. 

మకరరాశిలో సూర్య, చంద్రులు ఉండి కుజ ప్రభావం ఉంటే మోకాలు సమీపంలో అనారోగ్యాలు గాని దెబ్బలు గాని తగిలే అవకాశాలు ఉన్నాయి. 

శిరస్సుకు కారకుడైన కుజుడు పాపగ్రహ ప్రభావానికి లోనయితే శిరస్సుపై దెబ్బలుంటాయి. కుజుడు లగ్నం నుండి ఏ భావంలో ఉన్నాడో చూసి ఆ భావానికి సంబందించిన శరీర స్దానంలో కాని అతడున్నరాశికి చెందిన శరీరభాగంలో గాని చిహ్నం ఉంటుంది. శరీరంలో దక్షిణ భాగంలో పుట్టుమచ్చ లేదా చిహ్నమునకు కుజుడు కారకుడు.

కుజుడు వెనుక నుండి ఉదయిస్తాడు కావున కుజగ్రహ ప్రధానుడైన వ్యక్తి ఎదుటి వారి మాటలను మరోకోణంలో ఆలోచిస్తాడు. కుజుడు శని లగ్నంలో ఉండగా ఈ స్ధానం పై గోచార రవి సంచారం చేస్తున్నప్పుడు దుర్ఘటనలు కలిగే అవకాశాలు ఉంటాయి.

కుజుడు, శుక్రులు కలసి ద్వితీయంలో ఉంటే యుక్త వయస్సులోనే పళ్ళు ఉడిపోవటం, పుచ్చిపోవటం జరుగుతుంది. కుజుడు వ్యయంలో ఉంటే ఋణాను బంధాలను తీర్చుకోవటానికి మళ్ళీ మానవ జన్మ ఎత్తుతారు. 

చంద్రాత్ కేంద్రగతే భౌమే యోగో మంగళ కారకః 
మంగళాఖ్యే సరోజాతః నిత్య శ్రీర్నిత్య మంగళం

ఈ శ్లోకం ఆదారంగా చంద్రునకు సప్తమ కేంద్రంలో కుజుడు ఉన్నప్పుడు చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. ఇట్టి యోగమున్న జాతకులకు కుజదోషం ఉండదు. ఈ యోగ జాతకులు నిత్య లక్ష్మీ కటాక్షం ఉన్నవారుగా, నిత్యం శుభములు పొందేవారుగా ఉంటారు.  

గురు మంగళ సంయోగే కుజదోషోనవిద్యతే 
చంద్ర మంగళ సంయోగే కుజదోషోనవిద్యతే

శుక్లపక్ష చంద్రుడితో కుజుడు కలసి ఉన్న, కుజునిపై గురుదృష్టి ఉన్న కుజదోషం ఉండదు.    

కుజదోషం ఉన్న వారిని కుజదోషం ఉన్న వారికే ఇచ్చి వివాహాం చేయాలనుకోవటం వల్ల దోషం పరిహారం కాదు. ఒక దోషం ఒక జాతకంలో ఉన్నప్పుడూ పరిహారాలు చేసుకోవటం శాస్త్రీయం. దోషం గల మరియొక జాతకునితో వివాహాం చేయటం వలన దోషం బలపడుతుండే గాని దోషం నశించదు. దోష నివారణకు వైధవ్య దోష పరిహారకములైన వ్రతాదులు చేసుకోవలయును. 

దర్మశాస్త్రాలు కూడ వైధవ్య యోగాదులకు శాంతి విధానాలనే బోధిస్తున్నాయి. విశిష్టమైన జ్యోతిష్య గ్రంధాలలో కూడ ఒక జాతకమందలి ఒక దుష్టయోగం మరియొక శుభయోగం వలనే పరిహారం అవుతాయని భోదిస్తున్నాయి.   తప్ప ఒక జాతకము నందలి దుష్టయోగం మరియొక జాతకమందలి దుష్టయోగం చేత పరిహారింపబడుటలేదు. గాంధారికి వైధవ్యయోగం ఉందన్న కారణం చేత ధర్మ శాస్త్ర విహితమైన మార్గంలో ఆ దోషాన్ని తొలగించి వివాహాం చేశారని భారత సారం అనే గ్రంధం తెలుపుతుంది. 

