Wednesday, March 7, 2018

భగవద్గీతను ఎందుకు పఠించాలి?

బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు. నిజమే! తలరాతను ఎవరూ మార్చుకోలేకపోవచ్చు. కానీ, గీతను చదివితే మాత్రం జీవనరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోను, మనిషి జీవితంలోను గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే…భగవద్గీత అనగా….భగవంతునిచే గానం చేయబదినదని అర్థం. అంతే భగవంతుని చేత చెప్పబడింది. ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవత్ తత్వము, భగవంతుడిని చేరే మార్గాలు, మనిషి పరమపదాన్ని పొందడానికి ఆచరించే మార్గాలు తదితర విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. గీతలోని 18 అధ్యాయాలు మోక్ష సౌధానికి చేర్చే 18 సోపానాలని వేదాంత కోవిదులు చెబుతారు. ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత ఈ మూడింటినీ కలిసి ‘ప్రస్థాన త్రయం’ అంటారు. ప్రాస్థానం అనగా ప్రయాణం. మనిషి పరమపద ప్రయాణానికి కావలిసిన సాధన సంపత్తుల గురించి, నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించివీటిలో పుష్కలంగా ఉంది. నేటి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని అంటున్నారు. 

లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగామ్. ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరింపబడి 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని ‘మోక్ష సప్తసతి’ అని కూడా అంటారు. ఉపనిషత్తులను చదవాలి. బ్రహ్మసూత్రాలను మననం చేయాలి. భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి. భగవద్గీత వేదాంత విషయాలు, వేదాంత రహస్యాలు, పరమ పదాన్ని చేరే ఉపాయాలు ఉన్నాయి కాబట్టి సన్యాసం స్వీకరించిన మోక్షగాములకు, వయసు మళ్ళినవారికి ఉపయోగపడే గ్రంథమనే అభిప్రాయం చాలమందిలో పాతుకుపోయింది. కానీ, ఇది నిజం కాదు. గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది. ఇది స్పృశించని అంశమంటూ లేదు. అందుకే ఇది ప్రపంచంలోనే మకుటాయమానమైన సాహిత్య ఉద్గ్రంథం. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను ఆధారం చేసుకునే నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారు. 

గీతలో దైనందిన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి? సన్మార్గాన ఎలా నడవాలి? సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది, లోక కల్యాణానికి ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు పొందుపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం ‘పారాయణ గ్రంథం’ కాదు, ‘అనుష్టాన గ్రంథం’ (అంటే నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించదగ్గది). భగవద్గీత కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యశాస్త్రం, ఆహారవిజ్ఞానశాస్త్రం, నైతికధార్మిక శాస్త్రం. ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రం. మనిషి జీవితానికి సంబంధించి అన్ని విషయాలను ఇది చర్చించింది. అందువల్లే భగవద్గీతను ‘మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం’ అని అన్నారు. గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. భగవద్గీతలో ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై ఉన్న ప్రకృతి గుణాలైన సత్వ, రాజ, స్తమములను నిత్య జీవితంలో జయించడం, ద్వంద్వాములను నిగ్రహించడం, సదాచారం, సమబుద్ధి, సత్ప్రవర్తన పెంపొందించుకోవడం, సత్వగుణాలను అలవర్చుకోవడం, నిష్కామ కర్మానుష్టానం ద్వారా ఉత్తమ స్థితికి చేరుకోవడం, సాత్విక ఆహార నియమాలను పాటించడం, రాజసిక, తామసిక పదార్థాలను విసర్జించడం, ధ్యాన యోగ సాధన ద్వారా నిరంతర దైవచింతన, జ్ఞానాన్ని పొందగోరువారు పాటించాల్సిన నియమాలు, ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడగలగడం….ఇంకా ఎన్నో విషయాలు విపులీకరించి ఉన్నాయి. వాటిని తెలుసుకుని ఆచరించిన మనిషి మహనీయుడు అవుతాడు.ప్రస్తుత మానవ జీవితమ పూర్తిగా భౌతిక దృక్పథానికే పరిమితమైంది. స్వార్థమే పరమావధిగా తలుస్తూ, మనశ్శాంతి లేక కాలం గడుపుతున్నాడు. ఈ దృక్పథం మారాలంటే, మనసులో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే, నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలంటే ఆధ్యాత్మిక చింతన కావాలి. అటువంటి మార్పు కోరుకునేవారు తమ దైనందిన వ్యవహారాల్లో ‘గీత’కూ చోటు కల్పించాలి. అప్పుడు స్వీయాభివృద్ధితో పాటు సమాజభివృద్ధి ఎలా సాధ్యామవుతుందో ప్రతి ఒక్కరూ అనుభవం మీద తెలుసుకోవచ్చు.

