Wednesday, May 9, 2018

శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత


మన పండుగల్లో ముఖ్యమైంది. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా హనుమంతుని కధలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు నిర్వహిస్తారు.
ఆంజనేయస్వామి ధైర్యానికి ప్రతీక. శక్తిసామర్ధ్యాలకు ప్రతిరూపం. సముద్రం దాటి లంక చేరాడు. ఆకాశమార్గంలో పయనించి సీతమ్మవారి జాడ కనిపెట్టాడు. సంజీవనీ పర్వతాన్నే పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తియుక్తులను కీర్తించడం సాధ్యమా?! హనుమజ్జయంతి సందర్భంగా పంచముఖ హనుమాన్, పాదరస హనుమాన్ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయాల్లో హనుమాన్ ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరు ఈవేళ ఉపవాసం ఉండడానికే ఇష్టపడతారు.
హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు.
హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తికి, బల సంపన్నతకు సంకేతమైన హనుమంతుని విశేషాలు స్మరించుకుందాం. హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండీ రాముడి సేవలో గడపడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆంజనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తిప్రపత్తులు అంటే, తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు. శ్రీరాముని, సీతమ్మతల్లి కంటే మిన్నగా ప్రేమించాడు హనుమంతుడు.
ఒకసారి హనుమాన్ సీతాదేవి నుదుట సిందూరం పెట్టుకోవడం చూసి,"నుదుట సిందూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా" అని అడుగుతాడు.
సీతమ్మ తల్లి నవ్వుతూ "శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని" అంటుంది.
అంతే, హనుమంతుడు క్షణం ఆలోచించకుండా తన ఒళ్ళంతా సిందూరం పూసుకుంటాడు. అదీ హనుమంతునికి రాముడి మీద గల నిరుపమానమైన భక్తి. హనుమంతుని భక్తికి ఇలాంటి తార్కాణాలు ఎన్నో!
ఒక సందర్భంలో సీతమ్మ హనుమంతునికి రత్నాభరణాన్ని బహూకరించింది. హనుమంతుడు ఒక్కో పూసనూ కొరికి చూసి, విసిరేయసాగాడు.
అదేమిటని అడగ్గా, ''రామయ్య తండ్రి కనిపిస్తాడేమోనని ఆశగా చూశాను. నా స్వామి లేని రత్నాలు, స్వర్ణాలతో నాకేం పని?” అన్నాడు.
హనుమంతుని నిరుపమానమైన భక్తికి ఇంతకంటే కొలమానం ఇంకేం కావాలి? రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోగా, ఆ తల్లిని అన్వేషించడానికి బయల్దేరాడు హనుమంతుడు. అహర్నిశలూ ప్రయత్నించి, సీతమ్మ జాడ తెలుసుకున్నాడు.
అశోకవనంలో శోకమూర్తిలా కూర్చుని, దిగులు సముద్రంలో కుంగిపోతూ, ఆత్మత్యాగం చేయాలనుకుంటున్న సీతమ్మకు శ్రీరాముని అంగుళీయకం చూపి, ధైర్యంగా ఉండమని స్థైర్య వచనాలు పలికాడు. లంకాదహనం చేసి తన వంతు సహకారం అందించాడు.
వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు. పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంవల్ల ధైర్యం,స్థైర్యం కలుగుతాయి. భయాలూ భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు.
ఇక హనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతో హనుమంతుని అర్చిస్తారు.
- శ్రీ హనుమాన్ జయంతి (తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారు.)
''కలౌ కపి వినాయకౌ : అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు,
హనుమంతుడు.
హిందూమతంలో ప్రాముఖ్యత :
హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః
రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్
హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది.
హనుమంతుని నైజం
యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్
శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.
కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ(11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివును అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనందభాష్పాలు కారుస్తూ, నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు. చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి, రామకధ చెప్పే సభలో ఒక మూలున కూర్చుంటారు. అందరు రాకముందే వచ్చి, అందరు వెళ్ళిపోయేవరకు ఉంటారు.
భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయమవుతాయి. చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. శని బాధలు తొలగిపోతాయి. బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి(మీకు వీలైనన్ని సార్లు)హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరు, ఈ 40(మండలం) రోజుల పాటు కఠిన బ్రహ్చర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి, నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలిగి తీరుతుంది.