జాతకమందలి వైధవ్య యోగం ఉన్నప్పుడు సావిత్రీ వ్రతం గాని, పిప్పల వ్రతం గాని చేయించి జాతకంలో దీర్ఘాయువు గల వరునితో వివాహం చేయాలి.

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

చంద్రగ్రహ దోష నివారణకు "ముత్యం"

ముత్యమును క్షీరాబ్ధి, హురూముంజ, కాకిపాడి, ఇక్షుజము, అంబుపూస, నీరాజము, మంజరి, గొగ్గి, చిప్ప ముత్యం ఇలా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ముత్యం చంద్రగ్రహానికి ప్రతీకగా ధరిస్తారు. ముత్యం స్వచ్ఛంగా, తెల్లగా, గుండ్రంగా, బియ్యపు గింజలవలె వంకరగాను, గుండ్రంగాను ఉంటాయి. ప్రకృతిలో ఎక్కువగా ముత్యాలు ముత్యపు చిప్పల ద్వారా లభ్యమవుతాయి. ఈ ముత్యాలు “షెల్ ఫిష్” అనే నత్త జాతికి చెందిన డిప్పలు గల చేప ద్వారా లభ్యమగును. సముద్రపు అడుగు భాగంలో తిరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు ఈ డిప్పలోకి చేరి ఇబ్బంది కలిగినప్పుడు రక్షణ కవచంగా ఒక ద్రవాన్ని స్రవిస్తాయి. ఆ ద్రవం గట్టి పడి ముత్యాలుగా రూపొందుతాయి.

బృహస్సంహిత గ్రంధం ఆధారంగా ప్రకృతిలో ముత్యాలు ఏనుగు కుంభ స్ధలాలలోను, సర్పాల శిరస్సు పైన ముత్యపు చిప్పల ద్వారా, శంఖాలలోను, మేఘాలలో, వెదురుబొంగులలో ఒక రకమైన చేపలలోను, అడవిపంది కోరల్లోను మంచి ముత్యాలు మాత్రం ముత్యపు చిప్పలలో మాత్రమే లభించునని పేర్కొనటం జరిగింది.

ఐరావతం జాతికి చెందిన ఏనుగు కుంభ స్ధలంలో కింద దంతాలు పుట్టే స్ధలంలో ఏర్పడే ముత్యాలు పుష్యమి, శ్రావణా నక్షత్రాలలోను, ఆది, సోమ వారాలలోను మాత్రమే లభిస్తాయి. భద్ర జాతికి చెందిన ఏనుగులలో ముత్యాలు ఉత్తరాయణంలోను, సూర్య, చంద్రగ్రహణాల సమయంలోను లభిస్తాయి. దీనినే‘గజముక్తా’అంటారు. ఇది అత్యంత కాంతి వంతంగా ఉండి ఇది ఉన్న గదిలో దీపం అవసరం ఉండదని, సకల భోగ భాగ్యాలను, సర్వవిధాల విజయాన్ని కలుగజేస్తుంది.

             అడవిపందుల కోరల్లో నుండి వచ్చే ముత్యాలను‘శూకరముక్తా’ అంటారు. ఇది ధరించిన వారికి అమోఘమైన వాక్శుద్ధి లభిస్తుంది. చేపలు, తిమింగలాల పొట్టలో లభించే ముత్యాలు చేప కన్ను ఆకారంలో ఉండి చీకటిలో సైతం చూడగలిగే శక్తి కలగి ఉంటాయి.

            పుష్యమి, శ్రావణా నక్షత్రంలో కురిసే వడగండ్లవర్షంలో లభించే ముత్యాలను‘మేఘముక్తా’అంటారు.  ఇవి భూమి మీద పడే లోపల అంతరిక్షచారులైన దేవ గంధర్వ, యక్ష కిన్నెరాదులు సంగ్రహిస్తారని ప్రతీతి. ఇవి అత్యంత కాంతివంతంగా ఉండి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి.

