Friday, August 23, 2013

సంధ్యావందనం

సంధ్యావందనం

ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం ధరించిన వర్ణాల వారు చేయవలసిన దైనందిన వైదిక కర్మలలో సంధ్యావందనము ఒకటి. సంధ్యా వందనమనగా సంధియందు (పగలు రాత్రియు కలసియున్న సంధికాలము) చేయదగినది. సంధ్యావందనము చేయకుండా యితర కర్మలను చేయరాదు. సంధ్యావందనము కర్మలో సూర్యుని అర్ఘ్యం ఇవ్వడం, మరియు గాయత్రీ జపం కొన్ని అంశాలు.
సంధ్యా వందనము రోజునకు మూడుసార్లు చేయవలెను. రోజులో మొదటిసారి సంధ్యా వందనము రాత్రి యెక్క చివరిభాగము నక్షత్రములు ఉండగా చేయుట. నక్షత్రములు లేకుండా చేయుట మధ్యమము. సూర్యోదయమైన తరువాత చేయుట అధమము. కాని మనము సూర్యోదయమైన తరువాత చేయుట ఆచారముగా వచ్చుచున్నది. ఇక రెండవసారి మధ్యాహ్న సంధ్యా వందనము సూర్యోదయమైన 12 ఘడియలు తరువాత చేయుట ఉత్తమము. సూర్యోదయమము అయిన తరువాత 8 నుంచి 12 ఘడియలు మధ్య చేసిన మధ్యమము. సూర్యోదయమైన 19 నుంచి 24 ఘడియలు మధ్య చేయుట అధమము. సాయం సంధ్యావందనము సూర్యుడు అస్తమించుచుండగా చేయుట ఉత్తమము, నక్షత్ర దర్శనము కాకుండ చేయుట మధ్యమము, నక్షత్ర దర్శనము అయిన తరువాత చేయుట అధమము. సంధ్యా వందనము పురుడు, మైల, పక్షిణి సమయములందు అర్ఘ్యప్రదానము వరకు చేయాలి. ప్రయాణాల్లో వీలుపడనిచో మానసికముగా సంధ్యా వందనము చేయవచ్చును. రోజూ తప్పక సంధ్యా వందనము చేవలెను.
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

ఉపనయనము

ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు. ఇది అధికంగా పురుషులకు చేస్తారు. బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్ఠ లతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిష్ఠలతోకూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది. ఉపనయనానికి ముందు ఒక జన్మ తరువాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు.
క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా, అధిక ప్రాముఖ్యతతో నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు. మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు. అక్కడవారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు.

ఉపనయనము అయ్యేవరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చటానికి అర్హుడుకాడు. యజ్ఞయాగాది క్రతువులు నెరవేర్చటానికి ఉపనయనము చేసుకున్న తరువాతే అర్హత వస్తుంది. క్షత్రియులకు ధర్మశాస్త్రాలభ్యసించడం అత్యవసరం కనుక ఉపనయన క్రతువు జరిపించి, విద్యాభ్యాసం ఆరంభించేవారు. పితరులకు కర్మకాండ, తర్పణం లాంటి కార్యాలు చేయడానికి ఉపనయనం అత్యవసరం. కొన్ని సందర్భాలాలో తల్లి తండ్రులు మరణావస్థలో ఉన్న సమయాలలో అత్యవసరంగా ఉపనయనం జరిపించి, కర్మకాండ జరిపించే అర్హతనిస్తారు. సన్యసించడానికి ఉపనయనం ప్రధానమే. కనుక హిందూ ధర్మంలో ఉపనయనం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక ప్రక్రియ. హిందూ ధర్మంలో ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు తప్పక నిర్వహించవలసిన బాధ్యత.

ఉపనయనము హిందువులలో కొన్ని కులాలలో మాత్రమే జరిగే ప్రక్రియ. ఇది సాధారణంగా బ్రాహ్మణులకు, వైశ్యులకు మరియు క్షత్రియులకు జరుగుతుంది. ఉపనయనం జరిగిన రోజున బాలుని తండ్రి బాలునికి చెవిలో గాయత్రీ మంత్రం ఉపదేశిస్తాడు. ఉపనయనం జరిగిన నాటి నుండి వటువు ప్రతి నిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. వేదాభ్యాసానికి ముందు తప్పనిసరిగా ఉపనయనం చేయవలెను. వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని స్నాతక ప్రక్రియ ద్వారా వదిలి, గృహస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తాడు వరుడు. 

ఉపనయన విధులు బ్రాహ్మణులకు, క్షత్రియులకు మరియు వైశ్యులకు వేరు వేరుగా ఉంటాయి.

బ్రాహ్మణులకు 5 సంవత్సరాలవయసులో ఉపనయనం చేసినట్లు అయితే "బ్రహ్మ వర్చస కామం పంచమ వర్షే" అథవా గర్బాష్టకంలో బ్రాహ్మణులకు ఉపనయనం చేయాలి. క్షత్రియులకు 11 సంవత్సరాల వయసులో, వైశ్యులకు 12 సంవత్సరాల వయసులో ఉపనయనము చేయడం ఉచితమని శాస్త్రనిర్ణయం. ఉపనయన సమయంలో బ్రాహ్మణులు నార వస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి, జింకతోలును ఉత్తరీయంగా ధరించాలి. అలాగే బ్రాహ్మణుడు ముంజకసవుతో పేనిన మొలత్రాడును ధరించాలి. ముంజ కసవు దొరకనప్పుడు దర్భ గడ్డిని నీటితో తడిపి ఒక ముడివేసి ధరించవచ్చు. మొలత్రాడు విధిగా ముప్పేటగా ధరించాలి. నూలుతో కట్టిన తొమ్మిది పోగుల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. అలాగే బిల్వము లేక మోదుగ దండాన్ని కేశమువరకు ఉండేలా చేసుకుని ధరించాలి. ఉపవీతుడైన పిమ్మట భవతీ బిక్షాక్షాం దేహిఅని యాచించాలి. గురుకులానికి వెళ్ళిన బ్రాహ్మచారి యాచనతో దొరికిన ఆహారాన్ని గురువుకు సమర్పించి, తరువాత గురువు అనుమతితో భుజించాలి. అవశిష్టాన్ని పరిశుద్ధుడై తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి. భుజించిన పిదప చేతులు శుభ్ర పరచుకుని ఆచమనం చేసి శరీరావయాలను నీటితో శుభ్రపరచుకోవాలి. ఆ తరువాత వస్త్రంతో అవయవాలను తుడుచుకోవాలి. ముందుగా తల్లిని కానీ, సోదరిని కానీ తల్లి వైపు సోదరిని కానీ యాచించడం ఉత్తమం. అవమానించని వారిని యాచించడం ఉత్తమమని అంతరార్ధం. ఈ మాదిరి బ్రహ్మచారి యాచించడం మధూకరం అంటారు. ఇందుకు పేద గొప్పా తారతమ్యం లేదు. అందరూ గురు శుశ్రూషలో సమానమే. ఉపనయనమునకు బ్రాహ్మణులకు చైత్ర వైశాఖ మాసాలు ఉత్తమం.

