Tuesday, April 24, 2018

దుష్టదూరా

దుష్టత్వమునకు, దుష్టత్వము కలవారికి దూరముగా నుండునదే శ్రీమాత అని అర్థము.

           లోకహాని కలిగించు పనులు, అట్టి పనులను చేయువారు శ్రీమాత అనుగ్రహము పొందలేరు. శ్రీమాత శిష్టులనెట్లనూ అభివృద్ధి గావించుచుండును. దుష్ట చేష్టల నరికట్టుచుండును. ఆమెకు పక్షపాత బుద్ధి లేదు. దుష్టులను అరికట్టును. శిష్ణులను రక్షించును. దుష్టు లింకనూ పతనము చెందకుండ కాచును.

          తమ వృద్ధికై తాము పాటుపడువారు శ్రీమాత అనుగ్రహ పాత్రులు. తమ వృద్ధికి, ఇతరుల వృద్ధికీ పాటుపడువారు విశేష అనుగ్రహమును పొందుదురు. తమ వృద్ధికై ఇతరులను దోచుకొను వారు, హింసించువారు, దుఃఖములను కలుగజేయువారు శ్రీమాత అనుగ్రహమునకు పాత్రులు కాలేరు.

             దుష్టులు వేరు. దుర్బలులు  వేరు. దుర్బలురను  శ్రీమాత బ్రోచును. వారిది బలహీనతయే కాని దుష్టత్వము కాదు. జీవులు తమ తమ బలహీనతలను అధిగమించుటకే దైవారాధన. శ్రీమాత అట్టివారిని అనుగ్రహించుచుండును. పరిమితత్వమే బలహీనత అట్టి బలహీనత వలన ఏర్పడుచున్న దుఃఖములనుండి రక్షింపబడుటకు భక్తులు ఆరాధన చేయుదురు. వారికి చేయూత నిచ్చుట తన కర్తవ్యముగా శ్రీమాత భావించును.
     మదించి అతిక్రమించుచూ, ఇతరులకు కష్టము, నష్టము, దుఃఖము కలిగించుట దుష్టత్వము. అట్టివారు కూడ శ్రీమాత ఆరాధించుటకు ప్రయత్నింతురు. అట్టివారికి శ్రీమాత దూరముగ నుండును. అనగా వారియెడల సుప్తయై ఉండును. దుష్టులకైననూ బలము శక్తి స్వరూపిణియైన శ్రీమాతనుండి లభించును కదా! అట్టి శక్తితో వారు దుష్కార్యములు చేయుచున్నపుడు వారిని క్రమముగా శక్తిహీనులను చేయును. పదవియందున్నవారికి పదవీచ్యుతి కలుగును. ధనవంతులు దరిద్రులగుదురు. వారి శరీర ఆరోగ్యము నశించి తీరని రోగములకు గురియగుదురు. వారియందలి ఆమె శక్తి వారినుండి దూరము చేయుట ఈ నామమునకు అర్థము. మాట పడిపోవుట, కదల లేకుండుట, కళ్ళు పోవుట ఇత్యాదివన్నియూ వానికి తార్మాణము. అట్టి సమయమున జీవులు తక్షణమే శక్తిహీనులగుదురు. శ్రీమాత దూరమగుట సహింపరాని దురదృష్టము.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...