తక్ష, వాసుకి జాతికి చెందిన సర్పముల శిరస్సులలో లభించే ముత్యాలు ‘సర్పముక్తా’అంటారు. వీటిని సానపట్టకుండా ఉంగరంలో పొదగాలి. ఈ సర్పాలు 100 సంవత్సరములు బతుకుతాయట. ఈ ముత్యాలు దరించిన వారికి మృత్యు బాధలు ఉండవని, విష సర్పబాధల నుండి విముక్తి లభిస్తుందని ప్రతీతి.

దట్టమైన అడవులలో ఉండే వెదురు బొంగులలో మరియు వెఱ్ఱి చెరకు గడల  కణుపుల వద్ద లభించే ముత్యాలు పుష్యమి, స్వాతి, శ్రావణా నక్షత్రాలకాలంలో వేణుగాన ధ్వని ఏర్పడి లభిస్తాయి. వీటిని ‘వంశీముక్తా’అంటారు. వీటికి స్త్రీ వశీకరణ శక్తి ఉంటుందని ప్రతీతి.

లక్ష్మీదేవి ఆవిర్భవించిన పాంచజన్య శంఖాలలో లభించే ముత్యాలు ‘శంఖముక్తా’ అంటారు. ఇవి నీలం రంగులో ఉంటాయి. స్వాతి కార్తెలో సూర్యుడు స్వాతి నక్షత్రంలో సంచరిస్తూ ఉన్నప్పుడు సముద్ర ప్రాంతమందు తెరుచుకొని ఉన్న ముత్యపు చిప్పలలోకి వర్షపు నీరు పోయినప్పుడు అవి ముడుచుకొని ఘనీభవించి ముత్యాలుగా మారుతాయి. సముద్రపు అలల తాకిడికి అదిరి రెండు ముత్యాలుగా పెక్కు ముత్యాలుగా ఏర్పడతాయి. వీటినే‘స్వాతి ముత్యాలు’అంటారు. వీటిని  చంద్రకిరణం లాగా చల్లగా, ప్రకాశిస్తూ అనర్ఘరత్న అనదగిన “మహా మౌక్తికం” అని అంటారు. వీటిని మంత్ర సాధకులు వశీకరణ విద్యాలకు ఉపయోగిస్తారు.

             త్రికోణంగా ఉన్న ముత్యాలు, గుంటలుగా ఉన్నవి, పొరలగా ఉన్నవి, నల్లగా ఉన్నవి, ఎక్కువ బుడిపెలు ఉన్నవి, ఎర్రగా, కాంతిహీనంగా, చేప కన్ను వలె ఉన్నవి, ఇసుక రేణువులు అంటుకొని ఉన్న ముత్యాలు దోషము కల ముత్యాలు ధరించరాదు.

ముత్యాలు ఎక్కువగా చైనా, జపాన్, ఆస్ట్రేలియాలలో లభించును. భారతదేశంలో బొంబాయి, తిరునల్వేలి జిల్లాలలోని తుత్తుకుడి దగ్గర కొన్ని వేల సంవత్సరాలుగా లభించే ముత్యాలు ఆభరణాలలోను, ఔషదాలలోను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గోమూత్రంలో కొద్దిగా ఉప్పువేసి దానిలో ముత్యం నానబెట్టి దాన్యపు ఊకతో రుద్దినప్పుడు పగలక ముందు కంటే కాంతి వంతంగా మెరిసినప్పుడు అది జాతిముత్యమని, పగిలినచో కృత్రిమ ముత్యాలుగా గుర్తించాలి. కృత్రిమముత్యాలు నీటిలో నానబెట్టిన పొరలు పొరలుగా విడిపోవును. జాతిముత్యాలను రంధ్రం గుండా భూతద్దంలో చూసినప్పుడు ఉల్లి పొరల వల్లే నరుకులు నరుకులుగా కనిపించును.