అలాగే క్షత్రియులకు వెల్వెట్ వస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి కురుమృగ చర్మాన్ని ఉత్తరీయంగా ధరించాలి. ముర్వ కసవుతో చేసిన మొలత్రాడును అది లభించని పక్షంలో నీటితో తడిపిన రెల్లుని మూడు ముడులు వేసి ధరించాలి. జనపనారతో చేసిన తొమ్మిది వరసలుగల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. యజ్ఞోపవీతానికి జంద్యం అనే మరో పేరుకూడా ఉంది తమిళనాట ప్రతి సంవత్సరం జంద్యాల పండుగ జరుపుకుంటారు. తమిళనాట ఈ పండుగను ఆవణి ఆవట్టం అంటారు. వివాహానంతరం మొదటిసారిగా ఈ పండుగ అత్తవారింట జరుపుకోవడం ఆనవాయితే. యజ్ఞోపవీతాన్ని భుజంపై నుండి రెండవ చేతి క్రిందిగా ధరించాలి. శుభకార్యాలకు సవ్యంగానూ కర్మక్రియలు లాంటి పితృ కార్యాలు జరిపేటప్పుడు అపసవ్యంగా ధరించడం ఆనవాయితీ. అలాగే మర్రి లేక చండ్ర కొమ్మను కానీ నొసటి వరకు ఉండేలా దండాన్ని ధరించాలి. తరువాత బిక్షాం భవతి దేహి అని యాచించాలి. యాచించే ముందు సూర్యోపాసన చేసి అగ్నికి ప్రదక్షిణ చేసి యాచించాలి. క్షత్రియులకు జ్యేష్ట ఆషాఢాలు ఉపనయము చేయడానికి ఉత్తమమని భావన.

అలాగే వైశ్యులు ఉన్ని బట్టను అంగవస్త్రంగా ధరించి గొర్రెతోలును ఉత్తరీయంగా ధరించాలి. వైశ్యుడు జనపనారతో చేసినది అది లభ్యం కానిచో తుంగతో చేసిన మొలత్రాడును ముప్పేటగా చేసి అయిదు ముడులు వేసి ధరించాలి. మేక బొచ్చుతో చేసిన తొమ్మిది పేటల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. జమ్మి లేక మేడి కొమ్మను ముక్కు వరకు ఉండేలా ధరించాలి. దండం వంకర లేనిది అగ్నిలో కాలనిది పైపట్టతో కూడినదై ఉండాలి. ఆశ్వయుజ, కార్తీక మాసాలు వైశ్యులకు ఉత్తమ ఉపనయన కాలమని పెద్దల భావన.

 

ఉపనయనం చేయించే అధికారం ముందుగా తండ్రికి లేనిచో అన్నకు అదికూడా లేనిచో దాయాదులకు అంటే సగోత్రికులకు ఉంటుంది. ఉపనయనం చేయించే వ్యక్తిని ఆచార్యుడుగా వ్యవహరిస్తారు. ఉపనయన సమయంలో వటువునకు ఆచార్యుడు గాయత్రీ మంత్రోపాసన చేస్తాడు. యజ్నోపవీత ధారణ సమయంలో అయిదుగురు బ్రహ్మచారులను పూజించి పసుపు బట్టలను ఇవ్వడం ఆచారం. బ్రహ్మ దేవునకు సహజంగా లభించిందీ మొదట పుట్టినదీ అయిన ఈ పవిత్ర యజ్ఞ ఉపవీతాన్ని నేను ధరిస్తున్నాను ఈ యజ్ఞ ఉపవీతం నాకు తేజస్సు, బలం, దీర్ఘాయువు, నిర్మలత్వం మరియు పుష్టిని ఇచ్చుగాక అని వటువు మంత్రయుక్తంగా చెప్పి ధరిస్తాడు. యజ్ఞోపవీత ధారణ వటువునకు ఆశ్రమ వాసాధికారం, కామ్యసిద్ధి, విద్యాధ్యయనం, వేదాధ్యయనం, సంపద, యశస్సు, ఆయుష్షు మరియు ధర్మాచరణాధికారం ఇస్తుంది.

అగ్నిహోత్రమునకు ఉత్తర దిక్కుగా ఆచార్యుడు కూర్చుని దక్షిణ దిశగా సన్నికల్లు ఉంచి వటునిచే అతిష్టేమ మంత్రం చెప్పి తొక్కించాలి. రాయివలెనే నీవు బ్రహ్మచర్య వ్రతములో స్థిరుడవై ఉండాలని దీని అర్ధం. ఆ రాతి మీదనే వస్త్రాలను అభిమంత్రించి వటువునకు ధరింపచేయవలెను, దేవతా వస్త్రాలను ధరించి ఐశ్వర్య వంతుడవై ఆర్తులను ఆప్తులను ఆదుకుంటూ నిండునూరేళ్ళు జీవించమని ఆశ్వీర్వదిస్తూ ఈ వస్త్రధారణ జరుగుతుంది. ఆ తరువాత మొలత్రాడు కట్టి యజ్ఞోపవీతాన్ని ధరింపచేసి మంత్రోపాసన చేయించాలి. వటువు ఆచార్యునకు గోదానం ఇచ్చి దండధారణ చేయించి అగ్నికి ప్రదక్షిణచేసి భిక్షాటనకు బయలు దేరాలి.

ఉపనయనము తరువాత వటువు కనీసం 12 సంవత్సరాలు ఒక వేదమునైనా అభ్యసించాలి. అలాగే ఒక్కో వేదానికి ఒక్కో 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించవచ్చు. కానీ అది తప్పని సరికాదు. కలియుగములో ఎక్కువకాలం బ్రహ్మచర్యం మంచిదికాదని ఋషి భావన. ఆ తరువాత స్నాతకం చేసి వివాహ జీవితంలో ప్రవేశపెట్టడం శాస్త్రసమ్మతం.