హనుమాన్ జయంతి రోజున పూజ ఎలా చేయాలి?

హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు.

పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్‌ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.

పెళ్లి ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు చక్కని భార్య రావాలంటే


” సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం ” . కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేయడం వలన అబ్బాయిలకి త్వరలో వివాహము అవుతుంది అని ఒక విశ్వాసం .

ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి.

సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః||
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే||
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే||
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః||
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||

|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం |

             గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ..........

సంకష్టహర గణపతి

గణేశుని వ్రతాలలో అత్యంత ప్రభావవంతమైనదీ, సర్వ సంకటాలను నివారించేదీ సంకష్టహర గణపతి వ్రతం. గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.

సంకటహర గణపతి :

సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూగణేశుని వ్రతాలలో అత్యంత ప్రభావవంతమైనదీ, సర్వ సంకటాలను నివారించేదీ సంకష్టహర గణపతి వ్రతం. గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.

సంకటహర గణపతి :

సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలొనూ ఆదివారం మరియు మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాయి.

వ్రత కథ :

పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.

గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.జింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలొనూ మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాయి.

వ్రత కథ :

పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.

గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.

ముముక్షువు వదలిపెట్టాల్సినవి

అజ్ఞానం వధలిపెట్టినవాళ్లు జ్ఞానులు అవుతారు. మూఢత్వం వదలివేసి పరమాత్మవైపు అడుగులు వేసేవారు ‘ముముక్షువు’లు అవుతారు. ఆశ, మోహం, భౌతిక సుఖాభిలాష, అహంకారం- ఇవన్నీ మోక్ష సాధనకు ప్రతిబంధకాలు. ఉదాహరణకు పైవాటిలో ‘ఆశ’నే తీసుకుందాం. ఆశ మనిషికి స్వార్థబుద్ధిని కలిగిస్తుంది. స్వార్థం చివరకు ‘నాది’ అనే అహంకారం రూపంలోకి మారుతుంది. నాది, నేను అన్న చోట భగవంతుడికి స్థానం లేదు.
అహంకారం మోక్షానికి ప్రతిబంధకం. తాను స్ర్తి, పురుష లింగభేదం చేత కాని, పేద, ధనిక సామ్యం చేతగాని, భేదభావం పాటించని ‘జీవుడు’ అన్న సత్యం మరిచిపోతున్నాడు. గృహస్థుడైన ఒక వ్యక్తి ఇల్లు నిర్మించుకొన్నా, పెళ్లిచేసినా, మరే ఇతర ఘనకార్యం చేసినా ‘నేను చేశాను’ అన్న అహంకార ప్రదర్శన చేస్తున్నాడు. అదే తనకు ఏదైనా కష్టం వస్తే ‘దేవుడే తనకిన్ని కష్టాలు కలిగించాడ’ని దేవుణ్ణి నిందిస్తున్నాడు. నిస్వార్థబుద్ధితో జీవిస్తూ, తను చేసే ప్రతి పనిని భగవంతుడే చేయిస్తున్నాడు అన్న లక్షణం ప్రతివారు ఆచరిస్తే ఋషులే అవుతారు.
భౌతిక వస్తువులపై మనకుండే ప్రేమ లౌకికమైంది.

అలౌకిక భావన మనకు కలిగినపుడు ‘ఈశావాస్యమిదం సర్వమ్’ అన్న ఋషి వాక్కు నిజరూపం పొందుతుంది. ఋషివాక్కులోనే కాదు జానపద భజన కీర్తనల కూడా ఇలాంటి సందేశమే కన్పిస్తుంది. మనం ఎంతెంత భౌతిక విషయాల్లో మునిగిపోతే భగవంతునికి అంత దూరమవడం నిజం. ‘‘చుక్కాని లేని నావ బరువయ్యే కొద్దీ ప్రమాద స్థితికి దగ్గరవుతుంది’’ అన్న ఓ మహనీయుని మాటలు నిజం. జనక మహారాజు గొప్ప వేదాంత చక్రవర్తి అని మనందరకు తెలుసు. అష్టావక్ర మహామునినే గురువుగా చేసుకొని ‘అష్టావక్రగీత’ ప్రపంచానికి అందేట్లు చేసిన జిజ్ఞాసువు.

