Sunday, December 15, 2013

జట్టు ఊడకుండా...

జట్టు ఊడకుండా...


జుట్టురాలడం అనేది సాధారణ సమస్య. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ రాలిపోతుందనే ఫిర్యాదును ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటు న్నాం. జుట్టు కూడా చర్మం లాగానే కెర్సటెల్‌ అనే పదార్థం తో చేయబడింది. చర్మానికి ఎలా శ్రద్ధ తీసుకుంటు న్నామో, శిరోజాల పట్లా అలానే ఉండాలి.
సహజ కారణాలు
    • వాతావరణం పొడిగా ఉన్నప్పుడు జుట్టు పొడిబారి తెగిపోయే అవకాశం ఉంది. తేమగా ఉన్నపుడు చిక్కుపడి రాలిపోతాయి.
    • సూర్య కిరణాలు, అతి నీలలోహిత కిరణాలు.
    • మానసిక ఒత్తిడి, వౄఎత్తి, వ్యక్తిగత సమస్యలు, విద్యార్థులకైతే పరీక్షల భయం.
    • వేడి ఎక్కువగా ఉన్న నీళ్లతో తలస్నానం చేయడం, హెయిర్‌ డ్రయ్యర్ల వాడకం.
    • స్ట్రెయిటెనింగ్‌, రింగులు చేయించుకోవడం.

    • ఇతర కారణాలు
      హార్మోన్‌ లోపం.. హైపోథెరాయిడిజం, రక్తాల్పత.. ఇను ము, విటమిన్‌ బి12 లోపం ఇన్‌ఫెక్షన్‌, డెటింగ్‌. ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యం వల్ల, పోశాకాహార లోపము వల్ల ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటంది. జుట్టు రాలడం లో 30 నుంచి 40 రకాలు ఉన్నాయి. ప్రధానముగా రెండు రకాలు కనిపిస్తాయి.

    • జాగ్రత్తలు
    • ముందుగా జుట్టు తత్వాన్నిబట్టి షాంపూలను ఎంచు కోవాలి. వారానికి రెండు సార్లు షాంపూ చేయాలి. నూనెతత్వం ఉన్న శిరోజాలెతే రెండు రోజులకోసారి తప్పనిసరి.
    • కండిషనర్‌ తప్పనిసరి. పొడి తత్వం ఉన్నవారు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి.
    • సమతులాహారంతో జుట్టుకు తగిన పోషణ అందు తుంది. అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, తాజాపండ్లు, గుడ్లు, పప్పులు, డెరీ ఉత్పత్తుల్లో అవి సమౄఎద్ధిగా దొరుకుతాయి.
    • అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య బాధిస్తుంటే వెద్యులను సంప్రదించి ఫ్లూయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. వారి సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది.
  • నిమ్మ రసంతో నిండైన ఆరోగ్యం

    నిమ్మ రసంతో నిండైన ఆరోగ్యం


    వంటింటి చిట్కాలని తేలిగ్గా కొట్టి పరేస్తుంటాం. కానీ, అవే మన శరీర ఆరోగ్యానికి మేలు చేయడంలో ఎంతో ఉపకరిస్తాయి. నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో వినియోగిస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మకాయ కలుపుకోవడం, చికెన్‌ మటన్‌ వంటి స్పైసీ ఫుడ్స్‌లో టేస్ట్‌ కోసం నిమ్మకాయ వాడడం జరుగుతుంటుంది. ఆ నిమ్మకాయ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. నిమ్మరసంలో 5 శాతం సిట్రిక్‌ యాసిడ్‌ వుంటుంది. ఇది నిమ్మకాయకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇక విటమిన్లూ వంటివాటి విషయానికొస్తే, విటమిన్‌ సి, విటమిన్‌ బి, కాల్షియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేడ్స్‌ నిమ్మకాయలో పుష్కలంగా ఉంచేందుకు దోహదపడుతాయి. నిమ్మరసంతో మేని నిగారింపుతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చేలా వివిధ రకాలైన ఉపయోగాలున్నాయి.అజీర్ణంతో బాధపడేవారెవరైనసరే, కాస్త నిమ్మరసం, గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు. గుండెల్లో మంట, డయేరియా, బద్ధకంగా ఉండడం వంటివాటికి నిమ్మరసం దివ్యౌషధం, నిమ్మకాయ సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి, కాస్సేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే, శరీరంలో నిగారింపు వస్తుంది. వయసు మీద వడుతుండడం వల్లే వచ్చే చర్మ ముడతపడి పోవడాన్ని నిమ్మకాయ రసం కొంత వరకు నిరోధిస్తుంది. బ్లాక్‌ హెడ్స్‌ వంటివాటిని నివారిస్తుంది నిమ్మరసం.ఎవరైనాసరే, పన్ను నొప్పితో బాధ పడుతుంటే, కాస్త నిమ్మరసాన్ని నొప్పిపుట్టిన చోట పెడితే వారికి ఉపశమనం లభిస్తుంది. పళ్ల నుంచి రక్తం కారుతున్న, నోటినుంచి దుర్వా సన వస్తున్నా నిమ్మకాయ రసం వాటిని దూరం చేస్తుంది.