బ్రహ్మచారికి నియమ నిష్ఠలు అనేకం ఉంటాయి. సుగంధ ద్రవ్యాలను వాడరాదు, పగటి నిద్ర పనికి రాదు, అలంకరణ చేసుకోరాదు, కామక్రోధ మద మాత్సర్యాలకు దూరంగా ఉండాలి, స్త్రీలయందు మౌనం సాధించాలి, సంగీత నృత్య వాద్యాలకు దూరంగా ఉండాలి, దుర్జన సాంగత్యం చేయకూడదు, చన్నీటి స్నానం మాత్రమే చేయాలి, వాహనాన్ని అదిరోహించకూడదు, వివేకం వీడకూడదు. దంతధావనానికి సుగంధాలను ఉపయోగించరాదు, అతిగా ఉద్రేకం, సంతోషం లాంటివి దరిచేరనీయకూడదు. అద్దములో ముఖమును చూడరాదు. మధువు, మాంసము తీసుకొనకూడదు. ఉప్పు, కారం లేని సాత్విక భోజనమే భుజించాలి. గురువు ఆజ్ఞను శిరసావహించాలి. ఇలా అనేక నియమ నిస్ఠలతో బ్రహ్మచర్యాన్ని కొనసాగించాలి. విద్యాభ్యాస సమయంలో బ్రహ్మచారి గురువునకు ఏమీ ఇవ్వనవసరం లేదు. కానీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గురువును అడిగి అతను కోరినది గురుదక్షిణగా సమర్పించడం ఆచారం.

 ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ

చార్‌ ధామ్‌

భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ద హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక,పూరీ మరియు రామేశ్వరం లను కలిపి చార్‌ ధామ్‌ గా వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యులచే ఉపదేశించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు మరియు ఒక శైవ క్షేత్రము కలదు. కాలక్రమేణా చార్‌ ధామ్‌ అనే పదము హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది.

మూలాధారాలు లేనప్పటికీ భారతదేశంలో హిందూమత వ్యాప్తికి విస్తృతంగా కృషిచేసిన ఆది శంకరాచార్య ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చార్‌ధాం హోదాను ఆపాదించారు. ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడటం గమనార్హం. ఉత్తరాన బద్రీనాధ్ ఆలయం, తూర్పున పూరీ లోని జగన్నాధ ఆలయం, పశ్చిమాన ద్వారక లోని ద్వారకానాధీశ ఆలయం మరియు దక్షిణాన రామేశ్వరం లో రామనాధస్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి. సిద్ధాంతపరంగా దేవాలయాలు హిందూ, అవి శైవమతానికి మరియు వైష్ణవ శాఖలలో మధ్య విభజించబడి ఉన్నప్పటికీ, చార్ ధామ్ తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారంలా భావింపబడుతుంది. 20వ శతాబ్ద మధ్యకాలం నుండి హిమాలయా పర్వత సానువులలో ఉన్న బద్రీనాధ్, కేదార్‌నాధ్, గంగోత్రి మరియు యమునోత్రి ఆలయాలను కలిపి ఛోటా చార్‌ధామ్‌ గా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా ఉత్తరాఖండ్ పర్యాటకం అత్యధికంగా లాభపడుతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాత్రను బాగా ప్రోత్సహిస్తున్నది.

ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

శుక్లయజుర్వేదం

యాజ్ఞవల్క్య మహర్షి సూర్యుడినుండి నేర్చుకుని ప్రచారం చేసిన యజుర్వేదాన్నే శుక్లయజుర్వేదం అంటారు. ఉపనిషత్కాలపు ప్రాచీన భారతదేశంలో యాజ్ఞవల్క్యుడు గొప్ప ఋషిగా, మహామేధావిగా, బ్రహ్మతత్వవేత్తగా గణనకెక్కాడు. అతని తండ్రి వాజసుడు. కనుక అతడు వాజసనేయుడయ్యాడు. వ్యాస శిష్యుడైన వైశంపాయన మహర్షికి అతడు శిష్యుడు. గురువు వద్ద యజుర్వేదం అభ్యసించాడు. ఒకసారి గురువుతో తగాదాపడగా గురువు కోపగించి తన వద్ద నేర్చుకున్న విద్యనంతా తిరిగి అప్పగించమన్నాడు. దానితో విద్యనంతా అప్పగించి సూర్యునికై తపస్సు చేసాడు. సూర్యుడు యాజ్ఞవల్క్యుడికి యజుర్వేదమంతా తిరిగి నేర్పాడు. దానికే యజుర్వేద వాజసనేయ శాఖ అని, శుక్ల యజుర్వేదమని పేర్లు వచ్చాయి. యాజ్ఞవల్క్యుడు గురువుకు అప్పగించివేసిన దానికి కృష్ణ యజుర్వేదము అని పేరు వచ్చింది.

ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

మహాన్యాసము

మహాన్యాసము 


నారుద్రో రుద్రమర్చయేత్ - అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.

మరి ఈ మహాన్యాసము అంటే?

మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు  కలిగినది.

౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు  కలది

౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది

౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది

౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది

౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము  పంచాంగన్యాసము కలది

ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.

౧. ప్రథమాంగన్యాసము

భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగ రుద్ర, దక్షిణాంగ రుద్ర, పశ్చిమాంగ రుద్ర, ఉత్తరాంగ రుద్ర, ఊర్ధ్వాంగ రుద్రులకు స్తుతి పూర్వక నమస్కారములు చేయవలెను. అటు తర్వాత,  పూర్వాంగముఖ రుద్ర, దక్షిణాంగముఖ రుద్ర, పశ్చిమాంగముఖ రుద్ర, ఉత్తరాంగముఖ రుద్ర, ఊర్ధ్వాంగముఖ రుద్రులకు స్తోత్ర పూర్వక నమస్కారములు చేయవలెను. తర్వాత, "యా తే రుద్ర శివాతమా" మొదలగు మంత్రములను పఠించుచు, తన శిఖాదులను తాకవలెను.

౨. ద్వితీయాంగన్యాసము

ఓం నమో భగవతే రుద్రాయ అని పలికి నమస్కరించి, ఓం మూర్ద్నే నమః, నం నాసికాయై నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః,  తేం దక్షిణ హస్తాయ నమః, రం వామ హస్తాయ నమః, యం పాదాభ్యాం నమః అనే మంత్రాలు చదువుతూ ఆయా అంగాల యందు  నమస్కార పూర్వకంగా న్యాసము (రుద్రుని నిలుపుట) చేయవలెను.

౩. తృతీయాంగన్యాసము

సద్యోజాతాది మంత్రములు చదువుతూ పాదాది అంగములను న్యాసము చేయవలెను. హంస గాయత్రీ మంత్రము పఠించి "హంస హంస" అని పలికి శిరస్సును స్పృశించవలెను. హంస అనగా శివుడు. ఇలా న్యాసము చేయుట వలన భక్తుడు ఆ సదాశివుడే తానగును.