అలాంటి జనకుడి దగ్గర వేదాంత విషయాలలు నేర్చుకోవడానికి ఓ మహారణ్యంలో తపస్సు చేసుకొనే మునీశ్వరుడు తన శిష్యుడైన యువ సన్యాసిని పంపించాడు. సన్యాసి సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చేవరకు జనకుడు రాజసభలో ఉన్నాడు. బయట ద్వారం దగ్గర ఉన్న సేవకులకు ‘నేను వచ్చాను’ అన్న వర్తమానం రాసి ఇచ్చి, లోపలకు పంపించాడు సన్యాసి. జనకుడు అది చూసి వెనకాల నేను చచ్చిన తర్వాత రండి అని తిరుగు టపా పంపించాడు.

అంటే ‘నేను అనే అహంకారం చచ్చిన తర్వాత రావచ్చు’ అని దాని అర్థం. సన్యాసికి అమ్మో! జనకుడితో జాగ్రత్తగా వ్యవహరించాలి అని అర్థమయ్యింది. మొత్తానికి లోపలకు ప్రవేశం లభించింది. సాదరంగా ఆహ్వానించాడు జనకుడు. ‘నాయనా! ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి.

వేదాంతం సంగతి రేపు చూద్దాం’ అని భటులను ఆజ్ఞాపించి భోజనాదులు ఏర్పాటుచేసి, విశ్రాంతి మందిరం చూపించమన్నాడు. సన్యాసికి ఎక్కడలేని వ్యాకులత మొదలయ్యింది. ఇంత రాజభోగాలలో మునిగి తేలే వ్యక్తి నాకు వేదాంతం ప్రబోధిస్తాడా? మా గురువుగారు అనవసరంగా ఈయన దగ్గరకు పంపించాడే అని బాధపడ్డాడు. సరే! ఆయన వేదాంత ప్రతిభ ఏమిటో రేపు చూడొచ్చులే అని విశ్రాంతి మందిరానికి చేరుకున్నాడు. రాజగృహం కాబట్టి ఈ సన్యాసి విశ్రాంతి తీసుకొంటున్న గది పైభాగంలో ఓ కత్తి వ్రేలాడదీసి ఉంది. సరిగ్గా నిద్రపోయే సమయంలో సన్యాసి ఆ కత్తిని చూశాడు. అంతే! తెల్లవార్లూ నిద్రపట్టలేదు. పడుకొంటే ఆ కత్తి తనపై ఎప్పుడు పడుతుందోనని ఆందోళన.

బ్రాహ్మీ ముహూర్తంకన్నా ముందే అంతఃపురం నుండి సన్యాసికి పిలుపు వచ్చింది. జనకుడు సన్యాసిని సాదరంగా ఆహ్వానించాడు. ‘‘నాయనా! మా వనంలో ఉన్న కొలనులో స్నానం చేస్తూ మాట్లాడుకొందాంరా!’’ అన్నాడు. ఇద్దరూ స్నానం చేస్తూ చర్చ మొదలుపెట్టగానే అంతఃపుర భవనం పైభాగంలో పెద్ద అగ్నికీలలు కన్పించాయి. జనకుడు నిశ్చలంగా ఉన్నాడు. కాని సన్యాసి తత్తరపడ్డాడు. వెంటనే ‘మహారాజా! అదిగో మీ భవనాలు అగ్నికి ఆహుతి అయిపోతున్నాయ్’ అన్నాడు జనకుడు మెల్లగా కళ్లు తెరచి ‘మూరెడు కౌపీనం (గోచీగుడ్డ) ధరించే నీకెందుకయ్యా అగ్నికీలల్లో అంతఃపురం అంటుకోవడం గురించి?’ అని మందలించి, తిరిగి అడవికి ఆ సన్యాసిని పంపిస్తాడు. మనలో హృదయ శైథిల్యం నశించి, భగవంతుని పట్ల ప్రేమ పుట్టనంతవరకు భగవత్తత్వం మనకు అలవడదు. అన్నీ వదలిపెట్టి హిమాలయాలకు వెళ్లినా సంసారం మన మనస్సులో ఉంటే హిమాలయం కూడా రణగొణధ్వనులుండే మన ఇల్లుగా మారిపోతుంది. మన ఇంట్లో ఉన్నా సకారాత్మక దృక్పథం ఉంటే ఆ ఇల్లే హిమాలయంగా మారుతుంది. ఇక వ్యక్తిగా మనల్ని వేదాంతం ఇలా ఉండమని శాసిస్తుంది.

