శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీ నామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ చేయ నూహించి నీ మూర్తినిన్గాంచి నీసుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నన్ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్-మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు పూజించి యబ్భానుజుం బంటు గావించి యవ్వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియున్ భూమిజన్ జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషనిన్జేసి సుగ్రీవుడా యంగదా జాంబవంతాది వీరాదులన్ గూడి యాసేతువున్ దాటి వానరుల్-మూకలై పెన్మూకలై దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్-వైచి యాలక్షణున్ మూర్చనొందింపగా నప్పుడే నీవు సంజీవినిన్-దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్వీరులం బోరి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా అంత లోకంబులానందమై యుండ నవ్వేళలందన్ విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముతోజేర్చి అయ్యోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసితే పాపముల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులున్ కల్గునే వానరాకార యో భక్తమందార యో పుణ్యసంచార యో ధీర యో వీర నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మన్త్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్ వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్ తలతు నా జిహ్వయందుండియున్ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ నామాంకితధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర నీ జ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతమ్బులన్ బేన్ పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలన్ బడం గొట్టి నీముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి రారోరి నాముద్దు నరసింహ యనుచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామి యో ఆంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే నమో వాయుపుత్రా నమస్తే నమో నమః ||
Wednesday, February 21, 2018
శ్రీ ఆంజనేయ దండకం
శ్రీ ఆంజనేయ కరావలంబ స్తోత్రం
శ్రీ మత్కిరీట మణిమేఖాల వజ్ర కాయ॥
భోగేంద్ర భోగమణి రాజిత రుద్రరూప
కోదండ రామ పాదసేవన మగ్నచిత్త ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క వారైద్విభావ్య॥
భక్తార్తి భంజన దయాకర రామదాస
సంసార ఘోర గహనే చరతోజితారే:॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార కూ ప మతి ఘోర మఘాధ మూలం ॥
సంప్రాప్య దు:ఖ విష సర్ప వినష్ట్ర మూ ర్తే
ఆర్తన్య దేవ కృపయా పరిపాలితస్య ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార ఘోర విష సర్ప భయోగ్ర దం ష్ట్ర॥
భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ
ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార కూప మతిమజ్జన మొహితస్య॥
భుజానిఖేద పరిహార పరావదార
లంకాదిరాజ్య పరిపాలన నాశహేతో॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
ఏకేణ ఖడ్గ మపరేణ కరేణ శూలమ్॥
ఆదిత్య రుద్ర వరుణాది నుత ప్రభావ
వరాహ రామ నరసింహ శివాది రూప ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
ఆంజనేయ విభవే కరుణా కరాయ॥
పాప త్రయోప శయనాయ భవోషధాయ
త్రిష్టాది వృశిక జలాగ్ని పిశాచ రోగ ॥
కలేస వ్యయాయ హరయే గురవే నమస్తే
కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
1. విద్యా ప్రాప్తికి:- పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన! సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!
🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄
2. ఉద్యోగ ప్రాప్తికి :- హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే! ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
3. కార్య సాధనకు :- అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద! రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
4. గ్రహదోష నివారణకు :- మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ! శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
5. ఆరోగ్యమునకు :- ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా! ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
6. సంతాన ప్రాప్తికి :- పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్! సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
7. వ్యాపారాభివృద్ధికి :- సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్! అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
8. వివాహ ప్రాప్తికి :- యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః! వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
అగ్నితత్వ రాశులలో జన్మించిన వారి లక్షణాలు
అగ్నితత్వ రాశులు :- మేషం, సింహాం, ధనస్సు రాశుల వారు అగ్నితత్వానికి చెందినవారు. వీటికి వరుసగా అధిపతులైన కుజ, సూర్య, గురువు అగ్నితత్వం కలిగి ఉంటారు. అగ్నితత్వ రాశుల వారు ఉష్ణ తత్వం కలిగి కోప స్వభావాలు కలిగిఉంటారు. అగ్నితత్వం కావటం వలన వికాసం, శక్తి సామర్ధ్యాలు, చైతన్యం, ప్రేరణ, సాహసం, పౌరుషం, కోపం మొదలగు లక్షణాలు కలిగి ఉంటారు. న్యాయకత్వం, దైర్యసాహసాలు, శత్రువులపైన విజయాలు.