తర్వాత, అంజలి చేసి "త్రాతార మింద్ర...." మొదలగు మంత్రములు   పఠించుచు ఆయ దిక్కుల అధిదేవతలగు ఇంద్రాదులకు నమస్కారములు చేయవలెను. దీనినే, సంపుటం అంటారు.

తర్వాత దశాంగ రౌద్రీకరణం - భక్తుడు అంజలి ఘటించి, పైన సంపుటంలో చెప్పిన మంత్రములు పఠించుచు, వరుసగా తూర్పు నుండి మొదలు పెట్టి అథో దిక్కు వరకు , ఆయా దేహ స్థానాన్ని తాకి (లలాటము నుండి పాదముల వరకు), ఆయా దేవతకు నమస్కరించుచు (ఇంద్రుని మొదలు పృథివి చివర) రుద్రుని తన దేహము యందు న్యాసము చేయవలెను. ఇందులో ప్రతి మంత్రమునకు ముందు "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని చెప్పవలెను.

తర్వాత షోడశాంగ రౌద్రీకరణము -  ఓం  అం విభూరసి  ప్రవాహణో.... అనే మంత్రముతో మొదలు పెట్టి ఓం అః  ఆహిరసి బుధ్నియో" అను మంత్రముల వరకు (అకారాది వర్ణమాల), అన్ని మంత్రములు ప్రతి దాని చివర 'రౌద్రేణానీకేన పాహిమాగ్నే పిపృహి మా మా మాహిగ్‍ం సీః' అనే మంత్రభాగమును జోడించి చదువుతూ, తన శిఖ నుండి పాదముల వరకు పదహారు అంగములను తాకుచు, తన దేహమును రుద్రుని భావించవలెను. కొంతమంది దీనికి కూడా ప్రతి మంత్రము ముందు  "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని సంపుటీకరణ చేస్తారు.

దీనివలన తన చర్మము, ఎముకలయందు సర్వ పాపములనుండి విముక్తి పొందును, సర్వ భూతములచే అపరాజితుడగును, ఉపఘాతములన్ని తొలగి, రక్షణ పొందును.

౪. చతుర్థాంగన్యాసము

"మనోజ్యోతిః...." మొదలగు మంత్రములు చదువుతూ, గుహ్యాది శిరస్యంతం అంగముల తాకుతూ, ఆ అంగములను అభిమంత్రణము చేయవలెను. గుహ్యము, పాదములు తాకినప్పుడు అప ఉపస్పృశ్యము చేయవలెను (రెండు చేతులను నీతితో శుద్ధి) - ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆత్మ రక్షా అంటారు. దీనితో పాటు "బ్రహ్మాత్మ న్వదసృజత" మొదలగు మంత్రములు చదివి 'ఆత్మనే నమః' అని నమస్కారము చేయవలెను. ఇలా చేయటం వలన తన ఆత్మ యందు ఆ పరమాత్మ ఉండునట్లు చేయుట అగును.

౫. పంచమాంగన్యాసము

ఇందులో శివ సంకల్ప సూక్తం ప్రధాన మైనది. శివ సంకల్పం గురించి ప్రత్యేక వ్యాసం తర్వాత రాస్తాను. "యే వేదం భూతం భువనం భవిష్యతి.." మొదలుకొని  ముప్ఫై తొమ్మిది మంత్రములున్న శివ సంకల్ప సూక్తాన్ని పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ శివసంకల్పగ్‍ంహృదయాయ నమః" అని చెప్పి తన హృదయమున న్యాసము చేయవలెను. దీనివలన మోక్షము కలుగును.

తరువాత పురుష సూక్తము పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ పురుష సూక్తగ్‍ంశిరసే స్వాహా" అని శిరసున న్యాసము చేయవలెను. దీనివలన జ్ఞానమోక్ష ప్రాప్తి.

తర్వాత, ఉత్తర నారాయణమును "అద్భ్య స్సం భూతః" మొదలు "సర్వమ్మనిషాణ" వరకు పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తర నారాయణగ్‍ంశిఖాయై వషట్" అని శిఖ యందు న్యాసము చేయవలెను.

తరువాత అప్రతిరథకవచమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఆశుశ్శిశానోప్రతిరథం కవచాయ హుం" అని చెప్పి కవచముగా న్యాసం చేయవలెను. దీని వలన శత్రు బాధా నివారణం, విజయ ప్రాప్తి.

తరువాత, "ప్రతి పూరష మేకకపాలా న్నిర్వపతి......" అనే అనువాకమును, "జాతా ఏవ ప్రజా రుద్రా న్నిరవదయతే..." అను అనువాకమును పఠించి, "ఓం నమో భగవతే రుద్రాయ ప్రతి పూరుషం ప్రతి పూరుషం విభ్రా డితి నేత్రత్రయాయవౌషట్" అని చెప్పి మూడు నేత్రములను తాకవలెను.

తరువాత, "త్వ మగ్నే రుద్ర ....." అనే అనువాకమును, "దేవా దేవేషు శ్రయధ్వం..." అనువాకమును పఠించి "ఓం నమో భగవతే  రుద్రాయ అస్త్రాయ ఫట్" అని న్యాసము చేయవలెను. తరువాత "భూ ర్భువ స్సువ ఇతి దిగ్బంధః"  అని దిగ్బంధమును చూపించ వలెను.

తరువాత, ఆష్టాంగ ప్రణామములు చేయవలెను (ప్రతి అంగమునకు ఒక మంత్రము ఉంది. దాన్ని పఠించి, ఎనిమిది అవయవములు భూమిపై తాకునట్లు, వాటిని తాను కూడా తాకుచు ఒక్కొక్క అవయవామునకు ఒక్కొక్క సాష్టాంగ ప్రణామము చేయవలెను (రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు - ఇవి అష్టాంగములు).

వీటి తర్వాత, తన్ను రుద్ర రూపునిగా ధ్యానించ వలెను.  

శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్

దీని తర్వాత, రుద్ర స్నానార్చనాభిషేక విధిని ప్రారంభించ వలెను.

లింగమును ప్రతిష్ఠించి, "ప్రజననే బ్రహ్మాతిష్ఠంతు" మొదలు "సర్వేష్వంగేషు సర్వాః దేవతాః యథాస్థానాని  తిష్ఠంతు మాం రక్షంతు" అని చెప్పవలెను. (ఇప్పుడు అన్ని అంగములలో ఆయా దేవతలు యథా స్థానములందు ఉండునట్లు ప్రార్థించునది).