మార్చి, ఏప్రియల్ మాసములలో లభించే సముద్రపు ముత్యాలు ప్రభుత్వం ఆదీనంలో ఉండి గజఈతగాళ్ళ ద్వారా తెప్పించుకుందురు. ఇవి ధరించుటకు   ప్రశస్తమైనవి.  కృత్రిమ   ముత్యాలు   జపాన్   ఇతర  దేశాలలో
 తయారు  చేయబడుతున్న వాటిని ధరించిన ఫలితం ఉండదు.

ఆయుర్వేదశాస్త్రం ప్రకారం గోమూత్రం, ఆవుపాలతో శుద్ధి చేసిన ముత్యాన్ని చింతపండు రసం నందు మూడు రోజులు ఉంచి భస్మం చేసిన ముత్యభస్మం సేవించటం వలన మతిభ్రమణం, నేత్రదోషాలు, క్షయ, ఉబ్బసం, స్ఫోటకం, చర్మవ్యాధులు, వీర్యస్ఖలనం, శుక్ల నష్టం, పైత్యం, గుండెనొప్పి, బహిష్టు రోగాలు, బొల్లి, అజీర్ణం, జ్ఞాపకశక్తి లేకపోవటం, వ్రణాలు, అతిఉష్ణం, ఉదరసంబంధ వ్యాధులు త్వరగా తగ్గును.

             ముత్యం ధరించుట వలన ప్రయోజనాలు:- ముత్యమునకు అధిపతి చంద్రుడు. వ్యాపారకారకుడైన చంద్రుడి యొక్క ముత్యం ధరించిన వారికి వ్యాపారాభివృద్ధి, క్రయ, విక్రయములయందు నేర్పరితనం కలిగి సకల సంపదలు కలుగును. సంఘంలో సామాజికసంబంధాలు పెంచి గౌరవ ప్రతిష్ఠలు గడించే విధంగా చేస్తాయి. మానసిక ప్రశాంతత, ఆలోచనావిధానంలో మార్పులు కలుగును. 

ముత్యాన్ని భస్మం చేసి ధనవంతులు సున్నం బదులుగా వాడేవారు. దాంపత్య జీవితంలో అన్యోన్నతకు, సౌఖ్యమునకు, వివాహం ఆలస్యమగు వారికి ముత్యం ధరించిన అనుకూలమైన  సత్వర ఫలితాలు వస్తాయి. స్త్రీల పాలిట కల్పతరువు ముత్యం. తల్లి కారకత్వం వహించే ముత్యం దరించిన వారికి తల్లిచే కలహాలు, అభిప్రాయభేదాలు ఉండవు. హోటల్స్, వస్త్రవ్యాపారులు, నీటి సంబంద వృత్తులు చేసేవారు, పాలవ్యాపారం, స్త్రీల సంఘాల వాళ్ళు ముత్యం ధరించిన ప్రజలలో మంచి సామాజిక సంబంధాలు ఏర్పడి వ్యాపారాభివృద్ది కలుగును.

జాతకచక్రంలో చంద్రుడు వృశ్చికరాశిలో నీచలో ఉన్న, లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, శత్రుక్షేత్రాలలో ఉన్న, అమావాస్య రోజు జన్మించిన వారు, చంద్ర దశ అంతర్ధశలలో, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలలో లగ్నాన్ని ఆదారంగా చేసుకొని ముత్యం ధరించిన జీవితంలో కష్టనష్టాలు తొలగి మంచి అభివృద్ధిలోకి రాగలరు. మొదటి సారి ముత్యం దరించేటప్పుడు “పద్మ ద్వాజాయ విద్మహే హేమ రూపాయ ధీమహీ తన్నో సోమ ప్రచోదయాత్” అనే మంత్రాన్ని జపిస్తూ 3 క్యారెట్స్ నుండి 6 క్యారెట్స్ వరకు బరువు కలిగిన ముత్యాన్ని చూపుడువ్రేలుకి గాని, ఉంగరపు వేలుకి గాని సోమవారం చంద్రహోరాలో  పొంగలిని ప్రసాదంగా ఇస్తూ ధరించాలి.