ఉగ్రరధ శాంతి షష్టి పూర్తి మహోత్సవం

మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్క. (ఈ తరువాత ఆధ్యాత్మిక జీవితమే తరువాయి అని గుర్తు. దీనికోసమే షష్టి పూర్తి ఉత్సవం చేసి, పిల్లలకు బాధ్యతలు ఒప్పగించి, వాసనప్రస్థులవుతారు.

షష్టి పూర్తి 60 సం|లు నిండిన తరువాత చేసుకోవలసిన ఉత్సవము. ఒకమనిషి జీవితంలో 60 సం|లు పరిక్రమ పూర్తి అవుతుంది. మృత్యుంజయుడు అయిన రుద్రుడు ఆజీవియందు ఉగ్రుడై ఉంటాడు. రుద్రుణ్ణి శాంతిపచేయు కార్యక్రమము అందుకే దీనిని "ఉగ్రరధ శాంతి" అంటారు. అపుడు నక్షత్ర, గ్రహ, మృత్యుంజయ జప, తర్పణ హోమాదులు, ఆయుష్య సూక్త పారాయణ హోమాదులు, రుద్రాభిషేకం, సూర్యనమస్కారములు, ఇతర దేవతాపారాయణాలు యధావిధిగా శక్త్యానుసారం జరిపించుకొనుట ఉత్తమము.

"ఉగ్రరధ" అనే భయంకర దోషము అరవై నిండగానే మనిషి కి ఆవహిస్తుంది . దానివల్ల భయంకర శోకము ను మానవులు పొందుదురు . అందువల్ల షష్టి పూర్తి కార్యక్రమము లో భాగంగా ' ఉగ్రరధ ' దోషనివారణ కార్యక్రమనూ జరుపుకుంటారు .

షష్టి పూర్తి అనగా అరువది సంవత్సరములు ఆయువు పూర్తి అయిన పిదప మరల అరువది సంవత్సరముల ఆయువును ప్రసాదించమని భగవంతును కోరుచూ చేయు ఉత్సవము. దీనినే షష్టి పూర్తి మహోత్సవం అని అంటారు. ఈ షష్టి పూర్తి మహోత్సవం నే అమృతోత్సవం అని కుడా అందురు. అమృత + ఉత్సవం అమృతము అనగా మోక్షము . ఉత్సవం అనగా ఆనందమును పుట్టించు శుభకార్యము. మోక్షమును, అమితానందమును కలిగించమని ఆ భగవంతుని కోరుకోనుచు చేయు శుభకార్యమే" అమృతోత్సవము ".

ఈ ఉత్సవమును అరువద్ది సంవత్సరములు పూర్తి అయిన తల్లితండ్రులకు వారి సంతానము చేయదగినట్టిదే ఈ మహోత్సవం. ఇందు ఆయుష్కామన యజ్ఞము కూడా జరిపించబడును. అనగా ఆయు: + కామన + యజ్ఞము - ఆయు: అనగా ఆయువు, కామన అనగా కోరి, యజ్ఞమనగా శ్రేష్టమైన, పవిత్రమైన మరియు భగవంతునికి ప్రేతి పాత్రమైన శుభకర్మ. దీనిద్వారా నిండు నూరేళ్ళు ఆయువును ప్రసాదించమని పరమాత్మను కోరుకోనుచు చేయు శ్రేష్టమైన కర్మే " ఆయుష్కామన యజ్ఞ " మందురు. ఈ ఉత్సవమును యజ్ఞము ద్వారా శాస్త్రజ్ఞానము కలిగిన బ్రాహ్మణుల ద్వారా జరిపించుట శ్రేష్టము. ఇది కడు ఉత్తమోత్తమైన సత్కర్మ. ఈ కార్యక్రమము జరుగుచుండగా ఆ తల్లితండ్రులు పొందు ఆనందానుభూతిని వర్ణించలేము. అది స్వయముగా చూడవలయును. మన ప్రత్యక్ష - సాకార దేవతల పూజ అంటే ఇదే. ఇది ఎంతో పుణ్యం చేసుకున్న గుణవంతులైన సంతానమునకు మాత్రమె లభించును. ఇట్టి సేవ, పూజ కొన్ని లక్షలు, కోట్లు గుమ్మరించినా ఈ ఫలము లభించదు. ఈ సంస్కారమునే సాకార - ప్రత్యక్ష దేవతల పూజ అనియు అంటారు.

