Wednesday, May 9, 2018

హనుమజ్జయంతి

      ఓం శ్రీమాత్రే నమః

అద్వైత చైతన్య జాగృతి

హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు.

హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. హనుమంతుని ఈ నామములు నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.

హనుమాన్ జయంతి సందర్భముగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటారు.

ఆంజనేయ స్వామి ధర్యానికి ప్రతీక. శక్తి సామర్ధ్యాలకు ప్రతీక హనుమత్ రూపం. సముద్రం దాటి లంక చేరాడు. ఆకాశ మార్గములో ప్రయాణం చేసి సీతమ్మ జాడ కనిపెట్టారు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తి యుక్తులను కీర్తించడం సాధ్యమా?

హనుమాన్ జయంతిని కొందరు చైత్ర పౌర్ణమి నాడు చేస్తుండగా మరికొందరు వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు. ఇక కేరళ రాష్ట్రం లో మార్గశిర మాసం లో హనుమత్ జయంతిని జరుపుకుంటారు.

హనుమంతుడు అంతులేని పరాక్రమవంతుడయ్యివుండి కూడా శ్రీరాముని సేవలో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆన్జనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తి ప్రపత్తులంటే తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారని శ్రీరామున్ని సీతమ్మ తల్లికంటె మిన్నగా ప్రమించాడు హనుమంతుడు.

ఒకసారి  సీతమ్మ నుదుటున సిందూరం పెట్టుకోవడ చూసి సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా? అని అడుగుతాడు. అందుకు సీతమ్మ నవ్వి " శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా వుండాలని చెపుతుంది. అంతే హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఒళ్ళంతా సింధూరం పూసుకుంటాడు.   అదీ హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరుపమానమైన భక్తి.

హనుమంతుని భక్తికి ఇలాంటి తార్కానాలన్ని ఎన్నో ఎన్నోన్నో వున్నాయి.

హనుమాన్ జయంతి విశేష దినాన మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతున్ని అర్చిస్తారు.  కలౌ కపి వినాయకౌ: ....... అంటే కలియుగం లో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు ... వినాయకుడు, హనుమంతుడు.
 
హనుమంతుడు - అంజనా దేవి, కేసరీల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు, మహా బాలుడు. శ్రీరామునికి దాస దాసుడు, అర్జునికి సఖుడు, ఎర్రని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినా వాడు, లంకలో బందీయైన సీతమ్మ తల్లి శోకాన్ని హరించిన వాడు, ఔషధీ సమేతముగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్ముని ప్రాణాలు నిలిపిన వాడు.  దశకంటుడు అయిన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించిన వారికి మృత్యు భయం లేకుండా వారికి సర్వత్రా విజయం లభిస్తుంది

ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. అలాగే భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయం అవుతాయి. శని గ్రహం అనుకూలంగా లేకపోతె వచ్చే బాధలూ తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది. బలం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది.

హనుమంతునికి 5 సంఖ్య చాల ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి.  అరటి పళ్ళు , మామిడి పళ్ళు అంటే ఆయనకు ప్రీతి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

అలాగే చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ  దశమి  వరకు గల మండలం రోజుల పాటు ప్రతిరోజూ 1, 3, 5, 11, లేదా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి. కోరిన కోరికలు నెరవేరే అవకాశాలు వుంటాయి. సంతానం కోరేవారు మండలం పాటు పారాయణ చేసి అరటిపండు నివేదించి ఆ పండును ప్రసాదం గా స్వీకరిస్తే తప్పకుండ సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

💫🚩💫🚩💫🚩💫 కొంగుబంగారం –
శ్రీరామ నామం
💫🚩💫🚩💫🚩💫

సకల లోకాలలో ఆదర్శగుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించేవాడు శ్రీరాముడు. రాముడు గొప్పవాడా? రామ నామం గొప్పదా అంటే రామని కంటే రామనామమే గొప్పదని చాటే కథలు చాలా ఉన్నాయి. రామ నామం గొప్పతనం గురించి ముందు తెలుసుకుందాం. రామనామ గొప్పతనాన్ని వివరించే ఈ గాథ చదవండి.

లంకానగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తూ వుంది. రాయిపై ‘రామ’ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ వుంది. ఇదంతా చూస్తూ వున్న రాముడిలో ‘నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేనే రాయి వేస్తే’ అనే ఆలోచన కలిగింది. అంతే శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోనికి వేసాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. దీనిని చూసి ఆశ్చర్యానికి లోనైన రాముడు పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని వివరించి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు

అందుకు హనుమంతుడు “రామ” అనే నామం రాసివున్న రాళ్ళే పైకి తేలుతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం రాయలేదు కదా! అందుకే మునిగిపోయింది” అని సమాధానం యిచ్చాడు.

అంటే రాముడికంటే కూడా రామనామం మహా శక్తివంతమైందన్నమాట!
రామాయణం కంటే బలమైన రామనామం

రావణాసుర సంహారానంతరం అయోధ్యనగరం చేరుకుని శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక, అయోధ్యానగరంలో రామసభ కొలువుదీరి వున్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు. మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు. కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి వుండటం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై “రామా! నీ సేవకుడు నన్ను అవమానించాడు. నీవు అతడిని శిక్షించు” అని రాముడిని ఆదేశించాడు. విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్దమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు ‘రామ’ నామాన్ని జపించడం ప్రారంభించాడు. ఈ విషయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. ‘రామ’ నామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి. అలసిపోయిన శ్రీరాముడికి పట్టుదల అధికంకాగా చివరకు బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్దమయ్యాడు.

ఇంతలో నారదమహర్షి అక్కడకు చేరుకుని “మహర్షీ! హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రమున మీరు మరణదండన విధించడమా? ‘రామ’ నామ జపం హనుమంతుడిని రామ బాణాల నుంచి రక్షిస్తూ వుంది. యిప్పటికైనా మీ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకుని ఆజ్ఞను ఉపసంహరించండి” అని విశ్వామిత్రుడితో పలికాడు.

ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు.

దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని సృష్టమవుతూవుంది. యుగయుగాలను, సర్వలోకాలను తరింపజేసిన మహిమాన్వితమైన నామం – ‘రామనామం’.

అందుకే-
‘రామత్తత్వో అధికం నామ
మితి మన్యా మహేమయమ్
త్వయై కాతౌతారి తాయోధ్యా
నామ్నుతు భువన త్రయమ్

అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు. అంటే శ్రీరాముడి చేత అయోధ్య తరింపబడింది. రామనామం చేత మూడు లోకాలు తరించాయని అర్థం!
‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరి మంత్రంలోని ‘రా’ అనే ఐదవ అక్షరం ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రంలోని ‘మ’ అనే రెండవ అక్షరం కలిస్తే ‘రామ’ అనే నామం అయింది. అంటే హరిహరతత్త్వాలు రెండింటిని ఇముడ్చుకున్న నామం రామనామం!

రామ’ అనే పదాన్ని గమనిస్తే ర, మ,లు కలిస్తే (అమ్మ) ‘రామ’ అవుతుంది ‘ర’ అంటే అగ్ని. ‘ఆ’ అంటే సూర్యుడు. ‘మ’ అంటే చంద్రుడు అని అర్థం. అంటే ‘రామ’ అనే పదంలో విశ్వాసానికి మూలమైన మూడు శక్తులు వున్నాయని చెప్పబడుతూ వుంది. అంతేకాకుండా ‘రామ’ అనే నామంలోని ‘రా’ అనే అక్షరం భక్తులను సంసారసాగరం నుంచి రక్షిస్తుందనీ ‘మ’ అనే అక్షరం భక్తుల మనోరథాలను నెరవేరుస్తుందని మహర్షులు పేర్కొనగా ‘రామ’ అనే పదంలోని ‘రా’ అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయనీ, ‘మ’ అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోనికి ప్రవేశించవని ఇందులోని అంతరార్థం.
అందువల్ల త్రిమూర్తులలో లయకారుడైన పరమశివుడు-

‘శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్రనాయ తత్తుల్యం
రామనామ వరాననే’