    అంతేకాదు గొంతులో తరచూ తలెత్తే ఇబ్బందుల నుంచి నిమ్మరసంతో విముక్తి పొందవచ్చు. నిమ్మరసం, నీరు కలిపి పుక్కిళీస్తుంటే గొంతు నొప్పి, గొంతులో గరగర వంటివి ఇబ్బంది పెట్టవు.
    నిమ్మరసంతో చేసే నింబూ పానీలో ఎక్కువగా వుండే పొటాషియం రక్తపోటు అంటే, బీపిని అదుపులో ఉంచుతుంది. నీరసం, మగతగా వుండడం, ఒత్తిడికి పనిచేస్తుంది నింబు పానీ. శ్వాశ కోశ ఇబ్బందులతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. ఆ విషయాన్నీ డాక్టర్లూ అంగీకరిస్తారు.

    జ్ఞాపక శక్తి లోపించకుండా...

    జ్ఞాపక శక్తి లోపించకుండా...


    brain_600x450జ్ఞాపకశక్తి అనేది మన నిత్య జీవితంలో ప్రతి పనికి అవసరం. ఇది లోపిస్తే ప్రతి పనికి అంతరాయం. ఏదైనా విషయం గుర్తుంచుకున్నప్పుడు వెంటనే గుర్తుకు రాకపోవడాన్ని జ్ఞాపకశక్తి లోపంగా వ్యవహరిస్తారు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగే సంఘటనలు మెదడులోని న్యూరాన్లలో నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ విషయాన్ని బయటకు వెంటనే తేవడమే జ్ఞాపకశక్తి.

    లక్షణాలు:
    సరైన సమయంలో చదివింది గుర్తుకు రాకపోవడం.
    వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుకు రాకపోవడం.
    కొందరు కొన్ని విషయాలు ఒకటి రెండు రోజులు తర్వాతనే మరచిపోవడం.
    కొంతమంది గృహిణులు బజారుకు వెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేసామో, లేదో, గ్యాస్‌ ఆఫ్‌ చేసామో లేదో అని ఆందోళన పడటం వంటి లక్షణాలు ఉంటాయి.
    ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తమకు జ్ఞాపకశక్తి లోపించిదేమో అని ఆందోళన చెందడం సహజం. అలా కాకుండా చేసే పని మీద దృష్టి సారించి ఏకాగ్రతతో చేయుట భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వలన మానసికి ఒత్తిడి లేకుండా జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే ‘జ్ఞాపకశక్తి’ మెరుగు పడుతుంది.

    చికిత్స:
    హోమియోలో జ్ఞాపకశక్తి లోపాన్ని నివారించడానికి అద్భుతమైన మందులు ఉన్నాయి. ఈ మందులను ఎన్నుకునే ముందు వ్యక్తి మానసిక, శారీరక అలవాట్లను పరిగణలోకి తీసుకోవాలి. అలాగే జ్ఞాపకశక్తి లోపానికి గల కారణాలైన భయం, మానసిక ఒత్తిడి, నెగటీవ్‌ ఆలోచనలు ఉంటే వాటి నుండి బయట పడేందుకు కౌన్సిలింగ్‌ ఇప్పించాలి.

    మందులు:

    ఎనకార్డియం: 
    జ్ఞాపకశక్తి లోపానికి ఈ మందు బాగా పని చేస్తుంది.
    పిల్లలు చదివింది పరీక్షలకు ముందు గుర్తుకు రాక బాధపడుతుంటారు.
    ఇటువంటి వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

    ఎకోనైట్‌:
    వీరు తేదీలను మరిచిపోతారు.
    మానసిక ఒత్తిడి వల్ల, టెన్షన్ల వల్ల జ్ఞాపకశక్తి తగ్గినట్లయితే ఆరంభ దశలో ఈ మందు బాగా పని చేస్తుంది. అలాగే వీరు చల్ల గాలిలో తిరగడం వలన ముక్కు బిగుసుకొనిపోయి, తుమ్ములు, గొంతు నొప్పి వెంటనే ప్రారంభమవుతాయి.
    వీరికి ఆందోళన, దాహం విపరీతంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉండి జ్ఞాపకశక్తి లోపంతో బాధపడే వారికి ఈ మందు ఆలోచించదగినది.

    సిక్యుట విరోస:
    వీరు మందమతులు.
    వీరి పేరును సైతం మరిచిపోతారు.
    చివరకు తమ ఇంటి నెంబరును, ఫోను నెంబరును కూడా మరిచిపోతారు.
    ఇలాంటి వారికి ఈ మందు బాగా పని చేస్తుంది.