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

రాహుగ్రహ దోష నివారణకు "గోమేదికం"


ఆవు మొక్క మేదస్సును పోలి ఉండును కనుక దీనిని గోమేధికం అంటారు. గోమేధికాన్ని గోమేధ అని, పింగస్ పధిక్, త్రినాపర్, పిస్పి, హజార్ యామిని, రాహురత్నఅని పిలుస్తారు. గోమేధికం గోమూత్రపు రంగును కలగి ఉంటుంది. గోమేధికం గోమూత్రం రంగులోను, తేనె రంగులోను లభ్యమగును. కొన్ని తెలుపు రంగులో ఉండి మెరుస్తూ ఉండును. గోమేధికం కంకర రాళ్ళలో, నదీ ప్రవాహములలో కొట్టుకొని వస్తుంటాయి.

గోమేధికం, వైడూర్యం, పుష్యరాగం, పచ్చలు స్ఫటిక జాతికి చెందిన రత్నములు. గోమేధికం వజ్రము వలె కఠినముగా ఉంటుంది. బ్రాహ్మణ వర్ణం కలిగిన గోమేధికాలు తెల్లని కాంతితో, క్షత్రియ వర్ణం కలిగిన ఎరుపు రంగు మిశ్రమంతో, వైశ్య వర్ణం కలగిన ఆకుపచ్చ, పసుపు రంగుల్లో, శూద్ర వర్ణం కలిగిన నలుపు రంగులో మిశ్రమంగా కనిపించును.

మచ్చలు, చారలు, కాంతిహీనం గలవి ధరించరాదు. వాటిలో గల దోషములలో మలినముగా, కాంతిహీనంగా ఉన్న“మలదోషం” ఉన్న వాటిని, మచ్చలు గల బిందుదోషం ఉన్న వాటిని, చారలు, గీతలు ఉన్న “రేఖ దోషం” ఉన్న వాటిని, బీటలు, ముక్కలుగా విరిగిన దోషమున్న “త్రాళ” దోషమున్న వాటిని, కాకి పాదం వంటి “కాక పాదం”దోషం ఉన్న వాటిని ధరించిన జరగరాని అనుకోని దోషాలు సంభవించగలవు.

గోమేధికాలు హిమాలయ పర్వతాలలోను, శ్రీలంక ప్రాంతములలో లభ్యమగును. సూర్యకాంత గోమేధికం సూర్యునికి ఎదురుగా పెట్టినప్పుడు అగ్నిజ్వాల వలె కనిపిస్తుంది. హిమాలయ పర్వత ప్రాంతములలో లభ్యమగు చంద్రకాంత గోమేధికం చంద్రకాంతిలో పరీక్షించిన పౌర్ణమి చంద్రుని వలె తెల్లగాను, మంచువలె చల్లగా, ప్రకాశవంతంగా  ఉంటుంది. తెలుపు, ఎరుపు రంగులలో ఉండి మెరుపు కలిగినవి, ఒకవైపు నుండి చూచిన రెండోవైపు కనపడేవి శ్రేష్ఠమైనవి.

ఆయుర్వేదశాస్త్రం ప్రకారం గోమేధికాన్ని గోమూత్రం లేదా గుర్రపు మూత్రంలో 72 గంటలు నానబెట్టి శుద్ధిచేసి, తదుపరి నల్ల ఉమ్మెత్త రసంలో ఒకరోజు అంతా ఉంచి కొలిమిలో భస్మం చేసిన దానిని స్వీకరించిన గుండె జబ్బులు, నరాల బలహీనత, నపుంసకత్వం మొదలగు వ్యాధుల నుండి విముక్తి కలుగును. రసాయనశాస్త్రం ప్రకారం బేరీలియమ్, జిర్కోనియం ఆక్సైడ్ ల రసాయన సమ్మేళనమే గోమేధికం.