అని పేర్కొన్నాడు. ‘రామ రామ రామ’ అని మూడుసార్లు నామ జపం చేస్తే శ్రీ విష్ణుసహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందట. కాగామ కటపయాది వర్గసూత్రం ప్రకారం ‘య’ వర్గంలో ‘రా’ రెండవ అక్షరం కాగా ‘ప’ వర్గంలో ‘మ’ అయిదో అక్షరం. అంటే 2 X 5=10. దీనిని బట్టి ‘రామ’ అనే పదం పది సంఖ్యకు సంకేతం. ఇక మూడుసార్లు అంటే (10 X 10 X 10 = 1000) వెయ్యికి సమానమవుతుంది. అందుకే శివుడు ‘రామ’ అనే నామం మూడుసార్లు పలికితే సహస్త్రనామంతో సమానమని చెప్పినట్లు కథనం.

అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పదనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి.

కిరాతకుని వాల్మీకిగా మార్చిన రామనామం
వాల్మీకి మహర్షి జీవితమే రామనామ మహిమకు చక్కని నిదర్శనం. నిజానికి ఆయన కిరాతకుడు. మహర్షులు చెప్పినట్లుగా’మారా’ అనే మాటకు జపం చేస్తూ కొంతకాలానికి ‘మరా’ అనే పదం ‘రామ’ గా మారింది. ఆయనపై వాల్మీకం(పుట్ట) పెరిగింది. చివరికి నారదమహర్షి ఉపదేశంతో వెలికి వచ్చి రామ నామ గొప్పదనాన్ని తెలుసుకుని ‘వాల్మీకి’ అయి రామయాణాన్ని మనకు అందించాడు. రాముడికంటే రామ నామం గొప్పది.

శనిబాధలు చేరనివ్వని రామనామం

పూర్వం ఒకసారి శనీశ్వరుడు ఎలాగైనా హనుమంతుడిని ఆవహించి కష్టాలపాలు చేయాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ వున్నాడు. హనుమంతుని సమీపించి శనీశ్వరుడు తన మనస్సులోని కోరికను వెలిబుచ్చగా “నేను ప్రస్తుతం రామనామజపంలో మునిగి వున్నాను. రామనామ జపం ముగిసిన తర్వాత నీవు నన్ను ఆవహించు” అని సమాధానం యిచ్చాడు. అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు. రామనామజపాన్ని హనుమంతుడు ఎప్పుడు ముగిస్తాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూడసాగాడు. గుండెల నిండుగా సీతారాములనే నింపుకున్న హనుమంతుడు రామనామం ఆపేదెన్నడు? చివరకు నిరీక్షించి... నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపించేవారి దరిచేరడం కష్టమని తెలుసుకుని వెనక్కు వెళ్ళిపోయాడు. అంటే శనీశ్వరుడిని దరి చేరనీయని శక్తివంతమైన నామం – ‘రామనామం!’ కాబట్టి ‘రామ’ నామాన్ని జపించేవారి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహబాధలు వుండవని చెప్తున్నారు. హనుమంతుని రక్షగా వుంచే రామనామం

‘యత్ర యత్ర రఘునాధ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలి
బాష్ప వారి పరిపూర్ణలోచనం
మారుతీం సమత రాక్షసాంతకం’

అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ వుంటుందో అక్కడ కళ్ళనిండా ఆనందబాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి వుంటారట రాక్షసులను దోమల లాగా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు. దీనిని బట్టి రామ నామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ పక్కనే వుంటాడు. మనలను రక్షిస్తూ వుంటాడు. అనగా రామనామ జపం కేవలం ‘రాముడి కృపనే కాకుండా హనుమంతుడి కృపను కూడా ప్రసాదింపజేస్తుంది రామనామ సంకీర్తన
‘రామనామము రామనామము రమ్యమైనది రామనామము
రామనామము రామనామము రామనామము రామనామము
శ్రీమదఖిల రహస్తమంత్ర విశేషధామము శ్రీరామనామము
దారి నొంటిగ నడుచువారికి తోడు నీడే శ్రీరామ నామము...’