భీమరధ శాంతి: 70 సం|లు నిండిన తరువాత చేసుకొనే శాంతి.
విజయరధ శాంతి: 78 సం|లు నిండిన తరువాత జరిపించుకొను శాంతి.
సహస్ర చంద్రోదయ దర్శన వ్రతం: 83 సం|లు ప్రారంభంనుండి చేసుకునే శాంతి. వ్రతంలేదా 1000(పౌర్ణమి) చంద్రోదయదర్శనములు పూర్తి అయినతరువాత (లేదా) మునిమనమలు పుట్టినతరవాత చేసుకోవలసిన కార్యక్రమం దీనినే "ప్రపౌత్రజననశాంతి" అనికూడ అంటారు. ఈ వ్రతము యదాశక్తిగా సూర్యచంద్ర అరాధనతోపాటు విశేషమైన కార్యక్రమములు జపదాన హోమాదులు జరిపించుకోనవలెను. వంశంలోని పిల్లలందరూ వీరికి పుష్పాభిషేకం చేయుట అచారంగ కలదు.

మన ధర్మంలో విధినిషేధాలు ఎందుకు ?

ఈ  మధ్య  చాలా మంది  అడిగే  ప్రశ్న: మేమెందుకు గర్భగుడిలోకి వెళ్ళలేము? మేమెందుకు మూల విగ్రహాన్ని ముట్టుకోకూడదు? మేమెందుకు  వేదం  నేర్చుకోకూడదు? పుస్తకాలు కొనుక్కుని మంత్రాలు మేము మాత్రం చదవలేమా?

వీటికి  కొంచెం సహేతుకంగా సమాధానపరుద్దాం.ఒక  కధ చెప్పుకుందాం.
ఒక రీసెర్చ్ లాబరేటరీ వుంది. దానిలో కొన్ని అణుధార్మిక పదార్ధాలు ఉంచబడ్డాయి. ఆ ల్యాబ్ లోకి వెళ్ళడానికి  కొందరికే అనుమతి వుంది. దానిలోకి  వెళ్ళాలంటే ప్రత్యేక ట్రైనింగ్, తీసుకోవలసిన జాగ్రత్తల మీద కొంత orientation అన్నీ వున్నాయి. దానిలోకి  వెళ్ళడానికి కొంతమందినే ఎంచి  వారికి మాత్రమె లోనకు వెళ్ళే అనుమతిని ఇచ్చారు ఆ పరిశోధనా గృహం వారు. ఇంతలో కంచర గాడిదయ్య అనే ఒకడు, అసంతృప్తి దేశదిమ్మరమ్మ అనే  మరో మహిళా శిరోమణి ఆ  సంస్థ మీద కసితో దీన్ని కొన్ని వర్గాల వారి కుట్ర అని గొడవ చేసి, గగ్గోలు పెట్టి వారు పని చెయ్యని సోమరులు వారిని మాత్రమె ప్రత్యేకంగా అనుమతిస్తున్నారని నానా యాగీ చేసి ఆ సంస్థను అప్రతిష్టపాలు చేసేవారు. చివరికి ఒకరోజు ఆ సంస్థ వారికి వెళ్ళండి, కానీ సరైన ట్రైనింగ్ తీసుకోండని చెప్పారు. అబ్బ చ్చా మాకన్నీ  తెలుసులే అని వెళ్లి ఆ గదిని పరిశీలించి అక్కడ  వాళ్ళకేమి అర్ధం కాక ఆ పదార్ధాలను అటు ఇటు చూసి పట్టుకుని, మొహం మీద పెట్టుకుని సేల్ఫీలు దిగి కొన్ని టీవీ చానెళ్ళలో తాము చేసిన గొప్ప పనిని అందరికీ తెలిసేలా చేసి ఇన్నాళ్ళు తమను ఎలా అణగదోక్కారో కధలు అల్లి మరీ వివరించారు.కొన్నేళ్ళు బాగానే గడిచాయి. ఆ అణుధార్మిక వస్తువులకు తమవాడు, పగవాడు అని ఏమి తేడా వుండదు. ఇద్దరికీ శుబ్బరంగా కొన్ని అంతు తెలియని వ్యాధులు సంక్రమించాయి. కాన్సర్ అని, మరొకటి అని, ఎన్నో ఆ వస్తువుల దీర్ఘకాలిక రోగాలోచ్చి చివరికి దేహత్యాగం చేసారు.