         గోమేదికం ధరించటం వలన కలుగు ప్రయోజనాలు:- గోమేధికమునకు అధిపతి రాహువు. ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాలలో జన్మించిన వారు, రాహు మహాదశ, అంతర్దశ జరుగుతున్న వాళ్ళు గోమేదికం దరించటం మంచిది. భూత ప్రేత పిశాచముల భాదలు అనుభవించుచున్నప్పుడు ఉంగరంలో గోమేదికం ధరించిన భాదల నుండి విముక్తి కలుగుతుంది. గోమేదికం ధరించిన సర్వజన వశీకరణ కలుగును. శత్రువులు మిత్రులుగా మారుదురు. స్త్రీ మూలకంగా ధనప్రాప్తి కలుగును. రోగములు కలగకుండా కాపాడగలదు. విదేశీవిద్యలలో రాణించటానికి విదేశీ వ్యాపారాలు అనుకూలించటానికి, విదేశాలలో ధనార్జనకు ఉత్తమమైన రత్నం గోమేదికం.

రాహువు జాతకచక్రంలో లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, నీచలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న, రాహువు జన్మజాతకంలో గాని గోచారంలో గాని  పంచమం, నవమంలో ఉన్న, రాహుదశలోను కలహాలు, ఆస్తి నష్టాలు, కోర్టులలో గొడవలు, విద్యాభంగం, రోగ భయం, రుణబాధలు, వ్యాపార ఉద్యోగాది వృత్తులలో ప్రతికూలం, స్త్రీ మూలకంగా ఆపదలు, ఆర్ధిక బాధలు కలుగును. అట్టి సమయం నందు గోమేధికం ధరించిన బాధల నుండి విముక్తి లభించును. మలినంగా దోషములతో కూడిన గోమేధికం ధరించిన దరిద్రం, కష్టనష్టాలు కలుగును. గోమేధికాన్ని “నాగ ధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహీ తన్నో రాహు ప్రచోదయాత్” అనే మంత్రాన్ని జపిస్తూ 3 నుండి 5 క్యారెట్స్ కలిగిన గోమేధికాన్నిమద్యవేలుకు శనివారం రోజు శనిహోరలో కిలోన్నర మినుములు దానం చేస్తూ ధరించాలి. 

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

దుష్ట నక్షత్రాలు - అపవాదులు


శ్వశ్రూవినాశ మహిజౌ సుతరాం విధత్తః

కన్యాసుతే నిరృతిజౌ శ్వశురం హతశ్చ

జ్యేష్ఠా భజాత తనయా స్వధవాగ్రజంచ

శక్రాగ్ని జా భ్వతి దేవర నాశకర్త్రీ  - ముహూర్త చింతామణి.

మూలలో జన్మించిన కన్య, సుతుడు మామగార్కి దోషాన్ని కలిగిస్తాడు. ఆశ్లేష జన్మించిన కన్య, సుతుడు అత్తగారికి దోషాన్ని కలిగిస్తాడు.

జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించిన స్త్రీ భర్త యొక్క అన్న గారికి దోషకారి అవుతుంది. విశాఖ నక్షత్రంలో జన్మించిన స్త్రీ భర్త  యొక్క తమ్మునికి దోషకారి అవుతుంది.   

అపవాదులు

ద్వీశాద్యపాద త్రయజా కన్యా దేవర సౌఖ్యదా

మూలాంత్య పాద సార్పాద్య పాద జాతో తయోః శుభౌ - ముహూర్త చింతామణి.

విశాఖ 1,2,3 పాదాలలో జన్మించిన స్త్రీ మరిదికి మేలు చేస్తుంది. మూల చివరి పాదంలోను, ఆశ్లేష 1 వ పాదంలోను జన్మించిన స్త్రీ మామ గారికి అత్త గారికి శుభం చేస్తుంది. 

సుతః సుతావానియతం శ్వశురం హంతిమూలజః

తదంత్య పాదజోనైవ తధాశ్లేషాద్య పాదజః

వత్సరాత్పితరం హంతి మాతరం తు త్రివర్షతః

ద్యుమ్నం వర్షాద్వయేనైవ శ్వశురం నవ వర్షతః

జాతం బాలం వత్సరేణ వర్షైః పంచభిరగ్రజం

శ్యాలకం చాష్టభి ర్వర్షైః అనుక్తాన్ హంతి సప్తభిః

తస్మాచ్ఛాంతిం ప్రకుర్వీత ప్రయత్నా ద్విద్ధిపూర్వకం. – నారదుడు. 

ఈ వచనాలను అనుసరించి ఆయా గండ దోషాలకు పరిమితి ఉందని, శాంతి చేసుకుంటే ఆ దోషం ఉండదని స్పష్టమవుతుంది. 

తండ్రికి దోషం సంవత్సరం లోను, తల్లికి 3 సంవత్సరాలలోను,ధనానికి 2 సంవత్సరాలలోను, మామ గారికి 9 సంవత్సరాలలోను, బాలునికి 1 సంవత్సరాలలోను, అన్నకు 5 సంవత్సరాలలోను, బావమరిదికి 8 సంవత్సరాలలోను, ఇక్కడ వివరించని వ్యక్తులకు సంబందించిన దోషం 7 సంవత్సరాలలోను,కనిపిస్తుంది. అందువలన విధిని అనుసరించి శాంతి చేసుకోవాలి. 

నక్షత్ర శాంతి చేస్తే దోషముండదని దీని భావం. దీనిని బట్టి పూర్వకాలంలో బాల్య వివాహాలు జరిగే సమయంలో మూల,ఆశ్రేష నక్షత్ర దోషాలు ప్రధానంగా ఉండేవి అని జననాది 9 సంవత్సరాల కాల పరిమితి దాటిన తరువాత ఆ దోషం ఉండదని అర్ధం అవుతుంది. 

ఈ భయాల వల్ల భవిష్యత్తులో మీరు కూడ అంద విశ్వాసాలకు బలి కావచ్చును.ఎలాగంటే మీరు కోరి మంచిదని నమ్మిన నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకున్నా ఆమెకు కలిగే శిశువు మూల,అశ్లేష,జ్యేష్ట,విశాఖ,మఖ నక్షత్రాలలో జన్మిస్తే మీరు ఆ శిశువుకి వివాహం భవిష్యత్తులో చేయగలరా?అప్పుడు శాస్త్రాన్ని నిందించి ప్రయోజనం ఉండదు.

ఒకరి జన్మ నక్షత్రాల వల్ల మరణాలు మరొకరికి సంభవించవు.నక్షత్రాలవల్ల జరిగితే మంచి జరుగుతుంది గాని చెడు జరగదు.

నక్షత్రాలపై మీకు ఏదైనా సంశయం ఉంటే అది వివాహం చేసుకున్న భార్యా భర్తలకే వర్తిస్తుంది కాని వారి తల్లితండ్రులకు,అక్క చెల్లెల్లకు,లేక అన్నదమ్ములకు వర్తించదు.

కాబట్టి మీరు ఏమాత్రం సంకోచం లేకుండా మిగిలిన విషయాలన్నింటికి పొంతన కుదిరితే మూడ నమ్మకాలను వదిలి వివాహం చేయవచ్చు.

జాతక పరిశీలనలో అన్ని విషయాలకు పొంతన కుదిరితే నక్షత్రం పేరు మీద అనవసరంగా భయానికి లోనై విద్యా,వినయం,వివేకం,గుణం,సాంప్రదాయం,సంస్కారం,రూపం గల వదువులను విసర్జింపక మీరు ఆ కన్యను కోడలిగా తెచ్చుకోవచ్చు.

జాతకం సంబంధం రాగానే మూలా నక్షత్రం,అశ్లేష నక్షత్రం అని సంబంధం వద్దు అని అప వాక్యములు పలకకుండా విచారణ చేయమని విజ్ఞప్తి. శాస్త్రంలో ప్రతి అంశానికీ దోషం గురించి ప్రస్తావించిన గ్రంథంలో దోష పరిహారములు ప్రస్తావించలేదు. గ్రంథాలు అనేకం పరిశీలించిన తరువాత చేయవలసిన నిర్ణయాలు ఏమీ చదవకుండా చేయవద్దు అని సూచన.

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...