ఇలా ప్రారంభమై సాగే రామనామ సంకీర్తనను ప్రతిరోజూ ‘ఉభయ’ సంధ్యలలో పఠించడం వల్ల మానసిక శాంతి చేకూరుకుంది. ఎటువంటి సమస్యల నుండి అయినా గట్టెక్కే ధ్యైర్యం కలుగుతుంది. అంతేకాకుండా అనేకసార్లు విష్ణు సహస్ర నామ పారాయణం చేసిన ఫలం లభిస్తుంది. దీనిని ప్రతి ఒక్కరూ చేయవచ్చు. వీలున్నవారు సామూహికంగా కూడా చేయడం మంచిది.
నామమంత్రం
‘శ్రీరామ జయరామ జయజయ రామ’ అనేది పదమూడు అక్షరాల నామ మంత్రం. దీనిని పఠించడం వల్ల కూడా విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి. సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్లసార్లు జపించి శ్రీరాముడి దర్శనాన్ని పొందినట్లు పురాణకథనం. వీలున్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ వుండడం శ్రీరామ రక్ష!

రామకోటి

‘చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం’

అంటే ‘రామ’ నామాన్ని కోటిసార్లు రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. ‘రామకోటి’ రాయడం అనాది నుంచి మనదేశంలో వున్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటిని రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమినాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు. రాసేవారు కొన్ని నియమాలను పాటిస్తే శ్రీరాముడి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.

అంతటి శక్తివంతమైన రామనామ జపం వీలున్నప్పుడు చేద్దాం. శ్రీరామ, హనుమంతుల కృపకు పాత్రులమవుదాం.
శ్రీరామ నామ జపం ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు.
💫🚩💫🚩💫🚩💫
Report this ad

సూర్యాంజనేయం

శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం, విన్నాం కానీ ఈ సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి/ హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడడు.

బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం : హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎఱ్ఱని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. కాని ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించాడు. ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం.

సూర్యశిష్యరికం :

బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్యనూ అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యనూ అభ్యసించిన వివిధ పురాణాలు వేరు వేరుగా చెబుతున్నాయి. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు (గడియకు లక్షా డెబ్బై వేళ యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యాభ్యాసం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి) జిజ్జ్వల్యమానంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన ఘనుడు వాయుపుత్రుడు ఒక్కడే. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమగామంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని వినయంతోను, సింహికను శక్తితోను, సురసను యుక్తితోను జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.

సూర్యుపుత్రునికి స్నేహితుడు :

సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను, సహాయాన్ని అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే. అంతేగాక రావణ సంహారానికి తోడ్పడే నరవానర మైత్రికి బీజం వేసినవాడు కూడా హనుమంతుడే.

సూర్యుని మనుమడు : కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి సూర్యుసుతుడైన సుగ్రీవునికి సోదరి. అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు. కనుక సూర్యుడు హనుమంతుడికి తాత.

సూర్యుని అల్లుడు : వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావన లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది. పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది.

సూర్యవంశీయుని భక్తుడు : హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. శ్రీరామునితో పరిచయమైనా నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.

త్రిమూర్తుల శక్తి : సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూతుడు. అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక. హనుమంతుని భవిష్యబ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి. కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకామైనట్టే. సూర్యుని కూడా త్రిమూత్రుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి. కాబట్టి శ్రీ సూర్యరామాంజనేయులను ద్విగుణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించ వచ్చు. ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్త్యాత్మకంగా విస్తరించింది.