    సల్ఫర్‌: 
    వీరు పేర్లను మరిచిపోతారు.
    వీరికి మానసిక శక్తి తక్కువ, బద్ధకస్తులు.
    వీరు మతి మరుపుతో పాటు, చర్మ వ్యాధి, మలబద్ధకంతో బాధపడుతుంటారు.
    వీరికి పరిశుభ్రతపై పట్టింపు ఉండదు, అపరిశుభ్రంగా ఉంటారు.
    వీరు చూడటానికి సన్నగా ఉంటారు.
    కుదురుగా ఒక చోట నిలబడలేరు, వంగి నడుస్తుంటారు.
    ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

    గృహస్తులు పాటించవలసిన ఆచారాలు

    గృహస్తులు పాటించవలసిన ఆచారాలు


    rising-sunలేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి తగవు. ఎప్పుడుపడితే అప్పుడు తలవెంట్రుకలను, గోళ్ళను తీయరాదు. దంతాలతో గోళ్ళను కొరకరాదు.ఊరక మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, చేతి గోళ్ళను తినువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని వెల్లడించు వాడు, శుభ్రత లేనివాడు - వీరు శీఘ్రముగా వినాశము పొందుదురు.ప్రాకారము కల్గిన గ్రామమును గాని, ఇంటిని కాని ద్వారము గుండా ప్రవేశింపవలయునే కాని ప్రాకారము దాటి ప్రవేశింపకూడదు. రాత్రులందు చెట్ల కింద ఉండరాదు. దూరముగా ఉండవలయును.దీర్ఘకాలము బతుకకోరువాడు కేశములను, భస్మమును, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు.

    రెండు చేతులతోను తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు. శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయరాదు. (శిరః స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనము).ఎప్పుడును పాచికలు (జూదము) ఆడకూడదు. పరిహాసము కొరకు కూడా జూదము ఆడకూడదు. పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు. పక్క మీద కూర్చుని ఏమియు తినరాదు. చేతిలో భోజ్య వస్తువును పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు.రాత్రిపూట నువ్వులతో గూడిన ఏ వస్తువును భుజించరాదు. వస్తహ్రీనుడెై శయినింపరాదు. ఎంగిలితో ఎక్కడకును వెళ్ళరాదు.తడిగా నున్న కాళ్ళు గలవాడెై భోజనము చేయవలయును. దాని వలన దీర్ఘీయువు కలుగును. తడి కాళ్ళతో పండుకొనరాదు.
    సాయి శరణం - బాబా శరణం
    బాబా శరణం - సాయి శరణం

    భోజనం తరువాత చేయకూడని ఆరు ముఖ్యమైన పనులు

    భోజనం తరువాత చేయకూడని ఆరు ముఖ్యమైన పనులు


    భోజనం తరువాత చేయకూడని ఆరు ముఖ్యమైన పనులు
    1) DON’T SMOKE: ధూమపానము చేయరాదు. భోజనము చేసినతరువాత ఒక cigarette కాల్చితే పది cigarettesకు సమానము అని చెబుతున్నారు. కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట.
    2) DON’T EAT FRUITS: పళ్ళు తినకూడదు. భోజనము చేసిన తరువాత పళ్ళు తినడం వలన కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. అందుకే పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది.
    3) DON’T DRINK TEA: టీ తాగకూడదు. టీవలన పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వడం కష్టంఅవుతుంది.
    4) DON’T LOOSEN YOUR BELT: బెల్టు లూస్ చేయకూడదు(పెట్టుకునే వారు) దీనివల లోపల ఎక్కడన్నా ఇరుక్కున్న ఆహరం సరిగ్గా జీర్ణం కాదు.
    5) DON’T BATH: స్నానం చేయకూడదు. భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.
    6) DON’T SLEEP: నిద్ర పోకూడదు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక gastric & infection వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలు కంటే ఎక్కువగా పడుకోకుండా ఉంటె మీ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు డాక్టర్లు

    జ్యోతిష్య శాస్త్రము – భాగములు


    జ్యోతిష్య శాస్త్రము మూడు భాగములుగా విభజించ బడినది. 
    1.       గణిత భాగము ; ఈ భాగములో గ్రహలయొక్క సంచారము తిధి, వార, నక్షత్రములు, యోగములు, కరణములు, గ్రహ గతులు  గ్రహణములు , మూడమి మొదలగు అనేక విషయములను తెలియపరచుచు పంచాంగమును వ్రాయుట గురించి తెలుసుకొన వచ్చును.
    2.       జాతక భాగము ; ఈ భాగములో గ్రహముల యొక్క సంచారమునుబట్టి మానవుని జీవితములో కలుగు శుభాశుభములను, లాభ నష్టములను తెలుసు కొనవచ్చును.
    3.       ముహూర్త భాగము ; ఈ భాగములో మానవుడు నిత్య జీవితములో జరుగు ప్రతి కార్యము అనగా జన్మించిన నాటి నుండి నామకరణము, బారసాల,అన్నప్రాశనం, అక్షరాభ్యాసం, ఉపనయనము, వివాహము, గృహారంభము, గృహప్రవేశం మొదలగు అనేకరకముల శుభ కార్యముల గురించి ముహూర్తములు నిర్ణయించుటకు ఉపయోగ పడును.

    కుజదోషం – విశ్లేషణ.... కుజ దోషము 6 రకములుగా ఉంటుంది .


    నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

    బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...