Saturday, December 14, 2013

చక్ర సౌందర్యం

మన శరీరం ఏడు చక్రాల సమాహారం. ఈ చక్రాలన్నీ అవయవాలను శుభ్రం చేసి.. మనల్ని నిత్య ఆరోగ్యవంతులుగా తయారుచేస్తాయి.

మూలాధార చక్రం : శరీరంలోని వెన్నెముక కింది భాగంలో ఉంటుంది మూలాధార చక్రం. కళ్లు మూసుకుని ఆ ప్రదేశంలో ఒక చక్రం ఉన్నట్లు ఊహించుకోవాలి. దాని మీదే దృష్టిపెట్టి మూడు నిమిషాలు కూర్చుంటే సరిపోతుంది. ఈ సమయంలో సాధారణ శ్వాస తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మల మూత్రాలు సాఫీగా సాగుతాయి.

స్వాధిష్టాన చక్రం : వెన్నెముక కింది భాగం - అంటే బొడ్డుకి కొంచెం కింది స్థానంలో ఉంటుందిఈ చక్రం. దీని మీద దృష్టి నిలపడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.

మణిపూరక చక్రం : వెన్నెముక దగ్గర బొడ్డుకి వెనుక భాగంలో ఉంటుంది ఈ చక్రం. ఈ భాగం మీద మనసును ఏకీకృతం చేస్తే జీర్ణశక్తి అభివృద్ధి చెందుతుంది. క్లోమగ్రంథి చక్కగా పనిచేస్తుంది. మధుమేహ సమస్యలను రాకుండా కాపాడటం దీని ముఖ్య లక్షణం.

అనాహత లేక హృదయ చక్రం : గుండెకు వెనుక భాగాన ఉండే ఈ చక్రం అత్యంత కీలకమైనది. దీని మీద దృష్టి పెట్టడం వల్ల గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. రక్తం సాఫీగా సరఫరా అవుతుంది. రెగ్యులర్‌గా ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడం వల్ల హృద్రోగ సమస్యలు రావు. సున్నితమైన మనస్తత్వం అలవడుతుంది.

విశుద్ధి చక్రం : కంఠానికి వెనుక భాగంలోని ఈ చక్రం.. థైరాయిడ్ సమస్యల్ని రానివ్వదు. స్వరపేటిక సమస్యలు తగ్గుతాయి. గొంతు సంబంధిత జబ్బులు రావు.

ఆజ్ఞా చక్రం : రెండు కనుబొమల మధ్య భాగంలో ఉండే చక్రం ఇది. ఇప్పటి వరకు చెప్పుకున్న అయిదు చక్రాలు ఆరోగ్యానికి సంబంధించినవైతే ఈ రెండు చక్రాలు ఏకాగ్రత, జ్ఞాపకశక్తికి సంబంధించినవి. మిగతా అన్ని చక్రాలను ఆజ్ఞాపించే అధికారం దీని సొంతం.

సహస్తార చక్రం : శిరస్సు మధ్య భాగంలో ఉంటుందీ చక్రం. మనసును సమతుల్య పరుస్తుంది. భావోద్వేగాలను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
— with Sireesha Ratnaji Chowdary Alla.

Friday, December 13, 2013

మన తోటి ప్రాణుల నుండి గ్రహించవలసినది

మన తోటి ప్రాణుల నుండి గ్రహించవలసినది 

ఉమామహేశ్వర స్తోత్రం

నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 1 ||

నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 2 ||

నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ |
విభూతిపాటీరవిలేపనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 3 ||

నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |
జంభారిముఖ్యైరభివందితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 4 ||

నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 5 ||

నమః శివాభ్యామతిసుందరాభ్యాం
అత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |
అశేషలోకైకహితంకరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 6 ||

నమః శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాళకల్యాణవపుర్ధరాభ్యామ్ |
కైలాసశైలస్థితదేవతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 7 ||

నమః శివాభ్యామశుభాపహాభ్యాం
అశేషలోకైకవిశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 8 ||

నమః శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 9 ||

నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |
జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 10 ||

నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ |
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 11 ||

నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |
సమస్తదేవాసురపూజితాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 12 ||

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |
స సర్వసౌభాగ్యఫలాని
భుంక్తే శతాయురాంతే శివలోకమేతి || 13 ||