⚜💫⚜💫⚜💫⚜
                     శ్రీ రాముని చిత్రంలో ,మనకు శ్రీరాముడు ,సీత ,లక్షణుడు ,హనుమంతుడు సాధారణంగా కనిపిస్తారు . శ్రీరాముడు  జ్ఞానం ,సీత భక్తి ,లక్ష్మణుడు వైరాగ్యం ,హనుమంతుడు బుద్ధి యోగం . సర్వే సర్వత్ర ఉన్నది సీతా రాములే . లక్ష్మణుడనే జీవుడు , వైరాగ్య భావంతో ,నాది అనే భావాన్నిశరీరానికి  [ఊర్మిళలా]నిద్రాణంగాఉంచి , ప్రచోదనం చెందిన హనుమంతునివంటి బుద్ధితో, సర్వే సర్వత్ర సీతారాములే ఉన్నారని ,తానంటూ వేరుగా లేనని పొందే  అనుభవం ఒక  వ్యక్తిదే కానీ ,సాధన స్వరూపాన్నే మనకు 4మూర్తులుగా పరిచయం చేస్తున్నది ,రామాయణం. శరీరమే తను . శరీరానికి సంబంధించినవి తనవి . ఇదే జీవతత్వం . తాను శరీర మాత్రుడు కాదని, సృష్టి, దృష్టిలో ఉన్నా అనుభవానికి రావడం పరతత్వం . దృష్టిలో, సృష్టి కదలుతున్నా , మెలకువలో బుద్ధి పరతత్వంలో మేలుకొని సృష్టిలో కదలు తున్నదంతా పరమాత్ముని శక్తి మాత్రమే, అనే అనుసంధానాన్ని కొనసాగించి ,ప్రతి కదలికను జ్ఞానాగ్ని పునీత సీతగా గ్రహించి అష్ట సిద్ధి రూపంగా కలుగుతున్న భౌతిక ,ఆధ్యాత్మిక సంపదను మాయగా గుర్తెరిగి ,సాక్షాత్తుగా సీతా మహాదేవి ప్రసాదించిన మాల,అయినా,తన అంతరంగంలో శాంతికి ఏ మాత్రం భంగం కలగకుండా సాధనలోని ఏకాగ్రతను సడలనివ్వక ప్రతి క్షణంలో,రామపట్టాభిషేకాన్నిద్రుష్టి నుండి దూరం కానియక[అంతా పరమాత్మదే]అని,నిద్రలోనడిచే వ్యక్తిలా[భరతుడు] అవసరమైనంత వరకే ,సృష్టిలో చరిస్తూ,చేరే ,జీవన్ముక్త స్థితికి నిర్వచనమే,రామాయణం.ప్రతి అవతార గాధ, వివిధ,మానవ స్వభావాలకు,వివిధ మార్గాలను గమ్యాన్ని చేరడానికి నిర్దేసించినవి. ఎన్నో మానవ స్వభావాలకు వేరు,వేరుగా బోధ సాగడానికి అనువుగా పెద్దలు వివిధ దేవతా రూపాలుగా,తత్వాన్ని పరిచయం చేశారు .విద్యుచ్చక్తి అనేక ఉపకరణాలుగా , వినియోగించ బడినంతమాత్రాన,దాని ఏకత్వానికి ఏభంగం లేనట్లే ,అనేకదేవతారాధన అని అందరూ భావించేది,అవగాహనా రాహిత్యమే కానీ,నిజం కాదు .దీన్ని కూడా అవసరం లేని వారిని లోపలికి రానివ్వని కంచెలా , అర్హత లేని వారిని సాధనకు రాకుండా కాపాడే మాయ మాత్రమే.

శ్రీ ఆదిశంకరుల విరచిత కాశీ విశ్వనాథాష్టకం

గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 1 ||

వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 2 ||

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 3 ||

సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 4 ||

పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 5 ||

తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 6 ||

ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 7 ||

రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 8 ||

వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతమ్ అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ||
విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ||

*కాశీవిశ్వనాథాష్టకం -తాత్పర్యం*
*******************
గంగాధరుడు
************
గంగా తరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం:
************
గంగా నదీ అలలను తన జటాఝూటంలో అందంగా కలిగిన, తన ఎడమ వైపు పార్వతీ దేవి ఎల్లప్పుడూ శోభించే, శ్రీహరికి ప్రియుడైన, మన్మథుని గర్వము అణచిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

వామే శక్తి ధరం వందే వకారాయ నమో నమః

వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం
వామేన విగ్రహ వరేణ కళత్రవంతం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************
పదములకు, వర్ణనకు అందని అనేక గుణాలు కలిగిన స్వరూపంతో ఉన్న, బ్రహ్మ విష్ణు మరియు ఇతర దేవతలచే సేవించబడిన పాదములు కలిగిన, తన ఎడమ వైపు శుభములు కలిగించే పార్వతిని కలిగి ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
పులిచర్మము ధరించిన శశిధరుడు

భూతాధిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం
పాశాంకుశాభయ వర ప్రద శూల పాణిం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం:
************
సమస్త భూతములకు అధిపతియైన, సర్పములను ఆభరణంగా కలిగిన, పులిచర్మం వస్త్రంగా ధరించిన, జడలు కట్టిన కేశములు కలిగిన, పాశము (తాడు), అంకుశము, త్రిశూలము ధరించిన, అభయము, వరాలను ప్రసాదించే, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
నెలవంక సిగపూవు నవ్వగా

శీతాంశు శోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానల విశోషిత పంచ బాణం
నాగాధిపారచిత భాసుర కర్మ పూరం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం:
************
చల్లదనాన్ని ఇచ్చే చంద్రుని కిరీటముగా కలిగి భాసిల్లుతున్న, తన ఉగ్రనేత్రముతో మన్మథుని దగ్ధము చేసిన, నాగేంద్రుని కర్ణములకు అలంకారముగా ధరించిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
రౌద్రమున, ఆనందమున తాండవము

పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం దనుజ పుంగవ పన్నగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం:
************
మదించిన ఏనుగులపాలిటి సింహంలా ఉన్న, అసురులపాలిటి గరుత్మంతుని వలె ఉన్న,  మరణాన్ని, శోకాన్ని, వృద్ధాప్యాన్ని నాశనం చేసే అగ్నిలా ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
నిరంజనుడు, నిర్గుణుడు

తేజోమయం సుగుణ నిర్గుణమద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయం
నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************
తేజస్సు కలిగి, సుగుణములు కలిగి, గుణములు లేని, వేరే సాటిలేని, ఆనందకారకుడైన, ఓటమి ఎరుగని, తర్కానికి అందని, సర్పములకు ఆత్మయై, అన్ని శుద్ధ స్వరూపములు తానేయై, ఆత్మ స్వరూపుడైన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
సచ్చిదానందుడు

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందా
పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ
ఆదాయ హృత్ కమల మధ్య గతం పరేశం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
************
ఏ కోరికలూ లేనివాడైన, దోషములు ఎంచని, నింద చేయని, పాపములకు దూరముగా ఉండి సమాధి స్థితిలో ఉన్న హృదయకమలము మధ్యలో నివసించి ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
గరళ కంఠుడు

రాగాది దోష రహితం స్వజనానురాగం,
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహయం,
మాధుర్య ధైర్య శుభగం గరళాభిరామం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: 
**************
రాగద్వేషాది దోషములు ఎరుగని, తన భక్తులను ప్రేమతో చూసే, వైరాగ్యము, శాంతికి నిలయమై, హిమవంతుని పుత్రిక సహాయం పొందుతూ, మాధుర్యము, ధైర్యము కలిగి విషాన్ని ధరించిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము

ఫలశ్రుతి:
***********
వారాణసీ పురపతే
స్తవనం శివస్య
వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం

తాత్పర్యం:
************
వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని అష్టకాన్ని పఠనం చేసే మనుష్యులకు దేహమున్నప్పుడు విద్య, మంచి, ఎనలేని సుఖము, అనంతమైన కీర్తి, అటు తర్వాత మోక్షము లభించును.

విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

తాత్పర్యం:
************
ఈ విశ్వనాథ అష్టకం శివుని సన్నిధిలో చదివిన వారికి శివలోకము, ఆ పరమశివుని ఆశీస్సులు పొందుదురు.
అంతర్యామి - అంతయును నీవే.

శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత


మన పండుగల్లో ముఖ్యమైంది. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా హనుమంతుని కధలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు నిర్వహిస్తారు.
ఆంజనేయస్వామి ధైర్యానికి ప్రతీక. శక్తిసామర్ధ్యాలకు ప్రతిరూపం. సముద్రం దాటి లంక చేరాడు. ఆకాశమార్గంలో పయనించి సీతమ్మవారి జాడ కనిపెట్టాడు. సంజీవనీ పర్వతాన్నే పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తియుక్తులను కీర్తించడం సాధ్యమా?! హనుమజ్జయంతి సందర్భంగా పంచముఖ హనుమాన్, పాదరస హనుమాన్ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయాల్లో హనుమాన్ ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరు ఈవేళ ఉపవాసం ఉండడానికే ఇష్టపడతారు.
హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు.
హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తికి, బల సంపన్నతకు సంకేతమైన హనుమంతుని విశేషాలు స్మరించుకుందాం. హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండీ రాముడి సేవలో గడపడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆంజనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తిప్రపత్తులు అంటే, తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు. శ్రీరాముని, సీతమ్మతల్లి కంటే మిన్నగా ప్రేమించాడు హనుమంతుడు.
ఒకసారి హనుమాన్ సీతాదేవి నుదుట సిందూరం పెట్టుకోవడం చూసి,"నుదుట సిందూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా" అని అడుగుతాడు.
సీతమ్మ తల్లి నవ్వుతూ "శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని" అంటుంది.
అంతే, హనుమంతుడు క్షణం ఆలోచించకుండా తన ఒళ్ళంతా సిందూరం పూసుకుంటాడు. అదీ హనుమంతునికి రాముడి మీద గల నిరుపమానమైన భక్తి. హనుమంతుని భక్తికి ఇలాంటి తార్కాణాలు ఎన్నో!
ఒక సందర్భంలో సీతమ్మ హనుమంతునికి రత్నాభరణాన్ని బహూకరించింది. హనుమంతుడు ఒక్కో పూసనూ కొరికి చూసి, విసిరేయసాగాడు.
అదేమిటని అడగ్గా, ''రామయ్య తండ్రి కనిపిస్తాడేమోనని ఆశగా చూశాను. నా స్వామి లేని రత్నాలు, స్వర్ణాలతో నాకేం పని?” అన్నాడు.
హనుమంతుని నిరుపమానమైన భక్తికి ఇంతకంటే కొలమానం ఇంకేం కావాలి? రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోగా, ఆ తల్లిని అన్వేషించడానికి బయల్దేరాడు హనుమంతుడు. అహర్నిశలూ ప్రయత్నించి, సీతమ్మ జాడ తెలుసుకున్నాడు.
అశోకవనంలో శోకమూర్తిలా కూర్చుని, దిగులు సముద్రంలో కుంగిపోతూ, ఆత్మత్యాగం చేయాలనుకుంటున్న సీతమ్మకు శ్రీరాముని అంగుళీయకం చూపి, ధైర్యంగా ఉండమని స్థైర్య వచనాలు పలికాడు. లంకాదహనం చేసి తన వంతు సహకారం అందించాడు.
వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు. పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంవల్ల ధైర్యం,స్థైర్యం కలుగుతాయి. భయాలూ భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు.
ఇక హనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతో హనుమంతుని అర్చిస్తారు.
- శ్రీ హనుమాన్ జయంతి (తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారు.)
''కలౌ కపి వినాయకౌ : అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు,
హనుమంతుడు.
హిందూమతంలో ప్రాముఖ్యత :
హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః
రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్
హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది.
హనుమంతుని నైజం
యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్
శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.
కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ(11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివును అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనందభాష్పాలు కారుస్తూ, నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు. చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి, రామకధ చెప్పే సభలో ఒక మూలున కూర్చుంటారు. అందరు రాకముందే వచ్చి, అందరు వెళ్ళిపోయేవరకు ఉంటారు.
భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయమవుతాయి. చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. శని బాధలు తొలగిపోతాయి. బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి(మీకు వీలైనన్ని సార్లు)హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరు, ఈ 40(మండలం) రోజుల పాటు కఠిన బ్రహ్చర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి, నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలిగి తీరుతుంది.

హనుమాన్ జయంతి రోజున పూజ ఎలా చేయాలి?

హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు.

పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్‌ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...