1.ఎప్పుడూ నీళ్లలో ఉండే వరి ఆకును బయటకు తీస్తే ఆకుపై నీరు కన్పించదు.

2.ఎప్పుడూ బురదలో ఉండే కుమ్మరిపురుగు బయటకు వస్తే నీళ్లలో కడిగినట్లుగా ఉంటుంది. ఈ రెండు లక్షణాలు అలవర్చుకొంటే మనం ఎంత పెద్ద సంసారంలో ఉన్నా అది మనల్ని అంటుకోదు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

( నేటి నిఘా వారపత్రిక జోనల్ ఇంచార్జ్ )

Sunday, May 6, 2018

గౌతముడు సప్తర్షులలో ఒకడు


వేదకాలానికి చెందిన మహర్షులలో ఒకడు. మంత్రాల సృష్టికర్తగా (మంత్ర ధృష్ట) సుప్రసిద్ధుడు. ఋగ్వేదంలో ఈయన పేరు మీదుగా అనేక సూక్తులు ఉన్నాయి. ఈయన అంగీరసవంశానికి చెందిన రాహుగణుడి కొడుకు. దేవీ భాగవత పురాణం ప్రకారమ్, గోదావరి నది గౌతముడి పేరు మీదుగా వచ్చింది. ఈయనకు వామదేవుడు, నోధసుడు అని ఇరువురు పుత్రులు కలరు. వీరు కూడా మంత్ర ధృష్టలే.

వ్యక్తిగత జీవితం*

ఈయన భార్య పేరు అహల్య ఈమె బ్రహ్మ యొక్క మానసపుత్రిక. పురాణాల ప్రకారం, బ్రహ్మ ఎవరైతే భూమిని మొత్తం ముందుగా చుట్టి వస్తారో వారికే అహల్య దక్కుతుందని ప్రకటిస్తాడు. అప్పుడు గౌతముడు కామధేనువుచుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఆమెను గెలుచుకుంటాడు. మిథిలా నగరానికి రాజుయైన జనకుడి కొలువులో ప్రధాన ఆచార్యుడైన శతానంద మహర్షి ఈయన పుత్రుడు. గౌతముడు ఆచరించిన 60 సంవత్సరాల తపస్సు మహాభారతంలోని శాంతి పర్వములో ప్రస్తావించబడింది. నారదపురాణంలో ప్రస్తావించబడినట్లు ఒకసారి ఏకథాటిగా 12 ఏళ్ళు కరువు ఏర్పడగా గౌతముడు ఋషులందరినీ పోషించి వారిని రక్షించాడు. హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సప్తర్షులలో ఒకడు. గౌతమ గోత్రానికి మూలపురుషుడు. భరధ్వాజుడు, ఈయన అంగీరస మూలానికి చెందిన వారే.

*పురాణం*

రామాయణం ప్రకారం ఒకసారి గౌతముడు సూర్యోదయాన్నే గంగానదిలో స్నానమాచరించడానికి వెళ్ళగా దేవతల రాజైన దేవేంద్రుడు గౌతముడి భార్యయైన అహల్యను మోహించి మారు వేషంలో వెళ్ళి ఆమెను అనుభవించాడు. జరిగింది దివ్యదృష్టితో తెలుసుకున్న గౌతముడు ఆ ఇద్దరికీ శాపమిచ్చాడు. ఈ శాపం ప్రకారం అహల్య రాయిగా మారిపోయింది. ఇంద్రుడి శరీరం వేయి యోనిలతో నిండిపోయింది. తరువాత వారిద్దరిమీదా జాలిపడిన గౌతముడు కొంచెం ఊరట కలిగించేందుకు ఆ శాపాలనే వరాలుగా మార్చాడు. ఇంద్రుడి శరీరంపై ఉన్న యోనులు కళ్ళు లాగా కనబడేటట్లుగా, రాయిగా మారిన అహల్య శ్రీరామునిపాదస్పర్శతో పూర్వ రూపం సంతరించుకుని తనను కలుసుకునేటట్లుగా అనుగ్రహించాడు.