[తరువాత, "అగ్ని ర్మే వాచిశ్రితః వాగ్ఘ్రుదయే హృదయం మయి" మొదలు "అంత స్తిష్ఠ త్వమృతస్య గోపాః" వరకు పఠించి లింగము, అంగములను స్పృశించ వలెను. గంధము, అక్షతలు, బిల్వ పత్రములు, పుష్పాలు, ధూప దీప నైవేద్య తాంబూలములతో లింగమును అర్చించి ఆత్మను ప్రత్యారాధించ వలెను.అభిషేక ప్రారంభములో చమకములోని 'శంచమ' అనువాకమును, నమక చమకముల లోని మొదటి అనువాకములను పఠించి, "ప్రాణానాం గ్రంథిరసి"  అనే నాలుగు అనువాకములు, దశ శాంతి మంత్రములు, ప్రశ్నాంతము జపించి, శతానువాకములను, పంచకాఠకములను పఠించి అభిషేకము చేయవలెను. ఇట్లు ఏకాదశ వారములు చేసినచో అది ఏకాదశ రుద్రాభిషేకమగును.]

ఇది క్లుప్తంగా మహాన్యాసం లోని అధికార అర్హతకు చేయవలసిన పధ్ధతి.

ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

Tuesday, August 20, 2013

బట్టి విక్రమార్కుడు

చదువు అర్థం కానప్పుడు బట్టీ

సాధనం అవుతుంది. ఇంగ్లీషు

మీడియం బడుల్లో భాష మీద పట్టు

రాకమునుపే ఆ భాషలో చదువు

చెప్పటం వల్ల అర్థం కాదు.

అర్థంకాని చదువుతో మార్కులు

తెచ్చుకోవాలి అంటే పిల్లలకు బట్టీనే

దారి. అర్థం చేసుకుని చదివితే

అరగంటలో అయ్యే పాఠానికి బట్టీ

పెట్టటం కోసం కొన్ని గంటలు కుస్తీ

పడాలి. పైగా బట్టీ పెట్టింది ఎక్కువ

కాలం గుర్తుండదు కనుక మళ్ళీ

మళ్ళీ దాన్ని తిరగతోడుతూ

ఉండాలి. ఇందువల్ల చదువుకోసం

మామూలుగా వెచ్చించాల్సిన

సమయం కంటే అదనపు

సమయం కావాలి. దీనితో బుద్ధి

వికాసానికి, వ్యక్తిత్వ ఎదుగుదలకు

ఉపయోగపడే చదువేతర

కార్యక్రమాలకు కోత పడుతుంది.

ఇందువల్ల పరిస్థితులకు తగ్గట్టు

సర్దుకుపోయే నైపుణ్యాలు ఈ తరం

పిల్లల్లో పెంపొందటం లేదు. అవి

కొంతమందిలో పెంపొందినా బడితో

సంబంధం లేకుండా వారి

తల్లిదండ్రులు తీసుకున్న అదనపు

జాగ్రత్తలవల్ల అయి ఉంటుంది.
మార్కులతో సంబంధం లేని

ఇలాంటి నైపుణ్యాలను నేర్పే తీరికా,

అవసరమూ ప్రస్తుత బడులకు

లేదు. మార్కులు వస్తున్నాయా

లేదా అన్నదే వారికి గీటురాయి.

దీంతో బిడ్డలు ఎదిగాక, జీవితంలో

ఎదురయ్యే చిన్న చిన్న ప్రతికూల

పరిస్థితుల్ని కూడా ఎదుర్కొనే

చేవలేనివారుగా, సామాజిక

చైతన్యం లేని చచ్చు తరంగా

తయారు అవుతున్నారు.

అందుకనే పాతికేళ్ళకు మునుపు

కనీ వినీ ఎరగని ‘‘చదువు ఒత్తిడి’’

అనే గుదిబండ ఇపుడు పిల్లల

మెడలో వేలాడుతోంది.
21-టో నూరేడు తొలి అంకం

నుంచి పిల్లల్లో మానసిక సమస్యలు

ఎక్కువ అవుతున్నాయని సర్వేలు

తెలుపుతున్నాయి. ఇందుకు

కారణం చదువూ, దానికి

సంబంధించిన ఒత్తిడి. ‘‘విద్యా

విధానంలో, బోధనా పద్ధతి,

బోధనా భాషలో వచ్చిన మార్పులు

పిల్లల్లో ఎక్కువ ఒత్తిడికి కారణం’’

అని శాస్ర్తియ పరికింతలు

తెలుపుతున్నాయి.
అసలే మనం ఒత్తిడి యుగంలో

ఉన్నాం. అంటే సమాజం

మొత్తంమీద ఒత్తిడి ఉంటుంది.

సమాజం మీద పడే ఒత్తిడి పిల్లల

మీదకు కూడా జారుతుంది.

దీనికితోడు గోరుచుట్టు మీద రోకటి

పోటులా చదువు ఒత్తిడి అదనంగా

వచ్చి చేరటంవల్ల దాని ప్రభావం

వారిలో రెట్టింపు అవుతుంది.
ఒత్తిడి ప్రభావం పిల్లల మీద రెండు

రకాలుగా ఉంటుంది. ఒకటి పిల్లలు

తాము ఒత్తిడికి గురవుతున్నాము

అన్న సంగతిని గుర్తించలేరు, కానీ

దానివల్ల కలిగే భయం,

ఆందోళనల్ని అనుభవిస్తూ

ఉంటారు. అయినా దాన్ని

బయటికి చెప్పలేరు. రెండోది,

పిల్లలు ఎంత తెలివిగలవాళ్ళు

అయినప్పటికీ, ఒత్తిడిలో ఉంటే

అది నేర్చుకొనేదారికి అడ్డుగా

నిలుస్తుంది. అందువల్ల చదువు

మందగిస్తుంది. దీనివల్ల తెలివి

ఉన్నా పిల్లల్లో చదువు అంటే ఆసక్తి

కోల్పోయి, మరతనం (మెకానికల్)

చోటుచేసుకుంటుంది. ఫలితంగా

బిడ్డలో దాగి వున్న ప్రతిభ

విరబూయటం మందగిస్తుంది.

కొందరు అయితే చదువు పట్ల

వ్యతిరేకత ఏర్పరుచుకొని

పక్కదారులు పట్టే అవకాశం ఉంది.
ఒత్తిడి ఎదుర్కొనే మెళకువలు

కానీ, దాని నుండి బయటపడే

ఉపశమన పద్ధతులు కాని

పసిబిడ్డల్లో అపుడే ఏర్పడి

ఉండవు. కాబట్టి వాళ్ళకు వాళ్ళుగా

ఒత్తిడి నుండి బయటపడలేరు.