శివపురాణాంతర్గగ అంధకకృత శివాష్టోత్తర శతనామస్తోత్రమ్

మహాదేవం విరూపాక్షం చంద్రార్థకృత శేఖరమ్!
అమృతం శాశ్వతం స్థాణుం నీలకంఠం పినాకినమ్!!
వృషభాక్షం మాహాజ్ఞేయం పురుషం సర్వకామదమ్!
కామారిం కామదహనం కామరూపం కపర్దినమ్!!
విరూపం గిరీశం భీమం స్రగ్విణం రక్త వాసనం!
యోగినం కాలదహనం త్రిపురఘ్నం కపాలినమ్!!
గూఢవ్రతం గుప్తమంత్రం గంభీరం భావగోచరమ్!
అణిమాదిగుణాధారం త్రిలోక్యైశ్వర్యదాయకమ్!!
వీరం వీరహణం ఘోరం విరూపం మాంసలంపటుమ్!
మహామాంసాదమున్మత్తం భైరవం వై మహేశ్వరమ్!!
త్రైలోక్య ద్రావణం లుబ్ధం లుబ్ధకం యజ్ఞసూదనమ్!
కృత్తికానాం సుతైర్యుక్తమున్మత్తం కృత్తివాసనమ్!!
గజకృత్తి పరీధానం క్షుబ్ధం భుజగభూషణమ్!
దద్యాలంబం చ వేతాలం ఘోరం శాకిని పూజితమ్!!
అఘోరం ఘోరదైత్యఘ్నం ఘోరఘోషం వనస్పతిమ్!
భస్మాంగం జటిలం శుద్ధం భేరుండ శతసేవితమ్!!
భూతేశ్వరం భూతనాథం పంచభూతాశ్రితం ఖగమ్!
క్రోధితం నిష్ఠురం చండం చండీశం చండికాప్రియమ్!!
చండం తుంగం గరుత్మంతం నిత్య మాసవ భోజనమ్!
లేనిహానం మహారౌద్రం మృత్యుం మృత్యోరగోచరమ్!!
మృత్యోర్మృత్యుం మహాసేనం శ్మశానారణ్య వాసినమ్!
రాగం విరాగం రాగాంధం వీతరాగ శతార్చితమ్!!
సత్త్వం రజస్తమోధర్మమధర్మం వాసవానుజమ్!
సత్యం త్వసత్యం సద్రూపమసద్రూపమహేతుకమ్!!
అర్థనారీశ్వరం భానుం భాను కోటీశతప్రభమ్!
యజ్ఞం యజ్ఞ పతిం రుద్రమీశానం వరదం శివమ్!!
అష్టోత్తరశతం హ్యేతన్మూర్తీనాం పరమాత్మనః!
శివస్య దానవో ధ్యాయన్ ముక్తస్తస్త్మాన్మహాభయాత్!!

"మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే"


"మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ,
స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే" అని ఆదిశంకర భగవత్పాదులు వివేక చూడామణి గ్రంథంలో అన్నారు. అద్వైత ప్రకరణ గ్రంథమైన వివేక చూడామణికి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీశంకర భగవత్పాదులు వేదాంత సారమైన ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాసి వాటిని సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రకరణ గ్రంథాల్ని కూడా వ్రాశారు. జ్ఞానమార్గం ద్వారా మోక్షం పొందవచ్చన్నది ఆయన కనుగొన్న సత్యం. సాధన, సంపత్తి కావాలి. వివేక, వైరాగ్యాలు కావాలి. ఇహపర సుఖాలు కోరకుండా ఉండాలి, మనస్సునూ, ఇంద్రియాలనూ నియంత్రించాలి. ఇంద్రియ వస్తువులు మనముందు ఉన్నప్పటికీ వాటిని వద్దనుకుని తన హృదయంలో ఉన్న ఆత్మపై ధ్యానం చేయాలి. తీవ్రమైన ముముక్షుత్వం కావాలి. అంటే ముక్తిని తప్ప మరేదీ కోరకూడదు. సాధకునికి అఖండ ఆనందం తద్వారా లభిస్తుందని వారిబోధ.
శ్రీ శంకర భగవత్పాదులు అపర శంకరులు. ఎన్నోభక్తి స్తోత్రాల్నీ వారు రచించారు. వివేక చూడామణిలో మొదటి శ్లోకాలు చదివినట్లయితే మనకు తెలిసేది వివేక వైరాగ్యాదులు చాలా ముఖ్యమని! వారి భాష్యాల్లో జ్ఞానసంపాదనకు ప్రాముఖ్యం ఇచ్చారు. అంటే, భక్తిని ఆయన ఎప్పుడూ నిరసించలేదు. తనలోనే ఉన్న ఆత్మను ఎల్లప్పుడూ ఎరుకతో జ్ఞాపకం ఉంచుకోవాలి అంటున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు "ఈశ్వరః సర్వభూతానామ్ హృద్దేశేర్జున తిష్ఠతి" - సర్వజీవరాశుల్లో భగవంతుడు వారి వారి హృదయాల్లో విరాజిల్లుతున్నాడు.
"అహమాత్మా గుడాకేశ సర్వభూటాశయస్థితః" - నేను ఆత్మగా అందరి హృదయాల్లో ఉన్నాను. ఓ అర్జునా! ’సర్వస్యాహం హృది సన్నివిష్ఠః’ - నేను, సర్వజీవరాశుల హృదయాల్లో నివసిస్తున్నాను.
భక్తి అనేది ముక్తికి సోపానం. అదేవిధంగా జ్ఞానమార్గం ద్వారా మోక్షం లభిస్తుంది. ’జ్ఞానాదేవతు కైవల్యం. ప్రజ్ఞానం బ్రహ్మ’ అని వేదాలు ఘోషిస్తున్నాయి. శ్రీరామకృష్ణ పరమహంస వైరాగ్య పరిపూర్ణులైన సర్వసంగ పరిత్యాగులకు జ్ఞానమార్గం, గృహస్థ భక్తులకు భక్తిమార్గం బోధించారు. మార్గాలేవైనా గమ్యం ఒక్కటే అని గుర్తించి, నమ్మిన మార్గంలో సాధన చేయాలి.

శ్రీ మహావిష్ణువుకు మంటే అరాగిపాత్రలో నైవేద్యమిత ఇష్టం

సాధారణంగా ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు,అక్కడ అర్చకులు స్వామికి ఓ పాత్రలో నైవేద్యాన్ని పెడుతూ ఉండటాన్ని చుస్తు ఉంటాము..ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు మంటే అరాగిపాత్రలో నైవేద్యమిత ఇష్టం. ఇందువెనుక ఒక కధ ఉంది. ఆ కధ సాక్షాత్ శ్రీ మహా విష్ణువే చెప్పాడు. పూర్వం గుడాకేశుడనే రాక్షసుడు ఉండేవాడు . అతడు పుట్టుకతో రాక్షసుడైనప్పటికీ, ఎలాంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవచింతనలో కాలాన్ని వెళ్ళబుచ్చుతూండేవాడు. గుడాకేశుడు విష్ణువు భక్తుడు. నిరంతరం విష్ణువు నామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తూండేవాడు. ఇది ఇలాగ ఉండగా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సు చేయాలని అనిపించింది. ఫలితంగా, ఆ రాక్షసుడు పదహారువేల సంవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చెయ్యగా . అతని తపస్సుని మెచ్చిన విష్ణుమూర్తి,ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. అందుకు గుడాకేశుడు, తనకు ఏమి అక్కర్లేదు అని, కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. అలాగే తన మరణం విష్ణుచక్రం వల్ల మాత్రం ఏర్పడి,తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. గుడాకేశుడు సంతోషించాడు. విష్ణుమూర్తి అనుగ్రహించిన అనంతరం గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. వైశాఖ శుద్ధ ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిర్ణయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తున్న గుడాకేశుడు మిక్కిలి సంతోషించాడు. విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించింది. వెంతనే అతడి మాంసమంతా రాగిగా మారి పోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారు అయ్యింది. ఆ పాత్ర లో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడమంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్త్టం. అనంతరం తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి. రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని విష్ణుమూర్తి సెలవిచ్చారు. అందుకే విష్ణుమూర్తికి రాగిపాత్ర లో నైవేద్యం సమర్పించటం వెనుక ఇంత కథ ఉంది. సత్యనారాయణస్వామికి ఎర్రగోధుమ నూక ప్రసాదం ఎంతో ఇష్టం. పరమశివునికి చిమ్మిలి, గణపతికి కుడుములు ,మహాలక్ష్మికి పానకం,వడపప్పు,లలితా దేవికి గోక్షీరాన్నం,పులిహోర ! కృష్ణుడికి అటుకులు బెల్లం..ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రసాదం అంటే ప్రీతి.....ఆ ప్రసాదం ఇష్టం వెనుక కూడా మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి....వారికి అవి ప్రీతి అంటే...ఇంకో విధంగా ఆలోచిస్తే..అవి వారికి నివేదన చేసి మనం స్వీకరిస్తే...మన ఆరోగ్యానికి మంచి శక్తిని ఇవ్వడమే.......ఆ నిర్గుణ పరబ్రహ్మం ఎప్పుడూ లోక క్షేమమే కదా చేస్తాడు,.....లోకాస్సమస్తాస్సుఖినో భవంతు !!!!!!!

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...