ఆరాటం, పోరాటం కలిగి ఉంటారు. ఇతరులను ఆకర్షించుట. ఇతరులను తమ అడుగు జాడలలో నడిపించుట. ఇతరులు పొగిడినచో పొంగిపోయి ఆపదలు కొని తెచ్చుకుందురు. అగ్నితత్వ రాశులలో లగ్నం గాని, రాశిగాని, ఎక్కువ గ్రహాలు గాని ఉన్నప్పుడు అగ్నితత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎక్కువ మంది అధికారులు గాని, నాయకులు గాని, సైన్యాధిపతులు గాని అగ్నితత్వ రాశుల యందు లగ్నం గాని, చంద్రుడు గాని, సూర్యుడు గాని ఉండగా జన్మింతురు. వీటిని దర్మత్రికోణ స్ధానాలు అనికూడా అంటారు.
మేషరాశి :- ప్రధమ రాశి కావటం వలన ప్రతి పనిలో ముందు ఉండాలని కోరుకుంటారు. ప్రతి పని చేయగలననే ఆత్మ విశ్వాసం, సంకల్ప శక్తి, ఇచ్చా శక్తి కలిగి ఉంటారు. ప్రతి పనిలో చొరవ చూపిస్తారు. ప్రధమ స్ధానం పొందటానికి, పేరు ప్రఖ్యాతలు సంపాదించటానికి ఉత్సాహం చూపిస్తారు. కుజరాశి అయినందున చురుకుదనం, దైర్యం, సాహసం, పౌరుషం, స్వేచ్చ, స్వతంత్ర ప్రవర్తన, నిర్భయంగా మాట్లాడటం, నిస్సంకోచంగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం వీరి లక్షణాలు.
ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం, అహంభావం, అహంకారం కలిగి ఇతరులను లెక్క చేయక పోవటం. తల బిరుసుతనం, తొందరపాటు, ముందు వెనుక ఆలోచించకుండా ప్రతి పనిలో చొరవ చూపిస్తారు. రోషం, కోపం ఎక్కువ. తగాదాలకు ముందుంటారు. తనకు తోచిన విధంగా ప్రవర్తించటం. అన్నిరకాల పోటీలకు ముందుంటారు. ఒక ఉద్యమాన్ని, ఒక సంస్ధను నడపగలిగే నాయకత్వ లక్షణాలకు మేషరాశి కారకత్వం వహిస్తుంది.
సింహారాశి:- సింహా రాశి పంచమ రాశి కావటం వలన ఈ రాశి వారికి స్ఫురణ శక్తి, సృజనాత్మక శక్తి కలిగి ఉంటారు. అధికార నిర్వహణా సామర్ధ్యం కలిగి ఉంటారు. వ్యూహాలను రచించటంలో నిపుణత కలిగిఉండటం, నీతి నియమాలు, లౌకిక ఙ్ఞానం, అంచనా వేయగలిగే సామర్ధ్యం, పరిపాలనా సామర్ధ్యం కలిగి ఉంటారు. శత్రువులను తెలివిగా ఎదుర్కొనే సామర్ధ్యం, ధైర్య సాహసాలు, పరాక్రమ వంతులుగా ఉంటారు. గుర్తింపును తెచ్చిపెట్టే క్రీడలు, కళలు, పందాలు, జూదం మొదలగు వాటిపై అభిలాష కలిగిస్తుంది. ఊహాత్మక సామర్ధ్యం కలిగి ఉండటం చేత విద్యా సంస్ధల నిర్వహణ, భోధన రంగాలలో రాణిస్తారు.
రవి ఆరోగ్య కారకుడు కావటం వలన బాల వైద్యం, ప్రశుతి వైద్యం, హృద్రోగ చికిత్సలలో రాణిస్తారు. విశాల హృదయులు కావటం వలన అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపడతారు. రవి రాశి కనుక పెత్తనం కలిగి ఉండాలనుకోవటం, ఇతరులు తనని అనుసరించాలనుకోవటం, తన మాటే నెగ్గాలనుకోవటం, ప్రతి విషయంలో పర్యవేక్షణ కలిగి ఉండటం, యాజమాన్య లక్షణాలు, అధికార నిర్వహణా సామర్ధ్యం, రాజకీయాలలో రాణింపు, న్యాయకత్వ నిర్వహణ, గౌరవ పదవులకు సింహరాశి ప్రాదాన్యత వహిస్తుంది.
ధనస్సు రాశి :- పంచమానికి బావాత్ భావం కావటం వలన మంచి ఙ్ఞాపక శక్తి, ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగే సామర్ధ్యం కలిగి ఉంటారు. గురుగ్రహానికి స్వక్షేత్రం కావటం వలన వివిధ శాస్త్రాల అద్యయనం, వివిధ అంశాలపై పరిశోదన, ఉన్నత విధ్యాభ్యాసం, భోదన, వైఙ్ఞానిక సంస్ధల నిర్వహణ, గ్రంధ రచన చేయగలగటం, ప్రచురణ, ప్రసంగించటం, ప్రసార మాద్యమాలను వినియోగించుకోవటం, వైఙ్ఞానికి, శాస్త్రీయ అంశాలపై సలహాలిచ్చే వృత్తుల పట్ల ఆసక్తి కలిగి ఉండటం.