అందుకే పిల్లల్ని ఒత్తిడికి దూరంగా

ఉంచాలి. ఒత్తిడిలేని చదువుని

మనం బిడ్డలకు అందించాలి. కానీ

వాస్తవంలో జరుగుతున్నది

ఏమిటి? తగిన వయస్సు

రాకముందే, భాష రాక మునుపే

పరాయి భాషలో చదువును

నాటడానికి ప్రయత్నించటంవల్ల

అసలు ఎదుగుదలే మందగిస్తోంది.
సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని

బోధనా పద్ధతుల్లో విప్లవాత్మక

మార్పులు వచ్చాయి. దీనివల్ల

పిల్లలకు పాఠాలు సులభంగా అర్థం

అవుతాయి. గతంలో ఎగువ

తరగతుల్లో కానీ అర్థం అయ్యే

పాఠాలను నేడు దిగువ తరగతి

పిల్లలు సయితం బాగా అర్థం

చేసుకోగలిగిన పరిస్థితి ఉంది.

పరమాణు నిర్మాణం, జెనెటిక్సు

లాంటి అతి కష్టమయిన అంశాలను

కూడా 5దో తరగతి పిల్లలకు

అలవోకగా అర్థం అయ్యేలా చెప్పే

బోధనా ఉపకరణలు ఇపుడు

వాడుతున్నాము. అలాంటప్పుడు

చదువు చాలా సుళువు కావాలి,

విద్యా ప్రమాణాలు పెరగాలి,

నాణ్యత పెరగాలి. ఆ మేరకు

చదువు కోసం కేటాయించాల్సిన

సమయం తగ్గాలి, బట్టీ విధానానికి

ముగింపు పలకాలి. కానీ నిజానికి

జరుగుతున్నది ఏమిటి?
చదువు గంటలు పెరిగాయి.

ఎందుకు పెరిగాయి? బట్టీ ఎందుకు

పెట్టాలి? చదువు అర్థం కాక!

ఎందుకు అర్థంకావటంలేదూ?

ఇంగ్లీషు సరిగా రాక! ఇంగ్లీషు

మీడియంలో చదివినా ఇంగ్లీషు

ఎందుకు రావటం లేదూ? సొంత

భాష ఎదగకముందే, రాని భాషలో

మొదలుపెట్టటంవల్ల.
ఒక మొక్క ఎదిగేటపుడు దాని

పక్క మరో మొక్క ఉంటే కావాల్సిన

మొక్క సరిగా ఎదగదు. కాబట్టే

రైతు ‘కలుపు’తీస్తాడు. లేత

వయసులో ఎదగాల్సిన భాషను

వదిలి కలుపు భాష పెరగటానికి

ఎరువులు వేస్తున్నాము.

ఇందువల్ల ఏ భాషా సరిగా

ఎదగదు. భాష మీద పట్టు లేకపోతే

చదువు మీద పట్టురాదు.

చదువుమీద పట్టు వచ్చినట్టు

అనిపించాలి అంటే ఉన్న ఒకే ఒక

అడ్డదారి బట్టీ. బట్టీకోసం ఎక్కువ

కష్టపడాలి. బట్టీకోసం ఎక్కువ

సమయం కావాలి. కాబట్టే పిల్లలు

‘బట్టి’కొట్టి ‘మార్కులు’ తెచ్చే

బట్టివిక్రమార్కుల అవతారం

ఎత్తుతున్నారు. అర్థం కాని

చదువు శవాన్ని పదే పదే

మెదడులోకి దించటానికి

ప్రయత్నించటం. దిగిన వెంటనే

అది మెదడులోనుండి మాయం

కావటం. ఏడాది పొడుగునా

పిల్లలకు ఈ జంజాటానికే సమయం

చాలటం లేదు. ఇక మనిషిగా

ఎదగటానికి సమయం ఎక్కడ

సంధ్యాదేవతా నమస్కారః

శరీర శుద్ధిఅపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌உపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |

ఆచమనఃఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా)
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య)
ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య)
ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య)
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా)
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా)
ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా)
ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా)
ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య)
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః

(ఏతాన్యుచ్చార్య ఉప్యక్త ప్రకారం కృతే అంగాని శుద్ధాని భవేయుః)

భూతోచ్చాటనఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః

(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)

ప్రాణాయామఃఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ |
ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
ఓమాపో జ్యోతీసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ || (తై. అర. 10-27)

సంకల్పఃమమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః – జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా – క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహంః ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యామ్ ఉపాసిష్యే ||

మార్జనఃఓం ఆపోహిష్ఠా మ’యోభువః’ | తా న’ ర్జే ద’ధాతన | హేరణా’ చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతేనః | తీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’ జిన్వ’థ | ఆపో’ నయ’థా చ నః | (తై. అర. 4-42)

(ఇతి శిరసి మార్జయేత్)

(హస్తేన జలం గృహీత్వా)

ప్రాతః కాల మంత్రాచమనఃసూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యద్రాత్ర్యా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ స్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | రాత్రి స్తద’వలుంపతు | యత్కించ’ దురితం మయి’ | ఇదమహం మా మమృ’త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో’మి స్వాహా” || (తై. అర. 10. 24)

మధ్యాహ్న కాల మంత్రాచమనఃఆపః’ పునంతు పృథివీం పృ’థివీ పూతా పు’నాతు మామ్ | పుంతు బ్రహ్మ’స్పతి ర్బ్రహ్మా’ పూతా పు’నాతు మామ్ | యదుచ్ఛి’ష్ట మభో”జ్యం యద్వా’ దుశ్చరి’తం మమ’ | సర్వం’ పునంతు మా మాపో’‌உసతా ంచ’ ప్రతిగ్రగ్గ్ స్వాహా” || (తై. అర. పరిశిష్టః 10. 30)

సాయంకాల మంత్రాచమనఃఅగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యదహ్నా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | అహ స్తద’వలుంపతు | య త్కించ’ దురితం మయి’ | ఇద మహం మా మమృ’త యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా || (తై. అర. 10. 24)

(ఇతి మంత్రేణ జలం పిబేత్)

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

ద్వితీయ మార్జనఃధి క్రావణ్ణో’ అకారిషమ్ | జిష్ణో రశ్వ’స్య వాజి’నః |
సురభినో ముఖా’కత్ప్ర ఆయూగ్‍మ్’షి తారిషత్ ||

(సూర్యపక్షే లోకయాత్రా నిర్వాహక ఇత్యర్థః)

ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ర్జే ద’ధాతన | హేరణా’ చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతేనః | తీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’ జిన్వ’థ | ఆపో’ నయ’థా చ నః || (తై. అర. 4. 42)