*ధర్మ సూత్రాలకు ఆద్యుడు*

గౌతముడు రచించిన ధర్మసూత్రాలు ఆయన పేరు మీదుగా గౌతమ ధర్మ సూత్రాలుగా ప్రఖ్యాతిచెందాయి..ఇవే మొట్టమొదటి ధర్మ సూత్రాలు అంటారు. మనువు రాసిన ధర్మ శాస్త్రాన్నే మొదటి మానవ జాతి ధర్మ శాస్త్రం అనికూడా అంటున్నారు. గౌతముడు రాసిన ధర్మసూత్ర గ్రంథంలో ఇందులో 28 అధ్యాయాలు, 1000 సూత్రాలూ ఉన్నాయి. నాలుగు ఆశ్రమాలూ, నలభై సంస్కారాలూ, చాతుర్వర్ణాలు, రాజధర్మాలు, శిక్షాస్మృతులు, స్త్రీ పాటించాల్సిన ధర్మాలు, ఆహార నియమాలు, ప్రాయశ్చిత్తానికి నియమాలు మొదలైన హింధూ ధర్మ శాస్త్రంలోని అన్ని దృక్కోణాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా గౌతమ ధర్మ శాస్త్రమనేది అత్యంత పురాతనమైన న్యాయశాస్త్ర గ్రంథంగా చెప్పవచ్చు.

Wednesday, May 2, 2018

ఒకే గోత్రం ఉంటే పెళ్లెందుకు చేసుకోరు?

హిందువులు సగోత్రీకుల మధ్య వివాహాలను అనుమతించరు. ఈ ఆచారాన్ని అన్ని కులాల వారు పాటిస్తారు. అయితే ఇలాంటి ఆచారం ఎందుకు ఏర్పడింది. గోత్రం అంటే ఏంటి?. ‘గోత్రం’ అనే పదం ‘గౌః’ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ‘గౌః’ అంటే గోవులు అని అర్థం. ‘గోత్రం’ అనే పదానికి గురువు, భూమి, వేదం, గోవుల సమూహం అనే అర్థాలు ఉన్నాయి. గోత్రం అనగా మన మూల పురుషుడి పేరు. అంటే వంశోత్పాదకులైన ఆది మహర్షులలో మొదటి మహర్షి పేరన్నమాట. ‘గోత్రం’ అనే పదం మొట్టమొదటిసారిగా ‘ఛాందోగ్యోపనిషత్‌’లో ఉన్న సత్యకామ జాబాలి కథలో కనిపిస్తుంది.

గోవు, గురువు, భూమి, వేదం అని అర్థాలున్నాయి. అయితే వీటీకి, మనషులకు ఉన్న సంబంధం ఏంటి?. పురాతన కాలంలో గోవులే ధనం. ఒక చోట నుంచి మరోచోటికి వలస వెళ్తుండేవారు. అలాంటి సమయంలో గోవుల రక్షణకు గోత్రాలను ఏర్పరిచారు. ఒకరి గోవులు మరొకరి గోవులలో కలిసిపోవడం వల్ల వచ్చే గొడవలను గోత్రపాలకులు తీర్చేవారు. వారు ఎంతో క్రమశిక్షణ, తపోనిష్ఠతో ఉండేవారు. అలాంటి గోత్రపాలకుల పేర్లే ఆపై వారి వారి సంతానానికి గోత్రనామాలయ్యాయి. వారి వంశక్రమంలో జన్మించిన వారు, వారి వారి మూల పురుషులను గోత్ర నామంతో ఆరాధిస్తున్నారు. పూజల్లో, యజ్ఞాల్లో , యాగాల్లో, వివాహ సంబంధమైన విషయాల్లో గోత్రం యొక్క పాత్ర ఎంతో ఉంటుంది.

తమదగ్గరున్న గోవుల రంగులను బట్టి తెల్లగోవులు వాళ్లు, నల్లగోవులు వాళ్లు అనే పేర్లను గోత్రాలుగా, తమకు విద్య నేర్పించిన గురువులను బట్టి అంటే వశిష్ట, విశ్వామిత్ర మొదలైన రుషులను తమ గోత్రాలుగా చెప్పుకోవడం ఇది ఒక పద్దతి. ఒకే గోత్రానికి చెందిన వాళ్లు అంటే సోదర సమానులు. ఒకే తండ్రి పిల్లలు ఎలాగైతే అన్నా చెల్లెళ్లు అవుతారో అలాగే ఒకే గోత్రానికి చెందిన వారు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు అవుతారు. అందుకని సంబంధం కుదుర్చుకునే ముందు గోత్రాలను తెలుసుకుంటారు. వేర్వేరు గోత్రాల వారికే వివాహం జరిపిస్తారు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...