అర్హతను, అవకాశాలను సక్రమంగా వినియోగించటం. దూరం, వేగం లక్షణాలు కలిగిన ఈ రాశి వారి విదేశీ వ్యవహారాలలో రాణిస్తారు. సమాచార, పర్యాటక, రవాణా రంగాలలో రాణించగల సమర్దతను కల్పిస్తుంది. సత్వర ఫలితాలు పొందాలనే ఆరాటం, ఉత్సాహం కలిగిస్తుంది. వేదశాస్త్రం, న్యాయ శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, తత్వ శాస్త్రం, రాజనీతి శాస్త్రం మొదలగు అద్భుత శాస్త్రాల పట్ల ఆసక్తి కలిగిస్తుంది. ధైవ భక్తి, ధర్మ చింతన, ఆశాభావం, ఉన్నతమై కోరికలు, ఆశయాలు కలిగి ఉండటం ఈ రాశి లక్షణాలు.

Sunday, February 18, 2018
గౌరీశంకర్ రుధ్రాక్ష
గౌరీశంకర్ రుధ్రాక్షను మొదటిసారిగా ధరించేటప్పుడు శివాలయంలో అభిషేకించటం చాలా మంచిది. “ఓం గౌరీశంకరాయనమః” “ ఓం నమశ్శివాయ”అనే మంత్రాన్ని జపిస్తూ రుధ్రాక్ష ధారణ చెయ్యాలి.
రెండు గింజలు కలిసి ఉన్న రుద్రాక్షలనే ‘గౌరీశంకర్’ రుద్రాక్షలుగా వ్యవహరిస్తారు.రెండు రుధ్రాక్షలలో ఒకటి పార్వతి, రెండవది పరమేశ్వర స్వరూపంగా కొలుస్తారు. బార్యభర్తల అన్యోన్నతకి ,వైవాహిక జీవితంలో కలిగే ఇబ్బందులకు “గౌరీశంకర్ రుధ్రాక్ష”ని తప్పనిసరిగా ధరించవలెను.
గౌరీశంకర్ రుధ్రాక్షను స్త్రీ,పురుష భేదం లేకుండా ఎవరైనా ధరించవచ్చు.“గౌరీశంకర్ రుధ్రాక్షను” ధరరించినను,పూజించినను కుటుంబంలో సకల సౌక్యములు కలుగును. గౌరీశంకర్ రుధ్రాక్ష శివపార్వతుల స్వరూపం కావటంవలన పేరుప్రఖ్యాతలు,అభివృద్ధి కలుగుతాయి.
గౌరీశంకర్ రుధ్రాక్ష మనిషి యొక్క ఆలోచనా విధానంలో మార్పులను చూసిస్తుంది. . గౌరీశంకర్ రుధ్రాక్ష ఆద్యాత్మికతను మేలుకోల్పుతుంది. గౌరీశంకర్ రుధ్రాక్షను 12 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ధరించవచ్చు.గౌరీశంకర్ రుధ్రాక్షను వివాహం కానివారు ధరించిన సత్వరమే వివాహ ప్రయత్నాలు అనుకూలించును.
జాతకచక్రంలో కుజదోషం,కాలసర్పదోషం ఉన్నవారు గౌరీశంకర్ రుధ్రాక్షను ధరించటం మంచిది..జాతకచక్రంలో రాహు,కుజ,శుక్ర దశలు జరిగే వారు గౌరీశంకర్ రుధ్రాక్షను ధరించటం మంచిది.
గ్రహ దోషాలను తొలగించి, బుద్ధిని, వివేకాన్ని కలిగిస్తుంది. మెదడు హృదయానికి సంబంధించిన రోగాల్ని దూరం చేస్తుంది. హృద్రోహము, రక్తపోటు, బ్రెయిన్ హేమరేజ్ మరియు అనేక చర్మరోగాలను దూరం చేస్తాయి. మొత్తంపై రుద్రాక్షలోని రసాయనిక ద్రవ్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Friday, February 16, 2018
పుత్ర_సంతానం_కోసం_పుత్ర_గణపతి_వ్రతం
శ్రీ పుత్ర గణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి)
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
‘‘సాక్షాత్ రుద్ర ఇవాపరః’’ అన్నట్లుగా జగదంబ అనుగ్రహముతో జన్మించి రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు జగదంబ పార్వతీ దేవిని ఆనందింప డేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుతిని విన్న అమ్మ వారు ఎవరైతే ఈస్తుతిని గౌరీ సమేత గణపతిని ఫాల్గుణ శు।।చవితి యందు పఠించి నువ్వలుబెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకేవిధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదేవిధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదంబ పార్వతి వరమిచ్చెను. అట్టి జగదంబ సమేత పుత్రగణపతి అనుగ్రహముపొందుటకు ఈ పుత్రగణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి) పారాయణము చేయడం వలన వంశదోషములు తొలగి శక్తియుక్తలు కలిగిన పుత్రులు జన్మించునని వరాహపురాణ వచనము. మొదట ఈస్తోత్రముతో డుంఢి రాజు అను కాశీరాజు పుత్రగణపతిని ఆరాధించి సత్ఫలితములను పొందెను. అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం.
పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు . మంచి సంతానం కోసం, సంతానం లేని వల్లూ సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలూ చెబుతున్నాయి.
చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వాళ్ళ సంతానం కలుగుతుంది అని నమ్మకం.
పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గుణ శుద్ధ చవితి ప్రత్యేకతగ కనిపిస్తూ వుంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 'పుత్రగణపతి వ్రతం' ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
పుత్ర గణపతి స్తోత్రం
శ్లో।। ఙ్ఞానశక్తిముమాం దృష్ట్వాయద్ దృష్టం వ్యోమ్ని శంభునా ।
యచ్చోక్తం బ్రహ్మణా పూర్వంశరీరంతు శరీరిణామ్ ।। 1
శ్లో।। యచ్చాపి హసితం తేనదేవేన పరమేష్ఠినా ।
ఏతత్కార్య చతుష్కేణపృథివ్యాంచ చతుర్ప్యపి ।। 2
శ్లో।। ప్రదీప్తాస్యో మహాదీప్తఃకుమారో భాసయన్ దిశః ।
పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్‌రుద్ర ఇవాపరః ।। 3
శ్లో।। ఉత్పన్నమాత్రో దేవానాంయోషితః సప్రమోహయన్ ।
కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యారూపేణచ మహాత్మవాన్ ।। 4
శ్లో।। తద్ దృష్ట్వా పరమం రూపంకుమారస్య మహాత్మనః ।
ఉమానిమీషే నేత్రాభ్యాంతమ పశ్యతభామినీ ।। 5
శ్రీ పరమేశ్వర ఉవాచ -
శ్లో।। వినాయకో విఘ్నకరో గజాస్యోగణేశ నామా చ భవస్య పుత్రః ।
ఏతేచ సర్వే తవయాన్తు భృత్యావినాయకాః క్రూరదృశః ప్రచండాః ।
ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహఃకార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ।। 6
శ్లో।। భవాంశ్చ దేవేషు తథా ముఖేషుకార్యేషుచాన్యేషు మహానుభావాత్ ।
అగ్రేషు పూజాం లభతేన్యధాచవినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ।। 7
శ్లో।। ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ సురైఃసమం కాంచన కుంభ సంస్థెః ।
జలై స్తథా సావభిషిక్తగాత్రోరరాజ రాజేంద్ర వినాయకానాం ।। 8
శ్లో।। దృష్ట్వాబిషిచ్య మానంతుదేవాస్తం గణనాయకం ।
తుష్టువుః ప్రయతాః సర్వేత్రిశూలాస్త్రస్య సన్నిధౌ ।। 9
దేవా ఈచుః - 9
శ్లో।। నమస్తే గజవక్త్రాయనమస్తే గణనాయక ।
వినాయక నమస్తేస్తు నమస్తేచండ విక్రమ ।। 10
శ్లో।। నమోస్తుతే విఘ్నకర్త్రేనమస్తే సర్పమేఖహో ।
నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత ।
సర్వదేవ నమస్కారాదవిఘ్నం-
- కురు సర్వదా ।। 11
శ్రీ పార్వత్యువాచ -
శ్లో।। అపుత్రోపి లభేత్ పుత్రానధనోపి ధనం లభేత్ ।
యం యమిచ్ఛేత్ మనసాతం తం లభతి మానవః ।। 12
శ్లో।। ఏవంస్తుత స్తదాదేవైర్మహాత్మా గణనాయకః ।
అభిషిక్తస్య రుద్రస్యసోమస్యా పత్యతాం గతః ।। 13
శ్లో।। ఏతస్యాం యస్తిలాన్ భుక్త్వాభక్త్యా గణపతిం నృప ।
ఆరాధయతి తస్యాశు తుష్యతేనాస్తి సంశయః ।। 14
శ్లో।। యశ్చైతత్ పఠతే స్తోత్రంయశ్చైతచ్ఛ్రుణుయాత్ సదా ।
నతస్య విఘ్న జాయన్తేనపాపం సర్వథా నృప ।। 15
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్...
-
అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప మహర్షి. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు....