Tuesday, August 20, 2013

శ్రీ రుద్రం –నమకం- చమకం

శ్రీ రుద్రం – నమకం


ఓం నమో భగవతే రుద్రాయ ||


నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః |
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః ||


యాత ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః |
శివా శరవ్యాయా తవ తయా నో రుద్ర మృడయ ||


యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాశినీ |
తయా నస్-తనువా శంతమయా గిరిశంతాభి చాకశీహి ||


యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే |
శివాం గిరిత్రతాం కురుమా హిగ్ంసీః పురుషం జగత్||


శివేన వచసాత్వా గిరిశా చ్ఛావదామసి |
యధా నః సర్వ మిజ్జగద యక్ష్మగ్ం సుమనా అసత్ ||


అధ్యవోచ దధివక్తా ప్రధమో దైవ్యో భిషక్ |
అహీగ్ంశ్చ సర్వా”జ్ఞంభ యంత్సర్వా”శ్చ యాతుధాన్యః ||


అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగళః |
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః సహస్రశో వైషా_గ్_ం హేడ ఈమహే ||


అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః
ఉతైనం గోపా అదృశన్-నదృశన్-నుదహార్యః |
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః ||


నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే” |
అధో యే అస్య సత్వానోహం తేభ్యోకరన్-నమః ||


ప్రముఞ్చ ధన్వనస్-త్వముభయోర్-ఆర్త్ని యోర్జ్యాం |
యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వప ||


అవతత్య ధనుస్త్వగ్ం సహస్రాక్ష శతేషుధే |
నిశీర్య శల్యానాం ముఖా శివోనః సుమనా భవ ||


విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత |
అనేశ-న్నస్యేషవ ఆభురస్య నిషంగధిః ||


యాతే హేతిర్-మీడుష్టమ హస్తే బభూవతే ధనుః |
తయాస్మాన్ విశ్వతస్-త్వమయక్ష్మయా పరిబ్భుజ ||


నమస్తే అస్త్వాయు ధాయానా తతాయ ధృష్ణవే” |
ఉభాభ్యా ముతతే నమో బాహుభ్యాం తవ ధన్వనే ||


పరితే ధన్వనో హేతిరస్మాన్-వృణక్తు విశ్వతః |
అధోయ ఇషుధిస్తవారే అస్మన్నిధే హితం ||


నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః ||


నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం+ పతయే నమో
నమః సస్పింజరాయ త్విషీమతే పధీనాం+ పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేన్నానాం+ పతయే నమో
నమో హరికేశా యోప వీతినే పుష్టాణాం+ పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం+ పతయే నమో
నమో రుద్రాయా తతావినే క్షేత్రాణాం+ పతయే నమో
నమః సూతాయా హంత్యాయ వనానాం+ పతయే నమో
నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం+ పతయే నమో
నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం+ పతయే నమో
నమో భువంతయే వారివస్కృతా యౌషధీనాం+ పతయే నమో
నమః ఉచ్చైర్-ఘోషా యాక్రందయతే పత్తీనాం+ పతయే నమో
నమః కృత్స్న వీతాయ ధావతే సత్వనాం+ పతయే నమః


నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం+ పతయే నమో
నమః కకుభాయ నిషంగిణే” స్తేనానాం+ పతయే నమో
నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం+ పతయే నమో
నమో నిచేరవే పరిచరా యారణ్యానాం పతయే+ నమో
నమః సృకా విభ్యో జిఘాగ్ం సద్భ్యో ముష్ణతాం+ పతయే నమో
నమో உసిమద్భ్యో నక్తం చరద్భ్యః ప్రకృంతానాం+ పతయే నమో
నమ ఉష్ణీషినే గిరిచరాయ కులుంచానాం+ పతయే నమో
నమః ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్-వానేభ్యః ప్రతిద ధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్-భ్యశ్చ వో నమో
నమో உస్సద్భ్యో విద్యద్-భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జా+గ్రద్-భ్యశ్చ వో నమో
నమః స్తిష్ఠద్భ్యో ధావద్-భ్యశ్చ వో నమో
నమః స్సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యో உశ్వపతిభ్యశ్చ వో నమః


నమః ఆ+వ్యాధినీ”భ్యో వివిధ్యంతీ భ్యశ్చ వో నమో
నమ ఉగణాభ్యస్-స్తృగం హతీభ్యశ్చ వో నమో
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో
నమో వ్రాతే”భ్యో వ్రాతపతి భ్యశ్చ వో నమో
నమో గణేభ్యో గణపతి భ్యశ్చ వో నమో
నమో విరూపేభ్యో విశ్వ రూపేభ్యశ్చ వో నమో
నమో మహద్భ్యః క్షుల్లకే భ్యశ్చ వో నమో
నమో రధిభ్యో రధేభ్యశ్చ వో నమో
నమో రధే”భ్యో రధపతి భ్యశ్చ వో నమో
నమః సేనా”భ్యః సేనాని భ్యశ్చ వో నమో
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృ భ్యశ్చ వో నమో
నమః స్తక్షభ్యో రధకారే భ్యశ్చ వో నమో
నమః కులాలేభ్యః కర్మారే”భ్యశ్చ వో నమో
నమః పుంజిష్టే”భ్యో నిషాదే భ్యశ్చ వో నమో
నమః ఇషుకృద్భ్యో ధన్వకృద్-భ్యశ్చ వో నమో
నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో
నమః శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః


నమో భవాయ చ రుద్రాయ చ
నమః శర్వాయ చ పశుపతయే చ
నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ
నమః కపర్ధినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ
నమో” హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ
నమో అగ్రియాయ చ ప్రధమాయ చ
నమ ఆశవే చా+జిరాయ చ
నమః శీ+ఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ ఊర్మ్యాయ చావ స్వన్యాయ చ
నమః స్త్రోతస్యాయ చ ద్వీప్యాయ చ


నమో” జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ
నమః పూర్వ జాయ చా+పర జాయ చ
నమో మధ్య మాయ చా+పగల్భాయ చ
నమో జఘన్యాయ చ బుధ్ని యాయ చ
నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ
నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ
నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ
నమః శ్లోక్యాయ చా వసా+న్యాయ చ
నమో వన్యాయ చ కక్ష్యాయ చ
నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ
నమ ఆశు షేణాయ చాశు రథాయ చ
నమః శూరాయ చావ భిందతే చ
నమో వర్మిణే చ వరూధినే చ
నమో బిల్మినే చ కవచినే చ
నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ


నమో దుందుభ్యాయ చాహ నన్యాయ చ
నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ
నమో దూతాయ చ ప్రహితాయ చ
నమో నిషంగిణే చేషుధిమతే చ
నమః స్తీక్ష్ణేషవే చాయుధినే చ
నమః స్వాయుధాయ చ సుధన్వనే చ
నమః స్రుత్యాయ చ పథ్యాయ చ
నమః కా+ట్యాయ చ నీప్యాయ చ
నమః సూ+ద్యాయ చ సరస్యాయ చ
నమో నా+ద్యాయ చ వైశంతాయ చ
నమః కూప్యాయ చా వట్యాయ చ
నమో వర్ష్యాయ చా వర్ష్యాయ చ
నమో మే+ఘ్యాయ చ విద్యుత్యాయ చ
నమ ఈ+ఘ్రియాయ చా తప్యాయ చ
నమో వాత్యాయ చ రేష్మియాయ చ
నమో వా+స్తవ్యాయ చ వా+స్తుపాయ చ


నమః సోమాయ చ రుద్రాయ చ
నమ స్తామ్రాయ చారుణాయ చ
నమః శంగాయ చ పశుపతయే చ
నమ ఉగ్రాయ చ భీమాయ చ
నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ
నమో హంత్రే చ హనీయసే చ
నమో వృక్షేభ్యో హరికేశేభ్యో
నమ స్తారాయ నమః శంభవే చమ యోభవే చ
నమః శంకరాయ చ మయస్కరాయ చ
నమః శివాయ చ శివతరాయ చ
నమ స్తీర్ధ్యాయ చ కూల్యాయ చ
నమః పార్యాయ చా+వార్యాయ చ
నమః ప్రతరణాయ చో+త్తరణాయ చ
నమ ఆతార్యాయ చా+లాద్యాయ చ
నమః శష్ప్యాయ చ ఫేన్యాయ చ
నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ


నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్ం శిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్ తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్ వరేష్ఠాయ చ
నమో” హృదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్ం సవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చో+లప్యాయ చ
నమ ఊర్వ్యాయ్చ చ సూ+ర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణ శద్యాయ చ
నమో పగుర మాణాయ చాభిఘ్నతే చ
నమ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానా_గ్_ం హృదయేభ్యో
నమో విక్షీణ కేభ్యో నమో విచిన్వత్ కేభ్యో
నమ ఆనిర్ హతేభ్యో నమ ఆమీవత్ కేభ్యః


ద్రాపే అంధ సస్పతే దరిద్రన్ నీలలోహిత |
ఏషాం పురుషాణా మేషాం పశూనాం మా భేర్మారో మో ఏషాం కించనా మమత్ ||


యాతే రుద్ర శివా తనూః శివా విశ్వాహ భేషజీ |
శివా రుద్రస్య భేషజీ తయానో మృడ జీవసే” ||


ఇమాగ్ం రుద్రాయ తవసే కపర్దినే” క్షయ ద్వీరాయ ప్రభరామహే మతిం |
యధానః శమసద్ ద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ ననాతురం ||


మృడానో రుద్రో తనో మయస్కృధి క్షయ ద్వీరాయ నమసా విధే మతే |
యచ్ఛం చ యోశ్చ మనురాయజే పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ ||


మానో మహాంత-ముత మానో అర్భకం మాన ఉక్షంత-ముత మాన ఉక్షితం |
మానో వధీః పితరం మోత మాతరం ప్రియా మానస్ తనువో రుద్ర రీరిషః ||


మానస్ తోకే తనయే మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషు రీరిషః ||
వీరాన్-మానో రుద్ర భామితో వధీర్-హవిష్మంతో నమసా విధేమతే ||


ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయ ద్వీరాయ సుమ్ నమస్మేతే అస్తు |
రక్షా చనో అధి చ దేవ బ్రూహ్యథా చనః శర్మ యచ్ఛద్-విబర్హా”ః ||


స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న భీమ-ముపహత్ను-ముగ్రం |
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యంతే అస్మన్ నివపంతు సేనా”ః ||


పరిణో రుద్రస్య హేతిర్-వృణక్తు పరిత్వేషస్య దుర్మతిర ఘాయోః |
అవ స్థిరా మఘవద్-భ్యస్-తనుష్వ మీడ్వస్-తోకాయ తనయాయ మృడయ ||


మీఢుష్టమ శివమత శివోనః సుమనా భవ |
పరమే వృక్ష ఆయుధన్ నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి ||


వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః |
యాస్తే సహస్రగ్ం హేతయోన్య మస్మన్-నివపంతు తాః ||


సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః |
తాసా-మీశానో భగవః పరాచీనా ముఖా కృధి ||


సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యా”మ్ |
తేషాగ్ం సహస్ర యోజనే వధన్వాని తన్మసి ||


అస్మిన్ మహత్యర్ణవే”உంతరిక్షే భవా అధి ||
నీలగ్రీవాః శితికణ్ఠాః” శర్వా అధః క్షమాచరాః ||
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః ||


యే వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాః||
యే భూతానా-మధిపతయో విశిఖాసః కపర్దినః ||
యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్ ||
యే పథాం పథిరక్షయ ఐల బృదా యవ్యుధః ||
యే తీర్థాని ప్రచరంతి సృకావంతో నిషంగిణః ||
య ఏతావంతశ్చ భూయాగ్ం సశ్చ దిశో రుద్రా వితస్థిరే |
తేషాగ్ం సహస్ర యోజనే వధన్వాని తన్మసి ||


నమో రుధ్రేభ్యో యే పృథివ్యాం యే”உంతరిక్షే
యే దివి యేషామన్నం వాతో వర్ష మిషవస్-తేభ్యో దశ
ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్-దశో-దీచీర్-దశోర్ధ్వాస్-తేభ్యో
నమస్తే నో మృడయంతు తేయం ద్విష్మో యశ్చ నో ద్వేష్టితం వో జంభే దధామి ||


త్ర్యంబకం యజామహే సుగంథిం పుష్టి వర్ధనం |
ఉర్వా రుకమివ బంధనాన్-మృత్యోర్-ముక్షీయ మామృతా”త్ ||


యో రుద్రో అగ్నౌయో అప్సుయ ఓషధీషు
యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు ||


తముష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి భేషజస్య |
యక్ష్వా”మహే సౌ”మనసాయ రుద్రం నమో”భిర్-దేవ మసురం దువస్య ||


అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః |
అయం మే” విశ్వభే”ష జోయగ్ం శివాభి మర్శనః ||


యేతే సహస్ర మయుతం పాశా మృత్యో మర్త్యాయ హంతవే |
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవ యజామహే |
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా” ||


ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి |
ప్రాణానాం గ్రంథిరసి రుద్రోమా విశాంతకః |
తేనాన్ నేనా”ప్యాయస్వ ||


సదాశివోం |


ఓం శాంతిః శాంతిః శాంతిః

శ్రీ రుద్రం – చమకం

ఓం అగ్నా విష్ణూ సజేషసేమా వర్ధంతు వాంగిరః |
ద్యుమ్నైర్ వాజేభిరాగతం ||
వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే ప్రసితిశ్చమే ధీతిశ్చమే
క్రతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే శ్రుతిశ్చమే
జ్యోతిశ్చమే సువశ్చమే ప్రాణశ్చమే உపానశ్చమే
వ్యానశ్చమే உసుశ్చమే చిత్తంచమ ఆధీతంచమే వాక్చమే
మనశ్చమే చక్షుశ్చమే శ్రో+త్రంచమే దక్షశ్చమే బలంచమ
ఓజశ్చమే సహశ్చమ ఆయుశ్చమే జరాచమ ఆత్మాచమే
తనూశ్చమే శర్మచమే వర్మచమే உంగానిచమే
స్థానిచమే పరూగ్‌ం షిచమే శరీరాణిచమే ||
జైష్ఠ్యంచమ ఆధిపత్యంచమే మన్యుశ్చమే
భామశ్చమే உమశ్చమే உంభశ్చమే జేమాచమే మహిమాచమే
వరిమాచమే ప్రథిమాచమే వర్ష్మాచమే ద్రాఘుయాచమే
వృద్ధంచమే వృద్ధిశ్చమే సత్యంచమే శ్రద్ధాచమే
జగచ్చమే ధనంచమే వశశ్చమే త్విషిశ్చమే క్రీడాచమే
మోదశ్చమే జాతంచమే జనిష్య మాణంచమే సూక్తంచమే
సుకృతంచమే విత్తంచమే వే+ద్యంచమే భూతంచమే
భవిష్యచ్చమే సుగంచమే సుపథంచమ ఋద్ధంచమ-ఋద్ధిశ్చమే
క్లుప్తంచమే క్లుప్తిశ్చమే మతిశ్చమే సుమతిశ్చమే ||
శంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే
కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే
వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే
యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే
విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞా+త్రంచమే
సూ+శ్చమే ప్రసూ+శ్చమే సీరంచమే లయశ్చమ
ఋతంచమే உమృతంచమే యక్ష్మంచమేనా మయచ్చమే
జీవాతుశ్చమే దీర్ఘా యుత్వంచమేన మిత్రంచమే భయంచమే
సుగంచమే శయనంచమే సూషాచమే సుదినంచమే ||
ఊర్క్చమే సూనృతాచమే పయశ్చమే రసశ్చమే
ఘృతంచమే మధుచమే సగ్ధిశ్చమే సపీతిశ్చమే
కృషిశ్చమే వృష్టిశ్చమే జైత్రంచమ ఔద్-భిద్యంచమే
రయిశ్చమే రాయశ్చమే పుష్టంచమే పుష్టిశ్చమే
విభుచమే ప్రభుచమే బహుచమే భూయశ్చమే
పూర్ణంచమే పూర్ణతరంచమే உక్షితిశ్చమే
కూయవాశ్చమే உన్నంచమే உక్షుచ్చమే వ్రీహయశ్చమే యవా”శ్చమే
మాషా”శ్చమే తిలా”శ్చమే ముద్గాశ్చమే
ఖల్వా”శ్చమే గోధూమా”శ్చమే మసురా”శ్చమే
ప్రియంగవశ్చమే உణవశ్చమే శ్యామాకా”శ్చమే నీవారా”శ్చమే ||
అశ్మాచమే మృత్తికాచమే గిరయశ్చమమే పర్వతాశ్చమే
సికతాశ్చమే వనస్-పతయశ్చమే హిరణ్యంచమే உయశ్చమే
సీసంచమే త్రపుశ్చమే శ్యామంచమే
లోహంచమే உగ్నిశ్చమ ఆపశ్చమే వీరుధశ్చమ
ఓషధయశ్చమే కృష్టపచ్యంచమే உకృష్టపచ్యంచమే
గ్రామ్యాశ్చమే పశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం
విత్తంచమే విత్తిశ్చమే భూతంచమే భూతిశ్చమే
వసుచమే వసతిశ్చమే కర్మచమే శక్తిశ్చమే உర్థశ్చమ
ఏమశ్చమ ఇతిశ్చమే గతిశ్చమే ||
అగ్నిశ్చమ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే
సవితాచమ ఇంద్రశ్చమే సరస్వతీచమ ఇంద్రశ్చమే
పూషాచమ ఇంద్రశ్చమే బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే
మిత్రశ్చమ ఇంద్రశ్చమే వరుణశ్చమ ఇంద్రశ్చమే
త్వష్ఠాచమ ఇంద్రశ్చమే ధాతాచమ ఇంద్రశ్చమే
విష్ణుశ్చమ ఇంద్రశ్చమే உశ్వినౌచమ ఇంద్రశ్చమే
మరుతశ్చమ ఇంద్రశ్చమే విశ్వేచమే దేవా ఇంద్రశ్చమే
పృథివీచమ ఇంద్రశ్చమే உన్తరిక్షంచమ ఇంద్రశ్చమే
ద్యౌశ్చమ ఇంద్రశ్చమే దిశశ్చమ ఇంద్రశ్చమే
మూర్ధాచమ ఇంద్రశ్చమే ప్రజాపతిశ్చమ ఇంద్రశ్చమే ||
అగ్‌ం శుశ్చమే రశ్మిశ్చమే உదా”భ్యశ్చమే உధిపతిశ్చమ
ఉపాగ్‌ం శుశ్చమే உన్తర్యామశ్చమ ఐంద్ర వాయశ్చమే
మైత్రా వరుణశ్చమ ఆ+శ్వినశ్చమే ప్రతి ప్రస్థానశ్చమే
శుక్రశ్చమే మంథీచమ ఆగ్-రయణశ్చమే వైశ్వ దేవశ్చమే
ధ్రువశ్చమే వైశ్వా నరశ్చమ ఋతుగ్రహాశ్చమే உతిగ్రాహ్యా”శ్చమ
ఐంద్రాగ్నశ్చమే వైశ్వ దేవశ్చమే మరుత్వతీయా”శ్చమే
మాహేంద్రశ్చమ ఆదిత్యశ్చమే సావిత్రశ్చమే సారస్వతశ్చమే
పౌష్ణశ్చమే పాత్నీ వతశ్చమే హారి యోజనశ్చమే ||
ఇధ్మశ్చమే బర్హిశ్చమే వేదిశ్చమే దిష్ణియాశ్చమే
స్రుచశ్చమే చమసాశ్చమే గ్రావాణశ్చమే స్వరవశ్చమ
ఉపరవాశ్చమే ధిష వణేచమే ద్రోణ కలశశ్చమే
వాయవ్యానిచమే పూతభృచ్చమే ఆధవ నీయశ్చమ
ఆగ్నీ”ధ్రంచమే హవిర్ధానంచమే గృహాశ్చమే
సదశ్చమే పురోడాశా”శ్చమే
పచతాశ్చమే உవభృ థశ్చమే స్వగాకారశ్చమే ||
అగ్నిశ్చమే ఘర్మశ్చమే உర్కశ్చమే సూర్యశ్చమే
ప్రాణశ్చమే உశ్వ మేధశ్చమే పృథివీచమే உదితిశ్చమే
దితిశ్చమే ద్యౌశ్చమే శక్వరీ రంగులయో దిశశ్చమే
యజ్ఞేన కల్పన్తాం ఋక్చమే సామచమే స్తోమశ్చమే
యజుశ్చమే దీక్షాచమే తపశ్చమ ఋతుశ్చమే వ్రతంచే
హోరాత్రయో”ర్-వృష్ట్యా బృహద్ర థంత రేచమే
యజ్ఞేన కల్పేతాం ||
గర్భా”శ్చమే వత్సాశ్చమే త్ర్యవిశ్చమే త్ర్యవీచమే
దిత్యవాట్చమే దిత్యౌహీచమే పంచావిశ్చమే పంచావీచమే
త్రివత్సశ్చమే త్రివత్సాచమే తుర్యవాట్చమే తుర్యౌ హీచమే
పష్ఠవాట్చమే పష్ఠౌహీచమ ఉక్షాచమే వశాచమ
ఋషభశ్చమే వేహచ్చమే నడ్వాంచమే ధేనుశ్చమ
ఆయుర్-యజ్ఞేన కల్పతాం
ప్రాణో యజ్ఞేన కల్పతా-మపానో యజ్ఞేన కల్పతాం
వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్-యజ్ఞేన కల్ప్తతాగ్ం உశ్రోత్రం
యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం
వాగ్-యజ్ఞేన కల్పతా-మాత్మా యజ్ఞేన కల్పతాం
యజ్ఞో యజ్ఞేన కల్పతాం ||
ఏకాచమే తిస్రశ్చమే పంచ చమే సప్తచమే
నవచమ ఏకా దశచమే త్రయో దశచమే
పంచ దశచమే సప్త దశచమే నవ దశచమ
ఏక విగ్ం శతిశ్చమే త్రయో విగ్ం శతిశ్చమే
పంచ విగ్ం సతిశ్చమే సప్త విగ్ం శతిశ్చమే
నవ విగ్ం సతిశ్చమ ఏక-త్రిగ్ం శచ్చమే
త్రయస్-త్రిగ్ం శచ్చమే
చతస్-రశ్చమే உష్టౌచమే ద్వాదశ చమే
షోడశ చమే విగ్ం శతిశ్చమే
చతుర్-విగ్ం శతిశ్చమే உష్టావిగ్ం శతిశ్చమే
ద్వాత్రిగ్ం శచ్చమే షట్-త్రిగ్ం శచ్చమే
చత్వారిగ్ం శచ్చమే చతుశ్-చత్వారిగ్ం
శచ్చమే உష్టాచత్-వారిగ్ం శచ్చమే
వాజశ్చ ప్రసవశ్చా పిజశ్చ క్రతుశ్చ సువశ్చ
మూర్ధాచ వ్యశ్నియశ్చాన్‌-త్యాయన-శ్చాంత్యశ్చ
భౌవనశ్చ భువన-శ్చాధిపతిశ్చ ||
ఓం ఇడా దేవహూర్-మనుర్యజ్ఞనీర్-బృహస్పతి-రుక్థామదాని
శగ్ం సిషద్-విశ్వే-దేవాః సూ”క్తవాచః పృథివి మాతర్మా
మాహిగ్ం సీర్-మధు-మనిష్యే మధు-జనిష్యే
మధు వక్ష్యామి మధు వదిష్యామి మధిమతీం దేవేభ్యో
వాచముద్యాసగ్ం శుశ్రూ షేణ్యా”మ్‌ మనుష్యే”భ్యస్తం
మా దేవా అవంతు శోభాయై పితరోను మదంతు ||
ఓం సహనాభవతు సహనం భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహయై”
ఓం శాంతిః శాంతిః శాంతిః
 
''ఇట్లు''
    మీ,
'జి.సుబ్రహ్మణ్య శర్మ' 

ఓమ్

om.jpg



"ఓం" - ఇదే మూల మంత్రం. ఏ మంత్రం ఉచ్చరించించాలన్న్నా ముందు 'ఓం' చేరుస్తారు. ఓంకారంతోనే సామవేదం గానం చేస్తారు. ఓంకారంతోనే ఏ శాస్త్రమైనా మొదలవుతుంది. ఓంకారంతోనే యాజ్ఞికులు యజ్ఞం మొదలుపెడతారు. ఓంకారంతోనే బ్రహ్మ ఈ విశ్వసృష్టిని ప్రారంబించాడు. చాలామంది ఓంకారం అంటే ధ్యానానికి, యోగాకు ముందూవెనకా వాడుకునే పదమే అనుకుంటున్నారు. మరికొందరు ఓంకారాన్ని పవిత్ర మత చిహ్నంగా పరిగణిస్తున్నారు. ఇంకా కొంతమంది ఓంకారాన్ని మంత్రపూరితమైన శబ్దం మాత్రమే అని భావిస్తున్నారు. ఓం ఒక పదం కాదు. ఓంకారం ఈ విశ్వాన్నంతటినీ చలింపచేసే ఒక శబ్దం. ఈ శబ్ద చలనాన్ని మన పూర్వ గురువులూ, ప్రాచ్య విజ్ఞానవేత్తలూ అయిన ఋషులు కనుగొన్నారు.


గొప్ప పండితురాలు, భగవద్గీత అనువాదకుతాలు అయిన బార్బరా స్టోలర్ మిల్లర్, " ప్రతివాక్కూ, భావం ఓం నుంచే పుట్టాయి. అది విశ్వరహస్యాన్ని బోధిస్తుంది" అంటారు. ఆధారభూతమైన శక్తి ఏర్పరిచే ప్రకృతి చలనంవల్ల,ఈ విశ్వసృష్టి జరుగుతుందని వేదాలు చెప్తున్నాయి. ఆ శక్తే 'ఓం". ఓంకారం ఈ సృష్టికర్తకు శబ్దరూపం. అందులోనుంచి ఈ విశ్వం మాత్రమేకాదు, నిత్యమూ, నిరుపమానమైనవీ ఎన్నో జన్మిస్తాయి. మాండూక్య ఉపనిషత్, ఓంకార గొప్పదన్నాన్ని ఇలా వివరిస్తోంది. " ఓం నిత్యమైన శబ్దం. ఓం అంటే విశ్వం. ఓం తత్వ విచారం ఇదే! భూత, బవిష్యత్, వర్తమానాలు; ఉన్నవి, ఉండబోయేవి, ఉంటున్నవి అన్నీ ఓంకారమే! అలాగే కాలంతో సంబంధం లేకుండా, ఈ విశ్వంలో జరిగే సృష్టి అంతా ఓంకారమే" వేదమంత్రాలన్నీ ఓంకారం నుంచే వచ్చాయి.'జాగ్రదావస్థలోని, జీవనంలోని అత్యున్నతమైన, శబ్దరూపమైన మంత్రం ఓంకారం,


మన ప్రాచీన మతగ్రంధాలు కూడా ఓంకారం అనే విశిష్ట శబ్దాన్ని మిగిలిన అన్ని మంత్రాలకూ ఆధారమని చెప్తున్నాయి. ఈ ఓంకారం అనే శబ్దం సృష్టికే కాదు లయకు కూడా కారణమవుతుంది. యోగులు ఓంకారాన్ని ప్రణవమంటారు. అది ప్రాణచలనానికి కారణమవుతుంది. యోగులు ఈ ఓం అనే ప్రణవమే మానవ మేధస్సు వెనక వుండే శక్తి అని, అదే మనిషి ఆలోచించడానికి, కదలడానికీ, స్పర్శను అనుభవించడానికి, దేన్నైనా ఆచరించడానికీ ఆధారం అంటారు. సరైన ఉచ్చారణ వల్ల విశ్వవ్యాప్తమైన శబ్ద చలన తరంగాలు ప్రతి మనిషిలోనూ ఉన్నాయన్న విషయం గ్రహించవచ్చు. వ్యక్తిలోని ఓంకారం స్థూల,సూక్ష్మ,ప్రాణమయ శరీరాలను అధిగమించి ఉంటుంది. అది నిద్రావస్థ, జాగ్రదా వస్థ, స్వప్నవస్థలకు అతీతమయింది. మానవుడు ప్రతి ఉచ్చ్వాస నిశ్వాసాల్లోనూ తన ఇచ్చ లేకుండా అప్రయత్నంగా ఓంకారాన్ని ఉచ్చరిస్తూనే ఉంటాడు. ఓంకారంలో ఉన్న మూడు అక్షరాలు సృష్టి, స్థితి, లయలకు ప్రతీకలు.ఓంకారంలోని మొదటి అక్షరం 'అ ' దీన్ని అమ్మలో 'అ ' లాగ పలకాలి. ఇది జాగ్రదావస్థను తెలియ జేస్తుంది. రెండవ అక్షరం 'ఉ ' దీన్ని ఉడుతలో ' ఉ ' లాగ పలకాలి. ఇది స్వప్నావస్థను చెప్తుంది. మూడవ అక్షరమైన ' మ్ ' (o) లా పలకబడి, వ్యక్తి చేతన సుషుప్తిలో పొందే అనుభవాలను గ్రహించేసే సమర్ధత కలిగి వుంటుంది.


సంస్కృత లిపిలో ’ఓం’ రాసినప్పుడు ఆ అక్షర ఒంపులో ఎన్నో విశేషాలున్నాయి. ఒక్కొక్క ఒంపూ ఒక్కొక్క విశేషాన్ని చెప్తుంది. పెద్దదిగా ఉండే క్రింది ఒంపు జాగ్రదావస్థను తెలియ జేస్తుంది. అంటే భౌతిక ప్రపంచానుభూతుల్ని పొందుతామన్నమాట. పై ఒంపు ఈ భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయే సుషుప్తిని చెప్తుంది. ఈ రెండూ కలిసే చోట ఉన్న మరొక ఒంపు, భౌతిక ప్రపంచంలో మనం చూసిన వస్తువుల నీడలు కదలాడే స్వప్నావస్థను వివరిస్తుంది. ఈ మూడు ఒంపులనుంచి వేరై, ఒక అర్ధ చంద్రాకారంపైన ఒక బిందువు వుంటుంది. అది నాలుగో స్థితి అయిన పూర్ణ జ్ణానాన్ని లేదా తురీయాన్ని చాటుతుంది. ఆ అర్ధచంద్రాకారం నిరామయాన్నిచాటుతూ ఈ భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని తెంపుకోనంతకాలం ఆ తురీయాన్ని చేరటం అసంభవం అంటూ ఉంటుంది.


ఓంకార మంత్రోచ్చారణ మానవ మేధస్సును, పరమాత్మను తెలుసుకోడానికి ప్రేరేపిస్తుంది.ఓంకారం ఎప్పుడుఉచ్చరింపబడ్డా సరే , ఒకసారి ఒంకార ఉచ్చరణ చేయడానికీ, మరొకసారి ఓంకారాన్నిపలకడానికి మధ్య తప్పనిసరిగా నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దం నాల్గవస్థితి లేదా తురీయానికి ప్రతీక.అంటే ఆ స్థితిలో అనంతమైన కరుణవల్ల ఆత్మ తనకూ, పరమాత్మకూ గల అనుబంధాన్ని గ్రహించగలుగుతుందన్నమాట.

'' ఇట్లు ''
    మీ,
'జి.సుబ్రహ్మణ్య శర్మ'

గంగా భాగీరధీ

విధవ గంగా భాగీరధీ సమానురాలు ఎలా అయింది???



నదుల్లో గంగానది అతి పవిత్రమైనదని భారతీయుల ప్రగాడ విశ్వాసం.అందుకనే దేశం నలుమూలల నుంచీ హిందువులు పవిత్ర గంగా స్నానం చెయ్యడానికి కాశీ, ప్రయాగ, హరిద్వారం, గంగోత్రి, గోముఖం వెళ్తారు. గంగా నదిలో స్నానం చేస్తే పాప ప్రక్షాళనం ఔతుందని వారి నమ్మకం. మహేశ్వరుడంతడివాడే గంగను నెత్తిన పెట్టుకున్నాడు. అనునిత్యం తనకు అభిషేకం చేయించుకుంటాడు.


ప్రజా జీవితంలో గంగ అంతటి పవిత్ర స్థానాన్ని అధిష్టించింది. అంతటి పవిత్ర గంగమ్మ తల్లితో విధవరాల్ని "గంగాభాగీరధీ సమానురాలు" గా పోలుస్తారెందుకు??

విధవను శ్రీమతి అనరు. సౌభాగ్యవతి అనరు. మహాలక్ష్మి సమానురాలని కూడా అనరు. విధవను గంగాభాగీరధీ సమానురాలనే వ్యవహరిస్తారు. గంగ విధవ కాదే! విధవ, గంగతో సమానురాలు ఎలా అవుతుంది?? గంగ పవిత్రతకి ప్రతీక ఐతే విధవ అశుభానికి సంకేతం. విధవను గంగను సమానులుగా సరిపోల్చే ఈ సాంప్రదాయం ఎలా వాడుకలోకి వచ్చింది??


భర్తను పోగొట్టుకొని అనాధ అయిన స్త్రీ పట్ల అందరూ పూర్వం కంటే మరింత పవిత్రతా భావంతో ప్రవర్తించాలన్న ఉద్దేశంతో మన పూర్వజులు విధవను గంగమ్మ తల్లితో సరిపోల్చారు. ఇక్కడ విధవ గంగతో సరిపోల్చబడింది కాని గంగను విధవతో సరిపోల్చినట్టు కాదు. భర్త చనిపోయాక మగదక్షత లేని విధవకు సామాజిక రక్షణ కలిగించే సదుద్దేశ్యంతో ఆమెకు గంగతో గంగతో సమానమైన పవిత్ర స్థానాన్ని ఆపాదించారు.


ఈ విషయంపై వేరొక కథనం కూడా ఉంది. "గంగ" అంటే 'భాగీరధీ" అన్న అర్ధమే గాక గంగా శబ్దాన్ని విశేషణంగా తీసుకుంటే "పూజ్యమైన" అన్న అర్ధం ఉంది. విధవ గంగా భాగీరధీ నదులంతటి పునీతమైనదన్న భావంతో విధవను గంగా భాగీరధీ సమానురాలని పూజ్యభావంతో వ్యవహరించడం అనూచానంగా వస్తున్న ఆచారం. ఇంకో కథనం కూడా ప్రచారంలో ఉంది.


"గంగ" అంటే నీరు కదా! నిలువెల్లా నీరే అయిన గంగమ్మ పుణ్యస్త్రీ అయినా బొట్టు పెట్టుకోవడానికి ఆమెకు అవకాశం లేదు. ఆపాదమస్తకం శరీరమే నీరయినప్పుడు నీటిలో బొట్టు నిలిచేది ఎలా?? సృష్టిలో బొట్టు పెట్టుకో(లే)ని ఏకైక సుమంగళి గంగమ్మ తల్లి ఒక్కర్తే! భర్త ఉండీ, పునిస్త్రీ అయిన గంగకు, భర్తని పోగొట్టుకుని బొట్టు పెట్టుకునే సౌభాగ్యాన్ని పోగొట్టుకుంది విధవ. "బొట్టు" అంటే నుదుటను పెట్తుకునే "తిలకం" అనే కాదు. "పుస్తె,తాలిబొట్టు" అన్న అర్ధాలు కూడా ఉన్నాయి. బొట్టుకి, తాలిబొట్టుకి అంతటి అవినాభావ సంబంధం ఉంది. బొట్టు విషయంలో బొట్టు(తాళి) ఉన్న గంగకూ విధవకూ సామ్యమున్నది!



అందుకనే విధవను గంగా భాగీరధీ సమనురాలనడంలో ఔచిత్యం అర్ధం అవుతున్నది కదా!

 ఇట్లు
    మీ
జి.సుబ్రహ్మణ్య శర్మ

మదేవుని ఆవిర్భావం


సృష్టికి పూర్వం ప్రపంచమంతా జలమయమైపోయింది. ఆ జలంలో నారాయణుడు శేషతల్పం మీద కన్నులు మోడ్చి సహస్ర చతుర్యుగాలు శయనించాడు. అలా శయనించినప్పటికి ఆయన చైతన్యశక్తి అంతర్ముఖంగా జాగృతంగానే ఉంది. ఆ తర్వాతా కాలమే స్వీయశక్తి ప్రేరేపించగా ఆయనకు సృష్టి చెయ్యాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే తనలో లయం చెందిన సమస్త విశ్వం మీద ఆయన దృష్టి పెట్టగా రజోగుణం పుట్టింది. దాని ప్రభావంతో ఆయనలో నిక్షిప్తమైన సూక్ష్మతత్వాలన్నీ కలిసి నాభిస్థానం నుంచి పద్మకోశంగా వ్యక్త్తమయ్యాయి. సకల లోకాలకు ఆధారమై, ప్రకృతి గుణాలకు ఆలవాలమై ప్రకాశించే ఆ పద్మంలో విష్ణువు తన అంశను ప్రవేశపెట్టాడు. అప్పుడు వేదమయుడైన బ్రహ్మ అందులోంచి ఆవిర్భవించాడు. ఆయన్నే స్వంభువుడు అంతారు. అలా ఆవిర్భవించిన బ్రహ్మ పద్మకర్ణిక(తామర దుద్దు)లోంచి ఆకాశం వైపు దృష్ణిని సారించి నాలుగు దిక్కులూ చూస్తూ చతుర్ముఖుడయ్యాడు. కాని ఆయనకేమీ అర్ధం కాలేదు. అప్పుడాయన "ఇక్కడ నాకేమీ కనిపించడం లేదు. సముద్ర జలమూ, ఈ పద్మమూ తప్ప. ఈ పద్మ కర్ణికలో కూర్చున్న నేను ఎవరిని? అసలు ఈ పద్మం ఎలా పుట్టింది? దీనికేదో ఆధారం ఉండాలి " అనుకుంటు పద్మనాళం ద్వారా జలంలోకి ప్రవేశించి నాభి వద్దకు వెళ్ళాడు. కానీ దానినీ గుర్తించలేకపోయాడు. ఇలా పద్మోద్భవ స్థానాన్ని తెలుసుకోలేక, తన ప్రయత్నం విరమించి, తిరిగి పద్మాన్నే చేరుకున్నాడు. ఆ పద్మంలోనే కూర్చుని శ్వాసను నియంత్రించి, ధ్యానమగ్నుడై వంద సంవత్సరాలు సమధి స్థితిలో ఉన్నాడు. చివరికి ఆయనకు జ్ఞానోదయమైంది.


అప్పుడు శిరోరత్నకాంతులు ప్రళయజలంలోని చీకటిని పటాపంచలు చేస్తుండగా పదివేల పడగలనే చత్రాల క్రింద తామరతూడులాంటి తెల్లని శరీర తల్పం మీద శయనించి ఉన్న ఒక పురుషుడు బ్రహ్మదేవుని హృదయంలో సాక్షాత్కరించాడు.


సంధ్యాకాల మేఘాలనే వస్త్రాలను ధరించి, రత్నాలతో, ఓషధులతో, నీటి ధారలతో, పుష్పాలతో చేసిన వనమాలను కంఠసీమలో అలంకరించుకుని, వెదుళ్ళే భుజాలు కాగా, వృక్షాలే పాదాలు కాగా, బంగారు శిఖరాలతో శోభించే పచ్చల పర్వతం యొక్క సోయగాన్ని ఆ మహాపురుషుడి దేహకాంతులు తలదన్నుతున్నాయి.


లోకత్రయాన్ని తన కుక్షిలో నిక్షిప్తం చేసుకుని, విచిత్ర దివ్యవస్త్ర, దివ్యాభరణ భూషితుడై, సాటిలేని మేటి విరాట దేహంతొ ఆ దివ్యపురుషుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రవంకల వంటి నఖాలతో ఆయన పాదపద్మాంగుళులు తామరరేకుల్లాగా అందగించి వున్నాయి. వేద నిర్దేశిత మార్గంలో అర్పించేవారికి వాంచాఫల సిద్ధినిస్తాయి ఆ పాదాలు.


ఆ దేవదేవుడు కడిమి పువ్వుల పుప్పొడిలాగా పసుపు పచ్చని కాంతులీనే వస్త్రాలు ధరించాడు. శ్రీవత్సమనే పుట్టుమచ్చతో పాటు కౌస్తుభరత్నం ఆయన వక్షాన్ని అలంకరించింది. ఆయన ధరించిన వనమాల చుట్టూ వేదాలు భ్రమరాలై ఆయన కీర్తిని గానం చేస్తున్నాయి.


అటువంటి ఆ ఆదిపురుషుణ్ణి దర్శిస్తున్న సమయంలో బ్రహ్మదేవునికి తన శరీరంతో పాటు నాభి అనే సరస్సు, పద్మం, సముద్రజలం, ప్రళయవాయువు గోచరించాయి కాని విశ్వసృష్టికి కావల్సిన తత్వాలు ఆయన కంటికి కనిపించలేదు.అప్పుడాయన శ్రీహరిని స్తుతించగా ఆయన కర్తవ్యం బోధించి అంతర్హితుడయ్యాడు.


విష్ణువు అంతర్హితుడయిన తర్వాత బ్రహ్మదేవుడు నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేసి జ్ఞానవంతుడూ, విజ్ఞానవంతుడూ అయ్యాడు. ఆ సమయంలో వాయువు ప్రచండంగా వీచింది. బ్రహ్మ అధిష్టించిన పద్మమూ, సముద్ర జలమూ కంపించాయి. ఇది గ్రహించి దివ్యతపశ్శక్తి సంపన్నుడైన బ్రహ్మ ఆ జలాన్ని పానం చేసి, వాయువును లోపలికి పీల్చేసాడు. అనంతరం తాను ఆసీనుడైన పద్మం ఆకాశమంతా వ్యాపించి ఉండడం గమనించి పూర్వం ఆ పద్మంలోనే లీనమైపోయిన అన్ని లోకాలను తిరిగి సృష్టించాలనుకున్నాడు. ముందుగా ఆ పద్మాన్ని మూడు విభాగాలుగా చేసి (ముల్లోకాలు) తర్వాత దానిని పద్నాలుగు భాగాలుగా( చతుర్దశ భువనాలు) విభజించాడు. ఈ లోకంలో జీవులు తమ కర్మఫలాన్ని అనుభవిస్తారు.


ఈ విధంగా బ్రహ్మ చేత సృష్టించబడిన జగత్తు పూర్వం ఎలా ఉండేదో, ఇప్పుడూ అలాగే ఉంటుంది, భవిష్యత్తులోనూ అలాగే ఉంటుంది. అంటే క్రమబద్ధంగా ఏర్పడి, పెరిగి నశిస్తుంది.

 ఇట్లు
    మీ
జి.సుబ్రహ్మణ్య శర్మ

రామకోటి రాయడానికి నియమాలు





రామకోటి రాయడానికి పూనుకోవడం ఒక సత్కార్యం. ఈ కార్యానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

* రామకోటి రాయాలన్న మీ సంకల్పాన్ని ముందు దేవుడి దగ్గర మానసికంగా సంకల్పం చేసుకోండి.

* శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్నా పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్లకాగితాలతో పుస్తకం తయారుచేసుకోండి.

* మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో, శ్రీ రామ అష్టోత్తరశతనామావళి తో పూజించండి. తరవాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడంప్రారంభించండి.

* రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకుండా స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి.

* అనుకోకుండా మంధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకంమూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు , చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి.

* రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. దానికి ఉపయోగించేకలాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం.

* రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కాని శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్రవస్తుంది అనుకుంటే బలవంతంగారాయకుండా ఆపేయాలి.

* ప్రతి లక్ష నామాలకు ప్రత్యెక పూజ,నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి.

* రామకోటి రాయడం పూర్తీ అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ,నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది.

* పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి. లేదా ఏదైనారాముని గుడిలో ,ఆధ్యాత్మిక సంష్తకు అప్పగించాలి. అదీ వీలుకాకుంటే నదిలో వదలాలి.

 ఇట్లు
    మీ
జి.సుబ్రహ్మణ్య శర్మ

 



అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన ఆ చల్లని తల్లి త్రిశక్తి శ్రీ సరస్వతి, శ్రీలక్ష్మి, శ్రీమహాకాళి రూపాల్లో శ్రీ వైష్ణవదేవి పేరుతో కొలువుదీరి భక్తుల ఆరాధానలందుకుంటున్న దివ్యక్షేత్రం. ’జ్వాలాక్షేత్ర” ఇది అష్టాదశ శక్తిపీఠాలలో 15వ శక్తిపీఠం.కాశ్మీర్ రాష్ట్రంలోని కత్రాకు 14కిలోమీటర్ల దూరంలో శ్రీ మాతా వైష్ణవీ దేవి కొలువై ఉన్న జ్వాలా క్షేత్రం.

త్రేతాయుగంలో శ్రీరాముడు లంకానగరములో దండయాత్రకు బయలుదేరేముందు జగన్మాతను ప్రార్ధించగా జగన్మాత సరస్వతి, లక్ష్మి, మహాకాళి రూపాల్లో ప్రత్యక్షమై ఆయన పూజలందుకున్నట్లు చెప్పబడింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని పూజలందుకున్న ఆ జగన్మాత ద్వాపరయుగంలో ఉత్తర భారతదేశానికి వెళ్ళి జమ్ము ప్రాంతాల్లోని అదవుల్లో కొలువుదీరినట్లు చెప్పబడుతుంది. ఈ విధంగా త్రేతాయుగం, ద్వాపరయుగంలో పూజలందుకున్న ఈ అమ్మవారు కలియుగంలో కొలువుదీరడాన్ని ఒక విశేషంగా చెప్పుకోవచ్చు.

ఎత్తయిన పర్వత శ్రేణులు, వాటిపైన ఆకాశన్నంటే వివిధ వృక్షాలు, ఆహ్లాదాన్ని కలిగించే అందమైన ప్రకృతి శోభ మధ్య త్రికూట పర్వతం పైన ’శ్రీ వైష్ణవీ దేవి’ ఆలయం ఉంది. ఆలయం సముద్ర మట్టానికి సుమారు 5,200 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీ వైష్ణవదేవీ యాత్ర కత్రా నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడినుంది ఆలయం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు సాధారణంగా కాలినడకనే వెళతారు. ఈ దారిలో వాహనాలు వెళ్ళలేవు. నడవలేని వారికి , వృద్ధులకు గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి. కత్రాకు కొంత దూరంలో ’భూమికా మందిరం ’ ఉంది. .ఇక్కడ ఉన్న రిసెప్షన్ కౌంటర్‍లో భక్తులు దర్శనానికి వెళ్ళేముండు తమ పేర్లను నమోదు చేసుకోని రసీదు పొందాలి. ఆ రసీదు ఉన్నవారే దర్శనానికి అర్హులు. ప్రయాణ మార్గంలో కత్రా నుంచి సుమారు రెండు కిలోమీటర్లు దాటగానే ’దక్షిణ దర్వాజా’ ఉంది. ఇక్కడినుండి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల దీనికి ’దర్సన దర్వాజా’ అని కూడా పేరు. దీనిని దాటిన తర్వాత ’ బాణ్ గంగా’ ఉంది. వైష్ణవీదేవి బాణం వేయగా అక్కడ ఉన్న రాయి నుండి గంగ ఉద్భవించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెపుతారు.

బాణ్‍గంగాకు ఒకటిన్నార కిలోమీటర్లు దూరంలో ’చరణ పాదుకా’ అనే ప్రాంతం ఉంది. ఇక్కడి అమ్మవారి పాదముద్రల నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. దీని భక్తులు తీర్ధంగా స్వీకరిస్తారు. మరి కొంత దూరంలో ’ఆదికుమారి మందిరం’ ఉంది. తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో ’సాంజీ భేట్’ ఉంది. ఇక్కడి నుండి మూడు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత శ్రీవైష్ణవీదేవి ఆలయం ఉంది. సాంజీ భేట్ వరకు కొండను ఎక్కుతూ వచ్చిన భక్తులు ఇక్కడ నుండి కొండ దిగుతూ ఆలయాన్ని చేరుకుంటారు. విశాలమైన వివిధ భవనాలుగా, అపార్టుమెంటుల్లాగా కనిపించే ఆలయంపై ఉత్తర భారత శైలిలో నిర్మించిన గోపురం ఉంది. ఆలయం పైభాగంలో సింహం ప్రతిమలు దర్శనమిస్తాయి. శ్రీ ఆంజనేయస్వామి చిహ్నం ఉన్న లోహపతాకం ఎప్పుడూ ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. భక్తులందరూ ఒకే క్యూలైనులో వెళ్ళవలసిందే ప్రత్యేక దర్శనాలు వంటివి లేవు.

జగన్మాత శ్రీవైష్ణవిదేవి గుహలోపల కొలువుదీరి ఉంది. సుమారు 98 అడుగుల గుహలో గుహగోడపై శ్రీవైష్ణవీదేవి దర్శనమిస్తుంది. ఈ గుహలోకి కొంతదూరం వంగి, మరికొంత దూరం పాకుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. గుహలో కొలువుదీరిన జగన్మాత రాయి రూపంలో దర్శనమిస్తుంది.. ఈ మూర్తి క్రిందిభాగం ఒకటిగానే ఉండి శిఖరస్థానం దగ్గరకు వచ్చేటప్పటికి మూడుగా విభజింపబడి ఉంటుంది. ఎడమవైపు తెల్లని భాగం శ్రీ సరస్వతిగా, మధ్యలోని పచ్చని భాగం శ్రీలక్ష్మిగా, కుడివైపున ఉన్న నల్లని భాగం శ్రీమహాకాళిగా చెప్పబడుతూ ఉంది.అంటే ఈమె ముగ్గురు శక్తుల సమ్మేళనంతో ఏర్పడిన ఏకరూపం. అమ్మవారు కొలువుదీరి ఉన్న గుహలో అమ్మవారి కంటే ముందే ’చరణ్ గంగా’ ఉంది. ప్రవహిస్తూ ఉన్న ఈ నీటిలో భక్తులు కాళ్ళు కడుక్కుని అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న బైరవనాధుడిని దర్శించుకుంటారు.

ప్రతీ రోజు పూజలుజరిగే శ్రీవైష్ణవిదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల సంధర్భంగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి జమ్ముకు వెళ్ళేందుకు రైలు సౌకర్యాలు ఉన్నాయి. కత్రాతో పాటు మార్గమంతా త్రికూట పర్వత ప్రాంతంలోనూ వసతి గృహాలు, సత్రాలు ఉన్నాయి. రోజంతా ఆలయం తెరిచే ఉంటుంది. అయితే జనవరి , ఫిబ్రవరి నెలల్లో మంచు వల్ల ప్రయాణం కష్టమవుతుంది కనుక మిగతా సమయాల్లో వైష్ణవి దేవి యాత్రకు వెళ్ళడం మంచిది.

 

ఇట్లు
    మీ
జి.సుబ్రహ్మణ్య శర్మ 

గాయత్రీ దేవతా

ఋషులు, యోగులు, మునులు, సామాన్యులు, పాపభూయిష్టమైన ఈ ప్రాపంచికము నుండి ముక్తులయి, శాశ్వతమైన బ్రహ్మ పదమును పొందుటకు అనేక విధములయైన ప్రయత్నములు చేయుచున్నారు. ఆ బ్రహ్మపదమును అనుగ్రహించు విద్య :గాయత్రీ మహావిద్య"

" న గాయత్ర్యా: పర: మంత్ర: న మాతు: పరా దేవతా "


గాయత్రీ కంటే గొప్ప మంత్రము, తల్లికంటే గొప్పదేవత సృష్టిలో లేదు.

ఓం భూర్భువస్సువః
తత్సవితుః వరేణియం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్

ఈ గాయత్రీ మంత్రమున ఇరవైనాలుగు అక్షరములతో పాటు ఇరవైనాలుగు దేవతమూర్తుల శక్తి అంతర్హితమై వుంటుందని గాయత్రీ మంత్రోపాసకులు ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ ఇరవైనాలుగు దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు చేకూరుతాయని తాంత్రిక గ్రంధాలు అభివర్ణిస్తున్నాయి.


ఇరవై నాలుగు గాయత్రీమూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అని పేరు.

ఇరవైనాలుగు అక్షరములు - దేవతలు

1. తత్ - గణేశ్వరుడు
2. స - నృసింహ భగవానుడు
3. వి - విష్ణుదేవుడు
4. తుః - శివదేవుడు
5. వ - కృష్ణ భగవానుడు
6. దే - రాథా దేవి
7. ణ్యం - లక్ష్మీదేవి
8. భ - అగ్నిదేవుడు
9. ర్గః - ఇంద్రదేవుడు
10. దే - సరస్వతి
11. వ - దుర్గాదేవి
12. స్య - హనుమంతుడు
13. ధీ - పృధ్వీదేవి
14. మ - సూర్యదేవుడు
15. హి - శ్రీరాముడు
16. ధి - సీతామాత
17. యో - చంద్రదేవుడు
18. యో - యమదేవుడు
19. నః - బ్రహ్మదేవుడు
20. ప్ర - వరుణదేవుడు
21. చో - నారాయణుడు
22. ద - హయగ్రీవ భగవానుడు
23. యా - హంసదేవత
24. త్ - తులసీదేవి




ఇంతటి మహిమాన్వితం, దివ్యశక్తి గల ఈ మంత్రాన్ని ఉచ్చరించటంలో స్వర, వర్ణ, లోపం ఉండిన హాని కలుగుతుంది.

బ్రహ్మ పదమును పొందదలచినవారు "కాలనియమమును విధిగా పాటించవలయును. ప్రాతః(సూర్యోదయమునకు ముందు), మధ్యాహ్నికము, సాయంసంధ్యా(సూర్యుడు అస్తమించక ముందు)

ఈ త్రికాలములందు అశ్రద్ధ వహించక గురువు చెప్పిన ప్రకారం "త్రిసంథ్యా"యందు సంధ్యా వందనము, గాయత్రీ మంత్ర జపం చేసిన మనుజుడు బ్రహ్మపదమును సులభముగా పొందగలడు.

నేడు ఫలానా విద్యాభ్యాసం చేతను, వృత్తి, వ్యాపార బాధ్యతల చేతను, గురువు సమీపమున బహుకాలము గడుపక నియమ-నిష్ఠలను కాల రాస్తున్నారు. మరికొందరిలో నియమం వున్నా నిష్ఠలేదు. నిష్ఠ వున్నా నియమం లేదు. మానవుడు బ్రహ్మపదమును పొందాలంటే నియమ-నిష్ఠలు రెండూ ఉండాలి. 

 

ఇట్లు
    మీ
జి.సుబ్రహ్మణ్య శర్మ 

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...