మేరీ క్యూరీ అణుధార్మికత మీద పరిశోధనలు చేసినప్పుడు ఎన్నో విషయాలు కనుక్కుంది. దాని వల్ల శరీరం మీద ఎటువంటి ప్రభావం వుంటుందో వివరంగా చెప్పింది. ఎలా కాపాడుకోగలమో చెప్పింది. కానీ ఆవిడ మాత్రం వాటి మీద పూర్తి అవగాహన సాధించే క్రమంలో ఎంతో దగ్గరగా ఆ  రేడియం తో పని చేసింది. దానివల్ల శరీర రుగ్మత కలిగి, కాన్సర్ తో మరణించింది. కానీ ఆవిడ తెలిపిన విధానంతో ఎందరో శాస్త్రజ్ఞులు కాపాడబడ్డారు. ఆవిడ భర్త కూడా అటువంటి రోగానికే ప్రాణం వదిలారు. కానీ వీరి పరిశోధనల వలన ఎన్నో విషయాలు, జాగ్రత్తలు తెలుసుకున్నారు. అటువంటి అన్ని విషయాలు గ్రంధస్థం చేసారు. దాన్ని వారు భావితరాలకు అందించారు. ఆ చెప్పిన విషయాల వలన ఎంతో జాగ్రత్తగా మరింత పరిశోధనలు చేసి యురేనియం, ప్లుటోనియం ఇలా ఎన్నో పదార్ధాలను కనుక్కుని, వాటి ద్వారా అమోఘమైన శక్తిని ఉత్పత్తి చేసారు మన శాస్త్రజ్ఞులు. కానీ దీనికి ఆది మాత్రం క్యూరీ దంపతుల విశేష పరిశోధన, కృషి. వారు ఈ విషయంలో వారు నేటికాలం మహర్షులు.