పునః మార్జనఃహిర’ణ్యవర్ణా శ్శుచ’యః పాకాః యా సు’జాతః శ్యపో యా స్వింద్రః’ | గ్నిం యా గర్భ’న్-దధిరే విరూ’పా స్తాశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యా సాగ్ం రాజా వరు’ణో యాతి మధ్యే’ సత్యానృతే అ’శ్యం జనా’నామ్ | ధు శ్చుశ్శుచ’యో యాః పా’కా స్తాశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యాసాం” దేవా దివి కృణ్వంతి’ క్షం యా ంతరి’క్షే బహుథా భవ’ంతి | యాః పృ’థివీం పయ’సోందంతి’ శ్శుక్రాస్తాశగ్గ్ స్యోనా భ’వంతు | యాః శివేన’ మా చక్షు’షా పశ్యతాపశ్శివయా’ ను వోప’స్పృశ త్వచ’ మ్మే | సర్వాగ్’మ్ గ్నీగ్‍మ్ ర’ప్సుషదో’ హువే వోయిర్చో మోజో నిధ’త్త || (తై. సం. 5. 6. 1)
(మార్జనం కుర్యాత్)

అఘమర్షణ మంత్రః పాపవిమోచనం
(హస్తేన జలమాదాయ నిశ్శ్వస్య వామతో నిక్షితపేత్)
ద్రుదా ది’వ ముంచతు | ద్రుదా దివే న్ము’ముచానః |
స్విన్న స్స్నాత్వీ మలా’ దివః | పూతం పవిత్రే’ణే వాజ్య”మ్ ఆప’ శ్శుందంతు మైన’సః || (తై. బ్రా. 266)

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ప్రాణాయామమ్య

లఘుసంకల్పఃపూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ యథా కాలోచిత అర్ఘ్యప్రదానం కరిష్యే ||

ప్రాతః కాలార్ఘ్య మంత్రంఓం భూర్భుస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || 3 ||

మధ్యాహ్నార్ఘ్య మంత్రంఓం గ్ం సశ్శు’చిష ద్వసు’రంతరిక్షస ద్దోతా’ వేదిషదతి’థి ర్దురోసత్ | నృష ద్వ’స దృ’స ద్వ్యో’బ్జా గోజా ఋ’జా అ’ద్రిజా తమ్-బృహత్ || (తై. అర. 10. 4)

సాయం కాలార్ఘ్య మంత్రంఓం భూర్భుస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ ||

(ఇత్యంజలిత్రయం విసృజేత్)

కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తం
ఆచమ్య…
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కాలాతిక్రమ దోషపరిహారార్థం చతుర్థా అర్ఘ్యప్రదానం కరిష్యే ||

ఓం భూర్భుస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ ||
(ఇతి జలం విసృజేత్)

సజల ప్రదక్షిణంఓం ద్యంత’మస్తం యంత’ మాదిత్య మ’భిథ్యాన్కుర్వన్-బ్రా”హ్మణో విద్వాన్ త్సకల’మ్-ద్రమ’శ్నుతే అసావా’దిత్యో బ్రహ్మేతి || బ్రహ్మైవ సన్-బ్రహ్మాప్యేతివం వేద || అసావాదిత్యో బ్రహ్మ || (తై. అర. 2. 2)

(ఏవమ్ అర్ఘ్యత్రయం దద్యాత్ కాలాతిక్రమణే పూర్వవత్)
(పశ్చాత్ హస్తేన జలమాదాయ ప్రదక్షిణం కుర్యాత్)
(ద్విరాచమ్య ప్రాణాయామ త్రయం కృత్వా)

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

సంధ్యాంగ తర్పణంప్రాతఃకాల తర్పణంసంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||

మధ్యాహ్న తర్పణంసంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||

సాయంకాల తర్పణంసంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||

(పునరాచమనం కుర్యాత్)

గాయత్రీ అవాహనఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ’ ఇత్యార్షమ్ | గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపమ్ | సాయుజ్యం వి’నియోమ్ || (తై. అర. 10. 33)

ఆయా’తు వర’దా దేవీ క్షరం’ బ్రహ్మసంమితమ్ | గాత్రీం” ఛంద’సాం మాతేదం బ్ర’హ్మ జుషస్వ’ మే | యదహ్నా”త్-కురు’తే పాపం తదహ్నా”త్-ప్రతిముచ్య’తే | యద్రాత్రియా”త్-కురు’తే పాపం తద్రాత్రియా”త్-ప్రతిముచ్య’తే | సర్వ’ ర్ణే మ’హాదేవి ంధ్యావి’ద్యే రస్వ’తి ||

ఓజో’‌உసి సహో’‌உసి బల’మసి భ్రాజో’‌உసి దేవానాం ధానామా’సి విశ్వ’మసి విశ్వాయు-స్సర్వ’మసి ర్వాయు-రభిభూరోమ్ | గాయత్రీ-మావా’హయామి సావిత్రీ-మావా’హయామి సరస్వతీ-మావా’హయామి ఛందర్షీ-నావా’హయామి శ్రియ-మావాహ’యామి గాయత్రియా గాయత్రీ చ్ఛందో విశ్వామిత్రఋషి స్సవితా దేవతా‌உగ్నిర్-ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్-హృదయగ్‍మ్ రుద్ర-శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్‍మ్ శత్యక్షరా త్రిపదా’ షట్-కుక్షిః పంచ-శీర్షోపనయనే వి’నియోగః | ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ || (మహానారాయణ ఉపనిషత్)

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

జపసంకల్పఃపూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ||

కరన్యాసఃఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః |
ప్రచోదయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః |

అంగన్యాసఃఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచోదయా”త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ |
ఓం భూర్భుస్సురోమితి దిగ్భంధః |

ధ్యానమ్ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్-ముఖై స్త్రీక్షణైః |
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ |
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ||

చతుర్వింశతి ముద్రా ప్రదర్శనంసుముఖం సంపుటించైవ వితతం విస్తృతం తథా |
ద్విముఖం త్రిముఖంచైవ చతుః పంచ ముఖం తథా |
షణ్ముఖో‌உథో ముఖం చైవ వ్యాపకాంజలికం తథా |
శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్ |
ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ |
సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా |

చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః |
ఇతిముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ ||

యో దేవ స్సవితా‌உస్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||

గాయత్రీ మంత్రంఓం భూర్భుస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
అష్టముద్రా ప్రదర్శనంసురభిర్-ఙ్ఞాన చక్రే చ యోనిః కూర్మో‌உథ పంకజమ్ |
లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః ||
ఓం తత్సద్-బ్రహ్మార్పణమస్తు |

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

ద్విః పరిముజ్య |
సకృదుప స్పృశ్య |
యత్సవ్యం పాణిమ్ |
పాదమ్ |
ప్రోక్షతి శిరః |
చక్షుషీ |
నాసికే |
శ్రోత్రే |
హృదయమాలభ్య |