మన సనాతన ధర్మం గురించి ఒకసారి ఆలోచిస్తే మనకు తెలిసిన విషయం కూడా ఇంచుమించు ఇటువంటిదే. తమ శరీర సౌఖ్యాలను వదులుకుని తాము ఎన్నో విషయాల మీద పరిశోధనలు చేసి, తపించి, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఎన్నో విషయాలు తాము శిష్యులకు తరతరాలుగా బోధించారు. గ్రంధస్థం చేసారు. అవే మనకు పురాణఇతిహాసాలు, ధర్మ శాస్త్రాలు, ఆగమాలు ఇలా ఎన్నో రకంగా ఎన్నో విషయాలను జాగ్రత్తగా అందించబడ్డాయి. వాటిలో ఏ క్రతువులు ఎలా చెయ్యాలో, ఏ విగ్రహ ప్రతిష్ట ఎలా జరగాలో, ఒకడు దేవాలయంలో ఎలా మసలుకుంటే వాడికి మంచిది, ఏది చెయ్యకూడదు లాంటి  ఎన్నో విషయాలను పంచుకున్నారు. వాటిని చదవాలన్నా ముందు వారికి కొంత వేదజ్ఞానం వుండాలని నియమం పెట్టారు. ఇదేదో అందరికీ అందించవలసిన విషయాలు కావు, కేవలం ఎవరికైతే అధికారం వుందో వారు మాత్రమె ఈ గర్భగృహ ప్రవేశం చెయ్యాలి అన్న నియమాలను చెప్పారు. అలాగే సామాన్య జనం ఎలా ఉండాలో,వారి పరిధి ఎంతవరకో నిర్ణయించారు. మంత్రశక్తితో అక్కడ దైవీ శక్తిని ఎలా అక్కడకు ఆహ్వానించవచ్చో శాస్త్రం తెలిసిన వారికి తెలుస్తుంది. ఒక గురువు దగ్గర ఎలా మసలుకోవాలో, ఒక దైవం దగ్గర ఎలా మసలుకోవాలో చెబుతుంది శాస్త్రం. తద్విరుద్ధంగా చేస్తే  వారు తత్వ్యతిరిక్తమైన ఫలితాలు చవి చూస్తారు. ఒక శాస్త్రజ్ఞుడు చేసే పరిశోధన తెలియని వాడికి ఎలా పిచ్చిగా  వుంటుందో, మన క్రతువుల గురించి తెలియని వారికి అలాగే అర్ధం కాదు. అవన్నీ జాత్యహంకారంతో ఇలా వాళ్లకు వాళ్ళే  రాసేసుకున్నారని నేడు కొందరు కుహనా మేధావులు దుష్ప్రచారం చేస్తున్నారు. నేడు ఆ గర్భగుడిలోకి వెళ్లామని గొప్పగా చెప్పుకుంటున్నారు. దీని పర్యవసానాలు నేడు తెలియవు. కొన్ని రోజులు ఓపిక పడితే వారి ప్రాభవం మనం చూడకపోము.

ఒక  దైవప్రాసాదంలో మడి వుంటుంది, ఆచారం వుంటుంది. అక్కడ ప్రతిష్టితమైన శక్తి కి అనుసరణీయమైన ఒక పద్ధతి వుంటుంది. అవన్నే పాటిస్తేనే అక్కడకు వెళ్ళిన ఫలితం దక్కుతుంది. ఒక యూనివర్సిటీ కి ఎందుకు ఒక  స్కూల్ కు  వెళ్ళాలంటే ఒక యూనిఫారం వేసుకుని వెళ్తాం. ఒక ముఖ్యమైన మీటింగ్ కు  వెళ్ళాలంటే ఎంతో జాగ్రత్తగా తయారవుతాము. అంత భక్తి నమ్మకం వున్నవాళ్ళు దేవుని దగ్గరకు వెళ్ళాలంటే ఒక రకం దుస్తులు ధరించాలంటే బాధ ఎందుకు?

ఎలాగైతే ఒక యంత్రాన్ని నడపగల టెక్నీషియన్ కు  మాత్రమె ఆ యంత్ర గదిలోకి  అనుమతి వుంటుందో, ఒక ఆపరేషన్ థియేటర్ లో ఎలా వైద్యం, శాస్త్ర చికిత్స తెలిసిన వైద్యులకు మాత్రమె ప్రవేశం వుంటుందో, యంత్ర తంత్ర మంత్రం ప్రతిష్టితమైన ఒక దేవాలయ గర్భగుడికి కూడా కొందరికే అనుమతి వుంటుంది. అది ఏ వర్ణం వారైనా సరే. బ్రాహ్మణుడు కదా అని అందరు బ్రాహ్మణులకు గర్భ గుడిలో ప్రవేశం వుండదు. ఇది తెలియని కొందరు కేవలం ఇది బ్రాహ్మణ కుట్ర అని అందరినీ పక్కదోవ పట్టిస్తున్నారు.
తా చెడ్డ కోతి వనమెల్లా చెరచినది అన్నట్టు ఒక అర్ధం కాని మూర్ఖుడు మరింత మందిని మూర్ఖత్వంలోకి నేట్టేస్తున్నాడు. తద్వారా దేశ సమగ్రతను దెబ్బ తీస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ళకు ఎప్పటికైనా బుద్ధి రావాలని ప్రార్ధిద్దాం.

వారికి కొంతైనా జ్ఞానం ప్రసాదించమని కోరుకుందాం

ఆయుర్దాయం

    

శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ  ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. 💐

అనేది వేద  ఆశీర్వచనం.. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది.

"వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం".

అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో పశ్యేమ శరదశ్శతం,   జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం అని చెప్పబడించి.

నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలి అని ఆకాంక్షిస్తాం.

ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. గుడ్ మార్నింగ్ అని చెప్పడం, గుడ్ నైట్ చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం.

మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలూ జరుగుతుంది.

ఇది పూర్వకాలపు విషయమే కాదు,  నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం.

“బ్రతికి యుండిన
శుభములు
బడయవచ్చు
కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది.

అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే.

కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి?

అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం. నిజమే, ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా?

దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా?

ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ
పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః
అని చెప్పబడింది.

అంటే “ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటాయని" దాని అర్థం.

ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న.

లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం న శక్యతే నుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని,
జరిగి తీరుతుందని మరికొందరి మాట.

ఏది నిజం మనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న. ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా! ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది.

ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది.

అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.

లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు,
శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం.

అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా పరమందటమూ చూస్తాం.
ఇంకా విశేషం ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు త్రేతాయుగంలో చనిపోయిన  వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలిసికొన్నాం.

కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది.

కాబట్టే మన పూర్వజులు ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని,

శతమానం భవతి అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది.

అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి..

వేసవి కాలం జాగ్రత్తలు


వేసవి వచ్చేసింది. తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం.
రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెలా ఆస్వాదించొచ్చు.
వేసవి చిట్కాలు:--
1) ఆహారపథార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.

2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
🍂🍃🍂🍃
3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
5) మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
6) కూల్ డ్రింక్స్ కన్నా, కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
7) కాఫీ , టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
8) కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
9) సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
10) పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ లేదా డబ్బాకులు వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
11) వేసవిలో బయట జ్యూస్ లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్ లు చేసుకుని తాగాలి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
12. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి ఒ.ఆర్.ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
13. తాటిముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
14. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
15. వేసవిలో భయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి 
Important note *** 
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
16. వయస్సు 50 దాటన వారు తమ ప్రయాణాలలో తప్పక ORS packets పాకెట్స్ వెంట తీసుకెళ్ళాలి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
17.ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటె మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్న వారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్'కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
18.వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి. వదులుగా, కాటన్'తో తయారుచేసిన బట్టలను ధరించండి. దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా జరుగుతుంది.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
19.ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
20. వేసవికాలంలో భయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకుని వెళ్ళండి.....

Tuesday, March 6, 2018

ప్రియ పుష్పాలు


పూజకు సిద్ధమై పోయారా?మరి పూజకు పూలు తెచ్చారా,తేలేదా? మరైతే పదండి మీ తోటకి పూలు తెద్దాం.అన్నట్టు విష్ణువుకి  ఇష్టమైన పూలేంటో తెలుసా!
ఇవిగో.....👇

*అహింస  ప్రథమం  పుష్పం  పుష్పం  ఇంద్రియ  నిగ్రహః*
*సర్వ భూత  దయా పుష్పం  క్షమా  పుష్పం  విశేషతః*
*జ్ఞాన  పుష్పం  తప: పుష్పం      శాంతి  పుష్పం  తథైవ  చ* 
*సత్యం  అష్ట విధం  పుష్పో: విష్ణో హో  ప్రీతి కరం  భవేత్ !!*

*1.అహింసా పుష్పం:*
ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం.

*2.ఇంద్రియ నిగ్రహం:*
చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం.

*3.దయ:*
కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.

*4.క్షమ:*
ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ.ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.

*5.ధ్యానం:*
ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం.ఇది దేవుని అందించే ఐదో పుష్పం.

*6.తపస్సు:*
మానసిక ( మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.

*7.జ్ఞానం:*
పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.

*8.సత్యం:*
ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.
 
అవి చాలా అరుదైన పుష్పాలు,అవి మా తోటలో *అన్ని లేవే* అంటున్నారా!మరేం పర్లేదు,ఇవాళే మొక్కలు నాటండి.🌱🌾🌴
త్వరలోనే మిగతా పూలు పూయించండి. మీరంతా వచ్చే ఏడాది పూజ వాటితోనే చేస్తారని ఆశిస్తూ.....

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...