ప్రాతఃకాల సూర్యోపస్థానంఓం మిత్రస్య’ ర్షణీ ధృ శ్రవో’ దేవస్య’ సా సిమ్ | త్యం చిత్రశ్ర’ వస్తమమ్ | మిత్రో జనాన్’ యాతయతి ప్రజానన్-మిత్రో దా’ధార పృథివీ ముతద్యామ్ | మిత్రః కృష్టీ రని’మిషా‌உభి చ’ష్టే త్యాయ’ వ్యం ఘృతవ’ద్విధేమ | ప్రసమి’త్త్ర మర్త్యో’ అస్తు ప్రయ’స్వా న్యస్త’ ఆదిత్య శిక్ష’తి వ్రతేన’ | న హ’న్యతే న జీ’యతే త్వోతోనై మగ్ంహో’ అశ్నో త్యంతి’తోదూరాత్ || (తై. సం. 3.4.11)

మధ్యాహ్న సూర్యోపస్థానంఓం ఆ త్యే రజ’సా వర్త’మానో నివేశ’య న్నమృతం మర్త్య’ంచ | హిరణ్యయే’న సవితా రథేనా‌உదేవో యా’తి భువ’నా నిపశ్యన్’ ||

ద్వయ ంతమ’ స్పరి పశ్య’ంతో జ్యోతి రుత్త’రమ్ | దేవన్-దే’త్రా సూర్య మగ’న్మ జ్యోతి’ రుత్తమమ్ ||

దుత్యం జాతవే’దసం దేవం వ’హంతి కేతవః’ | దృశే విశ్వా’ సూర్య”మ్ || చిత్రం దేవానా ముద’గా దనీ’కం చక్షు’ర్-మిత్రస్య వరు’ణ స్యాగ్నేః | అప్రా ద్యావా’ పృథివీ అంతరి’క్షగ్‍మ్ సూర్య’ త్మా జగ’త స్తస్థుష’శ్చ ||

తచ్చక్షు’ర్-దేవహి’తం పురస్తా”చ్చుక్ర ముచ్చర’త్ | పశ్యే’మ రద’శ్శతం జీవే’మ రద’శ్శతం నందా’మ రద’శ్శతం మోదా’మ రద’శ్శతం భవా’మ రద’శ్శతగ్‍మ్ శృణవా’మ రద’శ్శతం పబ్ర’వామ రద’శ్శతమజీ’తాస్యామ రద’శ్శతం జోక్చ సూర్యం’ దృషే || య ఉద’గాన్మతో‌உర్ణవా” ద్విభ్రాజ’మాన స్సరిస్యధ్యాథ్సమా’ వృభో లో’హితాక్షసూర్యో’ విశ్చిన్మన’సా పునాతు ||

సాయంకాల సూర్యోపస్థానంఓం మమ్మే’ వరుణ శృధీ హవ’ ద్యా చ’ మృడయ | త్వా మ’స్యు రాచ’కే || తత్వా’ యామి బ్రహ్మ’ణా వంద’మా స్త దాశా”స్తే యజ’మానో విర్భిః’ | అహే’డమానో వరుణేబోధ్యురు’గ్ం సమా’యుః ప్రమో’షీః ||

యచ్చిద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతమ్ | మినీమసిద్య విద్యవి | యత్కించేదం వరుణదైవ్యే జనే‌உభిద్రోహ మ్మనుష్యాశ్చరామసి | అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః | కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ | సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ వరుణ ప్రియాసః || (తై. సం. 1.1.1)

దిగ్దేవతా నమస్కారః(ఏతైర్నమస్కారం కుర్యాత్)
ఓం నమః ప్రాచ్యై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ప్రతీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఉదీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ర్ధ్వాయై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమో‌உధ’రాయై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమో‌உవాంతరాయై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |

ముని నమస్కారఃనమో గంగా యమునయోర్-మధ్యే యే’ వంతి తే మే ప్రసన్నాత్మాన శ్చిరంజీవితం వ’ర్ధంతి నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ నమో నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ న’మః ||

సంధ్యాదేవతా నమస్కారఃసంధ్యా’యై నమః’ | సావి’త్ర్యై నమః’ | గాయ’త్ర్యై నమః’ | సర’స్వత్యై నమః’ | సర్వా’భ్యో దేవతా’భ్యో నమః’ | దేవేభ్యో నమః’ | ఋషి’భ్యో నమః’ | ముని’భ్యో నమః’ | గురు’భ్యో నమః’ | పితృ’భ్యో నమః’ | కామో‌உకార్షీ” ర్నమో నమః | మన్యు రకార్షీ” ర్నమో నమః | పృథివ్యాపస్తేజో వాయు’రాకాశాత్ నమః || (తై. అర. 2.18.52)

ఓం నమో భగవతే వాసు’దేవాయ | యాగ్‍మ్ సదా’ సర్వభూతాని రాణి’ స్థారాణి’ చ | సాయం ప్రాత ర్న’మస్యంతి సా మా సంధ్యా’‌உభిరక్షతు ||

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథా‌உంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||

గాయత్రీ ఉద్వాసన (ప్రస్థానం)త్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వమూర్థ’ని | బ్రాహ్మణే”భ్యో‌உభ్య’ను ఙ్ఞాతా చ్చదే’వి థాసు’ఖమ్ | స్తుతో మయా వరదా వే’దమాతా ప్రచోదయంతీ పవనే” ద్విజాతా | ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర’హ్మర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకమ్ || (మహానారాయణ ఉపనిషత్)

భగవన్నమస్కారఃనమో‌உస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః ||

భూమ్యాకాశాభి వందనందం ద్యా’వా పృథివీ త్యమ’స్తు | పిర్-మాతర్యది హోప’ బృవేవా”మ్ |
భూతం దేవానా’ మవమే అవో’భిః | విద్యా మేషం వృజినం’ జీరదా’నుమ్ ||

ఆకాశాత్-పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||
శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి |

సర్వవేదేషు యత్పుణ్యమ్ | సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ ||
స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి ||
వాసనాద్-వాసుదేవస్య వాసితం తే జయత్రయమ్ |
సర్వభూత నివాసో‌உసి శ్రీవాసుదేవ నమో‌உస్తుతే ||

శ్రీ వాసుదేవ నమో‌உస్తుతే ఓం నమ ఇతి |

అభివాదః (ప్రవర)చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | … ప్రవరాన్విత … గోత్రః … సూత్రః … శాఖాధ్యాయీ … అహం భో అభివాదయే ||

ఈశ్వరార్పణంకాయేన వాచా మనసేంద్రియైర్వా | బుద్ధ్యా‌உ‌உత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||
హరిః ఓం తత్సత్ | తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు |

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...